టెల్ అవివ్: తమ దేశంపై ఇరాన్ భారీ మిసైల్స్‌తో దాడి చేస్తే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్రంగా ఖండించటంలో విఫలమయ్యారని ఇజ్రాయెల్ మండిపడింది. ఆంటోనియో గుటెర్రెస్‌ను ‘పర్సనా నాన్ గ్రేటా’గా ప్రకటించింది. ఆయన తమ దేశంలోకి రాకుండా నిషేధం విధిస్తున్నామని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పోషల్ మీడియాలో ఓ పోస్ట్‌లో పేర్కొంది.
‘‘ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన హేయమైన దాడిని నిస్సందేహంగా ఖండించలేని ఎవరైనా ఇజ్రాయెల్ గడ్డపై అడుగు పెట్టే అర్హత లేదు. హమాస్, హెజ్‌బొల్లా, హౌతీలు ఇప్పుడు ఇరాన్ నుంచి ఉగ్రవాదులు, రేపిస్టులు, హంతకులకు ఐరాస సెక్రటరీ జనరల్ మద్దతు ఇస్తున్నారు. ఐక్యరాజ్యసమితి చరిత్రలో ఆంటోనియో గుటెర్స్ ఒక మాయని మచ్చగా మిగిలిపోతారు. ఆంటోనియో గుటెర్స్ ఉన్నా.. లేకపోయినా.. ఇజ్రాయెల్ తన పౌరులను రక్షించుకుంటుంది. అదేవింధంగా దేశ గౌరవాన్ని నిలబెట్టుకుంటుంది’’ అని ఇజ్రాయెల్ పేర్కొంది.
మంగళవారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ సుమారు 400 బాలిస్టిక్ మిసైల్స్‌తో భీకరంగా దాడులు చేసింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్.. తమ ఐరన్ డోమ్ వ్యవస్థతో ఇరాన్ మిసైల్స్‌ను అడ్డుకున్నట్లు ప్రకటించింది.
చదవండి: ఇరాన్ దాడులు.. బంకర్‌లోకి ఇజ్రాయెల్ ప్రధాని పరిగెత్తారా?
Comments
Please login to add a commentAdd a comment