Antonio guterres
-
గాజాపై ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు.. ట్రంప్‌కు ఝలక్!
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాలస్తీనాలోని గాజాపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందనే వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. ఇక, తాజాగా గాజాను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటేరస్ వ్యతిరేకించారు. దీంతో, ట్రంప్ నిర్ణయం ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.గాజాగా విషయంలో ట్రంప్ వ్యాఖ్యలపై తాజాగా ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటేరస్ స్పందించారు. ఈ క్రమంలో గాజాను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటేరస్ వ్యతిరేకించారు. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా గుటేరస్..‘పాలస్తీనా ప్రజలకు వారి సొంత భూమిలో మనుషులుగా జీవించే హక్కు ఉంది. ఐక్యరాజ్యసమితి.. అక్కడ శాంతి, స్థిరత్వం మరియు పాలస్తీనా ప్రజల విడదీయరాని హక్కులకు పూర్తిగా కట్టుబడి ఉంది. గాజాపై పరిష్కారాల అన్వేషణలో, మనం సమస్యను మరింత దిగజార్చకూడదు. అంతర్జాతీయ చట్టం పునాదికి కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. ఏ రూపంలోనైనా జాతి ప్రక్షాళనను నివారించడం చాలా అవసరం. గాజా ప్రజలపై భయంకరమైన పరిస్థితుల్లో జీవనం కొనసాగించారు. ఇప్పటికైనా పాలస్తీనియన్లకు అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. The Palestinian people have the right to simply live as human beings in their own land.The @UN is fully committed to peace, stability, and the inalienable rights of the Palestinian people.— António Guterres (@antonioguterres) February 5, 2025మరోవైపు.. గాజా ప్రాంతంలో తమ దేశ సైన్యాన్ని మోహరించడానికి ట్రంప్ సిద్దంగా లేరని వైట్ హౌస్ వర్గాలు చెప్పుకొచ్చాయి. గాజా పునర్ నిర్మాణంలో అమెరికా భాగస్వామ్యం అవసరమని ట్రంప్ విశ్వస్తున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు. In the search for solutions on Gaza, we must not make the problem worse.It is vital to stay true to the bedrock of international law.It is essential to avoid any form of ethnic cleansing.— António Guterres (@antonioguterres) February 5, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు, సంచలనాల ట్రంప్ మరో అంతర్జాతీయ సమాజంపై మరో బాంబు విసిరారు. గాజాను అమెరికా పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్‌తో యుద్ధంలో శ్మశానసదృశంగా మారిన గాజాను అత్యంత సుందర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలు చేపడతాం. భారీగా ఆవాస, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. గాజాను వీడబోం: స్థానికులు ట్రంప్ ప్రతిపాదనపై గాజా పౌరులు మండిపడుతున్నారు. ‘‘ఇన్నాళ్లకు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత సొంత గూటికి తిరిగి వెళ్తున్నాం. మా ఇళ్లను విడిచిపెట్టబోం. గౌరవప్రదమైన జీవితం కోరుకుంటున్నాం. మా నేతలను వీడాలనుకోవడం లేదు’’ అని చెబుతున్నారు. ట్రంప్ ప్రతిపాదన గాజాతో పాటు పరిసర దేశాల్లో మరింత విధ్వంసానికి, ఘర్షణకు కారణమవుతుందని వారంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయకుండా ఇజ్రాయెల్‌తో ఎలాంటి సంబంధాలను కొనసాగించబోమని స్పష్టం చేసింది. గాజన్లు తమ ఇళ్లకు తిరిగి వచ్చి పునరి్నరి్మంచాలని కోరుకుంటున్నారని ఐరాసలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ అన్నారు. వారి ఆకాంక్షలను గౌరవించాలన్నారు. ట్రంప్‌ది హాస్యాస్పద, అసంబద్ధ ప్రకటన అని హమాస్ దుయ్యబట్టింది. ‘‘ఈ తరహా ఆలోచనలు పశ్చిమాసియాలో మరిన్ని ఘర్షణలకు దారితీస్తాయి. గాజావాసులకు సమీప దేశాల్లో పునరావాసం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదన మరింత గందరగోళం, ఉద్రిక్తతలకు కారణమవుతుంది. గాజావాసులు దీనికి ఒప్పుకోరు’’ అని హమాస్ అధికారి సమీ అబు స్పష్టం చేశారు. -
ఇరాన్ దాడులు.. ఐరాస చీఫ్‌పై ఇజ్రాయెల్ నిషేధం
టెల్ అవివ్: తమ దేశంపై ఇరాన్ భారీ మిసైల్స్‌తో దాడి చేస్తే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్రంగా ఖండించటంలో విఫలమయ్యారని ఇజ్రాయెల్ మండిపడింది. ఆంటోనియో గుటెర్రెస్ను ‘పర్సనా నాన్ గ్రేటా’గా ప్రకటించింది. ఆయన తమ దేశంలోకి రాకుండా నిషేధం విధిస్తున్నామని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పోషల్ మీడియాలో ఓ పోస్ట్‌లో పేర్కొంది.‘‘ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన హేయమైన దాడిని నిస్సందేహంగా ఖండించలేని ఎవరైనా ఇజ్రాయెల్ గడ్డపై అడుగు పెట్టే అర్హత లేదు. హమాస్, హెజ్బొల్లా, హౌతీలు ఇప్పుడు ఇరాన్ నుంచి ఉగ్రవాదులు, రేపిస్టులు, హంతకులకు ఐరాస సెక్రటరీ జనరల్ మద్దతు ఇస్తున్నారు. ఐక్యరాజ్యసమితి చరిత్రలో ఆంటోనియో గుటెర్స్ ఒక మాయని మచ్చగా మిగిలిపోతారు. ఆంటోనియో గుటెర్స్ ఉన్నా.. లేకపోయినా.. ఇజ్రాయెల్ తన పౌరులను రక్షించుకుంటుంది. అదేవింధంగా దేశ గౌరవాన్ని నిలబెట్టుకుంటుంది’’ అని ఇజ్రాయెల్ పేర్కొంది.మంగళవారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ సుమారు 400 బాలిస్టిక్ మిసైల్స్‌తో భీకరంగా దాడులు చేసింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్.. తమ ఐరన్ డోమ్ వ్యవస్థతో ఇరాన్ మిసైల్స్‌ను అడ్డుకున్నట్లు ప్రకటించింది.చదవండి: ఇరాన్ దాడులు.. బంకర్లోకి ఇజ్రాయెల్ ప్రధాని పరిగెత్తారా? -
మేజర్గారి ప్రసంగం మెగా హిట్
ప్రతిష్ఠాత్మక ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డ్’ అందుకోవడంతో వార్తల్లోకి వచ్చిన మేజర్ రాధికాసేన్ తన ‘వైరల్ స్పీచ్’ ద్వారా మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘జెండర్–సెన్సిటివ్ పీస్‌కీపింగ్ ప్రాముఖ్యత గురించి తన ప్రసంగంలో నొక్కి చెప్పింది సేన్. ‘జెండర్–సెన్సిటివ్ పీస్‌కీపింగ్ అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదు. అది అందరి బాధ్యత. మహిళల ఆరోగ్యం, విద్య, శిశుసంరక్షణ. లింగసమానత్వం, లైంగిక హింసను ఎదుర్కోవడం లాంటి అంశాలపై కమ్యూనిటీలతో మమేకమయ్యే అవకాశం లభించింది’ అంటుంది సేన్. ప్రసంగం అనంతరం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ రాధికసేన్ను నిజమైన నాయకురాలిగా, మోడల్‌గా అభివర్ణించారు. -
గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
హమాస్ బలగాలను అంతం చేయటమే లక్ష్యంగా.. గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడిలో ఐక్యరాజ్య సమితిలో పనిచేసే ఓ భారతీయ వ్యక్తి మృతి చెందినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. ఆ వ్యక్తి తన వాహనంలో రఫాలోని యూరోపియన్ హాస్పటల్‌కు వెళ్తుతున్న క్రమంలో ఒక్కసారిగా జరిగిన దాడిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటుతో ఉన్న మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఇక.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఐక్యరాజ్య సమితికి చెందిన తొలి వ్యక్తి మరణంగా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.మరణించిన వ్యక్తి ఐక్యరాజ్య సమితిలోని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విభాగానికి( DSS) చెందిన భారతీయ వ్యక్తిగా తెలుస్తోంది. మృతి చెందిన వ్యక్తి భారత దేశానికి చెందిన మాజీ ఆర్మీ సైనికుడని సమాచారం.Today a @UN vehicle was struck in Gaza, killing one of our colleagues & injuring another. More than 190 UN staff have been killed in Gaza.Humanitarian workers must be protected.I condemn all attacks on UN personnel and reiterate my urgent appeal for an immediate humanitarian…— António Guterres (@antonioguterres) May 13, 2024‘‘ఐక్యరాజ్య సమితి చెందిన డీఎస్ఎస్ విభాగంలోని సభ్యుడు మరణించటం చాలా బాధాకరం. ఈ ఘటనలో మరో సభ్యుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. రఫాలోని యూరోపియన్ ఆస్పత్రికి తమ వాహనంలో వెళ్తున్న క్రమంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది’’ అని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అంటోనియో గుటెర్రెస్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.ఈ దాడి ఘటనను యూఎన్ఓ జనరల్ సెక్రటరీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ తీవ్రంగా ఖండించారు. యూఎన్ఓ సిబ్బందిపై జరిగిన అన్ని దాడులపై దర్యాప్తు చేస్తామని అన్నారు. అదేవిధంగా డిఎస్ఎస్ విభాగానికి చెందని సభ్యుడి మరణం పట్ల యూఎన్ఓ జనరల్ సెక్రటరీ గుట్రెస్ సంతాపం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. -
Israel-Hamas War: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ
ఐక్యరాజ్యసమితి: ఇజ్రాయెల్–హమాస్ మధ్య వివాదం మొదలైన అయిదు నెలల తర్వాత సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత రంజాన్ మాసంలో గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని సంబంధిత వర్గాలను కోరుతూ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. 15 సభ్యదేశాలతో కూడిన మండలిలోని 10 తాత్కాలిక సభ్యదేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రష్యా, చైనా సహా 14 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఎవరూ వ్యతిరేకించనప్పటికీ శాశ్వత సభ్యదేశం అమెరికా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. ‘గాజా విషయంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తీర్మానాన్ని భద్రతా మండలి ఆమోదించింది. తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బేషరతుగా బందీలందరినీ విడుదల చేయాలని కోరింది’అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ‘ఎక్స్’లో తెలిపారు. అలాగే, గాజాలో చిక్కుకున్న పాలస్తీనియన్ల వైద్య, ఇతర మానవతా అవసరాలను పరిష్కరించాలని, నిర్బంధించిన వారందరికీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత వర్గాలపై ఉందని తీర్మానం పేర్కొంది. ‘ఈ తీర్మానాన్ని కచి్చతంగా అమలు చేయాల్సిందే. వైఫల్యం క్షమించరానిది’ అంటూ అని గుటెరస్ వ్యాఖ్యానించారు. మండలి తీర్మానంపై ఇజ్రాయెల్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఐరాస హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ ల్యూయిస్ పేర్కొన్నారు. పాలస్తీనా ప్రజల ఆకలిచావులను ఆపేందుకు మానవతా సాయం అందించేందుకు వీలు కల్పించాలని, చట్ట విరుద్ధ దాడులను ఆపాలని ఇజ్రాయెల్‌ను కోరారు. అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న నెతన్యాహు ఐరాస తీర్మానానికి నిరసనగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్నత స్థాయి బృందంతో తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీకి సహకారం నిలిపివేయాలని కూడా ఇజ్రాయెల్ నిర్ణయించింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేయడం, ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్ తీవ్రస్థాయి యుద్ధంతో విరుచుకుపడుతుంటం తెలిసిందే. -
Israel-Hamas war: గాజాకు సాయం పునరుద్ధరించండి
రఫా: గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్లకు అందించే మానవతా సాయాన్ని యథా ప్రకారం కొనసాగించాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెరస్ సంబంధిత దేశాలను కోరారు. లేని పక్షంలో 20 లక్షల మందికి పైగా శరణార్థులకు అందాల్సిన సాయం, పునరావాస కార్యక్రమాల్లో భారీగా కోత పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే తీవ్ర మానవీయ సంక్షోభం నెలకొందని అన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడికి దిగిన విషయం తెలిసిందే. పాలస్తీనా శరణార్థులకు సాయం, పునరావాసం కోసం పనిచేస్తున్న ఐరాస సిబ్బందిలో డజను మంది ఆ దాడిలో పాల్గొన్నట్లు ఆరోపణలు రావడంతో అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ తదితర 8 దేశాలు సాయం నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. పాలస్తీనా శరణార్థులకు అందుతున్న సాయంలో ఈ దేశాల వాటా దాదాపు 60 శాతం వరకు ఉంటుంది. సాయం ఆగిపోతే పాలస్తీనా శరణార్థులకు అవసరమైన కనీస ఆహార నిల్వలు సైతం మరికొద్ది రోజుల్లోనే అడుగంటే ప్రమాదముందని భావిస్తున్నారు. హమాస్‌కు తోడ్పాటు అందించినట్లుగా భావిస్తున్న 12 మంది ఉద్యోగుల్లో ఇప్పటి వరకు 9 మందిని బాధ్యతల నుంచి తొలగించారు. ఒకరు చనిపోగా మరో ఇద్దరిని గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
కాల్పుల విరమణపై తీర్మానం..అమెరికా వీటో!
న్యూయార్క్: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి రావాలంటూ శుక్రవారం ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా మోకాలడ్డింది యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బందీలను హమాస్ మిలిటెంట్లు బేషరతుగా వెంటనే విడిచిపెట్టాలంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేసిన ప్రతిపాదనకు ఐరాసలోని 90 సభ్యదేశాలు మద్దతు పలికాయి. ఆ దేశం మండలిలో ప్రవేశపెట్టిన ఆ తీర్మానానికి మొత్తం 15 దేశాలకు గాను 13 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటేశారు. మరో శాశ్వత సభ్యదేశం బ్రిటన్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. గాజాలో మానవతా సంక్షోభ నివారణ నిమిత్తం ఇటీవల ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ అసాధారణ అధికారాన్ని ఉపయోగించారు. తక్షణమే మానవతా కోణంలో కాల్పుల విరమణ జరగాలని, పౌరుల రక్షణ కోసం, అత్యవసర సాయం అందజేయడానికి అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలని మండలి దేశాలకు గుటెరస్ పిలుపునిచ్చారు. యూఎన్ ఛార్టర్‌లోని ఆర్టికల్ 99 కింద ప్రత్యేక అధికారంతో అంతర్జాతీయంగా ఆందోళనలను కలిగించే పరిస్థితుల్లో భద్రతా మండలిని సమావేశ పరచవచ్చు. దీనిలో భాగంగా సమావేశమైన మండలిలో యూఏఈ తీర్మానంపై ఓటింగ్ జరిగింది. మండలిలో శాశ్వత సభ్య దేశమైన అమెరికా తన వీటో అధికారంతో ఆ తీర్మానాన్ని అడ్డుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అది హమాస్ పుంజుకునేందుకు ఉపయోగపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ దేశ ప్రతినిధి రాబర్ట్ వుడ్ మండలిలో మాట్లాడుతూ.. ‘ఈ తీర్మానం వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం ఉండదు. ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజలు శాంతి, భద్రతల మధ్య జీవించాలని అమెరికా బలంగా కోరుకుంటోంది. అయితే, అస్థిరమైన కాల్పుల విరమణకు అంగీకరిస్తే హమాస్ మరో యుద్ధానికి ప్రణాళిక రచిస్తుంది’అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముసాయిదాలో సవరణలు చేయాలని అమెరికా అంటోంది. మండలిలో తీర్మానాన్ని అమెరికా అడ్డుకోవడంపై యూఏఈ రాయబారి మహ్మద్ అబుషాహబ్ విచారం వ్యక్తం చేశారు. -
Israel-Hamas War: నెల రోజులుగా నెత్తురోడుతోంది
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలై నెల రోజులు దాటింది. గాజాపై భూతల దాడులను తాత్కాలికంగా నిలిపివేసిన ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులను కొనసాగిస్తోంది. బుధవారం గాజా అంతటా క్షిపణులు, రాకెట్లు ప్రయోగించింది. గాజా గత 24 గంటల వ్యవధిలో 214 మంది మరణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నెల రోజులకుపైగా సాగుతున్న యుద్ధంలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం పైచేయి సాధిస్తోంది. గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య 10,569కి చేరుకుంది. గాజాలో పెరిగిపోతున్న మరణాలపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజాస్ట్రిప్ మొత్తం చిన్నపిల్లల శ్మశాన వాటికగా మారుతోందని చెప్పారు. మృతుల సంఖ్య పెరుగుతోంది అంటే ఇజ్రాయెల్ సైన్యం తప్పుడు దారిలో పయనిస్తున్నట్లు అర్థమని స్పష్టం చేశారు. దాడులకు 4 గంటలు విరామం ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి నిత్యం వేలాది మంది దక్షిణ గాజాకు వలస వెళ్తున్నారు. ఇప్పటిదాకా దాదాపు 70 శాతం మంది వెళ్లిపోయినట్లు అంచనా. గాజా ఆసుపత్రుల్లో గుండెను పిండేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ లేక ఆసుపత్రుల్లో ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఔషధాలు, వైద్య పరికరాలు లేక క్షతగాత్రులకు చికిత్స అందించడం లేదు. ఇంక్యుబేటర్లలో శిశువులు విగత జీవులుగా మారుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. చాలా హాస్పిటళ్లలో పెట్రోల్, డీజిల్ లేక జనరేటర్లు పనిచేయడంలేదు. ఇజ్రాయెల్ సైన్యం తొలిసారిగా బుధవారం గాజాపై దాడులను 4 గంటలపాటు నిలిపివేసింది. గాజాకు మానవతా సాయం చేరవేయడానికి వీలుగా దాడులు ఆపినట్లు వెల్లడించింది. హమాస్‌పై యుద్ధం ముగిశాక గాజా రక్షణ బాధ్యతను తాము స్వీరిస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని చేసిన ప్రకటనపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ స్పందించారు. గాజాను ఆక్రమించుకొనే ఆలోచన చేయొద్దని ఇజ్రాయెల్‌కు హితవు పలికారు. ఇజ్రాయెల్‌కు జీ7 దేశాల మద్దతు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంపై జీ7 దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధులు జపాన్ రాజధాని టోక్యోలో చర్చలు జరిపారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ చర్చలు బుధవారం ముగిశాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడిని వారు ఖండించారు. ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించారు. ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని తేల్చిచెప్పారు. గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించానికి మార్గం సులభతరం చేయాలని, ఇందుకోసం హమాస్‌పై యుద్ధానికి కొంత విరామం ఇవ్వాలని జీ7 ప్రతినిధులు ఇజ్రాయెల్‌కు సూచించారు. కాల్పుల విరమణ పాటించాలని సూచించకపోవడం గమనార్హం. 50 వేల మందికి 4 టాయిలెట్లు గాజాలో నెలకొన్న భయానక పరిస్థితులను అమెరికా నర్సు ఎమిలీ చలాహన్ మీడియాతో పంచుకున్నారు. గాజాలో క్షతగాత్రులకు సేవలందించిన ఎమిలీ ఇటీవలే అమెరికా చేరుకున్నారు. 26 రోజుల తర్వాత ఈరోజే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నానని తెలిపారు. గాజాలో 26 రోజుల్లో ఐదు చోట్లకు మారాల్సి వచి్చందన్నారు. ఒకచోట 35 వేల మంది నిరాశ్రయులు ఉన్నారని తెలిపారు. ముఖాలు, మెడ, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలున్న చిన్నారులు కనిపించారని వెల్లడించారు. 50 వేల మంది తలదాచుకుంటున్న ఓ శిబిరంలో కేవలం 4 మరుగుదొడ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడ రోజుకు కొద్దిసేపు మాత్రమే నీటి సరఫరా జరిగేదని వివరించారు. -
ఐరాస భద్రతా మండలిలో భారత్.. సభ్యదేశాలదే తుది నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రపంచంలో సిసలైన దేశం అంటూ ఏదైనా ఉందంటే అది భారతదేశమేనని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. ఇండియాను ‘విశ్వ దేశం(కంట్రీ ఆఫ్ ది వరల్డ్)’గా అభివరి్ణంచారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ‘ అంతర్జాతీయంగా బహుళపక్ష వ్యవస్థలో భారత అత్యంత ముఖ్యమైన భాగస్వామి. అయితే ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇచ్చే ప్రక్రియలో నా పాత్ర ఏమీ లేదు. సభ్య దేశాలదే తుదినిర్ణయం’ అని గుటెరస్ స్పష్టంచేశారు. ‘ఐరాస భద్రతా మండలిలో, బహుపాక్షిక వ్యవస్థల్లో సంస్కరణలు తప్పనిసరి. అంతర్జాతీయ ఆర్థిక మౌలికస్వరూపం సైతం పాతదైపోయింది. ఇందులోనూ నిర్మాణాత్మకమైన సంస్కరణలు జరగాలి. అంతర్జాతీయ వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను అవి తీర్చాలి. యుద్ధాలు, సంక్షోభాలతో కాలాన్ని వృధా చేసుకోకూడదు. ఓవైపు పేదరికం, ఆకలి, అసమానతలు పెరుగుతుంటే మరోవైపు సహానుభూతి, సంఘీభావం తెలిపే గుణం తగ్గిపోతున్నాయి. మంచి కోసం అందరం కలిసికట్టుగా ముందడుగువేద్దాం’ అంటూ జీ20 దేశాలను గుటెరస్ కోరారు. సమీప భవిష్యత్తులో ఉక్రెయిన్– రష్యా శాంతి ఒప్పందం వాస్తరూపం దాలుస్తుందన్న నమ్మకం తనకు లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రపంచం కోరుకునే గణనీయమైన మార్పుల సాధనకు భారత జీ20 సారథ్యం సాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ ప్రపంచం ఒక వసుధైక కుటుంబంలా మనగలగాలంటే ముందుగా మనం ఒక్కటిగా నిలుద్దాం. ప్రపంచం ఇప్పుడు కీలకమైన మార్పు దశలో ఉంది. భవిష్యత్ అంతా భిన్న ధ్రువ ప్రపంచానిదే’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
భూగోళం.. ఇక మండే అగ్నిగోళం.. ముంచుకొస్తున్న మరో ప్రమాదం
సాక్షి, అమరావతి: భూగోళం మండే అగ్నిగోళంగా మారుతోంది. శీతల దేశాల్లో సూర్యుడు సెగలు పుట్టిస్తున్నాడు. ఎండల ధాటికి ఓ వైపు అడవులు దగ్ధమైపోతుండగా.. మరోవైపు మంచు కరిగిపోయి వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ యుగం ముగిసిపోయిందని.. ఇక గ్లోబల్ బాయిలింగ్ శకం వచ్చేసిందని ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే ఈ ఏడాది జూలైలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని యూరోపియన్ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్, ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించాయి. సాధారణంగా జూలైలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యేదని.. కానీ, ఈ ఏడాది దాదాపు 17 డిగ్రీలకు పెరిగిందని వెల్లడించాయి. 1.20 లక్షల సంవత్సరాల్లో భూమి ఇంత వేడెక్కడం ఎప్పు డూ లేదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. విపరీత వేడి కారణంగా మంచు కరిగి వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే చైనా, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికా ఈశాన్య ప్రాంతాలు, జపాన్, భారత్, పాకిస్తాన్లో ఆకస్మిక వరదలు సంభవిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఎడారి ప్రాంతాల్లో పగటిపూటతో పోలిస్తే రాత్రి సమయాల్లో వాతావరణం కాస్త చల్లబడుతుంది. కానీ, కాలిఫోర్నియాలోని ‘డెత్ వ్యాలీ’లో రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. అక్కడ జూలై నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే వాయవ్య చైనాలోనూ రికార్డు స్థాయిలో 52.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఉత్తరార్ధ గోళంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో వడగాడ్పులు వీచాయి. ఫలితంగా అంటార్కిటికాలో కూడా పెద్ద ఎత్తున మంచు కరిగిపోయింది. అలాగే ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, పోలాండ్ దేశాలను వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేశాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పొంచి ఉన్న కరువు ముప్పు..! దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, ఆసియా దేశాలు వసంత కాలం చివరి నుంచి అత్యధిక వేడిని ఎదుర్కొన్నాయని యూరోపియన్ కోపర్నికస్ నివేదిక చెబుతోంది. అమెరికాలోని దక్షిణ రాష్ట్రాల్లో క్రమం తప్పకుండా 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. గ్రీస్, ఇటలీ, క్రొయేషియా, అల్జీరియా, కెనడాలో కార్చిచ్చులు చెలరేగి అడవులను దహించాయి. నాడాలో ఏకంగా నాలుగు వారాల్లో 46 వేల చదరపు మైళ్ల అడవులు బూడిదయ్యాయి. 60 శాతం దేశాల్లోని అడవుల్లో మంటలు చెలరేగాయని నివేదిక తెలిపింది. వీటి ఫలితంగా 1950తో పోలిస్తే ప్రపంచ భూభాగంలో దాదాపు మూడో వంతు ఏటా కరువు సంభవిస్తుందని.. ఇది 10 లక్షల మందిని తీవ్ర ఆకలిలోకి నెడుతుందని శాస్త్రవేత్తల నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ ఏడాది చివరితో పాటు 2024లో ఎల్‌నినో ప్రభావం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫలితంగా బ్రిటన్, ఐర్లాండ్, బాల్టిక్ సముద్రం, జపాన్ సముద్రం, పసిఫిక్, పశ్చిమ హిందూ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. కాగా, ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ మేర కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలతో కలిసి ఐక్యరాజ్యసమితి చర్యలు చేపడుతోంది. -
గ్లోబల్ వార్మింగ్ కథ ముగిసింది.. ఐరాస తీవ్ర ఆందోళన
న్యూయార్క్: పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 1,20,000 సంవత్సరాల్లో ఈ జులై నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ.. గ్లోబల్ వార్మింగ్ యుగం ముగిసిందని.. ఇక మరిగే యుగంలోకి అడుగుపెట్టామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రికార్డు స్థాయిలో ధ్వంసమయ్యే ఉష్ణోగ్రతలు భూమిని వేడెక్కిస్తూ వచ్చాయని.. ఇక నుంచి సలసల మరిగే పరిస్థితులను ఎదుర్కొబోతున్నాం Era of global boiling has arrived అని వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా గ్లోబల్ వార్మింగ్ గురించే ఆందోళన చెందుతూ వచ్చాం. ఇక దాని గురించి ఆలోచన అక్కర్లేదు. ఎందుకంటే ఇక నుంచి భూమి సలసల మరిగిపోతుంది. ఉత్తర అర్ధగోళంలో నమోదు అవుతున్న తీవ్రమైన వేడిని.. క్రూరమైన వేసవిగా అభివర్ణించారాయన. ఇది భూగ్రహానికి వచ్చిన విపత్తు. మంచు యుగం నుంచి చూసుకుంటే.. ఈ జులైలో ప్రపంచ స్థాయి ఉష్ణోగ్రతలతో రికార్డులు బద్ధలు అయ్యాయని పేర్కొన్నారాయన. వాతావరణ మార్పు ఊహించని రీతిలో శరవేగంగా జరిగింది. ఇది భయంకరమైన పరిణామం.. ఆరంభం అయ్యిందనే అనుకోవాలి. ఇంక హెచ్చరికలు ఉండవు. త్వరపడి చర్యలు చేపట్టాలంతే అని ప్రపంచ నేతలకు పిలుపు ఇచ్చారాయన. 'The era of global warming has ended. The era of global boiling has arrived' UN Secretary General António Guterres warns of 'unbreathable' air and 'unbearable' temperatures to come.https://t.co/XO2D0c5uIb 📺 Sky 501, Virgin 602, Freeview 233 and YouTube pic.twitter.com/dhJGEC0YoD — Sky News (@SkyNews) July 27, 2023 -
లింగ సమానత్వానికి మరో 300 ఏళ్లు పడుతుంది: గుటేరస్
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న లింగ అసమానతలపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. లింగ సమానత్వం మన కళ్ల ముందే కనుమరుగు అవుతోందని పేర్కొన్నారు. మహిళలు, పురుషుల మధ్య అంతరాలు తగ్గడానికి ఇంకో 300 ఏళ్లు పడుతుందని, ఇది బాధాకరం అన్నారు. మహిళల హోదా విషయంపై ఐరాస సెషన్లో సోమవారం మాట్లాడుతూ గుటేరస్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళల హక్కులను అవహేళన చేస్తూ, ప్రమాదంలోకి నెడుతూ, ఉల్లంఘిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. లింగసమానత్వంపై సాధించిన దశాబ్దాల పురోగతి మన కళ్ల ముందే కనుమరుగు కావడం ఆలోచించాల్సిన విషయమన్నారు. అఫ్గానిస్తాన్‌లో మహిళల హక్కులను తాలిబన్ ప్రభుత్వం కాలరాస్తున్న విషయాన్ని కూడా గుటెరస్ ప్రస్తావించారు. సాధారణ ప్రజా జీవితానికి వాళ్లను దూరం చేశారని చెప్పారు. చాలా దేశాల్లో మహిళల లైంగిక, పునరుత్పత్తి హక్కులను కూడా హరించివేస్తున్నారని తెలిపారు. కొన్ని దేశాల్లో పాఠాశాలకు వెళ్లే చిన్నారులను కిడ్నాప్ చేసి దాడులు చేస్తున్నారని, మరికొన్ని దేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వాళ్లపై దారుణాలకు పాల్పడుతున్నారని వివరించారు. లింగ సమానత్వ అంతరం రోజురోజుకు మరింత పెరుగుతోందన్నారు. చదవండి: అంటార్కిటికా కరిగిపోతోంది! -
‘పెరిగే సముద్ర మట్టాలతో కొన్ని దేశాలే జలసమాధి’
భూతాప పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు కట్టడి చేయకపోతే సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరిగి పలు దేశాలను ముంచేస్తాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘పెరుగుతున్న సముద్ర మట్టాలు’ అంశంపై ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సముద్ర మట్టాలు పెరిగితే భారత్, బంగ్లాదేశ్, చైనా, నెదర్లాండ్స్ వంటి దేశాలకు చాలా ప్రమాదం. కైరో, లాగోస్, మపుటో, బ్యాంకాక్, ఢాకా, జకార్తా, ముంబై, షాంఘై, కోపెన్‌హాగెన్, లండన్, లాస్ ఏంజెలెస్, న్యూయార్క్, బ్యూనస్ ఏరిస్, శాంటియాగో వంటి నగరాలకు ముప్పు. భూతాపం 2 డిగ్రీలు పెరిగితే సముద్రమట్టాలు ఆరు మీటర్లు, 5 డిగ్రీలు పెరిగితే ఏకంగా 22 మీటర్లు పైకెగసి ఆయా దేశాలను జలసమాధి చేస్తాయి’ అని హెచ్చరించారు. చదవండి: ఘోర ప్రమాదం.. 39 మంది వలసదారులు మృతి -
ప్రతి 11 నిమిషాలకు.. ఒక యువతి బలి.. సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే..
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ/బాలిక తమ భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో దారుణ హత్యకు గురవుతున్నారని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.. మానవ హక్కుల ఉల్లంఘనల్లో మహిళలపై జరిగే హింస ముందు వరసలో ఉందని పేర్కొంది. నవంబర్ 25న ‘‘మహిళలపై హింసా నిర్మూలన‘‘ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచంలో మానవ హక్కుల ఉల్లంఘనల్లో మహిళలపై హింస విస్తృతమైనది. ప్రతీ 11 నిమిషాలకు ఒక మహిళ తన భాగస్వామి లేదంటే సొంత కుటుంబానికి చెందిన వారి చేతిల్లోనే ప్రాణాలు కోల్పోతోంది. కోవిడ్–19, ఆర్థిక వెనుకబాటుతనం, ఇతర ఒత్తిళ్లతో మహిళలపై శారీరక, మానసిక హింస ఎక్కువైపోతోంది’’ అని గుటెరస్ పేర్కొన్నారు. దీనిని ఎదుర్కోవడానికి దేశాలన్నీ కార్యాచరణ రూపొందించాలన్నారు. ‘‘మహిళలపై హింస అంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. మహిళా హక్కుల కోసం పాటు పడే సంస్థలకు నిధులను 2026 నాటికి 50 శాతం పెంచాలి. మనందరం ఫెమినిస్టులమని గర్వంగా ప్రకటించుకోవాలి’’ అన్నారు. చదవండి: ఇండోనేసియా భూకంపం.. 268కి చేరిన మృతులు -
‘ప్రపంచ దేశాలన్నీ సహకరించుకోకపోతే వినాశనమే’
షెర్మ్–ఎల్–షేక్: ప్రపంచ దేశాలన్నీ పరస్పరం సహకరించుకోకపోతే వినాశనం తప్పదని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ హెచ్చరించారు. నరక కూపం దిశగా ప్రపంచ పయనం సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులను నియంత్రించకపోతే ఊహించని ఉత్పాతాలు తప్పవని పేర్కొన్నారు. కాలుష్య ఉద్గారాల విషయంలో అతిపెద్ద దేశాలైన చైనా, అమెరికా ఇకనైనా కళ్లు తెరవాలని, రాబోయే దుష్పరిణామాలను నివారించడానికి కలిసికట్టుగా పనిచేయాలని హితవు పలికారు. ఈజిప్ట్‌లోని షెర్మ్–ఎల్–షేక్‌లో సోమవారం కాప్–27 సదస్సులో వివిధ దేశాల నేతలు, ప్రతినిధులను ఉద్దేశించి గుటేరస్ ప్రసంగించారు. భూతాపం ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని చెప్పారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయని, కరువులు, వరదలు మానవాళికి పెనుసవాళ్లు విసురుతున్నాయని గుర్తుచేశారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకొనేలా ధనిక, పేద దేశాలు ఒక కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పారు. ధనిక దేశాలు 2030 నాటికి, ఇతర దేశాలకు 2040 నాటికి బొగ్గు వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని గుటేరస్ కోరారు. మనకున్న సమయం పరిమితం వాతావరణ మార్పులకు ఫుల్స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చిందని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్–సిసీ ఉద్ఘాటించారు. మనం జోక్యం చేసుకోకపోతే వాతావరణ మార్పులు ఎప్పటికీ ఆగవని అన్నారు. సమయం పరిమితంగానే ఉందని, ప్రతి సెకెన్ కాలాన్ని వాడుకోవాలని సూచించారు. యుద్ధాన్ని ఆపాలని రష్యా, ఉక్రెయిన్‌కు విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పుల వల్ల నష్టపోతున్న పేద దేశాలకు ధనిక దేశాలకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని నైజీరియా పర్యావరణశాఖ మంత్రి మొహమ్మద్ అబ్దుల్లాహీ కోరారు. ఇందుకోసం క్లైమేట్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. -
పర్యావరణానికి ‘లైఫ్’
కెవాడియా: వాతావరణ మార్పుల కారణంగా విధ్వంసకరమైన పరిణామాల నుంచి మన భూమండలాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా భారత్ ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ కార్యాచరణ రూపు దిద్దుకుంది. ప్రధాని మోదీ, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ సంయుక్తంగా మిషన్ లైఫ్(లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్)ను ప్రారంభించారు. ప్రజలు తమ జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, దీనిని ప్రపంచ దేశాల ప్రజల్లోకి ఒక ఉద్యమంలా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర గురువారం లైఫ్ మిషన్‌ను ప్రారంభించారు. ప్రజలు లైఫ్ స్టైల్లో మార్చుకోవాల్సిన జాబితాతో పాటు లైఫ్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ మిషన్ పీ3 మోడల్ అని ప్రో ప్లేనెట్, పీపుల్‌గా వ్యాఖ్యానించారు. ‘రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్’ విధానాన్ని అందరూ అనుసరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రజలు చేయాల్సిందిదే..! ప్రతీ రోజూ ఒక వ్యక్తి జిమ్‌కి వెళ్లడానికి పెట్రోల్‌తో నడిచే బైక్, కారు వంటి వాహనాన్ని వాడే బదులుగా సైకిల్‌పై వెళ్లడం మంచిదన్నారు. ఎల్ఈడీ బల్బులు వాడితే విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని ప్రధాని హితవు పలికారు. ఇలాంటివన్నీ ప్రజలందరూ మూకుమ్మడిగా పాటిస్తే ప్రపంచ దేశ ప్రజలందరి మధ్య ఐక్యత పెరుగుతుందని మోదీ చెప్పారు. ప్రకృతి వనరుల్ని అతిగా వాడొద్దు : గుటెరస్ ప్రకృతి వనరుల్ని అతిగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. జీ–20 దేశాలు 80 శాతం గ్రీన్ హౌస్ వాయువుల్ని విడుదల చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని గుటెరస్ గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రతీ ఒక్కరి అవసరాలు తీర్చే వనరులు ఈ భూమిపై ఉన్నాయి. కానీ అందరి అత్యాశలను నెరవేర్చే శక్తి భూమికి లేదు. దురదృష్టవశాత్తూ ఇవాళ రేపు ప్రతీ ఒక్కరూ అత్యాశకి పోతున్నారు. దానిని మనం మార్చాలి’’ అని కొన్ని దశాబ్దాల కిందటే గాంధీజీ చెప్పారని ఇప్పటికీ అది అనుసరణీయమని వ్యాఖ్యానించారు. భారత్ తీసుకువచ్చిన ఈ కార్యాచరణని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. -
భారత్ మానవ హక్కుల రికార్డుపై.. యూఎన్ చీఫ్ సీరియస్
ముంబై: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తన మూడు రోజుల పర్యటనలో భారత్ మానవ హక్కుల రికార్డుపై విమర్శలు కురిపించారు. ఈ మేరకు ఆయన ముంబైలో ప్రసంగిస్తూ...ప్రభుత్వ విమర్శకులు, జర్నలిస్టులు, మహిళా రిపోర్ట్‌ర్లపై దాడులు అధికమైపోయాయి. మానవ హక్కుల మండలిలో ఎన్నుకోబడిన సభ్య దేశంగా భారత్‌కి ప్రపంచ మానవ హక్కులను రూపొందించడం, మైనారిటీ వర్గాల సభ్యులతో సహా అందరి హక్కులను రక్షించడం, ప్రోత్సహించడం వంటివి చేయాల్సిన బాధ్యత ఉంది. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్ల భారత్‌లో సాధించిన విజయాలను గురించి కూడా ప్రశంసించారు. అలాగే భారత్‌లో వైవిధ్యం గొప్పగా ఉంటే సరిపోదని, హక్కులు రక్షింపబడాలి. అలాగే ద్వేషపూరిత ప్రసంగాలను నిర్ద్వద్వంగా ఖండించి విలువలను కాపాడుకోవాలి. మానవహక్కులను భారత న్యాయవ్యవస్థ నిరంతరం రక్షిస్తూ ఉండాలి. ఈ ప్రసంగంలో భారత్ కర్భన ఉద్గారాలు తగ్గించే విషయం గురించి కూడా ప్రస్తావించారు. పునరుత్పాదక శక్తి కోసం లక్ష్యాలను నిర్దేశిస్తున్నప్పటికీ భారత్ మాత్రం 70 శాతం బొగ్గును వినయోగిస్తోంది. భారత్ వంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ చర్యలు మరిన్ని తీసుకోవాలి. ఆరవ వంతు మానవాళి అధికంగా ఉన్న భారత్ 2030 కల్లా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధిస్తుంద? లేక విచ్ఛన్న చేస్తుందా? అని ప్రశ్నించారు. (చదవండి: మానవత్వం అంటే ఇది కదా! రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటున్న ఆమెను..) -
అణు వినాశనం ముంగిట ప్రపంచం: గుటెర్రస్
ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్‌లో యుద్ధం, మధ్యప్రాచ్యం, ఆసియా దేశాల్లో ఉద్రిక్తతలు ప్రపంచాన్ని అణు వినాశనం వైపుగా నడిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఒక్క అపోహ, పొరపాటు అంచనాతో మానవాళి మొత్తాన్ని అణ్వస్త్రాలు కబళించి వేస్తాయని హెచ్చరించారు. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ) అమలుకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన సదస్సులో ఆయన మాట్లాడారు. వివిధ దేశాల వద్ద ప్రస్తుతం 13 వేల అణ్వాయుధాలు పోగుపడ్డాయని చెప్పారు. -
ముందుంది పెను ముప్పు తట్టుకోలేరు: యూఎన్ చీఫ్ సంచలన హెచ్చరిక
బెర్లిన్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆహార కొరతపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి సంక్షోభం లాంటి సమస్యలకు తోడు ఉక్రెయిన్ యుద్ధంతో తలెత్తిన పరిస్థితుల కారణంగా గ్లోబల్ ఆహార విపత్తు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. అమెరికాలో ఇప్పటికే వందల మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తున్న తీవ్ర ప్రపంచ ఆకలి సంక్షోభం 2022 లో ప్రపంచవ్యాప్తంగా మరిన్ని కుటుంబాల్లో ఆకలి కేకల్ని రగిలించనుందని యూఎన్ చీఫ్ చెప్పారు. 2023లో పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చన్నారు. బెర్లిన్‌లో ధనిక, అభివృద్ధి చెందుతున్న దేశాల అధికారుల కిచ్చిన వీడియో సందేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఎరువుల ధరలు, ఇంధన ధరలతో రైతులు సతమతమవుతున్నందున ఆసియా, ఆఫ్రికా, అమెరికా అంతటా పంటలు దెబ్బ తింటాయని గుటెర్రెస్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఆహార ఉత్పత్తిలో ఎదురయ్యే సమస్యలే వచ్చే ఏడాది ప్రపంచ ఆహార కొరతకు సంక్షోభానికి కారణం కానున్నాయని తెలిపారు. ఈ సంక్షోభం, ఆకలి విపత్తుతో ఉత్పన్నమయ్యే సామాజిక, ఆర్థిక పరిణామాలను తట్టుకునే శక్తి ఏ దేశానికి లేదన్నారు. అలాగే ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై విధించిన పాశ్చాత్య ఆంక్షలు ఆహార కొరతకు కారణమని మాస్కో చేసిన వాదన "పూర్తిగా ఆమోదయోగ్యం కాదు" అని బెర్లిన్ సమావేశంలో పాల్గొన్న జర్మన్ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్బాక్ అన్నారు. 2021 అదే నెలల్లో రష్యా ఈ సంవత్సరం మే, జూన్లలో ఎక్కువ గోధుమలను ఎగుమతి చేసిందని బేర్బాక్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆకలి సంక్షోభానికి అనేక అంశాలు కారణమన్న గుటెర్రెస్ చేసిన వ్యాఖ్యలకు ఆమె మద్దతిచ్చారు. కానీ ఉక్రెయిన్‌పై రష్యా దాడి సునామీగా పరిణమించిందన్నారు. మరోవైపు ప్రపంచ మార్కెట్ల నుండి కీలకమైన వస్తువులను వెనక్కి తీసుకున్న రష్యాను క్షమించలేమంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మండిపడ్డారు. అనేక ఇతర దేశాలతో కలిపి రష్యాపై తాము విధించిన ఆంక్షల్లో ఆహారం, ఆహార ఉత్పత్తులు, ఎరువులు, తదితరాలకు మినహాయింపు ఇచ్చినట్టు గుర్తు చేశారు. -
బీజేపీకి సంకటం.. దేశ ప్రతిష్టకు భంగపాటు
జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై, పార్టీ ఢిల్లీ శాఖ మీడియా హెడ్ నవీన్ జిందాల్‌పై కాషాయ పార్టీ పెద్దలు సస్పెన్షన్ వేటు వేశారు. ఖతార్, కువైట్, ఇరాన్ సహా పలు అరబ్ దేశాల నుంచి సదరు అభ్యంతర వ్యాఖ్యలకు నిరసన ఎదురవడంతో, అధికార బీజేపీ.. వారిపై వేటు వేసింది. మరోపక్క ఆమె వ్యాఖ్యలు.. పశ్చిమాసియా దేశాల్లో లక్షలాది భారతీయుల ఉద్యోగాలకూ, సూపర్ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకూ ఉద్వాసన లాంటి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అరబ్ దేశాలు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. ఇలాంటి తరుణంలో ఐక్యరాజ్యసమితి కూడా ఈ విషయంపై తాజాగా స్పందించింది. భారత్‌ను సున్నితంగా హెచ్చరించింది. సహనంగా ఉండాలని సలహా ఇచ్చింది. తాజాగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ.. అన్ని మతాల పట్ల గౌరవం, సహనంతో వ్యవహరించాలని సూచించారు. మరోవైపు.. బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ను స్పందించాలని పాకిస్తాన్ జర్నలిస్టు కోరారు. ఈ సందర్భంగా యూఎన్ సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ మాట్లాడుతూ.. "ఈ ఘటనకు సంబంధించిన వార్తా కథలను చూశాను. ఈ వ్యాఖ్యలను నేను స్వయంగా చూడలేదు, కానీ.. అన్ని మతాల పట్ల గౌరవం, సహనాన్ని మేము బలంగా ప్రోత్సహిస్తున్నామని నేను మీకు చెప్పగలను అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ఆమె వ్యాఖ్యలు.. గల్ఫ్‌లోని భాగస్వామ్య దేశాలతో పెరుగుతున్న భారత సంబంధాలకు ఇబ్బంది తెచ్చాయి. భారత ఉపరాష్ట్రపతి మూడు రోజుల ఖతార్ పర్యటన వేళ మరింత ఇరుకునపెట్టాయి. ఇది కూడా చదవండి: ప్రవక్తపై వ్యాఖ్యలతో దుమారం.. భగ్గుమంటున్న ముస్లిం దేశాలు -
Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై భద్రతా మండలి ఏకగ్రీవ ప్రకటన
ఐరాస/జపోరిజియా(ఉక్రెయిన్): ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధంపై, ఫలితంగా ఆ దేశంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. సమస్యకు తక్షణం శాంతియుత పరిష్కారం కనుగొనాలంటూ యుద్ధంపై తొలిసారిగా ఏకగ్రీవ ప్రకటన చేసింది. ఈ దిశగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ చేస్తున్న ప్రయత్నాలకు 15 మంది సభ్యుల సమితి పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే ప్రకటనలో యుద్ధం అనే పదాన్ని వాడకుండా జాగ్రత్త పడ్డారు. రక్తపాతం ద్వారా ఏ పరిష్కారమూ దొరకదని, దౌత్యం, చర్చల ద్వారానే యుద్ధానికి ముగింపు పలకాలన్నది ముందునుంచీ భారత వైఖరి అని ఐరాసలో భారత శాశ్వత మిషన్ కౌన్సెలర్ ప్రతీక్ మాథుర్ పునరుద్ఘాటించారు. మే 9 విక్టరీ డే సమీపిస్తున్న నేపథ్యంలో రష్యా దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సిద్ధమవుతోంది. రెండో అతి పెద్ద నగరం ఖర్కీవ్‌ను రక్షణపరంగా దుర్భేద్యంగా మార్చేసింది. ఈ నగరాన్ని లక్ష్యం చేసుకుని రష్యా ఉన్నట్టుండి దాడులను తీవ్రతరం చేసింది. మారియుపోల్‌లో అజోవ్‌స్తల్ స్టీల్ ఫ్యాక్టరీపైనా దాడులను భారీగా పెంచింది. శుక్ర, శనివారాల్లో ప్లాంటు నుంచి 50 మందికి పైగా బయటపడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. తూర్పున డోన్బాస్లోనూ పోరాటం తీవ్రతరమవుతోంది. లెహాన్స్క్లో రష్యా బలగాలు బాగా చొచ్చుకెళ్లినట్టు సమాచారం. భాగస్వాములను కాపాడుకోలేని అమెరికా బలహీనత వల్లే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగిందని అల్‌ఖైదా నేత అల్ జవహరీ విమర్శించారు. అమెరికా అగ్రరాజ్యం కాదు. దిగజారిపోతోంది’’ అన్నారు. రొమేనియా సాయం సూపర్: జిల్ బుఖారెస్ట్: దాదాపు 10 లక్షల మంది ఉక్రెయిన్ శరణార్థులను రొమేనియా ఆదుకున్న తీరు సాటిలేనిదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ కొనియాడారు. 4 రోజుల యూరప్ పర్యటనలో ప్రస్తుతం రొమేనియాలో ఉన్న ఆమె ఆదివారం మాతృ దినోత్సవాన్ని స్లొవేనియాలో ఉక్రెయిన్ సరిహద్దుల సమీప గ్రామంలో శరణార్థులతో గడపనున్నారు. రొమేనియా అధ్యక్షుని భార్య కామెరాన్ అయోహనిస్తో జిల్ భేటీ అయ్యారు. వరల్డ్ చాంపియన్ మృతి అంతర్జాతీయ యుద్ధ క్రీడల్లో ప్రపంచ చాంపియన్, రష్యా యుద్ధ ట్యాంకుల నిపుణుడు బటో బసనోవ్ (25) ఉక్రెయిన్ యుద్ధంలో మరణించాడు. అతని యుద్ధ ట్యాంకును ఉక్రెయిన్ దళాలు పేల్చేశాయి. గతేడాది జరిగిన వరల్డ్ ట్యాంక్ బయాథ్లాన్‌లో గంటకు 50 మైళ్ల వేగంతో కూడిన లక్ష్యాలను ఒక్కటి కూడా వదలకుండా ఛేదించి బసనోవ్ రికార్డు సృష్టించాడు. యుద్ధంలో 38వ కల్నల్‌ను రష్యా డోన్బాస్లో కోల్పోయింది. మరోవైపు, రష్యా ల్యాండింగ్ షిప్‌ను టీబీ2 డ్రోన్ సాయంతో స్నేక్ ఐలాండ్‌లో ముంచేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధరించిన ఖాకీ జాకెట్ లండన్‌లో జరిగిన వేలంలో 90 వేల డాలర్ల ధర పలికింది. -
Russia-Ukraine War: చేతులు కలపండి.. యుద్ధాన్ని ఆపండి
వాషింగ్టన్/ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్, రష్యా దేశాల సంక్షేమంతోపాటు మొత్తం ప్రపంచ శాంతి కోసం యుద్ధానికి ముగింపు పలకాలని పుతిన్‌ను ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కోరారు. ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మతిలేని యుద్ధం వల్ల ప్రపంచానికి హాని తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. ప్రపంచానికి ఆహార, ఎరువుల కొరత తప్పాలంటే ఉక్రెయిన్, రష్యా, బెలారస్‌ల్లో ఉత్పత్తి యథాతథంగా కొనసాగాల్సిందేనన్నారు. ఏం చేయాలో మాకు తెలుసు: భారత్ ఉక్రెయిన్–రష్యా వ్యవహారంలో ఐరాసలో ఓటింగ్‌లకు భారత్ దూరంగా ఉంటుండడాన్ని తప్పుబడుతూ ఇంగ్లండ్‌లో నెదర్లాండ్స్ రాయబారి కరెల్ వాన్ ఊస్టెరోమ్ ట్వీట్ చేశారు. దీనికి ఐరాసలో భారత శాశ్వత రాయబారి టి.ఎస్.తిరుమూర్తి గట్టిగా బదులిచ్చారు. ‘‘మీ సలహాలు, సాయం అక్కర్లేదు, ఏం చేయాలో భారత్‌కు తెలుసు’’ అంటూ అన్నారు. ఈ యుద్ధంలో విజేతలంటూ ఎవరూ ఉండరనిఐరాస భద్రతా మండలి భేటీలో మాట్లాడుతూ ఆయన అన్నారు. భారత్ ఎప్పటికీ శాంతిపక్షమేనన్నారు. రష్యాపై ‘యుద్ధ నేరాలు’: ఆమ్నెస్టీ ఉక్రెయిన్‌లో రష్యా సైనికులు యుద్ధ నేరాలకు పాల్పడ్డారని ఆమ్నెస్టీ సెక్రెటరీ జనరల్ ఆగ్నస్ కలామార్డ్ ఆరోపించారు. వారి అరాచకాలను నమోదు చేశామన్నారు. ఈ యుద్ధ నేరాలకు విచారణను రష్యా ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. విపత్తు పరిస్థితులు: జెలెన్స్కీ రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో విపత్తు తరహా పరిస్థితులు నెలకొన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా సైన్యం ఇప్పటివరకు ఉక్రెయిన్‌పై 2,014 క్షిపణులు ప్రయోగించిందని చెప్పారు. 400 ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలను రష్యా సైన్యం ధ్వంసం చేసిందని తెలిపారు. 2,682 రష్యా యుద్ధ విమానాలు తమ గగనతలంపై ప్రయాణించాయని వెల్లడించారు. మరోవైపు మారియూపోల్ నుంచి రష్యా సేనలు చాలావరకు తూర్పు ప్రాంతానికి తరలివెళ్లాయని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. శరణార్థులతో జిల్ బైడెన్ భేటీ స్లొవేకియా సరిహద్దులో ఆశ్రయం పొందుతున్న ఉక్రెయిన్ శరణార్థులను అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ కలిశారు. ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. శరణార్థుల ఆవేదన ఒక తల్లిగా తనకు తెలుసని అన్నారు. జిల్ నాలుగు రోజుల పాటు యూరప్‌లో పర్యటించనున్నారు. -
ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోవాలి!: ఆంటోనియో గుటెరస్
War Must End For the sake of the people: ఉక్రెయిన్ పై రష్యా గత రెండు నెలలు పైగా నిరవధిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండించడమే కాకుండా ఐక్యరాజ్యసమితి వ్యవహార నిబంధనలను, దాని ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిచడమేనని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నొక్కి చెప్పారు. ఐక్యరాజ్యసమితతోపాటు అనేక దేశాలు ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ముగించాలని పిలుపునిచ్చాయి. ఐతే ఇరుదేశాల మధ్య నిలిచిపోయిన శాంతి చర్చలు గురించి మాత్రం ప్రస్తావించ లేదు. ప్రపంచ ప్రజల కోసమైనా ఈ యుద్ధ ముగిసిపోవాలని ఆకాంక్షించారు. ఇటీవలే గుటెరస్ మాస్కో, కీవ్లను పర్యటించారు. దెబ్బతిన్న ఓడరేవు నగరం మారియాపోల్‌లోని పౌరుల తరలింపు కోసం తన గళం విప్పారు. చైనా, యునైటెడ్ స్టేట్స్, ఐర్లాండ్, ఫ్రాన్స్, మెక్సికోలతో సహా భద్రతా మండలిలోని మెజారిటీ సభ్యుల మధ్య నెలల తరబడి కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. యూఎన్‌లోని చైనా రాయబారి జాంగ్ జున్ ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా చేయడాన్ని విమర్శిస్తూ.. దౌత్యం మాత్రమే ఈ పోరాటాన్ని ముగించగలదని నొక్కిచెప్పారు. ఈ యుద్ధాన్ని ముగించేలా కెన్యా దౌత్యవేత్త మర్టిన్ కిమాని, గుటెరస్ మధ్యవర్తిత్వం వహించాలని జాంగ్ జున్ అన్నారు. శాంతిని నెలకొల్పేందుకు ప్రతి ఒక్క అవకాశాన్ని వినయోయగించుకోవాలని ఐక్యరాజ్యసమితిలోని ఉక్రెయిన్ రాయబారి సెర్గీ కిస్లిత్స్య అన్నారు. భద్రతామండలిలో నార్వే, మెక్కికోలో శాశ్వత సభ్యులు కానీ సభ్యులు ఆంటోనియో గుటెరస్ పిలుపునకు బలమైన మద్దతు ఇచ్చారు. భద్రత మండలిలో ఐక్యత ప్రతిపాదన పై రష్యా ఉక్రెయిన్ పై దాడికి దిగినప్పటి నుంచి అనిశ్చితంగా ఉంది. మాస్కో భద్రత మండిలి ప్రతిపాదనకు మద్దతు తెలపడానికి రష్యాకు ఇంకాస్తా సమయం పడుతుందని రష్యాన్ డిప్యూటీ రాయబారి డిమిత్రి పోలియన్స్కీ చెప్పడం గమనార్హం. (చదవండి: జో బైడెన్ సంచలన నిర్ణయం) -
Russia-Ukraine war: తూర్పున దాడి ఉధృతం
ఇర్పిన్: ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దాడులను తీవ్రం చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ముట్టడి విఫలమైన తర్వాత రష్యా తన దృష్టిని తూర్పు ఉక్రెయిన్‌వైపు మరలించింది. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్‌కు కీలకమైన పరిశ్రమలున్నాయి. దీన్ని స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చని రష్యా భావిస్తోంది. డోన్బాస్ ప్రాంతంలో రష్యా కాల్పులు అధికమయ్యాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మారియుపోల్‌లో ఇప్పటికీ ఉంటున్న పౌరులు మరిన్ని ఇక్కట్లు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆ నగరంలోని స్టీల్‌ప్లాంట్‌పై రష్యా దాడి ముమ్మరమైనట్లు శాటిలైట్ చిత్రాలు చూపుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌లో ఐరాస చీఫ్ గుటెరస్ పర్యటన కొనసాగుతోంది. యుద్ధంలో అధిక మూల్యం చెల్లించేది చివరకు సామాన్య ప్రజలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధనేరాల గురించి మాట్లాడాల్సివస్తే, అసలు యుద్ధమే నేరమని చెప్పాలన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌కు సహాయం కొనసాగిస్తామని బల్గేరియా కొత్త ప్రధాని భరోసా ఇచ్చారు. రష్యా పౌర నివాసాలపై దాడులకు దిగుతోందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. తమ అధీనంలో ఉన్న ఖెర్సాన్ నగరంలో పేలుళ్లు జరిగాయని రష్యా తెలిపింది. పోరు కొనసాగించేందుకు తమకు మరిన్ని ఆయుధాలందించాలని ఉక్రెయిన్ మిత్ర దేశాలను కోరింది. నాటో సాయం 800 కోట్ల డాలర్లు ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు నాటో దేశాలు దాదాపు 800 కోట్ల డాలర్ల సాయం అందించాయని నాటో చీఫ్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. నాటోలో చేరాలనుకుంటే ఫిన్లాండ్, స్వీడన్‌ను సాదరంగా స్వాగతిస్తామని చెప్పారు. రష్యాతో యుద్ధం సంవత్సరాలు కొనసాగినా, తాము ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తామన్నారు. కొత్త శతాబ్దిలో యుద్ధాలు ఆమోదయోగ్యం కావని ఐరాస చీఫ్ గుటెరస్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధంలో నేరాలపై ఐసీసీతో విచారణకు తాను మద్దతిస్తానన్నారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించారు. -
Russia War: శాంతి చర్చల కోసం రంగంలోకి కీలక వ్యక్తి.. పుతిన్ రెస్పాన్స్..?
వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో రష్యా భీకర దాడులు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్.. రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటన ఖరారైంది. ఈ నెల 26న రష్యాలో, 28న ఉక్రెయిన్‌లో గుటెరస్ పర్యటించనున్నారు. ఈ పర్యటన విషయంపై రెండు దేశాలకు ఆయన లేఖలు రాశారు. కాగా, రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు ఆంటోనియో గుటెరస్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన వేర్వేరుగా సమావేశం కానున్నారు. అటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్తో, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబాతోనూ ఆయన భేటీ కానున్నారు. మరోవైపు.. కాల్పుల విరమణ కోసం వివిధ పక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలితమివ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ప్రజలను తరలించేందుకు వీలుగా రష్యా యుద్ధానికి విరామం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా గుటెరస్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో 1.2 కోట్ల మందికి మానవతా సాయం అవసరం ఉందన్నారు. డొనెట్స్క్, లుహాన్స్క్, మరియుపోల్, ఖేర్సన్ వంటి నగరాల్లోనే చాలా మంది ఉక్రేనియన్లు బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చావు బతుకుల మధ్య ఉన్న ప్రజల కోసం రష్యా, ఉక్రెయిన్ దేశాలు తుపాకులు వదిలాలని పిలుపునిస్తున్నానని అన్నారు. ఇది కూడా చదవండి: రక్షణ విషయంలో రష్యాపై భారత్ ఆధారపడొద్దు -
Russia-Ukraine War: నా పదవీకాలంలో అత్యంత విషాద క్షణాలు!
న్యూయార్క్: ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం తన పదవీ కాలంలోనే అంత్యంత విషాదకరమైన క్షణమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ అంశంపై చర్చించేందుకు ఐరసా భద్రతా మండలి గురువారం అత్యవసరంగా సమావేశమైంది. ‘‘ నా హృదయాంతరాళాల్లోంచి పుతిన్‌కు విజ్ఞప్తి చేస్తున్నా! ఉక్రెయిన్‌పై దాడికి పంపిన మీ బలగాలను ఆపండి. చాలామంది చనిపోయినందున దయచేసి శాంతికి అవకాశం ఇవ్వండి’’ అని భద్రతా మండలి సమావేశాన్ని ఆరంభించినట్లు గుటెరస్ మీడియాకు చెప్పారు. ఈ సమావేశం జరుగుతుండగానే పుతిన్ యుద్ధ ప్రకటన వెలువడింది. దీంతో ‘‘పుతిన్, మానవత్వం పేరు మీద అభ్యర్థిస్తున్నా మీ బలగాలను వెంటనే రష్యాకు మరలించండి. ఈ శతాబ్ది ప్రారంభం నుంచి ఐరోపా చూడని అత్యంత ఘోరమైన యుద్ధాన్ని ప్రారంభించడానికి అనుమతించకండి. ఈ పరిణామాలు ఉక్రెయిన్‌కు మాత్రమే కాక ప్రపంచానికే వినాశకారిగా మారతాయి. ఇవి మొత్తం రష్యా ఫెడరేషన్‌కే కాక ప్రపంచమంతటికీ విషాదభరిత పరిణామాలవుతాయి’’ అని గుటెరస్ మరో ప్రకటన చేశారు. కోవిడ్ నుంచి కోలుకుంటున్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై దాడి దుష్ప్రభావం చూపుతుందని, అభివృద్ధి చెందుతున్న దేశాలు కోలుకోవడం క్లిష్టంగా మారుతుందని చెప్పారు. చదవండి: (రష్యాకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఆ దేశాల జోలికొస్తే ఖబడ్దార్) పుతిన్ ప్రకటనతో కల్లోలం ఉద్రిక్తతలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చకు ఐరాస భద్రతా మండలి సమావేశమైంది. సమావేశం జరుగుతుండగానే పుతిన్ యుద్ధ ప్రకటన వచ్చింది. దీంతో ఒక్కమారుగా ఆయా దేశాల సభ్యులు షాక్ అయ్యారు. శాంతిస్థాపన కోరుతూ మండలి సభ్యులు సమావేశమైన సమయంలోనే, భద్రతామండలి బాధ్యతను తృణీకరిస్తూ పుతిన్ ప్రకటన చేశారని ఐరాసలో అమెరికా ప్రతినిధి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో మండలి కలిసికట్టుగా వ్యవహరించాలని కోరారు. ఈ విషయంలో మండలిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతామన్నారు. చదవండి: (Vladimir Putin: రష్యాకి ఎక్కడిదీ బరి తెగింపు!.. వాటిని చూసుకొనేనా..?) పుతిన్ చర్యల అనైతికమని, అన్యాయమని, ఉక్రెయిన్‌కు, ఐరసా సూత్రాలకు ఇది చీకటి రోజని యూకే ప్రతినిధి బార్బరా వుడ్వార్డ్ విచారం వెలిబుచ్చారు. రష్యా చర్యలకు ప్రతి చర్యలుంటాయని హెచ్చరించారు. యుద్ధాన్ని ఆపేందుకు మండలి కృషి చేయాలన్నారు. రష్యా యుద్ధాన్ని కోరుకుందని, దీన్ని తమ దేశం తీవ్రంగా ఖండిస్తోందని ఫ్రాన్స్ రాయబారి నికోలస్ డీరివెరె చెప్పారు. ఈ చర్యలకు రష్యా మండలి ముందు బాధ్యత వహించాలన్నారు. రష్యా చర్య అన్యాయమని ఐరాసలో ఉక్రెయిన్ రాయబారి సెర్గీ క్లైస్లిట్సియా ఆవేదన వెలిబుచ్చారు. ఫిబ్రవరి నెలకు మండలికి రష్యా తరఫున అధ్యక్షత వహిస్తున్న వాస్లీ నెబెంజియా వెంటనే తన బాధ్యతలను నెరవేర్చాలని సెర్గీ డిమాండ్ చేశారు. పుతిన్‌తో చెప్పి యుద్ధాన్ని ఆపాలని కోరారు. మండలిలో రష్యా ఆక్రమణను ఖండిస్తూ తీర్మానం చేయాలన్న నిర్ణయంపై ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అయితే తాము కేవలం కీవ్‌లో పదవిలో ఉన్న జుంటాకు వ్యతిరేకమని, ఉక్రెయిన్ ప్రజలకు కాదని రష్యా రాయబారి వాస్లీ చెప్పారు. ఇది యుద్ధం కాదని, డోన్బాస్లో ఒక ప్రత్యేక మిలటరీ చర్యని చెప్పారు. -
అక్కడ ఉగ్రవాదులకు అపరిమిత స్వేచ్ఛ.. ఐరాస ఆందోళన
ఐరాస: కల్లోలిత అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాద మూకలు అంతులేని స్వేచ్ఛను అనుభవిస్తున్నాయని, వాటికి ఎదురే లేకుండా పోయిందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుట్టెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గానిస్తాన్‌లోని ఐసిస్ అనుబంధ సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ లెవాంట్–ఖోరాసన్’కు సనావుల్లా గఫారీ అలియాస్ సాహ బ్ అల్-ముజాహిర్ నేతృత్వం వహిస్తున్నాడు. గత ఏడాది కాబూల్ ఎయిర్‌పోర్టుపై దాడికి సంబంధించి గఫారీపై అమెరికా సోమవారం 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. -
లతా మంగేష్కర్‌కు ఐరాస కార్యదర్శి నివాళి
న్యూయార్క్: ప్రఖ్యాత బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ మృతిపట్ల ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుట్టెరస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత ఉపఖండ గొంతు లత అని అభివర్ణించారు. లతా మంగేష్కర్ మరణం భారత్‌కు తీర్చలేని నష్టమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత కుటుంబానికి కూడా పూడ్చలేని లోటన్నారు. ఆమె ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ఉంటారన్నారు. ఐరా స ఉన్నతోద్యోగి అనితా భాటియా తదితరులు కూడా లత మృతికి తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. విదేశాల్లోని భారతీయ సంఘాలు లత మరణంపై విచారం వ్యక్తం చేశాయి. (చదవండి: బోరు కొడుతుందని సెక్యూరిటీ గార్డు చేసిన నిర్వాకం!... ఏకంగా రూ. 7 కోట్లు భారీ నష్టం) -
తీరుమారని తాలిబన్లు
న్యూయార్క్: అఫ్గాన్‌లో ప్రభుత్వ మాజీ సభ్యులు, మాజీ భద్రతా దళ సభ్యులు, అంతర్జాతీయ దళాలతో కలిసి పనిచేసిన వారు.. కలిపి దాదాపు 100 మందికి పైగా స్వదేశీయులను తాలిబన్లు చంపినట్లు నమ్మకమైన ఆరోపణలు వచ్చాయని ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుట్టెరస్ చెప్పారు. హతుల్లో మూడింట రెండొందలమందిని సరైన విచారణ లేకుండానే తాలిబన్లు పొట్టనబెట్టుకున్నారన్నారు. తమ హయాంలో దేశీయులందరికీ క్షమాభిక్ష పెడుతున్నామని, కక్ష సాధింపులుండవని గతంలో తాలిబన్లు ప్రకటించారు. కానీ ఇందుకు విరుద్ధంగా తాలిబన్లు వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అఫ్గాన్‌లో హక్కుల కార్యకర్తలు, మీడియాపై దాడులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని గుట్టెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. అటు తాలిబన్లు, ఇటు ఐఎస్ ఉగ్రవాదులు కలిపి ఇప్పటికి 8 మంది పౌర హక్కుల కార్యకర్తలను చంపారని, 10 మందిని నిర్బంధించారని తెలిసిందన్నారు. గత ఆగస్టులో అఫ్గాన్ పగ్గాలు తాలిబన్ల వశమయ్యాయి. త్వరలో ఎన్నికలు జరుపుతామని తాలిబన్లు ప్రకటించారు. కానీ ఇంతవరకు అలాంటి ఊసు తీసుకురాలేదు, పైగా మహిళలపై తీవ్ర నిర్భంధం మొదలైంది. దేశంలో మానవహక్కుల పరిరక్షణ జరపకపోతే విదేశీ సాయం అందించమని పలు దేశాలు ప్రకటిస్తున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. అఫ్గాన్‌లో ప్రస్తుతం అనేక సమస్యలు తాండవం చేస్తున్నాయని, దాదాపు 3 కోట్లమంది సంక్షోభ కోరల్లో చిక్కుకున్నారని ఆంటోనియో చెప్పారు. మరోవైపు తాలిబన్లపై ఎన్ఆర్ఎఫ్, ఐసిస్ దాడులు కూడా పెరిగాయన్నారు. తాలిబన్లలో జాతుల వైరుధ్య తగాదాలు ముదిరాయని చెప్పారు. -
ఐక్యరాజ్యసమితి దినోత్సవం.. చరిత్ర, విశేషాలు
ప్రతి ఏడాది అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. అంతేకాదు ఈ రోజు ప్రాముఖ్యత, ఏవిధంగా ఏర్పాటైంది తదితర విషయాలను స్మృతి పథంలోకి తీసుకురావడమే కాక రాబోయేతరాలకు చాటి చెప్పేలా ఈ దినోత్సవాన్ని అన్ని దేశాలు కలిసి ఘనంగా నిర్వహిస్తాయి. 1945 అక్టోబర్ 24 ఐక్యరాజ్యసమితి అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది ఈ రోజున ఏడాది ఐక్యరాజ్యసమితి వార్షికోత్సవం (ఐక్యరాజ్యసమితి) దినోత్సవంగా నిర్వహిస్తారు. చరిత్ర: 'యునైటెడ్ నేషన్స్' అనే పేరును యునైటెడ్ స్టేట్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఉపయోగించారు. యూఎన్‌లో ఆరు కీలక విభాగాలు ఉన్నాయి. అవి ప్రధానంగా జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, సెక్రటేరియట్ తదితరాలు న్యూయార్క్‌లోని యూఎన్ ప్రధాన కార్యాలయంలో ఉండగా, అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉంది. ఐక్యరాజ్య సమితి(యూఎన్) ఏర్పడిన సమయంలో యూఎన్ 51 సభ్య దేశాలను కలిగి ఉంది. ఇందులో ప్రస్తుతం 193 సభ్యదేశాలు ఉన్నాయి. ప్రాముఖ్యత: ఐక్యరాజ్యసమితి అనేది అంతర్జాతీయ శాంతి, భద్రతల దృష్ట్య దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా దేశాలన్నింటిని ఏకతాటి పైకి తీసుకొచ్చేలా సమన్వయం చేసే కేంద్రంగా ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. యూఎన్ దినోత్సవ వేడుకలు యూఎన్ దినోత్సవం సాధారణంగా న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ హాల్లో ఐక్యతకు గుర్తుగా అన్ని దేశాలు కలిసి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అయితే ఈ ఏడాది యూఎన్ డే ప్రత్యక్ష్యంగా అన్ని దేశాలు వేర్వేరుగా ముందుగా రికార్డు చేసిన ప్రదర్శనలతో ఈ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించాయి. ఈ మేరకు అక్టోబరు 21న రిపబ్లిక్ ఆఫ్ కొరియా, శాశ్వత మిషన్ స్పాన్సర్ చేసిన “బిల్డింగ్ బ్యాక్ టు గెదర్ ఫర్ పీస్ అండ్ ప్రోస్పెరిటీ” అనే థీమ్‌తో ఈ దినోత్సవాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. ‘76 సంవత్సరాల క్రితం విపత్కర సంఘర్షణల నీడ నుండి బయటపడే ప్రపంచానికి యూఎన్ ఆశావాహ దృక్పథంగా ఆవిష్కరింపబడింది. దేశవ్యాప్తంగా ఈ UNని మహిళలు, పురుషులు ఆ ఆశను చిగురించేలా మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎక్స్పో 2020 దుబాయ్ అక్టోబర్ 24న వివిధ అధికారిక కార్యక్రమాలతో ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని గౌరవ దినంగా జరుపుకుంటోంది’ అన్నారు. -
మహాత్ముడి స్ఫూర్తితో కరోనాపై పోరు
ఐక్యరాజ్యసమితి: గాంధీజీ ఇచ్చిన శాంతి సందేశాన్ని ప్రపంచ సమాజం అందిపుచ్చుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకోవడం కాదు, మనందరి ఉమ్మడి శత్రువైన కరోనా మహమ్మారిపై మహాత్ముడి స్ఫూర్తితో కలిసికట్టుగా యుద్ధం సాగిద్దామని సూచించారు. కరోనాను ఓడించడమే మన లక్ష్యం కావాలని చెప్పారు. గాంధీజీ జయంతి రోజే అంతర్జాతీయ అహింసా దినం కావడం యాదృచ్ఛికం కాదని అన్నారు. ఆయన పాటించిన అహింసా, శాంతియుత నిరసనలు, గౌరవం, సమానత్వం అనేవి మాటలకు అతీతమైనవని తెలిపారు. మానవాళి భవిష్యత్తుకు అవి చోదక శక్తులని ఉద్ఘాటించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులకు ఇవి చక్కటి పరిష్కార మార్గాలని వివరించారు. ఈ మేరకు అంతర్జాతీయ అహింసా దినం సందర్భంగా గుటెరస్ శనివారం ఒక సందేశం విడుదల చేశారు. ఘర్షణలు, వాతావరణ మార్పులు, పేదరికం, అసమానతలు, అపనమ్మకం, ప్రజల మధ్య విభజనలు ప్రపంచానికి పెద్ద సమస్యగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
మయన్మార్ నుంచి భారత్‌కు 15వేల మంది: ఐరాస
ఐక్యరాజ్యసమితి: మయన్మార్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా జనం వీధుల్లోకి వచ్చారు. ప్రజల నిరసనలపై మయన్మార్ సైన్యం ఉక్కుపాదం మోపింది. విచ్చలవిడిగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో 1,120 మంది చనిపోయినట్లు అంచనా. ఘర్షణలు, హింసాకాండ నేపథ్యంలో మయన్మార్ నుంచి 15,000 మందికిపైగా పౌరులు సరిహద్దు దాటి, భారత్‌లోకి ప్రవేశించారని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. చదవండి: అఫ్గాన్ పరిణామాలతో తీవ్ర ప్రభావం!.. అంత రహస్యమెందుకు? ఈ మేరకు ఆయన ‘మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలు, ఇతర మైనార్టీల మానవ హక్కుల పరిస్థితి’పేరిట ఒక నివేదికను ఐరాస సర్వ సభ్య సమావేశంలో సమర్పించారు. ఇందులో పలు అంశాలను ప్రస్తావించారు. ఫిబ్రవరి 1 కంటే ముందే సంక్షోభ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా 3.36 లక్షల మంది సొంత ప్రాంతాలను వదలిపెట్టారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 తర్వాత 2.20 లక్షల మంది అంతర్గతంగా నిరాశ్రయులయ్యారని వివరించారు. మరో 15వేల మందికిపైగా జనం సరిహద్దు దాటి, పొరుగు దేశమైన భారత్‌కు చేరుకున్నారని తెలిపారు. చదవండి: నేడు గాంధీ జయంతి: మహాత్ముడికి సోనియా, మోదీ నివాళులు -
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల న్యాయవాదిగా నోబెల్ గ్రహిత కైలాశ్ సత్యార్థి: యూఎన్
న్యూయార్క్: యూఎన్ జనరల్ అసెంబ్లీ 76వ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) న్యాయవాదిగా నోబెల్ గ్రహిత కైలాశ్ సత్యార్థిని నియమిస్తున్నట్లుగా శుక్రవారం ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు. ఈ మేరకు కైలాశ్ సత్యార్థి తోపాటు స్టెమ్ కార్యకర్త వాలెంటినా మునోజ్ రబనాల్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాండ్‌స్మిత్, కే పాప్ సూపర్‌స్టార్స్ బ్లాక్ పింక్‌లను ఎస్డీజీ కొత్త న్యాయవాదులుగా నియమిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ఒక ప్రతిక ప్రకటనలో తెలిపింది. (చదవండి: ఫస్ట్ టైం.. బెజోస్-మస్క్ మధ్య ఓ మంచి మాట) ఈ సందర్భంగా యూఎన్ చీఫ్ గుటెర్రెస్ మాట్లాడుతూ... కొత్తగా నియమితులైన ఈ ఎస్డీజీ న్యాయవాదులు తమ సరికొత్త విధానాలతో సంక్షోభంలో ఉన్న ప్రపంచాన్ని సుస్థిరాభివృద్ధి దిశగా నడిపించటమే కాక తమ ఆశయాలను నెరవేర్చుకోగలరంటూ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశ పురోగాభివృద్ధికై 17 అంశాలతో కూడిన సుస్థిరభివృద్ధి లక్ష్యాల కోసం ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు కలిసి పనిచేస్తామని అంగీకరించిన సంగతిని గుర్తు చేశారు. ఈ క్రమంలో 2030 కల్లా ఐక్యరాజ్యసమితి వర్కింగ్ గ్రూప్ సుస్థిరాభివృద్ధి కోసం ప్రతిపాదించిన లక్ష్యాల గురించి కూడా ప్రస్తావించారు. బాలకార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణ, బానిసత్వం వంటి వాటిపై నోబెల్ గగ్రహిత కైలాశ్ సత్యార్థి దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: ఎర్త్ - 2.0,‘అయ్యా! ఇంతకీ ఆ భూమి ఏ నగరంలో ఉంది?’) -
అఫ్గాన్‌కు భారీ స్థాయిలో ఆర్థికసాయం!
ఐక్యరాజ్య సమితి/జెనీవా: తాలిబన్లు చెరబట్టిన అఫ్గాన్‌ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు భారీ స్థాయిలో ఆర్థికసాయం చేస్తామని ప్రకటించాయి. కరువు, పేదరికం, వలసలతో సతమతమవుతున్న అఫ్గాన్ ప్రజల ఆకలి, వసతుల కష్టాలు తీర్చేందుకు 1.2 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.8,836 కోట్లు) ఆర్థిక సాయం చేస్తామని పలు దేశాలు హామీ ఇచ్చాయని ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ వెల్లడించారు. ఉగ్రవాదం పెచ్చరిల్లకుండా చూడడం, మానహక్కుల పరిరక్షణ తదితర సమస్యలపైనా ప్రపంచ దేశాలు తమ వంతు కృషిచేయాలని గుటెర్రస్ సూచించారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్‌కు సత్వర ఆర్థిక సాయం కోరుతూ ఐరాస సోమవారం జెనీవాలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం తెల్సిందే. ఈ ఏడాది అవసరాలు తీర్చేందుకు కనీసం 60.6 కోట్ల డాలర్ల సాయం చేయాలని గుటెర్రస్ కోరడం విదితమే. ‘ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సమాజం నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఏకంగా 1.2 బిలియన్ డాలర్ల సాయం చేస్తామని ‘ముఖ్యమైన’ దేశాలు ప్రకటించాయి. నా అంచానాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో విరాళాలు వస్తున్నాయి. అఫ్గాన్‌కు అంతర్జాతీయ సమాజం ఎంతటి భారీ స్థాయిలో ఆర్థిక తోడ్పాటు ఇస్తుందనడానికి ఈ ఘటనే తార్కాణం’ అని స్విట్జర్లాండ్ నగరం జెనీవాలో పత్రికా సమావేశంలో గుటెర్రస్ చెప్పారు. ‘తాలిబన్ల అనుమతి లేకుండా మానవతా కార్యక్రమాల అమలు అసాధ్యం. మానవ హక్కులు, మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదం.. అంశమేదైనా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు సాయం అందాలంటే తాలిబన్ ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు కొనసాగించాల్సిందే’ అని ఆయన స్పష్టంచేశారు. ‘ తాలిబన్ల దురాక్రమణ, కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద వేలాది మంది అఫ్గాన్ అభాగ్యుల పడిగాపులు, బాంబు పేలుళ్లు వంటి విషాదకర ఘటనలతో స్థానికుల భవిష్యత్ అగమ్యగోచరమైన నేపథ్యంలో ఐరాస అక్కడ సహాయ కార్యక్రమాలను కొనసాగించడం తప్పనిసరి’ అని గుటెర్రస్ వ్యాఖ్యానించారు. -
తాలిబన్ విజయంతో ఉగ్రమూకలకు ధైర్యం!
న్యూయార్క్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు విజయం సాధించడం ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లోని ఉగ్రవాదులకు ధైర్యాన్నిచ్చే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకపక్క అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, మరోపక్క తాలిబన్లతో ఐరాస చర్చలు జరపాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అంతర్జాతీయ సంబంధాల్లో అఫ్గాన్ కీలక పాత్ర పోషించాలని ఐరాస ఆశిస్తోందన్నారు. ‘‘ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అఫ్గాన్‌లో తాలిబన్లు విజయం సాధించడం ఇతర ప్రాంతాల్లోని ఉగ్రవాదులకు మనోధైర్యాన్నిస్తున్నది నిజం. అయితే ఇతర ఉగ్రగ్రూపులు తాలిబన్లతో పోలిస్తే భిన్నమైనవి, వీరి మధ్య పోలిక కనిపించదు.’’ అని ఆంటోనియో అభిప్రాయపడ్డారు. పలు టెర్రరిస్టు గ్రూపులు తాలిబన్లకు అభినందనలు పంపడమే కాకుండా, తమ సామర్ధ్యంపై బలమైన నమ్మకాన్ని పెంచుకుంటున్నాయన్నారు. ఆఫ్రికాలోని సహేల్ ప్రాంతంలో తీవ్రవాదుల దుశ్చర్యలను ఆయన ప్రస్తావించారు. చాలా ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని సమర్థంగా తిప్పికొట్టే పరిస్థితులు లేవన్నారు. దీనివల్ల టెర్రరిస్టులు క్రమంగా పట్టు సాధిస్తున్నారు, వీరికి తాజా పరిణామాలు ధైర్యాన్నిస్తున్నాయని చెప్పారు. ఐకమత్యమే అవసరం ఒక టెర్రరిస్టు గ్రూపు.. అది ఎంత చిన్నదైనా సరే, ఆత్మాహుతికి సిద్ధపడి ఒక దేశంపై దాడికి దిగితే, సదరు దేశ సైన్యాలు సైతం ఆ గ్రూపును ఎదుర్కోలేకపోతాయని ఆంటోనియో ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఉదాహరణగా అఫ్గాన్ ఆర్మీ 7రోజుల్లో మాయమవడాన్ని ప్రస్తావించారు. టెర్రరిజంపై యావత్ ప్రపంచం ఏకతాటిపై నిలబడితే సమర్ధవంతంగా ఎదుర్కోగలమన్నారు. అఫ్గాన్‌ను ఉగ్రవాదులకు నిలయంగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. అఫ్గాన్ తాలిబన్లతో ఐరాస నిరంతరం చర్చిస్తోందని, ఈ స్థితిలో చర్చలే ఉత్తమమార్గమని ఆయన చెప్పారు. తాలిబన్ల ప్రభుత్వం సమ్మిళితంగా ఉంటుందని ఆశించామని చెప్పారు. తాలిబన్లు అన్ని వర్గాలను పాలనలో మిళితం చేయాలని, మానవ హక్కులను కాపాడాలని, మహిళలు, బాలికల హక్కులపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ సంబంధాల్లో అఫ్గానిస్థాన్ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు. -
అఫ్గనిస్తాన్ సంక్షోభంపై ఐరాస స్పందన
సాక్షి,న్యూఢిల్లీ: అఫ్గనిస్తాన్ సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ప్రస్తుత పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది. తమతోపాటు, అంతర్జాతీయ సమాజం కలిసి నిలబడాలని, కలిసి పని చేయాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ విజ్ఞప్తి చేశారు. హింసను తక్షణమే అంతం చేయాలని పిలుపునిచ్చారు. తాము అఫ్గన్ ప్రజలను విడిచి పెట్టకూడదు, పెట్టలేమని పేర్కొన్నారు. ప్రపంచ తీవ్రవాద ముప్పును అణిచివేసేందుకు తమ వద్ద ఉన్న అన్ని సాధనాల ప్రయోగించాలని ఆయన ప్రపంచానికి పిలుపున్చారు. రాజధాని కాబూల్‌ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత నిర్వహించిన అత్యవసర సమావేశంలో గుటెరస్ మాట్లాడారు. బలప్రయోగంతో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్ల చర్య అంతర్యుద్ధానికి దారితీస్తుందని వ్యాఖ్యానించారు. మరోవైపు తాలిబన్లు అప్గన్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత చైనా తాలిబన్లకు మద్దతుగా నిలవగా, అక్కడి సంక్షోభ పరిస్థితులను పరిశీలిస్తున్నామని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈరోజు రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చదవండి: Delivery Guy: ఎంత పని చేశాడు, షాకింగ్ వీడియో If there is zero-tolerance for terrorism in all its forms & manifestations & it's ensured that Afghan territory isn't used by terrorist groups to threaten or attack any other country, then Afghanistan's neighbours & region would feel safer: India's Ambassador to UN, TS Tirumurti pic.twitter.com/WVGJAK4vdM — ANI (@ANI) August 16, 2021 WATCH LIVE: UN Security Council holds a meeting on the situation in Afghanistan https://t.co/uQWuXJZsGt — PBS NewsHour (@NewsHour) August 16, 2021 -
ఐరాస సెక్రటరీ జనరల్‌గా మళ్లీ గుటెరస్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి(సెక్రటరీ జనరల్)గా ఆంటోనియో గుటెరస్(72) మరోసారి ఎన్నికయ్యారు. సమితి సాధారణ సభ శుక్రవారం ఆయనను ఎన్నుకుంది. రెండోసారి ఈ పదవిలో గుటెరస్ నియామకం 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. 2026 డిసెంబర్ 31వ తేదీదాకా.. అంటే ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. జనరల్ సెక్రటరీగా గుటెరస్ రెండోసారి ఎన్నికకు భారత్ ఇంతకుముందే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గుటెరస్ 2017 జనవరి 1న ఐరాస 9వ సెక్రెటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది డిసెంబర్ 31న పదవీ కాలం ముగియనుంది. -
యూఎన్ చీఫ్‌గా మళ్లీ ఆంటోనియా గుటెరస్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా వరుసగా రెండోసారి ఆంటోనియా గుటెరస్‌ను నియమించాలని యూఎన్ భద్రతా మండలి సిఫారసు చేసింది. యూఎన్ చీఫ్‌గా మళ్లీ ఆంటోనియాకే అవకాశం ఇవ్వాలని మంగళవారం జరిగిన సమావేశంలో 15 దేశాల భద్రతామండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. గుటెరస్ పేరుని సూచిస్తూ ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభకు తీర్మానాన్ని పంపింది. 193 సభ్యదేశాలున్న సర్వ ప్రతినిధి సభ (జనరల్ అసెంబ్లీ) ఆమోదిస్తే వరుసగా రెండోసారి... 2022 జనవరి 1 నుంచి అయిదేళ్ల పాటు గుటెరస్ ఈ పదవిలో ఉంటారు. మరోవైపు భారత్ భద్రతామండలి తీర్మానాన్ని స్వాగతించింది. (చదవండి: గాంధీ మునిమనవరాలికి ఏడేళ్ల జైలుశిక్ష ) -
UN Chief: కరోనా మహమ్మారి మనతోనే ఉంది
ఐక్యరాజ్యసమితి: కోవిడ్–19 ముప్పు తొలగిపోలేదని, మహమ్మారి ఇంకా మనతోనే ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ హెచ్చరించారు. వైరస్ రూపాంతరం చెందుతూ (మ్యుటేటింగ్) తనను తాను అభివృద్ధి చేసుకుంటోందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆయన ఒక నివేదిక విడుదల చేశారు. ఇటీవల భారత్, దక్షిణ అమెరికాతోపాటు ఇతర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయని, వైరస్ బారినపడి ఊపిరి అందక విలవిల్లాడిన ఎంతోమందిని మన కళ్లముందే చూశామని అన్నారు. అందరికీ రక్షణ కల్పించేదాకా... ఏ ఒక్కరూ క్షేమంగా ఉండలేరని తాను మొదటి నుంచే చెబుతున్నానని గుర్తుచేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, ఔషధాలు, వ్యాక్సిన్ల పంపిణీ తదితర విషయాల్లో ప్రపంచ దేశాల మధ్య అసమానత నెలకొనడం బాధారమని చెప్పారు. పేద దేశాలను వైరస్ దయకు వదిలేశామని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కొరత తీర్చండి భయంకరమైన వైరస్‌తో మనం యుద్ధం సాగిస్తున్నామని ఆంటోనియో గ్యుటెరస్ అన్నారు. ఈ దశలో మనకున్న ఆయుధాలను సక్రమంగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. నిధుల కొరత, పరిమిత ఉత్పత్తి సామర్థ్యం వల్ల ఆశించిన స్థాయిలో కరోనా వ్యాక్సిన్లను తయారు చేసుకోలేకపోతున్నామని చెప్పారు. ఇప్పటిదాకా 17 కోట్ల డోసులను ‘కోవాక్స్’ కార్యక్రమం కింద పేదదేశాలకు అందించాల్సి ఉండగా... 6.5 కోట్ల డోసులు మాత్రమే పంపిణీ చేయగలిగామని అన్నారు. నిధుల కొరతను తీర్చే విషయంలో జీ20 దేశాలు చొరవ చూపాలని కోరారు. వందల కోట్లు పెట్టుబడి పెడితే లక్షల కోట్లు ఆదా అవుతాయని, కోట్లాది మంది ప్రజల ప్రాణాలు నిలుస్తాయని వ్యాఖ్యానించారు. ప్రపంచమంతటా కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని గ్యుటెరస్ సూచించారు. కరోనా వైరస్‌లో కొత్త వేరియంట్లు పుట్టుకురాకుండా ఆపాలన్నా, మహమ్మారిని అంతం చేయాలన్నా వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఇప్పటిదాకా ఉత్పత్తి చేసిన కరోనా టీకాల్లో 82శాతం టీకాలు ధనిక, అభివృద్ధి చెందుతున్న దేశాలకు, కేవలం 0.3 శాతం టీకాలు పేద దేశాలకు అందాయని వెల్లడించారు. చదవండి: USA: ఆర్ఎంపీలకు ఆన్లైన్ శిక్షణ) -
ఐరాసకు అరోరా ఎందుకీ ఆకాంక్ష
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ ఐదేళ్ల పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగుస్తుంది. అంతకు రెండు నెలల ముందే అక్టోబర్‌లో ఆ పదవికి ఎన్నికలు జరుగుతాయి. అనుభవజ్ఞుడైన 71 ఏళ్ల గ్యుటెరస్ మళ్లీ పోటీ చేస్తే కనుక మళ్లీ గెలిచే అవకాశాలే ఎక్కువ. అయితే అంతటి అత్యున్నతస్థాయి పదవికి తాను పోటీ చేయబోతున్నట్లు ఏ మాత్రం అనుభవం లేని అరోరా ఆకాంక్ష అనే 34 ఏళ్ల మహిళ హటాత్తుగా ప్రకటించారు! ‘గెలుస్తానా.. లేదా తర్వాతి సంగతి. నేనైతే పోటీ చేస్తాను’ అంటున్నారు. అంతేకాదు, ఐక్యరాజ్య సమితి డబ్బంతా మీటింగ్‌లకు, పేపర్వర్క్లకు ఎలా వృథా అవుతోందో చెబుతూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు! చూస్తుంటే సమితి ప్రధాన కార్యదర్శి అభ్యర్థిగా ఒక సాధారణ మహిళ అయిన ఆకాంక్ష ఎన్నికల ప్రచారం మొదలైనట్లే ఉంది! అరోరా ఆకాంక్షకు తన ఇంటిపేరుతో ‘అరోరా’ అని పిలిపించుకోవడమే ఇష్టం. గతంలో నాలుగేళ్లు ఆమె ఐక్యరాజ్య సమితిలోనే ఒక కంపెనీ తరఫున ఆడిటర్‌గా పని చేశారు. అది తప్ప దౌత్యవేత్తగా ఆమెకు ఏ అనుభవమూ లేదు. ఇప్పుడు సమితికే చీఫ్‌గా పోటీ పడటానికి సిద్ధం అయ్యారు! ‘‘ఒకప్పటి శరణార్థుల మనవరాలిని. కష్టం అంటే ఏమిటో నాకు తెలుసు. కనుక దేశాల కష్టాలను గట్టెక్కించే ఈ పదవికి నేను అర్హురాలిననే అనుకుంటున్నాను’’ అని ఆమె చెబుతున్నారు. ప్రచారం కోసం ఆమె ఎక్కువగా తన సొంత పొదుపు నుంచే ఖర్చుచేయబోతున్నారు. ఆ మొత్తం 30 వేల డాలర్లు. రూపాయల్లో సుమారు 22 లక్షలు. అరోరా కెనడా పౌరురాలు. పుట్టింది ఇండియాలో. 2022–26 పదవీ కాలానికి జరిగే సమితి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసేందుకు ఆమోదం కోసం ఈ నెల 17నే ఆమె తన దరఖాస్తు పత్రాన్ని సమితికి సమర్పించారు. ఆ వెంటనే ‘‘పేద దేశాల కోసం ఏదైతే చేయాలో దాన్ని చేయడం లో సమితి విఫలమయింది’’ అనే వ్యాఖ్యతో తన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు! పోటీకి ఆమె పేరును ఏదో ఒక దేశం ప్రతిపాదించాలి. 193 దేశాలు సభ్యులుగా ఉన్న సమితి నుంచి ఇంతవరకూ అలాంటి సమర్థన ఏదీ రాలేదు. పోటీ చేయలేకపోయినా, పోటీ చేయాలన్న ఆమె ప్రయత్నం వైపు మాత్రం ప్రపంచ దేశాల తలలన్నీ తిర గనయితే తిరిగాయి. చిన్న దేశాలను సమితి చిన్న చూపు చూస్తోందని అరోరా ఆరోపణ. ఏటా సమితికి వచ్చే 56 బిలియన్ డాలర్ల రాబడిలో డాలరుకు 29 సెంట్లు మాత్రమే సకారణంగా ఖర్చువుతుండగా, మిగతా అంతా సమావేశాలకు, నివేదికల తయారీకి వృథా అవుతోందన్నది ఆమె చేస్తున్న మరో ఆరోపణ. అందుకే తను ఎంపికైతే ఇలాంటి దుర్వినియోగం జరగకుండా చూస్తానని ఆమె హామీ ఇస్తున్నారు. ‘అయినా సరే, తను గెలుస్తుంది అని ఎలా అనుకుంటోంది..’ అని పరిహసించేవాళ్ల ఉండొచ్చు. అయితే ఆమెను సమర్థించేవారూ లేకపోలేదు. ‘ఫియర్లెస్’ అని కొందరు. ‘ఎందుకు పోటీ చేయకూడదు?’ అని ఇంకొందరు. దీనికి భిన్నంగా.. ‘75 ఏళ్ల చరిత్ర గల ఐక్యరాజ్య సమితి ఏ పరిస్థితుల్లో ఏర్పడిందో ఈమెకు ఏం తెలుసు?’ అనేవారు ఎలాగూ ఉంటారు. సమితి లో శాశ్వత సభ్యత్వం గల దేశాలైన బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, అమెరికాలు వీటో చేస్తే ఏ నిర్ణయమైనా వీగిపోక తప్పని స్థితిలో ఈమె వచ్చి ఏం మారుస్తుంది అని మరో మాట! అవేవీ పట్టించుకోవడం లేదు ఆరోరా. రానున్న ఒకటి రెండు నెలల్లో ఆమె సమితి రాయబారులను కలిసి తన లక్ష్యం ఏమిటో వివరించే ఆలోచనలో కూడా ఉన్నారు. ఒకప్పటి ఆమె సహోద్యోగుల నుంచి కూడా అరోరాకు మద్దతు లభిస్తోంది. ‘నాకేమీ గెలుపు వ్యూహాలు, రాజకీయ ధ్యేయాలు లేవు. సమితి పనితీరును మెరుగు పరిచేందుకు నిజాయితీగా పోటీలోకి దిగుతున్నాను’’ అని చెబుతున్నారు అరోరా. ∙∙ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి దగ్గర్లోనే నివాసం ఉంటున్నారు అరోరా ఆకాంక్ష. ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. జీతాన్ని పొదుపుగా వాడుకుంటారు. తల్లిదండ్రులూ ఆమెతోనే ఉంటారు. సమితికి పోటీ చేసే విషయంలోనూ వారు ఆమె వైపే ఉన్నారు. అరోరాకు హ్యారీపొట్టర్ నవలలంటే ఇష్టం. ఒత్తిడుల నుంచి అవి ఆమెను సేద తీరుస్తాయట. ఆమె వార్డ్రోబ్ నిండా అన్నీ ముదురు వర్ణాల దుస్తులే. సమితి ఫీల్డ్ వర్క్ మీద 2017లో ఉగాండా వెళ్లినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్న ఆరు సూట్లు కూడా వాటిల్లో ఉన్నాయి. ఉగాండా వెళ్లినప్పుడు అక్కడ ఆమె చూసిన ఘోరం గురించి ఇక్కడ చెప్పాలి. అరోరా హర్యానాలో జన్మించారు. తర్వాత కొంతకాలం సౌదీ అరేబియాలో పెరిగారు. తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. తొమ్మిదో యేట నుంచి 18 ఏళ్ల వయసు వరకు అరోరా ఇండియాలోని బోర్డింగ్ స్కూల్లో చదివారు. తర్వాత కెనడా వెళ్లి అక్కడ డిగ్రీ పూర్తి చేశారు. అక్కడే ఒక ప్రేవేట్ కంపెనీలో ఆడిటర్‌గా చేరారు. ఆ కంపెనీ తరఫున 2016 లో ఐక్యరాజ్య సమితిలో ఉద్యోగం రాగానే ఎగిరి గంతేసి చేరిపోయారు. ఐక్యరాజ్య సమితి అంటే అంత గొప్ప ఆమెకు. అయితే ఆ గొప్ప లోపలికి వెళ్లాక కనిపించలేదు! తర్వాతి ఏడాది వేసవిలోనే అరోరాకు ఉగాండా వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడో చిన్నారి.. ఆకలి బాధ తట్టుకోలేక బురద ముద్దల్ని తినడం ఆమె మనసును కలచి వేచింది. ఆ దృశ్యం ఆమె మనసులో అలా ఉండిపోయింది. డ్యూటీకి తిరిగొచ్చాక సమితిలోని తన సీనియర్ ఆఫీసర్‌తో ఆ సంగతి ని ఆమె ఎంతో ఆవేదనగా చెప్పినప్పుడు ఆ ఆఫీసర్ స్పందించిన తీరు ఆమెను మరింతగా బాధించింది. ‘బురద మంచిదేలే. ఐరన్ ఉంటుంది’ అని అన్నారట! అది తట్టుకోలేక పోయారు అరోరా. క్రమంగా సమితిలోని అలక్ష్యాలు, సమితి నిరాదరణలు ఒక్కోటీ ఆమె కంటబడటం మొదలైంది. ఆ అనుభవాలన్నీ ఇప్పుడు ఆమెను సమితి ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసేందుకు బలంగా ప్రేరేపిస్తున్నాయి. అరోరా గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే పోటీ చేయాలన్న ఆలోచననే ఒక గెలుపుగా భావించాలని ఆమెను సమర్థించేవారు అంటున్నారు. -
‘అరోరా ఆకాంక్ష’.. రికార్డు సృష్టించనుందా?!
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి అధ్యక్ష పదవి కోసం భారత సంతతికి చెందిన మహిళ బరిలో నిలిచారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) ఆడిట్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న అరోరా ఆకాంక్ష(34) అధ్యక్ష బరిలో నిలిచినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్న ఆంటోనియో గుటెరస్ పదవీకాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యున్నత దౌత్యవేత్త పదవికి తాను పోటీ చేస్తున్నట్లు అరోరా గత నెలలోనే తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ నెలలో ‘‘అరోరాఫర్ఎస్జీ’’ పేరిట ఆమె ప్రచారం సైతం ప్రారంభించారు. ఇక అధ్యక్ష బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించిన అరోరా ఆకాంక్ష ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. తాజాగా రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ప్రచార వీడియోను విడుదల చేశారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం లోపల నడుస్తూ అరోరా ఈ వీడియోను తీశారు. గడిచిన 75 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి ప్రపంచానికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని.. శరణార్థులను రక్షించలేదని ఆమె ఆరోపించారు. అందుకే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌గా తాను పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ అరోరా గనక ఈ పదవి చేపడితే.. ఐక్యరాజ్య సమితి 75 ఏళ్ల చరిత్రలో సెక్రటరీ జనరల్ పదవి చేపట్టిన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టిస్తారు. కాగా, ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మరోసారి అధ్యక్షుడిగా కొనసాగాలని భావిస్తున్నారు. ఆయన మొదటి విడత పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగుస్తుంది. కొత్త సెక్రటరీ జనరల్ 2022 జనవరి 1న బాధ్యతలు స్వీకరిస్తారు. 2017 జనవరి 1న గుటెరస్ సెక్రటరీ జనరల్‌గా ప్రమాణం చేశారు. మరోసారి అధ్యక్షుడిగా పని చేయాలని గుటెరస్ ఆశిస్తున్నారు. ఇక అరోరా ఆకాంక్ష విషయానికి వస్తే ఆమె టొరంటోలోని యార్క్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టడీస్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు. భారతదేశంలో జన్మించిన అరోరా ఆకాంక్షకు ఓసీఐ కార్డ్ వుంది. అలాగే కెనడా పౌరురాలిగా ఆ దేశ పాస్‌పోర్ట్ కలిగివున్నారు. చదవండి: భారత్ సేవలకు సెల్యూట్: యూఎన్ చీఫ్ డ్యాషింగ్ అడ్వైజర్ -
ఐరాస సెక్రటరీ జనరల్‌కు వ్యాక్సిన్
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కోవిడ్–19 టీకా తొలి డోసు తీసుకున్నారు. ప్రజలంతా సాధ్యమైనంత త్వరగా కోవిడ్ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ప్రాంతంలోనూ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాలకు సూచించారు. న్యూయార్క్ సిటీ ప్రభుత్వ పాఠశాలలో 71 ఏళ్ల గుటెర్రస్ మోడెర్నా టీకా తొలి డోసు వేయించుకున్నారు. అనంతరం విజయచిహ్నాన్ని చూపుతోన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 65 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇస్తున్నామని, ఈ క్రమంలో ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రస్‌కి కూడా టీకా వేసినట్టు న్యూయార్క్ మేయర్ కార్యాలయం ప్రకటించింది. ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి, సాఠశాల సిబ్బందిసహా 65 ఏళ్ళు పైబడిన వారికి న్యూయార్క్‌లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే తాను బహిరంగంగా టీకా తీసుకుంటానని గత డిసెంబర్లో ప్రకటించిన గుటెర్రస్ అందులో భాగంగానే బహిరంగంగా టీకా తీసుకున్నారు. కోవిడ్ మరింత ముమ్మరం కాకుండా నిలువరించేందుకు, అందరూ సురక్షితంగా ఉండేందుకు ప్రజలంతా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని గుటెర్రస్ కోరారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడిన గుటెర్రస్ 2021లో తన పది ప్రాధామ్యతలను ప్రస్తావించారు. అందులో కోవిడ్–19 కూడా ఒకటని తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటోన్న సమస్యల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ సమస్య కూడా ఉందన్నారు. ‘వ్యాక్సిన్ జాతీయవాదం’ ఆర్థిక, నైతిక వైఫల్యమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి దేశానికీ తన ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత, హక్కు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోని ఏ ఒక్క దేశం కూడా వ్యాక్సిన్ విషయంలో నిర్లక్ష్యానికి గురికాకూడదని తెలిపారు. భారత్ సహకారం భేష్ భారత్ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ప్రపంచానికే గొప్ప వరమని ఐక్యరాజ్య సమితి చీఫ్ కొనియాడారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య సంక్షోభం సందర్భంలో ఇతర దేశాలకు కోవిడ్ టీకా డోసులను సరఫరా చేస్తోన్న భారత్ కృషిని గుటెర్రస్ ప్రశంసించారు. అంతర్జాతీయ వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలక పాత్ర పోషించేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా తొలి దశలో భారత్ 9 దేశాలకు 60 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసిందని గుటెర్రస్ తెలిపారు. ఆర్థిక స్థాయిలతో సంబంధం లేకుండా అన్ని దేశాలకు కోవిడ్–19 వ్యాక్సిన్ ని అందించడమే కోవాక్స్ లక్ష్యమని ఆయన అన్నారు. అమెరికా నూతన అధ్యక్షుడు జోబైడెన్ సైతం, కీలకమైన కోవిడ్–19 వ్యాక్సిన్‌ని ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తోన్న భారత్ ‘నిజమైన మితృడు’అని కొనియాడారు. అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణకు లక్షలాది డోసుల వ్యాక్సిన్‌ని భారత్ సరఫరా చేయడం గొప్ప విషయమని పలు సరిహద్దు దేశాలు పేర్కొన్నాయి. -
అది చాలా ప్రమాదకరం: డబ్ల్యూహెచ్ఓ చీఫ్
బెర్లిన్: కరోనా నిరోధక వ్యాక్సిన్ తమ ప్రజలకే ముందుగా అందించాలన్న దేశాల ఆలోచనా విధానం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసస్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాక్సిన్ను ప్రభావంతంగా ఉపయోగించుకుంటేనే, మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు. కొన్ని దేశాల్లోని ప్రజలందరికీ టీకా అందించడం కంటే కూడా, అన్ని దేశాల్లోని కొంతమంది ప్రజలకు వాక్సినేషన్ చేయడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. కాగా ప్రపంచవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. రష్యాలో స్పూత్నిక్- వీ పేరిట టీకాను విడుదల చేయగా, క్లినికల్ ట్రయల్స్ తుది దశకు చేరుకున్న క్రమంలో మరికొన్ని కంపెనీలు, త్వరలోనే వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.(చదవండి: నన్ను గెలిపిస్తే అందరికీ ఫ్రీగా వాక్సిన్) ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా వంటి దేశాలు భారీ స్థాయిలో వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేసి, ప్రజలకు అందించే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే పేద దేశాల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఈ విషయం గురించి టెడ్రోస్ ఆదివారం నాటి సదస్సులో మాట్లాడుతూ.. ‘‘ తమ ప్రజలను కాపాడుకునేందుకు వ్యాక్సిన్‌ను దక్కించుకునేందుకు దేశాలు పోటీపడటం సహజం. అయితే ఇప్పుడు వ్యాక్సిన్‌ను ఎంత ప్రభావంతంగా ఉపయోగించుకోగలమన్న అంశం మీదే కోవిడ్-19 వ్యాప్తి ఆధారపడి ఉంటుంది. వ్యాక్సిన్ నేషనలిజం వల్ల మహమ్మారి మరింత విజృంభించే అవకాశాలే తప్ప, దానిని నియంత్రించే అవకాశం ఉండదు. యూరప్ దేశాల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఇలాంటి తరుణంలో, వ్యాక్సిన్‌ను కొన్ని దేశాలకే పరిమితం చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. ప్రభావంతమైన వ్యాక్సిన్ విడుదలైతే, అన్ని దేశాల్లోనూ అది వినియోగంలోకి వచ్చినపుడే ఆశించిన ఫలితాలు లభిస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. (వ్యాక్సిన్ : వారు 2022 వరకు ఆగాల్సిందే!) అత్యంత తీవ్రమైన సంక్షోభం ఇది: ఐరాస చీఫ్ ఇక ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ.. ‘‘సమకాలీన పరిస్థితుల్లో ఇదే అత్యంత తీవ్రమైన సంక్షోభం. ఇప్పుడు ప్రపంచమంతా అడుగడుగునా కలిసి నుడుస్తూ, సుహృద్భావంతో మెలగాల్సిన ఆవశ్యకత ఉంది. వ్యాక్సిన్లు, కరోనా టెస్టులు, చికిత్సా విధానాలే ఇప్పుడు మన జీవితాన్ని కాపాడే మార్గాలు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి’’అని పేర్కొన్నారు. కాగా శనివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 4,65,319 కరోనా కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లండించింది. వీటిలో సగం కంటే ఎక్కువ కేసులు యూరప్ దేశాల్లో వెలుగుచూసినట్లు వెల్లడించింది. -
కరోనా పాపం చైనాదే
ఐక్యరాజ్య సమితి: కరోనా పాపం చైనాదే అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తికి చైనాదే బాధ్యతగా ఐక్యరాజ్య సమితి గుర్తించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఆన్లైన్లో చేరిన ట్రంప్ మాట్లాడుతూ చైనా వైరస్ కారణంగా 188 దేశాల్లో ప్రాణ నష్టం జరిగిందని ఆరోపించారు. ‘కనిపించని శత్రువు చైనా వైరస్‌తో తీవ్రమైన యుద్ధం చేశాం. మెరుగైన భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తున్న మనం ప్రపంచం మీదకు ప్లేగు లాంటి వ్యాధిని వదిలిన చైనాను... ఆ పాపం తనదే అని అంగీకరించేలా చేయాలని ట్రంప్∙అన్నారు. కరోనా వైరస్ చైనా లోనే పుట్టిందని, ఆ దేశ ప్రభుత్వం ఈ ప్రమాద కరమైన వైరస్ వ్యాప్తి విషయంలో బాధ్యతా రహి తంగా వ్యవహరించిందని స్పష్టం చేశారు. కోవిడ్ విషయంలో అమెరికా యుద్ధ ప్రాతిపదికన స్పందించిందని, రికార్డు సమయంలో వెంటి లేటర్లను సమకూర్చడంతోపాటు, చాలా వేగంగా అత్యవసర చికిత్సలను అభివృద్ధి చేశామని, తద్వారా వ్యాధి కారణంగా జరుగుతున్న ప్రాణనష్టాన్ని 85 శాతం వరకూ తగ్గించగలిగామని ట్రంప్ వివరించారు. కోవిడ్ నివారణకు టీకాను అభివృద్ధి చేసిన తరువాత ప్రపంచం సరికొత్త శాంతి, సహకార, సమృద్ధతల్లో కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరితోనూ యుద్ధం చేసే ఉద్దేశం లేదు: జిన్‌పింగ్ ఒకవైపు అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూండగానే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ జనరల్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. ఏ దేశంతోనూ ప్రత్యక్ష లేదా పరోక్ష యుద్ధం చేసే ఉద్దేశం చైనాకు లేదని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ‘ఇతరులతో ఉన్న భేదాభిప్రా యాలను, వివాదాలను తగ్గించుకునేందుకు ప్రయత్నం కొనసాగుతుంది. చర్చలు, ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వివాదాల పరిష్కా రానికి ప్రయత్నిస్తాం’ అని ఆయన తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. కరోనావ్యవహారాన్ని రాజకీయం చేయడం, విభేదాలు సృష్టించడం ఆపాలని స్పష్టం చేశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచం తల్లకిందులైపోయిందని ప్రభుత్వాధినేతలతో కిటకిటలాడే జనరల్ అసెంబ్లీ నేడు బోసిపోయి కనిపించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అసమానతలను కరోనా వైరస్ అందరి దృష్టికి తెచ్చిందని, భారీ స్థాయి ఆరోగ్య విపత్తును తీసుకొచ్చిందని∙వివరించారు. ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం కావడంతోపాటు కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారని, మానవ హక్కుల వంటి అనేక సమస్యలు మళ్లీ సవాళ్లుగా పరిణమిస్తున్నాయని అన్నారు. -
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
అన్నట్లే అవుతోంది దేశాలన్నింటికీ పెద్ద.. ఆంటోనియో గుటెరస్. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆయన. కరోనా మొదలైనప్పటి నుంచి ప్రతిరోజూ ఆయన బలమైన హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. అవన్నీ నిజం అవుతున్నాయి. కరోనా వర్తమాన ప్రభావం, ఆర్థికరంగ భవిష్యత్తు పర్యవసానాలు అన్నీ కూడా అన్ని విధాలుగా మహిళలనే బాధితులను చేస్తాయని గుటెరస్ చెప్పని రోజు లేదు. ఇప్పుడు మరొక మాట కూడా అన్నారు. ‘అందరం సేఫ్ అయ్యేవరకు ఏ ఒక్కరం సేఫ్ కాదు.. మహిళలు సేఫ్‌గా ఉంటేనే ప్రపంచం సేఫ్ గా ఉంటుంది’ అని. గుటెరస్ పోర్చుగల్ దేశస్తుడు. డ్రైవర్ బాబు యూటా హైవే మీద ఒక కారు నెమ్మదిగా వెళుతోంది! కాలిఫోర్నియా పెట్రోలింగ్ పోలీసులు ఆ కారును ఆపారు. విండో గ్లాస్‌ను కిందికి దింపించి కారు లోపలికి తొంగి చూశారు. స్టీరింగ్ ముందు 5ఏళ్ల బాలుడు! తనే డ్రైవ్ చేస్తున్నాడు. ‘ఎక్కడికి వెళ్తున్నావ్’ అని పోలీసులు అడిగారు. ‘లాంబొర్గీని కారు కొనడానికి వెళ్తున్నాను. మా మమ్మీని కొనమంటే కొనడం లేదు’ అన్నాడు! లాంబొర్గీని కారు మన కరెన్సీలో మూడుకోట్ల రూపాయలు ఉంటుంది. పోలీసులు ఆ ఐదేళ్ల ఆసామి పర్సు తీసి చూశారు. మూడు డాలర్లు ఉన్నాయి. -
మహిళలకు మళ్లీ నాటి పరిస్థితి?
సాక్షి, హైదరాబాద్: సమాజంలో అసమానతలు, లింగ వివక్షకు కరోనా వైరస్ పరోక్షంగా కారణమవుతోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అభిప్రాయపడ్డారు. తొలి దశలో ప్రపంచవ్యాప్తంగా పురుషుల ఆరోగ్య స్థితిని కరోనా దెబ్బ తీస్తుందని, ముఖ్యంగా వృద్ధులను బలి తీసుకుంటుందని భావించామని, క్రమంగా రూటు మార్చుకున్న కరోనా మహిళల భద్రతకే సవాలుగా మారిందని ఆయన తెలిపారు. కరోనా పరిణామ క్రమంపై గుటెర్రస్ అంతర్జాతీయ మీడియాను ఉద్దేశించి రాసిన ఓ వ్యాసాన్ని ఐరాస తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది. ఈ వ్యాసంలో ఆయన కరోనా కారణంగా మహిళా శక్తి అర్ధ శతాబ్దం వెనక్కు వెళ్ళినట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. (ట్రంప్ తాజా బెదిరింపు : ట్రేడ్ వార్ భయాలు) గుటెర్రస్ వ్యాసంలోని ముఖ్యాంశాలు: ‘ఇప్పటికే లాక్ డౌన్, క్వారంటైన్ వల్ల మహిళలపై ప్రపంచవ్యాప్తంగా గృహ హింస పెరిగింది. అయితే మహిళలపై హింస పెరగకుండా ఇప్పటికే ప్రపంచంలోని 143 దేశాలు రక్షణ చర్యలు మొదలుపెట్టాయి. కానీ, కరోనా కారణంగా తలెత్తనున్న ఆర్థిక సంక్షోభం ప్రపంచ మహిళల ముఖ చిత్రం మార్చబోతోంది. ఇటీవలి సంక్షోభ కాలంలో మహిళలపై భౌతిక అరాచకం పెరిగిపోతోంది. వారి హక్కులు, స్వేచ్ఛపై దాడి జరుగుతోంది. నేను 1960ల్లో విద్యార్థిగా ఉన్నప్పుడు మహిళల శ్రమ చూశాను. మోయలేని బరువులు నెత్తిన పెట్టుకుని కూలీ పనికి వెళ్లడం గమనించాను. నేను రాజకీయాల్లోకి రావడానికి అది కూడా కారణం అయింది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని, మహిళలకు సమాన ఉపాధి, వేతనం లభించాలని కోరుకున్నా. తరువాత కాలంలో నేను ఆశించినది జరిగింది. (కరోనా విపత్తు: భారీ ఉపశమనం) కానీ, కరోనా వైరస్ మళ్లీ పాత పరిస్థితుల్లోకి వారిని నెడుతోందని అనిపిస్తోంది. పనిమనిషిగా, దినసరి కూలీగా, తోపుడు బండి వ్యాపారిగా, చిన్న తరహా ఉద్యోగినిగా మహిళ పురుషుడికన్నా ఎక్కువ శ్రమ చేస్తుంది. ఐఎల్ఓ అంచనా ప్రకారం రానున్న మూడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల ఉద్యోగాలు పోతాయని అంటున్నారు. మొదట ప్రభావం చూపేది మహిళల మీదనే అని నా అభిప్రాయం. మరో విషయం ఏమిటంటే కరోనా బాలికా విద్యను కూడా ప్రభావితం చేయనుంది. ఎబోలా వైరస్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా (వైరస్ ప్రభావం ఉన్న దేశాల్లో) బాలికా విద్య 50 నుంచి 34 శాతానికి తగ్గిపోయిన విషయం విస్మరించలేనిది. ఈ అంశాలన్నింటిపై రాజకీయ నాయకత్వం దృష్టి పెట్టాలి. బాలికా విద్యతో పాటు, మహిళలకు సామాజిక భద్రత, హెల్త్ ఇన్సూరెన్స్, సిక్, చైల్డ్ కేర్ సెలవులు, నిరుద్యోగ భృతి కల్పనలాంటి విషయాలపై పని చేయాలి. కరోనా దృష్టాంతం తర్వాత ప్రపంచం ఆ దిశలో ముందుకెళ్లినప్పుడే మహిళా హక్కులు పరిరక్షింపబడతాయి.’ (వైరల్ వీడియా షేర్ చేసిన ప్రధాని మోదీ) -
కిమ్ ఆరోగ్యంపై స్పందించిన యూఎన్ఓ
న్యూయార్క్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి వదంతులు వస్తున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ) స్పందించింది. కిమ్ ఆరోగ్యం విషమించిందంటూ గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయని దీనిపై ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని యూఎన్ తెలిపింది. వివిధ జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో వస్తున్న వార్తల ద్వారానే తమకు ఈ సమాచారం అందిందని ఆ దేశ ప్రతినిధుల నుంచి తమకు వర్తమానం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు యూఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ గురువారం రాత్రి ఓ ప్రకటన చేశారు. కిమ్ ఆరోగ్యం గురించి పూర్తి వివరాలను తెలుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. (కిమ్ ఎక్కడున్నారో తెలుసు) కాగా ఏప్రిల్ 15 నుంచి కిమ్ బయట ప్రపంచానికి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. ఆర్యోగం బాగలేదని పలు పత్రికలు సైతం ప్రచురించాయి. ఈ వార్తలును అమెరికాతో పాటు దక్షిణ కొరియా సైతం తీవ్రంగా ఖండిచాయి. తాజాగా మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఏప్రిల్ 15 నాటి కార్యక్రమానికి హాజరుకాకపోయి ఉండవచ్చని పలు దేశాలు అభిప్రాయపడుతున్నాయి. (‘కిమ్’ గురించి మాకు తెలియదు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1341281459.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నమస్తేతో ఐక్యరాజ్యసమితికి అక్బరుద్దీన్ వీడ్కోలు
న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితిలో భారత కీర్తిప్రతిష్టలు మరింత పెరిగేలా తన పదునైన మాటలతో ఆకట్టుకున్న భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ గురువారం రిటైర్ అయ్యారు. ముఖ్యంగా ఐరాసాలో భారత్‌పై పాక్ తప్పుడు ఆరోపణలు చేసిన ప్రతీసారి పాక్ ప్రతినిధులనోట మాట రాకుండా సయ్యద్ కడిగిపారేసేవారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారెన్ సర్వీస్) అధికారి 2016 జనవరి నుంచి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక సయ్యద్ తర్వాత ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధిగా టీఎస్ తిరుమూర్తి నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఇక తన వీడ్కోలు సందర్భాన్నికూడా కరోనావ్యాప్తిని అరికట్టడానికి వీలుపడే ఓ మంచి సూచనను ఇవ్వడానికి సయ్యద్ అక్బరుద్దీన్ ప్రయత్నించారు. వీడియో కాల్ ద్వారా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌కు భారత సంప్రదాయ పద్దతిలో నమస్కరించి తన విధులనుంచి తప్పుకున్నారు. నమస్కరించడానికి సమయం ఆసన్నమైంది అంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుటెరస్‌కు నమస్కరిస్తున్న వీడియోను తన ట్విటర్‌ఖాతాలో సయ్యద్ పోస్ట్ చేశారు. తన విధులనుంచి తప్పుకునే ముందు ఓ చిన్న విన్నపం అంటూ గుటేరస్‌కు విజ్ఞప్తి చేశారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఎవరినైనా కలిసినప్పుడు లేదా వీడ్కోలు సమయాల్లో హలోగానీ, షేక్ హ్యాండ్‌వంటివి కాకుండా నమస్తే అని చెబుతారు. అందుకే ఇప్పుడు కూడా నమస్తే చెప్పాలని అనుకుంటున్నాను అని గుటెరస్‌తో సయ్యద్ అన్నారు. దీనికి చిరునవ్వుతో నమస్తే అంటూ గుటెరస్‌కూడా బదులిచ్చారు. Time to bow out, with the usual🙏🏽 pic.twitter.com/BM6m7j7qQW — Syed Akbaruddin (@AkbaruddinIndia) April 30, 2020 -
ఐసోలేషన్‌లో అవే మన ఆత్మీయ నేస్తాలు!
