
అల్లూరి సీతారామరాజు, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం ఎదురైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సంధ్యారాణి సోమవారం పర్యటించారు. అయితే.. మంత్రి సంధ్యారాణి పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు ఏర్పాటుచేసిన ఆ ఫ్లెక్సీల్లో సీఎం చంద్రబాబు ఫొటో కనిపించకపోవటం గమనార్హం.
అయితే మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలు పెట్టి.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో పెట్టని వైనం కనిపించింది. దీంతో పాడేరులో ఫ్లెక్సీల ఏర్పాటు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment