లాక్‌డౌన్: దానివల్ల ఉద్యోగం పోయింది / ఆదాయం తగ్గింది. బయటకు వెళ్లే వీలు లేదు. చేతిలో సెల్ ఫోన్. ఈజీ లోన్ అంటూ ప్రకటన. క్లిక్ చేశారు. దొరికి పోయారు. చక్రవడ్డీ .. అపరాధ రుసుము ఇది అందరికీ ఇప్పుడు అర్థం అయ్యింది. ఈ రుణ యాప్లకు ఈ విషయం ముందే ఎలా తెలుసు? ఇలా లాక్ డౌన్ వస్తుందని జనాలు ఇంట్లో చిక్కుబడి బతకడం కోసం అప్పు చేయాల్సి వస్తుందని ముందుగానే పసిగట్టాయా? ఎప్పటినుంచి ఈ రుణ అప్ ల ప్లానింగ్ జరిగింది ?
స్కూల్స్ తెరుచుకున్నాయి. ఆన్‌లైన్ ఎడ్యు కంపెనీలు దివాళా బాట పట్టాయి. అంటే స్కూల్ మూసివున్నంత కాలం వీరికి సిరుల పంట. అది ఓకే. 2020 లో అందరం ఏమనుకొన్నాము ? ఒకటి రెండు నెలలు స్కూల్స్ మూత. అటుపై తెరుచుకొంటాయి అని కదా? స్కూల్స్ రెండేళ్లు తెరవరని ఆన్లైన్ ఎడ్యు కంపెనీలకు ముందే తెలుసా ? రెండు నెలలకు అయితే పెట్టుబడులు రావు కదా. పిల్లల కోసం కరోనా వస్తుందనే ప్రచారం , కరోనా సోకితే పిల్లలకు కవాసకి వస్తుందని లాంటి వార్తలు , ప్రచారం యాదృచ్చికం గా ప్రజల హితం కోరి వచ్చిందా ? లేక ఆన్లైన్ ఎడ్యు కంపెనీల డబ్బు పలికించిందా ?
కరోనాకు ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. అయినా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇంకా చాలా మటుకు వర్క్ ఫ్రొం హోమ్ మోడ్ లోనే. సరే వారి ఇష్టం. కానీ లాక్ డౌన్ లాక్ డౌన్ అంటూ జరిగిన ప్రచారం వెనుక వారి పాత్ర ఏమీ లేదా ? “ లాక్ డౌన్ వల్ల కొంప కొల్లేరు. నీవు ఇంట్లో నక్కి నక్కి దాక్కున్నా అది సోకుతుంది. అందరికీ ఒక సారి సోకితేనే దానికి పరిష్కారం. మరో మార్గమే లేదు. సోకితే అది మరణానికి దారి తీయకుండా ఇమ్మ్యూనిటిని బలోపేతం చెయ్యాలి. భయపెట్టడం అంటే చంపడమే “ అని మొదటి నుంచి చెబుతున్నా.
మరణ మృదంగం ! లాక్ డౌన్ కావాలి ! పిల్లలకు కరోనా లాంటి ప్రచారం ప్రజాహితం కోసం జరిగిందా ???? రుణ యాప్లు, ఆన్లైన్ ఎడ్యు కంపెనీలు , సాఫ్ట్వేర్ కంపెనీలు , ఫార్మా కంపెనీలు, బడా ఆసుపత్రులు పాపం పుణ్యం తెలియని అమాయక జీవులేనా ? కుట్ర సిద్ధాంతం వారి పనేనా ? ఏది నిజం ? ఏది అబద్దం ? కుట్రనా ? మతిభ్రమణా? ఆలోచించండి.
- వాసిరెడ్డి అమర్నాథ్
ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు
Comments
Please login to add a commentAdd a comment