Republicans
-
అమెరికాలో భారతీయం
అమెరికా మొత్తం ఓటర్లు 16.1 కోట్ల పై చిలుకు. అందులో భారతీయ అమెరికన్ల సంఖ్య మహా అయితే 21 లక్షలు. కానీ ఆ దేశ రాజకీయాల్లో మనవాళ్లు నానాటికీ ప్రబల శక్తిగా ఎదుగుతున్నారు. ప్రధాన పార్టీలైన రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇప్పుడు వారి రాజకీయ శక్తిని ఏ మాత్రమూ విస్మరించే పరిస్థితి లేదు. అందులోనూ భారత మూలాలున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈసారి ఏకంగా డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా దూసుకుపోతున్నారు. దాంతో భారతీయ అమెరికన్ల ఉత్సాహానికి పట్టపగ్గాల్లేకుండా పోతోంది. భారతీయ అమెరికన్లలో అత్యధికులు విద్యాధికులే. కేవలం ఓటర్లుగానే గాక అభ్యర్థులుగా, ఓటర్లను సమీకరించే శక్తిగా, నిధుల సేకర్తలుగా కొన్నేళ్లుగా వారి హవా బహుముఖంగా విస్తరిస్తోంది. దాంతో సహజంగానే అధికార సాధనలో వారి మద్దతు నానాటికీ కీలకంగా మారుతోంది.స్వింగ్ స్టేట్లలోనూ హవాఅధ్యక్ష ఎన్నికల్లో విజేతను తేల్చడంలో అతి కీలకంగా మారే మిషిగన్, జార్జియా వంటి స్వింగ్ స్టేట్లలో భారతీయుల జనాభా చాలా ఎక్కువ. దాంతో వారి ఓట్లు, మద్దతు రెండు పార్టీలకూ మరింత కీలకంగా మారాయి. 2020లో బైడెన్ విజయంలో జార్జియా ఫలితమే నిర్ణాయకంగా మారడం తెలిసిందే. అక్కడ భారతీయ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. గత రెండు మూడు అధ్యక్ష ఎన్నికలు అత్యంత హోరాహోరీగా జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హారిస్, ట్రంప్ భాగ్యరేఖలు స్వింగ్ స్టేట్లలోని ఇండియన్ ఓటర్ల మనోగతంపై గట్టిగానే ఆధారపడ్డాయంటే అతిశయోక్తి కాదంటారు డాక్టర్ మిశ్రా.→ స్వింగ్ స్టేట్లుగా పేరుబడ్డ 10 రాష్ట్రాల్లో ఉన్న దక్షిణాసియా ఓటర్లలో ఇండియన్లే మెజారిటీ.→ స్వింగ్ స్టేట్లలో పెన్సిల్వేనియాను అత్యంత కీలకమైనదిగా చెప్తారు. అలాంటి రాష్ట్రంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తేల్చడంలో బక్స్ కౌంటీది నిర్ణయాక పాత్ర. అక్కడ ఆధిపత్యం పూర్తిగా ఇండియన్లదే!→ దక్షిణాసియాకు చెందిన 48 లక్షల మంది పై చిలుకు యువ ఓటర్లను ప్రభావితం చేయడంలో భారతీయులు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు మిశ్రా వివరించారు.→ గత రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో ఓటేశారు. 2020లో 71 శాతం మంది ఓటేశారు. తాజా ఆసియన్ అమెరికన్ ఓటర్ సర్వేలో ఏకంగా 91 శాతానికి పైగా ఈసారి ఓటేస్తామని చెప్పారు!పార్టీలకు నిధుల వెల్లువభారతీయ అమెరికన్ల సగటు వార్షిక ఆదాయం 1.45 లక్షల డాలర్లు. అమెరికన్లతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. కొన్నేళ్లుగా ప్రధాన పార్టీలకు వారినుంచి నిధులు పోటెత్తుతున్నట్టు డెమొక్రటిక్ పార్టీ నేషనల్ ఫైనాన్స్ కమిటీ (డీఎన్ఎఫ్సీ) సభ్యుడు అజయ్ భుటోరియా చెబుతున్నారు. ‘‘నేను 20 ఏళ్లకు పైగా నిధుల సేకర్తగా వ్యవహరిస్తున్నా. మనవాళ్లు ఈ స్థాయిలో రాజకీయ విరాళా లివ్వడం గతంలో ఎన్నడూ లేదు’’ అంటూ విస్మయం వెలిబుచ్చారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా బాగా పెరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. డీఎన్ఎఫ్సీలో 5 శాతానికి పైగా భారతీయులే ఉండటం విశేషం. భూరి విరాళాలిస్తున్న వారితో పాటు పార్టీలకు, వాటి ఎన్నికల ప్రచార కార్యకలాపాలకు చిన్న మొత్తాలు అందజేస్తున్న అమెరికన్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోందని ఆసియన్ అమెరికన్ డయాస్పొరాలో అతి పెద్దదైన రాజకీయ కార్యాచరణ కమిటీ ఏఏపీఐ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ చెప్పుకొచ్చారు. 2012 నుంచీ ఇండియన్ అమెరికన్లలో ఈ ధోరణి బాగా పెరుగుతోందని డ్రూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంగయ్ మిశ్రా వెల్లడించారు. అమెరికా అధ్యక్ష పీఠానికి దారి సిలికాన్ వ్యాలీ గుండా వెళ్తుందన్నది నానుడి. కీలకమైన ఆ టెక్ రాజధానిలో భారతీయులదే హవా. హారిస్‌కు కాలిఫోర్నియాలో ఇటీవల ఒక్క వారంలోనే ఏకంగా 5.5 కోట్ల డాలర్ల విరాళాలు పోగయ్యాయి! వాటిలో మనవారి నుంచి వసూలైనవే ఎక్కువ. డెమొక్రాట్ పార్టీకి భారీ విరాళాలిచ్చిన జాబితాలో 60 మందికి పైగా ఇండియన్ అమెరికన్లు న్నారు. వీరిలో పారిశ్రామిక దిగ్గజం ఇంద్రా నూయీ మొదలుకుని ఏఐ ఇన్వెస్టర్ వినోద్ ఖోస్లా దాకా పలువురి పేర్లున్నాయి.రిపబ్లికన్లకూ...రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. సంపత్ శివాంగి, హోటల్ పరిశ్రమ దిగ్గజం డానీ గైక్వాడ్ వంటి పలువురు ఎన్నారైలు ట్రంప్ ప్రచార కార్యకలాపాలకు భారీ విరాళాలిస్తున్నారు. అయితే 2020 నుంచీ ఇండియన్ అమెరికన్లు, ముఖ్యంగా హిందువులు రిపబ్లికన్ పార్టీకి క్రమంగా దూరమవుతున్న వైనం స్పష్టంగా కన్పిస్తోంది.అధికార పదవుల్లోనూ...అమెరికాలో అన్ని స్థాయిల్లోనూ అధికార పదవుల్లో కూడా భారతీయుల హవా సాగుతోంది. సెనేట్, ప్రతినిధుల సభతో పాటు రాష్ట్రాల సెనేట్లు, అసెంబ్లీలు మొదలుకుని సిటీ కౌన్సిళ్లు, స్కూలు బోర్డుల దాకా, జిల్లా అటార్నీలుగా నియమితులవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.→ యూఎస్ కాంగ్రెస్‌లో ఐదుగురు భారతీయ అమెరికన్లున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది ఏడుకు పెరుగుతుందని భావిస్తున్నారు.→ అమెరికా యువజనుల్లో భారతీయులు కేవలం 0.6 శాతమే. కానీ 4.4 శాతం మంది ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.→ బైడెన్–హారిస్ పాలన యంత్రాంగంలో 150 మందికి పైగా భారతీయ అమెరికన్లు కీలక స్థానాల్లో ఉన్నారు.→ హారిస్ అధ్యక్షురాలిగా నెగ్గితే ఈ సంఖ్య 200 దాటుతుందని అంచనా.→ అమెరికా జనాభాలో యూదులు 2 శాతమే అయినా కాంగ్రెస్‌లో వారి సంఖ్య 10 శాతం. కొన్నేళ్లలో భారతీయులు అమెరికా సమాజంపై ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారన్నది ఒక అంచనా.సగానికి పైగా డెమొక్రాట్లే!→ తాజా సర్వే ప్రకారం భారతీయ అమెరికన్లలో ఏకంగా 55 శాతం మంది డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులమని ప్రకటించుకున్నారు.→ 25 శాతం మంది రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్నారు.→ స్వతంత్రులు, తటస్థులు 15 శాతం మందిగా లెక్క తేలారు. మిగతావాళ్లు తమ రాజకీయ మొగ్గుదలపై మాట్లాడేందుకు ఇష్టపడలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ప్రహేళిక
డోనాల్డ్ ట్రంప్ రాజకీయాలు, వ్యక్తిత్వం, విధానాలు, వీటన్నిటితో కూడిన గందర గోళం పట్ల అమెరికన్లు ఎలా స్పందిస్తారు అనేది 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అతి పెద్ద చిక్కుప్రశ్న. ట్రంప్ పతనం నుంచి ఉత్థానం చెందారు. అలాగని ఆయన ప్రజాదరణకు తీవ్రమైన పరిమి తులున్నాయి. ప్రధానంగా 4 అంశాల్లో ట్రంప్ వైఖరిని పరిశీలించాలి.1. ట్రంప్ నిలకడతనం: కొద్ది నెలల కాలంలోనే ఆయన రెండుసార్లు మరణానికి చేరువగా వెళ్లివచ్చారు. ప్రజారంగంలో బలంగా ఉండటానికి అవసరమైన స్పష్టమైన భౌతిక ధైర్యం ఆయనకు ఉంది. 2015లో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించి నప్పటినుంచీ రాజకీయ ప్రత్యర్థులు, అమెరికా రాజకీయ పండి తులు కనీసం ఎనిమిది సార్లు ట్రంప్ రాజకీయ సంస్మరణను ఖాయం చేసేశారు. రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ 2016లో గెలు స్తారని ఎవరూ అనుకోలేదు. హిల్లరీ క్లింటన్‌ను అధ్యక్ష రేసులో ఓడించగలరని అసలు అనుకోలేదు. ఆయన అభ్యర్థిత్వానికి రష్యా మద్దతు విషయంలో సాగిన దర్యాప్తు నుండి బయట పడతారనీ ఎవరూ అనుకోలేదు. కోవిడ్ మహమ్మారిపై ఆయన అశాస్త్రీయ నిర్వహణను అమెరికన్లు క్షమిస్తారని కొద్దిమందే భావించారు.2020 ఎన్నికల ఫలితాల చట్టబద్ధతను అంగీకరించడానికి నిరాకరించిన తర్వాత, యునైటెడ్ స్టేట్స్ కాపిటల్‌పై దాడికి ఒక గుంపును పంపిన తర్వాత కూడా ట్రంప్ ఆధిపత్యం చలాయించే ఆటగాడిగా ఉంటారని ఎవరూ భావించలేదు. రిపబ్లికన్లు సెనే ట్ను కోల్పోయిన తర్వాత, 2022 మధ్యంతర ఎన్నికలలో హౌస్‌ను గెలవ లేకపోయిన తర్వాత అందరూ ట్రంప్ పనయిపోయిందని వ్యాఖ్యా నించారు. పైగా ఆయన నేరారోపణ కేసుల నుండి బయట పడతారని ఎవరూ నమ్మలేదు. కానీ ట్రంప్ ప్రతిసారీ విమర్శకుల అంచనాలను తారుమారు చేశారు. మరింత ప్రజాదరణ పొందారు. రిపబ్లికన్ పార్టీని నియంత్రిస్తున్నారు. 2. ట్రంప్ ప్రజాదరణకు పరిమితులు: 2016 నవంబర్‌లో ఆయన అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత, ఆయన నాయకత్వంలో పాల్గొన్న అన్ని ఎన్నికలనూ రిపబ్లికన్ పార్టీ ఓడిపోయింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రిపబ్లికన్లు హౌజ్‌ను కోల్పోయిన 2018 మధ్యంతర ఎన్నికలు ఇందులో ఉన్నాయి. 2021 జనవరిలో జార్జియా సెనేట్ ఎన్నికల్లో ఓటమి కూడా ఇందులో భాగం. అంతెందుకు, ట్రంప్ స్వయంగా ఓడిపోయిన 2020 అధ్యక్ష ఎన్నికలు కూడా దీంట్లో ఉన్నాయి. ఆయన ఆధ్వర్యంలో రిపబ్లికన్ పార్టీ స్థిరంగా ఓడిపోయింది. విస్తృతమైన ఓటర్లలో దాని ఆకర్షణ తగ్గింది.3. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో జాత్యహంకారం: ‘మేక్ అమె రికా గ్రేట్ ఎగైన్’ అని ట్రంప్ చేసే ప్రచారం ‘మేక్ అమెరికా వైట్ ఎగైన్’ అని స్పష్టమైపోయింది. ఆయన వ్యాఖ్యానాలు పక్షపాతాన్ని, ద్వేషాన్ని, భయాన్ని కలిగించేలా ఉన్నాయి. ఒహయో పట్టణంలోని అక్రమ హైతియన్ వలసదారులు పెంపుడు జంతువులను తింటు న్నారని ట్రంప్, జేడీ వాన్ ్స (రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి) నిరా ధారమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి పట్టణంలోని వలసదారులు ఎవరూ చట్టవిరుద్ధంగా ఉండటం లేదు. వాళ్లెవరూ పెంపుడు జంతువులను తినడమూ లేదు. ఇక ట్రంప్ గట్టి మద్దతుదారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లారా లూమర్ 9/11 స్మారక స్థూపం వద్దకు ట్రంప్‌తో పాటు విమానంలో వెళ్లి, డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ భారతీయ మూలాలపై జాత్యహంకార దాడిని ప్రారంభించారు. ట్రంప్ స్వయంగా హారిస్‌పై జాత్య హంకార వ్యాఖ్యలను ప్రయోగించారు. ట్రంప్ గెలుపును వేడుకగా జరుపుకొనే భారత మితవాద శక్తులు దీనిని గుర్తుంచుకోవాలి.4. ట్రంప్ విదేశాంగ విధానం: డెమొక్రాట్లు, పాత రిపబ్లికన్లకంటే కూడా సంకుచిత భావన కలిగిన అమెరికా గురించి ట్రంప్ మాట్లాడుతున్నారు. నిజానికి, ట్రంప్ తన మొదటి హయాంలో ‘అబ్రహం ఒప్పందాల’కు మధ్యవర్తిత్వం వహించారు. చైనాకు వ్యతిరేకంగా అమెరికా వైఖరిని పెంచారు. ఇరాన్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలను ఆమోదించారు. ఉత్తర కొరియాతో చర్చలు జరిపారు. ఇవన్నీ ఆయన ప్రపంచవ్యాప్త వ్యవహారాలు జరపగలరని సూచించాయి. కానీ అంతర్జాతీయ వ్యవస్థలో ప్రబలమైన ప్లేయ ర్గా ఉన్న అమెరికా ఆర్థిక, సైనిక బాధ్యతలను ట్రంప్ అసహ్యించుకుంటారు. దానితో వచ్చే ప్రయోజనాలను ఆయన చూడలేరు లేదా ఈ ప్రయోజనాలు లేవని నటిస్తారు. ప్రపంచీకరణ వల్ల, ప్రపంచంలో అమెరికా పాత్ర వల్ల అమెరికన్లు ఉద్యోగాలు కోల్పో యారనీ, అసమానతలు పెరిగాయనీ వాదిస్తారు.ట్రంప్‌కు జనాదరణ ఉందనేది నిజం. అదే సమయంలో ఆయన ఆధిపత్యం కొనసాగడం లేదన్నదీ నిజమే. ఎన్నికల ఫలితా లను కచ్చితంగా అంచనా వేయడం ఎందుకు కష్టమో దీన్నిబట్టి అర్థమవుతోంది. గుర్తింపు ఆధారిత రాజకీయాలను ఆయన మిత వాదం నుండి స్వీకరించారు. పాత వామపక్షీయుల ఉదారవాద ఆర్థిక శాస్త్రం, విదేశాంగ విధాన విమర్శలనూ స్వీకరించారు.ట్రంప్‌ను సైద్ధాంతికంగా ఒక వర్గంలోకి చేర్చడం ఎందుకు కష్టమో ఇది వివరిస్తుంది. అమెరికన్లు ఆయన వ్యక్తిత్వాన్ని, విధాన మిశ్ర మాన్ని, దానితో వచ్చే గందరగోళాన్ని ఇష్టపడతారా లేదా అనేది 2024 ఎన్నికలకు సంబంధించిన ప్రధాన ప్రశ్నగా మిగిలిపోయింది.ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
‘వాన్స్’ ఉత్తమ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి: వివేక్‌రామస్వామి
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ వైస్‌ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్ ఎంపికపై భారత సంతతి బిలియనీర్ వివేక్‌రామస్వామి స్పందించారు. ‘నా స్నేహితుడు వాన్స్‌ను చూసి నేను గర్వపడుతున్నా. అతను నా ఫ్రెండే కాదు. క్లాస్మేట్. లాస్కూల్‌లో చదవుకునేపుడు మేమిద్దరం చాలా ఎంజాయ్ చేశాం. వాన్స్ ఉత్తమ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్. అతడి గెలుపు కోసం, దేశం బాగు కోసం నేను ఎదురు చూస్తున్నా’అని వివేక్‌రామస్వామి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వివేక్‌రామస్వామి ప్రైమరీల దశలోనే తప్పుకుని ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ల తరపున ట్రంప్ పోటీ పడుతున్నారు. ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఒహియో సెనేటర్ జేడీ వాన్స్‌ను తాజాగా ఎంపిక చేసుకున్నారు. -
అలెక్సీ నావల్నీ మరణం.. చిక్కుల్లో ట్రంప్!
వాషింగ్టన్: రష్యా ప్రతిపక్ష నేత, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై కరడుగట్టిన విమర్శకుడిగా పేరొందిన అలెక్సీ నావల్నీ మృతి.. ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. నావల్నీ మృతిపై.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరిగా స్పందించలేదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీలో పుతిన్ వింగ్ (పుతిన్ అనుకూల వర్గం) పట్ల జాగ్రత్తగా ఉండాలని ట్రంప్‌ను ఉద్దేశించి ఆ పార్టీ నేత లిజ్ చెనే హెచ్చరించారు. అలాంటివారిని వైట్‌హౌజ్‌లోకి వెళ్లనివ్వకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై డొనాల్డ్ ట్రంప్ సరైన రీతిలో స్పందించలేదు. చట్టానికి అతీతులుగా వ్యవహరించడంలో ట్రంప్, పుతిన్‌లు ఇద్దరూ ఇద్దరే. నాటో దేశాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా, బ్రిటన్ల భద్రతను ప్రమాదంలో పడేస్తాయి’అని చెనే తెలిపారు. కాగా, నాటో మార్గదర్శకాల ప్రకారం ఖర్చు పెట్టని దేశాలను రష్యా ఏమైనా చేసుకోవచ్చని.. ఈ విషయంలో రష్యాను తాను ప్రోత్సహిస్తానని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదీ చదవండి.. సొంత బ్రాండ్ షూస్ విడుదల చేసిన ట్రంప్ -
US: ట్రంప్ చేతిపై ఎర్ర మచ్చలేంటి ? ఫ్యాన్స్‌లో జోరుగా చర్చ
వాషింగ్టన్: ఈ ఏడాదిలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హాట్ ఫేవరెట్‌గా మారారు. రిపబ్లికన్ల తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిగా ట్రంప్ నామినేట్ అవడం దాదాపు ఖాయమనే తెలుస్తోంది. తాజాగా జరిగిన అయోవా స్టేట్ ప్రైమరీ బ్యాలెట్లో ట్రంప్ తిరుగులేని విజయం నమోదు చేసుకున్నారు. అయోవాలోనే 51 శాతం ఓట్లతో ట్రంప్ విజయభేరి మోగించారంటే మిగిలిన చోట్ల ట్రంప్ గెలుపు సులువేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే ట్రంప్ తాజాగా ఓ విషయమై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. బుధవారం న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఒక డిఫమేషన్ కేసులో కోర్టుకు వచ్చినపుడు అక్కడున్న మద్దతుదారుల వైపు చూస్తూ ట్రంప్ చేయి ఊపారు. అయితే ఆ సమయంలో ట్రంప్ చేతిపై ఎర్ర మచ్చలున్నాయి. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్రంప్ చేతిపై ఉన్న రెడ్ స్పాట్స్‌కు నెటిజన్లు తమకు తోచిన విధంగా కారణాలు చెబుతున్నారు. కొందరు ఆ మచ్చలు కెచప్ తిని చేయి శుభ్రం చేసుకోకపోవడం వల్ల వచ్చాయంటుంటే మరికొందరు అయోవాలో గడ్డకట్టించే చలి వల్ల వచ్చాయని కామెంట్లు చేస్తున్నారు. What happened to Trump’s hand? It wasn’t like this in New Hampshire. pic.twitter.com/B4TlPxEmDV — PatriotTakes 🇺🇸 (@patriottakes) January 17, 2024 ఇదీచదవండి.. రూపాయి కంటే తక్కువ విలువైన కరెన్సీలు ఇవే -
America Elections: రిపబ్లికన్ అభ్యర్థులకు మంచు టెన్షన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందడి మరికొద్ది గంటల్లో ప్రారంభమవనుంది. ఈ నెల 15వ తేదీన అయోవాలో రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిని ఎన్నుకునే ప్రైమరీ బ్యాలెట్(కోకస్) జరగనుంది. అయితే ఈ ప్రైమరీలలో ఎన్ని ఓట్లు పోలవుతాయన్నదానిపై పోటీపడుతున్న అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అయోవాలో జీరో డిగ్రీ ఫారెన్‌హీట్ కిందకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు, ఇక్కడ భారీగా కురుస్తున్న మంచు కారణంగా ఓటింగ్ శాతం ఎంత నమోదవుతుందో అని అభ్యర్థులు టెన్షన్ పడిపోతున్నారు. తక్కువ ఓటింగ్ శాతం తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందని ఎవరికి వారు ఆందోళ చెందుతున్నట్లు తెలుస్తోంది. బ్యాలెట్ జరిగే ఈ నెల 15వ తేదీన రాత్రి రికార్డుస్థాయి చలి ఉంటుందని జాతీయ వాతావరణ సర్వీసుల డేటా చెబుతోంది. ఇప్పటికే ఇక్కడ ఉన్న రికార్డుస్థాయిలో కురుస్తున్న మంచు వల్ల రోడ్లు బ్లాక్ అయి రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న అగ్ర నేతలు దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత సంతతికి చెందిన బిలియనీర్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి తమ ప్రచార ఈవెంట్లను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. ఇదీచదవండి..రష్యాలో మిస్టరీ డెత్స్.. ఎక్కువ మరణాలు వారివే -
అమెరికాకు తప్పిన షట్‌డౌన్ ముప్పు
వాషింగ్టన్: అమెరికాకు షట్‌డౌన్ ముప్పు తాత్కాలికంగా తప్పింది. వార్షిక ద్రవ్య వినిమయ బిల్లుని ఆమోదించడానికి ప్రతిపక్ష రిపబ్లికన్లు ససేమిరా అనడంతో బిల్లులు చెల్లించలేక అగ్రరాజ్యం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదరకర పరిస్థితులు వచ్చాయి. అయితే శనివారం రాత్రి చివరి క్షణంలో స్వల్పకాలిక బిల్లుకి రిపబ్లికన్లు ప్రతినిధుల సభలో ఆమోదించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చివరి క్షణంలో తాత్కాలిక నిధుల విడుదల బిల్లుపై సంతకాలు చేశారు. దీంతో దేశంలో వివిధ పథకాలు, సైనికులు, ప్రభుత్వ జీత భద్రతాలకు మరో 45 రోజులు ఢోకా లేదు. ఈ బిల్లు నుంచి ఉక్రెయిన్‌కు అందించే ఆర్థిక సాయాన్ని మినహాయించారు. అమెరికాలో కొత్త ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 30 అర్ధరాత్రి 12 గంటల్లోగా ద్రవ్యవినిమయ బిల్లుల్ని ఆమోదించాల్సి ఉంది. అయితే ప్రతినిధుల సభలో మెజార్టీ కలిగిన రిపబ్లికన్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్ని ఆమోదించడానికి నిరాకరించారు. ప్రతినిధుల సభ స్పీకర్ మెకార్థీ రిపబ్లికన్ పార్టీకి చెందినవారే అయినప్పటికీ ద్రవ్య బిల్లుల్ని అడ్డుకుంటే ప్రజలకి ఇబ్బందులకు గురవుతారని నచ్చజెప్పడంతో వారు ఒక్క మెట్టు దిగారు. స్పీకర్ ప్రతిపాదించిన స్వల్పకాలిక బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వానికి ఉపశమనం లభించింది. -
ట్రంప్ ప్రాభవం మళ్లీ పెరిగేనా?
