Amarnath Vasireddy
-
కరోనా తెచ్చిన తంటా! పిల్లల్ని ఫోన్లకు అడిక్ట్ కాకుండా ఏం చేయాలి?
ఎప్పుడెప్పుడు స్కూల్ లాంగ్ బెల్ కొడతారా ? ఇంటికెళుదామా ? అని చూస్తుంటారు " "క్లాసు రూమ్ లో పాఠాలు వినడం లేదు . పక్క వారిని గిల్లడం, గిచ్చడం లాంటి పనులు చేస్తున్నారు " " చిరాకు, కోపం, అసహనం ఎక్కువయ్యింది . ఏకాగ్రత లోపించింది " " టీచర్ల పై తిరుగుబాటు, తల్లితండ్రుల్ని ఎదిరించడం ఎక్కువయ్యింది. రాగ్గింగ్ , బుల్లియింగ్ , ఘర్షణలు ఎక్కువయ్యాయి " " చెడు వ్యసనాల బారిన పడుతున్నారు " ఒక్కో సారి మనం ఫ్లోలో వెళ్ళిపోతాం. మనకు కనిపించిందే లోకం అనుకొంటాము. మనసులో ఉన్నదే నిజంగా జరుగుతోంది అనుకొంటాము . అలాంటప్పుడు మనకు రియాలిటీ చెక్ అవసరం . నేను మొన్న ఆదివారం అదే పని చేశాను. ఆ రోజు జరిగిన ఇంటర్వ్యూ కు దాదాపు డెబ్భై మంది హాజరయ్యారు . వారిలో అత్యధిక శాతం ఇదివరకే ఏదో ఒక స్కూల్లో పనిచేస్తున్నారు. కరోనా ముందు కాలం తో పోలిస్తే , ఇప్పుడు... అంటే కరోనా తరువాత కాలం లో , పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు చూసారా ? అయితే ఏంటది ? ఇది నేను ఆ ఇంటర్వ్యూలో చాల మందిని అడిగిన ప్రశ్న . పైన ఇచ్చినవి వారి సమాధానాలు. ఒక్కరంటే ఒక్కరు పాజిటివ్ చేంజ్ ఉందని చెప్పలేదు . సమస్య తీవ్రంగా ఉందని చాలా మంది చెప్పారు . కారణం ఏంటని అడిగితే అందరూ ఆన్లైన్ క్లాసు లు . మొబైల్ వ్యసనం అని సమాధానం చెప్పారు . "ఈ కాలం పిలల్లు సెల్ ఫోన్ వాడక పొతే ఎట్టా ? " "టెక్నాలజీ మార్పు తెస్తుంది . ఇది సహజం " "టెక్ సావీ పిల్లలు " "మార్పు సహజం . మారుతున్న సమాజంతో పాటే మనం మారాలి " అని ఇంకా పలవరిస్తున్న అజ్ఞానులు కోకొల్లలు. ఏది మార్పు ? టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అనే సింపుల్ విషయం అర్థం కాని అమాయకత్వం అది. ఫ్లో లో వెళ్ళాలి అనుకొనే వారు .. ఇదే ట్రెండ్ అనుకొనే వారు .. మన పిల్లలు ఏదో సాధిస్తున్నారు అనుకొనే వారు .. ఇంకా కోట్లలో . ఈ లోగా యునెస్కో కుండబద్దలు కొట్టేసింది . మొబైల్ అడిక్షన్ వల్ల కలిగే నష్టాన్ని అధికారికంగా తేల్చేసింది. కమిషన్ల ఆశతో హోమ్ వర్క్ ను మొబైల్ డివైసెస్తో ముడిపెట్టే పాఠశాల యాజమాన్యాలకు పచ్చి వెలక్కాయ గొంతుకు అడ్డుపడట్టయ్యింది. కరోనా కాలం లో ఆన్లైన్ క్లాసులను నేను సెలైన్ పెట్టుకోవడంతో పోల్చా. తీవ్ర రోగముండి ఐసీయూ లో ఉంటే తప్పదు . కానీ టిఫిన్ బాక్స్ కు బదులు సెలైన్ పెట్టుకొని రోజూ ఇంటినుంచి బయటకు వెళుతామా? వారం రోజులు వానపడితే (వాన పడింది గట్టిగా రెండు రోజులే ) ఆన్లైన్ క్లాసులు షురూ చేసిన స్కూల్స్ . "పక్కన ఉన్న అన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు నడుపుతుంటే మీరెందుకు చేయరు?" అని మొన్న ఒక పేరెంట్ మెసేజ్ . "వెంటనే వారు కట్టిన ఫీజు వాపసు ఇచ్చేయండి .. ఆన్లైన్ క్లాసులు పెడుతున్న స్కూల్ లో అబ్బాయి ని చదివించడానికి వీలుగా టీసీ ఇచ్చేయండి " నా ఆర్డర్ . చివరకు పేరెంట్ కు తత్త్వం బోధపడింది. సారీ చెప్పారు "మాకు సెల్ ఫోన్ వల్ల కలిగే నష్టం అర్థం అయ్యింది. కానీ ఏమి చెయ్యాలి ?"... అని ఇంకా చాలా మంది ఇంట్లో బాంబు పెట్టుకొంటే పేలుతుంది . ఏమి చేస్తాము ? ఇంట్లో బాంబు పెట్టుకోము . ఇదీ అంతే. "పెద్దాళ్ళకు తప్పని సరి. ఆఫీస్ వర్క్ కోసం సెల్ ఫోన్. ఇది అట వస్తువు కాదు. మీ మెదళ్ళు సెల్ ఫోన్ వల్ల వంద రెట్లు అధికంగా ప్రభావితం అవుతాయి , కాబట్టి వద్దు" అని పిల్లలకు నచ్చ చెప్పి వారు సెల్ ఫోన్ వాడకుండా చూడాలి . మాట వినకపోతే కౌన్సిలింగ్ చేయించాలి . సమస్య జటిలం. పరిష్కారం అంత సులభం కాదు. సంవత్సరాల తరబడి అధిక తిండి తిని ఒంట్లో కిలోల కొద్దీ అధిక కొవ్వును పేరపెట్టుకొన్న వారు ఏమి చెయ్యాలి ? తిన్నప్పుడు పొందిన సుఖాన్ని గుర్తు చేసుకొంటూ దానికి ప్రాయచ్చితం అన్నట్టు సరైన తిండి తినాలి . వ్యాయామం చెయ్యాలి. అబ్బే ఇంత కష్టం మేము పడలేము. ఏదైనా సింపుల్ మార్గం ఉంటే చెప్పండి అని లక్షల్లో అనుకొంటున్నారు. అలాంటి బకరాల కోసం డబ్బాల్లో మూలికా మందులు వచ్చాయి. అవి జస్ట్ ఒక స్పూన్ తింటే సరిపోతుంది అని ప్రచారం. ఈజీ మార్గం కదా అని లక్షల మంది. దాన్ని తిని కిడ్నీలు నాశనం చేసుకొన్న వారు వేలమంది. అయినా ఆగదు. ఆగితే వారి బిజినెస్ సాగదు బలహీనతల్ని కాష్ చేసుకోవడంలో ఫార్మసురులకు మించిన వారెవరూ ఉండరు. నువ్వు అధిక తిండి తింటే వాడికి డయాబెటిస్ బిజినెస్. కనీస ఆహార నియమాలు లేకుండా టెన్షన్ పెంచుకొని నువ్వు ఇమ్మ్యూనిటిని కుళ్ళపొడుచుకొంటే ... తుమ్ముకు.. దగ్గుకు... కాన్సర్‌కు.. జ్వరానికి.. ఒంటి నొప్పులకు ... చివరాఖరికి దురద కూడా వాక్సిన్లు .తిరుగు లేని బిజినెస్. అవి వేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొంటే బోనస్ బిజినెస్ . ఇంతకీ కరోనా వాక్సిన్లు ఏమయ్యాబ్బా ? ముక్కు నోరు . చెవి.. ఇలా నవ రంద్రాల్లో వేసే వాక్సిన్లు .. వాటి మార్కెటింగ్ కోసం అదిగో చైనాలో కేసులు .. లాంగ్ కరోనా .. తొక్క... అంటూ విషపు రాతలు .. మరో పక్క కరోనా వాక్సిన్ వేసుకంటే కండ పుష్టి .. అంటూ మార్కెటింగ్ చేసే బ్రోకర్లు ... అరెరే .. ఎక్కడ పోయారబ్బా ? పిల్లి వచ్చే ఎలుక భద్రం అంటూ ఒక్క సారిగా మొత్తం మాయం అయిపోయారే. అన్నట్టు వారి ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు వేసుకోవాలిగా . ఆ లెక్కన ఇప్పుడు.. అయిదోదో ఆరోదో పొడుస్తుండాలిగా ? ఏంటి ఆగిపోయింది. ఇక ఇప్పుడు సెల్ ఫోన్ కు పిల్లలు బానిసలు అయిపోతుంటే... వాడిది రెహబ్ సెంటర్ బిజినెస్ . వాడిదేనా ? తిలాపాపం తలా పిడికెడు.. పిల్లలు సెల్ ఫోన్ వాడడం మానేస్తే వాటి అమ్మకాలు సగానికి పడిపోతాయి. సెల్ ఫోన్ బిజినెస్ దెబ్బ తింటుంది. దానితో పత్రికలకు ప్రకటనలు తగ్గిపోతాయి. ఓయో హోటళ్ల బిజినెస్ డల్ అయిపోతుంది. గంజాయి దందా తగ్గిపోతుంది. చెప్పుకొంటూ పొతే లిస్ట్ కొండ వీటి చేంతాడంత. ఒకటి నిజం. తమ చుట్టూరా ఉన్న పిల్లలు సెల్ ఫోన్ వాడుతుంటే మన పిల్లలు అదే పని చెయ్యాలని చూస్తారు. అందుకే మేము రివర్స్ ఎటాక్ మొదలెట్టాము. మా పిల్లలు సెల్ ఫోన్ వాడరు. మీ ఇరుగు పొరుగు పిల్లలో చైతన్యం తెండి అని చెప్పాము . ఒక్కోక్కరూ కనీసం అయిదు మందికి .. ఈ వారం రోజుల వానల్లో అందరూ కలిసి కొన్ని వేల మంది పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చారు . "సెల్ ఫోన్ వద్దు. ఆటలు ఆడుకోండి. బాల్యాన్ని ఎంజాయ్ చెయ్యండి. జంక్ ఫుడ్ వద్దు . ఆరోగ్య కరమయిన ఆహారం తీసుకోండి" అని ఎలుగెత్తి చాటారు. మార్పు వస్తుందా ? వస్తుంది. అవతలి వారికి చెప్పడమంటే తమకు తాము చెప్పుకోవడం. ఈ విధంగా మా పిల్లల్లో ఆ భావన మరింత దృడంగా .. పక్కింటి పిల్లలో .. ముఖ్యంగా వారి తల్లితండ్రుల్లో అవగాహన. వారు ఇప్పుడైనా నిద్ర లేస్తే బయటపడతారు . లేకుంటే రేపు దారుణాలకు మూగ సాక్ష్యంగా మిగిలి పోతారు. ఒక స్కూల్ ఇలా చేస్తోంది . మీరు ఇలా ఎందుకు చెయ్యరు అని ప్రతి ఒక్కరు తమ పిల్లలు చదువుతున్న స్కూల్ యాజమాన్యాలను ప్రశ్నిస్తే ? ఎన్నికలు రాబోతున్నాయి. మీ డ్రామాలు, గోవా ఫైటింగ్‌లు ఆపండి. బాల లోకాన్ని పీడిస్తున్న ఈ వ్యసనం పై మీ స్టాండ్ ఏంటి ? యునెస్కో చెప్పాక కూడా నిద్ర నటిస్తారా ?" అని ప్రతి రాజకీయనాయకుడ్ని, పార్టీని ప్రశ్నిస్తే .. మార్పు రాదా ? ప్రశ్నించడం ఆంటే వీధుల్లోకి పోనక్కర లేదు. జస్ట్ సోషల్ మీడియాను వేదికగా చేసుకొంటే చాలు. ఇంకా... స్వచ్చంద సేవ సంఘాలు .. ప్రజా సంఘాలు .. సినిమా హీరోలు .. అబ్బో సమాజం శక్తి కొంచమయ్యిందా ? ముందుకు రావాలి. రావాలి... బాబూ... రావాలి . రాక పొతే చరిత్ర హీనులయి పోతారు . ఎవరో వస్తారని .. ఏదో చేస్తారని .. నిజం మరిచితే నిదురోతే? కరోనా రెండో వేవ్ .. అటు పై వాక్ సీన్ సైడ్ ఎఫెక్ట్స్ కంటే... దారుణాలు ఖాయం . ఇది శాపనార్థం కాదు . హెచ్చరిక దండోరా ! మార్పు మనింటి నుంచే మొదలు కావాలి . వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, విద్యావేత్త (చదవండి: మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు) -
మీకు ఎక్కువ కాలం జీవించాలని ఉందా.. అయితే ఇలా చేయండి!
