ఇక నుంచి మైదానంలో క్రికెటర్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాల్సిందే!
లండన్: ఇక నుంచి మైదానంలో క్రికెటర్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాల్సిందే! మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) రూపొందించిన కొత్త నియమావళిలో అంపైర్లకు మరిన్ని అధికారాలు రాబోతున్నాయి. మైదానంలో ఏమాత్రం అనుచితంగా ప్రవర్తించినా సంబంధిత ఆటగాడిని పెవిలియన్‌కు పంపే అధికారం వారికి ఉంటుంది.
అలాగే క్రికెటర్లు వాడే బ్యాట్‌ల పరిమాణం కూడా తగ్గనుంది. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఎంసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదనలకు ఎంసీసీ ఆమోదముద్ర వేసింది.