సబ్‌కలెక్టర్, లోకాయుక్తకు ఫిర్యాదు
మదనపల్లె: అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రచార ఆర్భాటం ప్రొటోకాల్ వివాదాలకు దారితీసింది. మదనపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన కనీస ప్రాధాన్యం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభంలో ఇవ్వకపోవడంతో ఆయ న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిం చిన‘ హౌస్‌ఫర్‌ఆల్’ పథకానికి సంబంధించి స్థానిక మున్సిపల్ కార్యాలయం లో గురువారం పైలాన్ ప్రారంభించారు. సంబంధిత శిలాఫలకంలో ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇవ్వలేదు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా మొదట ముద్రించాల్సిన పేరును ఎనిమిదో పేరుగా ముద్రించారు. మదనపల్లె నియోజకవర్గానికి సంబంధం లేని పేర్లను మొదటి నుంచి వరుస క్రమంలో ముద్రించారు. దీనిపై ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి సీరియస్ అయ్యారు. స్థానిక సబ్‌కలెక్టర్, లోకాయుక్తాకు కూడా ఫిర్యాదు చేయనున్నారు.
అసలు శిలాఫలకంపై ఎమ్మెల్యే పేరును ఎందుకు ప్రాధాన్యత తగ్గించి ముద్రించాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని హౌసింగ్ ఈఈ రాజేంద్రకుమార్, డీ మునీశ్వర్ నాయుడులను ప్రశ్నించారు. వారి వద్ద నుంచి సరైన సమాధానం రాలేదు. ప్రోటోకాల్ ఉల్లంఘన చట్టం కింద చర్యలను తీసుకునేందుకు వెనుకాడనని ఎమ్మెల్యే హెచ్చరించారు. అంతేకాకుండా సబ్‌కలెక్టర్, లోకాయుక్తాలకు ఫిర్యాదులను కూడా పంపారు.