Protocol
-
BRS ప్రజా ప్రతినిధుల ఫోన్లు ఎత్తడం లేదు: తలసాని
-
అమెరికా పార్లమెంట్లో బాత్రూమ్ గొడవ
వాషింగ్టన్ : అమెరికా పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా ప్రతినిధుల సభకు ఎన్నికై చరిత్ర సృష్టించిన డెమొక్రటిక్ నేత, ట్రాన్స్‌జెండర్ సారా మెక్బ్రైడ్పై అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు కారాలుమిరియాలు నూరుతున్నారు. ఇన్నాళ్లూ పబ్లిక్ టాయిలెట్లు, పాఠశాలల్లో ట్రాన్స్జెండర్లు ఏ బాత్రూమ్ వాడాలన్న దానిపై మొదలైన చర్చ ఇప్పుడు పార్లమెంట్‌లోనూ జరగబోతోంది. అయితే పార్లమెంట్ ఇరుసభలైన ప్రతినిధుల సభ, సెనేట్‌లో రిపబ్లికన్లదే ఆధిపత్యంకావడంతో వారు ప్రతిపాదించే బిల్లు ఆమోదం పొందే అవకాశాలే ఎక్కువ. అయితే వ్యక్తి గౌరవాన్ని భంగపరుస్తూ ఏకైక ట్రాన్స్‌జెండర్ చట్టసభ మెంబర్‌పై రిపబ్లికన్ సభ్యులంతా ఏకమై విరుచుకుపడతారా? అని డెమొక్రాట్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలతోపాటు సెనేట్, ప్రతినిధుల సభకూ ఎన్నికలు జరిగాయి. ప్రతినిధుల సభ ఎన్నికల్లో భాగంగా డెలావర్‌లోని ఎట్ లార్జ్ హౌస్ డి్రస్టిక్ట్ నుంచి రిపబ్లికన్ అభ్యరి్థపై 72వేలకుపైగా మెజారిటీతో గెలిచి అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా 34 ఏళ్ల సారా రికార్డుసృష్టించడం తెల్సిందే. అయితే పురుషునిగా జన్మించి ట్రాన్స్‌జెండర్‌గా మారినంతమాత్రాన సారాను మహిళల బాత్రూమ్లోకి అనుమతించబోమని రిపబ్లికన్ నాయకురాలు, సౌత్ కరోలినా ఫస్ట్ కాంగ్రెషనల్ డిస్టిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన నాన్సీ మేస్ కరాఖండీగా చెప్పారు. ఈ మేరకు సారాను అడ్డుకోవాలంటూ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో ఆమె బిల్లు ప్రవేశపెట్టారు. ‘‘సారాకు వ్యతిరేకంగా మేం ఇంత మాట్లాడుతున్నా సారా నుంచి స్పందన లేదు. అంటే తను పురుషుడు అని ఒప్పుకున్నట్లే. మేం సారాను మహిళల బాత్రూమ్, స్పేస్, లాక్ రూమ్, చేంజింగ్ రూమ్‌లకు అనుమతించబోం. ఈ మేరకు పార్లమెంట్ ప్రోటోకాల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలి’’అని నాన్సీ మేస్ డిమాండ్‌చేశారు. ఈ ఉదంతంపై సారా స్పందించారు. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే రిపబ్లికన్లు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతి ఒక్క అమెరికన్‌కు తనకు నచ్చినట్లు జీవించే హక్కుంది. ఈ హక్కును గౌరవిస్తూ, పార్లమెంట్ సభ్యులు సభలో నాకు మద్దతు పలుకుతారని ఆశిస్తున్నా’అని సారా ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు. జన్మతః పురుషుడైన సారా తన 21 ఏళ్ల వయసులో అమ్మాయిగా మారాడు. -
గాజన్లే కవచాలు
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) అత్యంత అమానుషంగా వ్యవహరిస్తోంది. యుద్ధ సమయంలో ఇళ్లు, సొరంగాల్లోకి ప్రవేశించడానికి పాలస్తీనా పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటోంది. ‘మస్కిటో ప్రోటోకాల్’గా పిలిచే ఈ పద్ధతిని గాజాలోని ఇజ్రాయెల్ యూనిట్లన్నీ అవలంబిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైనికుడే ఈ మేరకు వెల్లడించడం విశేషం. ఐదుగురు పాలస్తీనా మాజీ ఖైదీలు దీన్ని ధ్రువీకరించారు. ఉత్తర గాజా, గాజా సిటీ, ఖాన్ యూనిస్, రఫా... ఇలా గాజా అంతటా ఇదే పద్ధతిని అమలు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. – జెరూసలెంనిషేధం బేఖాతరుసైనిక కార్యకలాపాలలో పౌరులను ఇలా అనైతికంగా, అనుమాషంగా ఉపయోగించడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషిద్ధం. వెస్ట్ బ్యాంక్‌లో అనుమానిత మిలిటెంట్ల తలుపులను తట్టడానికి ఇజ్రాయల్ సైన్యం పాలస్తీనా పౌరులను ఉపయోగిస్తోందని హక్కుల సంఘాలు ఫిర్యాదు చేయడంతో ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు 2005లో ఈ పద్ధతిని పూర్తిగా నిషేధించింది. దీన్ని క్రూరమైనదిగా, అనాగరికమైనదిగా అభివర్ణించింది. దాంతో ఈ విధానాలను మానుకున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం అప్పట్లో ప్రకటించింది. కానీ దాన్ని ఇంకా అమలు చేస్తున్నట్టు తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. గాజాలో పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైన్యం మానవ కవచాలుగా ఉపయోగిస్తున్న మూడు ఫోటోలను ‘బ్రేకింగ్ ది సైలెన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ మీడియాకు విడుదల చేసింది. ఉత్తర గాజాలో విధ్వంసకర పరిస్థితుల్లో ఇద్దరు సైనికులు ఓ పౌరుడిని ముందుకు తీసుకువెళుతున్న భయానక దృశ్యం ఒక ఫొటోలో ఉంది. మరో దాంట్లో మానవ కవచాలుగా ఉపయోగించే పౌరుల కళ్లకు గంతలున్నాయి. మూడో ఫొటోలో ఒక సైనికుడు బంధించిన పౌరుడిని కాపలా కాస్తున్నాడు.వెనుక నుంచి కాల్చారు..గాజాలో ఐదుగురు పాలస్తీనా మాజీ ఖైదీలు కూడా దీన్ని ధ్రువీకరించారు. 20 ఏళ్ల మహ్మద్ సాద్ఇజ్రాయెల్ సైన్యం దాడుల తర్వాత ఉత్తర గాజా వీడి ఖాన్ యూనిస్ సమీపంలో తాత్కాలిక శిబిరంలో ఉంటున్నాడు. తనకు, తమ్ముళ్లకు ఆహారం కోసం బయటికొస్తే ఇజ్రాయెల్ సైన్యం పట్టుకుంది. ‘‘మమ్మల్ని జీపులో తీసుకెళ్లారు. 47 రోజుల పాటు రఫా సైనిక శిబిరంలో నిర్బంధించారు. నిఘా చర్యలకు ఉపయోగించారు. మాకు మిలటరీ యూనిఫాం ఇచ్చారు. తలపై కెమెరా పెట్టారు. మెటల్ కట్టర్ ఇచ్చారు. సొరంగాల్లో వెదికేటప్పుడు సాయానికి మమ్మల్ని వాడుకున్నారు. మెట్ల కింద వీడియోలు తీయాలని, ఏదైనా దొరికితే బయటికి తేవాలని చెప్పేవారు. ఒక మిషన్ కోసం పౌర దుస్తుల్లో తీసుకెళ్లారు. సైన్యం వదిలివెళ్లిన ట్యాంకును వీడియో తీయమన్నారు. నేను భయపడితే వీపుపై తుపాకీతో కొట్టారు. నేను ట్యాంకు వద్దకు వెళ్లగానే వెనుక నుంచి కాల్చారు. అదృష్టవశాత్తూ బయటపడ్డా’’ అంటూ వీపుపై తూటా గాయాలు చూపించాడు. 17 ఏళ్ల మొహమ్మద్ షబ్బీర్దీ ఇదే కథ. ఖాన్ యూనిస్‌లోని అతని ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. తండ్రి, సోదరిని చంపి అతన్ని బందీగా పట్టుకుంది. ‘‘నన్ను మానవ కవచంగా వాడుకున్నారు. కూల్చేసిన ఇళ్లలోకి, ప్రమాదకరమైన, మందుపాతరలున్న ప్రదేశాల్లోకి తీసుకెళ్లారు’’ అని షబ్బీర్ చెప్పుకొచ్చాడు.ఏమిటీ మస్కిటో ప్రోటోకాల్శత్రువులున్న చోటికి కుక్కను పంపడం, ట్యాంక్ షెల్ లేదా సాయుధ బుల్డోజర్తో దాడి వంటివి చేస్తారు. కానీ ఈ పద్ధతిలో తాము దాడి చేయాలనుకున్న చోటికి బందీలనో, శత్రు దేశ పౌరులనో ముందుగా పంపిస్తారు. అక్కడ పేలుడు పదార్థాలున్నా, శత్రువులు పొంచి కాల్పులు, పేలుళ్లకు పాల్పడ్డా ముందుగా వెళ్లినవారు చనిపోతారు. ఆ ముప్పు తొలగాక సైన్యం ప్రవేశిస్తుంది. సాధారణంగా ఉగ్రవాద సంస్థలు ఉపయోగించే ఈ పద్ధతిని ఇజ్రాయెల్ సైన్యం అమలు చేస్తోంది.డాక్టర్‌నూ వదల్లేదు...59 ఏళ్ల డాక్టర్ యాహ్యా ఖలీల్ అల్ కయాలీ ఓ వైద్యుడు. గాజాలో అతి పెద్ద వైద్య సముదాయమైన అల్ షిఫా ఆస్పత్రిలో వేలాది మంది శరణార్థులతో కలిసి ఉండేవారు. గత మార్చిలో ఇజ్రాయెల్ సైన్యం రెండు వారాల దాడిలో ఆసుపత్రి ధ్వంసమైంది. అప్పుడే కయాలీని సైన్యం పట్టుకుంది. ‘‘నాతో అపార్ట్మెంట్ భవనాలను, ప్రతి గదినీ తనిఖీ చేయించారు. అదృష్టవశాత్తూ వేటిలోనూ హమాస్ ఫైటర్లు లేరు. అలా 80 అపార్ట్మెంట్లను తనిఖీ చేశాక నన్ను వదిలేశారు’’ అని గుర్తు చేసుకున్నారు.మన ప్రాణాలు ముఖ్యమన్నారు.. ఉత్తర గాజాలో తమ యూనిట్ ఓ అనుమానాస్పద భవనంలోకి ప్రవేశించే ముందు ఇద్దరు పాలస్తీనా ఖైదీలను ముందుగా పంపినట్టు ఇజ్రాయెల్ సైనికుడే వెల్లడించాడు. ‘‘వారిలో ఒకరు 16 ఏళ్ల బాలుడు. మరొకరు 20 ఏళ్ల యువకుడు. ఇదేంటని ప్రశ్నిస్తే మన సైనికుల కంటే పాలస్తీనా యువకులు చనిపోవడం మంచిది కదా అని మా సీనియర్ కమాండర్ బదులిచ్చారు. షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. సుదీర్ఘ కాలం యుద్ధంలో పాల్గొని అలసిపోయాక పెద్దగా ఆలోచించడానికి కుదరదు. అయినా ఈ పద్ధతిని అనుసరించడానికి కొందరు సైనికులం నిరాకరించాం. ‘అంతర్జాతీయ చట్టాల గురించి ఆలోచించొద్దు. ముందు మన ప్రాణాలు ముఖ్యం’ అని కమాండర్ చెప్పారు’’ అన్నాడు. చివరికి ఇద్దరు పాలస్తీనియన్లను వదిలేశారని చెప్పుకొచ్చాడు. -
మండల పరిషత్ సమావేశంలో టీడీపీ బరితెగింపు
దర్శి: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో టీడీపీ నేతల బరితెగింపు రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రొటోకాల్ ప్రకారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డినే అడ్డుకొన్నారు. కార్యాలయం గేట్లు మూసేసి రసాభాస చేశారు. శుక్రవారం దొనకొండలో మండల పరిషత్ సర్వసభ్య ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. అధికారుల ఆహ్వానం మేరకు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అక్కడికి వచ్చారు.పథకం ప్రకారం ముందుగానే అక్కడికి చేరుకున్న టీడీపీ నేతలు గేట్లు మూసివేసి వారిద్దరినీ అడ్డుకున్నారు. ఎంపీడీవో గేటువద్దకు వచ్చి వారిని లోపలికి పంపాలని టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ మూకలు ఆయన్ని బెదిరించి లోపలకు పంపేశారు. బూచేపల్లిపై దాడి చేయడానికి టీడీపీ మూకలు రాళ్లు కూడా తీసుకొచ్చినట్లు తెలిసింది. ఈ సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నాయి. ‘మా ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ మీకేం పని’ అంటూ టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను అసభ్య పదజాలంతో దూషించారు. ఉద్రిక్తత సృష్టించారు. గంటన్నరకుపైగా ఎమ్మెల్యే, జెడ్పీ చైర్‌పర్సన్‌ను గేటు బయటే నిలబెట్టారు. సీఐ సుబ్బారావు పోలీసు సిబ్బందితో వచ్చి వారిద్దరినీ లోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు మరింతగా రెచ్చిపోయి పోలీసులను సైతం అసభ్య పదజాలంతో దూషించారు. జై చంద్రబాబు అని నినాదాలు చేస్తూ కార్యాలయంలో రాళ్లు పెట్టుకుని హంగామా సృష్టించారు. సీఐ సుబ్బారావు పోలీస్ బందోబస్తు నడుమ ఎమ్మెల్యే, జెడ్పీ చైర్‌పర్సన్‌ను లోనికి తీసుకెళ్లారు. వారు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ, ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిని సత్కరించారు. -
కాంగ్రెస్ నేతలు ప్రోటోకాల్ పాటించడంలేదు: ప్రశాంత్‌రెడ్డి
-
రెండేళ్లలోనే కొత్త వరి వంగడాలు
(సాక్షి సాగుబడి డెస్క్): సంప్రదాయ ప్రజనన (బ్రీడింగ్) పద్ధతిలో ఓ కొత్త వరి వంగడం రూపొందించడానికి 6–7 సంవత్సరాలు పడుతుంది. క్లైమెట్ ఛేంజ్ వల్ల వాతావరణంలో వస్తున్న పెనుమార్పులకు దీటుగా తట్టుకునే వంగడాలు రూపొందించడం శాస్త్రవేత్తలకు ఇంత సుదీర్ఘకాల పరిమితి పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర నుంచి 2 ఏళ్లలోనే సరికొత్త వంగడాన్ని రూపొందించేందుకు అనువైన వినూత్న స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిని ఫిలిప్పీన్స్ మనీలాలోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) అభివృద్ధి చేసింది. భారతీయ, జపాన్ వరి రకాలతో పాటు ఏ దేశంలో వంగడాలతోనైనా రెండేళ్లలోనే కొత్త వంగడం రూపొందించటం సాధ్యమేనని ‘ఇరి’పరిశోధనల్లో తేలింది. ‘ఇరి’ప్ర«దాన కార్యాలయంతో పాటు వారణాసిలో ‘ఇరి’దక్షిణాసియా పరిశోధనా స్థానంలో కూడా సాంబ వంటి అనేక రకాలతో రెండేళ్లలోనే ‘ఇరి’శాస్త్రవేత్తలు విజయవంతంగా కొత్త వంగడాలను రూపొందించారు. కృత్రిమ వెలుగుల మధ్య ప్రయోగాలు నియంత్రిత వాతావరణంలో ప్రత్యేక గదుల్లో కృత్రిమ వెలుగుల మధ్య వరి ప్రయోగాలు చేయటం స్పీడ్ బ్రీడింగ్‌లో ముఖ్యభాగం. కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, తేమ, పోషకాల స్థాయి నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఇస్తారు. కుండీలలో పెరిగే వరి మొక్కలకు స్థూల, సూక్ష్మ పోషకాలను పిచికారీల ద్వారా అందిస్తున్నారు. ఈ స్పీడ్ బ్రీడింగ్ క్రమంలో వేగంగా పూత దశకు ఎదగటం అనేది మరో ముఖ్యాంశం. సాధారణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక వరి రకాలు 58 నుంచి 127 రోజుల మధ్య సహజంగా పూతకు వస్తాయి. అయితే, స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిలో రాత్రి, పగలు అని తేడా లేకుండా కృత్రిమ వెలుగుల మధ్య పెరిగే వరి మొక్కలు, వాటి సహజ కాల పరిమితితో నిమిత్తం లేకుండా, 60 రోజుల లోపలే అన్ని రకాలూ ఒకేసారి పూతకు వస్తున్నాయి. ఇలా త్వరగానే ఏ వరి రకమైనా కోతకు వస్తున్నాయి. అందువల్లనే ఈ స్పీడ్ బ్రీడింగ్ ప్రొటోకాల్ ద్వారా జరిపే పరిశోధనలకు ‘స్పీడ్ ఫ్లవర్’అని ‘ఇరి’పేరుపెట్టింది. ఏడాదికి నాలుగైదు పంటలు ఈ విధంగా ఏడాదికి 1–2 పంటలకు బదులు నాలుగైదు పంటలు పండిస్తున్నారు. నియంత్రిత వాతావరణంలో అనుకున్నన్ని రోజుల్లో పంట నూరి్పడికి వస్తోంది. వారణాసిలోని ఇరి దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధనా స్థానంలో 198 వరి రకాలను పెంచినప్పుడు అన్నీ 60 రోజుల్లోనే పూతకు రావటం విశేషం. స్వర్ణ, సాంబ మసూరి సహా.. వారణాసిలోని దక్షిణాసియా ఇరి పరిశోధనా స్థానం సంచాలకులు డా. సుధాంశు సింగ్ మాట్లాడుతూ.. క్రాసింగ్, ఇన్‌బ్రీడింగ్ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి స్పీడ్ బ్రీడింగ్ ప్రొటోకాల్ ఉపయోగపడుతోంది. క్షేత్రస్థాయిలో 6–7 సంవత్సరాల సమయం పట్టే పని ఇప్పుడు 1.5–2 ఏళ్లలోనే పూర్తవుతోందని వ్యాఖ్యానించారు. స్పీడ్ ఫ్లవర్ పరిశోధన కార్యక్రమంలో స్వల్పకాలిక రకాలైన కో–51, ఐఆర్64, మధ్యకాలిక రకాలైన సర్జూ–52, డిఆర్ఆర్ ధాన్ 44, దీర్ఘకాలిక రకాలైన స్వర్ణ, సాంబ మసూరి రకాలు సైతం చక్కని ఫలితాలు వచ్చాయని, రెండేళ్లలోనే కొత్త వంగడాలను అభివృద్ధి చేయటం సాధ్యమేనని తేలిందని సుధాంశు సింగ్ చెప్పారు. ఏడాదిలో స్వర్ణ వరిని వరుసగా 5.1 పంటలు, సాంబ మసూరిని 4.9 పంటలు వరుసగా సాగు చేయటం ఈ పద్ధతిలో సాధ్యపడిందని పేర్కొన్నారు. – డాక్టర్ సుధాంశు సింగ్ ఇది శాస్త్రపరంగా పెద్ద ముందడుగు.. ’’అధికోత్పత్తినిచ్చే, వాతావరణ మార్పుల్ని తట్టుకునే, పోషకాల పరంగా మెరుగైన సరికొత్త వరి వంగడాలను అతి తక్కువ కాలంలోనే రూపొందించడానికి అవకాశం దొరికిందిప్పుడు. వరికి జన్యుసుసంపన్నత చేకూరడానికి, ప్రపంచ మానవాళికి ఆహార భద్రతను అందించడానికి ఇది ఉపయోగకరం’అంటున్నారు పరిశోధకుల బృందం సారధి డాక్టర్ వికాస్ కుమార్ సింగ్. ’’ఈ పరిశోధనా ప్రాజెక్టుకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సౌజన్యంతో కేంద్ర బయోటెక్నాలజీ శాఖ ఆర్థిక తోడ్పాటు ఉంది. సమీప కాలంలోనే మన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని రైస్ బ్రీడర్లకు కూడా స్పీడ్ బ్రీడింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు.’అని వెల్లడించారు. – డాక్టర్ వికాస్కుమార్ సింగ్ -
TS: సీఎంవో కార్యాలయంలో కేటుగాడు.. ప్రోటోకాల్ ఆఫీసర్ పేరుతో..
సాక్షి, హైదరాబాద్: ల్యాండ్ సెటిల్మెంట్లు, అసైన్డ్ ల్యాండ్ రీ అసైన్డ్ చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సీఎం పబ్లిసిటీ సెల్లో దొంగ ప్రోటోకాల్ ఆఫీసర్‌గా అవతారం ఎత్తిన ప్రవీణ్ సాయి.. పలువురికీ సీఎం ప్రోటో కాల్ నకిలీ స్టిక్కర్స్ ఇప్పించాడు. హోం మినిస్టర్, మినిస్టర్స్ లెటర్ హెడ్స్‌తో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు తెర తీశాడు. వనస్థలిపురంలో నివాసం ఉంటున్న అత్తిలి ప్రవీణ్ సాయి.. 6 నెలల క్రితం ప్రభుత్వ పైరవీలు చేస్తూ పలువురికి శఠగోపం పెట్టాడు. అతని అరెస్ట్ చేసిన ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు.. ఇన్నోవా కార్, సెల్ ఫోన్‌ను సీజ్ చేశారు. ఇదీ చదవండి: ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు -
బైడెన్ డ్రైవర్ నిర్బంధం.. ఎందుకంటే..?
ఢిల్లీ: జీ20 సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కారు డ్రైవర్‌ను సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్ చేసినందుకు బైడెన్ కాన్వాయ్ నుంచి అతన్ని తొలగించారు. ప్రోటోకాల్‌కు విరుద్ధంగా కారును నడిపినందుకు సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అధ్యక్షుడు బైడెన్ కాన్వాయ్‌లో ఓ కారు డ్రైవర్ తన కారును యూఏఈ అధ్యక్షుడు నివాసముండే తాజ్ హోటల్‌కు తీసుకువెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ విభాగం అధికారులకు సమాచారం అందించారు. ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాను ఉదయం 9:30కి బైడెన్ నివాసముండే మౌర్య హోటల్‌కు వెళ్లాల్సి ఉందని డ్రైవర్ చెప్పాడు. ఈ క్రమంలో లోధి ఎస్టేట్ వద్ద నుంచి ఓ బిజినెస్ మ్యాన్‌ను తాజ్ వద్ద దించాల్సి వచ్చిందని చెప్పాడు. తనకు ప్రోటోకాల్స్ గురించి తెలియదని చెప్పాడు. దీంతో ఆ డ్రైవర్‌ను వదిలేశారు. జీ20 మీటింగ్‌కు హాజరవడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం ఢిల్లీ వచ్చారు. శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన సమావేశాల్లో పాల్గొన్నారు. అనంతరం శనివారం రాత్రి డిన్నర్ మీటింగ్‌కి హజరయ్యారు. ఈ రోజు ఉదయం రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. కొద్ది క్షణాల ముందే ఢిల్లీ నుంచి తిరుగుప్రయాణమయ్యారు. ఇటు నుంచి నేరుగా వియత్నాంకు బయలుదేరారు. ఇదీ చదవండి: ఢిల్లీ డిక్లరేషన్ వెనక షేర్పాల కఠోర శ్రమ -
ఇంటర్నెట్ నిలిపివేతకు ప్రొటోకాల్ ఉందా: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో ఇష్టారాజ్యంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడానికి ఏదైనా ప్రొటోకాల్ ఉందా? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్లో తరచుగా ఇంటర్నెట్ సేవలు బంద్ చేస్తున్నారని ఆరోపిస్తూ సాఫ్ట్వేర్ లా సెంటర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు నోటీసు జారీ చేసింది. సాఫ్ట్వేర్ లా సెంటర్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని ఆదేశించింది. ప్రొటోకాల్ ఏదైనా ఉంటే తమకు తెలియజేయాలని పేర్కొంది. నాలుగు రాష్ట్రాలకు నోటీసు ఇవ్వడం లేదని తెలిపింది. -
సీఎంకు చల్లటి చాయ్.. అధికారికి నోటీసులు
భోపాల్: ముఖ్యమంత్రి, రాజకీయ ప్రముఖులకు చల్లని చాయ్ అందించిన వ్యవహారంలో.. ఓ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రొటోకాల్ ఉల్లంఘన పేరిట జారీ అయిన ఆ నోటీసుకు సరైన వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఉన్నతాధికారులు. ముఖ్యమంత్రికి అందించిన టీ బాగోలేదని, పైగా చల్లగా ఉందంటూ మధ్యప్రదేశ్‌లో ఓ కిందిస్థాయి అధికారిపై చర్యలకు ఉపక్రమించారు. జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్ కాన్హౌ ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఉన్నతాధికారుల ఆరోపణ. ఈ మేరకు ఛాతర్పూర్ జిల్లా రాజ్‌నగర్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్(ఎస్డీఎం) డీపీ ద్వివేది.. రాకేశ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. సోమవారం ఖజురహో ఎయిర్‌పోర్ట్‌లో కాసేపు ఆగారు. ఆ సమయంలో ఎయిర్పోర్ట్ వీఐపీ లాంజ్‌లో సీఎంతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వాళ్లకు టిఫిన్‌తో పాటు టీ అందించారు అధికారులు. అయితే టీ చల్లారిపోయి ఉండడంతో వాళ్లంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు.. ఆ కార్యక్రమ వ్యవహారాలను చూసుకున్న జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్‌కు నోటీసులు పంపించారు. నాసికరం, పైగా చల్లారిన టీ అందించినందుకు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకపోతే ఏకపక్షంగా చర్యలు కఠినంగానే తీసుకుంటామని ఎస్డీఎం ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే విమానం నుంచి దింపేయండి: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: విమానాశ్రయాలు, విమానాల్లో ప్రయాణికులు మాస్క్‌లను కచ్చితంగా ధరించేలా నిబంధనలను అమలు చేయాలని ఢిల్లీ ధర్మాసనం ఆదేశించింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలు పాటించకుంటే విమానం నుంచి దింపేయాలని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో విమాన ప్రయాణంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడంపై పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధర్మాసనం కోవిడ్ నిబంధనలు అమలు చేయడమే కాకుండా ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోమని పేర్కొంది. కరోనా కట్టడి చేసే దిశగా ప్రజల ఆరోగ్య దృష్ట్యా మాస్క్ ధరించడం, హ్యండ్ శానిటైజేషన్ వంటి నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు ఉల్లంఘించే ప్రయాణికుల పై కఠిన చర్యలు తీసుకునేలా విమానాశ్రయాలు, విమానాల సిబ్బందికి పూర్తి అధికారాలు ఇస్తూ కరోనాకి సంబంధించిన ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేయమని డీజీసీఏని ఆదేశించింది. పైగా నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులపై జరిమానా విధించడం తోపాటు సదరు వ్యక్తుల పేర్లను కూడా నో ఫ్లై లిస్ట్‌లో ఉంచాలని ఆదేశించింది. ఐతే ధర్మాసనం తినేటప్పుడు లేదా తాగేటప్పుడు మాస్క్‌ని తొలగించేలా చిన్న వెసుల బాటు కల్పించింది. (చదవండి: కరోనా కేసులు పైపైకి.. అక్కడ మళ్లీ మాస్క్ సంకేతాలు!) -
కమలంలో ‘ప్రొటోకాల్’ కలకలం! పైకి అంతా బాగా ఉన్నట్టు కనిపిస్తున్నా..
సాక్షి, హైదరాబాద్: కమలం పార్టీలో ప్రొటోకాల్ కలకలం రేపుతోంది. రాష్ట్ర బీజేపీలో అంతా బాగానే ఉన్నట్టుగా పైకి కనిపిస్తున్నా అంతర్గతంగా గ్రూపు తగాదాలు బయటపడుతున్నాయి. ప్రజాసంగ్రామ యాత్ర–2 ప్రారంభానికి ముందే ఇలాంటివి వెలుగులోకి రావడం గమనార్హం. తాజాగా పాదయాత్ర ఏర్పాట్లపై నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తనను వేదికపైకి పిలవకుండా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌కు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫిర్యాదు చేశారు. తమకు గౌరవం, ప్రాధాన్యతనివ్వడం లేదంటూ కొన్నిరోజుల క్రితం వివిధ జిల్లాల్లోని పలువురు సీనియర్ నేతలు ఇటీవల సమావేశాలు నిర్వహించగా, జాతీయపార్టీ వారిని బుజ్జగించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ ఉల్లంఘన రూపంలో అసంతృప్తి బట్టబయలైంది. తన ఫిర్యాదును పరిష్కరించకపోతే జాతీయ నాయకత్వాన్ని ఆశ్రయించాలని, వారం రోజుల్లో తగిన స్పందన రాకపోతే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రఘునందన్ భావిస్తున్నట్టు తెలిసింది. గతేడాది తొలివిడత ›ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి మొదలు పెడితే ము గింపు సభ హుస్నాబాద్ దాకా, ఆ తర్వాత మంగళవారం రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం దాకా పదిసార్లు అవమానాలు ఎదురయ్యాయని ఆయన తన అనుయాయులతో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కొందరు ముఖ్యనేతలు ఇతర ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కించపరుస్తూ తమ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందుకు ఒంటెద్దు పోకడపోవడం సరికాదని ఆయన అభిప్రాయపడినట్టు తెలిసింది. (చదవండి: తెలంగాణ జడ్జీల స్థానంలో ఆంధ్రా జడ్జీలు? ) -
యాదాద్రి పునఃప్రారంభం.. నన్నెందుకు పిలవలేదు?
