అన్నట్లే అవుతోంది
దేశాలన్నింటికీ పెద్ద.. ఆంటోనియో గుటెరస్. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆయన. కరోనా మొదలైనప్పటి నుంచి ప్రతిరోజూ ఆయన బలమైన హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. అవన్నీ నిజం అవుతున్నాయి. కరోనా వర్తమాన ప్రభావం, ఆర్థికరంగ భవిష్యత్తు పర్యవసానాలు అన్నీ కూడా అన్ని విధాలుగా మహిళలనే బాధితులను చేస్తాయని గుటెరస్ చెప్పని రోజు లేదు. ఇప్పుడు మరొక మాట కూడా అన్నారు. ‘అందరం సేఫ్ అయ్యేవరకు ఏ ఒక్కరం సేఫ్ కాదు.. మహిళలు సేఫ్‌గా ఉంటేనే ప్రపంచం సేఫ్ గా ఉంటుంది’ అని. గుటెరస్ పోర్చుగల్ దేశస్తుడు.
డ్రైవర్ బాబు
యూటా హైవే మీద ఒక కారు నెమ్మదిగా వెళుతోంది! కాలిఫోర్నియా పెట్రోలింగ్ పోలీసులు ఆ కారును ఆపారు. విండో గ్లాస్‌ను కిందికి దింపించి కారు లోపలికి తొంగి చూశారు. స్టీరింగ్ ముందు 5ఏళ్ల బాలుడు! తనే డ్రైవ్ చేస్తున్నాడు. ‘ఎక్కడికి వెళ్తున్నావ్’ అని పోలీసులు అడిగారు. ‘లాంబొర్గీని కారు కొనడానికి వెళ్తున్నాను. మా మమ్మీని కొనమంటే కొనడం లేదు’ అన్నాడు! లాంబొర్గీని కారు మన కరెన్సీలో మూడుకోట్ల రూపాయలు ఉంటుంది. పోలీసులు ఆ ఐదేళ్ల ఆసామి పర్సు తీసి చూశారు. మూడు డాలర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment