సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ను ఆర్‌ఆర్‌ఆర్(రీజినల్ రింగ్ రోడ్డు) బాధితులు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కలిశారు. తమ సమస్యను ఎంపీ దృష్టికి బాధితులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు తీసుకురావాలని గత ప్రభుత్వాన్ని రైతులు కోరారని.. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల పేదలు, రైతులు నష్టపోయారని పేర్కొన్నారు.
‘‘కొన్ని ప్రాంతాల్లో ఆర్‌ఆర్‌ఆర్ దూరాన్ని కుదించడంలో మతలబు ఉంది. హెచ్‌ఎండీఏకు అవతల ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం జరగాలి. అశాస్త్రీయ అలైన్‌మెంట్ ద్వారా నష్టం జరుగుతుంది. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ రోజు ఎంపీగా ఉన్నవారు ఈ రోజు మంత్రులుగా కొనసాగుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీరు గార్చుతున్నారనే దానికి ఇదే నిదర్శనం’’ అని లక్ష్మణ్ చెప్పారు.
ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు నితిన్ గడ్కారీ దృష్టికి తీసుకెళ్లారు, పేదవాళ్ల భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. పేదలకు అండగా బీజేపీ ఉంటుంది. అన్యాయంగా భూములు లాక్కుంటే ఎంతటి పోరాటానికి అయిన బీజేపీ వెనకాడదు’’ అని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment