అధికారులు విలువ ఇవ్వడం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారులు ఎవరూ ఎమ్మెల్యేలను గౌరవించడం లేదని, కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఎమ్మెల్యేలకు కనీసం విలువ ఇవ్వక పోగా, ‘ఉద్యమంలో పనిచేసివచ్చారు, వీళ్లకేం తెలుసు’ అనే భావనలో అధి కారులు ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు ఆరునెలల ముందు కాంగ్రెస్‌లో ఎవరూ మిగలరని, సీఎల్పీ నేత జానారెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లోకి వస్తారని జోస్యం చెప్పారు.