జమైకా రచయితకు మ్యాన్ బుకర్
లండన్: ప్రముఖ జమైకా నవలా రచయిత మార్లన్ జేమ్స్ చరిత్ర లిఖించుకున్నారు. ఈ ఏడాది(2015) ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ ప్రైజ్ సొంతం చేసుకొని చరిత్ర కెక్కారు. జమైకా నుంచి తొలిసారి ఈ అవార్డు అందుకున్న వ్యక్తిగా నిలిచారు. ప్రతి ఏడాది కాల్పనిక సాహిత్య రచనా విభాగంలో మన్ బుకర్ సంస్థ ఈ అవార్డును అందిస్తుంది. ఈ ఏడాది మొత్తం ఆరుగురి ఫిక్షన్ స్టోరీలు తుది నామినీలుగా నిలవగా అందులో మార్లన్ జేమ్స్ ఫిక్షన్ 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్' ప్రైజ్ దక్కించుకుంది.
ఈ అవార్డు కోసం పోటి పడిన వారిలో భారత సంతతికి చెందిన బ్రిటన్ రచయిత సంజీవ్ సహోతా కూడా ఉన్నాడు. 1970లో బాబ్ మార్లీలో జరిగిన మారణ హోమాన్ని తన నవలకు ప్రాథమిక అంశంగా తీసుకొని 686 పేజీల్లో మార్లన్ జేమ్స్ 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్' రాశాడు. లండన్లోని గిల్డ్ హాల్లో గతరాత్రి ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. మ్యాన్ బుకర్ ప్రైజ్ను 1969లో స్థాపించారు. ఆంగ్ల కాల్పనిక సాహిత్యంలో విశిష్ట రచనలు చేసిన వారికి ఈ అవార్డును అందిస్తారు.
తుది నామినీలుగా ఎంపికైన రచనలు ఇవే..
'బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్'..మార్లన్ జేమ్స్(జమైకా)
సాటిన్ ఐస్ లాండ్-టామ్ మెక్ కార్తీ(బ్రిటన్)
ది ఫిషర్ మెన్-చిగోజి ఒబియోమా(బ్రిటన్)
ది ఇర్ ఆఫ్ ది రునావేస్- సంజీవ్ సహోతా(బ్రిటన్- భారతీయ సంతతి పౌరుడు)
ఏ స్పూల్ ఆఫ్ బ్లూ థ్రెడ్-అన్నే టేలర్(అమెరికా)
ఏ లిటిల్ లైఫ్-హన్యా యానాగిహారా(అమెరికా)