మీ వయసెంత ? ఆగండాగండి.. క్యాలండర్ వయసు చెప్పకండి . నేను ఫలానా సంవత్సరం పుట్టాను; కాబట్టి నా వయసు ఇంత అని చెప్పకండి. దాని వల్ల ప్రయోజనం పరిమితమే. కావాల్సింది మీ జైవిక వయసు . అంటే శరీర నిర్మాణ పరంగా మీ వయసు. క్యాలెండరు వయసు 50+ ఉన్నా జైవిక వయసు 20+ ఉండేవారు ఉన్నారు. అదే విధంగా క్యాలెండరు వయస్సు 30 ఉన్నా జైవిక వయస్సు 50 ఉండేవారు ఉన్నారు. దీని వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలనుకొంటున్నారా ? ప్రతి మనిషిలో 23 జతల క్రోమోజోములుంటాయి. ప్రతి క్రోమోజోమ్, DNA ఇంకా ప్రోటీన్లతో తయారవుతుంది. DNAలో జీన్స్ ఉంటాయి. ఈ జన్యువులే వ్యక్తికి వారసత్వంగా వచ్చిన జైవిక సూచికలు. కణాలు ఎలా పని చెయ్యాలో ఇవి నిర్ణయిస్తాయి. అంటే కంప్యూటర్లో సాఫ్ట్వేర్ మాదిరి. మానవ శరీరం ఈ ప్రోగ్రాం ప్రకారం నడుస్తుంది. మొత్తం ప్రోగ్రాం పుట్టుకతో రాదు. మన జీవన శైలి కూడా ఈ ప్రోగ్రాంను నిర్ణయిస్తుంది. ప్రతి క్రోమోజోమ్ కొసలో టెలోమేర్ అనే నిర్మాణం ఉంటుంది. అందులో జన్యువులుండవు. ప్రతి మనిషి శరీరంలో ప్రతి కణం విభజితమౌతూ ఉంటుంది. ప్రతి రోజూ మన శరీరంలో కొన్ని వేలకణాలు మరణిస్తాయి. కొత్త కణాలు పుడతాయి. ఇది నిరంతర ప్రక్రియ. కణం విభజితం అయ్యేటప్పుడు టెలోమెర్ లు పొట్టిగా మారుతుంటాయి . ఒక దశ లో టెలోమెర్ లు మరీ పొట్టిగా అయిపోతాయి . అప్పుడు కణవిభజన సాధ్యం కాదు . అప్పటినుంచి కొత్త కణాలు రావు . ఉన్న కణాలే ముసలివిగా మారి పోతాయి. వృద్ధాప్యం అప్పటినుంచి మొదలవుతుంది . కొంత మందికి పుట్టుకతో పొడవయిన టెలోమెర్లు వస్తాయి. అలాంటి వారు ఎక్కువ కాలం బతుకుతారు. రియల్ ఎస్టేట్ ఇంకా రాజకీయ రంగం లో కూడా పేరుగాంచిన ఒక తెలుగు సినిమా నటుడు వయస్సు 83 . ఇటీవల ఆయన తల వెంట్రుకలకు డై వేసుకోవడం మానేశారు . లేక పొతే యాభై వయసు వ్యక్తి లాగా కనబడుతారు. తన తల్లి కూడా వందేళ్ల దాక బతికినట్టు ఆయన ఇంటర్వ్యూ లో చెప్పారు . ఇలాంటి వారిలో పుట్టుకతో పొడవయిన టెలోమెర్ లు వస్తాయి . దీని వల్ల 70-80 ఏళ్ళు వచ్చినా కణవిభజన జరుగుతూనే ఉంటుంది. కొత్త కణాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వృద్ధ్యాప్యం చాలా లేట్ గా వస్తుంది. 80 ఏళ్ళు వచ్చినా ఆరోగ్యంగా వుంటారు . ఆరోగ్య కరమయిన దినచర్య ద్వారా టెలోమెర్లు పొట్టిగా కాకుండా చూసుకోవచ్చు. ఏం చేయాలంటే? 1 . ప్రతి రోజు శరీరానికి భౌతిక శ్రమ ఇవ్వాలి. కూర్చుని రోజంతా గడిపే వారు, కనీసం అరగంట నడవని వారు త్వరగా వృద్దులై పోతారు. వృద్ధాప్యం కాళ్లనుండి మొదలవుతుంది. తిన్నగా ముందుకు నడవకుండా ఎప్పుడైతే లోలకంలా కాస్త అటు ఇటు ఊగుతూ నడవడం మొదలెట్టారో .. అప్పుడే ప్రమాద గంటికలు మోగినట్టు. 2. సుఖ నిద్ర. నిద్రలో మన శరీరం, తనని తాని రిపేర్ చేసుకుంటుంది . పెద్దవారికి కూడా రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. 3. ప్రోటీన్ లు కేవలం యువకులకు అని చాలా మంది అనుకొంటారు . వయస్సు 40 దాటాక ప్రోటీన్ల అవసరం ఎక్కువవుతుంది . తగినంత ప్రోటీన్ తిని శరీరానికి భౌతిక శ్రమ కల్పిస్తే కండలు వస్తాయి. శరీరం అనే భవనానికి ఎముకలు ఇటుకలయితే.. కండలు సిమెంట్. కండలు లేకపోతే చర్మం మడతలు పడి బలహీనం అయిపోతుంది. ఎముకల దారుఢ్యం కోసం తగినంత కాల్షియమ్ తీసుకోవాలి. నువ్వుల ద్వారా శరీరానికి కాల్షియం అందించవచ్చు. ఇక్కడో విషయం. శరీరంలో D విటమిన్ తగినంత లేకపోతే కాల్షియంను జీర్ణించుకునే శక్తిని కోల్పోతారు. కాబట్టి ఎండలో అర గంట నడవడం. ఒక నువ్వుల ఉండ రోజూ తినడం చెయ్యాలి. 4. ఆనందకరమయిన జీవితం. 50 దాటాక ఒంటరి జీవితం ప్రమాదకరం. మానసిక కుంగుబాటు... అన్నిటికీ మించి డెమెన్షియా అంటే మతి మరుపు వ్యాధి వచ్చేస్తుంది . నిద్ర పోతున్నప్పుడు మినహా ఎప్పుడూ ఏదో ఒక పనిలో పడాలి. ఎవరితోనైనా మాట్లాడుతూ ఉండాలి . APJ అబ్దుల్ కలాం రిటైర్ అయ్యాక దర్జాగా కాలుపై కాలు వేసుకొని కూర్చోలేదు. తన కిష్టమయిన ఉపాధ్యాయ వృత్తి లోకి వెళ్లారు. పాఠం చెబుతూనే మరణించారు . రూ.1000 కోట్లు ఇచ్చినా రాని సుఖ మరణాన్ని పొందారు. అదీ జీవితం అంటే. మనవలు, దత్తత తీసుకొన్న పిల్లలు, అనాధ శరణాలయాలు .. పెంపుడు జంతువులు.. మనసుంటే వెయ్యి మార్గాలు . వయయసొచ్చాక "రామ గోవిందా" అంటూ కాలం గడపాలి అని చాల మంది అనుకొంటారు . "రామ గోవిందా "అంటే దైవాన్ని స్మరించుకొంటూ అనే అర్థం వరకు అయితే ఓకే. కానీ దీని అర్థం అన్ని పనులు మాని ఇంట్లో ఒంటరిగా కూర్చోమని కాదు . ఉపనిషత్తుల్లో వానప్రస్థం తరువాత, సన్యాస ఆశ్రమాన్ని నిర్దేశించారు. గృహస్థ ఆశ్రమం లో తనకోసం .. తన కుటుంబం కోసం పని చెయ్యాలి . సన్యాస ఆశ్రమంలో సమాజమే తన కుటుంబం అనుకొని. ధర్మాన్ని అంటే మంచి చెడు నలుగురికి చెబుతూ... ఊరూరా తిరగాలి. ఇది ఉపనిషత్తులు చెప్పింది. " నాదేముంది .. అంతా అయిపోయింది " అనుకుని TV ముందు కూర్చుని.. వాట్సాప్‌పై కాలక్షేపం చేసేవారు సన్నాసులు. తానూ బతికినన్నాళ్లు తానూ తనతోబాటు అందరూ బాగుండాలి అనుకొని పని చేసేవాడు సన్యాసి. పని - ఒక దశలో భుక్తి కోసం . అటుపై ఆరోగ్యం కోసం .. సమాజం కోసం . పని మానొద్దు వాసిరెడ్డి అమర్నాథ్, మానసిక శాస్త్ర పరిశోధకులు, ప్రముఖ విద్యావేత్త -
భారీ ప్యాకేజీతో యూఎస్‌లో ఆమెకు ఉద్యోగం.. పెళ్లంటే భయపడుతోంది! ఎందుకు?