భువనగిరి: యాదాద్రి పుణ్యక్షేత్ర పునః ప్రారంభానికి తనను ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంవో ప్రొటోకాల్ పాటించలేదు. స్థానిక ఎంపీగా ఉన్న నాకు ఆహ్వానం పంపలేదు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఆహ్వానించారు. దేవుడి దగ్గర కేసీఆర్ రాజకీయాలు చేయడం బాధాకరం అని అన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. #yadadritemple యాదాద్రి పునఃప్రారంభానికి @TelanganaCMO ప్రొటోకాల్ పాటించలేదు. స్థానిక ఎంపీగా నన్ను పునః ప్రారంభానికి పిలవలేదు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలను మాత్రం ఆహ్వానించింది. దేవుడు దగ్గర కేసిఆర్ బహునీచపు రాజకీయాలు చేయడం బాధాకరం. — Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) March 28, 2022 -
ప్రధాని మోదీకి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమీక్ష సమావేశం జరిపారు. ఈ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరించిన తీరుపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరుగుతోందంటూ ప్రశ్నించడంతో సీఎం కేజ్రీవాల్ తేరుకుని క్షమించాలి అని తెలిపారు. ఇంతకు ఏం జరిగిందంటే.. ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశాన్ని ఆమ్ఆద్మీ పార్టీ లైవ్ టెలికాస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మోదీ కేజ్రీవాల్ మాట్లాడుతున్న సమయంలో ‘ఏం జరుగుతోంది?’ అని ప్రశ్నించారు. ‘ఇది మన సంప్రదాయానికి విరుద్ధం కదా’ అని తెలపడంతో కేజ్రీవాల్ స్పందించి వెంటనే క్షమాపణలు చెప్పారు. ఈ సమావేశం గురించి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని సీఎం అరవింద్ తెలిపారు. ఇకపై జాగ్రత్తగా ఉంటామని చెప్పారు. అయితే ఈ వివాదంపై ఆమ్ఆద్మీ పార్టీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఓ వివరణ ఇచ్చారు. ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని ఎలాంటి ఆదేశాలు లేవని, గతంలో చాలా సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు గుర్తుచేశారు. ప్రజలకు ప్రాధాన్యమైన అంశం కావడంతో ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు సీఎంఓ తెలిపింది. ప్రత్యక్ష ప్రసారంతో ఎవరికైనా ఇబ్బందికలిగితే తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఢిల్లీ సీఎంఓ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ సమావేశ ప్రసారం ప్రొటోకాల్ ఉల్లంఘనగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ప్రభుత్వ ఉద్యోగులకు ఇక ఘనమైన వీడ్కోలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ రోజు ఘనంగా సన్మానించి ప్రభుత్వ వాహనంలో స్వగృహానికి సాగనంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి సంబంధించి విధివిధానాలు (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొటోకాల్)ను తయారు చేయాలని అధికారులను కోరారు. పదవీ విరమణ చేసిన ఏడుగురు సచివాలయ ఉద్యోగులకు శనివారం బీఆర్కేఆర్ భవన్లో సన్మాన సభ నిర్వహించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పట్ల గౌరవంగా వ్యవహరించాలని, పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సేవలను ఈసందర్భంగా సీఎస్ కొనియాడారు. సాధారణ పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి జి.క్రిష్ణవేణి, ఆ శాఖ ఆఫీస్ సబార్డినేట్ ఎన్.గంగమ్మ, ఐటీ శాఖ ఉప కార్యదర్శి టి.పద్మసుందరి, మైనారిటీ వెల్ఫేర్ శాఖ సహాయ కార్యదర్శి మహమ్మ ద్ నసీర్, పంచాయతీరాజ్ శాఖ సహాయ కార్యదర్శి మంజుల, ఆర్అండ్బీ శాఖ సెక్ష న్ ఆఫీసర్ అర్జున్ సింగ్, ఆర్థిక శాఖ సెక్షన్ అసిస్టెంట్ పాల్ ఫ్రాన్సిస్ పదవీ వీరమణ పొందిన వారిలో ఉన్నారు. కాగా, అటవీశాఖలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌గా రిటైర్ అయిన కౌసర్ అలీకి కూడా ఆ శాఖ అధికారులు సగౌరవంగా వీడ్కోలు పలికారు. -
విపక్షనేతకు ప్రొటోకాల్ పాటించని టీటీడీ
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల వెళ్లిన సందర్భంగా తిరుమల–తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రొటోకాల్ పాటించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత స్థానం ప్రతిపక్షనేతదే. ప్రతిపక్షనేత స్వామి వారి దర్శనానికి వస్తే టీటీడీ ఉన్నతాధికారులు స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి విపక్షనేత హోదాలో పాదయాత్ర చేసి తిరుమలకు వచ్చిన సందర్భంగా అప్పటి కార్యనిర్వహణాధికారి (ఈవో) అజేయ కల్లం సాదరంగా ఆహ్వానించి సంప్రదాయాన్ని పాటించారు. (కాలిబాటన కొండపైకి..) ప్రస్తుత విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తిరుమలకు వచ్చిన సందర్భంగా దీనికి పూర్తి విరుద్ధంగా జరిగింది. జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు (జేఈవో) స్థానికంగానే ఉండి కూడా కనీసం కలవకుండా ఎవరినో కిందిస్థాయి ఉద్యోగిని పంపి చేతులు దులుపుకున్నారు. జగన్ తిరుమల పర్యటన గురించి టీటీడీ అధికారులకు సమాచారం రాలేదా? అని వాకబు చేయగా పూర్తిగా పర్యటన, స్వామివారి దర్శనం గురించి ముందుగానే సమాచారం పంపించారని తెలిసింది. అయినా ప్రతిపక్షనేత జగన్ విషయంలో టీటీడీ ఉన్నతాధికారులు సంప్రదాయాలను పాటించకపోవడం గమనార్హం. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన అతి పెద్ద థార్మిక సంస్థ టీటీడీలో ఇలా జరగడానికి ప్రభుత్వ పెద్దల ఆదేశాలే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదేమి వైచిత్రి! స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులను రంగనాయకుల మండపంలో టీటీడీ వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించడం సంప్రదాయం. ఇలా ప్రముఖులను ఆశీర్వదించే సమయంలో టీటీడీనే ఫొటోలు తీయించి మీడియాకు విడుదల చేస్తుంది. విపక్షనేత జగన్‌ను ఆశీర్వదించి ప్రసాదం అందజేసిన ఫొటోలను టీటీడీ కనీసం విడుదల చేయకపోవడం గమనార్హం. ప్రొటోకాల్ లేని పారిశ్రామికవేత్తలు, సినీ రంగం వారికి ఇచ్చిన గౌరవం కూడా టీటీడీ ప్రతిపక్ష నేతకు ఇవ్వకపోవడం దారుణమని అన్ని వర్గాలూ విమర్శిస్తున్నాయి. ‘ఎవరి ఒత్తిడి వల్ల ఇలా చేశారోగానీ విపక్ష నేత విషయంలో ఇలా వివక్ష చూపడం తప్పిదమే. అధికార పార్టీ పెద్దలు చెప్పిన పనులు చేయడం, ఆ పార్టీ నేతలు చెప్పే అంశాలకు అధికారులు ప్రాధాన్యం ఇవ్వడం సాధారణమే. అత్యున్నత సర్వీసుకు చెందిన ఐఏఎస్ అధికారులు సైతం విచక్షణ మరచి పాలకుల ముందు మోకరిల్లుతూ గౌరవాన్ని కోల్పోయేలా వ్యవహరించడం సరికాదు. ఇలా బాస్‌ల అడుగులకు మడుగులొత్తుతూ సంప్రదాయాలను కాలరాయడం వల్ల ఐఏఎస్‌లపై గౌరవం సన్నగిల్లుతోంది’ అని సీనియర్ ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలపై బయటి వ్యక్తులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
అనధికారులకు అగ్రతాంబూలం!
- మంత్రుల సమీక్షలో ప్రొటోకాల్‌కు పాతర – చైర్‌పర్సన్‌కు అందని ఆహ్వానం – టీడీపీ అభ్యర్థికి, కార్యకర్తలకు అగ్రస్థానం నంద్యాల : అధికారికంగా మంత్రులు నిర్వహించిన సమీక్షలో అనధికారులకు అగ్రతాంబూలమిచ్చి ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి పార్టీ సమావేశంగా మార్చేశారు అధికారపార్టీ నేతలు. ఆదివారం స్థానిక సూరజ్‌గ్రాండ్ హోటల్లో మంత్రులు నారాయణ,అఖిలప్రియ అధికారులు,డ్వాక్రా మహిళలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందుకు మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచనకు పిలుపులేదు. కానీ ఎటువంటి హోదా లేని భూమా బ్రహ్మానంద రెడ్డికి అధిక ప్రాధాన్యతనిచ్చి తమ పక్కన కూర్చోబెట్టుకున్నారు. అలాగే కార్యకర్తలను ముందువరసలో కూర్చోబెట్టి డ్వాక్రా మహిళలు, అధికారులకు వెనుక వరుసలో సీట్లు కేటాయించారు. సీఎం 21వ తేదీన నంద్యాలలో పర్యటించనుండటం, నంద్యాల ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానంద రెడ్డి పేరు ఖరారు చేయడంతో మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. ఆదివారం తెల్లవారుజామునే అభివృద్ధి పనులను,సమస్యలను పరిశీలించారు. అనంతరం మున్సిపల్,రోడ్డు భవనాల శాఖ, మున్సిపల్ ఉపాధ్యాయుల సంఘాలు, డ్వాక్రా మహిళలతో సమావేశం చేపట్టారు. ప్రోటోకాల్‌ను విస్మరించిన అధికారులు : మంత్రుల సమీక్షలో అధికారులు ప్రొటోకాల్‌ను విస్మరించారు. దేశం సులోచన పార్టీ మారడంతో ఆమెను పక్కన పెట్టారు. ఆమె వర్గానికి చెందిన కౌన్సిలర్లకు కూడా సమాచారాన్ని పంపలేదు. సమావేశంలో పార్టీ నాయకులే ముందు వరుసలో కూర్చోవడంతో అధికారులు, డ్వాక్రా మహిళలకు చోటులేకపోవడంతో వెనుక వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. -
ప్రొటోకాల్ పాటించకపోతే తిప్పలు
తోటపల్లిగూడూరు: ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రొటోకాల్ పాటించకపోతే అధికారులు ఇబ్బందులు పడక తప్పదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి ఎమ్మెల్యే కాకాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ మండల వ్యవసాయాధికారిణి జ్యోత్స్నపై మండిపడ్డారు. ఇస్కపాళెంలో జరిగిన ఏరువాక కార్యక్రమానికి అధికారులు రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కుమారుడు రాజగోపాలరెడ్డిని ఆహ్వానించి ముఖ్య అతిథిగా పీఠం ఎలా వేస్తారని ప్రశ్నించారు. కనీసం వార్డు సభ్యుడు కూడా కాని సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంత్రి కుమారుడని, ప్రభుత్వ కార్యక్రమంలో ఏ విధంగా ముఖ్య అతిథిగా కూర్చోబెట్టావని దీనిపై వివరణ ఇవ్వాలని ఏఓ జ్యోత్స్న నిలదీశారు. ప్రొటోకాల్ అంటే ఏంటో తెలుసుకుని అధికారులు పద్ధతిగా వ్యవహరిస్తే మంచిదన్నారు. లేని పక్షంలో ఏ స్థాయి అధికారైనా ఇబ్బందులు పడక తప్పదని హెచ్చరించారు. -
ప్రోటోకాల్‌ను పక్కన పెట్టిన ప్రధాని మోదీ
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకు స్వాగతం పలికేందుకు వెళ్లిన సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రోటోకాల్‌ను పక్కన పెట్టేశారు. సాధారణంగా ప్రధానమంత్రి కాన్వాయ్ వెళ్తోందంటే ఆ మార్గంలో ట్రాఫిక్ మొత్తాన్ని ఆపేస్తారు. దాదాపు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో కాన్వాయ్ ఉందనగానే పోలీసులు ఇతర వాహనాలన్నింటినీ ఆపేసి కాన్వాయ్ వెళ్లిన తర్వాత మాత్రమే అనుమతిస్తారు. కానీ అలా నియంత్రణలు ఏవీ లేని మార్గంలోనే ప్రధానమంత్రి ప్రయాణించి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఒకరు భారతదేశంలో పర్యటిస్తున్నారు. షేక్ హసీనా నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. శనివారం నాడు ఆమె ప్రధాని మోదీతో విస్తృతస్థాయి చర్చలలో పాల్గొంటారు. సైనిక సాయం కోసం బంగ్లాదేశ్‌కు భారతదేశం దాదాపు 500 మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. -
అధికారులు విలువ ఇవ్వడం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారులు ఎవరూ ఎమ్మెల్యేలను గౌరవించడం లేదని, కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఎమ్మెల్యేలకు కనీసం విలువ ఇవ్వక పోగా, ‘ఉద్యమంలో పనిచేసివచ్చారు, వీళ్లకేం తెలుసు’ అనే భావనలో అధి కారులు ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు ఆరునెలల ముందు కాంగ్రెస్‌లో ఎవరూ మిగలరని, సీఎల్పీ నేత జానారెడ్డి కూడా టీఆర్ఎస్లోకి వస్తారని జోస్యం చెప్పారు. -
గీత దాటితే వేటు పడుద్ది
లండన్: ఇక నుంచి మైదానంలో క్రికెటర్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాల్సిందే! మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) రూపొందించిన కొత్త నియమావళిలో అంపైర్లకు మరిన్ని అధికారాలు రాబోతున్నాయి. మైదానంలో ఏమాత్రం అనుచితంగా ప్రవర్తించినా సంబంధిత ఆటగాడిని పెవిలియన్‌కు పంపే అధికారం వారికి ఉంటుంది. అలాగే క్రికెటర్లు వాడే బ్యాట్ల పరిమాణం కూడా తగ్గనుంది. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. గతేడాది డిసెంబర్లో జరిగిన ఎంసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదనలకు ఎంసీసీ ఆమోదముద్ర వేసింది. -
మహానందీశ్వరుడి సేవలో ప్రముఖులు
మహానంది: మహానందీశ్వరుడి సన్నిధిలో శనివారం పలువురు ప్రముఖులు పూజలు నిర్వహించారు. కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి కుటుంబ సభ్యులతో కలిసి మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రొటోకాల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు న్యాయమూర్తి దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అలాగే నంద్యాలకు చెందిన న్యాయమూర్తులు రామ్మోహన్, నాగేశ్వరరావు, ఎం.కుమారి, శైలజలు వేర్వేరుగా మహానంది క్షేత్రానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. వీరితోపాటు జిల్లా పరిషత్ సీఈఓ ఈశ్వర్, ఇన్‌కంట్యాక్స్ జాయింట్ కమిషనర్, ఐఆర్ఎస్ అధికారి సత్యనారాయణ (విజయవాడ రేంజ్) మహానందికి వచ్చారు. వీరికి దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వారికి స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేయించారు. -
రచ్చ...రచ్చ
కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం రచ్చ...రచ్చగా కొనసాగింది. ఆద్యంతం సభ గందరగోళం మధ్య సాగింది. ఉరీ ఉగ్రవాద దాడిలో అమరులైన జవాన్లకు సభ నివాళి అర్పించింది. సమావేశం ప్రారంభం కాగానే తమను ఆఖరి సీట్లలో కూర్చొబెట్టి తెలుగుదేశం పార్టీ సభ్యులంతా ముందు సీట్లలో కూర్చొన్నారని, వారు ఒక పార్టీ తరుపున గెలిచి మరో పార్టీ సభ్యుల ప్రక్కన ఎలా కూర్చొంటారని కార్పొరేటర్ బోలా పద్మావతి ప్రశ్నించడంతో సభలో గందరగోళం చెలరేగింది. దీంతో మేయర్ ప్రక్కన ఎమ్మెల్యే ఎలా కూర్చొంటారని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. ఈ విషయం వైఎస్ఆర్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాదులాటకు దారితీసింది. ఈ దశలో సీటింగ్ విషయంలో నిబంధనలు ఎలా ఉన్నాయని మేయర్ సురేష్‌బాబు కమీషనర్ పి. చంద్రమౌళీశ్వర్రెడ్డిని ప్రశ్నించారు. ఇందుకు కమీషనర్ సమాధానమిస్తూ ఎన్నికల తర్వాత నిర్వహించే మొదటి సమావేశంలో మాత్రమే సీటింగ్ విషయమై నిబంధనలున్నాయని తర్వాత నిర్వహించే సమావేశాలకు లేవని తెలిపారు. మేయర్ సమ్మతితో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన ప్రక్కన కూర్చొవచ్చని స్పష్టం చేయడంతో వివాదం సద్దుమణిగింది. – జాతీయ పట్టణ పారిశుద్ద్య పాలసీ–2008 ప్రకారం నగరపాలక వ్యర్థ పదార్థాల నిర్వహణ, పారిశుద్ద్యం మెరుగు పరుచుటకు ‘సిటీ శ్యానిటేషన్ టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై సభ్యులు పాకా సురేష్, మగ్బూల్‌బాషా మాట్లాడుతూ చట్టబద్దత, హక్కులు లేని ఈ కమిటీకి ఏం విలువుంటుందని ప్రశ్నించారు. దీనిపై కమీషనర్ స్పందిస్తూ ఇది పార్లమెంటులో చట్టమై వచ్చిందని, ఈ కమిటీ తీర్మాణాలను నిర్ణయాలను అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. జీవో నంబర్ 279 అమలుకు విముఖత రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 279 అమలుపై జనరల్ బాడీ విముఖత ప్రదర్శించింది. కార్పొరేషన్ సాదారణ నిధులు, 13, 14 ఆర్థిక సంఘ నిధులు, నాన్‌ప్లాన్ గ్రాంట్లతో ప్రతిపాదిత పనులు చేయలేమని, ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తే అమలు జరుపగలమని తీర్మాణించారు. నగరంలో తహసీల్దారు ఆఫీసు ప్రక్కన ఉన్న ఆరు సెంట్ల ప్రభుత్వ స్థలంలో ఆప్కోమెగా షోరూమ్ నిర్మాణానికి ఎన్ఓసీ ఇవ్వడానికి పాలకవర్గం ఆమోదం తెలిపింది. నెహ్రూ పార్కు నిర్వహణకు సంబంధించి వాకర్స్ అసోషియేషన్‌కు ఒక సంవత్సర కాలానికి ఇచ్చిన లీజు గడువు ముగిసినందున కార్పొరేటర్లు, అధికారులతో కూడిన కమిటీ ఇచ్చే నివేధిక ప్రకారం నిర్ణయం తీసుకోవాలని తీర్మాణించారు. పుట్లం పల్లిలో గ్రామ సర్వేనంబర్ 159/8లో ఒక ఎకరా స్థలంలో గిరిజన భవన్ నిర్మించుటకు ఎన్ఓసీ ఇవ్వడానికి అంగీకరించారు. రామక్రిష్ణ మిషన్ సంస్థకు సంబంధించిన వివేకానంద విద్యానికేతన్ స్కూల్‌కు పన్ను మినహాయింపు ఇవ్వాలని, కుక్కలకు అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ నిర్వహణకు సాదారణ నిధులను కేటాయించుటకు సభ్యులు అంగీకరించలేదు. బహిర్భూమికి బై బై కడప నగరపాలక సంస్థ పరిధిలో బహిరంగ మల, మూత్ర విసర్జన చేపట్టకూడదని తెలుపుతూ ధ్రువీకరణ ప్రతాన్ని సమర్పించడానికి కార్పొరేటర్లు సమ్మతిని తెలియజేశారు. అయితే ఒపెన్ డెఫికేషన్ జరుగుతున్న రాయల్ థియేటర్, వన్‌టౌన్ సమీపాల్లో మరుగుదొడ్లు నిర్మించాలని సభ్యుడు ఎంఎల్ఎన్ సురేష్ సూచించారు. సాయిపేటలో నగరపాలక ఉన్నత పాఠశాలలో 350 మంది విద్యార్థులకు ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉందని స్థానిక కార్పొరేటర్ సుజాత తెలిపారు. ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, పాత బస్టాండు సమీపాల్లో మరుగుదొడ్లు నిర్మించాలని మగ్బూల్‌బాషా చెప్పారు. ఎమ్మెల్యే అంజద్‌బాషా మాట్లాడుతూ కమ్యునిటీ టాయ్లెట్ల నిర్వహణ కష్టసాధ్యమని, వ్యక్తిగత టాయ్లెట్లకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. – కార్పొరేషన్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు షకీల్ అహ్మద్, వి. గుర్రప్ప, ఏ. శ్రీనివాసులు, పి. కిషోర్, ఎం. రాజశేఖర్‌లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతి ఇవ్వడానికి జనరల్ బాడీ ఆమోదం తెలిపింది. చిన్నచౌకు మినీ ౖ»ñ పాస్ సర్కిల్లో సంజన్న విగ్రహాన్ని నెలకొల్పాలని, వన్‌టౌన్ సమీపంలో ఉన్న రెడ్డి జయశ్రీ పే అండ్ యూజ్ టాయ్లెట్లకు ఉన్న లీజును రద్దుపరిచి, ఆ టాయ్లెట్లను పడగొట్టి ఆ స్థలాన్ని హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ వారికి ఇవ్వాలని నిర్ణయించారు. నోరు జారి...ఆపై క్షమాపణ చెప్పి ప్రకాష్‌నగర్, ఓంశాంతి నగర్లో నెలకొన్న భూగర్భ డ్రై నేజీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సభ్యులు కె. బాబు సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాలను చూపిస్తూ సభ మధ్యలో నిరసన తెలిపారు. ఆయనకు సానపురెడ్డి శివకోటిరెడ్డి, రామలక్ష్మణ్‌రెడ్డిలు మద్దతు పలుకుతూ అధికార పార్టీ వారికే అధికారులు పనులు చేస్తున్నారని చెప్పారు. పాలకపక్షంగా ఉంటూ ఎలా ఆందోⶠన చేస్తారని టీడీపీ సభ్యులు ప్రశ్నిస్తుండగా, ఇటీవల వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి మారిన జేసీబీ పీటర్స్ రెచ్చిపోయారు. అది కరపత్రిక అంటూ నోరుపారేసుకున్నారు. ఇలాంటి కథనాలు ఒక్క సాక్షిలోనే కాదు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాయంకాలం దినపత్రిల్లోనూ ప్రచురించారని, అవికూడా కరపత్రికలేనా అని వారు ప్రశ్నించడంతో అవి కూడా అలాంటివేనని చెప్పారు. దీంతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సమావేశాన్ని బహిష్కరించి బయటికి వచ్చారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ విశ్వనాథరెడ్డి, పాకాసురేష్ తదితరులు జోక్యం చేసుకొని పీటర్స్‌తో సభలో క్షమాపణ చెప్పించడంతో ఈ వివాదం సమసిపోయింది. సభలోకి దూసుకొచ్చిన ఆందోళనకారులు జీవో నంబర్ 279ను రద్దు చేయాలని, వివిధ కాలనీల్లో నిల్వ ఉన్న వర్షపునీటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ నగరపాలక సంస్థ ఎదుట ఆందోళన నిర్వహించిన సీపీఐ నాయకులు గేట్లు తోసుకొని కార్యాలయంలోకి, అటునుంచి సర్వసభ్య సమావేశం జరుగుతున్న కౌన్సిల్ హాలులోకి ప్రవేశించారు. పోలీసులు, సిబ్బంది వారిని నిలువరించలేకపోయారు. ఆందోళనకారులు సభలోకి రావడంతో మళ్లీ గందరగోళం చెలరేగింది. ఒక దశలో సీపీఐ కార్యకర్తలు, కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సమావేశం జరుగుతున్న సమయంలో అనుమతి లేకుండా ప్రవేశించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సెక్రటరీ చెన్నుడు, ఎస్ఈ ఉమామహేశ్వరరావు, ఎంఈ చెన్నకేశవరెడ్డి, ఎంహెచ్ఓ వినోద్‌కుమార్, ఇరిగేషన్ ఈఈ కొండారెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ శివనాగేంద్ర, ఆర్అండ్బి ఈఈ చంద్రశేఖర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
ప్రొటోకాల్ రగడ
– కర్నూలు ఎంపీ, రాజ్యసభ ఎంపీకి అందని ఆహ్వానం – ఎమ్మెల్యేతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కర్నూలు(టౌన్): అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ప్రొటోకాల్ రగడ రాజుకుంది. శనివారం సాయంత్రం స్థానిక మధర్‌థెరిస్సా సర్కిల్ వద్ద రూ. 2.30 కోట్ల కృష్ణాపుష్కారాల నిధులతో రోడ్డు విస్తరణ పనులు, పుట్‌పాత్, గ్రీనరీ పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నగరపాలక కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్, డీఈలు తప్పని సరిగా హాజరు కావాల్సి ఉంది. అయితే వీరికి సరైన సమయంలో సమాచారం ఇవ్వలేదు. కాంట్రాక్టర్ ఏకపక్షంగా ఎమ్మెల్యేకు ప్రాధాన్యం ఇవ్వడం విమర్శలు తావిచ్చింది. ప్రొటోకాల్ ప్రకారం పార్లమెంట్ సభ్యులను పిలవాలి. అయితే ఆమె ప్రతిపక్ష పార్టీలో ఉండడంతో సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే అదే పార్టీలో కొనసాగుతున్న రాజ్యసభ సభ్యునికి ప్రాధాన్యం కల్పించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్, ఇతర అధికారులు కనిపించకపోవడం గమనార్హం. ఇదే విషయంపై సాక్షి మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీంద్ర బాబును ఫోన్లో సంప్రదిస్తే.. సమాచారలోపం వల్ల సమయానికి చేరుకోలేకపోయామని సమాధానమిచ్చారు. -
ప్రోటోకాల్ ఉల్లంఘించిన బాలకృష్ణ
పుష్కరాల సందర్భంగా విజయవాడకు వచ్చిన సినీహీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారు. దుర్గగుడి మీదకు వెళ్లడానికి టికెట్ కొనాల్సి ఉన్నా కొనకుండా.. సొంత వాహనాలతో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో కలిసి ఆయన కొండ మీదకు వెళ్లిపోయారు. ఇలా ఎమ్మెల్యే నిబంధనలను ఉల్లంఘిస్తున్నా, దుర్గగుడి అధికారులు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. -
ఆర్చీల ఏర్పాటుతో ప్రజాధనం వృథా
–ప్రొటోకాల్‌కు తూట్లు పొడుస్తున్న ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం ఈఓ – ఆయనపై చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తా– ఆదోని ఎమ్మెల్యే ఆదోని టౌన్: ఉరుకుంద ఈరన్న స్వామి ఉత్సవాల పేరుతో ఆలయ ఈఓ ఆదోని– ఉరుకుంద మార్గంలో ఇష్టం వచ్చినట్లు ఆర్చీలు ఏర్పాటు చేసి ప్రజధనాన్ని వృథా చేస్తున్నారని ఆదోని ఎమ్మెల్మే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. దాదాపు వంద సంవత్సరాలుగా ఉరుకుంద ఈరన్న స్వామి ఉత్సవాలు ఏటా శ్రావణమాసంలో జరుగుతాయని, రాష్ట్రం నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితరప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారన్నారు. అయితే ఆలయ కమిటీ నిర్వాహకులు వారికి అవసరమైన ఏర్పాట్లపై దృష్టిసారించకుండా ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు. ఆర్చీలకే ఏడాదికి దాదాపు రూ.15లక్షల మేర ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ఆదోనిలో ఏర్పాటు చేసిన ఆర్చీలో ప్రొటోకాల్ పాటించలేదని, ఎమ్మెల్యేను కాదని ఎలాంటి హోదాలేని నాయకుల నిలువెత్తు ఫొటోలు పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న ఆలయ ఈఓపై చీఫ్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ కన్వీనర్ చంద్రకాంత్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ రాముడు పాల్గొన్నారు. -
హెల్త్ యూనివర్సిటీలో ప్రొటోకాల్ రగడ
శంకుస్థాపన శిలాఫలకంపై కానరాని స్థానిక కార్పొరేటర్ పేరు కార్పొరేటర్ లీలావతికి బదులు వద్దిరాజు గణేష్‌కు స్థానం వీసీపై డీఆర్ఓకు ఫిర్యాదు పోచమ్మమైదాన్ : రాష్ట్రంలోని వైద్య కళాశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పింది. దీని శంకుస్థాపన కార్యక్రమంతోనే వివాదాలు మెుగ్గ తొడిగాయి. వరంగల్ కేంద్ర కారాగార ఆవరణలో హెల్త్ యూనివర్సిటీ భవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(ఆదివారం) మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి రిమోట్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. అయితే శంకుస్థాపన శిలాఫలకంలో కొన్ని పొరపాట్లు దొర్లాయి. దీనిపై 28వ డివిజన్ కార్పొరేటర్ యెలగం లీలావతి పేరు కాకుండా 27వ డివిజన్ కార్పొరేటర్ వద్దిరాజు గణేష్ పేరును పెట్టారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి సైతం స్థానిక కార్పొరేటర్ లీలావతికి ఆహ్వానం అందలేదు. ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందని హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డిపై స్థానిక కార్పొరేటర్ లీలావతి శనివారం డీఆర్వో శోభకు ఫిర్యాదు చేశారు. పొరపాట్లను సరిదిద్దుతాం ప్రధాని నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపన చేయనున్న శిలాఫలకంపై పేర్ల విషయంలో ముద్రణ తప్పుగా జరిగింది వాస్తవమే. తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంజినీర్ అందించిన పేర్లతో ఈ శిలాఫలకాన్ని తయారుచేయించాం. దాన్ని అమర్చే సమయంలో పొరపాట్లను సరిదిద్దుతాం. – కరుణాకర్ రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ -
ఇదేమి ‘రక్ష’కా!
– మంత్రాలయం పోలీసుల అత్యుత్సాహం – ఆధ్యాత్మిక గురువుకు ప్రొటోకాల్ బందోబస్తు మంత్రాలయం : చుట్టూ పోలీసుల మధ్య కాషాయ వస్త్రధారణలో ఉన్న ఈయన పేరు డా.బ్రహ్మర్షి ఆనంద్ గురూజీ. రాఘవేంద్రస్వామి దర్శనార్థం శనివారం మంత్రాలయం మఠం వచ్చారు. కన్నడ చానెల్లో గ్రహ ఫలాలు చెప్పడంతోపాటు ఆధ్యాత్మిక ప్రవచనాలిచ్చే సాధారణ గురువైన ఈయన బెంగళూరులో ఆనంద్ సిద్ది పీఠం వ్యవస్థాపకులు. సాధారణంగా ఎంతోమంది పెద్దపెద్ద పీఠాధిపతులు వచ్చినా ఏనాడు పోలీసులు అటువైపు రాలేదు. కనీసం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి వచ్చినా కూడా ప్రొటోకాల్ పాటించని సందర్భాలు కోకొల్లలు. అలాంటి రాజకీయ ప్రముఖుడు కాదు.. నక్సలైట్ల హిట్ లిస్టులో ఉన్న వ్యక్తి అంతకన్నా కాదు.. శత్రుసైన్యాల నుంచి ఆపద ఉన్న వ్యక్తి కూడా కాదు. అలాంటి ఓ ఆధ్యాత్మిక గురువుకు ఇక్కడి పోలీసులు బందోబస్తు సపర్యలు చేశారు. ముందుగా ఎస్ఐ మునిస్వామి జీపు సైరన్ కొడుతూ మధ్య కారులో ఆనంద్‌గురూజీ, వెనక సీఐ నాగేశ్వరావు జీపు. ఎవరో వీవీఐపీ వచ్చారని అందరూ సైలెంట్ అయ్యారు. తీరా చూస్తే ఓ సాధారణ ఆధ్యాత్మిక గురువు. సాయంత్రం 4 గంటల వరకు సీఐ, ఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లు ఆయనకు రక్షకవలయంలా ఉండిపోయారు. అనంతరం ఆయన మంత్రాలయం నుంచి విశ్రమించగా పొలిమేర వరకు ఎస్ఐ జీపు ముందుగా సైరన్ కొడుతూ వీడ్కోలు పలికారు. కేసుల పని మానేసి పోలీసులు ఇలా అత్యుత్సాహం చూపించారు. భక్తులు సైతం ఎవరీయన, ఎందుకు ఇంత బందోబస్తు అంటూ ముక్కున వేలేసుకున్నారు. తీరా ఆయన గురించి తెలుసుకున్న జనం రెగ్యులర్ డ్యూటీలు పక్కనపెట్టి కాషాయం చుట్టూ కాపలా కాసిన పోలీసుల తీరు చూసి నవ్వుకున్నారు. -
ప్రజాప్రతినిధులంటే పట్టింపులేదా?
- క్వార్టర్లలో సమస్యలనూ పట్టించుకోవడం లేదు - అధికారులపై స్పీకర్,మండలి చైర్మన్ ఆగ్రహం - సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్లతో సమీక్ష సాక్షి, హైదరాబాద్ : ప్రజాప్రతినిధుల విషయంలో ప్రొటోకాల్ పాటించడంతోపాటు ఇతరత్రా అనేక సమస్యలపై ప్రభుత్వ అధికారులు పట్టింపు లేని విధంగా వ్యవహరిస్తున్నారని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసన సభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులతో బుధవారం స్పీకర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ప్రజాప్రతినిధుల విషయంలో అధికారుల తీరుపై సమీక్ష నిర్వహించిన అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్.. తొలుత తమ సమస్యలను, తమకు ఎదురైన అనుభవాలను ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. తమకు కేటాయించిన భద్రతా సిబ్బందిలో ఎవరెప్పుడు వస్తున్నారో, ఎపుడు పోతున్నారో, అసలు వారెవరో కూడా తెలియడం లేదని, తమ వద్ద మొత్తంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలియడం లేదని అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఇక స్పీకర్, చైర్మన్లకు కేటాయించిన అధికారిక నివాసాలతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్లలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో సంబంధిత అధికారులు దృష్టి పెట్టడడం లేదని ఆగ్రహించినట్లు తెలిసింది. క్వార్టర్లకు నీటి సరఫరా లేదని ఫోన్ చేస్తే పట్టించుకునే నాథుడే లేడని, తమ విషయంలోనే పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని అధికారులను నిలదీసినట్లు సమాచారం. సమావేశంలో పాల్గొన్న వాటర్ బోర్డు అధికారుల నుంచి సమాధానం లేకుండా అయ్యిందని, ఇటీవల క్వార్టర్లలో నీళ్లు లేవని ఒక వీఐపీ ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, చివరకు డబ్బులు ఇస్తామని చెప్పాల్సి వచ్చిందని.. అయినా స్పందన లేదన్న అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారుల తీరు మారకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. తమ వద్ద ఉండే భద్రతా సిబ్బంది సహా ఇతర సిబ్బంది వివరాలను వెంటనే తమకు అందజేయాలని అధికారులను ఆదేశించారని తెలిసింది. -
ప్రొటోకాల్ సంప్రదాయాన్ని మంటగలిపిన బాబు
పాతముచ్చుమర్రి(పగిడ్యాల): ఆంధ్రప్రదేశ్ గహనిర్మాణ శాఖ మంత్రిగా ప్రజలకు సేవలు అందించిన తన తండ్రి బైరెడ్డి శేషశయనారెడ్డికి ప్రొటోకాల్ ప్రకారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉన్నప్పటికి సీఎం చంద్రబాబు ఆ సంప్రదాయాన్ని మంటగలిపారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం పాతముచ్చుమర్రిలోని ఆయన స్వగహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడేళ్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన తన తండ్రికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. రాయలసీమ రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్న తనపై ఉన్న కక్ష్యతో సీఎం ఫ్రొటోకాల్ సంప్రదాయాన్ని పాటించలేదన్నారు. రాయలసీమ పుష్కారాల ఏర్పాట్లలో బైరెడ్డి: ఆగష్టు 12వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే కష్ణా పుష్కరాలకు ధీటుగా రాయలసీమ పుష్కరాలు నిర్వహించేందుకు నిర్ణయించిన బైరెడ్డి అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆదివారం పుష్కరాల నిర్వహణకు సంబంధించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. -
శోధన.. రంధ్రాన్వేషణ
♦ ఇంటింటా సమగ్ర సమాచార సేకరణ ♦ జిల్లాలో స్మార్ట్‌పల్స్ సర్వే ప్రారంభం ♦ 80 ప్రశ్నలతో వ్యక్తిగత వివరాల సేకరణ.. ♦ తొలిరోజు మందకొడిగా సాగిన ప్రక్రియ ♦ ప్రోటోకాల్ పేరుతో గంటల కొద్దీ జాప్యం ♦ ట్రయల్న్‌గ్రా పేర్కొన్న అధికారులు ఒంగోలు/ పుల్లలచెరువు : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో శుక్రవారం స్మార్టు పల్స్ సర్వే (ప్రజాసాధికారిక సమాచార సేకరణ) ప్రారంభమైంది. ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించేందుకు సిబ్బంది సమాయత్తమయ్యూరు. తొలిరోజు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నివాసం నుంచి సర్వే ప్రారంభమైంది. అక్కడ సర్వే సజావుగా సాగినప్పటికీ అనంతరం సమస్యలు ప్రారంభం అయ్యాయి. సర్వర్లు మొరారుుంచడంతో ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది. సర్వే సిబ్బంది ఒక్కొక్కరు రోజుకు 14 కుటుంబాలను అప్డేట్ చేయాల్సి ఉంది. అంటే ఒక్కో కుటుంబానికి కనీసంగా అరగంట సమయం పడుతుంది. దీని ప్రకారం సిబ్బందికి 7గంటలు సమయం తప్పనిసరి. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది అంతా ట్యాబ్‌లలో పని ప్రారంభించడంతోనే సర్వర్లు మొరాయించాయి. దీంతో సిబ్బంది గంటలకొద్దీ ఎదురుచూసినా ఉపయోగం లేకుండా పోయింది. మొరాయించిన సర్వర్లు, మరో వైపు ట్యాబ్‌లకు చార్జింగ్ సమస్యలు, చీరాల, కందుకూరు ప్రాంతంలో నెట్ వర్క్ సమస్యలు వెరసి 15 శాతం కూడా చేయలేకపోయారు. వీఐపీలకు సంబంధించి స్మార్ట్ పల్స్ సర్వేచేశామని, ఇది ట్రయల్ రన్ అంటూ అధికారులు చెప్పుకొచ్చారు. వివరాలు ఆన్ లైన్లో నిక్లిప్తం.. మొత్తం 30 రోజుల పాటు జరగనున్న ఈ సర్వేలో 80 ప్రశ్నలతో సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. ఎన్యూమరేటర్లు, సహాయకులను ఇప్పటికే నియమించారు. స్మార్టు పల్స్ సర్వేలో కీలకపాత్ర పోషించే ఎన్యూమరేర్లుకు సమగ్ర సమాచార సేకరణ చేసేందుకు ప్రత్యేకంగా ట్యాబ్‌ల పంపిణీ చేశారు. ఒక్కో ఎన్యూమరేటర్ రోజుకు కనీసం 14 కుటుంబాలకు చెందిన వివరాలను ట్యాబ్‌ల సహాయంతో ఆన్లైన్లో నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. వివరాలను ఎప్పటికప్పడు ఆన్లైన్లో పొందుపరిచేలా ఓ వెబ్సైట్ తయారు చేశారు. దీనిని జీపీఎస్ సిస్టం ద్వారా అనుసంధానం చేస్తారు. ప్రతి ఇంట్లో ఉండే వస్తువులతో పాటు వాహనాలు, విద్యుత్తుబిల్లులు చెల్లింపు, స్థిర చరాస్తుల వివరాలను ఆధికారులు సేకరించబోతున్నారు. కుటుంబ వివరాలు ఎలా నింపాలో నమూన గణాంక సర్వే ఇప్పటికే పూర్తి చేయగా అయా కుటుంబాల సాంఘిక, ఆర్థిక, వ్యక్తిగత సమాచారాన్ని 80 ప్రశ్నలతో నమోదు చేస్తారు. చూపించాల్సిన కార్డులు, ధ్రువపత్రాలు.. స్మార్టు పల్స్ సర్వే కోసం వచ్చే సిబ్బందికి కుటుంబసభ్యులకు సంబంధించిన ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటరుగుర్తింపు కార్డు, ఆదాయపు పన్ను ఐడీ, విద్యుత్ బిల్లు, డ్రైవింగ్ లెసైన్స్, వాహన రిజస్టేషన్, పట్టాదారు పాస్ పుస్తకం లేదా భూమి ఖాతా నంబర్, ఎల్పీజీ వినియోగదారుని పుస్తకం, బ్యాంక్ పాస్‌బుక్, వికలాంగ సదరం ధ్రువీకరణ పత్రం, నీటిపన్ను రసీదు, కుల ధ్రువీకరణ పత్రం(ఎస్సీ, ఎస్టీ, బీసీలకు), ఆదాయపత్రం, కిసాన్‌కార్డు, పింఛను ధ్రువీకరణ పత్రం, ఉపాధికార్డు, జనన ధ్రువీకరణ పత్రం, ఉపకార వేతన గుర్తింపు పత్రం చూపించాలని శుక్రవారం పుల్లలచెరువు మండలంలో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రత్యేకాధికారి కొండయ్య తెలిపారు. పథకాల వివరాలు తెసుకునేందుకే: కలెక్టర్ ఎమ్మెల్యే ఇంటి వద్ద స్మార్ట్ పల్స్ సర్వే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ సుజాతశర్మ మీడియాతో మాట్లాడారు. ప్రజాసాధికార సర్వేకు 2312 ఎన్యూమరేషన్ బ్లాకులను, మండల స్థాయి సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సర్వే మానిటర్ చేసేందుకు జిల్లా స్థాయి కమిటీ నియోజకవర్గ సమన్వయ అధికారులను, జిల్లాస్థాయి సాంకేతిక బృందాలను, మండల స్థాయి, మున్సిపల్ పరిధిలో కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సర్వేద్వారా వ్యక్తిగతంగా సభ్యుల సామాజిక, ఆర్థిక, విద్య స్థితిగతులు తెలుసుకుంటామన్నారు. ప్రభుత్వం పథకాల ద్వారా లబ్దిదారులు ప్రయోజనం, ఇంకా వారికి అందాల్సిన సంక్షేమ ఫలాలు వివరాలు తెలుసుకోనున్నట్టు చె ప్పారు. ఈ సర్వే ఈ నెలాఖరు వరకు, తిరిగి ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఆధార్ వల్ల ప్రజలకు అనేక ఉపయోగాలు ఉన్నాయని, కనుక సర్వే బృందాలు అడిగిన సమాచారం అందజేయాలన్నారు. ఈ సందర్భంగా సర్వే బృందం ఇట్టా చినరామయ్య కుటుంబ సభ్యులను టాబ్, ఐరిష్ ద్వారా వివరాలు ఆన్లైన్ ద్వారా నమోదు చేశారు. సర్వే బృందంలో సూపర్వైజర్ అమ్మిరెడ్డి, మాస్టర్ ట్రైనీలు విశ్వనాథ్, బాలరాజు, ఎన్యూమరేటర్ సాయిరాఘవ పాల్గొన్నారు. జేసీ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, ఒంగోలు ఆర్డీవో కమ్మ శ్రీనివాసరావు, ఎస్ఎస్ఏ పీవో ఎం.వి.సుధాకర్, మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటకృష్ణ, తహసీల్దారు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రొటోకాల్‌లో ‘పచ్చ’పాతం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రభుత్వం అధికారికంగా కల్పించిన ప్రొటోకాల్‌ను అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అభాసుపాల్జేస్తున్నా.. జిల్లా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నా ఉన్నతాధికారులు కూడా ఉలుకూ పలుకూ లేకుండా ఉండడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ప్రజల నుంచి ఎన్నికైన శాసనసభ్యులు 19 మంది, లోక్‌సభ సభ్యులు నలుగురు, పరోక్ష పద్ధతిలో శాసనమండలికి ఎన్నికైన ఎమ్మెల్సీలు 11 మంది ఉన్నారు. వీరిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య ఇటీవల తరచూ ప్రొటోకాల్ అమలు విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్సీలు తమ అభీష్టం మేరకు తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని అధికారులకు తెలియజేస్తారు. ఉదాహరణకు జిల్లాలో టీడీపీకి తుని నుంచి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పెద్దాపురం నుంచి బొడ్డు భాస్కర రామారావు, కొత్తపేటలో రెడ్డి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు రామచంద్రపురం నుంచి మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, రాజమహేంద్రవరం నుంచి ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరు అధికారిక కార్యక్రమాల్లో ప్రాతినిధ్యానికి సొంత నియోజకవర్గాలనే ఎంపిక చేసుకున్నారు. వారికి ఆయా నియోజకవర్గాల్లో అధికారిక కార్యక్రమాల సమాచారం తెలియజేయడం, ఆహ్వాన పత్రాల్లో వారి పేర్లు ముద్రించడం, వేదికలపై తొలుత ఆహ్వానించడం వంటివి ప్రొటోకాల్ కిందకు వస్తాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వరకూ ప్రొటోకాల్ ఉంటుంది. దీనిని కచ్చితంగా అమలు చేసేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక విభాగమే ఉంది. ప్రొటోకాల్ అమలు విషయంలో అందరినీ ఒకేలా చూడాల్సిన నైతిక బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. కానీ జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో అలా జరగడంలేదు. టీడీపీ ఎమ్మెల్సీ ఉన్న నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ నూరు శాతం అమలవుతూండగా.. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలున్న నియోజకవర్గాల్లో మాత్రం ఆ నిబంధనను అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు. ఉల్లంఘనలకు ఉదాహరణలెన్నో.. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో విపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుంటే ప్రొటోకాల్‌లో ‘పచ్చ’పాతం చూపిస్తున్నారు. అదే విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్సీలుంటే అధికారులు వారి అడుగులకు మడుగులొత్తుతున్నారు. రావులపాలెంలో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ సందర్భంగా విపక్ష వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, అధికార టీడీపీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కిట్ల పంపిణీ విషయంలో ఎవరు ముందనే అంశంపై వారిద్దరి మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడిచింది. ‘‘కొత్తపేట కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ ముందంటున్నారు. బాగానే ఉంది. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్సీలున్న రామచంద్రపురం, రాజమహేంద్రవరంలలో ఇదే విధానం పాటిస్తున్నారా?’’ అని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రశ్నించారు. దీనికి అటు అధికారుల నుంచి కానీ, ఇటు టీడీపీ ఎమ్మెల్సీ నుంచి కానీ సరైన సమాధానం రాలేదు. కొత్తపేట నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో ఆలమూరు మండలంలో రంజాన్ తోఫా సరుకులు పంపిణీ చేయించారు. మాజీ ఎమ్మెల్యేకు ఎటువంటి ప్రొటోకాల్ ఉండకపోయినా.. ఆయన ప్రభుత్వ కార్యక్రమంలో ఎలా పాల్గొన్నారో అధికారులే చెప్పాలి. దీనిపై రావులపాలెం కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రశ్నించినా జవాబు లేదు. ఆ రెండుచోట్లా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లనే అధికారులు కిమ్మనకుండా ఉండిపోయారు. కొత్తపేటలో టీడీపీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం అడుగుతున్నట్టుగానే.. రామచంద్రపురంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్కే ప్రొటోకాల్ ప్రకారం తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, అక్కడ ఆ పరిస్థితి లేదు. అక్కడ జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. ఇలా అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలపై అసలు బోస్ పేరే వేయడం లేదు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవల కాపవరంలో ఆర్డబ్ల్యూఎస్, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు వేసిన శిలాఫలకాలపై గ్రామ కమిటీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకుల పేర్లు సైతం వేసి, ఎమ్మెల్సీ బోస్ పేరు మాత్రం లేకుండా చేశారు. రాజీవ్ గృహకల్ప ప్రారంభం, 2015 అక్టోబర్‌లో దసరా ఉత్సవాలకు దేవాదాయ శాఖ ముద్రించిన ఆహ్వాన పత్రికలు, భీమేశ్వరస్వామికి ఏటా నిర్వహించే కల్యాణ ఆహ్వానం, జనవరిలో ఆర్థిక మంత్రి యనమల బీసీ హాస్టల్ ప్రారంభించినప్పుడు.. ఇలా చాలా సందర్భాల్లో బోస్ పేరు వేయలేదు. కొన్ని సందర్భాల్లో అసలు ఆహ్వానమే ఉండటం లేదు. ‘పచ్చ’పాతానికి ఇంతకంటే నిదర్శనాలేముంటాయి? రాజమహేంద్రవరంలో కూడా ఇదే తంతు. ఇటీవల కందుకూరి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహ్వానం మేరకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అందరికంటే ముందే వెళ్లారు. ఆ సమావేశానికి రావాల్సిన అక్కడి టీడీపీ మిత్రపక్షం బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆలస్యంగా వచ్చారు. అప్పటివరకూ వేదిక సమీపాన మరో గదిలో నిరీక్షిస్తున్న ఎమ్మెల్సీని పట్టించుకోకుండా ఎమ్మెల్యే వచ్చీరాగానే కార్యక్రమం నిర్వహించేశారు. దీనిపై ఎమ్మెల్సీ అప్పారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంపచోడవరంలో విపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని సైతం కాదని, జన్మభూమి కమిటీ సభ్యులే పెత్తనం చెలాయిస్తున్నారు. అధికారులు కూడా వారికే పెద్దపీట వేస్తున్నారు. కాకినాడ రూరల్‌లో టీడీపీకే చెందిన ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఉన్నా.. ఆమె భర్త పిల్లి సత్యనారాయణమూర్తి అధికారిక కార్యక్రమాలు, సమావేశాల్లో దర్జాగా పాల్గొంటున్నారు. ఏ ప్రొటోకాల్ ప్రకారం ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో.. అందుకు అధికారులు ఎలా అనుమతిస్తున్నారో ప్రశ్నార్థకమే. ఇలా చాలాసార్లు ప్రొటోకాల్ విషయంలో ‘పచ్చ’ పాతం చూపిస్తున్నా జిల్లా అధికారులు కిమ్మనడంలేదు. నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు ఇకనైనా ఇటువంటి వైఖరికి స్వస్తి చెప్పాల్సి ఉంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ప్రొటోకాల్‌పై ఏర్పాటైన ప్రివిలేజ్ కమిటీ కూడా జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో.. ఆ దిశగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించాలి. -
వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
కడప: రాష్ట్రంలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగితే సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ అవినాష్ రెడ్డి, రఘురామిరెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతుందంటూ కడపలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ..ప్రజా ప్రతినిధులను, ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి ఓడిపోయిన వారితో ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు. అవినీతిపై పోరాడుతున్నందుకే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, శ్రీనివాసులు, అంజాద్ బాషా, శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రజలు ఎన్నుకున్న వారికి అవమానమా?
ఓడిపోయిన వారికి గౌరవమా..ప్రొటోకాల్ అంటే ఇదేనా జిల్లాలో ప్రొటోకాల్ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను పిలవటం లేదు. ఓడిపోయిన అధికార పార్టీ నాయకులను వేదికలపైకి ఎక్కిస్తున్నారు. మాచర్ల : ప్రజలు ఎన్నుకున్న నేతలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రొటోకాల్ ప్రకారం వారిని ఆహ్వానించాల్సి ఉంది. ప్రభుత్వాలు రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించి ఓడిపోయిన వారిని పిలిచి వేదిక లపై ఎక్కించి ప్రొటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం చేయడంపై గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మాచర్ల నియోజకవర్గంలోప్రొటోకాల్ ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కావడంతో ఆయనను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవకుండానే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేస్తున్నారు. ఏడాదిగా ఇదే తీరు ఏడాదిగా ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి ఎమ్మెల్యే పీఆర్కేపై ఓటమి పాలైన ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చలమారెడ్డి, అంతకుముందు ఉపఎన్నికల్లో ఓడిపోయిన చిరుమామిళ్ల మధుబాబు తండ్రి వెంకటనర్సయ్య,కౌన్సిలర్లుగా పోటీచేసి ఓడిపోయినవారిని సైతం ప్రభుత్వ కార్యక్రమాల వేదికపై పిలిచి మాట్లాడిస్తున్నారు. ఏఎంసీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు తన పరిధిని దాటి మండలాల్లో అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, ఆదేశాలు జారీచేస్తూ ప్రొటోకాల్‌ను పట్టించుకోవటం లేదు. ఎంపీ రాయపాటి పర్యటనల్లో.. ఎంపీ రాయపాటి సాంబశివరావు రెండు నెలల్లో మాచర్ల నియోజకవర్గంలో పదిసార్లు పర్యటిస్తే ఒక్కసారి కూడా ఎమ్మెల్యే పీఆర్కేను ఏ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. ఇటీవల మాచర్ల మండలంలో ఎంపీ రాయపాటి పర్యటించి కృష్ణా పుష్కర ఘాట్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే పీఆర్కేను ఆహ్వానించలేదు. పురపాలక సంఘ కార్యాలయంలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం, హోం మంత్రి చినరాజప్ప పర్యటన సమయంలోనూ ఎమ్మెల్యే పీఆర్కేను ఆహ్వానించలేదు. పార్లమెంట్ ప్రోటోకాల్ కమిటీలో సభ్యుడిగా.. పార్లమెంట్లో ప్రొటోకాల్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఎంపీ రాయపాటి పాల్గొనే కార్యక్రమాల్లోనే ప్రొటోకాల్‌ను అధికారులు పట్టించుకోవడం గమనార్హం! రాయపాటి సైతం ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పాల్గొనకపోయినా ఓడిపోయిన అభ్యర్థులతో కొబ్బరికాయలు కొట్టించి ప్రోత్సహిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అహంభావంతోనే ఇలా.. నిబంధనలు లేవు, చట్టం లేదు, ప్రొటోకాల్‌ను పాటిం చరు. అధికారం వచ్చిందని అహంభావంతో యథేచ్ఛగా ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. రాష్ట్రాన్ని టీడీపీ సొంత రాజ్యంగా భావిస్తూ ప్రజాస్వామ్యహితంగా కాకుండా ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్నారు. అసెంబ్లీలో చెప్పుకుంటేనే దిక్కులేని పరిస్థితి. ప్రొటోకాల్ అమలు చేయాల్సిన ప్రజాప్రతినిధులే వాటిని ప్రోత్సహిస్తున్నారు. - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే, మాచర్ల -
ప్రొటోకాల్‌పై మంత్రికి ఫిర్యాదు
ఖానాపూర్ : పార్టీ కార్యక్రమాలతోపాటు తాజాగా మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఎంపీపీగా ఉన్న తనకు సమాచారం ఇవ్వకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించారని, స్థానిక ఎమ్మెల్యే సైతం త నపై కావాలనే వివక్ష చూపిస్తున్నారని ఎంపీపీ ఆకుల శోభారాణి ఆరోపించారు. ఆదివారం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దీనిపై నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై జిల్లాలోని మంత్రులు, పార్టీ జిల్లా, రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీపీ పేర్కొన్నారు. తనను ఉద్దేశ పూర్వకంగానే ఆహ్వానించడంలేదని దీంతో పార్టీ శ్రేణులో టీఆర్ఎస్లో రెండు గ్రూపులు ఉన్నాయా అనే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నారు. సమాచారం ఇవ్వకుండా మంత్రులు వస్తున్నారని హడావుడి చేసి ప్రజలతోపాటు అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. గతంలోను సీఎం వస్తున్నారంటూ తరచు హెలిప్యాడ్ స్థల పరిశీలన పేరుతో ప్రకటనలు ఇచ్చారన్నారు. మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో అవినీతి రాజ్యమేలుతుందన్నారు. ్జకార్యక్రమంలో నాయకులు దాసరి రాజన్న, లక్కవత్తుల శంకర్, కుంటాల గజేందర్, మ్యాదరి రాజేశ్వర్, బక్కశెట్టి వెంకట్రాములు, నారపాక నర్సయ్య, మగ్గిడి సురేశ్ పాల్గొన్నారు. -
బాంబు పేలుడు కేసులో కొత్త మలుపు
ఇదే తరహాలో కేరళలోని కొల్లంలో పేలుడు కేరళ వైపు చిత్తూరు పోలీసుల చూపు చిత్తూరు: ఏప్రిల్.. 7. చిత్తూరులోని న్యాయస్థానాల సముదాయంలో పట్టపగలు న్యాయమూర్తులు ఉపయోగించే ప్రొటోకాల్ వాహనం కింద బాంబు పేలింది. దీంతో ఓ న్యాయవాది వద్ద పనిచేసే గుమస్తా కాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సీన్ కట్ చేస్తే... బుధవారం.. కేరళ రాష్ట్రం కొల్లామ్‌లోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో ఓ జీపు కింద మందు పాతర పేలింది. ఇందులో కూడా ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరులో జరిగిన ఘటన, కొల్లామ్ ఘటన రెండూ దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న చిత్తూరు పోలీసులు కేరళ ఘటనపై దృష్టి సారించారు. చిత్తూరు నగరంలో బాంబు పేలుడు జరిగి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఏ ఒక్క చిన్న క్లూ కూడా దొరక్కుండా నిందితులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కేరళలోని కొల్లాం న్యాయస్థానాల సముదాయంలో బుధవారం బాంబు పేలుడు జరిగింది. చిత్తూరులో పార్కింగ్‌లో ఉన్న కారు కింద బాంబుపెట్టి పేలుడు సృష్టించారో ఇదీ అలాగే జరిగింది. కొల్లామ్‌లో న్యాయస్థానాల సముదాయం, కలెక్టరేట్ రెండూ ఒకే చోట ఉన్నాయి. చిత్తూరులో ఉపయోగించినట్లే పేలుడులో గన్‌పౌడర్‌ను తక్కువ మొత్తం ఉంచారు. అంటే ఎవర్నీ టార్గెట్ చేయడానికి కాదు.. భయపెట్టడానికన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ రెండు ఘటనలకు ఏవైనా సంబంధాలున్నాయా..? అనే దిశగా చిత్తూరు పోలీసులు సమాలోచన చేస్తున్నారు. చిత్తూరు నుంచి ఓ బృందాన్ని కొల్లామ్‌కు పంపి, అక్కడి పరిస్థితిపై ఆరా తీయడానికి చిత్తూరు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
ఫ్లెక్సీలో నా ఫొటో ఏదీ ?
అధికారులపై ఎంపీ శివప్రసాద్ ఆగ్రహం పాకాల : పాకాల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ వారు రూపొందించిన ఫ్లెక్సీని వే దిక ముందు ఉంచారు. అందులో ప్రొటోకాల్ ప్రకారం తన ఫొటో లేకపోవడంపై ఎంపీ అధికారులను ప్రశ్నించారు. కార్యక్రమానికి పిలిచి ఈ విధంగా అవమానపరచడం తగదని మండిపడ్డారు. సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఎంపిగా తనకు ఉందని, అయితే సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో ఎందుకు లేకుండా చేశారని ప్రశ్నించారు. ఎంపీ పట్ల ఇంత నిర్లక్ష్య దోర ణి వహించడం అధికారుల పని తీరుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో బడుగు బలహీన వర్గాల వారికి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఎంపీపీ చాముండేశ్వరి, జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌కుమార్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నంగా నరేష్‌రెడ్డి, జిల్లా ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్ మునీశ్వర్‌రెడ్డి, టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు నాగరాజనాయుడు, ఎంపీడీవో ఎల్వీ. రాజ్‌గోపాల్, తహశీల్దార్ సుధాకరయ్య, సర్పంచ్‌లు, ప్రజాప్రతిధులు, అన్ని శాఖల ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. -
ఎంపీలకు భలే చాన్స్..
నల్లగొండ ఎంపీకి నల్లగొండ, సూర్యాపేటలో.. భువనగిరి ఎంపీకి నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో కూడా.. సెగ్మెంట్ల వారీ విభజన జిల్లాలకే పరిమితం పార్లమెంట్ స్థానాలు, వాటి పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు యథాతథం నియోజకవర్గాలు పెరిగినా.. అదే పద్ధతి లోకల్ ప్రొటోకాల్ పరిధి విస్తరించడంతో ఎంపీలకు కొన్ని అధికారాలు కూడా పెరుగుతాయి. ఎంపీ ల్యాడ్స్ నిధులు సదరు పార్లమెంట్ నియోజకవర్గాలతోపాటు ఆయన లోకల్పొటోకాల్ పరిధి లోకి వచ్చే జిల్లాల్లోని మిగిలిన నియోజక వర్గాల్లో కూడా ఖర్చు చేసే వెసులు బాటు కలుగుతుంది. నల్లగొండ : పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జిల్లాల విభజనతో పార్లమెంట్ సభ్యుల లోకల్ ప్రొటోకాల్ పరిధి పెరగనుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పది జిల్లాలు.. 24 జిల్లాలుగా విడిపోనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేప థ్యంలో రాష్ట్రంలో ఉన్న 17 మంది ఎంపీల ప్రొటో కాల్ పరిధి కూడా విస్తరించనుంది. అంటే.. ఒకే జిల్లాను రెండు లేదా మూడు జిల్లాలుగా చేయడం..ఇందులోనూ ఒకే ఎంపీ స్థానంలోకి వచ్చే నియోజకవర్గాలను రెండు, మూడు జిల్లాలకు పంచేలా ప్రతిపాదనలు తయారు చేయడంతో ఎంపీల లోకల్ ప్రొటోకాల్ పరిధి ఆ మేరకు పెరిగే అవకాశం ఉంది. ఎంపీ ఒక్కరే... ప్రొటోకాల్ మూడు జిల్లాల్లో జిల్లాల విభజన ద్వారా ఒక ఎంపీకి పలు జిల్లాల్లో ప్రొటోకాల్ వర్తించనుంది. ఉదాహరణకు నల్లగొండ జిల్లాలో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలున్నాయి. నల్లగొండ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ స్థానాలు ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో ఉన్నాయి. అంటే ఇప్పటివరకు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఆ జిల్లాలో మాత్రమే లోకల్ ప్రొటోకాల్ ఉంటుంది. కానీ.. ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం జిల్లా విడిపోతే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట, మిర్యాలగూడ నియోజకవర్గాలు సూర్యాపేట జిల్లాలోకి వెళ్తాయి. అప్పుడు నల్లగొండ, నాగార్జునసాగర్ నల్లగొండలో ఉంటాయి. అలా జరిగితే.. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఈ రెండు జిల్లాల్లో (నల్లగొండ, సూర్యాపేట) లోకల్ ప్రొటోకాల్ వర్తిస్తుందన్నమాట. భువనగిరి ఎంపీ విషయానికి వస్తే లోకల్ ప్రొటోకాల్ పరిధి నాలుగు జిల్లాలకు వర్తించనుంది. ప్రస్తుతం భువనగిరి పార్లమెంట్ పరిధిలో నల్లగొండ జిల్లాలోని భువనగిరి, మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ అసెంబ్లీ స్థానాలతో పాటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, వరంగల్ జిల్లా జనగామ ఉన్నాయి. అంటే భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌కు ఈ మూడు జిల్లాల్లో లోకల్ ప్రొటోకాల్ వర్తిస్తోంది. జిల్లా విభజన జరిగితే ఆయన లోకల్ పొటోకాల్ పరిధి నాలుగు జిల్లాలకు పెరగనుంది. ఎలాగంటే... భువనగిరి పార్లమెంటు పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లాలోకి వెళ్తుంది కనుక సూర్యాపేట జిల్లాలో కూడా భువనగిరి ఎంపీకి లోకల్ ప్రొటోకాల్ వర్తిస్తుందన్నమాట. ఈ జిల్లాతో పాటు నల్లగొండ, భువనగిరి కేంద్రంగా ఏర్పాటయ్యే యాదాద్రి, జనగామ నియోజకవర్గం వెళ్లే మానుకోట జిల్లాల్లో కూడా ఆయన ప్రాతినిధ్యం పెరుగుతుం ది. ఈ లెక్కన నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ సభ్యులిద్దరికీ కలిపి మొత్తం ఐదు జిల్లాల్లో ప్రొటోకాల్ వర్తిస్తుందన్నమాట. అయితే, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగినప్పటికీ, ఆయా పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అసెంబ్లీలు నియోజకవర్గాలు, జిల్లాల పరిధిలో ఎంపీ లోకల్ ప్రొటోకాల్ వర్తించనుంది. జెడ్పీ సమావేశాలతోపాటు... లోకల్ ప్రొటోకాల్ పరిధి పెరగడం ద్వారా ఎంపీలకు కొన్ని అధికారాలు కూడా పెరుగుతాయి. ఎంపీ ల్యాడ్స్ నిధులు సదరు పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు ఆ యన లోకల్ ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే జిల్లాల్లోని మిగిలిన నియోజకవర్గాల్లో కూ డా ఖర్చు చేసే వెసులు బాటు కలుగుతుంది. అదేవిధంగా ఎంపీ స్థానం వచ్చే అన్ని జిల్లాల జెడ్పీ, డీఆర్సీ, బ్యాంకర్ల సమావేశాలు, అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరు కావచ్చు. కానీ.. విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశాలకు చైర్మన్‌గా వ్యవహరించే అవకాశం మాత్రం ఒక్క జిల్లాలోనే ఉంటుంది. సదరు పార్లమెం ట్ పరిధిలోనికి వచ్చే అసెంబ్లీ స్థానాలు కాకుండా... జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం స్థానిక ఎంపీ తర్వాతే విస్తరణ ఎంపీలకు ప్రొటోకాల్ వర్తించనుంది. -
ప్రొటోకాల్‌కు తిలోదకాలు
► నిబంధనలకు గవిరెడ్డి అతీతం! ► మాజీ ఎమ్మెల్యే అయినా నీరు-చెట్టు పనులు ► ప్రారంభించిన వైనం హాజరుకాని అధికార గణం ► పచ్చచొక్కాల తీరుపై ప్రజల ఆగ్రహం దేవరాపల్లి: అధికార పార్టీ నాయకులు ప్రొటోకాల్ నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారు. అధికారిక కార్యక్రమాలను సైతం పార్టీ కార్యక్రమాలుగా మార్చేస్తున్నారు. పలుమార్లు నిబంధనలను అతిక్రమిస్తున్నా చర్యలు తీసుకుంటున్న దాఖలాలులేవు. చెరువు ల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు నీరు-చెట్టు కార్యక్ర మం పేరిట చెరువుల్లో పూడిక తీత పనులు చేపడుతున్నారు. అయితే అధికారిక కార్యక్రమమైన ఈ నీరు-చెట్టు కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ నాయకు లు రాజ్యాం గానికి విరుద్ధంగా ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుకు ఎటువంటి హోదా లేనప్పటికీ పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని ప్రొటోకాల్‌కు తూట్లు పొడుస్తూ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇటీవల ముషిడిపల్లి గ్రామంలో అధికారిక కార్యక్రమైన ఎన్టీఆర్ గృహ కల్ప పథకం ప్రారంభోత్సవంలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వేచలం గ్రామంలో నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా మహాపాత్రుని చెరువు పూడిక తీత పనులకు సుమారు రూ.10 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులను బుధవారం స్థానిక సర్పంచ్ వంటాకు సింహాద్రప్పడుతో కలిసి మాజీ ఎమ్మెల్యే ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తూ ప్రారంభించడంపై పలువురు గ్రామస్తులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తెలుగు తమ్ముళ్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికార గణం చూసి చూడనట్టు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
టీడీపీ నేతలపై మంత్రి గంటా ఫైర్..
వైఎస్సార్ జిల్లా: కడపలో జరిగిన కాపు సంక్షేమం, అభివృద్ధి మేధోమథన సదస్సుకు హాజరయ్యేందుకు మంగళవారం కడపకు వచ్చిన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విజయవాడ నుంచి మంత్రి గంటా విమానం ద్వారా కడపకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి మంత్రి గంటాను ఆ పార్టీ నాయకుడు పుత్తా నరసింహారెడ్డి భోజనానికి నగరంలోని తన హరిప్రియ హోటల్‌కు తీసుకెళ్లారు. అప్పటివరకు విషయాన్ని గుర్తించలేకపోయిన మంత్రి ఒక్కసారిగా పరిస్థితి అర్థం చేసుకుని పుత్తాపై మండిపడినట్లు తెలిసింది. రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అయిన తనను ఇలా ఒక ప్రైవేటు హోటల్‌కు తీసుకు రావడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒక పద్ధతి అంటూ లేకుండా ప్రొటోకాల్‌ను ఏమాత్రం పాటించకుండా తమ ఆర్భాటాల కోసం తనను వాడుకోవడం తగదని సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయమై బందోబస్తులో ఉన్న పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే కడప నగర టీడీపీ అధ్యక్షుడు హరీంద్రనాథ్తోపాటు మరో టీడీపీ నాయకుడు దుర్గాప్రసాద్ మంత్రి గంటా వద్దకు వెళ్లారు. పార్టీలో ఇతర వర్గాల పెత్తనం కొనసాగుతోందని, కాపు వర్గాలకు ఏమాత్రం ప్రాధాన్యత కల్పించడం లేదని ఆరోపించినట్లు సమాచారం. ఈ సందర్భంగా హరీంద్రనాథ్ మాట్లాడుతూ పార్టీకి ఎంతో సేవలు చేస్తున్న దుర్గాప్రసాద్‌కు ఏ పదవి ఇవ్వకుండా, ప్రాధాన్యత కల్పించడం లేదని తెలిపారు. అతనికి ఏదో ఒక పదవిని కట్టబెట్టాలని సిఫార్సు చేశారు. దీంతో మంత్రి గంటా వారిద్దరిపై ఫైర్ అయ్యారు. పార్టీలో ఏం జరుగుతోందో? ఎవరు ఎలా నడుచుకుంటున్నారో? నాకు అంతా తెలుసని, ఎవరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. మంత్రి గంటా సీరియస్ అయిన అంశం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. -
ప్రొటోకాల్ ఉల్లంఘనులపై ఫిర్యాదు
మదనపల్లె: అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ప్రచార ఆర్భాటం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రొటోకాల్‌ను విస్మరించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి సబ్‌కలెక్టర్ కృతికాబాత్రాకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం ఆయన నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో కలిసి స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఇవ్వాల్సినప్రాధాన్యం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభంలో ఇవ్వకపోవడం బాధాకరమైన విషయమన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన‘ హౌస్‌ఫర్ ఆల్’ పథకానికి సంబంధించి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పైలాన్ ప్రారంభోత్సవ శిలాఫలకంలో ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ నిబంధనల మేరకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. వీలైనంత త్వర గా శిలాఫలకాన్ని మార్చి ప్రొటోకాల్ నిబంధన ప్రకారం ముఖ్య అతిథి స్థానంలో తన పేరును ముద్రించి ఏర్పాటు చేయాలని కోరారు. లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. స్పందించిన సబ్‌కలెక్టర్ ప్రొటోకాల్ ఉల్లంఘనపై సంబంధిత అధికారులతో విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కౌన్సిలర్లు జింకా వెంకటాచలపతి, బిఏ ఖాజా, మస్తాన్‌రెడ్డి, ఎంపీపీ సుజనా బాలకృష్ణారెడ్డి, జరీనా హైదర్, జెడ్పీటీసీ సభ్యులు భాస్కర్, సుజాత, సర్పంచ్ శరత్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్యే ఆగ్రహం
సబ్‌కలెక్టర్, లోకాయుక్తకు ఫిర్యాదు మదనపల్లె: అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రచార ఆర్భాటం ప్రొటోకాల్ వివాదాలకు దారితీసింది. మదనపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన కనీస ప్రాధాన్యం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభంలో ఇవ్వకపోవడంతో ఆయ న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిం చిన‘ హౌస్ఫర్ఆల్’ పథకానికి సంబంధించి స్థానిక మున్సిపల్ కార్యాలయం లో గురువారం పైలాన్ ప్రారంభించారు. సంబంధిత శిలాఫలకంలో ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇవ్వలేదు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా మొదట ముద్రించాల్సిన పేరును ఎనిమిదో పేరుగా ముద్రించారు. మదనపల్లె నియోజకవర్గానికి సంబంధం లేని పేర్లను మొదటి నుంచి వరుస క్రమంలో ముద్రించారు. దీనిపై ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి సీరియస్ అయ్యారు. స్థానిక సబ్‌కలెక్టర్, లోకాయుక్తాకు కూడా ఫిర్యాదు చేయనున్నారు. అసలు శిలాఫలకంపై ఎమ్మెల్యే పేరును ఎందుకు ప్రాధాన్యత తగ్గించి ముద్రించాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని హౌసింగ్ ఈఈ రాజేంద్రకుమార్, డీ మునీశ్వర్ నాయుడులను ప్రశ్నించారు. వారి వద్ద నుంచి సరైన సమాధానం రాలేదు. ప్రోటోకాల్ ఉల్లంఘన చట్టం కింద చర్యలను తీసుకునేందుకు వెనుకాడనని ఎమ్మెల్యే హెచ్చరించారు. అంతేకాకుండా సబ్‌కలెక్టర్, లోకాయుక్తాలకు ఫిర్యాదులను కూడా పంపారు. -
అధికారా ? టీడీపీ కార్యకర్తా ?
మదనపల్లె: మదనపల్లె హౌసింగ్ ఈఈ రాజేం ద్రకుమార్ అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తూ ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్, పట్టణ అధ్యక్షుడు జర్మన్‌రాజు మండిపడ్డారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గృహనిర్మాణ పథకం (హౌస్ ఫర్ ఆల్) ప్రారంభ కార్యక్రమంలో ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఫొటోలను ఫ్లెక్సీలో ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధాన మంత్రి, కేంద్రమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ ఫొటోలను ముద్రించాల్సి ఉండగా, ముఖ్యమంత్రితో పాటు కొంత మంది మంత్రుల ఫొటోలను మాత్రమే ఫ్లెక్సీలో ఏర్పాటు చేయడంపై వారు సీరియస్ అయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను అధికారిలా కాకుండా టీడీపీ కార్యకర్తలా నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ఈఈకి టీడీపీ కండువా కప్పేందుకు ప్రయత్నించారు. దీంతో సభలో కాస్త గందరగోళం ఏర్పడింది. దీంతో మున్సిపల్ చైర్మన్ చొరవ తీసుకుని అధికారులకు, నాయకులకు సర్దిచ్పెపడంతో వివాదం అప్పటికి సద్దుమణిగింది. హౌసింగ్ ఈఈపై ఎమ్మెల్యే ఆగ్రహం మదనపల్లె: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ప్రచార ఫ్లెక్సీలలో నియోజకవర్గ ఎమ్మెల్యే ఫొటో ముద్రించడం తెలియదా? అంటూ మదనపల్లె హౌసింగ్ ఈఈ రాజేంద్రకుమార్‌పై ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమ పైలాన్ ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ప్రొటోకాల్‌పై అవగాహన లేకుంటే తెలుసుకోవాలని హిత వు పలికారు. స్పందించిన ఈఈ ఇందులో తన తప్పేమిలేదని ఉన్నతాధికారులనుంచి వచ్చిన ఫ్లెక్సీనే ఏర్పాటు చేశానని వివరణ ఇచ్చారు. -
అవినీతి అతని ప్రోటోకాల్!
► రిజిస్ట్రేషన్ శాఖలో ఓ అధికారి దందా ► నెలకు ఇంత ఇవ్వాల్సిందేనని లక్ష్యాలు ► ప్రభుత్వం తరహాలో ప్రతీ ఆఫీసుకు నిర్దేశిస్తున్న వైనం ► డిప్యూటీ సీఎం దృష్టికి మొత్తం అవినీతి వ్యవహారం ► ఈ నేపథ్యంలో సెలవులో వెళ్లేందుకు ప్రయత్నాలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రతీ నెలా ఎంత మొత్తం ఆదాయం సంపాదించాలో తెలియజేస్తూ రిజిస్ట్రేషన్లశాఖకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించడం మీరు వినే ఉంటారు. అయితే, జిల్లాలో ఒక అధికారి... ఏ ఆఫీసు ఎంత మొత్తం నెలకు ఇవ్వాలో లక్ష్యాలు ఇస్తున్నారు. అంతకంటే తక్కువ మొత్తం తనకు ఇస్తేమీ పనిపడతా* అంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు. పైగా ఇవన్నీ ప్రోటోకాల్ ఖర్చులకంటూ సదరు అధికారి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంట. ప్రతీ నెలా కచ్చితంగా జిల్లాలోని రిజిస్ట్రేషన్‌శాఖ సిబ్బంది.. నిర్దేషించిన లక్ష్యం మేరకు సదరు అధికారికి మామూళ్లు సమర్పించుకోవాల్సిందే. అయితే, ఈ మొత్తం వ్యవహారం కాస్తా ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దృష్టికి వెళ్లింది. ఫలితంగా ఈ నెల మూడో వారం నుంచి సెలవుపై వెళ్లి.. కొత్తగా మంచి ఫోకల్ పోస్టింగు కోసం పైరవీలు ప్రారంభించాలని సదరు అధికారి నిర్ణయించుకున్నట్టు సమాచారం. సెలవులో వెళ్లే యోచన...! ఈయనగారి వ్యవహారశైలిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ నెల మూడో వారంలో సెలవులో వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు లంచాల బాగోతం కాస్తా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఇక్కడ ఉండటం వల్ల ఏ క్షణం ఏసీబీ అధికారులు దాడులు చేస్తారో అనే ఆందోళన ఆయన్ను వెంటాడుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో వేరే జిల్లాలో మంచి పోస్టింగు కోసం సెలవుపై వెళ్లాలని భావిస్తున్నట్టు తెలిసింది. సెలవులో ఉండి మంచి ఫోకల్ పోస్టింగుకు పైరవీలు షురూ చేయాలనేది సదరు అధికారి ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఎవరైనా కిందిస్థాయి సిబ్బంది చేస్తున్న అవినీతి వ్యవహారాలను ఈయన దృష్టికి తీసుకవస్తే...ఆ చూద్దాంలే అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. బాధ్యతలు అప్పగించడంలోనూ పైరవీలే రిజిస్ట్రేషన్‌శాఖలో జూనియర్, సీనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించడంలోనూ సదరు అధికారి నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్ అసిస్టెంట్‌కు అప్పగించాల్సిన బాధ్యతలను తనకు నమ్మకస్తుడిగా ఉన్న జూనియర్ అసిస్టెంటుకు అప్పగించరన్న విమర్శలు ఉన్నాయి. తనకు నమ్మకస్తుడిగా ఉన్న వ్యక్తిని నియమించుకోవడం ద్వారా అయినకాడికి దండుకోవచ్చుననేది ఆయన ఆలోచనగా ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే డిప్యూటీ సీఎంకు ఫిర్యాదులు వెళ్లగా సదరు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పురావడం లేదని ఆ శాఖ సిబ్బందే వ్యాఖ్యానిస్తున్నారు. -
కుబేరుడూ.. సామాన్యుడే!
► సామాన్య జీవితం, దాతృత్వంలో మేటి హెచ్‌సీఎల్ అధినేత శివ్‌నాడార్ ► టీటీడీ ట్రస్టులకు రూ.30 కోట్లకు పైగా విరాళాలు ► కానీ ప్రత్యేక దర్శనాల్లో వెళ్లేది అరుదు సాక్షి, తిరుమల: హెచ్‌సీఎల్ వ్యవస్థాపకులు శివ్‌నాడార్ 2015లో వెల్లడైన భారతదేశంలోని సంపన్నుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నారు. ఈయన ఏడాదిలో రెండు మూడుసార్లు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం ఈయనకు ప్రత్యేక దర్శనం కల్పించే అవకాశం ఉంది. అయినప్పటికీ సాధారణ భక్తుడిలాగే వస్తుంటారు. అందరితో కలసి రూ.300 టికెట్ల క్యూలోనే ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత హంగూ ఆర్భాటాలకు తావులేకుండా తిరిగి వెళుతుంటారు. మంగళవారం కూడా సామాన్య భక్తుడిలాగే రూ.300 టికెట్ల క్యూలో ఆలయానికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆపై రూ.కోటి విరాళం అందజేసి, ఈ మొత్తాన్ని నిత్యాన్న ప్రసాదానికి వాడాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ ట్రస్టులకు రూ.30 కోట్లకు పైగా విరాళం టీటీడీ శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు విద్య, వైద్య సేవలతో పేదలకు ఆపన్నహస్తం అందిస్తోంది. ఈ మహాయజ్ఞానికి హెచ్‌సీఎల్ కూడా వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఇప్పటికే హెచ్‌సీఎల్ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యపరంగా ఎన్నో సేవలందిస్తున్న శివ్‌నాడార్ టీటీడీ పథకాలకు భూరి విరాళాలు సమర్పించారు. ఇప్పటికే టీటీడీ నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు రూ.30 కోట్లకుపైగా విరాళాలు ఇచ్చినట్టు స్వయంగా టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతిసారీ రూ.కోటికి తగ్గకుండా విరాళం ఇవ్వడం శివ్‌నాడార్ సంప్రదాయం. సామాన్య భక్తుడిగానే వెంకన్న దర్శనం శ్రీవారి దర్శనం కోసం రోజూ లక్ష మందిదాకా వచ్చే తిరుమలలో ప్రత్యేక దర్శనాలు, మర్యాదల కోసం హోదాలేని వ్యక్తులు చేయని సిఫారసులుం డవు. కానీ శివ్‌నాడార్ సామాన్యుడిగానే క్యూలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం ఆయన ప్రత్యేకత. -
రెవెన్యూ జేబుకు చిల్లు
► అతీగతీ లేని ప్రొటోకాల్ నిధులు ► రూ. కోటి విడుదల చేశామని ప్రకటించిన ప్రభుత్వం ► అప్పులు తెచ్చి ఖర్చు చేస్తున్న రెవెన్యూ సిబ్బంది ► తీర్చే మార్గం కనిపించక ఆందోళనస గుంటూరు ఈస్ట్ : మహా సంకల్పం నుంచి నేటి వరకు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రెవెన్యూ సిబ్బంది భుజస్కందాలపై వేసుకుని పని భారంతో పాటు ఆర్థిక భారం వారే భరించి విజయవంతం చేశారు. ప్రొటోకాల్ ఖర్చుల కింద జిల్లాకు కోటి రూపాయలు విడుదల చేశామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అయితే నేటి వరకు ఒక్క రూపాయి కూడా రెవెన్యూ సిబ్బందికి అందకపోవడంతో వారు ఆందోళన లో పడ్డారు. రాజధాని కేంద్రమైన నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాలో రాష్ర్టస్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి నుంచి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు వచ్చి జిల్లాలో పర్యటిస్తున్నారు. దీంతో ప్రొటోకాల్ నిమిత్తం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించాల్సిన బాధ్యత రెవెన్యూ సిబ్బందిపై పడింది. కొన్ని కార్యక్రమాలు రెండు రోజులకు ముందే ఖరారవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో తహసీల్దార్, డీటీ, ఆర్ఐ స్థాయి సిబ్బందికి అన్ని పనులు పురమాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఆదేశిస్తారే కానీ, ఆర్థిక సహకారం ఇవ్వరు. అధికారులు,సిబ్బంది ఆ వారం రోజులు రాత్రనక పగలనక పని చేయడంతో పాటు ప్రొటోకాల్ ఖర్చులన్నీ వారే భరించాల్సి వస్తోంది. గతంలో సంవత్సరానికి మూడు పెద్ద కార్యక్రమాలు జరిగేవి. అప్పుడప్పుడు మంత్రులు వచ్చినప్పుడు కొంత ఖర్చు ఉండేది. ఇది వారికి పెద్ద భారమయ్యేది కాదు. మహా సంకల్పం, క్రిస్టియన్ భవన్ శంకుస్థాపన, తెనాలి రైతు సదస్సు వంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహించిందే కానీ, వాటికి సంబంధించి ప్రొటోకాల్ నిధులు ఒక్క పైసా రెవెన్యూ సిబ్బందికి చెల్లించలేదు. వీటికి తోడు శాసనసభాపతి, జిల్లాకు చెందిన మంత్రులు,ఇన్చార్జి మంత్రి జిల్లాలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. రాజధాని కావడంతో ఇతర మంత్రులు, సీఆర్డీఏ నేపథ్యంలో విదేశీ అతిథులు జిల్లాకు వస్తున్నారు. ఇటీవల టీడీపీ మహిళా విభాగం నాయకురాలి ప్రమాణ స్వీకారానికి ప్రొటోకాల్ ఖర్చులు రెవెన్యూ సిబ్బందే భరించాల్సి రావడంతో వారు ఆవేదనకు గురైనట్లు వార్తలొచ్చాయి. గొంతెమ్మ కోర్కెలు.. ఒక్కో అతిథికి ఒక్కో అలవాటు. రెవెన్యూ సిబ్బందికి అతిథుల గొంతెమ్మ కోర్కెలు శిరోభారంగా మారాయి. ఓ అతిథి ఉదయాన్నే సమోసాలు కోరగా, మరో అతిథి న్యాప్కిన్ టవల్స్ తిరస్కరించి అప్పటికప్పుడు కొత్త న్యాప్కిన్ టవల్స్ కోరారు. ఉదయం సాయంత్రం భోజనాలే కాక ఫలహారాలతో పాటు ఇతర వ్యసనాలకు కూడా సిబ్బంది పరుగులు తీయాల్సి వస్తోంది. నిధులు ఏమైన ట్టు.. అసలు ప్రభుత్వం విడుదల చేసిన కోటి రూపాయలు ప్రొటోకాల్ నిధులు ఏమయ్యాయనేది రెవెన్యూ సిబ్బందిని కొంతకాలంగా తొలుస్తున్న ప్రశ్న. ప్రభుత్వం ప్రకటించడమే కానీ విడుదల చేయలేదా? విడుదలైన నిధులను వేరే పనులకు మళ్లించారా? అసలు ఆ నిధులు ఏమయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానం దొరక్క రెవెన్యూ ఉద్యోగులు సతమతమవుతున్నారు. ప్రొటోకాల్ నిధులొచ్చినప్పుడు తీర్చవచ్చని అప్పుగా తెచ్చిన డబ్బు ఇప్పుడు ఎలా తీర్చాలా అని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనలో పడ్డారు. ఇప్పటికైనా అధికారులు ప్రోటోకాల్ ఖర్చులు చెల్లించాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. -
ఆ కుర్చీ మాకొద్దు!
కర్నూలు తహసీల్దార్‌గా రావడానికి జంకుతున్న అధికారులు ► ప్రొటోకాల్ పేరుతో వెయిటర్‌ను తలపించే పోస్ట్ ► వీఐపీల సపర్యలకు నెల ఖర్చు రూ.60వేలు ► రూ.3లక్షలకు పైగా బిల్లులు పెండింగ్ ► ఖర్చుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ఆర్ఐలు! కర్నూలు సీక్యాంప్: ఒకప్పుడు కర్నూలు తహ సీల్దార్ కుర్చీకి ఎంతో డిమాండ్. ఈ సీటును ఆశించే వారు ఫైరవీలు, పాలకుల సిఫారసు, డబ్బు, లాంటి అస్త్రాలను ఉపయోగించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. కర్నూలు తహసీల్దార్ పోస్టు అనగానే ఆమడదూరం జరుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మండల రెవెన్యూ అధికారి ఉద్వోగం వీఐపీల భోజనం, టిఫిన్ల మెనూ తీసుకునే వెయిటర్‌ను తలపిస్తోంది. దీంతో కర్నూలు తహసీల్దార్లుగా వచ్చిన వారు ఐదునెలలు తిరగకముందే ఇక్కడ ఉండలేం.. మమ్మల్ని బదిలీ చేయండని మంత్రులు, కలెక్టర్ల వెంట తిరుగుతున్నారు. ప్రొటోకాల్ డ్యూటీలో భాగంగా వీఐపీల టిఫిన్ నుంచి మధ్యాహ్న భోజనం, రాత్రి డిన్నర్‌కు అయ్యే ఖర్చు తహసీల్దార్ కార్యాలయమే చూసుకోవాలి. వీటికంతా ప్రతి రోజు రూ. 20నుంచి 30వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.60,000వేలు అవుతుంది. దీనికి ఉన్నతాధికారులు బిల్లులు పెట్టుకోమంటారు. అయితే, ఎప్పుడు మంజూరవుతుందో చెప్పలేని పరిస్థితి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు రూ. 1.50 లక్షలకు పైగా పెండింగ్ బిల్లులు ఇప్పటి వరకు రాకపోవడమే ఇందుకు ఉదాహరణ. అడ్డదార్లు తొక్కుతున్న ఆర్ఐలు: ఖర్చుపెట్టిన బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఆర్ఐలు తమ జేబునుంచి పైసలు తీయలేక జనం మీద పడుతున్నారు. దీంతో ఎలాంటి సర్టిఫికేట్ కావాలన్నా ఒక రేటు నిర్ణయించి వచ్చిన డబ్బులతో వీఐపీలకు సేవలు చేస్తున్నారు రెవెన్యూ సిబ్బంది. ఇదేంటని జనం ప్రశ్నిస్తే వీఐపీల ఖర్చు ఎవరు పెట్టుకుంటారని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. వీరికి పై స్థాయి అధికారులు మద్దతు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గ్రూప్2 ఆఫీసర్ వెయిటర్ అయిన వేళ: ఆర్ఐలు ఫీల్డ్‌వర్క్‌కు వెళ్లినప్పుడు నేరుగా తహసీల్దార్ వెళ్లి వీఐపీల మెనూ తీసుకోవాలి. ఉదయం ఏ హోటల్ నుంచి టిఫిన్ తెప్పించాలి, మధ్యాహ్నం,రాత్రి ఏ హోటల్ నుంచి భోజనం తెప్పించాలని వీఐపీలను ఒక గ్రూప్2 ర్యాంక్ స్థాయి ఉద్యోగి అడగడం ఇక్కడ సాధారణంగా మారింది. దీన్ని చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. సమయమంతా వీఐపీల సేవలో గడిచిపోతే జనానికి పనులు చేసేదెప్పుడనే ప్రశ్న తలెత్తుతుంది. సంవత్సరం క్రితం బిల్లులు పెండింగ్‌లో కిందటి సంవత్సరంలో తహసీల్దార్‌గా పనిచేసిన శేషఫణి తన పిరియడ్‌లో ప్రోటోకాల్ డ్యూటీ కోసం దాదాపు రూ.3లక్షలు ఖర్చుపెట్టారు. శేషఫణి ప్రస్తుతం బదిలీ అయి దాదాపు 5 నెలలు కావస్తున్నా ఇంతవరకు రూ.3 లక్షల బిల్లు విడుదల కాలేదు. ఎప్పటి బిల్లులు అప్పుడే క్లియర్ చేస్తున్నాం: సాధ్యమైనంత వరకు మా దగ్గర ఉన్న బిల్లులన్నీ పూర్తి చేశాం. జిల్లాలో వివిధ తహసీల్దార్ కార్యాలయాలకు పెండింగ్, విడుదల చేసిన బిల్లుల సమాచారాన్ని చేరవేశాం. ప్రోటోకాల్‌కు సంబంధించిన సమాచారం తహసీల్దార్ దగ్గర ఉంటుంది. డీఆర్ఓ గంగాధర్‌గౌడ్ -
పచ్చ మార్కు పాలన!
► జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట ప్రొటోకాల్ ఉల్లంఘన ► ప్రొటోకాల్‌పై ప్రశ్నిస్తేఅక్రమ కేసులు బనాయింపు ► నిన్న డాక్టర్ గోపిరెడ్డి, నేడు షేక్ మహ్మద్ ముస్తఫాపై తప్పుడు కేసులు రాష్ర్టంలో అరాచకం రాజ్యమేలుతోంది. ప్రజాస్వామ్యంలో పాలకులు తప్పు చేస్తే ఎత్తిచూపేందుకు ప్రతిపక్షం ఉంటుంది. అయితే పచ్చ పాలకులు తప్పు అని ఎవ్వరు ప్రశ్నించినా అధికార బలంతో అణగదొక్కుతున్నారు. పాలనలో పెడధోరణులు చొప్పిస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. సామాన్యులనే కాదు చివరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై సైతం అక్రమ కేసులు పెడుతూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. సాక్షి, గుంటూరు : జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గెలుపొందిన నియోజకవర్గాల్లో ఓటమిపాలైన అధికార పార్టీ నేతలు ఇన్చార్జి పదవి అడ్డుపెట్టుకుని హల్చల్ చేస్తున్నారు. ప్రొటోకాల్ పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రొటోకాల్‌పై ప్రశ్ని స్తే తప్పుడు కేసులు పెట్టిస్తూ ఎమ్మెల్యేలను సైతం అరెస్ట్ చేయిస్తున్నారు. నియోజకవర్గాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. నిన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. నేడు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మహ్మద్ ముస్తఫాపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నారు. తప్పు ఒకరిది శిక్ష మరొకరిది అన్నట్లు పోలీసుల వ్యవహార శైలి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు పట్టని ఉన్నతాధికారులు.. జిల్లాలో నరసరావుపేట, మాచర్ల, గుంటూరు తూర్పు, బాపట్ల, మంగళగిరి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ నిధులతో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా.. జన్మభూమి లాంటి అధికారిక కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యేల కంటే ముందుగా అక్కడి టీడీపీ ఇన్చార్జిలకు అధికారుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శిలాఫలకాలపై సైతం ఇన్చార్జిల పేరు ఉంటోంది. వారి పేరు ఏ అధికారంతో పెడుతున్నారో అర్థం కాని పరిస్థితి. దీనిపై జిల్లా ఉన్నతాధికారులను ఎన్నిసార్లు కలిసి ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతూపొంతూలేని ప్రొటోకాల్ ఉల్లంఘనలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో సైతం కార్పొరేషన్ అధికారులు టీడీపీ ఇన్చార్జి మద్దాళ గిరిధర్‌ను వేదికపై కూర్చోబెట్టి అధికారికంగా ఆయనతో పింఛన్లు ఇప్పించడం వంటివి చేశారు. స్థానిక ఎమ్మెల్యేను అవమానిస్తూ అధికారులు చేస్తున్న ప్రొటోకాల్ ఉల్లంఘనలకు అంతూపొంతూ లేకుండాపోతోంది. తాజాగా ఆదివారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని చంద్రబాబు నాయుడు కాలనీ, మద్దిరాల కాలనీల్లో కార్పొరేషన్ నిధులతో నిర్మించిన సైడ్ డ్రైన్లు, రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం పంపకపోవడంతో పాటు, టీడీపీ ఇన్చార్జి మద్దాళ గిరిధర్ పేరును శిలాఫలకంపై ఉండ టాన్ని జీర్ణించుకోలేని కొందరు వీటిని ధ్వంసం చేశారు. అయితే ఇదేదో ఎమ్మెల్యేనే చేసినట్లు ఆయనతో పాటు 56 మందిపై పెదకాకాని, గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు కూడా. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఎమ్మెల్యే ముస్తఫాను సైతం అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీనిపై వైఎస్సార్సీపీ జిల్లా నేతలు మర్రి రాజశేఖర్, లేళ్ళ అప్పిరెడ్డి, రావి వెంకటరమణ, కావటి మనోహర్ నాయుడు, కొత్తా చిన్నపురెడ్డి, ఆళ్ళ వీరరాఘవమ్మ ఎస్పీని కలిసేందుకు రాగా ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుతిరిగారు. గత నెలలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కూడా తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇలా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. -
ప్రొటోకాల్ పాటించండి
డ్యూటిప్స్ మహిళలకు ఇప్పుడు ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆఫీసులో చేరే ముందుగానే వీటిని పరిశీలించుకోవాలి. {పొటోకాల్ ప్రకారం తమ పై అధికారులకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమై బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు తప్పకుండా అనుమతి తీసుకోవాలి. అది ఎంత అర్జంటు పనైనా సరే ఇతరుల పని డిస్ట్రబ్ చేసేలా జరిపే సంభాషణ, కాలక్షేపపు ముచ్చట్లలో వీలున్నంత వరకూ పాలు పంచుకోకుండా ఉండాలి. తమని ఇంప్రెస్ చేసేందుకు మగ కొలీగ్స్ చేసే ప్రయత్నాలపై కొంత అవగాహన ఉండాలి. అవి మితి మీరకుండా ముందుగానే కట్ చేయడం అవసరం. -
వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత
అన్నవరం : వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవంలో పంచాయతీ సిబ్బంది ప్రొటోకాల్ పాటించకపోవడంతో వివాదం నెలకొంది. స్థానిక కొత్తపేట వద్ద రూ.23 లక్షలతో నిర్మించిన 90 వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ట్యాంక్‌ను కాకినాడ ఎంపీ తోట నర్సింహం, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పంచాయతీ సిబ్బంది ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఫొటో, పేరు లేకపోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబుకు ఆహ్వానం పలుకుతూ పంచాయతీ సిబ్బంది ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కానీ ఎమ్మెల్యే వరుపులకు ఫ్లెక్సీ ఏర్పాటు చేయలేదు. పంచాయతీ అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఆ పార్టీ శ్రేణులు పంచాయతీ కార్యదర్శి రామ శ్రీనివాస్‌ను నిలదీశారు. ఒక దశలో టీడీపీ, వైఎస్సార్‌కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ పరిస్థితి వచ్చింది. ఈ విషయంపై అధికారులు సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు కార్యకర్తలు పరిస్థితి వివరించారు. దీంతో ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడమేమిటని ప్రశ్నించారు. ఒక దశలో ఆయన పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ లేని వ్యక్తులను కార్యక్రమానికి ఆహ్వానిస్తే తాను బహిష్కరిస్తానని హెచ్చరించారు. అన్నవరం ఎస్సై జగన్మోహన్, సిబ్బంది ఇరువర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో కార్యక్రమానికి వచ్చిన కాకినాడ ఎంపీ తోట నర్సింహం ముందే ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో ఆయన వారిని వారించారు. అనంతరం ఎంపీ సూచన మేరకు టీడీపీ నాయకులు వెనక్కి తగ్గారు. టీడీపీ నేత పర్వత సురేష్ స్వయంగా ఎమ్మెల్యే వరుపుల వద్దకు వెళ్లి ఆయనను కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. జరిగిన విషయాన్ని మర్చిపోవాలని కోరారు. ప్రొటోకాల్ లేని వారిని కార్యక్రమం వద్దకు అనుమతించరాదని ఎమ్మెల్యే అన్నారు. దానికి టీడీపీ నాయకులు అంగీకరించడంతో ఎమ్మెల్యే వరుపుల కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఎంపీ తోట, ఎమ్మెల్యే వరుపుల వాటర్‌ట్యాంక్‌ను ప్రారంభిం చారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు, ఎంపీపీ బద్ది మణి, వైస్ ఎంపీపీ బి.సత్తిబాబు, సర్పంచ్ రాజాల గంగాభవాని పాల్గొన్నారు. మూడు రోడ్లకు శంకుస్థాపన అన్నవరంలోని జన్మభూమి రోడ్డు, సాయిబాబా ఆలయం నుంచి లోపలకు వెళ్లే రోడ్డు, కొత్తపేటలో మరో రోడ్డుకు ఎంపీ తోట నరసింహం శంకు స్థాపన చేశారు. అలాగే సత్యదేవుని నమూనా ఆలయం వరకు వాటర్ పైప్‌లైన్ పనులకు కూడా ఎంపీ తోట నరసింహం శంకుస్థాపన చేశారు. ప్రొటోకాల్ వివాదంపై స్పీకర్‌కు ఫిర్యాదు ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొంతమంది ప్రభుత్వ అధికారులు టీడీపీ తొత్తులుగా మారి ప్రొటోకాల్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు విమర్శించారు. అలాంటి వారిపై తాను శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. గురువారం ఆయన అన్నవరంలో విలేకర్లతో మాట్లాడారు. అన్నవరం వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేనైన తనను ఆహ్వానించారని, కానీ పంచాయతీ కార్యదర్శి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన పేరులేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా లేక పార్టీ కార్యక్రమమా అని ఆయన ప్రశ్నించారు. అధికారులు ప్రొటోకాల్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. ఎమ్మెల్యే వరుపుల వెంట పార్టీ యువజన విభాగం జాయింట్ సెక్రటరీ ముదునూరి మురళీ కృష్ణంరాజు, ఏలేశ్వరం మండల పార్టీ కన్వీనర్ గొల్లపల్లి బుజ్జి, పార్టీ నాయకులు వాసిరెడ్డి జమీలు, అన్నవరం ఎంపీటీసీ సభ్యులు బండారు సత్యగంగాభవానీ, అనుసూరి లక్ష్మి, అన్నవరం టౌన్ అధ్యక్షుడు రాయవరపు భాస్కరరావు, జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి అప్పారావు, సరమర్ల మధుబాబు, బండారు సురేష్, రాయి శ్రీనివాస్, పంచారయతీ వార్డు సభ్యులు ఈర్లు శ్రీనివాస్, నవుడు శ్రీను, వైఎస్సార్సీపీ నాయకులు బలువు రాంబాబు, దడాల సతీష్, బండారు అర్జునరావు, బొబ్బిలి వెంకన్న,పలివెల కొండలరావు, సింగంపల్లి రాము, రాజాన రామరాజు, కొల్లు చిన్నా, పూసర్ల వేంకట రత్నం, ధనలక్ష్మి, కొణతల విజయలక్ష్మి, షేక్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. -
మిలటరీ ప్రోటోకాల్.. నాకు బలాదూర్!
మిలటరీ ప్రోటోకాల్ కఠినమైనదే కావొచ్చు. క్రమశిక్షణతో కూడిన ఆ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం కుదరకపోవచ్చు. కానీ ఈ రెండేళ్ల చిన్నారి తన తండ్రి కోసం ఎన్నో నెలలుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసింది. రోజూ పడుకునేముందు అమ్మా.. నాన్న ఎప్పుడు వస్తాడు అని అడిగి అడిగి ఆలసిపోయింది. ఇక ఎంతమాత్రం ఆగలేకపోయింది. ఒక రోజు కళ్లముందు కనిపించిన కన్నతండ్రిని చూసి.. ఆనందంతో ఎగిరి గంతేసింది. వెంటనే చేతులు చాచి ప్రేమగా పరిగెత్తింది. తోటి సైనికులతో పాటు అటెన్షన్‌గా నిలబడి ఉన్న తండ్రిని ఆలింగనం చేసుకుంది. తండ్రి కూడా ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి, కిందకు వంగి.. ఆత్మీయంగా బిడ్డను హత్తుకుని.. తల నిమిరాడు. ఈ వీడియో ఇప్పుడు లక్షల మంది హృదయాలను హత్తుకుంటోంది. చిన్నారి కేరిస్ ఓజెల్స్ బీ తండ్రి లెప్టినెంట్ డానియల్ ఓజెల్స్ బీ అమెరికా సైన్యంలో పనిచేస్తున్నాడు. 300 ఫోర్ట్ కార్సన్ సైనికుల్లో భాగమైన ఆయన గత తొమ్మిది నెలలు మధ్యప్రాచ్యంలో పనిచేశారు. అమెరికా సైనిక ప్రోటోకాల్ ప్రకారం విదేశాల్లో పనిచేసి వచ్చిన సైనికులకు కమాండర్ అధికారిక స్వాగతం పలకాలి. ఇందులోభాగంగా కొలరాడోలో డానియెల్ బృందానికి సైనిక లాంఛనాలతో స్వాగత కార్యక్రమం నిర్వహిస్తుండగా.. తండ్రిని చూసిన ఆనందంలో మధ్యలోనే చిన్నారి కేరిస్ పరిగెత్తుకుంటూ వెళ్లింది. అమెరికా జెండాను తలపించే దుస్తులు వేసుకున్న కేరిస్.. సైనిక ప్రోటోకాల్ కు అంతరాయం కలిగిస్తూ తండ్రిని ఆత్మీయంగా హత్తుకుంది. ఈ దృశ్యాన్ని ఫేస్బుక్లో ఇప్పటికే 40 లక్షల మందికి పైగా వీక్షించారు. 'తను ఎంతో సంతోషపడింది. నన్ను గుర్తుపట్టగానే.. వెంటనే పరిగెత్తుకువచ్చింది. వద్దు అని నేను కూడా చెప్పలేకపోయాను' అని తండ్రి డానియెల్ ఆ తర్వాత మీడియాకు చెప్పారు. -
ప్రొటోకాల్ కష్టాలు
మంత్రులు, వీఐపీల ఖర్చులు తడిసిమోపెడు కీలక శాఖల అధికారులపైనే భారం జనం నుంచి వసూళ్లకుపాల్పడుతున్న వైనం నెలకు రూ.20లక్షలపైనే అనధికారిక ఖర్చు మంత్రులు, వీఐపీల ప్రొటోకాల్ ఖర్చులు పెనుభారంగా పరిణమిస్తున్నాయి. ఇటీవల నగరానికి వీఐపీల తాకిడి పెరగడంతో నెలకు రూ.20లక్షల పైనే అనధికారికంగా ఖర్చవుతోంది. ఒక్కో మంత్రికి రోజుకు రూ.10వేల పైబడే ఖర్చు చేస్తున్నారు. విజయవాడ : నగరానికి ప్రొటోకాల్ తాకిడి ఎక్కువైంది. ముఖ్యమంత్రి మొదలుకుని రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారుల వరకు అందరూ నగరంలోనే ఎక్కువగా ఉండటంతో ప్రొటోకాల్ ఖర్చులు పెనుభారంగా పరిణమిస్తున్నాయి. ఉన్నతాధికారుల సూచనలతో రెవెన్యూ విభాగంలోని అధికారులు ప్రొటోకాల్‌ను విభజించి సంబంధిత శాఖల అధికారులకే ఆ బాధ్యతలు, ఖర్చులు అప్పగిస్తున్నారు. ఏ శాఖతో సంబంధం లేని కొందరు వీఐపీల ఖర్చును ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. దీంతో జిల్లాలో నెలకు ప్రొటోకాల్ పేరిట సుమారు రూ.20లక్షలపైనే ఖర్చవుతోంది. ఆయా శాఖలపైనే భారం వ్యక్తిగత పర్యటనల నుంచి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం వరకూ వివిధ కార్యక్రమాల నిమిత్తం నెలకు సగటున 50 మందికి పైగా వీఐపీలు నగరానికి వస్తున్నారు. ఇవికాకుండా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి రోజూ మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు వస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రొటోకాల్ ఖర్చు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. వివిధ శాఖల మంత్రులు వస్తే హోటల్ బస నుంచి రవాణా సౌకర్యం వరకు అన్నీ ఆయా శాఖల అధికారులే చూసుకుంటారు. ఒక్కో మంత్రికి రోజుకు రూ.10వేల ఖర్చు ప్రొటోకాల్ బాధ్యతలు రెవెన్యూ సిబ్బందే పర్యవేక్షిస్తున్నారు. పూర్తి బాధ్యతలన్నీ తహశీల్దార్వే. అమాత్యులు, వారి బంధువుల బస, భోజన, ఫలహారాలను రోజుకు రూ.10వేల వరకు ఖర్చవుతోంది. ఇలా నెలకు ఒక్కో డిపార్టుమెంట్‌కు రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు ఖర్చవుతోందని చెబుతున్నారు. మరి.. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోందంటే.. జనంపైనే భారం ప్రొటోకాల్ ఖర్చులంటూ కొన్ని శాఖల్లో అధికారులు, సిబ్బంది.. జనాన్ని బాదేస్తున్నారు. అమాత్యుల ఖర్చులకు రెవెన్యూ, ఎక్సైజ్, విజిలెన్స్, రవాణా, వాణిజ్యపన్నుల శాఖ అధికారులు తమ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి నుంచి ఈ సొమ్ము వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది ప్రొటోకాల్ ఖర్చులంటూ ప్రతి కాగితానికీ డబ్బు వసూలు చేస్తున్నారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ అధికారులు కొరడా ఝళిపించి మరీ వసూలు చేస్తున్నట్లు వ్యాపారులు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీస్, రవాణా శాఖ అధికారులు కూడా లారీ యజమానులు, వాహనచోదకుల నుంచి వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వంతులవారీగా తమకు వచ్చే లంచాల నుంచి ఖర్చు చేస్తున్నారు. సమాచార పౌరసంబంధాలు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఉద్యానవన తదితర శాఖల్లో పనిచేసే కొందరు అధికారులు, సిబ్బంది బడ్జెట్ లేక అప్పులుచేసి ఖర్చు చేస్తున్నారు. -
ప్రొటోకాల్ పాటించటం లేదంటూ ఎమ్మెల్యే ఆగ్రహం
రాజేంద్రనగర్ : ప్రొటోకాల్ నిబంధనలను సక్రమంగా పాటించడం లేదంటూ ఉన్నతాధికారులపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మండిపడ్డారు. మంగళవారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితోపాటు ప్రకాష్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానికంగా రూ.82 లక్షలతో నిర్మించిన కొత్త సీసీరోడ్డును వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు పేరుకు బదులు ఈ కార్యక్రమంతో సంబంధం లేని వారి పేరు శిలఫలకంపై ఉండటంతో ప్రకాష్ గౌడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ నిబంధనలు పాటించడం లేదంటూ ఉన్నతాధికారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సమానంగా చూసేవారు
జ్ఞాపకాలను నెమరువేసుకున్న రాష్ట్రపతిభవన్ సిబ్బంది న్యూఢిల్లీ: సువిశాలమైన, 340 గదులున్న రాష్ట్రపతి భవన్లో కలాం ఐదేళ్లు ఉన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో అక్కడి సిబ్బందిపై చెరగని ముద్ర వేశారు. తాను దేశ ప్రథమ పౌరుడు... అయినా అటెండర్ నుంచి మొదలుకొని అందరినీ సమానంగా చూడటం కలాం గొప్పతనం. నిజానికి రాష్ట్రపతి భవన్లో ప్రొటోకాల్ చాలా పకడ్బందీగా అమలవుతుంది. ఎవరూ రాష్ట్రపతికి ఎదురుపడకూడదు. ఆయన పిలిస్తే తప్పితే... ఆయనున్న వైపు వెళ్లకూడదు. ఏది ఉన్నా సెక్రటరీలు చెబుతారు. మిగతా సిబ్బంది వాళ్లు చెప్పింది చేయాలంతే. అయితే కలాం ఇవేవీ పట్టించుకునేవారు కాదు. భద్రతా వలయాన్ని దాటుకొని సిబ్బంది క్వార్టర్ల వైపు వెళ్లేవారు.పిల్లలతో ముచ్చటించేవారు. ఆయన హయాంలో రాష్ట్రపతి భవన్లో పిల్లల సందడే ఎక్కువ. ఎంతటి వీవీఐపీలు ఉన్నా సరే... కలాం చిన్నారుల కోసం సమయం కేటాయించేవారు. ఫలానాది వండమని చెప్పలేదు.. ‘కలాం దక్షిణాది ఆహారాన్ని ఇష్టపడేవారు. అయితే ఫలానా వంటకం చేయమని ఐదేళ్లలో ఆయన ఏ రోజూ కోరలేదు. ఆయన భోజనంలో రెండు వంటకాలే ఉండేవి. ఎప్పుడైనా మూడో డిష్ సిద్ధం చేస్తే... ఏంటీ విశేషం... ఈ రోజు ఏదైనా పండగా?‘ అని అడిగేవారని రాష్ట్రపతి భవన్లో 31 ఏళ్లుగా వంటమనిషిగా పనిచేస్తున్న అహ్మద్ చెప్పారు. ‘వంటకాల్లో ఉప్పు ఎక్కువైనా ఏనాడు పల్లెత్తు మాట అనలేదు. పర్యటనలకు వెళ్లినపుడు ఎంత బిజీగా ఉన్నా... సిబ్బంది అంతా భోజనం చేశారా అని కనుక్కొనేవారు’ అని చెప్పారు. -
పుష్కర క్షోభ
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా ఉంది ప్రభుత్వోద్యోగుల పరిస్థితి. గోదావరి పుష్కర మహాపర్వం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా.. రాష్ర్ట మంత్రులు.. ఉన్నతాధికారులు.. మొత్తం రాష్ర్ట పాలనా యంత్రాంగ మంతా రాజమండ్రిలోనే రోజుల తరబడి కొలువుదీరింది. అమాత్యులు, పెద్ద దొరలు ఉన్నారంటే మాటలా..! ప్రొటోకాల్ ప్రకారం వారికి సకల మర్యాదలూ చేయాల్సిందే! వారికి, వారి మంది మార్బలానికి టిఫిన్లు, భోజనాలు, మినరల్ వాటర్, ఏసీ గదులు.. వారి పర్యటనలకు కావాల్సి వాహనాలు.. ఇలా అన్నీ దిగువస్థాయి అధికారులే సమకూర్చాలి. వీటన్నింటికీ అయిన ఖర్చును వారే భరించాల్సి వచ్చింది. పన్నెండు రోజుల పండగ ముగిసిన తరువాత లెక్కలు చూసుకుంటే.. తమకు వేలల్లో చేతిచమురు వదిలిపోయిందని.. ఈ మర్యాదల బాధ్యతలు చూసిన ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఆల్కాట్‌తోట (రాజమండ్రి) :పుష్కరాల పేరు చెప్పి డివిజన్ స్థాయి ఉద్యోగులకు చేతిచమురు బాగానే వదిలిపోయింది. ప్రొటోకాల్ ప్రకారం మంత్రులకు, ఉన్నతాధికారులకు అవసరమైన సేవలు అందించేందుకు వేలాది రూపాయలు మంచినీళ్లప్రాయంలా ఖర్చయిపోయాయని ఉద్యోగులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమా అని 12 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా దాదాపు రాజమండ్రిలోనే బస చేసింది. దీంతో ఇక్కడకు వచ్చే రాష్ట్ర, జిల్లా స్థాయి ఉద్యోగులకు వసతి, ఇతర ఏర్పాట్లు చూడాల్సిన బాధ్యత ఆయా శాఖల డివిజన్ స్థాయి సిబ్బందిపై పడింది. వచ్చే పెద్దల కోసం హోటళ్లు, రిసార్ట్లు, ప్రైవేటు ఫామ్‌హౌస్‌లు, అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లు.. ఇలా దాదాపు అందుబాటులో ఉన్న అన్ని రూములూ ముందుగానే సిద్ధం చేశారు. అయితే పుష్కరాలకు లక్షలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ఆయా రూముల అద్దెలు ఆకాశాన్నంటాయి. ఒక్కో రూముకు రోజుకు రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకూ చెల్లించాల్సి వచ్చింది. దీంతోపాటు రూముల్లో బస చేసేవారికి టిఫిన్లు, భోజనాలు సమకూర్చేందుకు అదనంగా ఖర్చయ్యాయి. అంతేకాదు.. ఆయా పెద్దల కుటుంబ సభ్యులను గోదావరి స్నానానికి తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా కార్లు కూడా అందుబాటులో ఉంచారు. ఒక్కో కారుకు రోజుకు రూ.2500 వరకూ చెల్లించాల్సి వచ్చింది. భక్తుల రద్దీ అధికంగా ఉన్న రోజుల్లోనైతే వాహనాల కోసం రూ.4 వేలు చెల్లించిన దాఖలాలు కూడా ఉన్నాయి. వచ్చిందేమో ఉన్నతాధికారులాయె. వారు చెప్పింది చెప్పినట్లు చేయకపోతే ఏం కొంపలంటుకుంటాయోనన్న ఆందోళనతో సొంత డబ్బులు వెచ్చించి మరీ ఏర్పాట్లు చేసేశారు. ఇలా కింది స్థాయి ఉద్యోగులు సొంతంగా వెచ్చించిన సొమ్ము దాదాపు రూ.4 కోట్ల వరకూ ఉంటుందని ఒక అంచనా. పెట్టిన ఖర్చు వేలల్లో ఉండడంతో కింది స్థాయి సిబ్బంది ఎటూ పాలుపోని పరిస్థితుల్లో పడ్డారు. రాజమండ్రి డివిజన్ పరిధిలోని దాదాపు అన్ని శాఖల ఉద్యోగులదీ ఇదే దుస్థితి. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వైద్యం, వ్యవసాయం, దేవాదాయ, విద్య, పోలీసు శాఖల్లో ఖర్చులు అధికమైనట్లు తెలిసింది. పుష్కరాలు ప్రారంభమైన రెండో రోజు రాజమండ్రి వస్తానన్న ఓ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి కోసం తెల్లవారుజామున మూడు గంటల వరకూ రూము వద్ద తాళాలు పట్టుకుని డివిజన్ స్థాయిలోని ఒక మహిళా ఉద్యోగితోపాటు పలువురు వేచి చూడాల్సి వచ్చింది. ఆయన రూములోకి వెళ్లాక ఇంటికి వెళ్లిన సదరు ఉద్యోగిని మళ్లీ ఉదయం ఆరు గంటలకల్లా అక్కడికి రావాల్సి వచ్చింది. మర్నాడు మళ్లీ ఇంకొందరు ఉన్నతాధికారులు వస్తున్నారని సమాచారం రావడంతో ఏదైతే అదే అయ్యిందిలే అని సదరు ఉద్యోగి సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. జిల్లా స్థాయి అధికారి ఒకరు తన చెల్లెలు పుష్కర స్నానానికి వస్తున్నారని చెప్పడంతో కింది స్థాయి సిబ్బంది కాకినాడకు కారు పంపించి అక్కడ నుంచి ఆవిడను తీసుకువచ్చి వీఐపీ ఘాట్‌లో స్నానం చేసేవరకూ వెంటే ఉండి సాగనంపాల్సి వచ్చింది. రాష్ట్రమంత్రులతో వచ్చిన పర్సనల్ సెక్రటరీ, గన్‌మెన్‌కు మంత్రులతో సమానంగా సేవలు అందించాల్సిన పరిస్థితి అధికారులపై పడింది. మంత్రుల సిబ్బంది కావడంతో వారు చెప్పిన మెనూ ప్రకారమే భోజనాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రొటోకాల్ అంశంతో బిల్లు పెట్టినా అవి పూర్తిగా ఇచ్చే పరిస్థితి కూడా కనిపించకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
ఎవడబ్బ సొమ్మని..!
అమాత్యుల ప్రొటోకాల్ ఖర్చుల కోసం అధికారుల అడ్డదారులు లంచం డబ్బుతో మంత్రులకు ఏర్పాట్లు ! ఏసీబీకి పట్టుబడ్డ ఐసీడీఎస్ ఉద్యోగిని వెల్లడి ప్రభుత్వం నుంచి చాలీచాలని నిధులు చర్చనీయాంశమైన ప్రొటోకాల్ నీతి! ఆనాడు రామదాసు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో శ్రీరామచంద్రుడికి గుడి కట్టించి తన స్వామి భక్తిని చాటుకున్నాడు.. ఆనక చెరసాల పాలయ్యాడు. ఇప్పుడు మన అధికారులు అమాత్యులపై తమ స్వామిభక్తిని చాటుకుంటున్నారు. ప్రొటోకాల్ ఖర్చుల పేరుతో మంత్రివర్యుల విందు విలాసాలకు, స్టార్ హోటల్ సౌకర్యాలకు, వారి మందీమార్బలం కోసం అవసరమైనంతా ఖర్చు చేస్తున్నారు. దీనికోసం లంచాలకు తెరతీస్తున్నారు. చివరికి జైలుపాలవుతున్నారు. తాజాగా విజయవాడలో ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్ ఉద్యోగిని ఉదంతంతో ఈ విషయం బాహాటమైంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ : జిల్లాలో ముగ్గురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు. పక్క జిల్లా గుంటూరులో మరో ఇద్దరున్నారు. వీరుగాక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిత్యం విజయవాడ, రాజధాని ప్రాంతంలోనే పర్యటిస్తున్నారు. అంటే ఆరుగురు మంత్రులు వారంలో నాలుగు రోజులు విజయవాడలోనే ఉంటున్నారు. ఐదుగురు మంత్రులకు హోటళ్లలో గదులు బుక్ చేస్తున్నారు. స్టార్ హోటళ్లు కావడంతో బిల్లులు కట్టలేక ఆయా శాఖల వారు నానా అవస్థలు పడుతున్నారు. అన్ని హంగులూ ఉండాల్సిందే... ఎక్సైజ్ శాఖ మంత్రి విజయవాడ వచ్చారంటే అన్ని హంగులూ ఉండాల్సిందే. గెస్ట్‌హౌస్‌లో తగిన సౌకర్యాలు ఉండటం లేదని చాలా సార్లు హోటల్లో గదులు బుక్ చేస్తున్నారు. సాధారణంగా డబ్బు సంపాదించే శాఖ కావడం, మద్యం వ్యాపారులు నిత్యం మంత్రితో టచ్‌లో ఉండటంతో ఖర్చులకు వెనకాడటం లేదు. పైగా నగరంలో మద్యం సిండికేట్ వారు ఎంత పెంచుకోవాలంటే అంత పెంచి అమ్మకాలు చేసుకునే సౌకర్యం ఎక్సైజ్ శాఖ కల్పించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు కూడా నిత్యం ఇక్కడే ఉంటుంటారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కార్యాలయం ఏర్పాటుచేసినా అది పేరుకు మాత్రమేనని చెప్పవచ్చు. సమావేశాల ఖర్చులన్నీ అధికారుల పైనే... ఇక జల వనరుల శాఖ మంత్రి కూడా గెస్ట్‌హౌస్‌లో ఉంటుంటారు. ఇరిగేషన్ కార్యాలయంలో పలుమార్లు సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఖర్చులన్నీ ఇరిగేషన్ శాఖ పైనే పడుతున్నాయి. ఈ మంత్రి ప్రొటోకాల్‌కే నెలకు కనీసంగా ఆరు లక్షల రూపాయలకు పైగా ఖర్చవుతున్నట్లు ఆ శాఖ ఉద్యోగులు కొందరు తెలిపారు. రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ప్రకాశం జిల్లా నుంచి వారంలో ఒకసారి తప్పకుండా వస్తుంటారు. ఆయన ప్రొటోకాల్ బిల్లు కూడా తడిసి మోపెడవుతోందని అధికారులు చెబుతున్నారు. వాణిజ్య పన్నుల శాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి వచ్చినప్పుడు ఇక చెప్పేదేముంది వారి హంగామానే వేరు. ఆ శాఖల్లో తీసుకునే పై ఫీజుల నుంచే ప్రొటోకాల్‌కు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో మంత్రికి కనీసంగా నెలకు రెండు లక్షలు ప్రొటోకాల్ ఖర్చులు అవుతున్నట్లు అధికారుల సమాచారం. ప్రభుత్వం ఇచ్చేది నామినల్... ప్రొటోకాల్ ఖర్చుల కోసం ప్రభుత్వం నామినల్‌గా ఇస్తుంది. వాహనాల ఖర్చు, మంత్రి, గన్మెన్ల భోజనం ఖర్చులు మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. మరి వారు వచ్చినప్పుడు గేట్‌వే హోటల్లో సమావేశం పెట్టారంటే కనీసంగానైనా లక్ష రూపాయల బిల్లు చెల్లించాల్సిందే. మంత్రితో పాటు వచ్చే మందీమార్బలానికి కూడా సంబంధిత శాఖ వారే ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. ఇటీవల జిల్లా కలెక్టర్‌కు రూ.8 లక్షల ప్రొటోకాల్ సొమ్ము వచ్చింది. కానీ బిల్లులు పెడితే అవి ఏ మూలకూ సరిపోవని ఒక ఉన్నతాధికారి తెలిపారు. విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం, గుడివాడ, నూజివీడు డివిజన్లకూ ప్రొటోకాల్ సొమ్ము ఇస్తారు. ఒక్క విజయవాడకే ఎక్కువ సొమ్ము కేటాయిస్తారు. ఇవి కాకుండా గన్నవరం తహశీల్దార్‌కు ప్రత్యేకంగా ప్రొటోకాల్ డ్యూటీ ఉంటుంది. అదీ నెలకు రూ.50 వేలకు మించడం లేదు. అక్కడ అయ్యే ఖర్చులు మాత్రం నెలకు కనీసంగానైనా రూ.3 లక్షల వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. విమానాశ్రయం ఉండటంతో నిత్యం మంత్రులే కాకుండా ఉన్నతాధికారులు, కేంద్ర మంత్రులు, అధికారులు వస్తుంటారు. వారి ఖర్చంతా తహశీల్దార్ కార్యాలయం భరించాల్సి ఉంటుంది. మామూళ్లకు తెరతీసిన శాఖలు ప్రొటోకాల్ ఖర్చుల పేరుతో పలు శాఖలు దండుకునే కార్యక్రమాన్ని చేపట్టాయి. కొన్ని శాఖల వారు ఏకంగా మంత్రుల పేర్లు చెప్పి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. వీరు ప్రత్యేకించి డబ్బులు అడగకుండా నెల కాగానే వారే పువ్వుల్లో పెట్టి ఇవ్వాలి. లేకుంటే తగిన విధంగా అధికారులు స్పందిస్తారు. సీఎం సభలు, పర్యటన ఖర్చులు మినహా ఇతర ప్రొటోకాల్ ఖర్చుల వ్యవహారం ఆయా శాఖల వారే చూడటంతో పరిస్థితి దారుణంగా ఉంది. సాధారణంగా ప్రొటోకాల్ ఖర్చులు రెవెన్యూ వారు చూడాలి. అయితే పలు శాఖల మంత్రులు నిత్యం వస్తుండటంతో రెవెన్యూ వారు చేతులెత్తేశారు. దాంతో ఆయా శాఖల వారే స్టార్ హోటళ్లలో రూముల నుంచి వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చూస్తున్నారు. పది నెలల క్రితం విజయవాడ గేట్‌వేలో సీఎం ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశం సొమ్ము వారం రోజుల క్రితం వచ్చింది. ఇలా నెలల తరబడి ఆగే పరిస్థితుల్లో వ్యాపారులు లేరు. దీంతో ఆయా శాఖల వారికి వడ్డన తప్పడం లేదు. ప్రొటోకాల్ రాష్ట్ర కార్యాలయం కూడా హైదరాబాద్‌లోనే ఉంది. నూతన రాజధానికి వస్తే కొంతవరకు సమస్య తీరుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది. -
ప్రొటోకాల్ పోటు
రాజధాని స్థాయిలో విశాఖకు వీఐపీల తాకిడి ఖర్చుల భారంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి {పైవేటు హోటళ్లకు కోట్లల్లో పేరుకుపోయిన బకాయిలు రాష్ర్ట విభజన తర్వాత నవ్యాంధ్రలో విశాఖ నగరానికి ఎనలేని ప్రాధాన్యం పెరిగింది. పేరుకు మంగళగిరి తాత్కాలిక రాజధాని అయినప్పటికీ కార్యకలాపాలన్నీ విశాఖలోనే జరుగుతున్నాయి. కేబినెట్ మీటింగ్‌ల నుంచి అంతర్జాతీయ సదస్సుల వరకు అన్నింటికి ఈ పోర్టు సిటీయే వేదికవుతోంది. వేలకోట్ల విలువైన పరిశ్రమల స్థాపనకు అవగాహన ఒప్పందాలన్నీ ఇక్కడే సాగుతున్నాయి. వీఐపీల పర్యటనల కోసం పెట్టే ప్రోటోకాల్ ఖర్చులు ఇక్కడి అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది. విశాఖపట్నం : విశాఖకు వీఐపీల తాకిడి విపరీతంగా పెరగడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హద్‌హుద్ తర్వాత వీఐపీలే కాదు..దేశ విదేశాలకు చెందిన ముఖ్యల రాక బాగా పెరిగిపోయింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలేని నెలంటూ లేదనే చెప్పాలి. ఒక్కో నెలలో రెండు మూడు సార్లు వస్తున్నారు. విశాఖలో ప్రభుత్వ అతిథి గృహం, ఏపీ టూరిజం గెస్ట్‌హౌస్‌లు ఉన్నాయి. అయినా సీఎంతో సహా వీరందరికీ స్టార్ హోటళ్లే కావాలి. నోవటల్ అయితే సీఎంకు క్యాంపుకార్యాలయంగా మారిపోయిందనే చెప్పాలి. అలాగే ప్రోటోకాల్ వాహనాలు మూలనపడ్డాయి. వాటిని బాగు చేయించుకోవడం కాని, కొత్తవి కొనుగోలు చేయడం కానీచేయరు..వచ్చిన ప్రతీ సారివేలకు వేలు పోసి ప్రైవేటు ఏసీ వాహనాలే కావాలి. వీరి పర్యటనల పేరుతో స్టార్ హోటళ్లను, ప్రైవేటు ట్రావల్ ఏజెన్సీలను మేపుతున్నారనే చెప్పాలి. బకాయిలు కోట్లల్లో...వచ్చేది లక్షల్లో సీఎం గత పది నెలల్లో అధికారికంగా 23 సార్లు జిల్లాకు వచ్చారు. ఒకసారి వచ్చివెళితేరూ.30లక్షలు ఖర్చవుతుందని అంచనా. అదే సీఎం పర్యటనలో కాస్తా భారీ కార్యక్రమం ఏదైనా ఉంటే ఖర్చు రూ. కోటి దాటిపోతోంది. అంటే సరాసరిన ట్రిప్పుడు సుమారుగా రూ.50లక్షల చొప్పున లెక్కేసుకున్నా సుమారు రూ.11.5కోట్ల పైమాటే. ఇక వరల్డ్ బ్యాంకు, ఆసియా బ్యాంకు, కేంద్ర బృందాలు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, గవర్నర్లు, కేంద్ర రాష్ర్ట మంత్రులు, సుప్రీం, హైకోర్టు జడ్జిలు ఇలా వీఐపీల పర్యటనలు లెక్కకు మించేఉన్నాయి. వీటిన్నింటికి ప్రోటోకాల్ ఖర్చులు లెక్కలేస్తే రూ.15-20 కోట్ల పైబడే ఉంటోంది. సీఎం పర్యటనల కోసం ఒక్క బాలాజీ సప్లయిర్స్కే అక్షరాల రూ.40 లక్షలు వరకు అధికారులు చెల్లించాల్సి ఉంది. రూ.20లక్షల వరకు హోటళ్లకు, కాన్వాయ్ వాహనాల కోసం ట్రావెల్ ఏజెంట్స్‌కు 35లక్షల వరకు చెల్లించాలి. అలాగే ఇతర ఖర్చులుగా మరో రూ.50లక్షలవరకు బిల్లులు బకాయిలున్నాయి. వీఐపీల పర్యటనల కోసం హోటళ్లు, కాన్వాయ్, ఇతర ఖర్చుల కింద ఇప్పటి వరకు సుమారు రూ.40లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ విధంగా అధికారికంగా రెండుకోట్లకు పైగానే బకాయిలున్నాయి. 2014-15 సంవత్సరానికి ప్రోటోకాల్ ఖర్చుకు జిల్లాకు రూ.34లక్షలు మంజూరైతే రూ.22లక్షలు మాత్రమే డ్రా చేసుకోగలిగారు. మిగిలిన రూ.13లక్షలు ఆంక్షలు పుణ్యామని వెనక్కి మళ్లిపోయాయి. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.12లక్షలు మాత్రమే మజూరయ్యాయి. ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. వీఐపీల తాకిడీ ఇంత తీవ్రంగా ఉంటే కలెక్టరేట్లో మాత్రం ప్రత్యేకంగా ప్రోటోకాల్ విభాగమంటూ లేని దుస్థితి నెలకొంది. రాజధాని స్థాయిలో వీఐపీల తాకిడి ఉన్న విశాఖలో ప్రత్యేకంగా డివిజనల్ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేకంగా ప్రోటోకాల్ విభాగం ఉండాల్సి ఉన్నప్పటికీ విశాఖలో మాత్రం ఆ పరిస్థితి లేదు. -
కేశినేని నానికి మళ్లీ కోపమొచ్చింది
ప్రొటోకాల్‌కు నీళ్లొదిలిన అధికారులు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారనే విమర్శలు ముఖ్యమంత్రి హెచ్చరికలనూ పట్టించుకోని అధికారులు విజయవాడ : ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)కు మళ్లీ కోపం వచ్చింది. జిల్లా అధికారుల వ్యవహార తీరుపై ఇప్పటికే ఆయన పలుమార్లు బహిరంగంగా విమర్శలు చేశారు. అయినా అధికారులు ఏమాత్రమూ మారడం లేదు. ప్రజాప్రతినిధులను అవమానిస్తూనే ఉన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు ఆ అవమానాలను దిగమింగి, ముందుకెళ్తున్నారు. ఎంపీ కేశినేని నాని మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా అధికారులను నిలదీస్తూనే ఉన్నారు. ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వంటి ముఖ్యులు వచ్చినప్పుడు కూడా ప్రొటోకాల్ పాటించకుండా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై అధికార పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలోకి కొంతమంది కీలక వ్యక్తుల సూచనల మేరకు అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తూన్నారన్న అనుమానాలను ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, జేసీపై కేశినేని సీరియస్ మచిలీపట్నంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ కమిటీలో కో కన్వీనర్‌గా ఉన్న ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)ను ప్రొటోకాల్ ప్రకారం వేదిక పైకి ఆహ్వానించలేదు. ఆయనకు సీటు కూడా కేటాయించలేదు. ఈ సమావేశంలో కలెక్టర్ అహ్మద్ బాబు.ఎ, జాయిట్ కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు. కన్వీనర్ ఎంపీ కొనకళ్ల నారాయణ తరువాత కో- కన్వీనర్‌ను పిలవాలి. అయితే ఆయన్ను పక్కన పెట్టిన అధికారులు మంత్రులు, డెప్యూటీ స్పీకర్‌ను పిలిచారు. ఆ తరువాత జరిగిన పొరపాటును గుర్తించిన అధికారులు నానిని వేదికపైకి ఆహ్వానించేసరికి ఆయన సీరియస్సయ్యారు. వాస్తవంగా ఈ సమావేశానికి కన్వీనర్, కో-కన్వీనర్, కలెక్టర్ మాత్రమే నిర్వహించాలి. అయితే కో-కన్వీనర్‌నైన తనను చివర్లో వేదికపైకి ఆహ్వానించడంతో నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఆయనను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ బతిమలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రొటోకాల్‌కు నీళ్లు విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన తెప్పోత్సవంలోనూ అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. ఎంపీ, ఎమ్మెల్యేలను పక్కన పెట్టి సబ్‌కలెక్టర్ నాగలక్ష్మి ప్రొటోకాల్ లిస్టు తయారు చేశారు. దీంతో ఆగ్రహించిన ఎంపీ కేశినేని నాని ప్రొటోకాల్ వివరాలు ఇవ్వాలంటూ ఏకంగా కలెక్టర్‌కు లేఖ రాశారు. దీంతో కలెక్టర్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఎంపీలు, ఎమ్మెల్యేలను అధికారులు బేఖాతర్ చేస్తూనే ఉండటంతో విజయవాడ ఆటోనగర్‌లోని జరిగిన ఒక సమావేశంలో ఎంపీ కేశినేని నాని సీరియస్ అయ్యారు. కేవలం మంత్రులకే ప్రాధాన్యం ఇస్తూ ఎంపీ, ఎమ్మెల్యేలను అవమానించడంపై నిలదీశారు. అదే సమావేశంలో నగర పోలీసులు అమలు చేసిన నైట్ డామినేషన్ పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశం చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది. ఎమ్మెల్యేల సూచనలను కలెక్టర్ అహ్మద్ బాబు.ఎ బేఖాతర్ చేయడంపై ఆగ్రహించిన సీనియర్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ తదితరులు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇటీవల ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కూడా తరచుగా అధికారులను హెచ్చరిస్తున్నా వారి తీరు మారకపోవడంపై ప్రజాప్రతినిధులు ఆగ్రహంతో ఉన్నారు. -