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మీద పోటీకి దిగే రిపబ్లికన్ అభ్యర్థి ఎవరు? పోరాటం తిరిగి బైడెన్, ట్రంప్ మధ్యనే ఉంటుందా? వారం రోజుల్లో రిపబ్లికన్ అభ్యర్థుల ప్రాథమిక డిబేట్ మొదలవుతుంది. ఒక పోల్ ప్రకారం, 52.7 శాతం మంది రిపబ్లికన్లు ట్రంప్‌ను సమర్థిస్తుండగా, ఆయన సమీప పోటీదారు డసాంటస్కు 14 శాతం మందే మద్దతిచ్చారు. పైగా 86 శాతం మంది రిపబ్లికన్ ఓటర్లు, ట్రంప్‌పై వచ్చిన నేర విచారణలు ఆయన్ని పోటీ చేయకుండా నిరోధించే ఉద్దేశ్యంతో తెచ్చినవని నమ్ముతున్నారు. ఏమైనా రాజకీయ వినోదం కోసం అర్రులు చాచే ప్రజారాశుల కోరికను తనకు అనుకూలంగా మలుచుకోగలిగే శక్తిమంతుడు ట్రంప్! 2022 నవంబర్‌లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో, ప్రతినిధుల సభకు మొత్తం సభ్యు లనూ, సెనేట్‌లో మూడింట ఒక వంతు సభ్యులనూ అమెరికన్లు ఎన్ను కున్నప్పుడు– పాత రిపబ్లికన్ వ్యవస్థకు చెందినవారితోపాటు కొందరు డెమొక్రాటిక్ పండితులు డోనాల్డ్ ట్రంప్ రాజకీయాలకు ‘నివాళులు’ అర్పించారు. ఆ ఎన్నికల్లో ట్రంప్ బలపరిచిన అభ్యర్థులు ఓడి పోయారు. 2020 ఎన్నికలు ‘దొంగిలించబడ్డాయని’ ట్రంప్ చేసిన ప్రక టనను బలపర్చినవారినీ, జో బైడెన్ చేతిలో ఓడిపోయినా అధికారంలో కొనసాగడానికి ట్రంప్ చేసిన దుస్సాహసిక ప్రయత్నానికి మద్దతు ఇచ్చినవారినీ ఓటర్లు స్పష్టంగా తిరస్కరించారు. ట్రంప్ తన పదవీ కాలంలో తన నామినీలతో నింపిన సుప్రీంకోర్టు గర్భస్రావాలపై ఇచ్చిన తీర్పు మీద మహిళా ఓటర్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. రిపబ్లికన్ పార్టీ నుంచి మరో అధ్యక్ష అభ్యర్థి, ట్రంప్ అత్యంత సమీప పోటీదారు అయిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డసాంటస్ తాజాగా రెండోసారి కూడా గవర్నర్‌గా విజయం సాధించారు. పైగా రిపబ్లికన్ దాతలు, ఆయన ప్రభావవంతమైన మీడియా ఛాంపియన్లు ఇద్దరూ ట్రంప్‌కు దూరమయ్యారు. మరి ఈ కొన్ని నెలలు రాజకీయాల్లో ఎలాంటి తేడాను చూపగలవన్నది ప్రశ్న. రిపబ్లికన్ అభ్యర్థులు వచ్చే వారం అయోవాలో తమ మొదటి ప్రాథమిక డిబేట్‌కు వెళుతుండగా, ఈ రేసులో ట్రంప్ ఎంత సౌకర్య వంతమైన స్థానంలో ఉన్నారంటే, బహుశా ఆయన ఆ చర్చకు కూడా వెళ్లకపోవచ్చు. ‘ఫైవ్థర్టీయైట్.కామ్’ రిపబ్లికన్ అభ్యర్థుల ప్రాథమిక పోటీల తాజా పోల్స్‌లో, 52.7 శాతం మంది ఓటర్లు ట్రంప్‌ను సమ ర్థించారు. 14 శాతం మంది మాత్రమే డసాంటస్కు మద్దతుగా నిలిచారు. ఇద్దరి మధ్యా ఆశ్చర్యకరంగా 38 శాతం తేడా ఉంది. వచ్చే వారం డిబేట్లో కనిపించే మిగతా వారందరూ – ప్రముఖంగా వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ, మైక్ పెన్స్, క్రిస్ క్రిస్టీ, టిమ్ స్కాట్‌లకు ఈ పోల్‌లో 10 శాతం కంటే తక్కువ ఓట్లు పడ్డాయి. చాలామందికి 5 శాతం కంటే తక్కువ వచ్చాయి. అయితే, ఏ రాజకీయ నేపథ్యం లేకుండా మొదటిసారి పోటీకి దిగుతున్న వివేక్ రామస్వామికి పెరుగు తున్న ఓటర్ల మద్దతు మాత్రం చెప్పుకోదగ్గది. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉన్న ప్రతి నేరారోపణ ఆయన పునాదిని బలోపేతం చేయడంలో సహాయపడింది. దాంతోపాటు బైడెన్ పరిపా లనకు వ్యతిరేకంగా రిపబ్లికన్లను ఇది సమైక్యపర్చింది. అయితే ఆయనపై ఆరోపించిన ప్రతి నేరాన్ని నిశితంగా చూస్తే, ట్రంప్ ఎంత ప్రమాదకరంగా, నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుంది. ఒక శృంగార తారకు డబ్బు చెల్లించాలంటే తన వ్యాపార రికార్డులను తప్పుగా చూపడమే కాకుండా, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఆర్థిక చట్టాలను ఉల్లంఘించాల్సి ఉంటుందని ట్రంప్‌కు తెలుసు. ఆయినా ఆ మార్గంలోనే ముందుకు సాగారు. వైట్ హౌస్ నుండి జాతీయ భద్రతా రహస్యాలను దొంగిలించడం, వాటిని తిరిగి ఇవ్వడానికి నిరాకరించడం, వాటిని దాచమని తన వ్యక్తిగత సహాయకుడికి చెబుతూనే, ఆ పత్రాలు తన వద్ద లేవని అబద్ధం చెప్పడం కూడా చట్టవిరుద్ధమని ఆయనకు తెలుసు. దానిక్కూడా సిద్ధపడ్డారు. 2020 ఎన్నికల ఫలితా లను తారుమారు చేయడానికి ప్రయత్నించవద్దని ఆయన సొంత కార్యాలయ సిబ్బందితోపాటు ప్రచార విభాగంలోని చాలామంది విశ్వసనీయమైన వ్యక్తులు ఆయన్ని హెచ్చరించారు. అయినా ఏడు రాష్ట్రాల నుండి మోసపూరిత ఓటర్ల జాబితాను సృష్టించారు, తన ఆదేశాలను పాటించని రాష్ట్ర అధికారులపై ఒత్తిడి తెచ్చారు, ఫలితాల ధృవీకరణను నిరోధించడానికి క్యాపిటల్‌పై దాడి చేయవలసిందని ఒక గుంపును ప్రేరేపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే... రాజ్యాంగం, చట్టపరమైన నిర్మాణం, సంస్థాగత నిబంధనలు, పార్టీ సిద్ధాంతాలు, రాజకీయ నియమాలే కాకుండా, ఎలాంటి మంచీ చెడూ నియంత్రణలలో లేని వ్యక్తి ట్రంప్. అయినప్పటికీ ట్రంప్ తనపై చేసిన మూడు నేరారోపణలను (ఈ వారంలో నాలుగవది ఎదుర్కొన్నారు) కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో గొప్ప విజయం సాధించారు. అమెరికన్ డీప్ స్టేట్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న హీరోలా, ఉదారవాదుల కుట్ర ఎదుర్కొంటున్న బాధితుడిలా ఆయన పాత్రలు మార్చుకుంటున్నారు. మరింతగా విరాళాలను సేకరించడం ప్రారంభించారు (ఈ డబ్బులో చాలా మొత్తం కేసుల ఫీజులకే పోతుంది). పైగా పార్టీలో క్షేత్రస్థాయి వర్గాలు ఆయన వెనుక సంఘటితమవుతున్నాయి. ఇటీవలి సీబీఎస్ న్యూస్ పోల్ ప్రకారం, 86 శాతం మంది రిపబ్లికన్ ఓటర్లు, ట్రంప్‌పై వచ్చిన నేర విచారణలు ఆయన్ని పోటీ చేయకుండా నిరోధించే ఉద్దేశ్యంతో వచ్చినవని నమ్ముతున్నారు. బైడెన్ చట్టబద్ధంగా ఎన్నిక య్యారని 92 శాతం మంది డెమొక్రాట్లు విశ్వసిస్తున్నప్పటికీ, 68 శాతం మంది రిపబ్లికన్లు బైడెన్ ఎన్నికను విశ్వసించడం లేదు. అంటే వీళ్లు ట్రంప్ అబద్ధాన్ని గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఒహాయో రాష్ట్ర శాసనసభ్యుడు, ట్రంప్ మద్దతుదారు అయిన నీరాజ్ అంటాని ఈ వ్యాసకర్తతో ట్రంప్ పునరుత్థానం గురించి చెప్పిన దానిని కూడా గమనించాలి: ‘‘ఇది ట్రంప్ పార్టీ. మాజీ దేశాధ్యక్షుడు దానిని నిర్వచిస్తున్నారు.’’ చివరకు, డసాంటస్ చేస్తున్న ప్రచారంలోని వైఫల్య శకలాలే ట్రంప్ పునరుత్థానాన్ని నిర్దేశిస్తున్నాయి. సాంఘిక సంప్రదాయవాదు లను గెలవడం కోసం... జాత్యహంకారం, బానిసత్వం, లైంగికత చుట్టూ ఉన్న బోధనలపై గవర్నర్ డసాంటస్ దాడి చేస్తూ, సాంస్కృతిక మితవాద తీవ్రవాదం ప్రాతిపదికన తన రాజకీయాలను నిర్వచించుకుంటున్నారు. అయితే ఇది ఆయనకు మద్దతు పెరగడంలో సహా యపడలేదు. పూర్వాశ్రమంలో యూఎస్ కాంగ్రెస్‌లో డసాంటస్తో కలిసి పనిచేసినవారు ఆయనకు ప్రజాకర్షణ కానీ, సహజమైన రాజ కీయ అనుసంధానం కానీ లేవని చెబుతున్నారు. తన ప్రచారాన్ని కూడా పేలవంగా నిర్వహిస్తున్నారు. సిబ్బందిని తరచుగా మార్చడంలో ఇది ప్రతిఫలిస్తోంది. ఇటీవలి ఒక ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ఎత్తి చూపినట్లుగా, ఫ్లోరిడా గవర్నర్‌ను కనికరం లేకుండా ట్రంప్ ఎగతాళి చేస్తున్నప్పుడు కూడా, ట్రంప్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలి యక డసాంటస్ తికమక పడుతున్నారు. రిపబ్లికన్లు వచ్చే జూలైలో మాత్రమే తమ అధ్యక్ష అభ్యర్థి ఎవర నేది నిర్ణయిస్తారు. ట్రంప్ చేస్తున్న న్యాయ పోరాటాలు ఆయన శక్తిని బాగా హరించవచ్చు. అయినా కూడా 2024లో అమెరికాలో జరిగే రాజకీయ పోరాటం తిరిగి బైడెన్, ట్రంప్ మధ్యనే సాగేట్టుగా కనిపిస్తోంది. అయితే అభ్యర్థిగా ట్రంప్ పోటీలో ఉండటం తమకు కలిసొస్తుందని బైడెన్ బృందం నమ్ముతోంది. బ్యాలెట్ పత్రాల్లో ట్రంప్ ఉనికి చాలు... స్వతంత్రులు, మితవాద రిపబ్లికన్లు, సబర్బన్ మహిళలు ఆయనకు దూరం జరగడానికి అన్నది ఈ వర్గం మాట. ట్రంప్ పట్ల వారి అపనమ్మకం, అయిష్టత చాలా తీవ్రస్థాయిలో ఉన్నందున... బైడెన్‌కు రెండవసారి పదవి దక్కడంపై ఉత్సాహం చూపని యువతతో సహా డెమొక్రాటిక్ పార్టీ పునాదిని ఏకీకృతం చేయడంలో ఇవి సహాయపడతాయి. తన పునాదిపై ఇప్పటికీ బలమైన పట్టున్న ట్రంప్‌ను తక్కువగా అంచనా వేయడం పొరపాటు అని వాదించే డెమొక్రాట్లు కూడా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి, అర డజను ఊగిసలాడే రాష్ట్రాల్లో మరోసారి మెజారిటీ కొన్ని వేల ఓట్లకు తగ్గుతుందని వీరి భయం. నిరుత్సాహకరమైన దేశ ఆర్థిక స్థితితో పాటు రాజకీయ వినోదం కోసం అర్రులు చాచే ప్రజారాశుల కోరికను కూడా తనకు అనుకూలంగా ట్రంప్ మలుచు కోగలరు. మొత్తం మీద, వచ్చే నవంబర్‌లో ఏమి జరిగినా, ట్రంప్ కరిష్మా ఇప్పటికీ సజీవంగానే ఉంది. అది అమెరికన్ రాజకీయాలను నిర్దేశిస్తూనే ఉంది. ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
బైడెన్‌పై అభిశంసనకు సిద్ధమైన రిపబ్లికన్లు
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌పై రిపబ్లికన్లు అభిశంసన తీర్మానానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయ లంచం కేసులో అతని ప్రమేయాన్ని వివరించే ఎఫ్బిఐ పత్రాలు బయటకు వచ్చిన నేపధ్యంలో బైడెన్‌పై అభిశంసనకు పూనుకున్నారు. ‘వైట్ హౌస్‌లో ఉంటున్న అవినీతి కుటుంబం’ సెనేటర్ చక్ గ్రాస్లీ ఎఫ్డీ-1023 ఫారమ్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దానిలో బైడెన్, అతని కుమారుడు హంటర్ తాము చేసిన సహాయానికి బదులుగా కైవ్‌కు చెందిన బురిస్మా హోల్డింగ్స్ సీఈఓను మిలియన్ల డాలర్లు చెల్లించాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు. ప్రతినిధి జిమ్ బ్యాంక్స్ ట్విట్టర్లో ఈ పత్రాలను తిరిగి పోస్ట్ చేస్తూ, వైట్ హౌస్‌లో ఉంటున్న అత్యంత అవినీతి కుటుంబం అని ఆరోపించారు. వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే దీనిని చదివి తెలుసుకోండి. బైడెన్‌ను వెంటనే పదవి నుండి తొలగించాలని అతను కోరారు. ‘బైడెన్ నేరాలకు రుజువులున్నాయి’ గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చెందిన ఇతర నాయకులు ఈ అభిశంసనకు వంతపాడారు. 80 ఏళ్ల అధ్యక్షుడిని గద్దె దించాలని డిమాండ్ చేశారు. బైడెన్ ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో అమెరికా తరపున పాల్గొన్నారు. బైడెన్ ఒక నేరస్తుడు. అతను మనల్ని డబ్బ్యుడబ్ల్యు3లోకి నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు బైడెన్లు చేసిన నేరాలకు రుజువు ఉందంటూ ప్రతినిధి మార్జోరీ టేలర్ గ్రీన్ ఆరోపించారు. ఈ విషయంలో రిపబ్లికన్లు ఇక జాప్యం చేయలేరు. ఇందుకోసం మాకు 218 రిపబ్లికన్ ఓట్లు అవసరం. నేను మొదటి రోజు నుండి ఇదే మాటపై ఉన్నాను. అమెరికన్ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. మరో ప్రతినిధి ఆండీ బార్ ఇలా రాశారు.. బైడెన్ రాజీ పడ్డాడనడానికి ఇది అసలైన సాక్ష్యం. బైడెన్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. ‘అవి నిరాధార ఆరోపణలు’ వైట్ హౌస్ అధికారులు రిపబ్లికన్ పార్టీ సభ్యులు చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. ఆ పత్రాలు నిజానిజాలతో సంబంధం లేకుండా ప్రచురితమయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ రిపబ్లికన్లు నిజానిజాలతో సంబంధం లేకుండా అధ్యక్షుడు బైడన్‌పై ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు. ఇది కూడా చదవండి: స్కూలుకు లేదు డుమ్మా.. 50 దేశాలు చుట్టొచ్చిందమ్మా..! 🚨BREAKING🚨 The FD-1023 form alleging then-Vice President JOE BIDEN was involved in a $5,000,000 bribery scheme with a Burisma executive has been released by @ChuckGrassley. Read 👇 pic.twitter.com/Mc6dVIwdsG — Oversight Committee (@GOPoversight) July 20, 2023 -
ట్రంప్‌కు ఊహించని షాక్.. అధ్యక్ష ఎన్నికల్లో సవాల్..
