ట్రాన్స్‌జెండర్ డెమొక్రటిక్ నేతను మహిళల బాత్‌రూమ్‌లోకి అనుమతించబోమన్న రిపబ్లికన్లు
సారా మెక్‌బ్రైడ్‌ను అడ్డుకునేందుకు బిల్లు తెచ్చిన ట్రంప్ వర్గం
తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన డెమొక్రటిక్ నేతలు
వాషింగ్టన్ : అమెరికా పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా ప్రతినిధుల సభకు ఎన్నికై చరిత్ర సృష్టించిన డెమొక్రటిక్ నేత, ట్రాన్స్‌జెండర్ సారా మెక్‌బ్రైడ్‌పై అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు కారాలుమిరియాలు నూరుతున్నారు. ఇన్నాళ్లూ పబ్లిక్ టాయిలెట్లు, పాఠశాలల్లో ట్రాన్స్‌జెండర్లు ఏ బాత్‌రూమ్ వాడాలన్న దానిపై మొదలైన చర్చ ఇప్పుడు పార్లమెంట్‌లోనూ జరగబోతోంది. అయితే పార్లమెంట్ ఇరుసభలైన ప్రతినిధుల సభ, సెనేట్‌లో రిపబ్లికన్లదే ఆధిపత్యంకావడంతో వారు ప్రతిపాదించే బిల్లు ఆమోదం పొందే అవకాశాలే ఎక్కువ. అయితే వ్యక్తి గౌరవాన్ని భంగపరుస్తూ ఏకైక ట్రాన్స్‌జెండర్ చట్టసభ మెంబర్‌పై రిపబ్లికన్ సభ్యులంతా ఏకమై విరుచుకుపడతారా? అని డెమొక్రాట్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అధ్యక్ష ఎన్నికలతోపాటు సెనేట్, ప్రతినిధుల సభకూ ఎన్నికలు జరిగాయి. ప్రతినిధుల సభ ఎన్నికల్లో భాగంగా డెలావర్‌లోని ఎట్ లార్జ్ హౌస్ డి్రస్టిక్ట్ నుంచి రిపబ్లికన్ అభ్యరి్థపై 72వేలకుపైగా మెజారిటీతో గెలిచి అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా 34 ఏళ్ల సారా రికార్డుసృష్టించడం తెల్సిందే. అయితే పురుషునిగా జన్మించి ట్రాన్స్‌జెండర్‌గా మారినంతమాత్రాన సారాను మహిళల బాత్‌రూమ్‌లోకి అనుమతించబోమని రిపబ్లికన్ నాయకురాలు, సౌత్ కరోలినా ఫస్ట్ కాంగ్రెషనల్ డిస్టిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన నాన్సీ మేస్ కరాఖండీగా చెప్పారు. ఈ మేరకు సారాను అడ్డుకోవాలంటూ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో ఆమె బిల్లు ప్రవేశపెట్టారు. ‘‘సారాకు వ్యతిరేకంగా మేం ఇంత మాట్లాడుతున్నా సారా నుంచి స్పందన లేదు.
అంటే తను పురుషుడు అని ఒప్పుకున్నట్లే. మేం సారాను మహిళల బాత్రూమ్, స్పేస్, లాక్ రూమ్, చేంజింగ్ రూమ్‌లకు అనుమతించబోం. ఈ మేరకు పార్లమెంట్ ప్రోటోకాల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలి’’అని నాన్సీ మేస్ డిమాండ్‌చేశారు. ఈ ఉదంతంపై సారా స్పందించారు. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే రిపబ్లికన్లు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతి ఒక్క అమెరికన్‌కు తనకు నచ్చినట్లు జీవించే హక్కుంది. ఈ హక్కును గౌరవిస్తూ, పార్లమెంట్ సభ్యులు సభలో నాకు మద్దతు పలుకుతారని ఆశిస్తున్నా’అని సారా ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు. జన్మతః పురుషుడైన సారా తన 21 ఏళ్ల వయసులో అమ్మాయిగా మారాడు.
Comments
Please login to add a commentAdd a comment