‘బాబు’ పర్యటనకు స్కూల్ బస్సులు
జిల్లాలో 491 వాహనాలు సమకూర్చిన అధికారులు అప్పుగా డీజిల్ పోయిస్తున్న యంత్రాంగం పేరుకున్న రూ.40 లక్షల బకాయిలు చిత్తూరు (అర్బన్): రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ప్రోటోకాల్ కోసం కాన్వాయ్ వాహనాలు.. బస్సులు, ఇతర వాహనాలు సమకూర్చలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు ఈ సారి చంద్రబాబు పర్యటనకు పాఠశాలల బస్సులు సైతం తీసేసుకోవాలని జిల్లా అధికారి ఒకరు ఆదేశాలు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. నీరు-మీరు పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం జిల్లాకు వస్తున్నారు. సీఎం బహిరంగ సభకు జనాన్ని తరలించడానికి జిల్లా యంత్రాంగం చేస్తున్న ఏర్పాట్లు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఇటీవల రాష్ట్రంలో పాఠశాలల బస్సులు వరుసగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. పలువురు చిన్నారులు ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై బాహటంగానే స్పందించిన ప్రభుత్వం పాఠశాలల బస్సులు పిల్లల రవాణాకు తప్ప మరే పనికి ఉపయోగించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ బాబు పర్యటనలో ఈ నిబంధనల్ని పూర్తీగా తుంగలో తొక్కిన యంత్రాంగం జిల్లాలో 491 బస్సుల్ని సీఎం పర్యటనకు సిద్ధం చేసింది. వీటిలో వంద ప్రైవేటు బస్సులు, 300 వరకు పాఠశాలలకు చెందిన బస్సులు తీసుకున్నారు. నిబంధనల్ని పాటించాల్సిన అధికారులే పిల్లల బస్సుల్ని ఇలా బలవంతంగా లాక్కుంటూ పెద్దల సభలకు ఉపయోగించడం ఎంత వరకు సమంజసమని బస్సుల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. డబ్బులేవీ...? సీఎం పర్యటనకు సమకూర్చిన బస్సులకు ముందుగా అడ్వాన్సులు ఇవ్వాలి. ఇందు కోసం కలెక్టర్ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కో బస్సుకు కనీసం వంద లీటర్ల డీజి లు, బస్సుకు అద్దె, డ్రైవర్ బత్తాతో పాటు కిలో మీటరకు కొంత చొప్పున డబ్బులు ఇవ్వాలి. కానీ గత రెండుసార్లు జిల్లాలో జరిగి న సీఎం పర్యటనకు డీజిల్ కోసం ఎలాంటి అడ్వాన్సులు ఇవ్వలేదు. రవాణాశాఖ అధికారులు పెట్రోలు బంకు యజమానుల్ని బతిమిలాడుకుని అప్పు కింద డీజిలు పోయించారు. జిల్లా యం త్రాంగం ఆర్నెళ్ల తరువాత డీజిల్ బిల్లు విడుదల చేస్తే అప్పుడు బకాయిలు చెల్లించారు. తాజాగా సీఎం పర్యటనకు స్వాధీనం చేసుకున్న ఏ ఒక్క వాహనానికి లీటర్ డీజిల్ పోయించడం తమవల్ల కాదని, రవాణాశాఖ అధికారులు చేతులెత్తేశారు. దీంతో జిల్లా పౌరసరఫరాల శాఖ కల్పించుకుని అప్పుగా డీజిల్ పోయిం చడానికి ముందుకు వచ్చింది. ఇక గత ఏడాది కాలంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాన్వాయ్ కోసం అద్దెకు ఇచ్చిన వాహనాలకు, ప్రస్తుత ముఖ్యమంత్రి పర్యటనకు కేటాయించిన కాన్వాయ్‌ల అద్దెల బకాయిలు మొత్తం వెరసి రూ.40 లక్షలకు చేరుకుంది. ఫలితంగా ముఖ్యంత్రి, వీఐపీ కార్యక్రమాలకు వాహనాలివ్వాలంటేనే ట్రావెల్స్ నిర్వాహకులు భయపడుతున్నారు. వాహనాలను ఇష్టానుసారంగా వాడుకోవడంతో పాటు వాటిని గుల్ల చేసి చేతికివ్వడం, అద్దెలు చెల్లించకపోవడం, డ్రైవర్లకు వేతనాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మంత్రి పచ్చచొక్కాల వెంట నడవటం బాధాకరం
సమస్యలు వివరించేందుకు వచ్చిన ఎమ్మెల్యేలను వదిలిపెట్టి మంత్రి పచ్చచొక్కాలను వెంట పెట్టుకుని ప్రొటోకాల్ పాటించకుండా వెళ్లిపోవడం బాధాకర ం. జిల్లాకు వచ్చిన మంత్రికి రైతుల కష్టాలను తెలపాలనుకున్నాం. అయితే మంత్రి ఎమ్మెల్యేలను వదిలి పచ్చచొక్కాల వెంట వెళ్లారు. అభివృద్ధి కోసం పార్టీల రహితంగా పనిచేస్తామన్న ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. ప్రజల కోసం పోరాడటానికి వెనుకాడబోము. జరుగుతున్న సంఘటనలను ప్రజలు చూస్తూనే ఉన్నారు. వారే తగిన బుద్ధి చెబుతారు. ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడు ఎమ్మెల్యే -
ప్రొటోకాల్ రగడ
శిలాఫలకంపై జిల్లా మంత్రుల పేర్లు లేవని నిరసన కమిషనర్ దిష్టిబొమ్మ దహనం కరీంనగర్ : జిల్లాలో మంత్రి హరీశ్‌రావు పర్యటన పూర్తయ్యాక ప్రొటోకాల్ రగడ మొదలైంది. శిలాఫలకంలో మంత్రుల పేర్లు లేకపోవడంతో ప్రొటోకాల్ వివాదం అధికారుల మెడకు చుట్టుకుంది. నగరంలోని 10వ డివిజన్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.33.22 లక్షలతో చేపట్టిన సీసీ డ్రెయిన్ శంకుస్థాపనకు ఏర్పాటు చేసిన శిలాఫలకంలో కేవలం మంత్రి హరీశ్‌రావు పేరు పెట్టి జిల్లాకు చెందిన మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్ పేర్లు చేర్చకపోవడాన్ని వివిధ సంఘాలు తప్పు పడుతున్నాయి. బీసీలను అణగదొక్కాలనే ఉద్దేశంతోనే మంత్రి ఈటెల రాజేందర్ పేరు చేర్చలేదని ఆరోపించారు. ప్రొటోకాల్ ఉల్లంఘించిన నగరపాలక సంస్థ కమిషనర్‌పై చర్య తీసుకోవాలని టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కట్ల సతీశ్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు అక్బర్‌హుస్సేన్, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సిద్దం వేణు, తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతినాయక్ 42వ డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, యువజన నాయకులు డిమాండ్ చేశారు. ఈటెల యువసేన జిల్లా అధ్యక్షుడు మంద సుధీర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో కమిషనర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచకొండ సత్యనారాయణరావు ఆధ్వర్యంలో బీసీ కులాల ఐక్యవేదిక పక్షాన శిలాఫలకం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆందోళనలో బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ శ్రీధర్‌రాజు, కాల్వ నర్సయ్యయాదవ్, కడారి అయిలయ్య, మియాపురం రవీంద్రచారి, పిట్టల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యామ లక్ష్మీరాజం, జిల్లా కార్యదర్శులు ఆర్పీ రాజు, మూల జయపాల్ పాల్గొన్నారు. కమిషనర్ దిష్టిబొమ్మ దహనం మంకమ్మతోట : నగరంలోని శనివారం మార్కెట్ యార్డులో ప్రారంభించిన అభివృద్ధి పనుల శంకుస్థాపన శిలాఫలకంపై మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్ పేర్లు రాయలేదని నిరసన వ్యక్తం చేస్తూ ఈటెల యువసేన, బీసీ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో నగరపాలకసంస్థ కమిషనర్ శ్రీకేశ్‌లట్కర్ దిష్టిబొమ్మను మంగళవారం దహనంచేశారు. ఈ సందర్భంగా యువసేన జిల్లా అధ్యక్షుడు మంద సుధీర్, బీసీ సంఘం నగర అధ్యక్షుడు రమేశ్ మాట్లాడుతూ మంత్రుల ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని ఖండించారు. ప్రభుత్వపరంగా కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు టి.విష్ణువర్ధన్, విజయ్, రావణవేని రాము, రాజేశ్, సంతోష్, కార్తీక్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే కల్పనతో వర్ల వాదన
పాఠశాల భవన ప్రారంభోత్సవంలో ఘటన ప్రభుత్వ కార్యక్రమంలో మీకేం పని అని ప్రశ్నించిన ఎమ్మెల్యే మొవ్వ,(కూచిపూడి) : ప్రభుత్వ కార్యక్రమంలో టీడీపీ నేతల హల్చల్ కొనసాగుతూనే ఉంది. ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మొవ్వ జేజేనగర్లో రూ.16.70లక్షల ఎస్ఎఫ్ఏ నిధులతో నిర్మించిన పాఠశాల భవన ప్రారంభోత్సవంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ సాక్షిగా గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కల్పనతో నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వర్ల రామయ్య వాగ్వాదానికి దిగారు. ఉదయం 9గంటలకు భవనాన్ని ప్రారంభించాల్సిన జెడ్పీ చైర్పర్సన్ అనూరాధ మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చారు. కాలాతీతంకావడంతో ముందుగా భవనాన్ని ప్రారంభించాలని అనురాధను రామయ్య కోరారు. సభా సంప్రదాయం ప్రకారం ముందుగా అతిథులను ఆహ్వానించిన అనంతరమే భవనాన్ని ప్రారంభించాలని ఎంఈవో బి. కోటేశ్వరరావుకు ఎమ్మెల్యే సూచించారు. రామయ్య కల్పించుకుని ముందుగా భవన ప్రారంభానికి ఏర్పాటు చేయాలని ఎంఈవోకు చెప్పారు. ఎమ్మెల్యే ఆగ్రహించి ప్రభుత్వ కార్యక్రమంలో ‘మీకేం సంబంధం’ అంటూ ఆయనను ప్రశ్నించారు. అతిథులు కల్పించుకుని సర్ధిచెప్పడంతో వివాదం సర్దుమణిగింది. అతిథులను ఆహ్వానించిన తర్వాతనే పాఠశాల భవనం ప్రారంభించారు. తొలుత పాఠశాల విద్యా కమిటీ అతిథులను ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన బ్యానరులో వర్ల రామయ్య పేరు చేర్చటంపై ఎస్ఎంసీ చైర్మన్ పసుమర్తి కృష్ణమూర్తిపై కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించటంతో వాటి ఏర్పాటులో తమ ప్రమేయం ఏమీ లేదని ఎంపీడీవో, ఎంఈవో వివరించారు. -
ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు
సాలూరు : అధికారుల ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం తో పాటు స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్టు సాలూరు ఎమ్మె ల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర తెలిపారు. ఫిర్యాదుపై సరి గ్గా స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో పలువురు అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలను మాజీ ప్రజాప్రతి నిధులతో ప్రారంభోత్సవం చేస్తూ, ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేను ఆహ్వానించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అధికారులు సమాచారం ఇవ్వకుండా ప్రొటోకాల్‌ను ధిక్కరిస్తుండడంతో ఎమ్మెల్యేగా తన గౌరవాన్ని, శాసన సభ గౌరవాన్ని కాపాడుకోవాల్సి న అవసరం తనపై ఉందన్నారు. అందుకే జరిగిన తీరుతెన్నులను కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీల ద్వారా ప్రభుత్వానికి, శాసనసభ స్పీకర్ ద్వారా శాసనసభకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. విచారణ అనంతరం అధికారులపై చర్యలు చేపడితే తాను బాధ్యుడ్ని కానని స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు పత్రికాముఖంగా, ప్రత్యక్షంగా ప్రొటోకాల్ ఉల్లంఘన వద్దని అధికారులకు తెలిపానని, కానీ కొందరు అధికారుల తీరులో ఎలాంటి మార్పు రాలేదన్నారు. అందుకే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తాను మాజీ ప్రజాప్రతినిధులను కూడా గౌరవించాలని ఇప్పటికే పలు కార్యక్రమాల్లో స్పష్టం చేశానని, అన్ని పార్టీలవారు, అందరు నాయకులు కలిసికట్టుగా కృషి చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నా రు. టీడీపీ నాయకులు భంజ్‌దేవ్, సంధ్యారాణి తదితరులను కూడా తాను ఎన్నడూ విస్మరించలేదని గుర్తుచేశారు. అయితే ఎమ్మెల్యేగా తన హక్కులకు అగౌరవం కలుగుతున్నందున్న భావనతోనే ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అనంతరం ఫిర్యాదు చేసిన అధికారుల వివరాలు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 6న మున్సిపల్ కౌ న్సిల్ సమావేశంలో తనకు కౌన్సిలర్ల మాదిరిగానే కమిషనర్ షేక్ సుభానీ కుర్చీని కేటాయించారని, ఏపీ ట్రాన్స్‌కోలో ఇటీవల భర్తీ చేసిన పోస్టుల వివరాలు ఎమ్మెల్యేగా ఆ శాఖ సీఎండీ, ఎస్ఈ, డీఈలను లేఖ ద్వా రా సెప్టెంబరు 22న కోరితే నేటివరకు ఏ ఒక్కరి నుంచి సమాదానం రాలేదన్నారు. ఒక ఎమ్మెల్యే వివరాలు కోరితే 15 రోజుల్లో సమాధాన ం ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదన్నారు. అలాగే అక్టోబర్ 24న రూ. 8 లక్షలతో గోముఖీ రెగ్యులేటర్ వద్ద మరమ్మతుల పనుల శంకుస్థాపన కు నీటిపారుదల శాఖ అధికారులు పిలవలేదన్నారు. అదే నెల 28న రూ. 43 లక్షలతో గురువినాయుడుపేట- మాతుమూరు గ్రామాల రహదారి నిర్మా ణం శంకుస్థాపన పనులకు, నవంబరు 3న మాతుమూరు- తాడూరు కాజ్వే పనుల శంకుస్థాపన పనులకు, అదేరోజున మో సూరు కాజ్వే నిర్మాణ పనులను ఆర్అండ్బీ అధికారులు తనకు సమాచారం ఇవ్వకుండానే ఇతరులతో శంకుస్థాపన జరిపారన్నారు. ఇకపై కూడా ఈ తరహా ప్రొటోకాల్ ఉల్లంఘన జరగదని భావిస్తున్నానన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ జరజాపు సూరిబాబు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గిరి రఘు, మాజీ కౌన్సిలర్ పిరాడి రామకృష్ణ, మాజీ ఏఎంసీ డెరైక్టర్ కర్రి పోలారావు, పాల్గొన్నారు. -
బదిలీలతో బిజీబిజీ...ఎవరూ అతీగతీ
జన్మభూమి- మన ఊరు కేవలం ప్రభుత్వ కార్యక్రమం. అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరవ్వాలి. కానీ పచ్చ చొక్కాల దౌర్జన్యాలతో గందరగోళంగా మారాయి. అధికారులు కూడా తానా తందానా అనడంతో ప్రొటోకాల్ పత్తాలేకుండా పోయింది. రెండో విడత వచ్చే సరికి కమిటీల పేరుతో అధికార ముద్రతో సర్కారు సభలపైకి ఉసి గొల్పడంతో ప్రజా సమస్యలు పక్కకు తొలగి పార్టీ ఎజెండా ముందుకు వచ్చింది. సర్వేల పేరుతో అర్హులను కూడా తొలగించడంతో మనస్థాపానికి గురై పలువురు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. ఓ వృద్ధురాలు ఏకంగా కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ మృతదేహంతో బంధువులు ధర్నాకు దిగారు. ఇంకో సంఘటనలో మరో వృద్ధుడు గుండె ఆగి చనిపోయాడు. తను పట్టిన కుందేలుకు మూడే కాళ్లున్నాయన్న చందంగా అధికారులు పని చేసుకుపోవడంతో సంక్షేమం స్థానంలో సంక్షోభం ఏర్పడింది. లబ్ధిదారుల్లో మానసిక ఆందోళన నెలకొంది. ఇంతలో బది‘లీల’లు ప్రారంభమయ్యాయి. ఈ అర్జీల గతి ఏమవుతుందోనని లబ్ధిదారుల్లో సరికొత్త భయం నెలకొంది. వచ్చిన అధికారికి అంతా కొత్తే. ‘పెద్దాయనొచ్చె...మళ్లీ మొదలెట్టు’ అన్న చందంగా తయారవుతుందేమోనని అనుమానాలు ప్రారంభమయ్యాయి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో పలు అవాంతరాలతో ముగిసిన జన్మభూమి సభలు అనుకున్న లక్ష్యానికి చేరుకోక విమర్శల పాలయింది. వచ్చిన లక్షల అర్జీలు సంబంధిత శాఖలకు పంపించే తరుణంలో బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో ప్రయోజనం ప్రశ్నార్ధకంగా మారింది. ప్రకాశం జిల్లాలో రెండు విడతలుగా 22 రోజులపాటు జరిగిన ‘జన్మభూమి - మా ఊరు’ సభలకు రెండు లక్షల 80 వేల అర్జీలు వచ్చాయి. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఇంకా నడుస్తుండటంతో ఈ దరఖాస్తులు ఆయా కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. అర్జీలకు ఆధార్‌తో ముడిపెట్టారు. ఆధార్ నెంబర్‌తోపాటు సెల్ నెంబర్ కూడా సేకరించాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 1255 గ్రామసభలు నిర్వహించారు. అందులో రెండు లక్షల 80 వేల దరఖాస్తులు వస్తే కేవలం రెవెన్యూ శాఖకు సంబంధించే లక్షా రెండువేల అర్జీలున్నాయి. భూ సమస్యలు, పట్టాదార్ పాసు పుస్తకాల కోసమే ఎక్కువ ధరఖాస్తులు వచ్చాయి. పట్టాదారు పాస్‌పుస్తకాలకు సంబంధించిన 1బీ ఖాతాలను క్రాస్ చెక్ చేయకపోవడంవల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఒక్క చీరాల మండలంలోనే 80 శాతం అర్జీలు అధికారుల రికార్డులతో సరిపోలడం లేదు. దీంతో రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చిన అర్జీలలో వ్యక్తిగతమైనపనుల కోసం ఎన్ని అర్జీలు వచ్చాయి, సామాజికపరంగా ఎన్ని ఉన్నాయనే అంశాన్ని విడగొట్టాల్సి ఉంది. వీటిని పరిష్కరించడానికి ఒక నిర్ధిష్టమైన గడువు లేదు. దీంతో అధికారులు వీటిని ప్రాధాన్యతాక్రమంలో రానున్న ఐదు సంవత్సరాల్లో వారి అవసరాలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ముఖ్యంగా డబ్బుతో ముడిపడిన ఏ అంశం కూడా పరిష్కారమయ్యే అవకాశం కనపడటం లేదు. ఆరోగ్య శిబిరాలు, వెటర్నరీ శిబిరాలు, పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది. పేదరికంపై గెలుపు, స్వచ్ఛ ఆంధ్రా, నీరు -చెట్టు తదితర కార్యక్రమాలు కూడా మొక్కుబడిగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది అంటూ సభలు నిర్వహించినా తర్వాత ఎక్కడా వాటి ఊసే లేదు. కొత్తగా బడికి వెళ్లని వారిని గుర్తించి స్కూళ్లలో చేర్చింది కూడా లేదు. డ్వాక్రా రుణాలు కూడా ముఖ్యమంత్రి సభలో ఇచ్చినవే. రుణమాఫీ అమలు కాకపోవడం వల్ల డ్వాక్రా గ్రూపులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాలేదు. నిర్దేశించిన లక్ష్యం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. రెవెన్యూ శాఖకు సంబంధించినవే కాకుండా, పింఛన్లకు సంబంధించి 55,703 అర్జీలు, పౌరసరఫరాల శాఖకు సంబంధించి 42, 650, హౌసింగ్‌కు సంబంధించి 38,469, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 11,754 అర్జీలు, మున్సిపాలిటీలకు సంబంధించి 5 వేల అర్జీలు వచ్చాయి. పింఛన్లకు పేరు మార్చి ఎన్టీఆర్ భరోసా పేరుతో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే, ఈ సభల్లో 2,56000 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్లకు సంబంధించి జిల్లాలో 79 వేల మంది పేర్లను తొలగించామని జిల్లా కలెక్టర్ విజయకుమార్ అధికారికంగా వెల్లడించారు. అందులో 27 వేలు పునరుద్ధరించారు. ఇంకా 52 వేల మందిలో అర్హత ఉండి కూడా పింఛన్ లేక చాలా మంది అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పింఛన్లకు అర్హులైనప్పటికీ జాబితాలో లేనివారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలకు సమాచారం అందించాలని అధికారులు చెబుతున్నారు. అయితే వారికి మాత్రం న్యాయం జరగడం లేదు. ఈ కమిటీలు కూడా పూర్తిగా తెలుగుదేశం వారితో నింపడంతో అర్హులకు న్యాయం జరగడం లేదు. తమకు పింఛన్ అందని కారణంగా జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా ఇంకొకరు గుండె ఆగి చనిపోయిన సంగతి తెలిసిందే. ఇంత జరిగినా ప్రభుత్వంలో మార్పు రాలేదు. ‘జన్మభూమి మా ఊరు’ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా తమ పార్టీ కార్యక్రమంగా నిర్వహించింది. పార్టీ నాయకులను వేదికపైన కూర్చోపెట్టేందుకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చిన జిల్లా మంత్రి, ఇతర శాసనసభ్యులు జన్మభూమి ముగిసిన తర్వాత దీనిపై సమీక్షించిన పాపాన పోలేదు. -
‘జన్మభూమి’లో ఉద్రిక్తత
ప్రొటోకాల్ పాటించని అధికారులు పింఛన్ల పంపిణీకి ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వని వైనం ఎమ్మెల్యే ఈశ్వరితో ఎంపీ గీత వాగ్వాదం పాడేరు రూరల్: మండలలోని సలుగు, మోదాపల్లి పంచాయతీల్లో శనివారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ రెండు చోట్లా నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాల్లో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితోపాటు అరకు ఎంపీ కొత్తపల్లి గీత హాజరయ్యారు. సలుగు గ్రామం లో పింఛన్ల పంపిణీ సమయంలో వీరిద్దరూ తీవ్ర వాగ్వాదానికి దిగారు. ప్రొటోకాల్ ప్రకా రం ఎమ్మెల్యే చేత కూడా పింఛన్లు ఇప్పించాల్సి ఉన్నప్పటికి అధికారులు కేవలం ఎంపీ గీత, టీడీపీ నాయకుల చేత మాత్రమే పింఛన్లు పం పిణీ చేయించడంతో ఎమ్మెల్యే ఈశ్వరి ఇదేమి పద్ధతని అధికారులను నిలదీశారు. నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులచేత కూడా పింఛన్లు పంపిణీ చేయించాలన్నారు. దీంతో తాము అధికార పార్టీకి చెందిన నాయకులమని, అన్ని చోట్ల తాము పింఛన్లను అందించేందుకు అర్హులమని తెగేసి చెప్పి ఎమ్మెల్యే, ఇతర వైఎస్సార్ నాయకులపై కొందరు గొడవకు దిగారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. మోదాపల్లిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాడేరు ఎంపీపీ వి.ముత్యాలమ్మ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు పింఛన్లలో కోత పెట్టడం సరైన పద్ధతి కాదని అనడంతో అక్కడ ఉన్న ఎంపీ కొత్తపల్లి గీత, ఇతర టీడీపీ నాయకులు ఆమెకు సమాధారం ఇవ్వకుండా వాగ్వాదానికి దిగారు. కొత్తపల్లి గీతతో ఉన్న టీడీపీ నాయకులు ఎంపీపీ, ఆమె వర్గీయులతో ఘర్షణ పడ్డారు. ఇక్కడ కూడా పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్క దిద్దారు. జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నాయకుల హవాపై ఆయా గ్రామాల గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పి.నూకరత్నం, మాజీ ఎంపీపీ రమణమూర్తి, వైఎస్సార్సీపీ నాయకులు వి.పిన్నయ్యదొర, బూరెడ్డి నాగేశ్వరరావు, తాజుద్దీన్, కె.చంద్రమోహన్‌కుమార్, త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు. -
నిరసనలకు శ్రీకారం
పింఛన్లు..పరిహారం కోసం ఆగ్రహం ఎంపీ, ఎమ్మెల్యేలకు తప్పని నిరసన ప్రోటోకాల్ ఉల్లంఘించిన అరకు ఎంపీ జన్మభూమిలో గళమెత్తిన ప్రజలు సాక్షి, విశాఖపట్నం: జన్మభూమి-మావూరు పునఃప్రారంభించిన తొలిరోజే జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు సొం తనియోజకవర్గంలోనే చుక్కెదురైంది. 1వ వార్డు ఆరిలోవ ప్రాంతంలో జరిగిన గ్రామసభలో తుఫాన్ బాధితులు ఎమ్మెల్యేను నిలదీశారు. తుఫాన్ తర్వాత మీరు కానీ..మీ అధికారులు కానీ మావైపు కన్నెత్తయినా చూడలేదు. సాయం పంపిణీలో వివక్ష చూపారు. 2వ వార్డులో పంపిణిచేసేరే తప్ప ఆరిలోవలో ఒక్క కిలో బియ్యం ఇవ్వలేదంటూ మండిపడ్డారు. దీనిపై సమాధానం చెప్పలేక ఇబ్బందిపడిన ఎమ్మెల్యే మీరు చెప్పింది నిజమే..సాయం పంపిణీసరిగా జరగలేదు.. మీకు పరిహారం విషయంలో న్యాయంచేస్తానని హామీ ఇచ్చారు. నక్కపల్లిలో మంత్రి గంటా శ్రీనివాస రావు కాన్వాయ్‌ను గత 45 రోజులుగా ఆందోళన చేస్తున్న యానిమేటర్లు అడ్డుకుని బైటాయించారు. తమతో ప్రభుత్వం కనీసం చర్చలు కూడాజరపలేదని..ఆకలితో అలమటిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేయగా ప్రభుత్వం దృష్టికితీసుకెళ్తాననంటూ వారికి సర్దిచెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మంత్రి గంటా పాయక రావుపేటలో పింఛన్‌దారుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొక తప్పలేదు. పింఛన్లలో కోత పెట్టారని.. తాము ఏ విధంగా అనర్హులమో చెప్పాలని మంత్రిని నిలదీయగా,న్యాయంచేస్తామని హామీ ఇచ్చారు. భీమిలి మండలం మాలకుద్దులో పింఛన్ల కోతపై బాధితులు ఎంపీపీ, జెడ్పీటీసీలను నిలదీశారు. తమకు వెంటనే పింఛన్లు పునరుద్దరించాలని వారిని చుట్టుముట్టి నినాదాలు చేసారు. ఇదే మండలంలోని తాటితూరులో తుపాన్ బాధితులు అధికారులపై విరుచుకుపడ్డారు. వీరికి మద్దతుగా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ దుంపల నాగమణి, పార్టీ నాయకులు ఎస్వి రమణారెడ్డి, ఈశ్వరరావులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ఈ దశలో టీడీపీ నాయకులు, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు సర్వేలో తప్పులు చేసారని చక్కదిద్దుతామని టీడీపీ నాయకులు ప్రజలకు సర్దిచెప్పి అక్కడ నుంచి వెళ్లాల్సి వచ్చింది. చోడవరం మండలం గోవాడ సభలో స్థానికులు గత జన్మభూమిలో ఇచ్చిన హామీలే అమలు చేయలేదు..మళ్లీ ఎందుకొచ్చారంటూ అధికారులపై మండిపడ్డారు. పారిశుద్ద్యంపై ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో చక్కదిద్దుతామనిచెప్పి నెలరోజులు గడుస్తున్నా పట్టించుకోలేదంటూ ఆరోపించారు. ఇదే మండలం నర్సాపురంలో పాస్పుస్తకాలజారీలో జరుగుతున్న జాప్యంపైరైతులు నిలదీయగా, జొన్నవరంలో పింఛన్ల కోతపై బాధితులు మండిపడ్డారు. పాడేరు మండలం పలుగు గ్రామసభలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. పింఛన్లను పంపిణీకి స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సిద్దపడగా గీత అడ్డుకుని ఇది మా ప్రభుత్వం మీరెవరూ పంపిణీ చేయడానికని ప్రశ్నించడంతో ఏ పార్టీలో ఉన్నావో తెలుసా అంటూ ఎమ్మెల్యే వర్గీయులు నిలదీశారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో గందరగోళ పరిస్థితులు ఏర్పడి ఎవరేం మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొనడంతో పోలీసులుజోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఇదే మండలం మొదపల్లి పంచాయితీలో జరిగిన సభకు హాజరైన ఎంపీ కొత్తపల్లి గీతను స్థానిక వైఎస్సార్సీపీ ఎంపీపీ ముత్యాలమ్మ నిలదీశారు. ఏపార్టీ తరపున ఇక్కడ పాల్గొంటున్నావో..ఏ విధంగా హామీలు అమలు చేస్తావో చెప్పాలని డిమాండ్ చేయడంతో ఎంపీ వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇక్కడ కూడా పోలీసులు, అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. నక్కపల్లిమండలం రమణయ్య పేట, చినదొడ్డుగల్లు, సీహెచ్వి అగ్రహరంల్లో కూడా పింఛన్‌దారులు అధికారులకు ముచ్చెమటలు పోయించారు. ‘పచ్చ’పాతమే.. జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నాయకుల పెత్తనం ఎక్కువైపోతోందని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులను కాదని టీడీపీ నాయకుల చేత కార్యక్రమాలు నిర్వహించడం సరికాదన్నారు. చూస్తుంటే ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేదా ‘పచ్చ’పార్టీ కార్యక్రమమా అనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. పాడేరు మండలం సలుగు, మోదాపల్లి గ్రామాల్లో శనివారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత, టీడీపీ నాయకుల వ్యవహార శైలి సక్రమంగా లేదన్నారు. తుఫాన్ సహాయక చర్యల్లోనూ తెలుగు తమ్ముళ్లదే హవా కనిపిస్తోందన్నారు. నిజమైన బాధితులకు పరిహారం దక్కడం లేదన్నారు. టీడీపీ అనుచరులకే సాయం అందుతోందన్నారు. మారుమూల గిరిజనులు ఇప్పటికీ నిత్యావసరాలకు నోచుకోలేదన్నారు. బాధితులకు పూర్తి సాయం కోసం వైఎస్సార్సీపీ పోరాటం సాగిస్తుందన్నారు. -గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యే, పాడేరు -
ప్రజాప్రతినిధులకు ఏదీ గౌరవం?
జన్మభూమిలో టీడీపీ ఇన్‌చార్జ్‌ల పెత్తనం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు దక్కని గౌరవం ప్రొటోకాల్‌కు విరుద్ధంగా టీడీపీ నేతల చేతుల మీదుగా అధికారిక కార్యక్రమాలు చోద్యం చేస్తున్న అధికార యంత్రాంగం పార్టీ ఏదైనా.. హోదా ఏదైనా.. ఆ ప్రాంతంలో ప్రజలు ఎన్నుకున్న వారికి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఇది వార్డు సభ్యుడి నుంచి ప్రధానమంత్రి వరకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే జిల్లా అధికారులు ప్రస్తుతం ప్రొటోకాల్ మరిచి అధికార పార్టీ నాయకులకు పెత్తనం కట్టబెడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమం ‘జన్మభూమి-మాఊరు’లో ప్రజాప్రతినిధులు కాని వారు వేదికపై ఆసీనులవుతున్నారు. అధికారులు కూడా పింఛన్లు ఇతరత్రా పత్రాలను వారి హస్తాలతోనే అందజేస్తున్నారు. సాక్షి, చిత్తూరు: ‘జన్మభూమి-మా ఊరు’ ఈ నెల 2న ప్రారంభమైంది. 4వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా పల్లెసీమల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే, మండలాధ్యక్షులు చదవాలి. లేదా జెడ్పీటీసీ సభ్యులు చదవాలి. ఆపై గ్రామాల్లోని ప్రజల సమస్యలు ఆలకించి, వాటికి పరిష్కారమార్గాన్ని చూపాలి. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏవైనా ప్రజలకు చేరాల్సి ఉంటే వాటిని ప్రజాప్రతినిధుల చేతులమీద అందించాలి. కానీ జిల్లాలో మాత్రం ‘ప్రజాప్రతినిధి’అనే మాటతో పనిలేకుండా టీడీపీ నేతల ఆధ్వర్యంలో అధికారులు జన్మభూమిని నడిపిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి... టీడీపీ కార్యకర్తలు, నాయకులంతా ప్రజాప్రతినిధులే అనే భ్రమలో అధికారులు ఉన్నారేమో జిల్లా వ్యాప్తంగా వారి ఆధ్వర్యంలో సభలు నడుస్తున్నాయి. ఇవిగో ఉదాహరణలు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి జన్మభూమిలో ఆయన పాల్గొనాలి. అధికారిక కార్యక్రమాలు ఆయనతో పాటు ఆయా మండల ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ ఆధ్వర్యంలో జరగాలి. కానీ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కుతూహలమ్మ జన్మభూమి వేదికపై ఆశీసునులై ఆమె ప్రజా సమస్యలు ఆలకిస్తున్నారు. ఆమె చేతులమీదుగా కొత్త పింఛన్లు ఇతర పథకాల పత్రాలు అందజేస్తున్నారు అక్కడి అధికారులు. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌కు బదులుగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే లలితకుమారి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక్కడ సునీల్ కంటే ఆమెకే పెద్దపీట వేయడం గమనార్హం చిత్తూరులో ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ, మేయర్కఠారి అనురాధ పాల్గొంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో టీడీపీ నేతలు దొరబాబు, కఠారి మోహన్, వైవీ రాజేశ్వరి, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ కూడా పాల్గొంటున్నారు. వీరి చేతుల మీదుగా పింఛన్ల పత్రాలు పంపిణీ చేస్తున్నారు. నగరి నియోజకవర్గంలో నగరి టీడీపీ ఇన్చార్జి ముద్దుకృష్ణమనాయుడు జన్మభూమిలో అధికారికంగా పాల్గొంటున్నారు. పలమనేరులో అమరనాథరెడ్డి ఎమ్మెల్యే అనే విషయం కూడా మరిచిపోయి, జన్మభూమి కార్యక్రమానికి ఆహ్వానించకుండా అధికారులు కార్యక్రమాన్ని నడుపుతున్నారు. దీనికి నిరసనగా ఎమ్మెల్యే మంగళవారం జవ్వునిపల్లెలో నేలపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ నియోజకవర్గంలో బోస్ అధికారికంగా పాల్గొంటున్నారు. ఇలా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ జన్మభూమి టీడీపీ నేతల చేతులమీదుగానే కొనసాగుతోంది. ఇది పూర్తిగా ప్రజాప్రతినిధులను అగౌరవపరచడమేనని ప్రతిపక్షపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలను అధికారులు ప్రోత్సహించి, వేదికపైకి తీసుకొచ్చి కార్యక్రమాన్ని నిర్వహించడం మరీ దారుణమని మండిపడుతున్నారు. జన్మభూమికి ముందు ప్రతీ మండలానికి ప్రత్యేకాధికారులను నియమించారు. జిల్లాకు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌తో పాటు ప్రత్యేకాధికారి జేసీ శర్మ పర్యవేక్షిస్తున్నారు. రోజూ ప్రొటోకాల్‌కు విరుద్ధంగా సభలు నడుస్తుంటే వీరి పర్యవేక్షణ ఎలా ఉందో...రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవిస్తున్నారో ఇట్టే తెలుస్తోంది. -
జన్మభూమిలో ప్రొటోకాల్ రగడ
చందోలు(పిట్టలవానిపాలెం) : మండలంలోని చందోలులో బుధవారం జరిగిన జన్మభూమి -మా ఊరు కార్యక్రమంలో అధికారులు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారు. అధికార పార్టీ నేతలు తమను ఎవరేం చేస్తారంటూ ధీమాతో అధికారుల మాటలను సైతం లెక్క చేయడం లేదు. చందోలులో జరిగిన గ్రామసభకు ప్రొటోకాల్ పాటించాలని జెడ్పీటీసీ సభ్యుడు అధికారులకు చెబుతున్నా పట్టించుకోకుండా బాపట్ల టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నం సతీష్ ప్రభాకర్‌ను వేదికపైకి ఆహ్వానించి పింఛన్లను పంపిణీ చేయించడంతో అప్పటివరకూ వేదికపై ఉన్న చందోలు ఎంపీటీసీ సభ్యులు షబానా బేగంబాజి,వీరయ్య,జెడ్పీటీసీ సభ్యుడు చిరసాని నారపరెడ్డి గ్రామసభను బహిష్కరించారు. ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు వారు పేర్కొన్నారు. పార్టీ నాయకుడిని ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి ఆహ్వానించడమేమిటని సూటిగా ప్రశ్నించారు.ఈ విషయంపై ఎంపీడీఓ శివనారాయణ మాట్లాడుతూ వేదికపైకి పార్టీ నాయకులు రాకూడదని చెబుతూనే ఉన్నానని, గ్రామసర్పంచ్ హోదాలో ఉన్న వారు ఆహ్వానించారని చెప్పారు. -
తిరగబడ్డ జనం
- జిల్లాలో పలుచోట్ల రసాభాసగా ‘జన్మభూమి- మా ఊరు’ - పింఛన్ల తొలగింపుపై ఎక్కడికక్కడ అధికారుల నిలదీత - ప్రొటోకాల్‌కు విరుద్ధంగా పాల్గొన్న టీడీపీ ఇన్‌చార్జ్‌లు సాక్షి, చిత్తూరు: ‘‘సదరన్ క్యాంపులు పెట్టారు. మమ్మల్ని అర్హులని సర్టిఫికెట్లు ఇచ్చారు. ‘అభయహస్తం’ పింఛన్లు ఎప్పటి నుంచో తీసుకుంటున్నాం. ఇప్పుడు పింఛన్ డబ్బులు పెం చామని చెప్పి, ఉన్న పింఛన్లు తీసేస్తారా ? మీరంతా మట్టికొట్టుకుపోతారు. జన్మభూమి వద్దు..ఏమీ వద్దు...ఇక్కడి నుంచి పొండి.’’ -పలమనేరు ఒకటో వార్డులో జన్మభూమి తీరు ఇది. ‘‘తాగేందుకు నీళ్లు లేవు. ఏళ్ల తరబడి గ్రామసభలు పెట్టడం. అధికారులు రావడం, వెళ్లడం...తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వడం చేతకానప్పుడు జన్మభూమి ఎందుకు ? మేము ఏ సమస్యలు చెప్పినా మీరు తీర్చలేరు.’’ -కుప్పం మండలం నూలకుంటలో అధికారులపై గొడవకు దిగిన గ్రామస్తులు. ...ఈ రెండు సంఘటనలను పరిశీలిస్తే ...జన్మభూమి-మన ఊరు ఎలా జరుగుతోందో...ప్రభుత్వ తీరు...పాలనపై ప్రజలు ఏ స్థాయిలో మండిపడుతున్నారనే విషయూలు అర్థమవుతారుు. ‘జన్మభూమి-మా ఊరు’పేరుతో అధికార యంత్రాంగం శనివారం జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించింది. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు హాజరైతే...ఇంకొ న్నిచోట్ల ప్రొటోకాల్‌కు విరుద్ధంగా టీడీపీ నేతలు పాల్గొని కా ర్యక్రమాన్ని నడిపించారు. అధికారులు దీన్ని ప్రోత్సహించా రు. దీనిపై పలుచోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంతోపాటు శ్రీకాళహస్తి, పలమనేరు, పీలేరు సహా పలుచోట్ల జన్మభూమి రసాభాసగా మారింది. పలమనేరు ఒకటో వార్డులో ఉదయం 9గంటలకే అధికారులు జన్మభూమికి హాజరయ్యారు. ప్రజలు మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఒక్కరూ రాలేదు. ఎమ్మెల్యే అమరనాథరెడ్డి వచ్చిన తర్వాత ప్రజలంతా హాజరయ్యారు. 550 అభయహస్తం పింఛన్లు..అర్హులైన వారికి వికలాంగ, వృద్ధాప్య, వితంతు పింఛన్లు తీసేశారని లబ్ధిదారులు, ప్రజలు కమిటీ సభ్యులపై మట్టి చల్లి... మట్టికొట్టుకు పోతారంటూ శాపనార్థాలు పెట్టారు. మైకులు తీసేశారు. దీంతో పింఛన్ల కమిటీలోని ఇద్దరు టీడీపీ సభ్యులను పోలీసులు పంపేశారు. పింఛను డబ్బు ఇవ్వకుండా పత్రాలు మాత్రమే ఇవ్వడంపై కూడా గొడవ జరిగింది. ఇలా పలుసార్లు ప్రజలు అధికారులపై గొడవకు దిగడంతో అర్థాంతరంగా కార్యక్రమాన్ని నిలిపేశారు. జగమర్లలో టీడీపీ ఇన్చార్జ్ బాలాజీ పాల్గొన్నారు. పింఛన్లు, మెమెంటోలు అతని చేతులమీదుగా అధికారులు ఇప్పించారు. దీంతో ప్రజలు అడ్డుకున్నారు. కుప్పంలో నూలకుంటలో మంచినీళ్లు ఇవ్వలేదని అధికారులు, ప్రజాప్రతినిధులపై గ్రామస్తులు గొడవకు దిగారు. నీళ్లు కూడా ఇవ్వలేనప్పుడు సమావేశం ఎందుకని, వెళ్లిపోండని అడ్డుపడ్డారు. శ్రీకాళహస్తి 2వార్డులో 24మంది చేనేత కార్మికులకు పింఛన్లు తీసేశారని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దీంతో టీడీపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఒకటో వార్డులో 120మందికి పింఛన్లు తీసేశారని అక్కడ ఇరువర్గాలకు వాగ్వాదం జరిగింది. అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు. గుర్రంకొండ మండలం టి. పసలవాండ్లపల్లెలో పింఛన్ల తొలగింపుపై లబ్ధిదారులు ధర్నా చేశారు. పీలేరు, కలికిరి, కలకడలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఒక్కరూపాయి నిధులు విడుదల చేయకుండా జన్మభూమి నిర్వహిస్తే ఏం ఉపయోగమని ఎమ్మెల్యే ప్రశ్నించారు.కార్వేటినగరం మండలంలో ఎమ్మెల్యే నారాయణస్వామి పాల్గొన్నారు. పింఛన్లతో పాటు పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. పూతలపట్టు పరిధిలోని కమ్మగుట్టపల్లె జన్మభూమిలో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ పాల్గొన్నారు. మంచినీటి సమస్యపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు. పింఛన్ల తొలగింపుపై ప్రశ్నించారు. ఆపై వినతి పత్రాలు అందించారు. చంద్రగిరిలో టీడీపీనేత గాలి ముద్దుకృష్ణమనాయుడు పాల్గొన్నారు.నగరి, సత్యవేడు, చిత్తూరులో పింఛన్లు, రేషన్‌కార్డులు, మంచినీటి సమస్యపై వినతిపత్రాలు అందజేశారు. మదనపల్లె, బీ.కొత్తకోట, పెద్దతిప్పసముద్రంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఆవిష్కరణ వివాదం
ప్రొటోకాల్ పాటించడం లేదంటూ మంత్రి రోషన్‌బేగ్ ఆగ్రహం ఆహ్వాన కమిటీ చైర్మన్ శంకరమూర్తిపై విమర్శలు ప్రొటోకాల్ మేరకే ఆహ్వానమన్న మండలి అధ్యక్షుడు కార్యక్రమాన్ని వాయిదా వేయాలని వాటల్ వినతి గాంధేయవాదులను విస్మరించారని ఆరోపణ ఆహ్వాన పత్రికలో నగర ప్రథమ మహిళ పేరును ప్రస్తావించకపోవడంపై అసహనం సాక్షి, బెంగళూరు : జాతిపిత విగ్రహావిష్కరణ కార్యక్రమం నేతల మధ్య వివాదానికి తెరలేపింది. విధానసౌధ, వికాససౌధ మధ్య 22 అడుగుల ఎత్తై గాంధీ విగ్రహాన్ని నేడు(గురువారం) ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ విషయంలో ప్రోటోకాల్‌కు తిలోదకాలిచ్చారంటూ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్‌బేగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేపీసీసీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించే సమయంలో పాటించాల్సిన నియమాలను విస్మరించారని అసహనం వ్యక్తంచేశారు. గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతం శివాజీనగర నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని, ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేనైన తానే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే ఈ విషయాలు ఏవీ తెలియని శాసన మండలి అధ్యక్షుడు డి.హెచ్.శంకరమూర్తి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారని మండిపడ్డారు. కాగా, అసెంబ్లీ, మండలి సభా కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక చానల్‌కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుమతి తెలిపారని అన్నారు. త్వరలో చానల్ ప్రారంభమవుతుందని తెలిపారు. అలాగే న్యాయపరమైన చిక్కుల వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన కేబుల్ నెట్వర్క్ వ్యవస్థ ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. ప్రోటోకాల్ మేరకే ఆహ్వానం మహాత్ముడి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అతిథులను ఆహ్వానించే విషయంలో తాము పారదర్శకంగానే ఉన్నామని విధానపరిషత్ సభాపతి డి.హెచ్.శంకరమూర్తి స్పష్టం చేశారు. కార్యక్రమ నిర్వహణలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ రాష్ట్ర మంత్రి రోషన్‌బేగ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆవిష్కరణకు సంబంధించి తన అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పారదర్శకంగానే వ్యవహరిస్తోందని అన్నారు. శాసనసభ, మండలి విపక్ష నేతలను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించినట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, జగదీష్‌శెట్టర్, ఎస్ఎం ృ ష్ణను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. అయితే కమిటీ సభ్యులు సూచన మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కొద్ది మంది పేర్లు మాత్రమే ఆహ్వాన పత్రికలో ముద్రించినట్లు చెప్పారు. విగ్రహావిష్కరణను వాయిదా వేయండి గాంధీజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని శాసనమండలి అధ్యక్షుడు డీహెచ్ శంకరమూర్తిని మాజీ శాసనసభ్యుడు వాటాళ్ నాగరాజు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన విధానసౌధలో శాసనమండలి అధ్యక్షున్ని కలుసుకుని ఓ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రంలోని గాంధేయవాదులతోపాటు అర్హులైన చాలామందిని ప్రభుత్వం ఆహ్వానించలేదన్నారు. అంతేకాక ఆహ్వాన పత్రికల్లో ప్రోటోకాల్ ప్రకారం పేర్లను ముద్రించక పోవడం వల్ల వారికి అవమానం జరిగిందని చెప్పారు. నగర ప్రథమ మహిళ, బీబీఎంపీ మేయర్ శాంతకుమారి పేరు కూడా ఆహ్వాన పత్రికలో లేకపోవడం ఇందుకు నిదర్శనమని అసహనం వ్యక్తం చేశారు. అందువల్ల కార్యక్రమాన్ని వాయిదా వేసి ప్రోటోకాల్ పాటిస్తూ అందరినీ ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. -
27 % లంచం
బీసీ సంక్షేమ శాఖలో ప్రతి పనికీ ఓ రేటు అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్టజెప్పాల్సిందే! ప్రొటోకాల్ పేరుతో ఒక్కో హాస్టల్ నుంచి రూ.1,000 వసూలు లంచం ఇవ్వకపోతే బిల్లు రాదంటున్న వార్డెన్లు బదిలీలకు బహిరంగంగానే పైరవీలు! మచిలీపట్నం : కాకులను కొట్టి గద్దలకు వేసిన చందంగా మారింది బీసీ సంక్షేమ శాఖలో పరిస్థితి. బడుగుల పిల్లలు కడుపు కొట్టి అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. మామూళ్లు లేనిదే ఒక్క ఫైలు కూడా ముందుకు కదలడం లేదు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన జిల్లాలో 60 వసతిగృహాలు ఉన్నాయి. ప్రతి నెలా వసతి గృహాల బిల్లుల చెల్లింపు సమయంలో అధికారులకు 27శాతం లంచంగా అందజేయాల్సిన దుస్థితి నెలకొందని పలువురు వార్డెన్లు తెలిపారు. వసతిగృహాల్లో పనిచేస్తున్న వార్డెన్లు, సిబ్బందికి శాఖాపరమైన పనులు కూడా సక్రమంగా జరగడం లేదని వాపోతున్నారు. ఏదైనా ఫైలు బీసీ సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయానికి వెళితే పరిష్కారం కోసం దాన్ని సిబ్బందికి పంపకుండా అధికారులు తమ వద్దే పెండింగ్‌లో పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటాలు ఇలా... మామూళ్లు ఇస్తేనే ప్రతినెలా వసతిగృహాలకు సంబంధించి బిల్లులను మంజూరు చేస్తున్నారని వార్డెన్లు చెబుతున్నారు. ఉన్నతాధికారులతోపాటు డివిజన్‌స్థాయి అధికారులు కూడా ముక్కుపిండి మరీ బిల్లు మొత్తంలో 27 శాతం లంచం వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. దీనిలో ఏఎస్‌డబ్ల్యూవోలు 15 శాతం, ఉన్నతాధికారులు 12 శాతం పంచుకుంటారని ఓ వార్డెన్ చెప్పారు. ఎవరైనా నెలవారీ మామూళ్లు అందజేయకపోతే సదరు హాస్టల్‌పై అధికారులు దాడి చేస్తారని, వివిధ కారణాలు చూపి ఇబ్బందులు పెడతారని, మామూళ్లు అందజేసిన తర్వాత ‘అంతా బాగుంది..’ అంటూ సర్దుకుపోవడం సర్వసాధారణంగా మారిందని మరో వార్డెన్ వివరించారు. మరోవైపు ప్రొటోకాల్ పేరుతో ప్రతి హాస్టల్ వార్డెన్ నెలకు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఉన్నతాధికారులకు ముట్టజెబుతున్నారు. ఈ మొత్తం అందజేయడం ఒక్కరోజు ఆలస్యమైనా, వెంటనే సంబంధిత హాస్టల్లో ఉన్నతాధికారులు తనిఖీ చేసి ఇబ్బందులు పెడతారని వార్డెన్లు చెబుతున్నారు. పది నెలలుగా వేతనాలు లేవు జిల్లాలోని బీసీ వసతిగృహాల్లో 87 మంది అవుట్ సోర్సింగ్ పద్ధతిపై పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.6,700 చొప్పున వేతనం చెల్లించాల్సి ఉంది. పది నెలలుగా వీరికి జీతాలు విడుదల చేయలేదు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది తమకు వేతనాలు విడుదల చేయాలని బీసీ సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయానికి వెళితే.. ‘మీరు అనేక తప్పులు చేశారు.. వేతనాలు ఎలా చెల్లిస్తాం..’ అంటూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి వెనక్కి పంపిస్తున్నారని పలువురు సిబ్బంది వాపోయారు. 2013, అక్టోబరు నుంచి వసతిగృహాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బందికి, 2014, ఫిబ్రవరి నుంచి బీసీ సంక్షేమ కళాశాల వసతి గృహాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు అందజేయాల్సి ఉంది. అన్నీ పారదర్శకంగానే : డీడీ అయితే, బీసీ సంక్షేమ శాఖలో ఎలాంటి అవకతవకలు జరగటం లేదని బీసీ సంక్షేమ శాఖ డీడీ ఎం.చినబాబు ‘సాక్షి’కి తెలిపారు. బిల్లుల చెల్లింపులన్నీ పారదర్శకంగానే ఉంటాయని ఆయన చెప్పారు. ప్రొటోకాల్ పేరుతో బీసీ సంక్షేమ శాఖలో ఎలాంటి వసూళ్లకు పాల్పడటం లేదని పేర్కొన్నారు. లంచం అందలేదని పదోన్నతులకూ బ్రేక్! బీసీ సంక్షేమ శాఖలో గ్రేడ్-1 వసతిగృహాల పోస్టులు మూడు ఖాళీగా ఉన్నాయి. గ్రేడ్-2 వార్డెన్లుగా పనిచేసే వారికి గ్రేడ్-1 వార్డెన్‌గా పదోన్నతి ఇవ్వాలంటే ఒక్కొక్క పోస్టుకు లక్ష రూపాయలు సమర్పించుకోవాల్సిందేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మామూళ్లు ఇవ్వకపోవడంతో ఏడాదికాలంగా వీటిని భర్తీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్లాస్-4 ఉద్యోగులకు విద్యార్హతలు ఉన్నప్పటికీ వార్డెన్లుగా పదోన్నతులు కల్పించాలంటే దానికి ప్రత్యేక ధరను నిర్ణయించారని బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం బదిలీలు జరగనున్న నేపథ్యలో ‘ఎవరు ఏ ప్రాంతానికి వెళతారు.. ఎవరు ఎంత ఇస్తారు...’ అంటూ ఏఎస్‌డబ్ల్యూవోలు బహిరంగంగానే బేరాలకు దిగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఎందుకీ వివక్ష!
ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలందరూ ఒకటే.. అధికారపక్షం, ప్రతిపక్షం అన్న వివక్ష కూడదు. అందరూ ప్రజాప్రతినిధులే అయినందున ఒకేరీతిలో గౌరవించాలి.. ప్రభుత్వపరంగా జరిగే కార్యక్రమాలు, సమావేశాలకు తప్పనిసరిగా ఆహ్వానించాలి. అందుకు కొన్ని పద్ధతులు, సంప్రదాయాలు ఉన్నాయి. కానీ టీడీపీ పాలనలో అవన్నీ గాలిలో కలిసిపోతున్నాయి. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. స్వపక్షం, విపక్షం అన్న తేడాతోపాటు.. స్వపక్షంలోనూ విపక్షాన్ని దూరం పెట్టే కుసంస్కృతి పాదుగొంటోంది. బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఆహ్వానమే లేకపోవడం.. సమావేశ వేదికపై ఒక ఎమ్మెల్యేకు ఉచితాసనం వేసి, మిగిలిన వారిని వేదిక ముందు కూర్చోబెట్టి ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: వారందరూ శాసనసభ్యులే.. అందరికీ ఒకటే ప్రొటోకాల్ వర్తిస్తుంది. కానీ బుధవారం జరిగిన జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. పాతపట్నం ఎమ్మెల్యేకు సమావేశానికి సంబంధించిన సమాచారమే పంపకపోగా, హాజరైన ఎమ్మెల్యేల పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించారు. ఈ సమావేశానికి మంత్రి, విప్, అధికారులతోపాటు నలుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంత్రి, విప్, జిల్లా కలెక్టర్, ఇతర ముఖ్యులు వేదికపై కూర్చోవడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ వారితోపాటు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానించి ఉచితాసనం ఇచ్చారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం వేదిక దిగువన అధికారులతోపాటు కూర్చున్నారు. వీరిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులుతోపాటు టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఉన్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ గుండ లక్ష్మీదేవిని మాత్రమే మంత్రులతోపాటు వేదికపై కూర్చోనిచ్చారు. శ్రీకాకుళం ఎమ్మెల్యేలకు మాత్రమే ఎందుకు ప్రాధాన్యమిస్తున్నారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకుముందు ఆరోగ్యశాఖ మంత్రి జరిపిన సమీక్ష గానీ, బుధవారం నాటి బ్యాంకర్ల సమావేశం గానీ శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందినవి కావు. రెండూ జిల్లా స్థాయి సమావేశాలే. వీటిలో పాల్గొన్న ఎమ్మెల్యేలందరినీ వీలైతే వేదికపై కూర్చోబెట్టాలి.. లేదంటే అందరినీ దిగువన సీట్లు కేటాయించాలి. అలా కాకుండా గుండ లక్ష్మీదేవినే ఎందుకు గౌరవిస్తున్నారు.. మిగిలినవారిని ఎందుకు అగౌరవిస్తున్నట్లు?.. పోనీ ఆమె సీనియర్ ఎమ్మెల్యేనా అంటే.. అదీ కాదు. బుధవారంనాటి సమావేశంలో పాల్గొన్న మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలతో సమానంగా తొలిసారి ఎన్నికైనవారే. మరి ఎందుకీ దుస్సంప్రదాయానికి తెర తీశారన్నదానికి జిల్లా అధికారులు, మంత్రి పుంగవులే సమాధానం చెప్పాలి. సమాచారం పంపడంలోనూ.. మరోవైపు సమావేశాల సమాచారం పంపడంలోనూ అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలో వివక్ష కనిపిస్తోంది. బ్యాంకర్ల కమిటీ సమావేశానికి సంబంధించి పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు సమాచారం అందలేదు. ఇదే విషయాన్ని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు సమావేశంలో ప్రస్తావించారు. సమాచారం ఎందుకు పంపలేదని జిల్లా అధికారులను ప్రస్తావిస్తూ.. అందువల్లే ఆయన హాజరుకాలేకపోయారని చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారం జిల్లాస్థాయిలో జరిగే సమావేశాలు, కార్యక్రమాలకు జిల్లా ఎమ్మెల్యేలందరినీ తప్పనిసరిగా ఆహ్వానించాలి, వీలైనంతవరకు ఆహ్వన పత్రం పంపించాలి, సమయం లేనప్పుడు కనీసం పోన్లో అయినా తెలియజేయాలని ఆయన గుర్తు చేశారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ ‘ఇప్పుడంతా ఫాస్ట్.. ఎస్ఎంఎస్లు చూడటం నేర్చుకోవాలి’ అంటూ వ్యంగ్యంగా, అసహనంగా వ్యాఖ్యానించారు. అయితే విప్ కూన రవికుమార్ కల్పించుకొని ‘సంప్రదాయం పాటించాల్సిందేనని.. ఫోనులో అయినా సమాచారం పంపాలని, ఎస్ఎంఎస్లు చూసుకోమనడం సరికాదన్నారు. దీన్నే అంగీకరిస్తే.. రేపు మనకూ ఎస్ఎంఎస్లే వస్తాయని’ అన్నారు. -
నేపాల్‌కు ‘హిట్’ ఫార్ములా
అభివృద్ధి కార్యక్రమాలకు భారత్ దన్ను రాయితీపై రూ. 6 వేల కోట్ల రుణం నేపాల్ రాజ్యాంగ అసెంబ్లీలో మోడీ ప్రకటన ఆ దేశ ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు మూడు ఒప్పందాలపై సంతకాలు విమానాశ్రయంలో మోడీకి ఘన స్వాగతం కఠ్మాండు: సుదీర్ఘ కాలం తర్వాత నేపాల్‌లో అడుగుపెట్టిన భారత ప్రధానికి ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం ఇక్కడి త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ప్రొటోకాల్‌ని పక్కనబెట్టి మరీ నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా స్వయంగా సాదర స్వాగతం పలికారు. నేపాల్ ఇద్దరు ఉప ప్రధానులూ ఆయన వెంట వచ్చారు. 17 ఏళ్ల తర్వాత ఆ దేశంలో అడుగుపెట్టిన భారత ప్రధాని మోడీనే కావడం విశేషం. నేపాల్‌తో సరికొత్త బంధాన్ని ఏర్పరచుకుంటామని ఆ దేశానికి బయలుదేరే ముందు ప్రకటించిన మోడీ అందుకు తగినట్లే వ్యవహరించారు. నేపాల్‌కు ‘హిట్’ ఫార్ములాను ప్రకటించారు. అలాగే అయోడిన్ లోపంతో తలెత్తే జబ్బులను నివారించేందుకు అయోడైజ్డ్ ఉప్పు సరఫరాకు అంగీకరించారు. ఇందుకు రూ. 5 కోట్ల గ్రాంటును కూడా ప్రకటించారు. కాగా, విమానాశ్రయంలో దిగిన మోడీకి నేపాల్ సైన్యం గౌరవ వందనం సమర్పించింది. ఇరు దేశాల జాతీయ గీతాలను ఆలపించారు. భారత ప్రధానిని చూడటానికి స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ ఇతర అధికారులతో కూడిన బృందం మోడీ వెంట వెళ్లింది. కఠ్మాండులోని ఓ స్టార్ హోటల్లో దిగిన మోడీతో తొలుత నేపాల్ విదేశాంగ మంత్రి మహేంద్ర పాండే భద్రత, వాణిజ్యం తదితర అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తర్వాత ఇక్కడి సింగా దర్బార్ సెక్రటేరియట్లో నేపాల్ ప్రధాని సుశీల్‌తో మోడీ చర్చలు జరిపారు. నేపాల్‌లో కొనసాగుతున్న శాంతి ప్రక్రియతో పాటు రాజ్యాంగ నిర్మాణం, ఆర్థిక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. మూడు ఒప్పందాలపై ఇరువురు నేతలూ సంతకాలు చేశారు. అయోడిన్‌తో కూడిన ఉప్పు సరఫరా, పంచేశ్వర్ ప్రాజెక్టు కోసం రాజ్యాంగ సవరణతో పాటు ఇరు దేశాల అధికారిక టీవీ కేంద్రాలైన దూరదర్శన్,నేపాల్ టెలివిజన్ మధ్య సహకారంపై ఈ ఒప్పందాలు జరిగాయి. అనంతరం నేపాల్ స్పీకర్‌ను కలిసేందుకు న్యూభనేశ్వర్లోని పార్లమెంట్ భవనం వద్దకు మోడీ బయలుదేరారు. మార్గమధ్యంలో కాన్వాయ్‌ని ఆపి మరీ సాధారణ ప్రజలను పలకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘హిట్’తో శీఘ్రాభివృద్ధి.. నేపాల్ రాజ్యాంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆ దేశానికి రూ. 6 వేల కోట్ల రాయితీలతో కూడిన రుణాన్ని మోడీ ప్రకటించారు. మౌలిక వసతుల కల్పన, ఇంధన రంగంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం దీన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అందిస్తున్న సాయానికి ఇది అదనమన్నారు. నేపాల్ వేగంగా అభివృద్ధి చెందేందుకు ‘హిట్(హెచ్ఐటీ)’ ఫార్ములాను మోడీ ప్రకటించారు. ‘హిట్ అంటే హెచ్-హైవేస్(జాతీయ రహదారులు), ఐ-ఐవేస్(అంతర్గత రోడ్లు), టి-ట్రాన్స్‌వేస్(వాయు, జల మార్గాలు). ఈ మూడింటి వల్ల నేపాల్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. వీలైనంత త్వరగా ఈ బహుమతిని అందించాలని భారత్ ఆశిస్తోంది’ అని సభ కరతాళ ధ్వనుల మధ్య అన్నారు. నేపాల్‌లో జల విద్యుదుత్పత్తికి అద్భుత అవకాశాలున్నాయని, కేవలం భారత్‌కు విద్యుత్‌ను అమ్మడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాల సరసన నేపాల్ స్థానం సంపాదించవచ్చని అన్నారు. నేపాల్ రాజ్యాంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన రెండో విదేశీ నేతగా మోడీ ప్రత్యేక ంగా నిలిచారు. మోడీ శాకాహార ప్రియుడు! పరాయి దేశంలోనూ మోడీ శాకాహారానికే ఓటేస్తున్నారు. ఆదివారం రాత్రి నేపాల్ ప్రధాని సుశీల్.. మోడీకి ఐదు నక్షత్రాల హోటల్లో విందు ఇచ్చారు. భారతీయ పాకశాస్త్ర నిపుణుడు (చెఫ్) నందకుమార్ గోపీ సూచనల మేరకు మోడీ కోసం శాకాహార భోజనాన్ని సిద్ధం చేశారు. నాన్రోటి, పప్పు, కూరగాయలనే మోడీ ఇష్టపడతారని, బ్రేక్‌ఫాస్ట్‌లో మసాలా టీ, నిమ్మరసం తీసుకోవడానికి ప్రాధాన్యం చూపుతారని ఆ చెఫ్ తెలిపారు.ట నేపాలీల మది దోచుకున్న మోడీ మోడీ నేపాల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి నేపాలీ భాషలో మాట్లాడి నేపాలీల హృదయాలను కొల్లగొట్టారు. హిందీలో మాట్లాడేముందు కాసేపు నేపాలీలో మాట్లాడారు. ఇదివరకు యాత్రికుడిగా నేపాల్‌ను సందర్శించానని, ఇప్పుడు ప్రధానిగా, స్నేహితుడిగా రావడం సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. నేపాల్ శస్త్ర(ఆయుధాలు)ను వదిలి శాస్త్ర(విజ్ఞానం) వైపు మళ్లి, ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు. ఆయన 45 నిమిషాల పాటు మాట్లాడారు. -
సౌదీనావస్థ
సౌదీలో చిక్కుకున్న ఆరుగురు విశాఖ వాసులు ఉద్యోగాలిప్పిస్తామని మోసగించిన ఏజెంట్లు అయిదు నెలలుగా జీతాల్లేవు రోజూ రాత్రిపూటే భోజనం చిన్న గదిలో పది మంది నివాసం అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబాన్ని గట్టెక్కించాలి. కొడుకు కిడ్నీ శస్త్ర చికిత్సకు డబ్బు సంపాదించాలి. ఆర్థిక సమస్యలను అధిగమించాలి... అందుకోసం విదేశం వెళ్లాలనుకున్నారు. అప్పులు చేసి ఏజెంట్ల చేతిలో లక్షలు గుమ్మరించారు. సౌదీలో విమానం దిగాక మోసపోయామని తెలుసుకున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక విలపిస్తున్నారు. అయిదు నెలలుగా నరకయాతన పడుతున్నారు. స్వదేశానికి తీసుకురమ్మని వారి బంధువులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. విశాఖ రూరల్ : సౌదీ అరేబియాలో ఉద్యోగాలిప్పిస్తామని కొందరు ఏజెంట్లు చేసిన ప్రకటనలు నమ్మి జిల్లాకు చెందిన చాలా మంది వారిని సంప్రదించారు. వెల్డర్, ఫిట్టర్, టెక్నికల్ ఉద్యోగాలిప్పిస్తామని, నెలకు రూ.20 వేలకు పైగా జీతమని, భోజనం, వసతి ఉచితమని ఏజెంట్లు నమ్మించారు. దీంతో అన్నెపు గోవిందరావు (నడుపూరు), గోల్కొండ శేషగిరిబాబు (బీహెచ్‌పీవీ), పిల్లా గణేష్ (శ్రీహరిపురం), ఎమ్డీ హఫీజుల్లా (పెదగంట్యాడ), రాయె శ్రీనివాసరావు (అనకాపల్లి), కోడెపు నరసింగరావు (కశింకోట)లు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఏజెంట్లకు సమర్పించి సౌదీ వెళ్లారు. రూపాయైనా జీతం ఇవ్వలేదు అక్కడికి వెళ్లాక చెప్పిన ఉద్యోగం కాకుండా కూలి పనులు చేయించారు. పనేదైనా నెలకు రూ.20 వేల జీతం వస్తుందన్న ఆశతో సంస్థ ప్రతినిధులు చెప్పిన ప్రతీ పని చేశారు. నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వలేదు. చిన్న గదిలో 10 మందిని కుక్కడంతో నిద్రపోయేందుకు కూడా స్థలం లేక అవస్థలు పడుతున్నారు. రోజూ రాత్రి పూట మాత్రమే భోజనం పెడుతున్నారు. అయిదు నెలలుగా ఇదే పరిస్థితి ఉండటంతో కుటుంబ సభ్యులకు చెప్పుకుంటూ విలపిస్తున్నారు. ఫోన్ చేయడానికి కూడా డబ్బుల్లేక, సంస్థలో పనిచేస్తున్నవారు, బయటి వ్యక్తులను అర్ధించి వారి ఫోన్లతో ఇళ్లకు ఫోన్ చేసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. తమ వారిని వెనక్కి రప్పించాలని కుటుంబ సభ్యులు ఇటీవలే కలెక్టర్‌కు వినతిపత్రాలను అందజేశారు. కష్టాలు తమ జీవితాలకు కొత్తేమి కాదని, డబ్బులు పోయినా తమ వారిని వెనక్కు రప్పిస్తే చాలని ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు. కలెక్టరేట్‌కు సమాచారం విశాఖ జిల్లావాసులు ఆరుగురు సౌదీలో చిక్కుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి కలెక్టరేట్‌కు సమాచారం అందింది. హైదరాబాద్‌లోని ఎన్ఆర్ఐ ప్రొటోకాల్ విభాగం నుంచి వీరి చిరునామాలు కలెక్టరేట్‌కు రావడంతో రెవెన్యూ అధికారులు బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. అందుబాటులో ఉన్న వారిని కలెక్టరేట్‌కు రప్పించి అక్కడ చిక్కుకున్న వారి పూర్తి వివరాలను సేకరించారు. కొందరి ఇళ్లకు రెవెన్యూ సిబ్బందిని పంపిస్తున్నారు. ఆరుగురు జిల్లా వాసులను నిర్థారించాక ఆ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అనంతరం ప్రభుత్వం వారిని వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేస్తుందంటున్నారు. -
అమ్మవారి ఆలయంలో బ్రేక్ దర్శనం
అమ్మవారి దర్శన సమయంలో మార్పు జేఈవో పోలా భాస్కర్ తిరుచానూరు : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తిరుమల తరహాలో బ్రేక్ దర్శనం అమలుచేసేందుకు సన్నాహాలు చేపడుతున్నట్లు టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ తెలిపారు. ఆయన బుధవారం అమ్మవారి ఆస్థాన మండపంలో అర్చకులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనంలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బ్రేక్ దర్శనం(కుంకుమార్చన) ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. అలాగే అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకునేందుకు వీలుగా దాదాపు గంట సమయం పొడిగించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ప్రతిరోజూ (శుక్రవారం మినహా) ఉదయం 5 గంటలకు అమ్మవారి ఆలయాన్ని తెరుస్తున్నారని, త్వరలోనే వేకువజామున 4.30 గంటలకు అమ్మవారి ఆలయం తీసేందుకు సన్నాహాలు చేపడతామన్నారు. అలాగే రాత్రి (శుక్రవారం మినహా) 8.45 గంటలకు నిర్వహించే ఏకాంతసేవను 9.30 గంటలకు నిర్వహించాలనే విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు ఆగమ పండితుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. బ్రేక్ దర్శనం.. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేసుకునేం దుకు భక్తులు ఇష్టపడుతుంటారని, ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. దీనికోసం ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో మూడు గంటల పాటు బ్రేక్ దర్శనం అమలు చేసి ఆ సమయంలో కుంకుమార్చన సేవ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ బ్రేక్ దర్శనంలోనే రూ.100 టికెట్టు కొనుగోలు చేసిన భక్తులను సైతం అనుమతిస్తామని పేర్కొన్నారు. అపవాదును తొలగించుకునేందుకే... ప్రొటోకాల్‌కు అనుగుణంగా వీఐపీలకు అన్ని మర్యాదలతో దర్శనం చేయించాల్సి వస్తోందన్నారు. ఇవేమి తెలియని సామాన్య భక్తుల నుంచి టీటీడీ అధికారులు కొందరికే పరిమితమవుతున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారని తెలిపారు. ఈ అపవాదును తొలగించుకునేందుకే బ్రేక్ దర్శనం అమలు చేయనున్నట్లు తెలిపారు. తిరుమల తరహాలోనే అమ్మవారిని బ్రేక్ దర్శనంలోనే వీఐపీలు దర్శించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పద్ధతికి అలవాటు పడేలా అంచెలంచెలుగా బ్రేక్ దర్శనాన్ని అమలుచేయనున్నట్లు వెల్లడించారు. -
దౌర్జన్యకాండ
విత్తన పంపిణీపై టీడీపీ పెత్తనం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రారంభాన్ని అడ్డుకున్న టీడీపీ నేతలు యాదమరిలో ఘటన 3 గంటల పాటు ధర్నా అధికారంలోకి వచ్చి నెలరోజులు గడవకముందే టీడీపీ నేతల ఆగడాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రొటోకాల్‌తో పనిలేదు...రైతుల శ్రేయస్సు ముఖ్యం కాదు... రాజకీయంగా తమపంతం నెగ్గించుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. యాదమరి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన విత్తన పంపిణీలో వారు చేసిన రభస అంతాఇంతాకాదు. ఈ ఘటనతో విత్తన పంపిణీ కార్యక్రమం అర్ధాంతరంగా ఆగిపోయింది. రైతులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. సాక్షి, చిత్తూరు : వేరుశెనగ విత్తన పంపిణీ ప్రక్రియను ఈ నెల 25 నుంచిప్రారంభిస్తామని జిల్లా వ్యవసాయాధికారులు ప్రకటించారు. యాదమరి మండలంలో ఈనెల 27న పంపిణీ చేయనున్నట్లు అక్కడి ప్రాథమిక సహకార సంఘం పత్రికలో ప్రకటన ఇచ్చింది. రైతులు విత్తనకాయల కోసం డబ్బులు లేక అప్పులు తెచ్చుకున్నారు. ఇంకొందరు బంగారు తాకట్టుపెట్టి నేరుగా పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చారు. అందుకు సంబంధించిన తాకట్టు పత్రాలు కూడా వెంట తెచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే సునీల్‌కుమార్, సొసైటీ చైర్మన్ శివకుమార్ వ్యవసాయ, సొసైటీ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో విత్తన పంపిణీని ప్రారంభించారు. నాలుగు బస్తాలు పంపిణీ చేశారు. పంపిణీ ఆపాలన్న టీడీపీ నేతలు.. జీ హుజూర్ అన్న సొసైటీ కార్యదర్శి పంపిణీ మొదలవగానే సొసైటీ వైస్ చైర్మన్ పూర్ణ, టీడీపీ మండల కన్వీనర్ వినాయక గౌండర్, మాజీ ఎంపీపీ రాజమాణిక్యం, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు అమర్నాథనాయుడు అక్కడికి వచ్చారు. విత్తన పంపిణీని ఆపాలని హుకుం జారీ చేశారు. ‘ప్రభుత్వం మాది.. వైఎస్సార్సీపీ నేతలు వచ్చి ఎలా పంపిణీ చేస్తారు. మేమే విత్తన పంపిణీని ప్రారంభించాలి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు. విత్తనాలు ఇచ్చేది లేదు. రేపు మేం తిరిగి పంపిణీని ప్రారంభిస్తాం. అప్పటి వరకు విత్తనాలు ఇచ్చేది లేదు.’ అని గట్టిగా అరుస్తూ పంపిణీని అడ్డుకున్నారు. సొసైటీ కార్యదర్శి షణ్ముగం పంపిణీని నిలిపేశారు. వెంటనే రైతులు ఆందోళనకు దిగారు. పంపిణీని ఎందుకు నిలిపేశారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ‘విత్తన పంపిణీకి సొసైటీ సభ్యులు తీర్మానం చేయలేదని, కాబట్టి నిలిపేస్తున్నామనిరూ. అన్నారు. సాయంత్రం 4 గంటలకు సొసైటీ తీర్మానం చేసి పంపిణీ చేస్తామన్నారు. ఎమ్మెల్యే సునీల్ కూడా రైతులతోపాటు బైఠాయించి ఆందోళనకు దిగారు. రాజకీయ దర్పం కోసమే వాయిదా ప్రొటోకాల్ ప్రకారం విత్తన పంపిణీని స్థానిక ఎమ్మెల్యే, సొసైటీ చైర్మన్, అధికారులు చేపట్టాలి. దీనికి సొసైటీ తీర్మానం అవసరం లేదు. ఒకవేళ తీర్మానం అవసరమనుకుంటే ఈనెల 27న విత్తన పంపిణీ చేపడుతున్నట్లు పత్రికా ప్రకటన ఎందుకు ఇచ్చారు? ఎమ్మెల్యేను ఎందుకు ఆహ్వానించారు? పంపిణీ ఎలా ప్రారంభించారు? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీనికి సొసైటీ కార్యదర్శి షణ్ముగం వద్ద సమాధానం లేదు. కమిటీ ఆమోదం లేదు కాబట్టి పంపిణీ నిలిపేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారని చివరకు షుణ్ముగం వాస్తవాన్ని కుండబద్దలు కొట్టారు. రాజకీయ ప్రాబల్యం, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను అవమానించడం కోసం టీడీపీ నేతలు అడ్డుతగిలి, పంపిణీని నిలిపేశారని రైతులకు అర్థమైంది. ఁ్ఙపనులు మానుకుని, దూరప్రాంతాల నుంచి విత్తనాల కోసం వచ్చాం. తీరా ఇక్కడకు వచ్చిన తర్వాత రాజకీయ గొడవల కోసం రైతులను ఇబ్బంది పెట్టారు.రూ.రూ. అని ఆందోళనకు దిగారు. 3 గంటలపాటు ఆందోళన సాగింది. అయినా పంపిణీ ప్రారంభించలేదు. నిరాశగా రైతులు, ఎమ్మెల్యే సునీల్ వెనుదిరిగారు. -
అయ్యగారి వెంట..!
చీపురుపల్లి : రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మాజీ ప్రభుత్వాధినేతల వెంట అధికారుల ప్రోటోకాల్ అవసరం లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం చీపురుపల్లి వచ్చిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెంట ఆర్డీఓ వెంకటరావు అనుసరించడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ఈ సంఘటనను కనులారా చూసిన స్థానిక ప్రజానీకం.. ప్రస్తుత మాజీ మంత్రులు ప్రభుత్వ అధికారులకు ఇంకా తాజాలుగానే కనిపిస్తున్నారా? అందుకే వారి వెంట పడు తూ స్వామిభక్తి చాటుకుంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా? ఠ మొదటి పేజీ తరువాయి ప్రోటోకాల్ లేకపోయినా విజయన గరం ఆర్డీ ఓ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెంట ఫాలో అయ్యారా? ఇవే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాటు శిలాఫలకంపై బొత్స సత్యనారాయణ పేరు కింద పీసీసీ అధ్యక్షుడు అని రాయించిన వైద్య, ఆరోగ్యశాఖ ఇంజినీరింగు అధికారులు సైతం అత్యుత్సాహం ప్రదర్శిం చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రప తి పాలన అంటున్నారు..మాజీల వెంట అధికారులు ఫాలో అవ్వాల్సిన పని లేదంటున్నారు... అయినప్పటికీ ఇదేం విడ్డూరం అంటూ మండ ల స్థాయి అధికారులు సైతం తలలు పట్టుకుం టున్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రి వంద పడక ల ఆస్పత్రిగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయ ణ ఇక్కడికి రాగా ఆయన వెంట ఆర్డీఓ కూడా వచ్చారు. అంతేకాకుండా అక్కడ బొత్సకు వచ్చిన పలు సందేహాలపై ఆర్డీఓ చర్చించా రు. దీంతో అక్కడున్న వారంతా విస్తుపోయా రు. అక్కడి నుంచి బయలుదేరి ఇతర మండలా ల్లో జరిగే కార్యక్రమాలకు కూడా బొత్స కాన్వాయ్‌లో ఆర్డీఓ వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. దీంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో జరి గిన శంకుస్థాపన కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ ఇంజినీరింగు అధికారులు ఇదేదో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అనుకున్నారో ఏమో శిలాఫల కంపై బొత్స పేరు పక్కన పీసీసీ అధ్యక్షుడు అని రాయించడం విడ్డూరమంటూ అంతా ముక్కు న వేలేసుకుంటున్నారు. దీనిపై వైద్యారోగ్యశాఖ డీఈ శ్రీనివాస్‌తో ‘న్యూస్‌లైన్’ మాట్లాడగా ఇదివరలోనే శిలాఫల కం సిద్ధ్దం చేయించామ ని, మార్చడం కుదరలేదంటూ నీళ్లు నమిలారు. మొత్తం మీద కాంగ్రెస్ పాలన ముగిసి, రాష్ట్రప తి పాలన వచ్చినా అధికారులు ఇలా చేస్తుండడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. -
సాదాసీదాగా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ చివరి స మావేశం శనివారం మొక్కుబడిగా.. సాదాసీదా గా ముగిసింది. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవి ర్భావం.. రాష్ట్రపతి పాలన నేపథ్యంలో సాగిన సమావేశం ఏటీఆర్ (చర్యల నివేదిక) జోలికి వెళ్లలేదు. ఎజెండాలో చేర్చిన 11 ప్రధానమైన అంశాలపై మూడున్నర గంటల్లో చర్చించి మమ అనిపించారు. విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ మధుయాష్కీ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కో-చైర్మన్, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, రాజ్యసభ సభ్యులు మహ్మద్ అలీఖాన్, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ వెంకటేశ్వర్రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రారంభోపన్యాసంలో మధుయాష్కీ 29వ రాష్ట్రంలో జిల్లా చివరి విజిలెన్స్, మానిటరింగ్గా పేర్కొం టూ... తెలంగాణవాదులు, అధికారులు, ప్రజలకు ‘తెలంగాణ’ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అసువులు బాసిన అమరవీరులకు రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ప్రొటోకాల్ పేరుతో ఆటంకాలు : అన్నపూర్ణ ఆవేదన ఆభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలపై స్పష్టత లేదంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి (ప్రస్తుతం మాజీ మంత్రి) సుదర్శన్ రెడ్డి, ఎన్పీడీసీఎల్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ తదితర అధికారు ల తీరు వల్ల ఆర్మూరు నియోజకవర్గానికి మంజూరైన సుమారు రూ.200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయలేని పరిస్థితి నెలకొందని ఎమ్మె ల్యే అన్నపూర్ణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సుదర్శన్‌రెడ్డి సమయం ఇవ్వకపోవడం... అధికారులు ఆయన రానిదే శిలాఫలకం వేయలేమని ‘ప్రొటోకాల్’ పేరిట హక్కులను హరించారని, నేడో, రేపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే తమ పరిస్థితి ఏంటని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్యేలు ఏ పనులు చేపట్టాలనుకున్నా తమ దృష్టికి తేవాలని, ప్రభుత్వ నిబంధనలు, ప్రొటోకాల్స్ని పరిగణలోకి తీసుకుని అభివృద్ధి పనులు సాగేలా చూస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సేద్యానికి పనికి రాని భూములను గుర్తించి ఆ భూముల్లో ఈత, తాటిచెట్ల పెంపకానికి చర్యలు తీసుకోవడం వల్ల 3.50 లక్షల గీత కార్మీకులకు ఉపాధి లభించేలా చూడాలన్నారు. అర్బన్ శాసనసభ్యులు యెండల లక్ష్మినారాయణ మాట్లాడుతూ నగరంలో ఐదు తాగునీటి ట్యాంకులు నిర్మాణమై ట్రయిల్న్ ్రకూడా పూర్తి అయినందున ప్రజలకు తాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు వెయ్యిమందే కనెక్షన్లకు దరఖాస్తులు చేసుకున్నారని, 25 వేల మందికి అవకాశం ఉందని కలెక్టర్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని కమిషనర్ మంగ తాయారును ఆదేశించారు. రూ.23 కోట్ల నష్టపరిహారంపై సభ్యుల ఆందోళన 2010 నుంచి జిల్లాలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడంలో రాష్ర్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అన్నపూర్ణమ్మ, యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది ఆంధ్ర ప్రాతానికి చెందిన మూడు జిల్లాలకు రూ.800 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం జిల్లా ప్రజలపై వివక్ష చూపిందన్నారు. శుక్ర, శనివారాల్లో కురిసిన వడగళ్లకు భారీగా పంటలు దెబ్బతిన్నాయని, తక్షణమే సర్వే జరిపించి పరిహారం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రద్యుమ్న స్పందిస్తూ రెండు రోజులుగా కురిసిన వర్షం కారణంగాా దెబ్బతిన్న గ్రామాల్లో వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేస్తున్నారని, పూర్తికాగానే నివేదిక ప్రభుత్వానికి పంపిస్తామన్నా రు. కాగా 11 అంశాల ఎజెండాపై విజిలెన్స్, మాని టరింగ్ కమిటీలో చర్చించిన సభ్యులు.. రాష్ర్టపతి పాలన... ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నందున జిల్లా అభివృద్ధిని కలెక్టరే చూసుకోవాలంటూ ఆయనపై భారం వేశారు. ఎన్నికల పోటీ పరీక్షలో మేము బీజీ అయిపోతామంటూ.. కలెక్టర్ ఈ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరడంతో ‘ మాకు కూడా ఎన్నికల ఏర్పాట్ల బిజీ ఉంటుందం’టూ చలోక్తి విసిరారు. సభలో మధుయాష్కీ, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అన్నపూర్ణమ్మలు పార్టీలపై నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు, చలోక్తులు సభికులను పలుమార్లు నవ్వించాయి. సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఏజేసీ శేషాద్రి, వివిధశాఖల ఉన్నతాధికారులు శివలిం గయ్య, నగేశ్, వెంకటేశం, శ్రీనివాస్‌రెడ్డిలతోపాటు పలువురు పాల్గొన్నారు. -
మంత్రిగారికి కోపమొచ్చింది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రొటోకాల్ పాటించని అధికారులపై మంత్రి ప్రసాద్‌కుమార్‌కు కోపం వచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు పాల్గొన్న కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం ఆయన ఆగ్రహానికి కారణమైంది. తన హక్కులను ఉల్లంఘించిన కలెక్టర్, ఎస్పీ సహా అటవీశాఖ అధికారులపై ఏపీ లెజిస్లేచర్ రూల్ 233(1) కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రికి ప్రసాద్‌కుమార్ లేఖ రాశారు. 19వ తేదీన వికారాబాద్‌లోని అనంతగిరి అటవీక్షేత్రంలో జింకలను వదిలే కార్యక్రమానికి డీజీపీ, సీఎస్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తనకు పిలుపు రాకపోవడాన్ని మంత్రి ప్రసాద్‌కుమార్ తీవ్రంగా పరిగణించారు. స్థానిక ఎమ్మెల్యే తానేననే విషయాన్ని గుర్తించకపోవడం, అత్యున్నత అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి త నను పిలువకుండా అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడిని కావడంతోనే అధికారయంత్రాంగం తన పట్ల వివక్ష చూపిందని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించకుండా తనను అగౌరవపరిచిన హైదరాబాద్ సర్కిల్ ఫారెస్ట్ కన్జర్వేటర్ బీఎస్ఎస్ ప్రసాద్, డీఎఫ్ఓ నాగభూషణం సహా కలెక్టర్ బి.శ్రీధర్, ఎస్పీ రాజకుమారిపై చర్యలు తీసుకునేందుకు.. ఈ అంశాన్ని హక్కుల కమిటీకి నివేదించాలని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. -
సీఎస్ఏ ప్రొటోకాల్ ఉల్లంఘించింది
ముంబై: దక్షిణాఫ్రికాలో భారత పర్యటన షెడ్యూల్‌కు సంబంధించి క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిందని బీసీసీఐ వెల్లడించింది. అందుకే ఈ ఏడాది చివర్లో జరగాల్సిన ఆ పర్యటన అనిశ్చితిలో పడిందని స్పష్టం చేసింది. ‘సుదీర్ఘ కాలంగా నడుస్తున్న కొన్ని అంశాలను సరైన దిశలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ విషయమైనా బీసీసీఐ సాధారణంగానే వ్యవహరిస్తుంది. ప్రొటోకాల్ ప్రకారం సిరీస్‌ను నిర్ణయించడమనేది సంయుక్తంగా ప్రకటించాల్సిన అంశం. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను బీసీసీఐ ఆమోదం లేకుండా ప్రకటించారు’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. బీసీసీఐని సంప్రదించకుండా నవంబర్-జనవరి మధ్యలో మూడు టెస్టులు, ఓ వన్డే సిరీస్‌ను సీఎస్ఏ ప్రకటించిన సంగతి తెలి సిందే. అయితే దక్షిణాఫ్రికా పర్యటనపై తమకు ఎలాంటి ఆందోళన లేదని పటేల్ వెల్లడించారు. ‘చాలా దేశాలు భారత్‌తో క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి సమస్య లేదు. అయితే పాక్, శ్రీలంకతో సిరీస్ జరుగుతాయని వస్తున్న ఊహాగానాలు తప్పు. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదు’ అని కార్యదర్శి అన్నారు. విండీస్‌తో సిరీస్‌కు వేదికలను ఖరారు చేయలేదన్నారు. ముంబైలోని సీసీఐకి అదనంగా మరో మ్యాచ్‌ను కేటాయించే అవకాశముందని చెప్పారు.