ప్రోటోకాల్ ఉల్లంఘించిన బాలకృష్ణ
పుష్కరాల సందర్భంగా విజయవాడకు వచ్చిన సినీహీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారు. దుర్గగుడి మీదకు వెళ్లడానికి టికెట్ కొనాల్సి ఉన్నా కొనకుండా.. సొంత వాహనాలతో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో కలిసి ఆయన కొండ మీదకు వెళ్లిపోయారు.
ఇలా ఎమ్మెల్యే నిబంధనలను ఉల్లంఘిస్తున్నా, దుర్గగుడి అధికారులు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు.