
ఫ్లెక్సీలో నా ఫొటో ఏదీ ?
అధికారులపై ఎంపీ శివప్రసాద్ ఆగ్రహం
పాకాల : పాకాల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ వారు రూపొందించిన ఫ్లెక్సీని వే దిక ముందు ఉంచారు. అందులో ప్రొటోకాల్ ప్రకారం తన ఫొటో లేకపోవడంపై ఎంపీ అధికారులను ప్రశ్నించారు. కార్యక్రమానికి పిలిచి ఈ విధంగా అవమానపరచడం తగదని మండిపడ్డారు. సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఎంపిగా తనకు ఉందని, అయితే సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో ఎందుకు లేకుండా చేశారని ప్రశ్నించారు. ఎంపీ పట్ల ఇంత నిర్లక్ష్య దోర ణి వహించడం అధికారుల పని తీరుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో బడుగు బలహీన వర్గాల వారికి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఎంపీపీ చాముండేశ్వరి, జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌కుమార్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నంగా నరేష్‌రెడ్డి, జిల్లా ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్ మునీశ్వర్‌రెడ్డి, టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు నాగరాజనాయుడు, ఎంపీడీవో ఎల్‌వీ. రాజ్‌గోపాల్, తహశీల్దార్ సుధాకరయ్య, సర్పంచ్‌లు, ప్రజాప్రతిధులు, అన్ని శాఖల ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు.