చీపురుపల్లి : రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మాజీ ప్రభుత్వాధినేతల వెంట అధికారుల ప్రోటోకాల్ అవసరం లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం చీపురుపల్లి వచ్చిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెంట ఆర్‌డీఓ వెంకటరావు అనుసరించడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది.
ఈ సంఘటనను కనులారా చూసిన స్థానిక ప్రజానీకం.. ప్రస్తుత మాజీ మంత్రులు ప్రభుత్వ అధికారులకు ఇంకా తాజాలుగానే కనిపిస్తున్నారా? అందుకే వారి వెంట పడు తూ స్వామిభక్తి చాటుకుంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా? ఠ మొదటి పేజీ తరువాయి
ప్రోటోకాల్ లేకపోయినా విజయన గరం ఆర్‌డీ ఓ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెంట ఫాలో అయ్యారా? ఇవే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాటు శిలాఫలకంపై బొత్స సత్యనారాయణ పేరు కింద పీసీసీ అధ్యక్షుడు అని రాయించిన వైద్య, ఆరోగ్యశాఖ ఇంజినీరింగు అధికారులు సైతం అత్యుత్సాహం ప్రదర్శిం చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రప తి పాలన అంటున్నారు..మాజీల వెంట అధికారులు ఫాలో అవ్వాల్సిన పని లేదంటున్నారు... అయినప్పటికీ ఇదేం విడ్డూరం అంటూ మండ ల స్థాయి అధికారులు సైతం తలలు పట్టుకుం టున్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రి వంద పడక ల ఆస్పత్రిగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయ ణ ఇక్కడికి రాగా ఆయన వెంట ఆర్‌డీఓ కూడా వచ్చారు. అంతేకాకుండా అక్కడ బొత్సకు వచ్చిన పలు సందేహాలపై ఆర్‌డీఓ చర్చించా రు. దీంతో అక్కడున్న వారంతా విస్తుపోయా రు.
అక్కడి నుంచి బయలుదేరి ఇతర మండలా ల్లో జరిగే కార్యక్రమాలకు కూడా బొత్స కాన్వాయ్‌లో ఆర్‌డీఓ వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. దీంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో జరి గిన శంకుస్థాపన కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ ఇంజినీరింగు అధికారులు ఇదేదో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అనుకున్నారో ఏమో శిలాఫల కంపై బొత్స పేరు పక్కన పీసీసీ అధ్యక్షుడు అని రాయించడం విడ్డూరమంటూ అంతా ముక్కు న వేలేసుకుంటున్నారు.
దీనిపై వైద్యారోగ్యశాఖ డీఈ శ్రీనివాస్‌తో ‘న్యూస్‌లైన్’ మాట్లాడగా ఇదివరలోనే శిలాఫల కం సిద్ధ్దం చేయించామ ని, మార్చడం కుదరలేదంటూ నీళ్లు నమిలారు. మొత్తం మీద కాంగ్రెస్ పాలన ముగిసి, రాష్ట్రప తి పాలన వచ్చినా అధికారులు ఇలా చేస్తుండడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.