వాషింగ్టన్:అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ల గాలి వీచింది. అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లోనూ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ సత్తా చాటింది. ఈసారి ఎన్నికల్లో సెనేట్‌లో మెజార్టీకి అవసరమైన సీట్లు రిపబ్లికన్ పార్టీకి లభించాయి.మరోవైపు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో కూడా రిపబ్లికన్ పార్టీ ముందంజలో ఉంది.
మొత్తం 100 సీట్లు ఉన్న సెనెట్‌లో 34 స్థానాలకు మంగళవారం(నవంబర్ 5) ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ఆధారంగా సెనేట్‌లో డెమోక్రట్లకు ఉన్న ఒక సీటు మెజార్టీ కూడా పోయింది. తాజాగా సెనేట్‌లో రిపబ్లికన్లకు 51 మంది డెమోక్రట్లకు 42 మంది సభ్యులున్నారు.మరో 7 స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది.
సెనేట్‌లో మెజారిటీతో కొత్త ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకాలు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకంలో రిపబ్లికన్లకు పట్టు లభించనుంది.ఇక 435 స్థానాలున్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో రిపబ్లికన్లకు 183 సీట్లు లభించాయి. దీంతో ఈసారి ట్రంప్ అధ్యక్ష పదవి గనుక చేపడితే ఆయనకు కాంగ్రెస్ నుంచి పెద్ద అడ్డంకులేవీ ఉండకపోవచ్చని తెలుస్తోంది.
ఇదీ చదవండి: డెమోక్రాట్లలో నిరాశ.. కమల ప్రసంగం రద్దు
Comments
Please login to add a commentAdd a comment