జీవితంలో ప్రతీ ఒక్కరు తమకంటూ కొంతమంది ఆత్మీయులను సంపాదించుకుంటారు. బాధ కలిగినా.. సంతోషంతో మనసు ఉప్పొంగినా ఆ భావాలను వారితో పంచుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో చుట్టూ ఎంతమంది ఉన్నా మనం ఒంటరి వాళ్లమనే భావన కలుగుతుంది. అలాంటి సమయాల్లో నచ్చిన పుస్తకం తీసి చదువుతూ ఉంటే మనసు తేలికపడుతుంది. పుస్తకాలు విజ్ఞానాన్ని ఇవ్వడంతో పాటు... మానసికంగా ఎంతో ధైర్యాన్ని కూడా ఇస్తాయి. ‘చినిగిన చొక్కైనా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అని కందుకూరి వీరేశలింగం పంతులు... ‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అని ప్రజాకవి కాళోజీ అన్నారంటే మనిషి జీవితంలో పుస్తక పఠనానికి ఉన్న ప్రాముఖ్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా స్వీయ అనుభవంతోనే మనకు దాని విలువ బోధపడుతుంది. నేడు(ఏప్రిల్ 23) అంతర్జాతీయ పుస్తక దినోత్సవం. జగమెరిగిన ఆంగ్ల నాటక రచయిత విలియం షేక్స్ పియర్ జయంతి- వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళిగా 1995 నుంచి ప్రతీ ఏటా వరల్డ్ బుక్ డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ‘‘ప్రపంచమంతా కోవిడ్-19తో కల్లోలం అవుతున్న వేళ పుస్తకాలు చేసే మ్యాజిక్ ఏంటో మనం తెలుసుకోవాలి. పుస్తక పఠనానికి ఉన్న శక్తి ఏమిటో... సరికొత్త రేపటిని నిర్మించుకోవడంలో అది ఏవిధంగా ఉపయోగపడుతుందో నేర్చుకోవాలి’’’ అని యునెస్కో ట్వీట్ చేసింది. మంచి పుస్తకాన్ని మించిన ఆత్మీయులెవరూ ఉండరంటూ ఓ ఫొటోను షేర్ చేసింది. ఇక ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సైతం.. ‘‘ నన్ను నేను సౌకర్యంగా ఉంచుకోవడంలో పుస్తకాలే ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి కష్టసమయాల్లో.. ఐసోలేషన్‌లో బుక్స్ మనకు ఎంతో సహాయం చేస్తాయి. పుస్తక పఠనంలో ద్వారా వచ్చే శక్తిని ఈ వరల్డ్బుక్డే సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకుందాం’’ అని ట్వీట్ చేశారు. తాటాకుల నుంచి ఇ-బుక్‌ల వరకు ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత పుస్తకాల ముద్రణ సులువుగా మారింది.. ఇ- బుక్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ సౌకర్యాలేవీ లేని పురాతన కాలం నుంచే ఎంతో మంది రచయితలు, కవులు తాటి ఆకులపై రచనా వ్యాసంగాలు చేశారు. ఇక సాహిత్యానికి పెద్దపీట వేసిన శ్రీకృష్ణదేవరాయలు వంటి ఎంతో మంది రాజులు కవులను ప్రోత్సహిస్తూ భాషాభివృద్ధికి తోడ్పడ్డారు. ప్రత్యేక సందర్భాల్లో బంగారు, వెండి, రాగి రేకులు, వస్త్రాలపై అమూల్యమైన సమాచారాన్ని లిఖించి భవిష్యత్ తరాలకు విలువైన సంపదను అందించారు. ఇక ప్రస్తుతం లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటూ ప్రపంచంపై కరాళ నృత్యం చేస్తున్న కరోనా మహమ్మారి గురించి పోతులూరి వీరేంద్ర బ్రహ్మేంద్రస్వామి ఏనాడో తాళపత్ర గ్రంథాల్లో లిఖించారన్న విషయం సోషల్ మీడియా ద్వారా ప్రపంచాన్ని చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. పన్నెండేళ్ల వయస్సులో లైబ్రరీ స్థాపించిన చిన్నారి యశోద గొప్ప కానుక... ప్రస్తుతం ప్రాణాంతక కోవిడ్-19ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ను ఎంతో మంది పుస్తక పఠనంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కేరళకు చెందిన యశోద డి షెనాయ్ వంటి(12) చిన్నారులు సైతం ఖాళీ సమయాన్ని మరిన్ని ఎక్కువ పుస్తకాలు చదివేందుకు వినియోగిస్తున్నామని చెబుతున్నారు. అంతేకాదు అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా పేరొందిన కేరళలో.. లాక్డౌన్ నిబంధనలు పాక్షికంగా సడలించిన నేపథ్యంలో నిత్యావసరాల షాపులతో పాటుగా పుస్తకాల షాపులు కూడా తెరవాలని ఆ రాష్ట్ర వాసులు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు విజ్ఞప్తి చేశారు. మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుస్తకాలను కొనుక్కునేందుకు కొన్ని గంటల పాటు బుక్‌షాపులు తెరచి ఉంచాలని కోరుతున్నారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా దేశంలోని అర్బన్ ప్రాంతాల్లోని నాన్ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో పుస్తకాల షాపులకు మినహాయింపు ఇవ్వడంతో రీడర్స్ క్లబ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వరల్డ్ బుక్ డే రోజు తమకు అందిన గొప్ప కానుక అంటూ పుస్తక ప్రియులు మురిసిపోతున్నారు. 23 April is #WorldBookDay! In a world disrupted by #COVID19, it is the magic of books that we need now. Let's unleash the power of reading to dream, to learn and to help us build a better tomorrow! ℹ️ https://t.co/MjMQG6JGxW #ShareCulture pic.twitter.com/jUNDlIjGxs — UNESCO (@UNESCO) April 23, 2020 -
భారత్ సేవలకు సెల్యూట్: యూఎన్ చీఫ్
న్యూయార్క్: మహమ్మారి కోవిడ్-19పై పోరులో ఇతర దేశాలకు అండగా నిలుస్తున్న దేశాలకు సెల్యూట్ చేస్తున్నామని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. ప్రాణాంతక వైరస్ వ్యాప్తి కట్టడికై భారత్ వంటి దేశాలు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించడంలో సత్పలితాలు ఇస్తున్నట్లుగా భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను దాదాపు 55 దేశాలకు భారత్ ఎగుమతి చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న దేశీయ అవసరాల కోసం తొలుత ఈ మందుల సరఫరాపై నిషేధం విధించిన భారత్ మానవతా దృక్పథంతో ఆంక్షలను ఎత్తివేసింది. ఈ క్రమంలో అమెరికా, మాల్దీవులు, ఇజ్రాయెల్, మారిషస్, సేచెల్లీస్ తదితర దేశాలు ఇప్పటికే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను దిగుమతి చేసుకున్నాయి.(భారత్ అంగీకరించింది: మలేషియా) ఇక పొరుగు దేశాలైన అఫ్గనిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, శ్రీలంక, మయన్మార్‌కు మందులు ఎగుమతి చేసేందుకు భారత్ అంగీకరించింది. అదే విధంగా జాంబియా, డొమినికన్ రిపబ్లిక్, మడగాస్కర్, ఉగాండా, బర్కినా ఫాసో, నైగెర్, మాలి, కాంగో, ఈజిప్టు, అర్మేనియా, కజక్షాన్, ఈక్వెడార్, జామాపియా, సిరియా, ఉక్రెయిన్, చాద్, జింబాబ్వే, ఫ్రాన్స్, కెన్యా, జోర్డాన్, నెదర్లాండ్స్, నైజీరయా, ఒమన్, పెరు మొదలగు దేశాలకు కూడా విపత్కర పరిస్థితుల్లో భారత్ సాయం అందించనుంది. కాగా కరోనాపై పోరులో ప్రపంచదేశాలు పరస్పరం సహకరించుకోవాలని ఐరాస పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. (యూకే నిపుణుల కమిటీ చైర్మన్‌గా వెంకీ రామకృష్ణన్) ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘వైరస్‌ను అంతం చేసేందుకు చేస్తున్న పోరాటంలో సంఘీభావంతో మెలగాలని ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉన్న దేశాలు సాయం అర్థించే దేశాలకు తప్పక సహాయం చేయాలని ఆయన ఉద్దేశం. ఇందుకు స్పందించి ఇతరులకు అండగా నిలుస్తున్న దేశాలకు మేము సెల్యూట్ చేస్తున్నాం’’అని పేర్కొన్నారు. భారత్ చేస్తున్న సాయంపై స్పందించాల్సిగా విలేకరులు కోరిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా బదులిచ్చారు. (కరోనా: సంక్షోభంలో వారి భవిష్యత్తు) -
2020 చివరి నాటికి వ్యాక్సిన్ కనుగొంటేనే..
న్యూయార్క్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19)నివారణకు వ్యాక్సిన్ కనుగొన్నప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది చివరి నాటికి కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశాలైన పలు ఆఫ్రికా దేశాల ప్రతినిధులతో బుధవారం ఆయన వీడియో కాన్షరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గుటెరస్ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా అందరినీ సంఘటితం చేస్తూ.. వ్యాక్సిన్ కనుగొనే పరిశోధనలను వేగవంతం చేసేలా ప్రోత్సహించినపుడే మహమ్మారిని నియంత్రించగలిగే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. అందుకోసం 2020 ఏడాది ముగిసే నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవశ్యకత ఉందన్నారు. (అమెరికా నిర్ణయం ఆందోళనకరం: చైనా) అదే విధంగా... ‘‘సురక్షితమైన, ప్రభావంతమైన వ్యాక్సిన్ మాత్రమే ప్రస్తుత పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురాగలిగే ఏకైక సాధనం. అదే లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతుంది. ట్రిలియన్ డాలర్ల ఖర్చును కట్టడి చేస్తుంది’’అని ఆంటోనియో పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో టాక్స్ రిటన్స్ దాఖలు చేసేందుకు గడువు పొడిగించిన ఉగాండా.... ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన వారిని ఆర్థికంగా ఆదుకుంటున్న నమీబియా.... ప్రజలకు ఆహార ధాన్యాలు అందిస్తున్న కేప్ వెర్డే.... పరిశ్రమలకు పన్ను భారం తగ్గించిన ఈజిప్టు ప్రభుత్వాలను ఆయన ఈ సందర్బంగా ప్రశంసించారు. కాగా ఐరాస అనుబంధమైన ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిధులు నిలిపివేయడంపై ఆంటోనియో గుటెరస్ విచారం వ్యక్తం చేసిన విషయం విదితమే. ట్రంప్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదన్న ఆయన.. విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం పరస్పర సహకారంతో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు.(ఉగ్ర ప్రమాదం పొంచి ఉంది: యూఎన్ చీఫ్ హెచ్చరికలు) -
ఉగ్ర ప్రమాదం పొంచి ఉంది: యూఎన్ చీఫ్ హెచ్చరికలు
న్యూయార్క్: మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి బయో ఉగ్రవాదానికి తెరలేపే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. ప్రాణాంతక వైరస్‌ను ఉగ్రమూకలు ఉన్మాద చర్యలకు వినియోగించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలకు, అంతర్జాతీయ సమాజానికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు. కరోనా వైరస్ సంక్షోభంపై గురువారం ఐరాసలో తొలిసారిగా డొమీనికన్ రిపబ్లిక్(కరేబియా దేశం) అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐరాస భద్రతా మండలి నుంచి ఆంటోనియో ప్రసంగించారు. కోవిడ్-19పై పోరును.. ‘‘ఈ తరం యుద్ధం- యునైటెడ్ నేషన్స్ అస్తిత్వానికై పోరాటం’’గా ఆయన అభివర్ణించారు. ‘‘మహమ్మారి కోవిడ్-19 తొలుత ఆరోగ్య సంక్షోభంగా పరిణమించింది. అయితే రాను రాను దీని కారణంగా ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ఇది ముప్పుగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక అశాంతి, హింస చెలరేగే పరిస్థితులకు దారితీసేలా ఉంది. మహమ్మారిపై పోరుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా లేనట్లయితే అది బయో ఉగ్రదాడులకు దారితీయవచ్చు. అలా అయితే రిస్కు మరింత ఎక్కువవుతుంది. ప్రపంచాన్ని నాశనం చేసేందుకు ఉగ్ర సంస్థలు దీనిని ఉపయోగించుకునే అవకాశం ఉంది’’అని ఆంటోనియో కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారిపై పోరులో ప్రభుత్వాలు తలమునకలైన వేళ ఉగ్రవాదులు రెచ్చిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. అదే జరిగితే అంటువ్యాధిపై పోరులో విజయావకాశాలు సన్నగిల్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. (గృహహింసకు ముగింపు పలకండి:యూఎన్ చీఫ్) వారి పరిస్థితి ఏమిటి? కరోనా విజృంభిస్తున్న తరుణంలో మానవ హక్కుల ఉల్లంఘన మరో ఆందోళనకరంగా అంశంగా పరిణమించిందని ఆంటోనియో పేర్కొన్నారు. బలహీనవర్గాలు, శరణార్థుల పరిస్థితి ఎలా ఉందోనంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. విద్వేష ప్రసంగాలు వింటూనే ఉన్నాం. చికిత్స అందించే విషయంలో వివక్షను చూస్తున్నాం. భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియాపై ఆంక్షలు పెరిగిపోతున్నాయి’’అని ఆంటోనియో వ్యాఖ్యానించారు. కాగా కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 95 వేల మంది మరణించగా.. దాదాపు పదహారున్నర లక్షల మంది దీని బారిన పడ్డారు. -
కరోనాపై పోరుతో పాటు అదీ ముఖ్యమే: యూఎన్ చీఫ్
న్యూయార్క్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికై ప్రపంచ దేశాలు పోరాటం ఉధృతం చేసిన వేళ గృహహింస కేసుల సంఖ్యలో పెరుగుదల ఆందోళనకరంగా పరిణమించిందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. అత్యంత సురక్షితంగా భావించే సొంత ఇంటిలోనే మహిళలు హింసకు గురవడం.. బాధాకర విషయం అని విచారం వ్యక్తం చేశారు. కరోనా ధాటికి ప్రపంచమంతా అల్లాడుతున్న వేళ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం గర్హనీయమన్నారు. గత కొన్నివారాలుగా గృహ హింస కేసుల్లో భయంకరమైన పెరుగుదల నమోదైందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంలో హెల్్పలైన్ నంబర్లను ఆశ్రయిస్తున్న మహిళల సంఖ్య రెట్టింపు అయిందన్నారు. హింసను అంతం చేసి ప్రతీ ఒక్కరు తమ ఇంటిలో శాంతి స్థాపన చేయాలని విజ్ఞప్తి చేశారు.(లాక్డౌన్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు!) అదే విధంగా కొన్ని దేశాల్లో కరోనాపై పోరుకు తగినంతగా వైద్య సిబ్బంది అందుబాటులో లేరని.. ఈ విషయంపై ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని గుటెరస్ సూచించారు. అంతేగాకుండా కోవిడ్-19పై పోరాడటంతో పాటుగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడం కూడా ముఖ్యమైన బాధ్యతగా గుర్తించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై యుద్ధంతో పాటుగా.. గృహ హింసకు వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. కాగా మానవాళికి ముప్పుగా పరిణమించిన కోవిడ్-19ను అంతం చేసే చర్యల్లో భాగంగా వివిధ దేశాల్లో లాక్డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా సహా భారత్, చైనా, యూరప్ దేశాలు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌లలో గృహ హింస కేసుల సంఖ్య రెట్టింపు అయిందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. (గృహ హింసకు ఎర్ర చుక్క పరిష్కారం) -
‘ఎన్నో సంక్షోభాలను ఎదుర్కోబోతున్నాం’
న్యూయార్క్ : రాబోయే రోజుల్లో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కోబోతున్నామని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్దం తరువాత ఇలాంటి పరిస్థితిని ప్రపంచం ఎప్పుడు చూసి ఉండదని అంచనా వేశారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనావైరస్ మహమ్మారి ప్రభావం ఆర్ధిక రంగంపై అత్యధికంగా ఉందని, కనీవినీ ఎరుగని ఆర్ధికమాంద్యాన్ని ప్రపంచం చూడబోతుందన్నారు. ఈ స్ధాయి ఆర్ధిక మాంద్యాన్ని ఎప్పుడు చూసి ఉండరని అంచనా వేశారు. కరోనా వైరస్ ప్రభావం అత్యంత అస్థిరత, ఆశాంతి, ఆందోళనలకు దారితీయబోతుందని చెప్పారు. సామాజికార్ధిక పరిస్థితులపై కరోనావైరస్ ప్రభావంపై నివేదిక విడుదల చేసే సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రపంచదేశాలు కలిసికట్టుగా కరోనా వైరస్‌పై పోరాటం చేయాల్సిన సమయమని అన్నారు. రాజకీయ విషయాలు పక్కన పెట్టిన మానవాళిని రక్షించుకోవడానికి అన్ని దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి చరిత్రలో ఈ స్ధాయి ఆరోగ్య సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదని నివేదికలో అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఆరోగ్యరంగాకే పరిమితం కాకుండా అన్ని రంగాలపై ప్రభావం చూపుతూ మానవ సంక్షోభానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. (కరోనా షాక్ : భారత్, చైనాకు మినహాయింపు) కరోనాను ఎదుర్కోవడానికి ఎవరికి వారు సొంత ఎజెండాలతో ముందుకు సాగుతున్నారని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను ఖాతరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు లేని దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరి సహకారంతోనే కరోనా మహమ్మారిని తరిమి కొట్టగలమని అభిప్రాయపడ్డారు. -
కరోనా కోసం 2 బిలియన్ డాలర్ల నిధి
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా కరోనాను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి 2 బిలియన్ డాలర్ల అత్యవసర నిధిని ప్రకటించింది. ‘ఊహించని ముప్పును ప్రపంచం ఎదుర్కొంటోంది. కోట్లాది ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తోంది. ఇది ప్రపంచ మానవాళి అంతటికీ ఎదురైన సమస్య. కాబట్టి మానవాళి అంతా కలసి దీంతో పోరాడాలి. దీని కోసం మేము రెండు బిలియన్ డాలర్ల ప్రపంచ మానవత్వ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచంలోని పేద దేశాలకు ఇది ఉపయోగపడుతుంది. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే, ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడవచ్చు. ఇప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే పెనుముప్పుగా మారుతుంది. అన్ని దేశాలకు మేము చెప్పేది ఒక్కటే. ఈ హెచ్చరికను ఆలకించండి’ యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. -
ఉరిశిక్షలను ఆపేయండి: ఐక్యరాజ్యసమితి
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి ఉరిశిక్షల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. దోషులకు ఉరిశిక్షలను ఆపేయాలని లేదంటే తాత్కాలికంగా అయినా ఆపాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టిఫానే డుజారిక్ ఉరిశిక్షపై స్పందించారు. ఆంటోనియా గ్యుటెరెస్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని దేశాలన్నీ మరణశిక్షను ఆపివేయాలి. లేదా కనీసం ఉరి శిక్షలపై తాత్కాలికంగా అయినా నిషేధాన్ని విధించాలి. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకుందని విలేకరుల సమావేశంలో తెలిపారు. చదవండి: 'నిర్లక్ష్యం చేస్తే లక్షల్లో ప్రాణాలు పోతాయి' నిర్భయ దోషులను ఉరి తీసిన 24 గంటల తర్వాత ఐక్యరాజ్య సమితి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నిర్భయను సామూహిక అత్యాచారం చేసి ఆమె చావుకు కారణమైన ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31) లను శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు. దేశంలో నలుగురిని ఒకేసారి ఉరితీయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న కరోనా వైరస్‌ను వీలైనంత వేగంగా కట్టడి చేయలేకపోతే రాబోయే రోజుల్లో మరణాల సంఖ్య లక్షల్లో ఉండే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరాస్ హెచ్చరించారు. కరోనాను కార్చిచ్చుతో పోల్చారు.కార్చిచ్చులా వ్యాపిస్తున్న ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయకుండా నిర్లక్ష్యం వహిస్తే లక్షల్లో ప్రాణాలు కోల్పోతారని దేశాలను హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఇంతకుముందెన్నడూ ఏర్పడలేదన్నారు. చదవండి: హీరోయిన్‌కు కరోనా.. ప్రియుడు బ్రేకప్! -
'నిర్లక్ష్యం చేస్తే లక్షల్లో ప్రాణాలు పోతాయి'
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న కరోనా వైరస్‌ను వీలైనంత వేగంగా కట్టడి చేయలేకపోతే రాబోయే రోజుల్లో మరణాల సంఖ్య లక్షల్లో ఉండే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గ్యుటెరాస్ హెచ్చరించారు. కరోనాను కార్చిచ్చుతో పోల్చారు. కార్చిచ్చులా వ్యాపిస్తున్న ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయకుండా నిర్లక్ష్యం వహిస్తే లక్షల్లో ప్రాణాలు కోల్పోతారని దేశాలను హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కరోనా కారణంగా 10వేల మరణాలు సంభవించగా ఈ వైరస్‌తో ఆరోగ్య పరిస్థితులు రోజురోజుకు మరింత క్షీణిస్తున్నాయని తెలిపారు. దీని నుంచి బయటపడడానికి పరస్పరం సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయా దేశాల్లో పరిస్థితలను చక్కబెట్టుకుంటూ ఇతర దేశాలతో ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు. చదవండి: ఏప్రిల్ 19న యుగాంతం; ఏంటి కథ? ఆంటోనియో గ్యుటెరాస్ చేసిన వ్యాఖ్యలు: ►ప్రతి దేశం వ్యూహాత్మక చర్యలు చేపడుతూనే, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేని దేశాలను కూడా ఆదుకోవాలి. ►కరోనాపై పోరులో జీ-20 దేశాలు ముందుండాలి. ఆర్థికంగా బలమైన దేశాలు స్వీయ పరిరక్షణతో సరిపెట్టుకోకుండా ఆఫ్రికా లాంటి పేద దేశాలపైనా, అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలపైనా దృష్టి సారించాలి. ►దేశాలు తమ మధ్య ఉన్న వాణిజ్య విభేదాలను పక్కనబెట్టి సరికొత్త సప్లై చైన్ వ్యవస్థలను పునరుద్ధరించాలి. ►త్వరలోనే ఈ వైరస్ ప్రతి ఒక్క దేశాన్ని తాకుతుంది. జీ20 దేశాలు ఇతర దేశాలకు సాయం చేయకపోతే దారుణ ఫలితాలు వస్తాయి. ►అల్పాదాయ, చిన్న, మధ్య తరహా వ్యాపారులను ఆదుకోవాలి. సామాజిక ఉద్యోగ భద్రత, జీతాలు ఇవ్వడం, బీమా సౌకర్యాలు వంటి వాటితో చేయూతనివ్వాలి. ►ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న దేశాలను వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆదుకోవాలి. ►ప్రపంచవ్యాప్తంగా పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ►స్వదేశీ వస్తు రక్షణ విధానం పాటిస్తున్న దేశాలు ఈ తరుణంలో కాస్త వెసులుబాటు నిర్ణయాలు తీసుకోవాలి. ►కోవిడ్-19పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను అన్ని దేశాలు పాటించాలి. -
మాటల్లేవ్... చేతలే..
