
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన వాయిదా
సాక్షి,అమరావతి: ఈ నెల 21న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కార్యక్రమాల్లో పలు మార్పులు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఈ నెల 22కు బదులుగా ఈ నెల 20నే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది.
ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు. అలాగే పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే జూన్ 19నాటి పులివెందుల పర్యటనను వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు.

Comments
Please login to add a commentAdd a comment