రాజేంద్రనగర్ : ప్రొటోకాల్ నిబంధనలను సక్రమంగా పాటించడం లేదంటూ ఉన్నతాధికారులపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మండిపడ్డారు. మంగళవారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితోపాటు ప్రకాష్రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
స్థానికంగా రూ.82 లక్షలతో నిర్మించిన కొత్త సీసీరోడ్డును వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్సీ ఎన్ రామచందర్రావు పేరుకు బదులు ఈ కార్యక్రమంతో సంబంధం లేని వారి పేరు శిలఫలకంపై ఉండటంతో ప్రకాష్ గౌడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ నిబంధనలు పాటించడం లేదంటూ ఉన్నతాధికారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.