ఆర్చీల ఏర్పాటుతో ప్రజాధనం వృథా | money waste for archies | Sakshi
Sakshi News home page

ఆర్చీల ఏర్పాటుతో ప్రజాధనం వృథా

Published Wed, Aug 10 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

ఆర్చీల ఏర్పాటుతో ప్రజాధనం వృథా

ఆర్చీల ఏర్పాటుతో ప్రజాధనం వృథా

–ప్రొటోకాల్‌కు తూట్లు పొడుస్తున్న ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం ఈఓ 
 – ఆయనపై చీఫ్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తా– ఆదోని ఎమ్మెల్యే
 
ఆదోని టౌన్‌:   ఉరుకుంద ఈరన్న స్వామి ఉత్సవాల పేరుతో ఆలయ ఈఓ ఆదోని– ఉరుకుంద మార్గంలో ఇష్టం వచ్చినట్లు ఆర్చీలు ఏర్పాటు చేసి ప్రజధనాన్ని వృథా చేస్తున్నారని ఆదోని ఎమ్మెల్మే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు.  బుధవారం  ఆయన నివాసంలో  విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.  దాదాపు వంద సంవత్సరాలుగా ఉరుకుంద ఈరన్న స్వామి ఉత్సవాలు ఏటా శ్రావణమాసంలో జరుగుతాయని, రాష్ట్రం నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితరప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారన్నారు. అయితే ఆలయ కమిటీ నిర్వాహకులు వారికి అవసరమైన ఏర్పాట్లపై దృష్టిసారించకుండా ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు. ఆర్చీలకే  ఏడాదికి దాదాపు రూ.15లక్షల మేర    ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ఆదోనిలో ఏర్పాటు చేసిన  ఆర్చీలో ప్రొటోకాల్‌ పాటించలేదని, ఎమ్మెల్యేను కాదని ఎలాంటి హోదాలేని నాయకుల నిలువెత్తు ఫొటోలు పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న ఆలయ ఈఓపై చీఫ్‌ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ కన్వీనర్‌ చంద్రకాంత్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ రాముడు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement