
గాయని చిన్మయి సోషల్ మీడియా ద్వారా ఫైర్
ఒక అత్యాచార కేసులో అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు వివాదాన్నిరేపుతున్నాయి వక్షోజాలను పట్టుకోవడం(Grabbing Breasts), పైజామా నాడాను చింపేయడం (Snapping Pyajama String) అత్యాచార యత్నం కిందికి రావంటూ హైకోర్ట్ తీర్పునిచ్చింది. ఈ చర్యలు అత్యాచారంగా పరిగణించ లేమని పేర్కొంది దీనిని పోక్సో చట్టం కింద తీవ్రమైన లైంగికదాడిగా పరిగణించవచ్చని వెల్లడించింది. అత్యాచారయత్న దశ (preparation stage) కు, వాస్తవ ప్రయత్నం (actual attempt) మధ్య తేడాను ఉందని వ్యాఖ్యానించింది. నిందితుడు అత్యాచారం చేయాలని నిశ్చయించుకున్నట్లు రికార్డులో ఉన్న ఏ సాక్ష్యమూ లేదని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. దీనిపై మహిళా ఉద్యమకారులు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రముఖ గాయని, చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) కూడా ఈ వివాదాస్పద తీర్పుపై సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది.
2021 నాటి కేసులో పవన్, ఆకాశ్ అనే వ్యక్తులు 11 ఏళ్ల చిన్నారిని లైంగికంగా దాడి చేసినట్లు ఆరోపణలు నమోదైనాయి. ప్రాసిక్యూషన్ ప్రకారం, లిఫ్ట్ ఇస్తామని చెప్పి నిందితులు మైనర్ బాలిక పట్ల అభ్యంతకరంగా ప్రవర్తించారు. బలవంతంగా ఆమెను కల్వర్ట్ క్రింద లాగే ప్రయత్నం చేశారు. బాటసారులు జోక్యం చేసుకోవడంతో నిందితులు అక్కడి నుండి పారిపోయారు.వారు ఆ బాలికను రక్షించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విచారణలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం నిందితులైన పవన్ , ఆకాష్‌లపై మోపబడిన ఆరోపణలు అత్యాచార ప్రయత్నం నేరంగా పరిగణించబడని స్పష్టం చేసింది.ఈ చర్య వల్ల బాధితురాలు నగ్నంగా లేదా వివస్త్రగా మారినట్టు సాక్షులు చెప్పలేదు. అంతేకాదు లైంగిక దాడికి ప్రయత్నించాడన్న ఆరోపణ లేవీ లేని కోర్టు తెలిపింది.
చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?
నిందితులను ఐపీసీ సెక్షన్ 354-బి (దుస్తులను తొలగించే ఉద్దేశ్యంతో దాడి లేదా నేరపూరిత బలప్రయోగం)తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక దాడి) కింద విచారించాలని ఆదేశించింది. మరోవైపు పవన్ తండ్రి, మూడో నిందితుడు అశోక్ బాధితురాల్ని దుర్భాషలాడి, బెదిరించాడన్న ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment