
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అధ్యక్షతన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. సూపర్ సిక్స్ మోసాలు, రైతులు పడుతున్న అవస్థలు, పార్టీ శ్రేణులపై కూటమి సర్కార్ వేధింపులతో పలు అంశాలపై పార్టీ కేడర్‌కు ఆయన ఈ భేటీలో దిశానిర్దేశం చేశారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో(Tadepalle Central Office) జరుగుతున్న ఈ మీటింగ్‌కు రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంటు)లు హాజరయ్యారు.