ఐక్యరాజ్యసమితి: వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావాలను అరికట్టేందుకు ఇప్పటివరకు చాలా మాటలు చెప్పామని, ఇక మాటలు కట్టిపెట్టి, చేతలు ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందని భారత ప్రధాని మోదీ ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి వేదికగా సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ నేతృత్వంలో వాతావరణ మార్పుపై సోమవారం జరిగిన శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. పారిస్ ఒప్పంద అమలుపై కార్యాచరణను వేగవంతం చేసే లక్ష్యంతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. వివిధ దేశాలు వాతావరణ మార్పు ప్రమాదాన్ని అరికట్టే దిశగా కృషి చేస్తున్నాయిగానీ ఇప్పుడు ఒక సమగ్ర కార్యాచరణ, అంతర్జాతీయ స్థాయి ఉద్యమం అవసరమని తన ప్రసంగంలో మోదీ పేర్కొన్నారు. ‘మనల్ని ముందుకు నడిపించాల్సింది అవసరమే కానీ అత్యాశ కాదు’ అని ప్రపంచదేశాలకు హితవు పలికారు. ఇందుకు విద్య నుంచి విలువల వరకు వ్యక్తిగత స్థాయిలో మార్పునకు అంతా శ్రీకారం చుట్టాలన్నారు. ఈ సదస్సులో భారత్ తరఫున ప్రధాని మోదీ ఒక కీలక ప్రకటన చేశారు. భారతదేశ శిలాజేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని 2022 నాటికి భారీగా 450 గిగావాట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. నెల క్రితమే స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పారిస్ ఒప్పందంలో భాగంగా.. ఆ లక్ష్యాన్ని 150 గిగావాట్లుగా ప్రధాని పేర్కొన్న విషయం విదితమే. ‘ప్రకృతిని గౌరవించడం, వనరులను జాగ్రత్తగా వాడుకోవడం, మన అవసరాలను కుదించుకోవడం..మొదలైన చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఆచరణ సాధ్యమైన ఒక ప్రణాళిక అవసరాన్ని నొక్కి చెప్పేందుకే భారత్ ఈ సదస్సులో పాల్గొంటోందని స్పష్టం చేశారు. భారత్‌లో బయో ఫ్యూయల్‌ను పెట్రోల్, డీజిల్‌లలో కలిపే కార్యక్రమం ప్రారంభించామన్నారు. నీటి సంరక్షణ, వర్షం నీటిని సంరక్షించుకోవడం లక్ష్యంగా ప్రారంభించిన ‘జల్ జీవన్ మిషన్’ పథకంపై రానున్న కొన్ని ఏళ్లలో 50 బిలియన్ డాలర్లు(రూ. 3.5 లక్షల కోట్లు) ఖర్చు పెట్టనున్నామన్నారు. నిర్ణయాత్మక సమయం: ఐరాస వాతావరణ మార్పును ప్రతికూలతపై యుద్ధం ప్రకటించేందుకు నిర్ణయాత్మక సమయం ఆసన్నమైందని ఐరాస పేర్కొంది. ఐరాస సోమవారం నిర్వహించిన ‘క్లైమేట్ ఎమర్జెన్సీ సమిట్’లో దాదాపు 60 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా గ్రీన్ హౌజ్ వాయువులు వాతావరణంలోకి విడుదల అవుతున్న నేపథ్యంలో.. బలహీనపడుతున్న పారిస్ ఒప్పంద అమలు లక్ష్యాలను పునరుజ్జీవింపజేసేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ‘వాతావరణ అత్యవసర స్థితి అనే పరుగుపందంలో మనం వెనకబడి పోతున్నాం. కానీ అది మనం గెలిచి తీరాల్సిన పరుగుపందెం’ అని ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్ అన్నారు. ట్రంప్ కూడా వచ్చారు పారిస్ ఒప్పందం విషయంలో భారత్ అమెరికాల మధ్య విభేదా లున్నాయి. అమెరికాకు నష్టదాయకమంటూ 2017లో ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. మోదీ ప్రసంగిస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కడే ఉన్నారు. అనూహ్యంగా, ముందే చెప్పకుండా ఈ సదస్సుకు ట్రంప్ హాజరుకావడం విశేషం. మోదీ, జర్మనీ చాన్సెలర్ మెర్కెల్ ప్రసంగాల అనంతరం ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి ట్రంప్ వెళ్లిపోయారు. సెనెటర్ భార్యకు మోదీ సారీ! హ్యూస్టన్: అమెరికా సెనెటర్ జాన్ కార్నిన్ భార్య సాండీకి మోదీ క్షమాపణలు చెప్పారు. ఆదివారం సాండీ పుట్టిన రోజు. అయితే భార్యతో సరదాగా గడపకుండా భర్త.. ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న మోదీ ఆమెకు సారీతో పాటు బర్త్‌డే విషెస్ చెప్పారు. ‘మీ పుట్టిన రోజు మీ జీవిత భాగస్వామి మీతో ఉండకుండా.. నాతో ఉన్నారు. అందుకు మీకు కోపం ఉండొచ్చు. సారీ’ అని ఆమెతో చెప్పారు. అప్పుడు మోదీని చూడాలి హౌడీ మోదీ కార్యక్రమంలో మోదీకి స్వాగతం పలుకుతూ భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరును ప్రస్తావించిన డెమొక్రాట్ పార్టీ నేత స్టెనీ హోయర్పై కాంగ్రెస్ పార్టీ ప్రశంసలు కురిపించింది. ‘మహాత్మాగాంధీ బోధనలు, నెహ్రూ దార్శనికతతో భారత్ మానవహక్కులకు, బహుళత్వానికి పట్టం కట్టే లౌకిక ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకుంది’ అని మోదీని స్వాగతిస్తూ స్టెనీ పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు స్పందించారు. నెహ్రూ సేవలను మోదీకి అమెరికా నేతలు గుర్తు చేయడం బావుంది అని మరోనేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ‘అద్వానీ సైతం నెహ్రూను ప్రశంసిస్తూ గతంలో ప్రసంగించారు. ఆ రోజులేమయ్యాయి?’ అంటూ జైరాం ట్వీట్ చేశారు. ‘నెహ్రూ పేరును స్టెనీ ప్రస్తావించినపుడు మోదీ ముఖ కవళికలు చూడాల్సిందే’ అని సింఘ్వీ వ్యాఖ్యానించారు. -
భారత పర్యావరణ కృషి భేష్
ఐక్యరాజ్య సమితి: పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ చేస్తున్న కృషి అద్భుతమని, సంప్రదాయేతర ఇంధన రంగాన్ని ముందుకు పరుగులు పెట్టించడంలో ఆ దేశం అమోఘంగా పనిచేస్తోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ కొనియాడారు. ప్రధాని మోదీని తను పలుమార్లు కలుసుకున్నానని సౌర విద్యుత్‌ని వినియోగించుకోవడానికి అంతర్జాతీయ దేశాలను కూడగట్టడంలో ఆయనలోని నాయకత్వ లక్షణాలు ప్రపంచానికి తెలిసాయని ప్రశంసించారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన గాంధీజీ సోలార్ పార్క్‌ని మోదీ 24న ప్రారంభించనున్నారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సుని పురస్కరించుకొని గుటెరెస్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా విందు సమావేశం ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్ రంగంలో భారత్ భారీగా పెట్టుబడులు పెడుతోందని, అయితే ఇంకా థర్మల్ పవర్ వినియోగాన్ని బాగా తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. -
భారత్‌పై ప్రశంసలు కురిపించిన ఐరాస
న్యూయార్క్ : పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా భారత్ అద్బుతమైన ప్రగతి సాధిస్తోందని ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. అంతర్జాతీయంగా పర్యావరణ మార్పులపై జరుగుతున్న పోరాటంలో భారత్ కీలకపాత్ర పోషిస్తుందని ఆయన ప్రశంసించారు. పలుమార్లు భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భాలను గుర్తుచేసుకున్న ఆంటోనియో , మహాత్మ గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఐరాస కార్యాలయానికి 193 సౌర ఫలకలు బహుమతిగా ఇచ్చారని.. అవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను సమకూర్చుకోవడానికి సౌరవిద్యుత్‌పై భారత్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం శుభ పరిణామమని కొనియాడారు. క్లీన్ ఇండియాలో భాగంగా మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రభావవంతంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, సెస్టెంబరు 23న ఐరాసలో వాతావరణ మార్పులపై సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మోర్కెల్, న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్, మార్షల్ ఐలాండ్ అధ్యక్షుడు హిల్డా హీన్లతో కలిసి ప్రసంగించనున్నారు. కర్బన ఉద్ఘారాలను తొలగించడం కోసం కొన్ని దేశాలు అణు ఇంధనం దిశగా అడుగులు వేస్తున్నాయని గుటెరస్ పేర్కొన్నారు. భారత్‌లో ఎక్కువభాగంలో బొగ్గు నిక్షేపాలు ఉన్న సంగతిని గుర్తుచేశారు. ప్రస్తుతం కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు కృషి చేస్తున్న భారత్‌ను ఐరాస గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహాత్మగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఐరాస ప్రదాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సౌర ఫలకలతో కూడిన సోలార్ పార్కును సెస్టెంబర్ 24న వివిధ దేశాల ప్రతినిధుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం పలు దేశాలకు చెందిన నేతలు గాంధీ సిద్ధాంతాలు తమను ఏ విధంగా ప్రభావితం చేశాయో మాట్లాడనున్నారు. కాగా ఈ సౌర ఫలకలు 50 కిలోల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ కార్యక్రమానికి సింగపూర్ ప్రధాని లీ హ్సీన్ లూంగ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్, జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్నెస్, ఇతర దేశాల నేతలు పాల్గొననున్నారు. -
ఐరాసలో కశ్మీర్ ప్రస్తావన!
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల్లో చర్చల సందర్భంగా కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశముందని ఐరాస ప్రధాన కార్యదర్శి అంటానియొ గ్యుటెరిస్ అధికార ప్రతినిధి స్టీఫానె డ్యుజారిక్ వెల్లడించారు. కశ్మీర్‌లోయలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, మానవహక్కుల ఉల్లంఘన తదితర అంశాలను వచ్చేవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ప్రధాన కార్యదర్శి గ్యుటెరిస్ లేవనెత్తవచ్చని పేర్కొన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఏకైక మార్గం చర్చలేనన్న విషయాన్ని గ్యుటెరస్ బలంగా విశ్వసిస్తున్నారని తెలిపారు. ‘ప్రస్తుత కశ్మీర్ సమస్య పరిష్కారంలో.. లోయలో మానవహక్కుల ఉల్లంఘన అంశాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని గ్యుటెరస్ అభిప్రాయపడ్డారని స్టీఫానె తెలిపారు. సాధారణ సభ సమావేశాలను ఈ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రధాన కార్యదర్శి ఉపయోగించుకోవచ్చన్నారు. అయితే, కశ్మీర్ పరిష్కారానికి భారత్ పాక్ ల మధ్య చర్చలే మార్గమని, వారు కోరితే ఇరువర్గాలకు ఐరాస కార్యాలయం అందుబాటులో ఉంటుందని, అదే సమయంలో మానవహక్కులకు సముచిత గౌరవం ఇవ్వాల్సిందేనని బుధవారం గ్యుటెరస్ అభిప్రాయపడిన విషయం ఇక్కడ గమనార్హం. ‘అక్కడ మానవ హక్కులను కచ్చితంగా గౌరవించాల్సిందే. అయితే, భారత్– పాక్‌ల మధ్య చర్చలే కశ్మీర్ సమస్యకు పరిష్కారమని నా విశ్వాసం’ అని నాడు పాక్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు గ్యుటెరస్ సమాధానమిచ్చారు. కాగా, జమ్మూకశ్మీర్ భారత్ భూభాగం. దీనికి సంబంధించిన ఏ సమస్యలోనైనా.. ఐరాస లేదా అమెరికా.. ఎవరైనా సరే మూడో శక్తి ప్రమేయాన్ని అంగీకరించబోం’ అని ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై భారత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. భారత్, పాక్‌లు కోరితేనే ఇందులో జోక్యం చేసుకుంటామని కూడా ఐరాస ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం భారత్, పాక్‌ల సంబంధాలు కనిష్ట స్థాయికి దిగజారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న న్యూయార్క్‌లో జరగనున్న ఐరాస సాధారణ సభ సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతానని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేసిన విషయమూ విదితమే. అయితే, అదే సెప్టెంబర్ 27న భారత ప్రధాని మోదీ కూడా ఐరాస వేదికగా ప్రసంగించనుండటం విశేషం. దీటుగా సమాధానమిస్తాం ఐరాస వేదికపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తే అధమ స్థాయికి పాకిస్తాన్ దిగజారితే.. అందుకు భారత్ అత్యున్నత స్థాయిలో జవాబిస్తుందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తేల్చి చెప్పారు. గతంలోనూ ఇలా అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తిన సందర్భాల్లో భారత్ తిరుగులేని విధంగా వారికి జవాబిచ్చామన్నారు. ఇప్పటివరకు ఉగ్రవాద వ్యాప్తిలో పెరెన్నికగన్న పాకిస్తాన్.. ఇప్పుడు భారత్‌పై ద్వేష భావజాల ప్రచారాన్ని కూడా తలకెత్తుకుందని విమర్శించారు. -
ప్రార్థనలు.. ప్రశాంతం!
శ్రీనగర్/న్యూఢిల్లీ/ఐరాస/వాషింగ్టన్: కశ్మీర్లో ప్రార్థనలు చేసుకునేందుకు ప్రభుత్వం శుక్రవారం ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేసింది. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు శాంతియుతంగా మసీదుల్లో ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోపోర్‌సహా కొన్నిచోట్ల అల్లరిమూకలు భద్రతాబలగాలపై రాళ్లు విసరగా, వారిని బలగాలు చెదరగొట్టాయి. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఏచూరి, రాజాల అడ్డగింత.. కశ్మీర్లో పర్యటించేందుకు వచ్చిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాలను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీనగర్ విమానాశ్రయంలో దిగిన వీరిద్దరినీ అధికారులు తిరిగి ఢిల్లీకి విమానంలో పంపించారు. ఈ విషయమై సీతారాం ఏచూరి మాట్లాడుతూ..‘శ్రీనగర్‌లోకి ఎవ్వరినీ అనుమతించరాదని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను పోలీసులు మాకు చూపించారు. భద్రతా కారణాల రీత్యా ఎవ్వరినీ అక్కడకు తీసుకెళ్లలేమని చెప్పారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ శుక్రవారం కూడా శ్రీనగర్‌లోని సున్నితమైన ప్రాంతాల్లో తన సహాయకులతో కలిసి పర్యటించారు. పలుచోట్ల కశ్మీరీలతో ముచ్చటించారు. అనంతరం సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులతో ఆయన సమావేశమయ్యారు. సంయమనం పాటించండి: గ్యుటెరస్ జమ్మూకశ్మీర్ విషయంలో భారత్–పాకిస్తాన్‌లు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ కోరారు. ఐరాస మార్గదర్శకాలకు లోబడి సిమ్లా ఒప్పందం మేరకు ఇరుదేశాలు తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలని సూచించారు. కశ్మీర్ సమస్యను మరో పక్షం జోక్యంలేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని 1972లో భారత ప్రధాని ఇందిర, పాక్ అధ్యక్షుడు జుల్ఫీకర్ అలీ భుట్టో ఒప్పందంపై సంతకాలు చేశారు. మా పాలసీ మారలేదు: అమెరికా కశ్మీర్ విషయంలో తమ విధానంలో ఎలాంటి మార్పులేదని అమెరికా తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి భారత్–పాకిస్తాన్‌లు ప్రత్యక్ష చర్చలు ప్రారంభించడమే మార్గమని పునరుద్ఘాటించింది. కాగా, అమెరికా విదేశాంగ సహాయ మంత్రి జాన్ ఆగస్టు 11–17 మధ్య భూటాన్, భారత్‌లో పర్యటించనున్నారు. భారత్, పాకిస్తాన్‌లు తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా శుక్రవారం పిలుపునిచ్చింది. పాక్ భయపడుతోంది: విదేశాంగ శాఖ కశ్మీర్లో భారత చర్యలు చూసి పాక్ భయపడుతోందనీ, ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే ఇకపై ప్రజలను తప్పుదోవ పట్టించలేమని పాక్ ఆందో ళన చెందుతోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ అన్నారు. కుల్‌భూషణ్ జాధవ్ ను భారత రాయబారులు కలిసే అంశంపై తాము పాక్‌తో మాట్లాడుతున్నామన్నారు. మరోవైపు, జమ్మూ కశ్మీర్‌లోని అన్ని పంచాయతీలు, వార్డులు, మొహల్లాల్లోనూ స్వాతంత్య్ర దినోత్సవాలను నిర్వహిస్తామని బీజేపీ ప్రకటించింది. ఆగ్రా జైలుకు కశ్మీర్ వేర్పాటువాదులు కశ్మీర్‌లోని హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మియన్ ఖయ్యూంను పోలీసులు కశ్మీర్ లోయలోని జైలు నుంచి యూపీలోని ఆగ్రాకు తరలించారు. కశ్మీర్లో సమస్యలు సృష్టించగల వ్యక్తులను కేంద్రం ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. ఖయ్యూంతోపాటు 25 మంది వేర్పాటువాదులనుఆగ్రాకు తరలించగా, శుక్రవారం మరో 20 మందిని కశ్మీర్ నుంచి ఆగ్రా సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా వారిని పోలీసులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రముఖ న్యాయవాదిగా పేరున్న ఖయ్యూం, వేర్పాటువాదులకు సంబంధించిన అనేక కేసులను వాదించారు. -
ఆర్టికల్ 370 రద్దు; యూఎన్ చీఫ్ కీలక వ్యాఖ్యలు!
ఇస్లామాబాద్/ న్యూయార్క్ : కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత కశ్మీర్లో కశ్మీరీల పరిస్థితి ఎలా ఉండబోతుందో ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు... ఆ నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను గురించి వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. అదే విధంగా కశ్మీర్ అఖండ భారత్‌లో సంపూర్ణంగా భాగస్వామి కావడం వల్ల ప్రయోజనాలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. మోదీ ప్రసంగంపై పెదవి విరిచిన ఇమ్రాన్ ఖాన్.. ప్రస్తుత అంశాలపై స్పందించాల్సిందిగా అంతర్జాతీయ సమాజాన్ని మరోసారి కోరారు. ఈ క్రమంలో భారత్ వ్యవహరిస్తున్న తీరుపై జోక్యం చేసుకోవాల్సిందిగా పాక్ రాయబారి మలీహా లోధి ఐక్యరాజ్యసమితికి విఙ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ తరఫున ఆయన ప్రతినిధి స్టెఫానే డుజారిక్ మాట్లాడుతూ...‘ 1972లో భారత్, పాకిస్తాన్ చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందం గురించి ఆంటోనియో గుటెరస్ గుర్తుచేశారు. జమ్మూ కశ్మీర్‌పై ఇరు దేశాలు శాంతియుతంగా చర్చించి అంతిమ నిర్ణయం తీసుకుంటామని సిమ్లా ఒప్పందంలో పేర్కొన్నాయి. ’ అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాలు సంయమనం పాటించాలని... ప్రజల హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆంటోనియో అన్నట్లు పేర్కొన్నారు. కాగా కశ్మీర్ విషయంలో యూఎన్ సహా ఇతరుల జోక్యం అంగీకరించబోమని భారత్ సిమ్లా ఒప్పందంలో స్పష్టం చేసింది. సిమ్లా ఒప్పందం? పశ్చిమ, తూర్పు పాకిస్తాన్ల మధ్య సంక్షోభం తలెత్తిన సమయంలో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) పాలకుడు షేక్ ముజ్బీర్ రెహ్మాన్‌కు అండగా భారత్ నిలబడింది. పాక్ ప్రభుత్వ ఆగడాలు భరించలేని బెంగాలీలు బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరు బాట పట్టారు. వారికి అండగా నిలిచిన భారత్‌పైకి పాకిస్తాన్ 1971లో యుద్ధానికి దిగింది. ఎన్నో ప్రాంతాలపై దాడులు మొదలు పెట్టింది. ఈ క్రమంలో భారత ఆర్మీ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ సమయంలోనే పాక్ అధీనంలో ఉన్న కశ్మీర్లో 5,795 చదరపు మైళ్ల భాగాన్ని మన సైన్యం కైవసం చేసుకుంది. రెండువారాల పాటు ఉధృతమైన పోరాటం తర్వాత బంగ్లాదేశ్ విముక్తి పొందింది. ఆ తర్వాత కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందంలో భాగంగా భారత్ కశ్మీర్లో తాను సొంతం చేసుకున్న భాగాన్ని పాక్‌కు తిరిగి ఇచ్చేసింది. ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని, కశ్మీర్లో శాంతి నెలకొల్పాలనే భారత్ ఆ నిర్ణయం తీసుకుంది. ఈ యుద్ధంలో వాస్తవానికి కశ్మీర్ ప్రమేయం ప్రత్యక్షంగా లేకపోయినా పాక్‌కు అత్యంత నష్టం కలిగించింది, భారత్ కశ్మీర్లో తిరిగి కొంత భాగాన్ని ఆక్రమించుకుంది ఈ యుద్ధంతోనే. ఈ క్రమంలో దౌత్యపరంగా బంగ్లాదేశ్‌ను గుర్తించే విధానం, ద్వైపాక్షిక సంబంధాల గురించి 1972లో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ భుట్టో, భారత ప్రధాని ఇందిరా గాంధీ సిమ్లాలో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య తలెత్తిన సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. కశ్మీర్ వంటి అంశాల్లో కూడా ఐక్యరాజ్యసమితి సహా ఇతరుల జోక్యం అంగీకరించబోమని భారత్ స్పష్టం చేసింది. ఇక ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో భారత్ వ్యవహరిస్తున్న తీరుపై స్పందించాల్సిందిగా గత కొన్ని రోజులుగా ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా.. జమ్మూ కశ్మీర్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, ఇదే అంశంపై సంయమనం పాటించాలని పాకిస్తాన్‌ను కోరింది. భారత్‌తో వాణిజ్య సంబంధాలకు స్వస్తి పలకడంతో పాటు దౌత్యపరమైన చర్యలతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దూకుడు పెంచడంతో సంయమనం పాటించాలని అగ్రరాజ్యం సూచించింది. దీంతో పాక్ దూకుడుకు కళ్లెం వేసినట్లు అయ్యింది. అయితే ప్రస్తుతం యూఎన్ కార్యదర్శి సిమ్లా ఒప్పందం గురించి ప్రస్తావించడంతో కశ్మీర్ అంశంపై ఐరాస ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది. -
సర్జికల్ స్ట్రైక్స్ : ఐరాస స్పందన
న్యూయార్క్ : జైషే ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడుల నేపథ్యంలో పాకిస్తాన్- భారత్‌లు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ విఙ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఆయన అధికార ప్రతినిధి స్టెఫానే డుజారిక్ మాట్లాడుతూ..‘ గత కొంతకాలంగా భారత్- పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను, ప్రతీకార దాడులను ఆంటోనియో నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాల ప్రభుత్వాలు పూర్తి సంయమనం పాటించాలని.. పరిస్థితులు దిగజారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన విఙ్ఞప్తి చేశారు’ అని వ్యాఖ్యానించారు. అయితే భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన డుజారిక్.. ఇందుకు సంబంధించి తమ వద్ద ఎటువంటి సమాచారం లేదన్నారు. కాగా పుల్వామా ఉగ్రదాడికి దీటుగా బదులిస్తామన్న భారత్.. ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. 12 మిరాజ్-2000 జెట్ ఫైటర్స్‌తో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్-2 విజయవంతంగా పూర్తి చేసి... అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించింది. -
‘భారత్, పాక్‌లకు మా సహకారం ఉంటుంది’
న్యూయార్క్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను నివారించేందుకు ఇరు దేశాలు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ పిలుపునిచ్చారు. ఇందుకు తాము పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన అధికార ప్రతినిధి స్టెఫానే డుజారిక్ మాట్లాడుతూ..‘ పుల్వామా ఉగ్రదాడి కారణంగా ఇండియా, పాకిస్తాన్ల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇటువంటి ఇబ్బందులను తగ్గించుకునేందుకు వారు ముందుకు రావాలి. అదే విధంగా వారు కోరినట్లైతే ఇరు దేశాలకు మా సహాయ సహకారాలు ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు. ఇక పుల్వామా దాడిపై విచారణ జరిపేందుకు జమ్మూలో ప్రయాణిస్తున్న యూఎన్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా-పాకిస్తాన్(యూఎన్‌ఎమ్‌ఓజీఐపీ) బృందానికి ఇబ్బందులు తలెత్తుతున్న విషయాన్ని స్టెఫానే ప్రస్తావించారు. యూఎన్‌ఎమ్‌ఓజీఐపీ వాహనంపై కొంత మంది నిరసనకారులు పాకిస్తాన్ జెండా ఉంచి ఆందోళనకు దిగారని పేర్కొన్నారు. ఈ క్రమంలో తమ బృందానికి మరింత భద్రత పెంచాలని భారత్‌ను కోరినట్లు వెల్లడించారు.(దాడి చేస్తే.. ఊరుకోం!) కాగా పుల్వామా ఘటన కారణంగా ప్రస్తుతం భారత్-పాక్ ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాల్సిందిగా ఐరాసను పాకిస్తాన్ కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు... ‘ ‘పాకిస్తాన్‌పై భారత్ బలాన్ని ప్రయోగిస్తుందనే ఆందోళనలతో మా ప్రాంతంలో భద్రతా పరిస్థితి క్షీణిస్తున్న అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. విచారణ కూడా చేయకుండానే పుల్వామాలో ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ కారణమనడం అర్థరహితం. ఉద్రిక్తతలను తగ్గించే చర్యలు తీసుకోవడం అనివార్యం. ఇందుకోసం ఐరాస తప్పక రంగంలోకి దిగాలి’ అని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఐరాసకు లేఖ రాశారు. అయితే భారత్, పాక్‌ల మధ్య మూడో దేశం లేదా సంస్థ జోక్యాన్ని భారత్ తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఏ సమస్యైనా ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోంది. -
ఈ–కామర్స్ రంగంపై అంతర్జాతీయ ఒప్పందం!
దావోస్: వేగంగా మారుతున్న ప్రపంచంతో పాటు మారకపోతే బహుళపక్ష వాణిజ్య వ్యవస్థలు, డబ్ల్యూటీఓ వంటి సంస్థలు కనుమరుగు కాక తప్పదని డబ్ల్యూటీఓ చీఫ్ రొబెర్టో అజెవెడో హెచ్చరించారు. దీనిని నివారించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. జోరుగా వృద్ధి చెందుతున్న ఈ–కామర్స్ కోసం అంతర్జాతీయ బహుళపక్ష ఒప్పందం అవసరమన్నారు. ఇక్కడి ప్రపంచ ఆర్థిక సదస్సులో (డబ్ల్యూఈఎఫ్) ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, రక్షణాత్మక విధానాలు పెరుగుతుండటం వంటి కారణాల వల్ల వాణిజ్య రంగంలో గతంలో కంటే సవాళ్లు మరింత క్లిష్టమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు నిజానికి రాజకీయ సమస్య అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుంటెరస్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయని, వీటిని సవ్యంగా పరిష్కరించలేకపోతే పెను విపత్తు తప్పదని ఆయన హెచ్చరించారు. కాగా ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంశాలను దేశాలు త్వరితంగా పరిష్కరించుకోవాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) చీఫ్ క్రిస్టీనా లగార్డ్ సూచించారు. అందుకే అం తర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించామన్నా రు. కాగా, కృత్రిమ మేధ నియంత్రణకు నిబంధనల ను రూపొందించాల్సిన అవసరముందని మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. గోప్యతను మానవ హక్కుగా పరిగణించాలని పేర్కొన్నారు. డిజిటల్ డిక్లరేషన్... డిజిటల్ యుగంలో నైతికంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామనే డిజిటల్ ప్రతినకు 40కు పైగా అంతర్జాతీయ వ్యాపార ప్రముఖులు సంఘీభావం తెలిపారు. ఈ డిజిటల్ డిక్లరేషన్‌పై మన దేశానికి చెందిన భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ తొలి సంతకం చేశారు. ఎరిక్సన్, ఐబీఎమ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, నోకియా, శామ్సంగ్, షార్ప్, వెరిజాన్, వొడాఫోన్, షియోమి తదితర సంస్థలు ఈ డిజిటల్ డిక్లరేషన్‌కు సంఘీభావం తెలిపాయి. ఎలక్ట్రానిక్ వేస్ట్.. 6,200 కోట్ల డాలర్లు ప్రతీ ఏడాదీ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(ఈ–వేస్ట్) విపరీతంగా పెరిగిపోతున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం 5 కోట్ల టన్నులుగా (ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా తయారైన వాణిజ్య విమానాల బరువు కంటే ఇది అధికం) ఉన్న ఈ–వేస్ట్ 2050 కల్లా 12 కోట్ల టన్నులకు పెరుగుతుందని పేర్కొంది. ఫలితంగా తీవ్రమైన ఆరోగ్య, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని వివరించింది. ఏటా పేరుకుపోతున్న ఈ–వ్యర్థాల విలువ 6,200 కోట్ల డాలర్ల మేర ఉంటుందని, ఇది మొత్తం ప్రపంచ వెండి ఉత్పత్తి విలువకు మూడు రెట్లకు సమానమని వివరించింది. ప్రతి ఏటా ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్స్ ఉత్పత్తుల్లో 20 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నట్లు తెలియజేసింది. -
ఐక్యరాజ్య సమితి అధ్యక్షునికి ఫోన్ చేసిన ఇమ్రాన్
వాషింగ్టన్ : పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు ఆంటోనియో గట్టర్స్‌కు ఫోన్ చేసి కశ్మీర్ విషయం గురించి మాట్లాడినట్లు తెలిసింది. ఈ విషయ గురించి స్వయంగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజార్రిక్ పీటీఐకు వెల్లడించారు. స్టీఫెన్, పీటీఐతో మాట్లాడుతూ పలు దేశాల అధిపతులు, ప్రధానులు, అధ్యక్షులు యూఎన్ అధ్యక్షుడితో మాట్లాడటం చాలా సాధరణం. అందులో భాగంగానే ఇమ్రాన్, ఆంటోనియోకు ఫోన్ చేశారన్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్‌కు కశ్మీర్‌పై తమ వైఖరేంటో చెప్పామన్నారు స్టీఫెన్. అయితే ఇమ్రాన్ కశ్మీర్ అంశం లేవనెత్తిన అనంతరం ఇరువురు మధ్య జరిగిన సంభాషణ వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. అంతేకాక కశ్మీర్ అంశం గురించి ఐక్యరాజ్య సమితి మిలిటరీ అబ్సర్వర్ గ్రూపు(యూన్ఎమ్ఓజీఐపీ) తరఫున పరిశీలకుల బృందం పని చేస్తోందని స్టీఫెన్ తెలిపారు. కొన్ని రోజులుగా కశ్మీర్ వ్యవహారంతో పాటు మరి కొన్ని సందర్భాల్లో పాకిస్థాన్ తీరుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ తీరును విమర్శిస్తూ ‘మీ పని మీరు చూసుకుంటే మంచిదం’టూ భారత్ తీవ్ర స్థాయిలో జవాబిచ్చింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఆంటోనియోతో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. కశ్మీర్ అంశం పరిశీలన గురించి ఐక్యరాజ్యసమితి 1949లో మిలిటరీ అబ్సర్వర్ గ్రూపును ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇందులో 118 మంది ఐక్యరాజ్యసమితి సిబ్బంది పనిచేస్తున్నారు. 1971 ఇండియా-పాక్ యుద్ధం, అదే ఏడాది ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం నుంచి ఈ సంస్థ ఇరు దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షించి వాటిని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌కు నివేదిస్తోంది. -
సంస్కరణలకు భారత్ మద్దతు
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ మూడ్రోజుల పర్యటనలో భాగంగా సోమవారం భారత్‌కు చేరుకున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న గ్యుటెరస్‌కు ఐరాస సీనియర్ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో ఆయన భేటీ అవుతారు. భారత పర్యటన సందర్భంగా గ్యుటెరస్ మీడియాతో మాట్లాడుతూ..‘ప్రపంచం మునుపెన్నడూ చూడని సవాళ్లను ప్రస్తుతం ఎదుర్కొంటోంది. వీటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ఐరాసను తీర్చిదిద్దాలి. నా సిఫార్సులకు ఐరాసలో సంపూర్ణ మద్దతు ప్రకటించిన భారత్‌కు ధన్యవాదాలు. ప్రస్తుతం భారత్ ఉమ్మడి లక్ష్యాల కోసం ప్రపంచ దేశాలతో కలిసి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా భిన్నధ్రువ ప్రపంచాన్ని నిర్మించడం అసాధ్యం. ఇండియా ప్రపంచ శక్తిగా మారుతోంది’ అని పేర్కొన్నారు. -
అవినీతి @ 5% ప్రపంచ జీడీపీ
ఐక్యరాజ్యసమితి: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు అవినీతే మూల కారణమనీ, ఈ జాడ్యం కారణంగా ప్రపంచ జీడీపీలో 5 శాతానికి సమానమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ అన్నారు. హింస, ఘర్షణలు, అస్థిరత, ఆయుధాలు, మాదకద్రవ్యాలు, మానవుల అక్రమ రవాణా తదితర అనేక సమస్యలు అవినీతి వల్లే రోజురోజుకూ పెరిగిపోతున్నాయని చెప్పారు. లంచగొండితనం కారణంగా హింస పెచ్చరిల్లుతుండటం, అంతర్జాతీయంగా శాంతి భద్రతలను కాపాడేందుకు అవినీతిని అంతమొందిచటం అనే అంశాలపై ఐరాస భద్రతా మండలి సోమవారం నిర్వహించిన సమావేశంలో గ్యుటెరస్ మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) అంచనాలను ఆయన ఉటంకిస్తూ.. అవినీతి కారణంగా ప్రపంచం 2.6 ట్రిలియన్ డాలర్ల మేర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. అక్రమ నగదు రవాణా, పన్ను ఎగవేతల కారణంగానే అవినీతి రోజురోజుకూ పెరిగిపోతోందనీ, ఈ నేరాలను అరికట్టేందుకు అన్ని దేశాలూ సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని గ్యుటెరస్ కోరారు. జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్లను ఏర్పాటుచేసి, విచారణ జరపడం అత్యంత ఆవశ్యకమనీ, స్వతంత్ర న్యాయవ్యవస్థ, మీడియా స్వేచ్ఛ, అవినీతిని బయటపెట్టే సామాజిక కార్యకర్తలకు రక్షణ ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రపంచ దేశాలకు సూచించారు. ‘అవినీతి అన్ని దేశాల్లోనూ ఉంది. ధనిక–పేద, ఉత్తర–దక్షిణ, అభివృద్ధి చెందిన–అభివృద్ధి చెందుతున్న.. ఇలా ప్రపంచంలోని ప్రతీ దేశంలోనూ అవినీతి ఉంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం వ్యక్తులు, వాణిజ్య సంస్థలు ఏడాదికి ఒక ట్రిలియన్ డాలర్ల కన్నా ఎక్కువే లంచం ఇస్తున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
కశ్మీర్లో స్వతంత్ర విచారణకు మద్దతు
ఐక్యరాజ్యసమితి: కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై స్వతంత్ర అంతర్జాతీయ విచారణకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ మద్దతు పలికారు. ఈ విషయంలో మానవ హక్కుల హైకమిషనర్ నిర్ణయాలు ఐరాస గొంతును ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు. స్వతంత్ర విచారణ జరపాలని ఐరాస మానవ హక్కుల విభాగం హైకమిషనర్ ప్రతిపాదించి ఓ నివేదిక రూపొందించారు. అయితే స్వతంత్ర విచారణ చేయాలన్న ప్రతిపాదనను భారత్ ఖండించింది. కాగా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కశ్మీర్‌లలో సాయుధులు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న హింస వల్ల పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అంతర్జాతీయ శాంతిభద్రతకు విఘాతం కలిగించే స్థాయి లేని అంశాలను కూడా ఆ నివేదికలో పేర్కొన్నారని భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. -
‘కథువా’ మృగాలను ఉరి తీయండి: ఐక్యరాజ్యసమితి
న్యూయార్క్ : కథువా చిన్నారి హత్యాచార ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. దీనిని భయానక ఘటనగా అభివర్ణించిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్.. ఘాతుకానికి పాల్పడ్డ వారిని ఉరి తీయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘మీడియాలో వచ్చిన కథనాలు నన్ను కదిలించాయి. ఓ పసి ప్రాణాన్ని అతి భయంకర రీతిలో చిత్రవధలకు గురి చేసి నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అలాంటి మానవ మృగాలను క్షమించకూడదు. చట్టపరిధిలో వారిని(గరిష్ఠ శిక్ష ఆధారంగా..) కఠినంగా శిక్షించి ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భారత ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరోసారి ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకూడదని కోరుకుంటున్నా’ అని గుటెర్రెస్ తన సందేశంలో పేర్కొన్నారు. దీనిని ఆయన ప్రతినిధి స్టీఫెన్ దుజ్జారిక్ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. కథువా జిల్లాలో నొమాదిక్ బకర్వాల్ ఇస్లాం తెగకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి జనవరి 10న అదృశ్యం కాగా.. వారం తర్వాత ఆమె మృత దేహం ఛిద్రమై కనిపించింది. పోస్ట్ మార్టం నివేదికలో ఆమెను అతిక్రూరంగా చెరిచి చంపినట్లు నిర్ధారణ కావటంతో కశ్మీర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ఘటనలో మరిన్ని వివరాలు ఇప్పుడు వెలుగులోకి రావటంతో.. దేశవ్యాప్తంగా ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
జర్నలిస్టుల హత్యలపై స్పందించిన ఐరాస
ఐక్యరాజ్యసమితి : భారత్‌లో జర్నలిస్టుల హత్యలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. జర్నలిస్టులపై వేధింపులకు, హింసకు పాల్పడటం ఆందోళనకరమని, భారత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధకరమని ఐరాస అధ్యక్షుడు అంటోనియో గట్టర్స్ అన్నారు. ఈ విషయాన్ని అంటోనియో డిప్యూటి ప్రతినిధి ఫర్హాన్ హక్ మీడియాకు తెలిపారు. మధ్యప్రదేశ్, బిహార్లలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పాత్రికేయులు సోమవారం హత్యకు గురికావడం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో ఇసుకమాఫియాపై వరుస స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించి, వారితో పోలీసుల లాలూచీని బయటపెట్టిన టీవీ జర్నలిస్ట్ సందీప్ శర్మను సోమవారం లారీతో ఢీకొట్టించి చంపించారు. లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ శర్మ చికిత్స పొందుతూ మరణించారు. బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో ఓ దినపత్రికలో పనిచేస్తున్న జర్నలిస్ట్ నవీన్ నిశ్చల్ ఆదివారం రాత్రి బైక్‌పై వెళుతుండగా వెనకనుంచి ఓ ఎస్యూవీ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో నవీన్‌తో పాటు ఆయన స్నేహితుడు అక్కడికక్కడే మరణించారు. తమ కుమారుడ్ని మాజీ సర్పంచ్ అహ్మద్ అలీనే చంపించాడని నవీన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనలను కమిటీ టూ ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) తీవ్రంగా ఖండించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్‌గా ఆంటోనియో ప్రమాణం
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి నూతన సెక్రటరీ జనరల్‌గా పోర్చుగల్ మాజీ ప్రధానమంత్రి ఆంటోనియో గుటెరెస్ సోమవారం ప్రమాణం చేశారు. ప్రస్తుత సెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో తదుపరి(సమితి 9వ) సెక్రటరీ జనరల్‌గా 67 ఏళ్ల గుటెరెస్ నియామకానికి సంబంధించిన తీర్మానాన్ని మొత్తం 193 దేశాల సర్వసభ్య సభ ఇంతకు ముందే ఆమోదించింది. గుటెరెస్ 1995 నుండి 2002 వరకూ పోర్చుగల్ ప్రధానమంత్రిగా పనిచేశారు. 2005 జూన్ నుండి 2015 డిసెంబర్ వరకు శరణార్థులకు ఐరాస హైకమిషనర్‌గా ఉన్నారు. ఆయన 2007 జనవరి 1వ తేదీ నుండి సమితి సెక్రటరీ జనరల్‌గా కొత్త బాధ్యతలు చేపడతారు. ఈ పదవీ కాలం ఐదేళ్ల పాటు ఉంటుంది. ఆ తర్వాత సభ్య దేశాలు ఆయన పదవీ కాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించవచ్చు. -
'గటరర్స్ని స్వాగతిస్తున్నాం'
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గటరర్స్ ఎంపికవడాన్ని భారత్ స్వాగతించింది. ఈ సందర్భంగా ఆయనకు భారత ఐక్యరాజ్యసమితి రాయభారి సయ్యద్ అక్బరుద్దీన్ అభినందనలు తెలియజేశారు. ట్వీట్ ద్వారా ఆయన ఈ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఈ ఏడాది జూలై గటరస్ ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌తో చేతులు కలిపిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు. గటరర్స్ గతంలో ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగానికి 10 సంవత్సరాలపాటు హై కమిషనర్‌గా పనిచేశారు. కాగా, ఐరాస జనరల్ సెక్రటరీ పదవికి పోటీ పడిన స్లొవేకియా విదేశాంగ మంత్రి మిరోస్లావ్ 9 అనుకూల ఓట్లు, 5 వ్యతిరేక ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. సెర్బియన్ విదేశాంగ మంత్రి వుక్ జెరిమిక్, యునెస్కో డెరైక్టర్ జనరల్ ఇరినా బొకోవా మూడో స్థానంలో నిలిచారు. 70 సంవత్సరాలుగా యూఎన్ సెక్రటరీ జనరల్‌గా పురుషుడే ఎన్నికవుతూ వస్తున్నారు. దీంతో సెక్రటరీ జనరల్ పదవి కోసం ఒక మహిళను ఎన్నుకోవాలని సూచనలు వచ్చాయి. అయితే ఈ సారికూడా పాత పద్ధతే కొనసాగబోతోంది. -
ఐరాస చీఫ్‌గా ఆంటోనియో!
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గట్టర్స్ స్పష్టమైన ఆధిక్యత సాధించారు. సోమవారం ముగిసిన 15 దేశాల భద్రతా మండలి మూడో దశ ఎన్నికల్లో ఆంటోనియోకు అనుకూలంగా 11 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు రాగా, ఒక అభిప్రాయం నమోదు కాలేదు. అనధికారికంగా జరిగిన గత రెండు దశల్లోనూ ఆయనే ఆధిక్యంలో కొనసాగారు.ఈ దశలో ఆయన గెలుపు లాంఛనమే కానుంది. గట్టర్స్ పేరును అధికారికంగా అసెంబ్లీకి పంపగానే ఆయన సభ్యత్వాన్ని ఖరారు చేయనున్నారు. గట్టర్స్ గతంలో ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగానికి 10 సంవత్సరాలపాటు హై కమిషనర్‌గా పనిచేశారు. కాగా, ఈ పదవికి పోటీ పడిన స్లొవేకియా విదేశాంగ మంత్రి మిరోస్లావ్ 9 అనుకూల ఓట్లు, 5 వ్యతిరేక ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. సెర్బియన్ విదేశాంగ మంత్రి వుక్ జెరిమిక్, యునెస్కో డెరైక్టర్ జనరల్ ఇరినా బొకోవా మూడో స్థానంలో నిలిచారు. 70 సంవత్సరాలుగా యూఎన్ సెక్రటరీ జనరల్‌గా పురుషుడే ఎన్నికవుతూ వస్తున్నారు. దీంతో సెక్రటరీ జనరల్ పదవి కోసం ఒక మహిళను ఎన్నుకోవాలని సూచనలు వచ్చాయి. అయితే ఈ సారికూడా పాత పద్ధతే కొనసాగబోతోంది.