జెరూసలెం: ప్రభుత్వానికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో జర్నలిస్టులు జోక్యం చేసుకునే వెసులుబాటును తగ్గిస్తూ ఇజ్రాయెల్ ప్రభుత్వం ఓ చట్టాన్ని చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి. గురువారం రాత్రి సమయం దాటాక అక్కడి ప్రభుత్వం ఈ చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం ప్రసార సాధనాల ద్వారా జర్నలిస్టులు ఒకరి పక్షానే ఉండిపోవడంగానీ, పక్షపాతం వహించడంగానీ, వ్యక్తిగత అభిప్రాయాలు తెలపడం, గ్రేడ్లను ఇవ్వడంగానీ చేయరాదు.
వీటిల్లో ఏ చర్యలకు పాల్పడినా వారిని శిక్షించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. ఒక్కోసారి ప్రభుత్వం తమకు ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ చట్టంపట్ల ఇజ్రాయెల్ ప్రెస్ కౌన్సిల్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికి భావవ్యక్తీకరణ అడ్డుకునే చర్యే అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కేబినెట్ మంత్రి అఫిర్ అకునిస్ మాత్రం దీనిపై వివరణ ఇస్తూ ఇది కొన్ని ప్రసార కార్యక్రమాలకు మాత్రమే వర్తిస్తుందని, కొన్ని టీవీ చానెళ్లు కావాలనే కొన్ని రాజకీయ పార్టీలవైపు ఉండి పనిచేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
అక్కడ వ్యక్తిగత అభిప్రాయాలకు ఇక నో..!
Published Fri, Sep 4 2015 8:56 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM
Advertisement