నల్లగొండ ఎంపీకి నల్లగొండ, సూర్యాపేటలో..
భువనగిరి ఎంపీకి నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో కూడా..
సెగ్మెంట్ల వారీ విభజన జిల్లాలకే పరిమితం
పార్లమెంట్ స్థానాలు, వాటి పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు యథాతథం
నియోజకవర్గాలు పెరిగినా.. అదే పద్ధతి
లోకల్ ప్రొటోకాల్ పరిధి విస్తరించడంతో ఎంపీలకు కొన్ని అధికారాలు కూడా పెరుగుతాయి. ఎంపీ ల్యాడ్స్ నిధులు సదరు పార్లమెంట్ నియోజకవర్గాలతోపాటు ఆయన లోకల్పొటోకాల్ పరిధి లోకి వచ్చే జిల్లాల్లోని మిగిలిన నియోజక వర్గాల్లో కూడా ఖర్చు చేసే వెసులు బాటు కలుగుతుంది.
నల్లగొండ : పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జిల్లాల విభజనతో పార్లమెంట్ సభ్యుల లోకల్ ప్రొటోకాల్ పరిధి పెరగనుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పది జిల్లాలు.. 24 జిల్లాలుగా విడిపోనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేప థ్యంలో రాష్ట్రంలో ఉన్న 17 మంది ఎంపీల ప్రొటో కాల్ పరిధి కూడా విస్తరించనుంది. అంటే.. ఒకే జిల్లాను రెండు లేదా మూడు జిల్లాలుగా చేయడం..ఇందులోనూ ఒకే ఎంపీ స్థానంలోకి వచ్చే నియోజకవర్గాలను రెండు, మూడు జిల్లాలకు పంచేలా ప్రతిపాదనలు తయారు చేయడంతో ఎంపీల లోకల్ ప్రొటోకాల్ పరిధి ఆ మేరకు పెరిగే అవకాశం ఉంది.
ఎంపీ ఒక్కరే... ప్రొటోకాల్ మూడు జిల్లాల్లో
జిల్లాల విభజన ద్వారా ఒక ఎంపీకి పలు జిల్లాల్లో ప్రొటోకాల్ వర్తించనుంది. ఉదాహరణకు నల్లగొండ జిల్లాలో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలున్నాయి. నల్లగొండ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ స్థానాలు ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో ఉన్నాయి. అంటే ఇప్పటివరకు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఆ జిల్లాలో మాత్రమే లోకల్ ప్రొటోకాల్ ఉంటుంది. కానీ.. ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం జిల్లా విడిపోతే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, మిర్యాలగూడ నియోజకవర్గాలు సూర్యాపేట జిల్లాలోకి వెళ్తాయి. అప్పుడు నల్లగొండ, నాగార్జునసాగర్ నల్లగొండలో ఉంటాయి. అలా జరిగితే.. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఈ రెండు జిల్లాల్లో (నల్లగొండ, సూర్యాపేట) లోకల్ ప్రొటోకాల్ వర్తిస్తుందన్నమాట. భువనగిరి ఎంపీ విషయానికి వస్తే లోకల్ ప్రొటోకాల్ పరిధి నాలుగు జిల్లాలకు వర్తించనుంది.
ప్రస్తుతం భువనగిరి పార్లమెంట్ పరిధిలో నల్లగొండ జిల్లాలోని భువనగిరి, మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ అసెంబ్లీ స్థానాలతో పాటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, వరంగల్ జిల్లా జనగామ ఉన్నాయి. అంటే భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌కు ఈ మూడు జిల్లాల్లో లోకల్ ప్రొటోకాల్ వర్తిస్తోంది. జిల్లా విభజన జరిగితే ఆయన లోకల్ పొటోకాల్ పరిధి నాలుగు జిల్లాలకు పెరగనుంది. ఎలాగంటే... భువనగిరి పార్లమెంటు పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లాలోకి వెళ్తుంది కనుక సూర్యాపేట జిల్లాలో కూడా భువనగిరి ఎంపీకి లోకల్ ప్రొటోకాల్ వర్తిస్తుందన్నమాట. ఈ జిల్లాతో పాటు నల్లగొండ, భువనగిరి కేంద్రంగా ఏర్పాటయ్యే యాదాద్రి, జనగామ నియోజకవర్గం వెళ్లే మానుకోట జిల్లాల్లో కూడా ఆయన ప్రాతినిధ్యం పెరుగుతుం ది. ఈ లెక్కన నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ సభ్యులిద్దరికీ కలిపి మొత్తం ఐదు జిల్లాల్లో ప్రొటోకాల్ వర్తిస్తుందన్నమాట. అయితే, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగినప్పటికీ, ఆయా పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అసెంబ్లీలు నియోజకవర్గాలు, జిల్లాల పరిధిలో ఎంపీ లోకల్ ప్రొటోకాల్ వర్తించనుంది.
జెడ్పీ సమావేశాలతోపాటు...
లోకల్ ప్రొటోకాల్ పరిధి పెరగడం ద్వారా ఎంపీలకు కొన్ని అధికారాలు కూడా పెరుగుతాయి. ఎంపీ ల్యాడ్స్ నిధులు సదరు పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు ఆ యన లోకల్ ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే జిల్లాల్లోని మిగిలిన నియోజకవర్గాల్లో కూ డా ఖర్చు చేసే వెసులు బాటు కలుగుతుంది. అదేవిధంగా ఎంపీ స్థానం వచ్చే అన్ని జిల్లాల జెడ్పీ, డీఆర్సీ, బ్యాంకర్ల సమావేశాలు, అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరు కావచ్చు. కానీ.. విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశాలకు చైర్మన్‌గా వ్యవహరించే అవకాశం మాత్రం ఒక్క జిల్లాలోనే ఉంటుంది. సదరు పార్లమెం ట్ పరిధిలోనికి వచ్చే అసెంబ్లీ స్థానాలు కాకుండా... జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం స్థానిక ఎంపీ తర్వాతే విస్తరణ ఎంపీలకు ప్రొటోకాల్ వర్తించనుంది.
ఎంపీలకు భలే చాన్స్..
Published Wed, May 25 2016 12:51 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
Advertisement
Advertisement