అమెరికాలో అధ్యక్ష బరిలో దిగడం కోసం పబ్లికన్ పారీ్టలో పోటీ పెరిగిపోతోంది. భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ తాను పోటీలో ఉన్నట్టు ప్రకటించగానే ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ అనుచరులందరూ ఓటమి పాలవడంతో పారీ్టలో ఆయనపై విశ్వాసం సన్నగిల్లుతోంది. అధ్యక్ష ఎన్నికల సమయానికి ఆయనకు 78 సంవత్సరాలు మీద పడతాయి. దీంతో ఒకప్పుడు ట్రంప్‌కు మద్దతునిచి్చనవారే ఇప్పుడు ఆయనపై పోటీకి సై అంటున్నారు.అయితే పోటీ ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్ మధ్య ఉంటుందని అంచనాలున్నాయి. రాన్ డెసాంటిస్ ట్రంప్‌కి గట్టి పోటీ ఇచ్చే వారిలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్ ముందు వరుసలో ఉంటారనే అంచనాలున్నాయి. ఇప్పటివరకు ఆయన తాను బరిలో ఉన్నట్టు ప్రకటించకపోయినప్పటికీ పార్టీలో ట్రంప్ వ్యతిరేక వర్గం రాన్‌కు జై కొడుతోంది. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ఫ్లోరిడా గవర్నర్‌గా 15 లక్షల ఓట్ల భారీ మెజారీ్టతో రాన్ నెగ్గారు. 44 ఏళ్ల వయసున్న రాన్ హార్వార్డ్‌లో లా డిగ్రీ పొందారు. నేవీలో పనిచేశారు. అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రజాప్రతినిధుల సభ్యునిగా 2013 నుంచి 2018 వరకు ఉన్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. రాన్ డెసాంటిస్‌కు రాజకీయాల్లో గుర్తింపు, ఒక లైఫ్ ఇచ్చింది ట్రంపే. 2019 ఎన్నికల్లో ఫ్లోరిడా గవర్నర్‌గా రాన్ అభ్యర్థిత్వాన్ని ట్రంప్ బాహాటంగా బలపరచడంతో ఆయన నెగ్గగలిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫ్లోరిడా గవర్నర్‌గా గత 40 దశాబ్దాల్లో ఎవరికీ దక్కని మెజారీ్టతో తిరిగి ఎన్నికయ్యారు. కరోనా సంక్షోభం సమయంలో ప్రజలకు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు. మాస్‌్కలు, టీకాలు తప్పనిసరి చేయకపోవడంతో ప్రజలు ఆయనను బాగా అభిమానించారు. దాదాపుగా ట్రంప్ భావాలే ఉన్నప్పటికీ, దుందుడుకు ధోరణితో కాకుండా సౌమ్యంగా వ్యవహరించడం వల్ల ట్రంప్ వ్యతిరేక వర్గానికి ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నారు. నిక్కీ హేలీ భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం బరిలో ఉన్నట్టు ప్రకటించి ప్రచారం మొదలుపెట్టడంతో రాజకీయాలు హీటెక్కాయి. ట్రంప్ తర్వాత అధికారిక ప్రకటన చేసిన రెండో అభ్యర్థి నిక్కీ. ఒకప్పుడు రిపబ్లికన్ పార్టీలో యువ కెరటంగా చరిష్మా ఉన్నప్పటికీ, ఇటీవల ఆమె ప్రభ నెమ్మదిగా తగ్గుతూ వచి్చంది. పంజాబ్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన నిక్కీ అక్కడి దక్షిణ కరోలినా తొలి మహిళా గవర్నర్‌గా చేశారు. 2016లో ట్రంప్‌ను తీవ్రంగా వ్యతిరేకించినా ఆయన అధ్యక్షుడయ్యాక ఆమె రాజీకొచ్చారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పని చేశారు. ఐరాస భద్రతా మండలి సమావేశం జరుగుతుండగా నాటకీయ పరిణామాల మధ్య పదవి నుంచి వైదొలిగారు. మైక్ పాంపియో డొనాల్డ్ ట్రంప్ హయాంలో సీఐఏ డైరెక్టర్‌గా, విదేశాంగ మంత్రిగా పదవులు నిర్వహించిన మైక్ పాంపియో చివరి వరకు ఆయనకు విధేయుడిగానే ఉన్నారు. ట్రంప్ విదేశీ విధానాలను ముందుకు తీసుకువెళ్లడంలో కీలకంగా వ్యవహరించారు. కేపిటల్ హిల్‌పై దాడి జరిగిన సమయంలో కూడా ట్రంప్‌కు మద్దతుగా ఉన్నారు. ‘‘చరిత్ర మమ్మల్ని బాగా గుర్తు పెట్టుకుంటుంది’’ అని వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు. వెస్ట్ పాయింట్ మిలటరీ అకాడమీలో గ్రాడ్యుయేషన్, హార్వార్డ్ యూనివర్సిటీ లా డిగ్రీ చేసిన పాంపియో ఇప్పుడు తన మాజీ బాస్‌నే ఎదిరించడానికి సిద్ధమవుతున్నారు. అధ్యక్ష అభ్యరి్థత్వానికి పోటీ పడతానని సన్నిహితుల వద్ద వెల్లడించారు. ఇక అధికారికంగా బరిలో దిగడమే మిగిలి ఉంది. మైక్ పెన్స్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉపాధ్యక్షుడిగా అత్యంత విధేయత ప్రకటించిన మైక్ పెన్స్ ఈసారి అధ్యక్ష అభ్యరి్థత్వానికి పోటీ పడతారని చెబుతున్నారు. 2021 జనవరిలో కేపిటల్ హిల్‌పై దాడి జరిగే వరకు ఇరువురి మధ్య మంచి అనుబంధం కొనసాగింది. ఆ దాడుల తర్వాత ట్రంప్, పెన్స్ సంబంధాలు క్షీణించాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో కిందపడినా పై చేయి తనదేనని చాటి చెప్పడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు సహకారం అందించడానికి పెన్స్ నిరాకరించారు. అప్పట్నుంచి పెన్స్‌పై గుర్రుగా ఉన్న ట్రంప్ ఆయనని ఒక పిరికివాడుగా ముద్ర వేస్తూ వ్యాఖ్యలు చేశారు. పెన్స్‌కి మదుస్వభావిగా పార్టీలో మంచిపేరుంది. తొలిసారిగా 2000 సంవత్సరంలో ప్రతినిధుల సభకు ఎన్నికైన పెన్స్ 2013 వరకు కాంగ్రెస్ సభ్యునిగా ఉన్నారు. 2013 నుంచి 2017 వరకు ఇండియానా గవర్నర్‌గా పని చేశారు. కరడు గట్టిన సంప్రదాయవాదిగా ముద్రపడిన పెన్స్ 2016లో ట్రంప్ అభ్యరి్థత్వానికి గట్టి మద్దతుదారుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయనపైనే పోటీకి సై అంటున్నారు. రిపబ్లికన్లలో ట్రంప్‌కు మద్దతు ఎంత ? ట్రంప్ అధ్యక్ష అభ్యరి్థగా పోటీకి దిగుతున్నానని ప్రకటించిన తర్వాత మిశ్రమ స్పందన కనిపించింది. ప్రస్తుతం అమెరికా ఉన్న పరిస్థితిల్లో ట్రంప్ వంటి దుందుడుకు ధోరణి కలిగిన వాడే అధ్యక్ష అభ్యరి్థగా ఉంటే గెలుపు సాధిస్తామని కొందరు భావిస్తూ ఉంటే మరికొందరు ట్రంప్ నోటి దురుసును అసహ్యించుకుంటున్నారు. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రెడ్ వేవ్ వస్తుందని అత్యధికులు ఆశించారు. అధ్యక్షుడు జో బైడెన్ పట్ల నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడంలో రిపబ్లికన్లు విఫలమయ్యారు. మరీ ముఖ్యంగా ట్రంప్ అనుచరులందరూ ఓటమి పాలవడం, కేపిటల్ హిల్‌పై దాడికి సంబంధించిన కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం వంటి పరిణామాలతో ట్రంప్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ విధానాలకు గ్రాండ్ ఓల్డ్ పార్టీలో అత్యధికులు మద్దతు చెబుతున్నా వాటిని అమలు చేయడంలో ట్రంప్ చూపిస్తున్న దూకుడు స్వభావాన్ని వ్యతిరేకిస్తున్నారు. 40 శాతం మంది ట్రంప్‌కు మద్దతుగా ఉంటే, 60 శాతం మంది వేరొకరు అధ్యక్ష అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది. 30 నుంచి 50 శాతం మంది ఫ్లోరిడా గవర్నర్ డెసాంటిస్‌కు మద్దతివ్వడం విశేషం. అధ్యక్ష అభ్యర్థి ఎన్నికలు పూర్తయ్యే సమయానికి పరిణామాలు వేగంగా మారిపోయి ట్రంప్‌కి అనుకూల పరిస్థితులు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. చదవండి: ఉద్యోగం ఒక్కటే కాదు.. అమెరికాలో అసలుకే మోసం.. -
100 ఏళ్లలో తొలిసారి.. స్పీకర్‌ను ఎన్నుకోలేకపోయిన అమెరికా
వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభలో స్పీకర్ ఎన్నికకు మంగళవారం ఓటింగ్ జరిగింది. మూడు రౌండ్ల బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించినా స్పీకర్ విజయానికి కావాల్సిన మెజార్టీ 218 ఓట్లు రాలేదు. దీంతో సభలో 222 సీట్లున్న రిపబ్లికన్ పార్టీకి షాక్ తగిలింది. స్పీకర్ పదవికి పోటీ పడుతున్న కెవిన్ మెకర్తీకి సొంత సభ్యుల నుంచే వ్యతిరేకత వచ్చింది. దీంతో మంగళవారం మూడు రౌండ్ల ఓటింగ్ జరిగినా ఆయన 218 ఓట్లు సాధించలేకపోయారు. 202 మంది రిపబ్లికన్ ప్రతినిధులు ఆయనకు అనుకూలంగా ఓటు వేయగా.. మరో 20 మంది వ్యతిరేకిస్తున్నారు. స్పీకర్ ఎన్నికకు జరిగిన తొలి రౌండ్ ఓటింగ్‌లో ఫలితం తేలకపోవడం అమెరికా ప్రతినిధుల సభ చరిత్రలో 100 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారి 1923లో స్పీకర్ ఎన్నికకు నిర్వహించిన తొలి రౌండ్ ఓటింగ్‌లో ఫలితం రాలేదు. అయితే స్పీకర్ అభ్యర్థికి కావాల్సిన మెజార్టీ వచ్చే వరకు ప్రతినిధుల సభలో ఓటింగ్ నిర్వహిస్తూనే ఉంటారు. ఫలితం వచ్చే వరకు ఎన్ని రౌండ్లయినా ఈ ప్రక్రియ కొనసాగిస్తారు. మంగళవారం మూడు రౌండ్ల ఓటింగ్ జరగగా.. బుధవారం మరోమారు ఓటింగ్ నిర్వహిస్తారు. తాను మళ్లీ రేసులో నిలబడతానని మెకర్తీ స్పష్టం చేశారు. పార్టీ సభ్యులతో చర్చించి అందరూ తనకు మద్దతు తెలిపేలా చూస్తానన్నారు. అయితే 20 మంది రిపబ్లికన్ సభ్యులు మెకర్తీని వ్యతిరేకిస్తున్నారు. వీరంతా ట్రంప్ సన్నిహితుడు అయిన జిమ్ జోర్డాన్‌కు మద్దతు తెలిపారు. మెకర్తీనే స్పీకర్‌గా ఎన్నుకోవాలని జోర్డాన్ సూచించినా.. వారు మాత్రం వినలేదు. మూడో రౌండ్లోనూ జోర్డాన్‌కు ఓటు వేశారు. అమెరికా ప్రతినిధుల సభలో ప్రస్తుతం 435 మంది సభ్యులున్నారు. రిపబ్లికన్లకు 222, అధికార డెమొక్రాట్లకు 212 మంది ప్రతినిధులున్నారు. మెజార్టీలో స్వల్ప తేడా ఉండటంతో 20 ఓట్లు చాలా కీలకమయ్యాయి. సభలో మొన్నటివరకు డెమొక్రాట్లదే మెజార్టీ. కానీ ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్లు అధిక సీట్లు గెలుచుకుని సభలో మెజర్డీ సాధించారు. చదవండి: కిమ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన దక్షిణ కొరియా..! -
బ్రేక్ ఇవ్వండి..ఎవరు ఇడియట్స్ అనేది తేలుద్దాం: బైడెన్ ఫైర్
తన విధానాలను సోషలిజంగా పేర్కొంటూ ఇడియట్స్గా ముద్రవేస్తున్నారంటూ మండిపడ్డారు అమెరికా అధ్యక్షడు జో బైడెన్. ఈ మేరకు ఆయన ఇల్లినాయిస్లోని జోలియెట్లో ఒక ప్రాథమిక పాఠశాలలో చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను చేస్తున్న సామజిక సేవలను విమర్శిస్తూ సోషలిజంగా పేర్కొంటున్నారని అన్నారు. రిపబ్లికన్లు ప్రజలకు సామాజిక భద్రత కల్పించే సేవ కార్యక్రమాలను హరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజల హక్కులు, సంక్షేమానికి సంబంధించిన సోషలిజాన్ని మట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తాను అధ్యక్షుడిగా వచ్చినప్పుడే సోషలిజం సంకేతాలు వినిపించాయి అందుకే దాన్ని ప్రేమించాను అందులోకి వచ్చానని దృఢంగా చెప్పారు. ఐనా రిపబ్లికన్లు సామాజిక భద్రత, వైద్య సంరక్షణ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నాశనం చేయాలని చూశారంటూ బైడెన్ మాటాల తుటాలు పేల్చారు. కష్టపడి పనిచేయండి, సహకరిచండి అప్పుడు మీకు ఈ విషయాలు సులభంగా అర్థమవుతాయంటూ గట్టి కౌంటరిచ్చారు. ఇవి నిబద్ధతతో కూడిన హామిలు, దీన్ని అమెరికన్ ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టే బాగా పనిచేస్తుంన్నారు. రిపబ్లికన్లను ఉద్దేశిస్తూ...దయచేసి కాస్త బ్రేక్ ఇవ్వండి కచ్చితంగా ఎవరు ఇడియట్స్ అనేది తేలిపోదుంగి అని వ్యగ్యంగా అన్నారు. బైడెన్ వ్యాఖ్యలతో సభా ప్రాంగణం ఒక్కసారిగా నవ్వులు, చప్పట్లతో మారు మ్రోగిపోయింది. (చదవండి: జెలెన్స్కీ తరుపై అసహనం...అత్యాశకు పోతే అంతే!) -
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ట్రంప్ హింట్..
వాషింగ్టన్: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మరోసారి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈసారి చారిత్రక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. శనివారం రాత్రి టెక్సాస్‌లో జరిగిన ఓ సమావేశంలో వేల మంది రిపబ్లికన్లను ఉద్దేశిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికీ 2020లో ఓటమిని మాత్రం ట్రంప్ అంగీకరించలేదు. 2016తో పాటు 2020లోనూ తానే విజయం సాధించానని, గతంలో కంటే మిలియన్ ఓట్లు ఎక్కువ సాధించి రికార్డు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలుస్తాని ధీమా వ్యక్తం చేశారు. రిపబ్లికన్లంతా మరింత పట్టుదలతో ఉండాలని సూచించారు. 2022 జనవరి 6న క్యాపిటల్ హిల్ హింసాత్మక ఘటనకు సంబంధించి హౌస్ సెలక్ట్ కమిటీ ట్రంప్‌కు సమన్లు పంపిన మరునాడే ఆయన ఎన్నికల్లో పోటీపై మాట్లాడటం గమనార్హం. బైడెన్ విజయాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు ఆరోజు క్యాపిటల్ భవనంతో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఘన విజయం సాధించినప్పటికీ.. ట్రంప్ మాత్రం తానే గెలిచానని చెప్పుకుంటున్నారు. బెడైన్ మోసానికి పాల్పడి ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. ఫలితాలు వచ్చి మూడేళ్లు గడిచినా ఇంకా తన వాదననే సమర్థించుకుంటున్నారు. చదవండి: బ్రిటన్ ప్రధాని పోటీలో ఉన్నా.. అధికారికంగా ప్రకటించిన రిషి సునాక్.. -
ఏడాది పూర్తయినా ఇంకా పోరాటమే...
వాషింగ్టన్: అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఆమె వ్యవహారదక్షతపై ఎన్నో విమర్శలొస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడితో ఆమె సఖ్యతపై ప్రశ్నలు ఓవైపు, ఉపాధ్యక్ష పదవికి సరైన పరిశీలన లేకుండానే ఎంపిక చేశారన్న ప్రత్యర్థుల ఆరోపణలు మరోవైపు.. శ్వేతసౌధం నుంచి సరైన మద్దతు లేకపోవడం వంటి ఎన్నో సవాళ్ల మధ్య ఆమె ఏడాది పాలన సాగింది. సాధారణ రోజుల్లోనే ఉపాధ్యక్ష బాధ్యతలో రాణించడం చాలా కష్టం... కరోనా మహమ్మారి సమయంలో అది మరింత సంక్లిష్టంగా మారింది. అధ్యక్షుడికి అంతర్గతంగా సలహాలు, సూచనలు ఎన్ని చేసినా, రోజువారీ ఘటనలపై ఆమె స్పందనపై విమర్శలొస్తున్నాయి. ఓటింగ్ హక్కుల బిల్లును ఆమోదించడం, మెక్సికో నుంచి వచ్చే అక్రమ వలసలను నిరోధించి, పరిష్కార చేయడం వంటి కీలక బాధ్యతలను బైడెన్, కమలాహారిస్‌కు అప్పగించారు. వీటితోపాటు బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్‌ను ముందుకు తీసుకెళ్లడం, స్పేస్ కౌన్సిల్‌కు నాయకత్వం వహించడం వంటివి ఆమె ముందున్నాయి. వీటన్నింటిలో ముఖ్యంగా వలసలనే రిపబ్లికన్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె సరిగా పనిచేయకపోవడంవల్లే వలసదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రగతిశీలమైన ధిక్కార గొంతుగా భావించిన ఆమె మద్దతుదారుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతేడాది గ్వాటెమాల, మెక్సికోలో పర్యటన సందర్భంగా వలసదారులనుద్దేశించి ‘‘ఎవ్వరూ రావొద్దు’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై యునైటెడ్ లాటిన్ అమెరికన్ నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ బాధ్యతల నిర్వహణపై డిసెంబర్లో ఓ ప్రజాభిప్రాయ సేకరణ జరపగా ఆమెకు మద్దతుగా 44శాతం ఓట్లు, వ్యతిరేకంగా 54శాతం ఓట్లు వచ్చాయి. అధ్యక్షుడికి సైతం దాదాపు ఇలాంటి ఫలితాలే వచ్చాయి. హ్యారిస్‌ను చిత్రీకరించడంలో మీడియా ఆమె స్టైల్మీదనే శ్రద్ధ పెట్టిందని డెమొక్రాటిక్ వ్యూహకర్త కరేన్ ఫిన్నే అభిప్రాయపడ్డారు. మధ్యంతర ముప్పు తప్పదా!? జో బైడెన్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయ్యింది. కరోనా, పర్యావరణ పరిరక్షణ, దేశ ఆర్థిక వ్యవస్థ, వలసలు, దేశీయ విధానాలు, విదేశీ ఒప్పందాల విషయంలో ఆయన చేసిన వాగ్దానాల్లో కొన్ని పరిష్కారమయ్యాయి. కొన్ని ప్రగతిలో ఉన్నాయి. ఇంకొన్నింటినీ నిలబెట్టుకోలేకపోయారు. వీటన్నింటిలోనూ ఇప్పుడు అతిపెద్ద ముప్పు కోవిడ్–19. అమెరికాలో 61 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. నిర్ధారణ పరీక్షల లక్ష్యాన్ని సైతం ఛేదించే దశలో ఉన్నారు. అయినా అది చూపిన ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. బైడెన్‌ను ఆమోదించే వారి సంఖ్య నెమ్మదిగా తగ్గుతోంది. దీన్ని పరిష్కరించలేకపోతే మధ్యంతరం ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఏర్పడతాయంటున్నారు విశ్లేషకులు. -
ట్రంప్ అభిశంసనపై విచారణ మొదలు
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక మాజీ అధ్యక్షుడి అభిశంసనపై సెనేట్‌లో విచారణ మొదలైంది. ట్రంప్‌పై విచారణ అర్ధరహితం అంటూ రిపబ్లికన్ పార్టీ చేసిన వాదన ఓటింగ్‌లో వీగిపోయింది. ట్రంప్‌పై అభిశంసన విచారణ రాజ్యాంగబద్ధమేనంటూ సెనేట్ 56–44 ఓట్ల తేడాతో విచారణకు ఓకే చెప్పింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు విచారణకు మద్దతు పలికారు. క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి ఘటనలో ట్రంప్‌ని ముద్దాయిగా తేల్చడం, అలాంటి వ్యక్తికి రిపబ్లికన్లు కొమ్ము కాస్తున్నారని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసమే డెమొక్రాట్లు అభిశంసన తీర్మానంపై విచారణకు పట్టుపట్టారు. దీంతో రెండోసారి అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడిగా, పదవి నుంచి దిగిపోయాక అభిశంసన ఎదుర్కొన్న వ్యక్తిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోతారు. అభిశంసన తీర్మానం సెనేట్‌లో నెగ్గే అవకాశం లేదు. సెనేట్‌లో రెండింట మూడు వంతుల మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తేనే తీర్మానం పాస్ అవుతుంది. అంటే 100 మంది సభ్యులున్న సభలో 67 మంది ఓట్లు వెయ్యాలి. రెండు పార్టీలకూ చెరి 50 మంది సభ్యుల బలం ఉంది. మరో ఆరుగురు రిపబ్లికన్లు అభిశంసనకు అనుకూలంగా ఉండడంతో 56 మంది అవుతారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే సభ చైర్మన్ కమలా హ్యారిస్ తన ఓటు వినియోగించుకుంటారు. ఏది ఏమైనా 67 మంది సభ్యుల మద్దతు లభించే అవకాశాలైతే లేవు. క్యాపిటల్ భవనం దాడి వీడియోలే ఆయుధం క్యాపిటల్‌పై దాడిని ట్రంప్ ప్రోత్సహించారన్న అభియోగాలపైనే అభిశంసన ప్రక్రియ కొనసాగుతుంది. సంబంధిత వీడియోలను వినియోగించాలని డెమొక్రాట్లు వ్యూహరచన చేస్తున్నారు. ఈ విచారణ సందర్భంగా ట్రంప్ ఆందోళనకారుల్ని ఎలా రెచ్చగొట్టారో వీడియోల ద్వారా సభ సాక్షిగా నిరూపించడానికి సభ్యులు కసరత్తు చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించి ట్రంప్‌ని బోనులు పెట్టడమే లక్ష్యంగా తాము ముందుకు వెళతామని సెనేట్‌లో ఇంపీచ్మెంట్ మేనేజర్ జామీ రాస్కిన్ చెప్పారు. అభిశంసనపై వాదనలు వినిపించుకోవడానికి ఇరుపక్షాలకు 16 గంటల చొప్పున సమయం కేటాయిస్తారు. అనంతరం సెనేట్ సభ్యులకు ఇరుపక్షాల్ని ప్రశ్నించడానికి నాలుగు గంటల సమయం కేటాయిస్తారు. అది పూర్తయి చర్చలు జరిగాక అభిశంసనపై ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ట్రంప్ అభిశంసనపై మాట్లాడుతున్న హౌజ్ ఇంపీచ్మెంట్ మేనేజర్ జేమీ రస్కిన్ -
ట్రంప్ అభిశంసన దిశగా..!
వాషింగ్టన్: గడువుకు ముందే దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దేశ ప్రజాస్వామ్య సౌధం క్యాపిటల్ భవనంపై దాడికి కారణమయ్యారన్న ఆరోపణలపై అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రతినిధుల సభలో బుధవారం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడికి అనుచరులను రెచ్చగొట్టారన్న ప్రధాన ఆరోపణతో ఈ అభిశంసన తీర్మానాన్ని రూపొందించారు. డెమొక్రాట్లు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభలో ఈ తీర్మానం ఆమోదం పొందితే.. వెంటనే దీనిని సెనెట్‌కు పంపిస్తారు. డెమొక్రాట్లతో పాటు పలువురు రిపబ్లికన్ సభ్యులు కూడా ఈ అభిశంసనకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న ట్రంప్‌ను అభిశంసిస్తూ రూపొందించిన ఈ తీర్మానంపై ప్రతినిధుల సభలో బుధవారం అర్ధరాత్రి(భారత కాలమానం) దాటిన తరువాత కూడా చర్చ కొనసాగింది. అభిశంసన తీర్మానం అమోదం పొందుతుందన్న విశ్వాసాన్ని డెమొక్రాటిక్ సభ్యులు వ్యక్తం చేశారు. ‘అధ్యక్షుడిగా ట్రంప్ శ్వేత సౌధంలో ఉన్నంతకాలం మన దేశం, మన స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నట్లే. క్యాపిటల్ భవనంపై దాడికి బాధ్యత వహించాల్సింది ట్రంపే. ఆయనే ఈ దాడికి కుట్ర చేశారు.అనుచరులను రెచ్చగొట్టారు. అందువల్ల ట్రంప్‌ను అభిశంసించే ఈ తీర్మానానికి మద్దతు పలకవలసిందిగా సహచర సభ్యులను కోరుతున్నా’ అని ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన డెమొక్రాట్ సభ్యడు జేమ్స్ మెక్ గవర్న్ సహచర ఎంపీలను కోరారు. క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించి ‘తిరుగుబాటు చేసేందుకు రెచ్చగొట్టారు’ అనే ప్రధాన ఆరోపణతో అభిశంసన తీర్మానాన్ని రూపొందించారు. ‘దాడితో ధ్వంసమైన ఈ భవనాన్ని మరమ్మత్తు చేయవచ్చు. కానీ ప్రజాస్వామ్య సౌధంపై జరిగిన ఆ దాడికి ట్రంప్‌ను బాధ్యుడిని చేయనట్లయితే, ఈ దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేం’ అని జేమ్స్ పేర్కొన్నారు. ‘దేశ ప్రజాస్వామ్య పునాదులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ‘అమెరికాలో ఇలాంటివి(క్యాపిటల్ భవనంపై దాడి) ఎట్టి పరిస్థితుల్లో కుదరవన్న గట్టి సందేశం ఇప్పుడు ఇవ్వనట్లయితే.. ఇవి మళ్లీ మళ్లీ జరిగే ప్రమాదముంది’ అని ఎంపీ చెల్లీ పింగ్రీ హెచ్చరించారు. ట్రంప్ పై అభిశంసన నిర్ణయం సరైంది కాదని రిపబ్లికన్ సభ్యుడు స్టీవ్ చాబొట్ అభిప్రాయపడ్డారు. ‘విభజిత దేశాన్ని కలిపే ప్రయత్నం చేయకుండా, మరింత విడదీసే ప్రయత్నం చేస్తున్నార’ని డెమొక్రాట్లపై విమర్శలు గుప్పించారు. రాజకీయ రచ్చను పక్కనబెట్టి, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను కలసికట్టుగా పరిష్కరించాల్సిన సమయం ఇదని సూచించారు. అంతకుముందు, 25వ రాజ్యాంగ సవరణ ద్వారా లభించిన అధికారంతో అధ్యక్షుడిగా ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను కోరుతూ ప్రతినిధుల సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 223 ఓట్లు, వ్యతిరేకంగా 205 ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్లలో ఒకరు తీర్మానానికి అనుకూలంగా ఓటేయగా, ఐదుగురు ఓటింగ్‌లో పాల్గొనలేదు. అయితే, 25వ రాజ్యాంగ సవరణ అధికారాన్ని వినియోగించుకుని ట్రంప్‌ను పదవి నుంచి దించాలన్న ఆలోచన తనకు లేదని స్పష్టం చేస్తూ ఈ ఓటింగ్ కన్నా ముందే ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి మైక్ పెన్స్ ఒక లేఖ రాశారు. అనుకూలంగా ఓటేస్తా అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తానని భారతీయ అమెరికన్ ఎంపీ డాక్టర్ అమీ బెరా స్పష్టం చేశారు. క్యాపిటల్ భవనంపై దాడికి కుట్ర పన్నినందుకు గానూ అమెరికా చరిత్రలో చెత్తకుండీలో చేరే స్థాయికి ట్రంప్ చేరారని మండిపడ్డారు. అమెరికా చరిత్రలోనే జనవరి 6 చీకటి రోజన్నారు. దేశ ప్రజాస్వామ్య సౌధంపై ఆ రోజు జరిగిన దాడికి కుట్రదారు, వ్యూహకర్త ట్రంపేనని విరుచుకుపడ్డారు. ఇందుకు ఆయన కొన్నాళ్లుగా ప్రణాళికలు వేశారన్నారు. ట్రంప్ దుశ్చర్యలను వివరించేందుకు మాటలు లేవన్నారు. ట్రంప్‌ని తొలగించలేం: పెన్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 25వ సవరణ ద్వారా గద్దె దింపేయాలని వస్తున్న డిమాండ్లను ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తోసిపుచ్చారు. ఆర్టికల్ 25 ద్వారా ట్రంప్‌ని పదవీచ్యుతుడ్ని చేయలేమని ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసికి లేఖ రాశారు. ‘‘మన రాజ్యాంగం ప్రకారం 25వ రాజ్యాంగ సవరణ అంటే అధ్యక్షుడికి శిక్ష విధించడం కాదు. అది ఎలాంటప్పుడు ఉపయోగించాలంటే భావి తరాలకు మార్గదర్శకంగా ఉండాలి. అధ్యక్షుడు అసమర్థుడైనప్పుడు, పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్‌ని ప్రయోగించాలి’’అని మైక్ పెన్స్ ఆ లేఖలో పేర్కొన్నారు. క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ట్రంప్‌ని గద్దె దింపేయాలంటూ డిమాండ్లు అధికమయ్యాయి. స్పీకర్ నాన్సీ ఈ డిమాండ్‌ను తీవ్రంగా వినిపించడంతో ఉపాధ్యక్షుడు ఆమెకు లేఖలో ఈ వివరణ ఇచ్చారు. అప్రమత్తతలో భాగంగా క్యాపిటల్‌లో మొహరించిన నేషనల్ గార్డ్ బలగాలు విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యం -
ట్రంప్‌ను తొలగించే తీర్మానాన్ని అడ్డుకున్న రిపబ్లికన్లు
వాషింగ్టన్: రాజ్యాంగబద్ధ అధికారాలను వినియోగించుకుని ట్రంప్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను కోరుతూ సోమవారం డెమొక్రాట్లు తీసుకువచ్చిన తీర్మానాన్ని ప్రతినిధుల సభలో రిపబ్లికన్ సభ్యులు అడ్డుకున్నారు. మద్దతుదారులను రెచ్చగొట్టి క్యాపిటల్ భవనంపై దాడికి ప్రోత్సహించారని, అధ్యక్షుడిగా అధికారంలో కొనసాగేందుకు ట్రంప్ అనర్హుడని పేర్కొంటూ డెమొక్రాట్లు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. 25వ రాజ్యాంగ సవరణ ద్వారా, కేబినెట్లోని మెజారిటీ సభ్యుల మద్దతుతో అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించే అవకాశముంది. ట్రంప్ పదవీకాలం 20న ముగియనుంది. ఈ లోపే అభిశంసన ద్వారా ఆయనను పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -
నీరా నియామకాన్ని వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లు
వాషింగ్టన్: యూఎస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్‌గా ఇండో అమెరికన్ నీరాటాండన్ నియామకాన్ని రిపబ్లికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. సెనేట్‌లో కీలక సభ్యులు బహిరంగంగానే ఆమె నియామకంపై అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. గతంలో పలువురు సెనేటర్లకు వ్యతిరేకంగా ఆమె అనేక అవమానాస్పద వ్యాఖ్యలు చేసిందంటున్నారు. టాండన్ నియామకానికి సెనేట్ ఆమోద ముద్ర తప్పనిసరి. ఈనేపథ్యంలో రిపబ్లికన్ సెనేటర్ల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. నీరా నియామకం బైడెన్ ఇప్పటివరకు ప్రకటించిన వాటిలో అత్యంత చెత్త నిర్ణయమని కీలకమైన సెనేటర్ జాన్ కార్నిన్ మండి పడ్డారు. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు గమనిస్తే, ఆమెతో కలిసి పనిచేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. పాత వ్యాఖ్యలు బయటపడకుండా ఉండేందుకు ఆమె ఇటీవల తన పాత ట్వీట్లను చాలావరకు డిలీట్ చేసిందన్నారు. రిపబ్లికన్లను విమర్శిస్తూ చేసిన దాదాపు 1000 ట్వీట్లను ఆమె తొలగించిందన్నారు. ప్రస్తుతం సెనేట్‌లో రిపబ్లికన్లకు 50 సీట్లున్నాయి. డెమొక్రాట్లకు 48 సీట్లున్నాయి. కీలకమైన రెండు సీట్లకు జనవరి 5న ఎన్నిక జరగనుంది. నీరా పాత ట్వీట్లను పరిశీలిస్తే ట్రంప్‌పై, సెనేట్ మెజార్టీ లీడర్ మెక్కనెల్పై పలు విమర్శలున్నాయి. మెక్కనెల్ను ఆమె మాస్కో మిచ్ అని సంబోధించారు. అప్పుడప్పుడు డెమొక్రాట్లకు మద్దతు పలికే రిపబ్లికన్ సెనేటర్ కాలిన్స్‌ను పాథటిక్గా ఆమె వర్ణించారు. దీనికితోడు గతంలో ఆమె నిర్వహించిన పదవుల్లో వివక్షతో వ్యవహరించారని కొందరు సెనేటర్లు విమర్శించారు. అయితే టాప్ డెమొక్రాట్ సెనేటర్లలో కొందరు మాత్రం ఆమె నియామకాన్ని సమర్థించారు. ట్రంప్ కామెంట్లతో పోలిస్తే ఆమె కామెంట్లు చాలా సరళంగా ఉన్నాయన్నారు. బైడెన్ ప్రభుత్వంలో ఆమె కీలకంగా మారుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. -
సెనెట్ నీది ‘హౌస్’ నాది!
వాషింగ్టన్: అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు రెఫరెండంగా భావించిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలొచ్చాయి. ప్రతిపక్షానికి బాసటగా నిలిచే ఆనవాయితీని కొనసాగిస్తూ ప్రతినిధుల సభ డెమొక్రటిక్ పార్టీ వశమైందని ప్రాథమిక ఫలితాలు తేల్చాయి. కానీ, ఎగువ సభ సెనెట్‌లో అధికార రిపబ్లికన్ పార్టీ తన మెజారిటీని నిలబెట్టుకుంది. 435 స్థానాలున్న ప్రతినిధుల సభకు మంగళవారం జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్లు సాధారణ మెజారిటీ కన్నా కనీసం 23 సీట్లు అధికంగా గెలుచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 235 సీట్లు, డెమొక్రాట్లకు 193 సీట్లున్నాయి. తాజా ఎన్నికల్లో రిపబ్లికన్ల నుంచి డెమొక్రాట్లు సుమారు 27 సీట్లు కైవసం చేసుకున్నారని ప్రాథమిక ఫలితాలు వెల్లడించాయి. కొత్త సభ వచ్చే జనవరిలో కొలువుదీరుతుంది. నలుగురు సిట్టింగ్ ఇండో–అమెరికన్లు ప్రతినిధుల సభకు తిరిగి ఎన్నికయ్యారు. వారంతా డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారే. ఈసారి రికార్డు స్థాయిలో 100 మంది మహిళలు దిగువ సభకు ఎన్నికయ్యారు. అందులో 28 మంది తొలిసారి ఈ సభలో అడుగుపెట్టబోతున్నారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన 78 ఏళ్ల నాన్సీ పెలోసి ప్రతినిధుల సభకు స్పీకర్‌గా ఎన్నికయ్యే చాన్సుంది. ఈ పదవి భారత్‌లో లోక్‌సభ స్పీకర్ హోదాతో సమానం. ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా రషిదా త్లాయిబ్, సోమాలియాకు చెందిన ఇల్హాన్ ఒమర్‌లు గుర్తింపు పొందారు. మరోవైపు, 35 స్థానాలకు ఎన్నికలు జరిగిన సెనెట్ (మొత్తం సభ్యులు 100)లో రిపబ్లికన్లు తమ ఆధిక్యతను కొనసాగించారు. తాజా ఎన్నికల తరువాత ఎగువ సభలో వారి బలం 51 పైనే ఉందని స్థానిక మీడియా తేల్చింది. ఇండో–అమెరికన్ల విజయం.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో నలుగురు సిట్టింగ్ ఇండో–అమెరికన్లు ప్రతినిధుల సభకు తిరిగి ఎన్నికవగా, మరో డజను మందికి పైగా రాష్ట్రాల స్థాయిలో జరిగిన అసెంబ్లీ, సెనెట్, అటార్నీ జనరల్ ఎన్నికల్లో గెలుపొందారు. ఇలినాయిస్ 8వ కాంగ్రెషనల్ జిల్లాలో రాజా క్రిష్ణమూర్తి మళ్లీ గెలిచారు. కాలిఫోర్నియా 7వ కాంగ్రెషనల్ జిల్లాలో అమీ బేరా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. సిలికాన్ వ్యాలీలో రో ఖన్నా గెలిచారు. ప్రతినిధుల సభలో ఏకైక మహిళా ఇండో అమెరికన్ ప్రమీలా జయపాల్ భారీ మెజారిటీతో గెలిచారు. విస్కాన్సిస్ రాష్ట్రంలో డెమొక్రటిక్ పార్టీకి చెందిన జోష్ కౌల్.. అటార్నీ జనరల్‌గా ఎన్నికై, ఈ పదవి దక్కించుకున్న తొలి ఇండో–అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. డెమొక్రటిక్ పార్టీకే చెందిన నీమా కులకర్ణి కెంటుకీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అమీశ్, కెవిన్ థామస్‌లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ముజతబా మొహమ్మద్ ఉత్తర కరోలినాసెనెట్కు ఎన్నికయ్యారు. మీడియాపై ట్రంప్ ఫైర్ వాషింగ్టన్: మీడియాపై ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. మధ్యంతర ఎన్నికలు ముగిసిన తరువాత బుధవారం శ్వేతసౌధంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాత్రికేయులతో వాగ్వాదానికి దిగారు. ముఖ్యంగా సీఎన్ఎన్ పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని మండిపడ్డారు. మీడియా సమావేశంలో ట్రంప్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి నిరాకరించి మైక్రోఫోన్‌కు దూరంగా జరిగారు. ట్రంప్ నేరగాళ్లుగా అభివర్ణించిన మధ్య అమెరికా ప్రజల వలసల గురించి సీఎన్ఎన్ పాత్రికేయుడు ప్రశ్నించగా..‘మీ పని మీరు చూసుకోండి..దేశ పాలనను నన్ను చేయనీయండి’ అని ట్రంప్ బదులిచ్చారు. రిపబ్లికన్ పార్టీ శ్వేత జాతీయులకు మద్దతిస్తోందా? అని మహిళా జర్నలిస్ట్ అడగ్గా.. ఆమె జాత్యహంకార ప్రశ్నలు వేస్తోందని మండిపడ్డారు. ట్రంప్‌తో వాగ్వాదానికి దిగిన సీఎన్ఎన్ విలేకరి ప్రెస్ ప్రవేశ అర్హతా పత్రాల్ని వైట్‌హౌజ్ రద్దుచేసింది. మీడియాకు వ్యతిరేకంగా ట్రంప్ ప్రవర్తన హద్దులు మీరిందని సీఎన్ఎన్ ఆరోపించింది. -
వారిలో ఎక్కువ మంది ట్రంప్‌కు వ్యతిరేకమే..!
అమెరికా చట్ట సభలకు జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు ఊహించినట్టే వచ్చాయి. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు, సెనెట్‌లో రిపబ్లికన్లు మెజారీటీ సాధించారు. ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల ఆధిపత్యం ట్రంప్ దూకుడుకు కళ్లెం వేస్తుందని ట్రంప్ వ్యక్తిగత అంశాలపై, ఆయన పాలనపై జరుగుతున్న దర్యాప్తులు ఊపందుకుంటాయని విశ్లేషకుల అంచనా. ట్రంప్ తన విధానాలను, నిర్ణయాలను పునఃపరిశీలించుకోవలసిన అవసరం ఉంటుందని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 100 మందికిపైగా మహిళలు ఎన్నిక కావడం విశేషం. మధ్యంతర ఎన్నికలు అమెరికా ప్రజల్ని ట్రంప్ అనుకూలురు, ట్రంప్ వ్యతిరేకులుగా విభజించాయనీ, దీని ఫలితం దేశ రాజకీయాల్లో మరో రెండేళ్ల వరకు ఉంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మధ్యంతర ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడికానప్పటికీ, ఇంత వరకు వచ్చిన ఫలితాలను బట్టి ప్రతినిధుల సభ డెమోక్రాట్ల పట్టులోకి వెళ్లిందని స్పష్టమవుతోంది. ప్రతినిధుల సభలో మెజారిటీ కంటే 30 సీట్లు అధికంగా డెమోక్రాట్లు గెలుచుకున్నారు. 2006 తర్వాత డెమోక్రాట్లకు ఇంత మెజారిటీ రావడం ఇదే తొలిసారి. డెమోక్రాట్ల తరఫున ఎన్నికైన వారిలో చాలా మంది మొదటి సారి ప్రజాప్రతినిధులయిన వారే. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు మెజారిటీ సాధించడం వల్ల ట్రంప్‌పై ఉన్న వివిధ కేసుల దర్యాప్తు ముమ్మరమవుతుంది. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పాల్పడిన అవకతవకలు, ఎన్నికల్లో రష్యా జోక్యం, అలాగే.. ఆయన వివాదాస్పద నిర్ణయాలు, పాలన తీరుపై విచారణలు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే కీలకాంశాలపై నిర్ణయం తీసుకోవాలంటే ప్రతినిధుల సభ, సెనెట్ రెండింటిలో మెజారిటీ సభ్యుల ఆమోదం అవసరం. సెనెట్‌లో రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్నందున డెమోక్రాట్ల పని అనుకున్నంత సులభం కాదు. కాగా, కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం జనవరిలో జరుగుతుంది కాబట్టి ఇదంతా కార్యరూపం దాల్చడానికి కొన్ని నెలలు పడుతుంది. ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించిన డెమోక్రాట్లు వివిధ అంశాలపై దృష్టి సారించనున్నారు. అభిశంసన సభలో మెజారిటీ ఉన్నందున డెమోక్రాట్ పార్టీకి మరింత నగదు అందుబాటులో ఉంటుంది. సిబ్బంది పెరుగుతారు. సభా సంఘాలపై నియంత్రణ వస్తుంది. దాంతో ట్రంప్‌కు సంబంధించిన వివిధ కుంభకోణాలు, వివాదాస్పద నిర్ణయాలపై విచారణలు ఊపందుకుంటాయి. అలాగే, ట్రంప్ అభిశంసనకు చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే అభిశంసన అంత సులభం కాకపోవచ్చు. ప్రతినిధుల సభ అభిశంసన ప్రక్రియను ప్రారంభించవచ్చు. కానీ, రెండు సభల్లో మెజారిటీ సభ్యులు ఆమోదిస్తేనే ఈ తీర్మానం చెల్లుతుంది. ప్రతినిధుల సభలో మెజారిటీ ఉన్నప్పటికీ చాలా మంది డెమోక్రాట్లు ట్రంప్ ఎన్నికల అక్రమాలపై జరుగుతున్న విచారణ తేలేంత వరకు అభిశంసనకు ముందుకు రాకపోవచ్చు. మరోవైపు సెనెట్‌లో మూడింట రెండు వంతుల బలం డెమోక్రాట్లకు లేదు. కాబట్టి అక్కడ తీర్మానం నెగ్గే అవకాశం లేదు. బడ్జెట్ ప్రతినిధుల సభలో మెజారిటీ ఉన్న డెమోక్రాట్లు బడ్జెట్ విషయంలో ట్రంప్‌కు కళ్లెం వేసే అవకాశం ఉంది. ఇప్పటిలా ట్రంప్ తనకు కావలసిన నిధుల కోసం ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉండదు. బడ్జెట్‌కు సంబంధించిన వివిధ అంశాల్లో ట్రంప్ మాట చెల్లుబాటయ్యే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. పన్ను రిటర్న్‌లు ట్రంప్ వ్యక్తిగత ఆదాయం, పన్ను రిటర్న్స్ పత్రాలను వెలుగులోకి తెచ్చేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తారు. గతంలో వీటిని ఇవ్వడానికి ట్రంప్ నిరాకరించారు. అయితే, ఈసారి ట్రంప్‌ను రిటర్న్స్ పత్రాల కోసం అడుగుతామనీ, ఆయన నిరాకరిస్తే తమకున్న అధికారంలో చట్టబద్ధంగా వాటిని తీసుకుంటామని హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీకి నాయకత్వం వహించనున్న రిచర్డ్ నీల్ చెప్పారు. ఆయన బ్యాంకు లావాదేవీల వివరాలు కూడా సంపాదిస్తామన్నారు. ఇవి బయటపడితే ట్రంప్‌కు రష్యాతో ఉన్న సంబంధాలు బయటపడతాయని ఆయన అన్నారు. అయితే, వీటికోసం న్యాయపరంగా సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉంటుంది. రష్యా జోక్యం గత అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందనీ, ట్రంప్ విజయానికి రష్యా సహకరించిందని వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో మళ్లీ విచారణ ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇప్పుడీ పునర్విచారణ ప్రారంభమైతే ట్రంప్‌పై ఒత్తిడి మరింత పెరగవచ్చు. మెక్సికో సరిహద్దులో గోడ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఈ అంశాన్ని కీలకం చేసుకుని లబ్ధి పొందారు. అక్రమ వలసలను అరికట్టడానికి మెక్సికో సరిహద్దు పొడవునా గోడ కడతానని చెప్పారు. అమెరికన్ కాంగ్రెస్ గత మార్చిలో దానికి 160 కోట్ల డాలర్లను కూడా కేటాయించింది. అప్పట్లో డెమోక్రాట్లు సహా పలువురు దీన్ని వ్యతిరేకించారు. ఇప్పుడీ గోడ నిర్మాణాన్ని ఆపేసేందుకు డెమోక్రాట్లు చర్యలు తీసుకోవచ్చు. ఒబామా కేర్ మధ్యంతర ఎన్నికల్లో ప్రభావం చూసిన అంశాల్లో ఇమ్మిగ్రేషన్, హెల్త్‌కేర్ ముఖ్యమైనవి. ఒబామా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాన్ని కొనసాగిస్తామని డెమోక్రాట్లు చెప్పారు. ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టే అవకాశం ఉంది. అలాగే, వలస విధానాల్లో ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న సవరణలు, తెస్తున్న కొత్త నిబంధనలపై కూడా డెమోక్రాట్లు దృష్టి సారించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మెడికేర్, మెడిక్ ఎయిడ్ పథకాల కొనసాగింపునకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల అనంతరం డెమోక్రాట్ల నేత నాన్సీ పిలోసి చెప్పారు. 65 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు ఆదాయంతో సంబంధం లేకుండా ఈ పథకాల కింద వైద్య సహాయం అందిస్తారు. ఔషధాల ధరల్ని తగ్గిస్తామని, ఆరోగ్యబీమా ప్రీమియం తగ్గిస్తామని కూడా డెమోక్రాట్లు చెబుతున్నారు. ఇరాన్‌తో ఒప్పందం ఒబామా హయాంలో అమెరికా –ఇరాన్‌ల మధ్య కుదిరిన అణు ఒప్పందం నుంచి ట్రంప్ వైదొలగడం పట్ల డెమోక్రాట్లు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడీ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని డెమోక్రాట్లు భావిస్తున్నా, సెనెట్‌లో మెజారిటీ లేనందున చేయగలిగిందేమీ ఉండదని తెలుస్తోంది. అలాగే, ఇజ్రాయెల్‌తో సంబంధాల విషయంపై కూడా వీరు దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించడంతో పలు ప్రభుత్వ కమిటీలు, విచారణ సంఘాలకు డెమోక్రాట్ నేతలే నాయకత్వం వహిస్తారు. దాంతో ఈ కమిటీలు ట్రంప్ పాలనపైన, వ్యక్తిగతంగాను శూలశోధనకు దిగే అవకాశం ఉంది. రెండుగా చీలిన అమెరికన్లు మధ్యంత ఎన్నికలు ట్రంప్ పాలనపై రెఫరెండమని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఎన్నికలతో ట్రంప్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా అమెరికన్లు విడిపోయారని , దీని ప్రభావం వచ్చే రెండేళ్ల పాటు అమెరికా రాజకీయాలపై ఉంటుందని వారు తెలిపారు. ఈ ఎన్నికలతో అమెరికా వాణిజ్యయుద్ధం మరింత ముదురుతుందని, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఇదే ప్రధానాంశం అవుతుందని పరిశీలకుల భావన. అలాగే, ఈ ఎన్నికల్లో వంద మందికి పైగా మహిళలు నెగ్గడంతో సంప్రదాయక వాదులైన డెమోక్రాట్లు తమ అజెండాను సవరించుకోవలసి ఉంటుందన్నారు. పురుషుల ఓట్లు ట్రంప్‌కే మధ్యంతర ఎన్నికల్లో 60శాతం పురుషుల ఓట్లు రిపబ్లికన్ పార్టీకి పడ్డాయని, మహిళల ఓట్లు రెండు పార్టీలకు పడ్డాయని ఎన్నికల సర్వేలు వెల్లడిస్తున్నాయి. మధ్యంతర ఎన్నికల్లో 49శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 18–24 ఏళ్ల మధ్య వయస్కుల్లో 68శాతం మంది డెమోక్రట్పార్టీకి ఓటు వేశారు. వృద్ధ ఓటర్లు ఎక్కువగా రిపబ్లికన్ అభ్యర్ధులకు ఓటు వేశారు. అమెరికాయేతర ఓటర్లు వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మంది డెమోక్రాట్ పార్టీకి ఓటు వేశారు. -
మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు షాక్
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం వెల్లడైన మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోగా.. ట్రంప్ రిపబ్లిక్ పార్టీ సెనేట్ ఆధిక్యం సాధించింది. ప్రతినిధుల సభలోని 435 స్థానాల్లో ఎన్నికలు జరగగా 419 చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో 223 స్థానాల్లో డెమోక్రాట్లు గెలుపొందగా, 196 స్థానాల్లో రిపబ్లికన్లు విజయం సాధించారు. గతంలో రిపబ్లికన్లు గెలిచిన 28 స్థానాలను కూడా డెమోక్రాట్లు కైవసం చేసుకోవడంతో హౌస్‌లో డెమోక్రాట్లు మోజార్టీని పొందారు. ఇక సెనేట్‌లో మాత్రం రిపబ్లికన్ పార్టీ ఎట్టకేలకు తమ ఆధిక్యాన్ని నిలుపుకుంది. సెనేట్‌లోని మొత్తం 100 స్థానాల్లో 35 సీట్లకు పోలింగ్ జరగగా.. 32 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలనంతరం సెనేట్‌లో రిపబ్లికన్లు 51 మంది, డెమోక్రాట్లు 46 మంది అయ్యారు. ఇందులో డెమోక్రాట్లు రెండు సీట్లను కోల్పోయారు. ఇంకా మూడు స్థానాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఇక 36 రాష్ట్రాల గవర్నర్ పదవులకు ఎన్నికలు జరగగా ఇప్పటికి 33 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. తాజా ఫలితాలతో డెమోక్రటిక్ గవర్నర్లు గతం కంటే ఏడుగురు పెరిగారు. రిప్రజెంటేటివ్స్ హౌస్, సెనేట్ను కలిపి అమెరికా కాంగ్రెస్‌గా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. -
ట్రంప్‌కు ఎదురుగాలి
వాషింగ్టన్: మధ్యంతర ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఎదురుగాలి వీస్తోంది. అగ్రరాజ్యం అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రచారాస్త్రంగా మార్చుకుని విజయం దిశగా సాగిపోయారు. తాజా ఫలితాల సరళి చూస్తోంటే డెమొక్రాట్ల ‘బ్లూ వేవ్‘ను అడ్డుకోగలుగుతానన్న ట్రంప్ నమ్మకానికి గండి పడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో డెమోక్రాట్లు మెజార్టీ దిశగా దూసుకుపోతూ పట్టు సాధించారు. అటు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు సెనేట్‌లో ఆధిక్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రతినిధుల సభలో 435 స్థానాలకు, సెనేట్‌లోని మొత్తం 100 స్థానాల్లో 35 సీట్లకు పోలింగ్ జరిగింది. తాజా ఫలితాల ప్రకారం 218 స్థానాల్లో డెమెక్రాట్లు గెలుపొందితే ప్రతినిధుల సభలో మెజార్టీ ఖాయం చేసుకుంది. మిచిగాన్, ఇల్లినాయిస్, కాన్సాస్,వర్జీనియా, ఫ్లోరిడా, పెన్సీల్వేనియా తదితర రాష్ట్రాల్లో డెమోక్రాట్లు గెలుపొందారు. ఇండియానా, టెక్సాస్, నాత్ డకోటా తదితర స్థానాల్లో రిపబ్లికన్లు విజయం సాధించారు. మరోవైపు అమెరికా కాంగ్రెస్‌లో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే 89మంది హౌస్‌కు ఎంపిక కాగా తొలిసారిగా సెనేట్‌కు ఇద్దరు ముస్లిం మహిళలు రషిదా త్లయీబా ఇహాన్ ఒమర్లతోపాటు మసాచుసెట్స్ నుంచి తొలిసారిగా నల్లజాతీయురాలైన కాంగ్రెస్ మహిళ, అరిజోనా, టెన్నీసీ ప్రాంతాల నుంచి ఇద్దరు మహిళా సెనేటర్లు గెలుపొందడం విశేషం. జారెడ్ పోలీస్ అమెరికా చరిత్రలో గవర్నర్‌గా ఎంపికైన తొలి గే గా చరిత్ర కెక్కనున్నారు. కాగా రెండేళ్ళ కన్నా తక్కువకాలంలోనే తన ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని అమెరికా అద్యక్షుడు డో నాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచార సభలో చెప్పుకొచ్చారు. తన విదేశాంగ విధానాలు, పాలన ప్రజలకు ఆమోదయోగ్యమయ్యాయని, 50 రాష్ట్రాలకు గాను పలు రాష్ట్రాల్లో ఓటర్లు తనకే పట్టం కడతారని ట్రంప్ విశ్వాసం ప్రకటించగా.. అటు డెమొక్రాట్లు తమదే విజయమని ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
రిపబ్లికన్లా? డెమొక్రాట్లా?
అమెరికా ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్‌లో ఉన్న 100 స్థానాల్లో 35 స్థానాలకు ఈ నెల 6న మధ్యంతర ఎన్నికలు (మిడ్ టర్మ్ ఎలక్షన్స్) జరగనున్నాయి. అధ్యక్షుడి పాలనా కాలం మధ్యలో ఈ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వీటిని మధ్యంతర ఎన్నికలు అని పిలుస్తారు. ప్రతినిధుల సభ, సెనేట్‌తో పాటు 39 రాష్ట్రాలు, ప్రాదేశిక పాలనా మండళ్లకు కూడా ఇదే సమయంలో ఎన్నికలు జరుగుతాయి. ప్రధాన పార్టీలైన రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఎవరికి వారు తామే మెజారీటీ సీట్లు దక్కించుకుంటామన్న ధీమాతో ఉన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 22 నెలల పాలనపై రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ట్రంప్ పార్టీ (రిపబ్లికన్లు)గెలిస్తే ఆయన వివాదాస్పద నిర్ణయాలు, అమెరికా ఆధిపత్య చర్యలు పెరుగుతాయనీ, ఆయనకు అడ్డూ అదుపూ ఉండదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే డెమొక్రాట్లు గెలిస్తే ట్రంప్ దూకుడుకు ముకుతాడు పడుతుందని, ఆయన తీరు ప్రజలకు నచ్చలేదన్న సంగతి స్పష్టమవుతుందని వారంటున్నారు. ప్రస్తుతం ప్రతినిధుల సభ, సెనేట్లలో రిపబ్లికన్లకే ఆధిక్యం ఉంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 241 స్థానాలు, డెమొక్రాట్లకు 194 సీట్లు ఉన్నాయి. సెనెట్‌లో 52 రిపబ్లికన్లవయితే, 48 డెమొక్రాట్లవి. అయితే దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి మధ్యంతర ఎన్నికలు అచ్చిరావడం లేదని గత ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 1934 నుంచి ఇంత వరకు 21 సార్లు మధ్యంతర ఎన్నికలు జరగ్గా కేవలం మూడు సార్లు మాత్రమే అధ్యక్ష పార్టీ గెలిచింది. ట్రంప్ పాలనపై రెఫరెండం అమెరికా అధ్యక్ష పదవి చేపటాక ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలు ఆ దేశంలోనే కాక అంతర్జాతీయంగానూ వివాదాస్పదమయ్యాయి. అమెరికన్లకు ఉద్యోగ ప్రయోజనాలు కలిగేలా వలస నిబంధనలను కఠినతరం చేస్తుండటం, ఏడు ముస్లిం దేశాల పౌరులకు అమెరికాలోకి ప్రవేశాన్ని నిరాకరించడం, చైనాతో వాణిజ్య యుద్ధం, గత ప్రభుత్వం ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి వైదొలగడం, ఐక్యరాజ్య సమితి సంస్థల నుంచి కూడా తప్పుకోనున్నట్టు ప్రకటించడం తదితర తీవ్ర, వివాదస్పద నిర్ణయాలను ట్రంప్ తీసుకున్నారు. వీటిని ట్రంప్ పార్టీలోనే చాలా మంది తప్పుబడుతున్నారు. ఇప్పటికి ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టి 22 నెలలు అవుతోంది. దీంతో మధ్యంతర ఎన్నికలను ట్రంప్ పాలనపై రెఫరెండంగా భావిస్తున్నారు. మధ్యంతర ఎన్నికల ప్రచారంలో డెమొక్రాటిక్ పార్టీ ఒబామా కేర్‌గా పేరొందిన ఆరోగ్య బీమా చట్టం కొనసాగింపును ప్రచారాస్త్రంగా మలుచుకుంది. ట్రంప్ ప్రకటించిన పన్నుల కోతనూ తమకనుకూలంగా మార్చుకుని ప్రచారం చేస్తోంది. అటు రిపబ్లికన్లు వీసాలు, అక్రమ వలసలపై దృష్టి పెట్టడంతో పాటు ఆర్థిక పునరుజ్జీవానికి ప్రాధాన్యత ఇస్తామంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటేసిన వారిలో 51శాతం మంది ఇప్పుడు ఆయనను వ్యతిరేకిస్తున్నారనీ, ఇది డెమొక్రాట్లకు లాభం కలిగిస్తుందని సర్వేలో వెల్లడయింది. విదేశీ జోక్యం 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందనీ, దాని ప్రమేయం వల్ల ఫలితాలు తారుమారయ్యాయని ఆరోపణలు వచ్చాయి. ఈ మధ్యంతర ఎన్నికల్లో కూడా రష్యా, చైనాలు జోక్యం చేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అమెరికా ఎన్నికలను రష్యా నియంత్రిస్తోందని ఆరు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉమ్మడి నివేదికలో స్పష్టం చేశాయి. సామాజిక మాధ్యమాల ద్వారా రష్యా అమెరికన్లను ప్రభావితం చేస్తోందని ఆ సంస్థలు ఆరోపించాయి. మధ్యంతర ఎన్నికల్లో రష్యా చురుకుగా జోక్యం చేసుకుంటుండటం వాస్తవమేనని, అదింకా కొనసాగుతోందని గత ఆగస్టులో నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ డాన్ కోట్స్ అధ్యక్ష భవనంలో మీడియాతో చెప్పారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అధికంగా ముందస్తు పోలింగ్ మధ్యంతర ఎన్నికలకు పోలింగ్ మంగళవారం జరగనున్నప్పటికీ ముందుగానే ఓటు వేసే అవకాశం ఓటర్లకు ఉంటుంది. పోలింగ్ రోజు రద్దీని తగ్గించేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఈ ముందస్తు పోలింగ్‌ను గతంలో కన్నా ఈసారి చాలా ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారనీ, ముఖ్యంగా యువత ముందున్నారని అధికారులు చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో గతే డాది కన్నా ఈ ఏడాది రెట్టింపు ముందస్తు ఓటిం గ్ నమోదైందన్నారు. అమెరికా వ్యాప్తంగా 3.15 కోట్ల మంది ఇప్పటికే ముందస్తు ఓటింగ్ అవకాశాన్ని ఉపయోగించుకుని ఓటేశారు. -
డెమోక్రాట్లతో ఎఫ్‌బీఐ కుమ్మక్కు
-
డెమొక్రాట్లతో ఎఫ్‌బీఐ కుమ్మక్కు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరుగుతోన్న దర్యాప్తులో డెమోక్రాట్లతో ఎఫ్‌బీఐ, న్యాయ విభాగం కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తూ ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లికన్లు ఎఫ్‌బీఐపై ‘మెమో’ విడుదల చేశారు. ఎఫ్‌బీఐ వద్దని వారిస్తోన్నా వినకుండా ట్రంప్ ఈ మెమోను ఆమోదించి హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీలకు పంపారు. మెమోరాండంలో వెల్లడైన వివరాలు సిగ్గుచేటని ట్రంప్ అన్నారు. రష్యా జోక్యంపై విచారణలో ట్రంప్ ప్రచార బృందానికి చెందిన మాజీ సలహాదారుడి విషయంలో అధికారులు కోర్టును తప్పు దారి పట్టించారని మెమోలో ఆరోపించారు. అందులోని అంశాల్ని పరిశీలిస్తే న్యాయశాఖ, ఎఫ్‌బీఐలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు తీసుకున్న నిర్ణయాల నైతికతపై ఆందోళన వ్యక్తమవుతోందని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సాండర్స్ అన్నారు. ప్రతినిధుల సభకు చెందిన ఇంటెలిజెన్స్ చైర్మన్ డెవిన్ న్యూనెస్ రూపొందించిన ఈ మెమోలో.. ‘ డెమోక్రాట్ల తరఫున బ్రిటిష్ నిఘా ప్రతినిధి క్రిస్టోఫర్ స్టీల్ రాసిన పరిశోధన వివరాల్ని దర్యాప్తులో ఎఫ్‌బీఐ వాడుకుంది’ అని ఆరోపించారు. అధ్యక్షుడి జాతీయ భద్రతా బృందం నుంచి అందిన సమాచారం ఆధారంగా దీనిని రూపొందించినట్లు శాండర్స్ తెలిపారు. రిపబ్లికన్ సభ్యుడు డానా రోహ్రబచెర్ మాట్లాడుతూ.. మెమోతో వాస్తవాలు వెలుగుచూశాయని చెప్పారు. ‘పోలీసు, నిఘా విభాగాలు కూడా కొన్నిసార్లు రాజీపడతాయి. ఎప్పటికప్పుడు అలాంటి దుర్వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అందుకే అన్ని ఫెడరల్ దర్యాప్తు విభాగాలపై అమెరికన్ చట్ట సభల పర్యవేక్షణ ఉండాలి’ అని అన్నారు. పారదర్శకత కోసం ట్రంప్ శ్రమిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఎఫ్‌బీఐ విచారణకు డెమోక్రాట్లు సాయపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నమే ఇది. ఇది వాటర్‌గేట్ కుంభకోణంతో పోల్చదగిన స్థాయిలో ఉంది’ అని అన్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌బీఐ మాత్రం నోరు మెదపలేదు.