- జిల్లాలో పలుచోట్ల రసాభాసగా ‘జన్మభూమి- మా ఊరు’
- పింఛన్ల తొలగింపుపై ఎక్కడికక్కడ అధికారుల నిలదీత
- ప్రొటోకాల్‌కు విరుద్ధంగా పాల్గొన్న టీడీపీ ఇన్‌చార్జ్‌లు
సాక్షి, చిత్తూరు: ‘‘సదరన్ క్యాంపులు పెట్టారు. మమ్మల్ని అర్హులని సర్టిఫికెట్లు ఇచ్చారు. ‘అభయహస్తం’ పింఛన్లు ఎప్పటి నుంచో తీసుకుంటున్నాం. ఇప్పుడు పింఛన్ డబ్బులు పెం చామని చెప్పి, ఉన్న పింఛన్లు తీసేస్తారా ? మీరంతా మట్టికొట్టుకుపోతారు. జన్మభూమి వద్దు..ఏమీ వద్దు...ఇక్కడి నుంచి పొండి.’’ -పలమనేరు ఒకటో వార్డులో జన్మభూమి తీరు ఇది.
‘‘తాగేందుకు నీళ్లు లేవు. ఏళ్ల తరబడి గ్రామసభలు పెట్టడం. అధికారులు రావడం, వెళ్లడం...తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వడం చేతకానప్పుడు జన్మభూమి ఎందుకు ? మేము ఏ సమస్యలు చెప్పినా మీరు తీర్చలేరు.’’
-కుప్పం మండలం నూలకుంటలో అధికారులపై గొడవకు దిగిన గ్రామస్తులు.
...ఈ రెండు సంఘటనలను పరిశీలిస్తే ...జన్మభూమి-మన ఊరు ఎలా జరుగుతోందో...ప్రభుత్వ తీరు...పాలనపై ప్రజలు ఏ స్థాయిలో మండిపడుతున్నారనే విషయూలు అర్థమవుతారుు. ‘జన్మభూమి-మా ఊరు’పేరుతో అధికార యంత్రాంగం శనివారం జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించింది. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు హాజరైతే...ఇంకొ న్నిచోట్ల ప్రొటోకాల్‌కు విరుద్ధంగా టీడీపీ నేతలు పాల్గొని కా ర్యక్రమాన్ని నడిపించారు. అధికారులు దీన్ని ప్రోత్సహించా రు. దీనిపై పలుచోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంతోపాటు శ్రీకాళహస్తి, పలమనేరు, పీలేరు సహా పలుచోట్ల జన్మభూమి రసాభాసగా మారింది.
పలమనేరు ఒకటో వార్డులో ఉదయం 9గంటలకే అధికారులు జన్మభూమికి హాజరయ్యారు. ప్రజలు మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఒక్కరూ రాలేదు. ఎమ్మెల్యే అమరనాథరెడ్డి వచ్చిన తర్వాత ప్రజలంతా హాజరయ్యారు. 550 అభయహస్తం పింఛన్లు..అర్హులైన వారికి వికలాంగ, వృద్ధాప్య, వితంతు పింఛన్లు తీసేశారని లబ్ధిదారులు, ప్రజలు కమిటీ సభ్యులపై మట్టి చల్లి... మట్టికొట్టుకు పోతారంటూ శాపనార్థాలు పెట్టారు. మైకులు తీసేశారు. దీంతో పింఛన్ల కమిటీలోని ఇద్దరు టీడీపీ సభ్యులను పోలీసులు పంపేశారు. పింఛను డబ్బు ఇవ్వకుండా పత్రాలు మాత్రమే ఇవ్వడంపై కూడా గొడవ జరిగింది. ఇలా పలుసార్లు ప్రజలు అధికారులపై గొడవకు దిగడంతో అర్థాంతరంగా కార్యక్రమాన్ని నిలిపేశారు. జగమర్లలో టీడీపీ ఇన్‌చార్జ్ బాలాజీ పాల్గొన్నారు. పింఛన్లు, మెమెంటోలు అతని చేతులమీదుగా అధికారులు ఇప్పించారు. దీంతో ప్రజలు అడ్డుకున్నారు.
కుప్పంలో నూలకుంటలో మంచినీళ్లు ఇవ్వలేదని అధికారులు, ప్రజాప్రతినిధులపై గ్రామస్తులు గొడవకు దిగారు. నీళ్లు కూడా ఇవ్వలేనప్పుడు సమావేశం ఎందుకని, వెళ్లిపోండని అడ్డుపడ్డారు. శ్రీకాళహస్తి 2వార్డులో 24మంది చేనేత కార్మికులకు పింఛన్లు తీసేశారని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దీంతో టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఒకటో వార్డులో 120మందికి పింఛన్లు తీసేశారని అక్కడ ఇరువర్గాలకు వాగ్వాదం జరిగింది. అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు.
గుర్రంకొండ మండలం టి. పసలవాండ్లపల్లెలో పింఛన్ల తొలగింపుపై లబ్ధిదారులు ధర్నా చేశారు. పీలేరు, కలికిరి, కలకడలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఒక్కరూపాయి నిధులు విడుదల చేయకుండా జన్మభూమి నిర్వహిస్తే ఏం ఉపయోగమని ఎమ్మెల్యే ప్రశ్నించారు.కార్వేటినగరం మండలంలో ఎమ్మెల్యే నారాయణస్వామి పాల్గొన్నారు. పింఛన్లతో పాటు పలు సమస్యలపై వినతులు స్వీకరించారు.
పూతలపట్టు పరిధిలోని కమ్మగుట్టపల్లె జన్మభూమిలో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ పాల్గొన్నారు. మంచినీటి సమస్యపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు. పింఛన్ల తొలగింపుపై ప్రశ్నించారు. ఆపై వినతి పత్రాలు అందించారు. చంద్రగిరిలో టీడీపీనేత గాలి ముద్దుకృష్ణమనాయుడు పాల్గొన్నారు.నగరి, సత్యవేడు, చిత్తూరులో పింఛన్లు, రేషన్‌కార్డులు, మంచినీటి సమస్యపై వినతిపత్రాలు అందజేశారు. మదనపల్లె, బీ.కొత్తకోట, పెద్దతిప్పసముద్రంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
తిరగబడ్డ జనం
Published Sun, Oct 5 2014 4:11 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement