పార్టీ మారే ప్రసక్తే లేదు..
పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు
సాక్షి,పాడేరు: ‘న్యాయవాది వృత్తిలో ఉన్న నాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని, ఆయన్ను మోసం చేస్తే నాకు పుట్టగతులుండవు’ అని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. సోమవారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగనన్న రాజకీయ భిక్షతో గెలిచిన తన రాజకీయ ప్రయాణం చివరి వరకు ఆయనతోనేనన్నారు. పార్టీ మారుతున్నాననే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. వైఎస్ జగన్ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో తనను గెలిపించిన పాడేరు నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాటాలు చేస్తానని, కొంతమందిలా తాను రూ.కోట్లకు అమ్ముడుపోయే రాజకీయ నాయకుడిని కాదన్నారు. 2029లో వైఎస్సార్‌సీపీదే అధికారమని, జగన్‌ను సీఎంగా చూస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు సురే‹Ùకుమార్, కిల్లు కోటిబాబునాయుడు, జిల్లా పార్టీ ప్రధాన కార్మదర్శి సీదరి మంగ్లన్నదొర, పార్టీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, పలు పంచాయతీల సర్పంచ్‌లు వంతాల రాంబాబు, బసవన్నదొర, మాజీ సర్పంచ్‌లు పాంగి సత్తిబాబు, శరభ సూర్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు డీపీ రాంబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment