
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికాలో కాంగ్రెస్ ఎన్నికల రిజల్ట్స్ కూడా బుధవారం(నవంబర్ 6) వెలువడుతున్నాయి. డెలవేర్‌లోని ఎట్ లార్జ్‌హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి సెనేట్‌కు డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్ సారా మెక్‌బ్రైడ్ విజయం సాధించారు.దీంతో సారా అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డులకెక్కారు.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ వేలెన్ 3తో,సారా మెక్‌బ్రైడ్ పోటీపడ్డారు.ఈ ఎన్నికలో సారాకు 95శాతం ఓట్లు పోలవగా వేలెన్‌కు 57.9 శాతం ఓట్లు పోలయ్యాయి.తాను ట్రాన్స్‌జెండర్‌గా చరిత్ర సృష్టించడానికి పోటీ పడలేదని డెలవేర్‌లో మార్పు కోసమే పోటీ చేసినట్లు సారా పేర్కొన్నారు.
కాగా,సారా మెక్ బ్రైడ్ ఎల్‌జీబీటీక్యూ జాతీయ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు.ఎన్నికల సమయంలో దాదాపు 3 మిలియన్ల డాలర్లకుపైగా ప్రచార విరాళాలు సేకరించారు. 2010 నుంచి డెలవేర్ డెమోక్రాట్లకు కంచుకోటగా ఉంది.
ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలు.. సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు
Comments
Please login to add a commentAdd a comment