
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
సాక్షి, హైదరాబాద్ : భూ వివాద విషయమై రాజేంద్రనగర్ ఎమ్మెల్యేపై మైలార్ దేవ్ పల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆవుల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 447,427,506 సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేశారు. కాగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై గతంలోను పలు కేసులు ఉన్నాయి. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ప్రకాశ్ గౌడ్ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.