తండ్రి ఐపీఎస్(IPS), తల్లి పన్నుల శాఖలో ఉన్నతాధికారిణి. కుమార్తె ఐఐటీ ముంబైలో చదివింది. స్టాన్‌ఫోర్డ్‌లో స్కాలర్షిప్ సీట్. భారీ ప్యాకేజీతో పెద్ద కంపెనీలో ఉద్యోగం. ఏడేళ్లుగా అమెరికాలోనే. పెళ్ళీడొచ్చింది. పెళ్లంటే భయపడుతోంది. కౌన్సిలింగ్ కోసం తండ్రి రిక్వెస్ట్. నా కౌన్సిలింగ్ మొదలయ్యింది . ముందుగా అవతలి వారు చెప్పింది నేను వింటాను .. ఇదిగో ఆమె మాటలు. "సంబంధాలు వచ్చాయి .. వస్తున్నాయి . నేరుగా వచ్చి ప్రపోజ్ చేసిన వారున్నారు. "దేహి "అంటూ వారిచ్చే చారిటీ కోసం ఎదురు చూడాలా ? 1. నా కంటే తక్కువ చదువు . నా శాలరీలో సగం... ఒక్కో సారి మూడో వంతు . అయినా ఫరావాలేదు అనుకొంటాను. పెళ్లయ్యాక నేను మొత్తం శాలరీ అతని అకౌంట్‌కు, నెల నెలా ట్రాన్స్ఫర్ చేసేయ్యాలంట. నా ఖర్చులకు చాలా ఉదారంగా డబ్బులు ఇస్తాడంట. భార్య- భర్త - కుటుంబం అనుకున్నాక నీది -నాది అని ఉండదు. మనది అనుకున్నాక లెక్కలు ఉండవు. నేను ఒప్పుకొంటాను. కానీ పెళ్లి పరిచయాల్లో ... తొలి సారే... మొహమాటం లేకుండా ఫైనాన్సియల్స్ మాట్లాడుతున్నారు. అంటే నా శాలరీని అయన అకౌంట్ లో లేదా ఆయన తల్లి అకౌంట్ లో వేసి నెల నెల" దేహి "అంటూ వారిచ్చే చారిటీ కోసం ఎదురు చూడాలా ? నా పైన నమ్మకం ఉండదా ? నన్ను వారు నమ్మనప్పుడు నేను వారిని ఎలా నమ్మాలి ? పెళ్లంటే డొమెస్టిక్ స్లేవరీనా ? (బానిసత్వమా ?). అతనికంటే ఉన్నత ఉద్యోగం .. ఎక్కువ పని చేసుకొంటూ, ఇంటికొచ్చాక వంట ఇంటి పనులు చేసుకొంటూ అతనికి అతని కుటుంబ సభ్యులకు పని మనిషి లాగా పని చేస్తూ నా డబ్బు వారికిస్తూ బతకాలా ? పైగా అమెరికా రూల్స్ ప్రకారం రేపు విడాకులు తీసుకోవలసి వస్తే నా జీతం ఎక్కువ కనుక, నేనే అతనికి నెల నెల మెయింటనెన్స్ ఇవ్వాలి. అత్తలు నరకం చూపిస్తారు 2. డబ్బు డబ్బు డబ్బు .. డబ్బే వారి శ్వాస .. డబ్బే వారి నిద్ర .. అదే వారి ఊపిరి .. దాని కోసం ఏమైనా చేస్తారు. నీతి, నియమం లాంటి మోరల్ ఎథిక్స్ ఒట్టి మాటలు . అందరూ ఆలా ఉండరని మీరు అంటున్నారు సార్.. కానీ మొత్తం నలుగురు ఫ్రెండ్స్‌కు ఇదే అనుభవం. పెళ్లి చేసుకొని రెండేళ్లు నరకం అనుభవించి ఇప్పుడు బయట పడ్డారు. ఇండియాలో అయితే కనీసం నలుగురు ఏమనుకొంటారో అనే ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ఎవరికి వారే .. అంతా వ్యక్తిగతం. అత్తలు నరకం చూపిస్తారు. వారి ప్లానింగ్ మామూలుగా ఉండదు. డబ్బు పిశాచాలు-శాడిజం- డబ్బు పిచ్చి రెండూ కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో .. ఇండియాలో వుండే మీకు అవగాహన అయ్యే అవకాశం లేదు సార్. ఒకసారి అమెరికాలోని మనోళ్ల బతుకులను పరిశీలించండి. ఘోరాతిఘోరాలు బయట పడుతాయి . మనుషులమన్న ఫీలింగ్ కూడా ఉండదు 3. గ్రీన్ కార్డు దశ దాటి, అమెరికా పౌరసత్వం వచ్చేస్తే తప్ప ఆ పరిస్థితిని వర్ణించలేం. 30 ఏళ్ళ క్రితం వారు కూడా మా లాగే వీసా పై వచ్చిన వారే.. ఇక్కడ ఉద్యోగ రీత్యా స్థిర పడ్డవారే. మా పైన కన్సర్న్ ..గౌరవం లేక పొతే పోయింది. మనుషులమన్న ఫీలింగ్ కూడా ఉండదు .ముఖ్యంగా వారి పిల్లలు... జన్మతః అమెరికన్ సిటిజెన్ షిప్ కదా. వారు సుపీరియర్ రేస్ అని ఫీలింగ్. లేదు సార్.. మీరన్నట్టు ఏదో ఒకటో రెండో ఇండివిడ్యుల్ కేసెస్ కాదు .. మొత్తం .. మొత్తం .. మేము చూసింది ఇదే. ఆటవికుల్లా చూస్తారు! వీరి ఇళ్లల్లోకి ఇండియా నుంచి బంధువులు వస్తే వారిని మనుషుల లాగా చూడరు. అనాగరికులు ఆటవికులు అని వారి ఫీలింగ్. అమ్మ, నాన్న బలవంతం మీద ఏదో నటిస్తారు. చాలా సార్లు ఆ నటన బయటపడిపోతుంది. ఒక సారి ఇండియా నుంచి వచ్చిన బంధువుల ముందే ఒక అమ్మాయి తండ్రి తో .. హే డాడ్ .. Fxxx అంది . ఆ నాలుగు అక్షరాలా పదం వీరి ఊత పదం. ఇవేమి డబల్ స్టాండర్డ్స్? వీరిని America Born Confused Thesis అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేసిస్... ఏబీసీడీ లంటారు. వీరు మాలాంటి వారి పెళ్లి ప్రొపోసల్ కనీసం కన్సిడర్ చెయ్యరు. చేస్తే గీస్తే .. పెళ్లి జరిగితే అటుపై అత్త టార్చర్. తెల్ల జాతి అమ్మాయితో కొడుకు ఎఫైర్ కొనసాగిస్తూంటాడు. అదేంటత్తయ్య.. అంటే... ఇది ఇక్కడ కామన్ అమ్మ .. ఏమి చేద్దాం అంటుంది. కోడలు మాత్రం అచ్చం తెలుగింటి అమ్మాయిలా వారికి చాకిరీ చెయ్యాలి . ఇవేమి డబల్ స్టాండర్డ్స్ ? " ఇదండీ . ఆ అమ్మాయి నాకు చెప్పిన అంశాలు . మధ్యలో చాల సార్లు ఉద్వేగానికి గురయ్యింది. ఏడ్చింది. అమెరికాలో సెటిల్ అయిన వారందరూ ఇలాగే ఉంటారు అని నేను అనుకోవడం లేదు. అదే విషయాన్ని ఆ అమ్మాయికి పదేపదే చెప్పాను. దుర్యోధనుడికి మంచి వారు .. ధర్మ రాజుకు చెడ్డవారు కనపడలేదట. ఇది కూడా చదవండి: అమెరికాలో ఎవరు మనోళ్లు.. ఎవరు పరాయి వాళ్లు? అదే మోడరన్ లైఫ్ అనుకుంటే ఎలా? ఆ అమ్మాయి దాదాపు గంట మాట్లాడింది. ఉన్నత విద్య చదివిన అమ్మాయి .. పెద్ద ఉద్యోగం .. జీతం సంపాదించుకొన్న అమ్మాయి .. పెళ్లంటే భయపడే స్థితి . కొంత వరకు ఆ అమ్మాయి PERCEPTION .. ఒప్పుకొంటాను. కానీ ఈ సమాజం తప్పులేదా ? బతకడం కోసం డబ్బు కావాలి. కాదనే వాడు ఫూల్ . కానీ.... డబ్బే సర్వస్వం అనుకుని, నెలల వయసులో పిల్లల్ని క్రెష్‌లో చేర్పించి .. వారితో సమయం గడపక .. వారికి జంక్ ఫుడ్ .. మొబైల్ అలవాటు చేసి.. అదే నాగరికత .. అదే మోడరన్ లైఫ్ అనుకొని బతికితే ? గంపెడు వాక్సిన్లు, ఇంటింటా ఆటిజం లేదా ఎలర్జీలు/ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ లు, అఫైర్ లు, లైవ్ ఇన్ రిలేషన్‌షిప్‌లు .. నలబై వచ్చినా పెళ్లి ఉండదు .. పెళ్ళైనా... పెటాకులే అయితే ? డబ్బు మహా అంటే ఆనందంగా గడపడానికి ఒక మార్గం. కానీ డబ్బే ఆనందం .. డబ్బే లైఫ్ అని బతికేస్తే ? ఒకరి జీవన శైలిని జడ్జి చెయ్యడం కాదు. అణుబాంబు పై కూర్చుని దాని ట్రిగ్గర్ లాగే ఆటలాడుతున్న వారిని హెచ్చరించే ప్రయత్నం. ధనం మూలం మిదం జగత్.. మానవతాన్ని, మానవ విలువల్ని చంపేయడమే నాగరికత అయితే నేనొక ఆటవికుడుగా బతకడానికే ఇష్టపడతాను . మానవ విలువలు లేని సమాజం అట్టే కాలం బతకదు అని హెచ్చరించడం నా కనీస సామజిక బాధ్యత అని భావిస్తున్న ఒక ఆటవికుడిని నేను. -వాసిరెడ్డి అమర్నాథ్, ప్రముఖ విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు -
H3N2: ఈ వైరస్ అంత డేంజరా? ఇలా చేశారంటే మాత్రం..
ఏంటీ H3N2 వైరస్ ? ఇది వందేళ్ల నాటి వైరస్. H1N1 వైరస్. మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి వైరస్. ఇప్పుడు కొత్తగా మ్యుటేట్ అయ్యిందా ? లేదు.. ప్రతి సంవత్సరం అనేక సార్లు మ్యుటేట్ అయ్యింది. ఇప్పుడు కొత్తగా సోకుతోందా? ప్రతి ఒక్కరికి అనేక సార్లు సోకింది. మరి ఇప్పుడు కొత్తగా భయపెడుతున్నారేంటి ? గతంలో మాస్క్‌లు లేవు. మ్యుటెంట్లకు కొత్త పేర్లు పెట్టి భయపెట్టి బిజినెస్ చేయడం గతంలో లేదు. ఇప్పుడు భయమే ఫార్మా కంపెనీల బిజినెస్. కోవిడ్ రెండో వేవ్‌లో గల్లా పెట్టెలు దాటి గోడౌన్లు నోట్ల కట్టలతో నిండాయి. ఓమిక్రాన్ వేవ్ వారిని నిరాశ పరిచింది. వాక్సీన్ల పుణ్యమా అంటూ సైడ్ ఎఫెక్ట్స్ వారు చికిత్స కోసం వెళుతుంటే బిజినెస్ బాగానే సాగుతోంది ! తిరిగి మాస్క్ లు నిభందనలు అలెర్ట్ అంటూ జనాల్లో భయం నింపి బిజినెస్ చేయాలనే ప్రయత్నం. గతం కంటే ఇప్పుడు ఇది ఎక్కువ ప్రభావం చూపుతోంది ఎందుకని ? రెండేళ్లు మాస్క్‌లు పెట్టుకొని వాక్సీన్లు వేసుకొని ఇమ్మ్యూనిటి ని బలహీనం చేసుకొన్నారు. ఇదే కారణం. మరి ఇప్పుడేమి చెయ్యాలి? దొంగలు దూరిన ఆరు నెలలలకు అన్నట్టు వున్నాయి కొందరి కూతలు. ఇది జనవరిలోనే మొదలయ్యింది. లక్షలాది మంది దీని బారిన పడి కోలుకున్నారు. దగ్గు రెండు మూడు వారాలు కొనసాగి తగ్గి పోయింది. ఇక ఎవరికీ రాదా? ఎవరో కొంతమందికి . రెండు నెలల్లో సోకకుండా మిగిలి పోయిన వారికి సోకుతుంది. మరి ఏమి చేయాలి? డి ,సి, బి విటమిన్ టాబ్లెట్స్ నాలుగు రోజులు( సోకినప్పుడు మాత్రం ) జింక్ టాబ్లెట్, వేడి నీరు తాగడం, వేడి నీటిలో ఉప్పు వేసి నోట్లో పోసుకొని పుకిలించడం, పసుపు అల్లం కాషాయం టీ కప్పులో మూడు నాలుగు రోజులు వేసుకోవడం. తగినంత నీరు తాగడం. రెండు రోజులు రెస్ట్. పాత రోగానికి కొత్త మోత వద్దు. కొందరి విష ప్రచారానికి మోసపోవద్దు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరి! -వాసిరెడ్డి అమర్నాథ్, పాఠశాల విద్యానిపుణులు, మానసిక శాస్త్ర నిపుణులు (నోట్: ఇది వ్యాసకర్త వ్యక్తిగతానుభవసారం ఇచ్చిన కథనం) చదవండి: తీవ్ర లక్షణాలా? కరోనా కాదు.. యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడొద్దు! -
పిల్లలు సెల్‌ఫోన్, టీవీకి అడిక్ట్ అయ్యారా?.. కడుపులో నులిపురుగులు ఉంటే..
మా అబ్బాయి / అమ్మాయి సెల్‌ఫోన్ / టీవీకి అడిక్ట్ అయిపోయారు. పుస్తకం ముట్టుకోవడానికి ఇష్టపడం లేదు !” అని కొంత మంది పేరెంట్స్ అంటున్నారు. నిజానికి మనం నేర్పే వాటినే పిల్లలు నేర్చుకొంటారు. మన ప్రమేయం లేకుండా పిల్లలు, ముఖ్యంగా అయిదేళ్ల లోపు పిల్లలు ఏదీ నేర్చుకోరు. పిల్లలు మనల్ని అనుకరిస్తారు. ఇలా చెయ్యండి 1 . ఎటువంటి పరిస్థితుల్లో పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇవ్వొద్దు. “ అది పెద్దల కోసం.. అవసరానికి మాత్రం వినియోగించడానికి “ అని చెప్పండి. 2 . మీరు టీవీ ముందు, సెల్‌ఫోన్‌తో గడిపే కాలాన్ని తగ్గించండి. 3 . ఆసక్తి కలిగిన పుస్తకాలు చదవండి. పిల్లలు దాన్ని అనుకరిస్తారు. 4 . పిల్లలతో సమయం గడపండి. వారికి రకరకాల ఆటలు నేర్పండి. వారితో ఆడండి. 5 . పిల్లలకు కథలు చెప్పండి. దాని గురించి వారితో చర్చించండి. దీని వల్ల క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది. అన్నిటికీ మించి మీ పిల్లలు మీరు చెప్పింది వినడం చేస్తారు. పెద్దయ్యాక కూడా ఇది కొనసాగుతుంది . మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు . 6 . పిల్లలు ఆకలేస్తే తింటారు. కడుపులో నులిపురుగులు లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆకలి తగ్గుతుంది. దానికి ట్రీట్మెంట్ అవసరం. నాలుగు గంటలకు స్వీట్స్ ఐస్ క్రీం లాంటి హై కెలొరీ ఫుడ్ ఇచ్చి, మరో మూడు గంటల్లో అన్నం తినమంటే తినరు. పిల్లల్ని అన్నం తినిపించే పేరుతొ ఏదైనా చేసి వారికి తినడం పైన ఇంటరెస్ట్ పోయేలా చేయకండి. పిల్లల్ని జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచండి. -వాసిరెడ్డి అమర్నాథ్, పాఠశాల విద్య పరిశోధకులు చదవండి: షుగర్ ఎందుకొస్తుంది?.. రాకుండా ఎలా కాపాడుకోవాలి? విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదా? ఎంతవరకు! డాక్టర్లు చెప్తున్నదేంటి? -
Amarnath Vasireddy: మూడు వారాలుగా దగ్గు, జలుబు ఆగకుండా వస్తున్నాయా?
గత మూడు వారాలుగా మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ జలుబు- దగ్గు ఆగకుండా వస్తోందా? ఒక వేళ తగ్గినా మళ్ళీ తిరగపెడుతోందా..? భయపడకండి. ఇది కరోనా కాదు. ఇప్పుడు లక్షలాది మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. మరో వారం పది రోజుల్లో సమస్య దానంత అదే పరిష్కారమైపోతుంది. ఎందుకిలా..? రెండు రకాలు: ►ఎలర్జీలు ►శక్తివంతమయిన బాక్టీరియా వైరస్లు. గమనించారా ? ఒక రోజు విపరీతమయిన చలి. పొగ మంచు. ఉన్నట్టుండి ఇంకో రోజు ఫ్యాన్ వేసుకోకపోతే నిద్రపట్టనంత ఉక్కపోత. వాతావరణంలో విపరీత మార్పులు. పొగ మంచు. దీనికి తోడు వాతావరణ కాలుష్యం. ఫాగ్.. స్మోక్.. రెండూ కలిసి స్మోగ్. దీనివల్ల చాలా మందిలో ఎలర్జీ లు వస్తున్నాయి. జలుబు అయితే తుమ్ములు నెమ్మదిగా వస్తాయి. అదే ఎలర్జీ అయితే ఒక్కో సారి ఆగకుండా వస్తాయి. ఎలర్జీ కి మందు లేదు. బయట మంచు ఉన్నా బెడ్ రూమ్ లో ఉన్న మీకు పచక్ పచక్ అని తుమ్ములొస్తున్నాయా ? అయితే ఎలర్జీ. జస్ట్ రిలాక్స్. మరో వారం లో వాతావరణం సెట్ అయిపోతుంది. అప్పుడు పోతుంది. కాకపోతే ప్రతి వింటర్ లో మీకు ఈ బాధ తప్పదు. వీలైనంతవరకు మంచు అదే స్మోగ్ లో బయటకు పోవద్దు. ఎండ వచ్చి పొగ మంచు తగ్గాక బయటకు వెళ్ళండి. కర్టైన్స్ తో కిటికీలు మూసి ఉంచండి. ఇక రెండో ది మొండి వైరస్ బాక్టీరియాలు. నిజానికి అవి మొండి కావు. అవి వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం.. బయట + మీ శరీరం లోపల.. రెండు చోట్లా ! బయటేమో స్మోగ్. లోపల మీ ఇమ్మ్యూనిటి వీక్. రెండేళ్లుగా మాస్క్‌లు వేసుకొని మీ ఇమ్మ్యూనిటీని బజ్జో పెట్టేశారు. తక్కువ మొత్తంలో వైరస్లు బాక్టీరియాలు సోకాలి. ఇమ్యూనిటీ కణాలు వాటిని చంపాలి. అదే దానికి బాటింగ్ ప్రాక్టీస్. రెండేళ్లు నెట్ ప్రాక్టీస్ లేకుండా బాట్స్మన్ పిచ్‌పైకి దిగితే ? ఇంకేముంది..? బాతే. అదే డక్ అవుట్. ఇప్పుడు అదే జరుగుతోంది. పోనీ లెండి. ఇప్పుడైనా బాటింగ్ ప్రాక్టీస్ అవుతోంది. ఇలా చేయండి. ►దగ్గుమందు తాగొద్దు. దాని వల్ల నష్టం తప్ప లాభం ఉండదు. ►వేడి నీరు తాగాలి. పురుషులు నాలుగు లీటర్లు. స్రీలు మూడు. పిల్లలు వయసు బట్టి ఒకటి నుంచి రేండు లీటర్ లు. వేడి నీటిలో ఉప్పు వేసుకొని నోట్లో పోసుకొని గార్గిల్ చేయాలి. ►అవసరం అయితే అల్లం పసుపు కాషాయం చేసి తాగండి. జస్ట్ టీ కప్పులో కొద్దిగా. రోజుకు ఒక సారి. మూడు నాలుగు రోజులు మాత్రం. ►శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. బాగా నిద్ర పోవాలి. స్ట్రెస్ కి దూరంగా ఉండాలి. -వాసిరెడ్డి అమర్నాథ్, ప్రముఖ ఉపాధ్యాయులు, వ్యక్తిత్వ, మానసిక పరిశోధకులు -
Amarnath Vasireddy: యంత్రాన్ని ప్రేమించు... మనిషిని ద్వేషించు! కోపం వస్తోందా?
వచ్చేసింది.. కృత్రిమ మేధ , మరమనుషుల ఉపయోగం , డిజిటలైజేషన్, ఆటోమేషన్ యుగం! రానున్న 15 ఏళ్ళల్లో భారీగా తగ్గిపోనున్న ఉద్యోగాలు/ వృత్తులు.. డ్రైవర్ , వ్యవసాయదారుడు , ప్రింటర్, పబ్లిషర్ , క్యాషియర్, ట్రావెల్ ఏజెంట్ , వైటర్స్ , డిస్పాచ్ క్లర్క్, ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగాలు, మిలిటరీ పైలట్, సోల్జర్.. టెలిమార్కెటర్, అకౌంటెంట్, టాక్స్ సలహాదారుడు , స్పోర్ట్స్ రిఫరీ / అంపైర్ , చేనేత కార్మికుడు, పెయింటర్, ప్లంబర్, స్టాక్ ట్రేడర్, నిర్మాణ కార్మికుడు.. భయమేస్తోందా? చర్చించండి . తప్పులేదు . తప్పదు. చిన్న చితకా వ్యాపారాలు అంతరించిపోతాయి. బహుళ జాతి సంస్థలు మరింత బలపడతాయి. ►ఒక పక్క కోట్ల ఆస్తులు కలిగిన వారు, మరో పక్క బతుకు తెరువు కోసం కష్టపడేవారు . ►ధనికులు మరింత ధనికులు అవుతారు, మధ్య తరగతి బీదరికంలోకి నెట్టబడతారు. సుమారుగా ఎనభై శాతం కష్టపడతారు. ►ధనికుల ఇళ్లల్లో వంటపనికి, ఇంటిపనికి రోబోలు, ఫ్రెండ్స్‌గా లివ్ ఇన్ పార్టనర్లుగా రోబోలు వస్తారు. ►ప్రతి ఆఫీస్‌లో మనుష్యుల కంటే రోబోలు, లేదా యంత్రాలు కనిపిస్తాయి. ►ఉద్యోగాలు తక్కువ; ధనిక బీద తారతమ్యం.. దీనితో తారా స్థాయిలో సామాజిక అసమానతలు, సామాజిక వైరుధ్యాలు, విద్వేషాలు. ►బాగా డెవలప్ అయ్యామనుకుంటున్న ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో జాతి విద్వేషం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ► ప్రతి దేశం రక్షిత విధానాలను అనుసరిస్తుంది. వలసలను తగ్గిస్తుంది లేదా పూర్తిగా అనుమతించదు ఈ మెసేజ్ చదివితే నా పై కోపం వస్తోందా ? ఇది నిజం కాకూడదు అనిపిస్తోందా? సాంకేతికత జ్యామితీయ నిష్పత్తి వేగంతో దాన్ని ఆపలేము. ఆపాల్సిన అవసరం లేదు. సాంకేతికతను మానవ కల్యాణానికి వాడాలి. కానీ అది కొన్ని బహుళ జాతీయ కంపెనీల చేతిలో బందీ. వారి అధిపత్యానికి తిరుగు లేదు. సామాజిక శాస్త్రాలను చదవని సాధారణ ప్రజానీకానికి ఇది అవగాహన అయ్యే అవకాశం లేదు . అయినా కన్ఫ్యూజ్ చేస్తారు. ఆటలు సాగనివ్వరు . నిరాశావాదం అనిపిస్తోందా ? నిజం నిష్టూరంగానే ఉంటుంది . మెసేజ్ సేవ్ చేసుకొని ఒక నాలుగేళ్ళ తరువాత చెక్ చేసుకోండి. -వాసిరెడ్డి అమర్నాథ్, ప్రముఖ ఉపాధ్యాయులు, వ్యక్తిత్వ, మానసిక పరిశోధకులు -
Amarnath Vasireddy: దేశాన్ని జయించడంలో బ్రిటిష్ వారికి సాయపడింది వారే! ఇక..
ఏ రాజ్యంలో , ఏ దేశంలో రాజులు ప్రజలకు మేలుచేసిండ్రు ... ? ఒక ప్రఖ్యాతి పొందిన పాట ! నిజమే ! ఏ జాతి చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం ? నరజాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం ... శ్రీ శ్రీ .. రాజులకు , బ్రిటిష్ వలస పాలనకు ఒక మౌలిక తేడా ఉంది. ఒక రాజు ఎంత క్రూరుడైనా, అధిక పన్నులు వేసి ప్రజల రక్తాన్ని జుర్రినా , ఆ డబ్బు తన విలాసాలకు తగలెట్టినా ఆ డబ్బు ఇక్కడే వుండేది. ఆ రాజు గారి విలాసాల వల్ల కనీసం కొంతమందికి ఉపాధి వచ్చేది. ఆ డబ్బు ఇక్కడే సర్కులేట్ అయ్యేది. బ్రిటిష్ పాలనలో మన సంపద వారి దేశానికి తరలి వెళ్ళిపోయింది. మహానుభావుడు గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆన్ ఇండియా గా పేరొందిన దాదాభాయ్ నౌరోజి తన "పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా" అనే గ్రంధం లో "డ్రైన్ అఫ్ వెల్త్ "అంటే సంపద జుర్రుడు లేదా సంపద వలస సిద్ధాంతం లో దీన్ని వివరించాడు . అందరు స్వతంత్ర సమర యోధులకు ఈ గ్రంధం మార్గదర్శి అయ్యింది. బ్రిటిష్ కాలంలో మన దేశం నుంచి వారు తమ దేశానికి తరలించిన సంపద విలువ సుమారుగా రెండు వేల అయిదువందల లక్షల కోట్లు (ఇరవై అయిదు ట్రిలియన్ పౌండ్లు) బ్రిటిష్ వారి కారణంగా కృత్రిమ అంటే మానవ ప్రేరేపిత కరువులు వచ్చాయి. బ్రిటిష్ పాలనకు ముందు ఆకలితో కరువుతో పెద్దగా చనిపోయిన దాఖలాలు లేవు. బ్రిటిష్ వారి కాలం లో కరువుతో ఆకలితో చనిపోయిన వారు సంఖ్య మూడు కోట్లు. పెద్దామె చనిపోతే అయ్యో పాపం అనడం తప్పుకాదు. ఇంగ్లాండ్ వెళ్లి ఉద్యోగం చెయ్యడం తప్పుకాదు. బతుకు తెరువు కోసం, మెరుగైన జీవనం కోసం వలసలు సహజం. అప్పుడు వారు చేసిన దానికి ఇప్పుడు కక్ష తీర్చుకోండి అని చెప్పడం లేదు. చరిత్రనే మరచి లేదా పిల్లి మొగ్గల పుస్తకాలూ చదివి బ్రిటిష్ వారివల్లే మనం డెవలప్ అయ్యాము. మనకు ఉపాధి వచ్చినది అంటే.. మీ అవగాహన, మీ ఇష్టం . తెలియక పొతే అడగండి. ఎన్ని గంటలైనా చెబుతాను. కానీ నాకు తెలిసిందే సర్వం అని మన సమర యోధుల త్యాగఫలాలను అవహేళన చేసేలా మాట్లాడం అన్యాయం. ఇలాంటి బ్యాచ్ బ్రిటిష్ కాలంలో కూడా ఉండేది. దేశాన్ని జయించడంలో బ్రిటిష్ వారికి వారే సాయపడింది. అది కాకుండా ఇంకో బ్యాచ్ ఉండేది.. మనదైతే కంపు కొడుతుంది. తెల్లటి బ్రిటిష్ దొరల మలం సువాసనలు వెదజల్లుతుంది అని నమ్మే వారు. ఇది జోక్ కాదు. నిజం. ఇలాంటి కంపు బ్యాచ్‌తో మాట్లాడే ఓపికే నాకు లేదు. - అమర్నాద్ వాసిరెడ్డి, ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు చదవండి: Amarnath Vasireddy: కోరికలే గుర్రాలయితే..? అనే డోపమైన్ హై కథ -
కోరికలే గుర్రాలయితే..? అనే డోపమైన్ హై కథ
అసంతృప్తి.. అందరిలోనూ ఏదో రకమైన అసంతృప్తి. ఇండియాలో బతికేలేము అంటూ అమెరికా , కెనడా , ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా కు వలస పోయే వారు ఎంతో మంది . అమెరికాలో ఎన్నో తరాలుగా స్థిరపడిన వారు అమెరికాలో హ్యాపీ లైఫ్ గడపలేము అంటూ డబెట్టి గోల్డెన్ వీసా కనుక్కొని గ్రీస్‌కు లేదా స్కాండినేవియన్ దేశానికి. అసలు భూమి నివాసయోగ్యం కాదు . త్వరగా మార్స్ పైకి వెళ్ళిపోతే బాగుండు అని మరి కొందరు . అసంతృప్తి.. కలెక్టర్ మొదలు బిల్లబంట్రోతు వరకు .. స్టార్ట్ అప్ మొదలు ఫామిలీ బిజినెస్‌మేన్ వరకు .. అందరిలో అసంతృప్తి . ఎందుకు ? 1950 లో ప్రపంచ జనాభా 250 కోట్లు. ఇప్పుడు 800 కోట్లు. డెబ్భై సంవత్సరాల్లో మూడు రెట్లకు పైగా పెరిగిన జనాభా ! ఇల్లు కట్టు కోవడానికి పంటలు పండించడానికి భూమి అవసరం. కానీ అప్పుడూ ఇప్పుడూ అదే భూమి. అంటే? పరిమతమైన వనరులు.. అపరిమితంగా పెరిగిపోతున్న డిమాండ్.. తిండి కోసం, నివాసం కోసం.. బతకడం కోసం పోటీ. విపరీతమైన పోటీ. పోటీ తెచ్చే ఒత్తిడి. ఇదీ నేడు సర్వత్రా కనిపించే స్థితి . కానీ శాస్త్రసాంకేతిక రంగాల్లో అభివృద్ధి పుణ్యమా అంటూ జనాభా ఇంతగా పెరిగినా, అందరి అవసరాలూ తీర్చగలిగిన స్థితి లో నేడు మానవాళి ఉంది. ఎనభై ఏళ్ళ క్రితం బెంగాల్ లో కరువు వల్ల ముప్పై లక్షల మంది చనిపోయారు అంటే నమ్మగలరా ? నేటి ప్రపంచం లో ఆకలి చావులు , కరువులు కాటకాలు ఎక్కడో కొన్ని ఆఫ్రికా దేశాలకు పరిమితం . అవసరాలు తీరుతాయి.. మరి కోరికలు..? స్కూటర్ కొన్నాయనకు కారు కావాలి . కారు కొన్నాయనకు లగ్జరీ కారు కావాలి . దాన్ని కొన్నాయనకు ప్రైవేట్ జెట్ కావాలి. ఫ్లాట్ కొన్నాయనకు ఇండిపెండెంట్ హౌస్ కావాలి . అది కొన్నాయనకు విల్లా కావాలి . గేటెడ్ కమ్యూనిటీ కావాలి . అది కొన్నాయనకు డిజైనర్ బంగాళా కావాలి . అది ఉన్నాయనకు సొంత దీవి కావాలి . ఆవసరాలు పరిమితం. గుర్రాలయిన కోరికలు..! కోరికలే మనిషి బాధలకు మూలం అన్నాడు గౌతమ బుద్ధుడు.2500 ఏళ్ళ క్రితమే మనిషి కోరికలకు పగ్గాలు ఉండేవి కావు . ఇప్పుడు గ్లోబల్ సమాజం . కోరికలు ఇప్పుడు గుర్రాలు కావు .. రాకెట్ లు .. సూపర్ సోనిక్ జెట్ లు! నలభై ఏళ్ళ ప్రపంచీకరణ ! అప్పటిదాకా ఏదైనా సామజిక విలువలు మిగిలుంటే దాన్ని తుడిచి పెట్టేసింది ! తనకు రాముడు లాంటి భర్త కావాలనుకొనేది ఒక నాటి స్త్రీ ! అంటే మరో స్త్రీని తలపులోకి కూడా రానివ్వ కూడదు . తనకు సీత లాంటి భార్య కావాలి అనుకునేవాడు ఒకప్పటి యువకుడు . అంటే కష్టాల్లో నష్టాల్లో తనవెంట నిలవాలి . న్యాయం కదా ? ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రపంచ . తనకు రష్మిక మందన లాంటి భార్య కావాలి ! సరిపోతుందా ? లేదు వీలైతే మృణాల్ ఠాకూర్ రెండో భార్య గా ! పోనీ అక్కడితో ఓకే ? సన్నీ లియోన్ లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి ! పూనమ్ పాండే షెర్లీన్ .. ఇంకా ఇంకా కావాలి ! వ్యయసాయం చేసే భర్త వద్దు . సిటీ లో ఉద్యోగం చేసేవాడు కావాలి . అక్కడితో హ్యాపీ నా ? పక్కింటాయనకు కారుంది . మనకు లేదు . ఆఫీస్ లో పని చేసే కొలీగ్ కు సిక్స్ ప్యాక్ వుంది . నీకు లేదు . " లైఫ్ ఈజ్ షార్ట్. చేతకానోళ్లే నీతులంటూ ఉపన్యాసాలిస్తారు . ఎంజాయ్ . దానికోసం ఏమైనా చేయొచ్చు . ఆన్లైన్ గేమ్ లో డబ్బు కోసం అమ్మనైనా చంపొచ్చు . పక్కింటి కుర్రాడితో సుఖం కోసం భర్తకు అన్నంలో విషం పెట్టొచ్చు . ఎంజాయ్మెంట్ ముఖ్యం " ఇదీ గ్లోబల్ యుగంలో మిలీనియం యూత్ ఫిలాసఫీ . స్మగ్లర్ లు గూండా లు రౌడీ షీటర్లు నేటి యువత కు ఆదర్శ పురుషులు. తెలంగాణకు చెందిన ఒక నాయకుడు తన నియోజకవర్గం లో యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేసాడు . అబ్బే ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరికీ కావాలి అని ఎక్కువ శాతం నోరు చప్పరించేసారుట ! తమ కళ్ళకెదుట రాజకీయాల్లో చేరి కోట్లు కూడబెట్టిన వారు వీరికి ఆదర్శం . సంవత్సరం లో వంద కోట్లు కూడబెట్టాలనుకున్నోళ్లకి నెలకు ఇంత జీతం చొప్పున చేసే ఓపిక ఉంటుందా ? జీవితం చిన్నది . నిజమే ! ఆనందంగా బతకాలి. కరెక్ట్ .. కానీ ... ఆనందం అంటే ? వస్తువుల్లో ఆనందాన్ని వెతుక్కోంటోంది నేటి సమాజం. వేలకోట్ల సంపద వున్నా తీవ్ర అనారోగ్యం తో చనిపోయిన రాకేష్ జున్ఝున్వాలా , గోవా బీచ్ లు .. బికిని మోడల్స్ .. క్యాలండర్ గర్ల్స్ విజయ్ మాల్యా .. నేడు లండన్ లో బోడి మల్లయ్య గా మారిన తీరు .. సమకాలీన ప్రపంచం ఎన్ని ఉదారణలను విసిరేసినా నేర్చుకోలేని స్థితికి చేరుకొంది మానవాళి . - అమర్నాద్ వాసిరెడ్డి, ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
కుట్ర సిద్ధాంతం వారి పనేనా?
లాక్డౌన్: దానివల్ల ఉద్యోగం పోయింది / ఆదాయం తగ్గింది. బయటకు వెళ్లే వీలు లేదు. చేతిలో సెల్ ఫోన్. ఈజీ లోన్ అంటూ ప్రకటన. క్లిక్ చేశారు. దొరికి పోయారు. చక్రవడ్డీ .. అపరాధ రుసుము ఇది అందరికీ ఇప్పుడు అర్థం అయ్యింది. ఈ రుణ యాప్‌లకు ఈ విషయం ముందే ఎలా తెలుసు? ఇలా లాక్ డౌన్ వస్తుందని జనాలు ఇంట్లో చిక్కుబడి బతకడం కోసం అప్పు చేయాల్సి వస్తుందని ముందుగానే పసిగట్టాయా? ఎప్పటినుంచి ఈ రుణ అప్ ల ప్లానింగ్ జరిగింది ? స్కూల్స్ తెరుచుకున్నాయి. ఆన్లైన్ ఎడ్యు కంపెనీలు దివాళా బాట పట్టాయి. అంటే స్కూల్ మూసివున్నంత కాలం వీరికి సిరుల పంట. అది ఓకే. 2020 లో అందరం ఏమనుకొన్నాము ? ఒకటి రెండు నెలలు స్కూల్స్ మూత. అటుపై తెరుచుకొంటాయి అని కదా? స్కూల్స్ రెండేళ్లు తెరవరని ఆన్లైన్ ఎడ్యు కంపెనీలకు ముందే తెలుసా ? రెండు నెలలకు అయితే పెట్టుబడులు రావు కదా. పిల్లల కోసం కరోనా వస్తుందనే ప్రచారం , కరోనా సోకితే పిల్లలకు కవాసకి వస్తుందని లాంటి వార్తలు , ప్రచారం యాదృచ్చికం గా ప్రజల హితం కోరి వచ్చిందా ? లేక ఆన్లైన్ ఎడ్యు కంపెనీల డబ్బు పలికించిందా ? కరోనాకు ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. అయినా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంకా చాలా మటుకు వర్క్ ఫ్రొం హోమ్ మోడ్ లోనే. సరే వారి ఇష్టం. కానీ లాక్ డౌన్ లాక్ డౌన్ అంటూ జరిగిన ప్రచారం వెనుక వారి పాత్ర ఏమీ లేదా ? “ లాక్ డౌన్ వల్ల కొంప కొల్లేరు. నీవు ఇంట్లో నక్కి నక్కి దాక్కున్నా అది సోకుతుంది. అందరికీ ఒక సారి సోకితేనే దానికి పరిష్కారం. మరో మార్గమే లేదు. సోకితే అది మరణానికి దారి తీయకుండా ఇమ్మ్యూనిటిని బలోపేతం చెయ్యాలి. భయపెట్టడం అంటే చంపడమే “ అని మొదటి నుంచి చెబుతున్నా. మరణ మృదంగం ! లాక్ డౌన్ కావాలి ! పిల్లలకు కరోనా లాంటి ప్రచారం ప్రజాహితం కోసం జరిగిందా ???? రుణ యాప్‌లు, ఆన్లైన్ ఎడ్యు కంపెనీలు , సాఫ్ట్వేర్ కంపెనీలు , ఫార్మా కంపెనీలు, బడా ఆసుపత్రులు పాపం పుణ్యం తెలియని అమాయక జీవులేనా ? కుట్ర సిద్ధాంతం వారి పనేనా ? ఏది నిజం ? ఏది అబద్దం ? కుట్రనా ? మతిభ్రమణా? ఆలోచించండి. - వాసిరెడ్డి అమర్నాథ్ ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
కృత్రిమ వర్షాలు.. వరమా? శాపమా ?
హార్ప్ : హై ఇంటెన్సిటీ ఆక్టివ్ ఆరోరల్ రీసెర్చ్ ప్రోగ్రాం : ఇది మానవ కల్యాణానికి ఉద్దేశించిన కార్యక్రమం అని ఒక పక్క ప్రచారం . 2018 సంవత్సరం రాజ్య సభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆనాటి మంత్రి అనిల్ మాధవ్ దవే దీన్ని అమెరికా చేతిలోని ఆయుధంగా అభివర్ణించారెందుకని ? దీని వల్ల భూతాపం పెరుగుతుందని మన దేశంలో గోధుమ, మొక్కజొన్న లాంటి పంటల దిగుమతి తగ్గనుందని ఆయన తన లిఖిత పూర్వక సమాధానములో చెప్పారెందుకని? మాటల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంది. కానీ లిఖిత పూర్వక సమాధానమంటే, సీనియర్ అధికారులు అన్ని చెక్ చేశాకే రాస్తారు. మరో విషయం అనిల్ దవే మరణం. దానిపై విచారణ జరగాలని అయన మిత్రుడు తపన్ భట్టాచార్య మధ్య ప్రదేశ్ హై కోర్ట్‌ను ఆశ్రయించిన మాట నిజం కాదా? ప్రయోగాల పేరుతొ ఆయనొస్పీర్ లో మార్పులు తెస్తే వాటి దీర్ఘ కాలిక పరిణామాలు ఎలా ఉంటాయి ? SAI అంటే ఏంటి ? స్ట్రాటోస్పీరిక్ ఏరోసోల్ ఇంజక్షన్ . SRM అంటే సోలార్ రేడియేషన్ మానేజ్మెంట్ . భూతాపాన్ని తగ్గించడం కోసం అంటే భూమిని లేదా వాతావరణాన్ని చల్లబరచడం కోసం సల్ఫర్ డయాక్సైడ్, కాల్షియమ్ కార్బోనేట్, ఉప్పు లాంటి వాటిని విమానాల ద్వారా వాతావరణ పై పొరల్లో చల్లడం ద్వారా చల్లడం . అగ్నిపర్వతాలు బద్దలయినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతుంది . దాని ప్రభావం తో సూర్య కిరణాలు భూమిని చేరకుండా వాతారణం కొన్ని రోజుల పాటు చల్లబడడం నిజమే . కానీ దాన్ని పట్టుకొని SAI, SRM లాంటి కార్యక్రమాలు చేబడితే రోగనికన్నా మందు ఎక్కువ కీడు చేస్తుంది అని శాస్త్రవేత్తలు హెచ్చరించిన మాట నిజం కదా ? ఏరోసోల్ ఇంజెక్క్షన్ ఏంటి ? దీని పై అంతర్జాతీయ నియంత్రణ ఏది ? వాతారణం తో ఆటలా ? కార్బన్ శాతాన్ని తగ్గించడం ద్వారా ఉష్ణోగ్రతలు తగ్గించడం అవసరం . కానీ మీరు వేసే ఈ వాతావరణ ఇంజెక్షన్ వల్ల కరోనా వాక్ సీన్ లా మంచి కన్నా చెడు ఎక్కువ జరగదు అని గ్యారెంటీ ఏంటి గాంలిన్ 1 : ఏంటిది ? చైనా చేపట్టిన కృత్రిమ వర్ష కార్యక్రమం. తమ దేశానికి చెందిన యాభై అయిదు లక్షల చదరపు కిలోమీటర్ ల ప్రాంతం లో కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ఉద్దేశించింది . దాదాపుగా 15 ఏళ్ళ క్రితమే ఈ టెక్నాలజీ ని వాడి బీజింగ్ ఒలింపిక్స్ ముందుగా తమ స్టేడియం లు ఎంత పటిష్టంగా ఉన్నాయో చెక్ చేసుకోవడానికి కృత్రిమ వానలు కురిపించిందని చెబుతారు. ఇండో చైనా సరిహద్దు .. మొత్తం కొండల ప్రాంతం . దీని పై చైనా ఎప్పుడో కన్ను వేసింది . ఆ ప్రాంతం లో ప్రజలను ఖాళీ చేయించి మెల్లగా వాటిని ఆక్రమించడానికి చైనా తన టెక్నాలజీతో భారీ స్థాయిలో కృత్రిమ వర్షాలు కురిపిస్తోంది అని జూన్ నెల్లోనే విశ్వ భారతి అనే పత్రిక ఆర్టికల్ ను ప్రచురించింది . ఇంతకీ వాతావరణ తారుమారు అనే కుట్ర జరుగుతోందా ? మామూలుగా అయితే నేను నమ్మేవాడిని కాను . కానీ వాక్ సీన్ విషయం లో జరిగిన మాయలు చూసి ఇక్కడ కూడా ఏదో జరుగుతోంది అని అనుమానిస్తున్నా. దీని పై చర్చ జరగాలి . మన దేశానికి చెందిన రా , ఐబి లాంటి సంస్థలు దీని పై నిఘా పెట్టి వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలి. - అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
కూర్చోవడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే! అన్నం ఎక్కువ తిన్నారో!
"ఇది తిను.. అది తినొద్దు.. అంటూ ఒకటే సోది. మన తాతముత్తాతలు హాయిగా అన్నీ తిన్నారు. ఇప్పుడే పనిలేని వాళ్లు అది తొనొద్దు... ఇది తినొద్దు... అంటూ ప్రచారం చేస్తున్నారు. హాయిగా అన్నీ తినండి ".... ఇదీ.... వాట్సాప్ లో ఆహార ప్రియులు ఫార్వర్డ్ చేసుకొని తుత్తి పొందే మెసేజ్ ! ఎంతమంది తాతలేంటి ? మనిషి పుట్టింది నలభై లక్షల సంవత్సరాల క్రితం. అంటే మనకందరికీ ఒక కోటి ఇరవై లక్షల మంది తాతలున్నారు. వారి జీవన విధానం మనల్ని ప్రభావితం చేస్తుంది. మనకు ఇష్టమున్నా , లేకున్నా తప్పదు.. తప్పించుకోలేము. అదే సూక్ష్మ పరిణామక్రమం ! అదే సైన్స్ ! 1. కూర్చోవడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే! మనిషి నాగరికుడయ్యింది అయిదు వేల సంవత్సరాల క్రితం మాత్రమే. నలబై లక్షల్లో అయిదువేల సంవత్సరాలంటే ఎంత ? ఒక శాతం కూడా కాదు. ఒక శాతంలో పదోవంతు. అంటే సముద్రంలో నీటి బొట్టు. అంటే మనిషి తన మనుగడలో తొంబై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం సమయం వేట - ఆహార సేకరణ లో గడిపేశాడు . అంటే పొద్దునే లేస్తే మగాళ్లు వేట. మహిళలు ఇంటిపని, పిల్లల సంరక్షణ, ఆహార సేకరణ. పగటి పూట కూర్చోవడం అరుదుగానే .ఏదో బాగా అలిసినప్పుడు కాసేపు రాత్రి పూట పడుకోవడం మానవ శరీరం అందుకు తగ్గట్టుగానే తయారయ్యింది. నడుస్తూ, పరుగెత్తుతూ, ఎక్కుతూ, దిగుతూ మన తాతలు పగలు గడిపేశారు .... ఇప్పుడేమో తీరిక. ఆఫీస్ పని ఉన్నా కూర్చొని చేయడమే . ఇక ఇప్పుడు కొత్తగా వర్క్ ఫ్రొం హోమ్. ఇంటినుంచి బయటకు వెళ్ళేపని లేదు. సోఫాలో, కుర్చీలో, మంచం లో అరుగు పైన గంటలు గంటలు కూర్చోవడమే. అదిగో అక్కడే సమస్య వచ్చింది . మన పూర్వీకులు మనకు సాధించి పెట్టింది.. తిరగడానికి అనువైన శరీరం. మనం .. లేదా మన తండ్రులు.. అంటే లింగులిటుకు అంటూ రెండు తరాలు మాత్రం .. కూర్చోవడం.. అదీ కాసేపు కాదు.. గంటలు గంటలు! మన బాడీ అందుకు తగ్గట్టు లేదు.. అందుకే.. బిపి.. షుగర్.. వెన్ను నొప్పి.. మోకాలు నొప్పి.. ఊబ కాయం.. హృద్రోగం .. అబ్బో ఒకటా రెండా ? సమస్యలే సమస్యలు .. సరే గుప్పెడు మాత్రలు ఉన్నాయి. ..... వేసుకొంటే పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంది . వేసుకోకపోతే ఇంకో సమస్య . మరి పరిష్కారం ? కనీసం రోజుకు గంట నడక .. శరీరం అలసి పోయేలా శారీరిక శ్రమ. నడక ఎంత అవసరమో ఇరవై నాలుగు గంటలు ఎకానమీ క్లాసులో తన సీట్ లో కూర్చొని ఇండియా నుంచి అమెరికా విమానాశ్రయం లో అప్పుడే దిగిన ప్రయాణికుడిని అడుగు చెబుతాడు . 2. ఒంటరి తనమంటే మానసిక అనారోగ్యానికి దగ్గరి దారి : మనిషి సంఘ జీవి . మన పూర్వీకులు వేట ఆహార సేకరణ దశలో జట్లుగా సమిష్టి జీవనం గడిపారు . జట్టు అంటే ఆంగ్లం లో బ్యాండ్ . ఒక్కో జట్టు లో సుమారుగా ముప్పై నలబై మంది ఉండేవారు . ఒక విధంగా చెప్పాలంటే జట్టు ఉమ్మడి కుటుబంకన్నా పెద్దది. జట్టులోని సభ్యుల మధ్య సహకారం.. సమన్వయం.. శ్రమ విభజన.. పరస్పరత ఉండేది . మనిషి నాగరీకుడు అయ్యి వ్యవసాయం వచ్చాక ఉమ్మడి కుటుంబాలొచ్చాయి. భార్య భర్త పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని కేంద్రక కుటుంబం అంటారు . ఇది కేవలం చివరి రెండు తరాలు మాత్రమే . కేంద్రక కుటుంబాలే మానవ మనుగడకు ముఖ్యంగా పిల్లల పెంపుదలకు అనుకూలం కాదు అనుకొంటుంటే ఇప్పుడు సరి కొత్త కుటుంబాలు . తల్లి లాప్ టాప్ లో లేదా టీవీ ముందు .. తండ్రి సెల్ ఫోన్ లేదా కంప్యూటర్ ముందు . పిల్లలల తో మాటాడే సమయం ఉండదు . వారి చేతిలో సెల్ ఫోన్ . అక్కడే అన్ని అరిష్టాలు మొదలు . అంతేనా ? మనిషి ఒంటరిగా గడిపింది ఎప్పుడు ? ఇప్పుడేమో ఎదిగిన పిల్లలు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో .. కనీసం ఆఫీస్ లాంటి వాటికి పోయినా అదో రకం .. వర్క్ ఫ్రొం హోమ్ .. రిటైర్మెంట్ తరువాత జీవనం .. . మనిషి ఒంటరి వాడయ్యాడు . పక్కన ఎవరైనా ఉన్నా మాట్లాడరు. చేతిలో సెల్ ఫోన్ ." ఖాళీ బుర్ర .. దెయ్యాల కొంప "అనే ఆంగ్ల సామెత ఉండనే వుంది . ప్రతి ఇంట్లో ఒక సైకో తయారవుతున్నాడంటే తప్పు .. మన తాతలదే . కానీ అదే మన ancestry. తప్పదు.. అదే నీ పరిణామ క్రమం.. అదే నీ బతుకు.. మారాలంటే కనీసం లక్ష సంవత్సరాలు కావాలి . 3. అన్నం ఎక్కువ తింటే సున్నం దక్కదు సుమీ.. మనిషి తన మనుగడ లో తొంబై తొమ్మిది శాతం సమయం మాంసం , దుంపలు , కాయలు పళ్ళు తిని బతికేసాడు . ఈ నాటి బాష లో చెప్పాలంటే మీట్.. సలాడ్స్ . నవీన శిలా యుగం లో అక్కడక్కడా బార్లీ లాంటి పంటలు . గోధుమ, వరి లాంటి ధాన్యాలు పండించింది కేవలం అయిదు వేల సంవత్సరాల క్రితం . దానికే మన బాడీ గా రెడీ గా లేదు . అది చాలదన్నట్టు ఇదిగో గత నలబై యాభై సంవత్సరాల్లో కొత్త వంగడాలు.. రసాయన ఎరువులు క్రిమి సంహారక మందులు .. పీచు సున్నా .. పిండి పదార్థాలు తప్పించి మిగతా పోషకాలు సున్నా .. అదే తెల్లనం .. ఉత్తరాది వారు మరీ దారుణం .. రసాయనాలు కలిసిన మైదా కలుపుకొని గోధుమ పిండి రొట్టెలు .. పుల్కాలు . సకల సమస్త రోగాలకు ఇవే కారణం . ఇది చాలదన్నట్టు ఆధునిక ప్రపంచంలో ప్రొసెస్డ్ ఫుడ్స్.. ట్రాన్స్ ఫ్యాట్స్ .. జంక్ ఫుడ్ .. అబ్బో .. రోగాలు మూడు రోగాలు ... ముప్పై ఆసుపత్రులు . ఈ మెసేజ్ ఇక్కడి దాక చదివిన వారికి రెండు మార్గాలున్నాయి . 1."అంటే ఏంటట ? మన తాతముత్తాతలు ఆకులూ అలుములు కట్టుకొని, గుహల్లో అడవుల్లో బతికారు కాబట్టి మనం కూడా బట్టలిప్పేసి అకులు కట్టుకొని అడవిలోకి వెళ్లిపోవాలా?" అని జోక్ చేసి .. మీ జోక్ కు మీరే కిచ కిచ అని నవ్వేసుకొని హ్యాపీ గా బతికెయ్యడం .. అల్ ది బెస్ట్ . లేదా .. ►రోజుకు ఒక గంట నడక ►పిల్లాపాపలతో సమయం గడపడం ►స్నేహితులు బంధువులు తో తరచూ కలుస్తూ సమయం గడపడం ►ఆఫీస్ లాంటి చోట్ల అందరితో కలివిడిగా మాట్లాడడం ►తెల్లన్నం బాగా తగ్గించి మైదా పుల్కాలు పూర్తిగా మానేసి ఆకుకూరలు కాయగూరలు , పళ్ళు లాంటివి ఎక్కువ తినడం . మనం ఎంచుకొన్న దారే మన భవిత రాదారా ? గోదారా? ఏది మీ దారి ?? - అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
లివింగ్ లెజెండ్ అన్నవరపు రామస్వామి
తొంభై ఆరేళ్ల వ్యక్తి బతికి ఉండడాన్ని మీరు ఎన్ని సార్లు ... ఎన్ని చోట్ల చూసారు ? ఒకటో రెండో సార్లు .... కదా ? ఒక వేళా బతికి ఉన్నా వారి ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది ? మందగించిన కంటి చూపు ... వినికిడి ... జ్ఞాపక శక్తి ! మంచం నుంచి లేవలేని స్థితి . అవునా ? తొంభైఆరేళ్ల లివింగ్ లెజెండ్ ను పరిచయం చేస్తా .... రండి . ..... శంకరాభరణం సినిమా చూసారు కదా ? తెలుగువాడన్నాక చూడకుండా ఎలా ఉంటారులెండి! శంకర శాస్త్రి ! తెలుగువాడి గుండెల్లో పాగా వేసాడు కదా . నిజజీవిత ప్రేరణ లేకుండా అంతటి పాత్ర ను మలచడం సాధ్యమా ? ఆ శంకర శాస్త్రి పాత్ర నిజ జీవితం లో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు . తలపాగా .. ఆహార్యం .. నిబద్దత .. క్రమశిక్షణ సంగీతం ... . అన్నీ .. అన్నీ . 1883 అంటే నూట నలభై ఏళ్ళ క్రితం పుట్టారు . సంగీత మహాగురువు . త్యాగరాజ స్వామి .. శిష్యుల్లో నాలుగో తరానికి చెందిన వారు పంతులు గారు . విజయవాడ అలంకార థియేటర్ సెంటర్ లో ఆయన విగ్రహం ఉంది. పంతులు గారు ఎంతో మంది సంగీత కారుల్ని తయారు చేసారు . ఆయన శిష్యుల్లో అందరికీ బాగా తెలిసిన వారు లెజెండ్ మంగళం పల్లి బాలమురళి కృష్ణ . రామకృష్ణయ్య పంతులు శిస్యుల్లో బాల మురళి కంటే సీనియర్ అయిన వ్యక్తే మనం చెప్పుకొంటున్న హీరో ఆ హీరో పేరు అన్నవరపు రామస్వామి . పుట్టింది 1926 . అంటే తొంబై ఆరేళ్ళ క్రితం . దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయ్యింది కదా . దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆయన 21 ఏళ్ళ యువకుడు . వామ్మో .. అప్పుడెప్పుడో పుట్టిన వ్యక్తి ఇంకా బతికున్నారా ? అని మీరు ఆశ్చర్య పోతున్నారా ? బతికుండమేంటి ? పాపం ప్రతిహతమగు కాక . చేతిలో కనీసం కర్ర లేదు . నాకంటే వేగం గా నడుస్తారు . మెట్లెక్కుతారు . కంటిచూపు పర్ఫెక్ట్ . వినికిడి పర్ఫెక్ట్ . జ్ఞాపక శక్తి సూపర్ . చాదస్తం లేదు సరి కదా .. చిలిపితనం ఎక్కువ. బాల మురళి సంగీత ప్రపంచం లో లెజెండ్ . ఆయనకు భారత రత్న రాలేదంటే అది తెలుగువాడి దౌర్బాగ్యం . బాలమురళి పాడిన త్యాగరాజ పంచరత్న కీర్తనలు యూట్యూబ్ లో చూడండి . ఆయనకు వయోలిన్ సహకారాన్ని అందిస్తున్న ఆయన సీనియర్ రామస్వామి కనిపిస్తారు . అదీ అన్నవరపు రామస్వామి గారి స్థాయి . అలాంటి వ్యక్తిని పరిచయం చెయ్యాల్సి రావడం ఇబ్బందికరం కాకపోతే ఇంకేంటి ? కాంట్రవర్సీ, సెన్సెషనల్ లాంటి విషయాల పట్ల ఉన్న ఆసక్తి , ఇంకా మన ముందే బతికి ఉన్న లెజెండ్స్ పట్ల ఉండదు . ఇదే మన సమాజ దౌర్బాగ్యం . అదే మన పతనావస్థ. మొన్న ఒక జర్నలిస్ట్ వాట్సాప్ గ్రూప్ లో ఒక బ్రేకింగ్ వార్త. అన్నమయ్య కీర్తన వివాదం తెలిసిందే కదా . దాని పై ఓ కరాటే మహిళ అభిప్రాయం అట .. అదీ ఆ బ్రేకింగ్ న్యూస్ . ఆ వివాదమే ఒక శుద్ధ దండగమారి వివాదం . పోనీ దానిపై అభిప్రాయం చెప్పాలంటే ఎవరు చెప్పాలి ? సంగీతం లో ఉద్దండులు చెప్పాలి . కదా? . వ్యక్తిగా ఎవరి అభిప్రాయం ఆమెకుండవచ్చు . తప్పులేదు . నాకు ఒళ్ళు మండిపోయింది . ఏందయ్యా ఇది? అని అడుగుదామని కొన్నా. "ఎవరండీ ఈమె?" అని అడిగా . నా వ్యంగ్యం ఆ గ్రూప్ లో ఎవరికీ అర్థం కాలేదు . రామాయణం లో పిడకల వేట లాగా ఇది ఎందుకు చెప్పానంటే ఇదీ మన స్థితి .. మన ఆలోచన విధానం .. మన మీడియా ధోరణి .... అని చెప్పడానికి . తిరిగి అన్నవరపు రామస్వామి గారి విషయానికి వచ్చేదాము . బాలమురళి గారి సంగీత కచ్చేరి ఎనిమిదేళ్ల క్రితం నా పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతి లో ఏర్పాటు చేశా .అప్పుడే తొలిసారి నాకు అన్నవరపు రామస్వామి గారితో పరిచయ భాగ్యం కలిగింది . అటుపై విజయవాడ లో మా స్కూల్ ప్రారంభించినప్పుడు తిరిగి బాల మురళి కచేరి ఏర్పాటు చేశా . తన చిన్ననాటి ఊరు విజయవాడ లో బాలమురళి చివరి కచేరి అదే . విజయవాడ లో మా స్కూల్ ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించింది బాలమురళి గారే. అటుపై మా స్కూల్ లో విద్యార్థులకు తొలిపాఠం గా సంగీతాన్ని నేర్పింది ఆయనే. ఆయనే వెంట అన్నవరపు రామస్వామి గారు . అటుపై విజయవాడ పోరంకి లో మా స్కూల్ లో నూతన భవనాన్ని ప్రారంభించింది రామ స్వామి గారే { అప్పటికి బాల మురళి కచేరిని దేవతలు స్వర్గం లో ఏర్పాటు చేసుకొన్నారు } . నేను సంగీతకారుడిని కాను . సంగీతం లో ఓనమాలు .. కాదు... కాదు .. సరిగమలు కూడా రాదు . మరి వీరి తో సంబంధాలేంటి ? ఇంగువ మూట గట్టిన బట్టకే వాసన అంటుకొంటుందట . అలాంటిది సుగంధ చందనం మూట గట్టిన బట్టకు ? నాకు శాస్త్రీయ సంగీతమంటే అందునా త్యాగయ్య సంగీతమంటే ప్రాణం . అదే బాలమురళి లాంటి లెజెండ్ ను కలిసే అవకాశమిచ్చింది . అదే నాదసుధార్ణవ పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారిని కలిసే అవకాశం , ఆయన విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగానే గన్నవరం లోని మా స్కూల్ లో ఏర్పాటు చేసే అవకాశాన్నిచ్చింది . తొంబై ఆరేళ్ళ లివింగ్ లెజెండ్ అన్నవరపు రామస్వామి మహా చిలిపి . ఇరవై ఏళ్ళ కుర్రాడిలో వుండే చిలిపితనం ఆయనలో ఉంది . మొన్న ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మెడలో పూలదండ వేసాం. అటు పై నేను మాట్లాడుతుంటే.. ఉన్నట్టుండి తన మెడలోని పూలదండ నాకు వేసేసారు . గన్నవరం లో మా స్కూల్ ప్రాంగణం లో ఆయన విగ్రహం .. దాన్ని ఆయనే ప్రారంభించడం .. ఆ కార్యక్రమం లో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి మనువడు సుధాకర్ త్యాగయ్య కీర్తన తో ప్రారంభించడం .. అంత ఒక కలలాగుంది. ఆహా.. ఇంతకంటే ఏమి కావాలి ? విగ్రవిష్కరణ సందర్భంగా సుమారు నలబై నిముషాలు ఎండలో నిలుచున్నారు అన్నవరపు గారు . ఇప్పటికీ ఆల్ ఇండియా రేడియో లో వయోలిన్ తో కచేరి చేస్తారు . సంగీతమే నా ఆరోగ్య రహస్యం అంటారాయన . నేను కూడా అంటా .. కర్నాటిక్ సంగీతం ఈజ్ ది సీక్రెట్ అఫ్ మై ఎనర్జీ . - అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
యూరప్ తగలబడి పొతుందెందుకని? హరిత గృహ ప్రభావమా! భూతాపమా!
యూరప్ తగలబడి పొతుందెందుకని ? హైదరాబాద్ ఉష్ణ మండల ప్రాంతం లో ఉంది. భూమధ్య రేఖ కు రెండు వేల కిలోమీటర్ ల దూరం . అదే యూరప్ దేశాలు సమ శీతోష్ణ మండలం లో ఉన్నాయి. ఉదాహరణకు పోర్చుగల్ భూమధ్య రేఖ నుంచి 4500 కిలోమీటర్ ల దూరం లో ఉంది . హైదరాబాద్ లో వేసవి లో 42 ,43 డిగ్రీ ల ఉష్ణోగ్రత రికార్డు అవుతుంటుంది . మరి మనం శీతల దేశాలుగా పిలుచుకునే యూరప్ లో వేసవిలో ఎంత ఉష్ణోగ్రత ఉండాలి ? 30?.. పోనీ ఎక్కువంటే 35 కదా ? మొన్న పోర్చుగల్ లో పిహవో అనే చోట రికార్డు అయిన ఉష్ణోగ్రత ఎంతో తెలుసా ? 47 డిగ్రీ లు .! రామగుండం, రెంటచింతల లాంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఉష్ణోగ్రత అరుదుగానే రికార్డు అవుతుంది . ఏదో ఎడారి లో ఉన్నట్టు మంచు దేశాలయిన యురోపియన్ దేశాల్లో ఆ ఉష్ణోగ్రతలు ఏంటి ? రైలు పట్టాలు దెబ్బతింటున్నాయి . రవాణా వ్యవస్థ దెబ్బ తింది. మంటలు! మంటలు! .. అడవులే కాదు. ఊళ్లే తగలబడి పోతున్నాయి . లండన్, కెంట్ , కన్వేల్ల్, తూర్పు లండన్ గ్రామాలు.. ఎక్కడ చూసినా తగలబడి పోతున్న దృశ్యాలు . స్కూళ్లకు సెలవులిచ్చేశారు . అత్యయిక పరిస్థితి విధించారు . ఎండకు, వేడి కి జనాలు చచ్చి పోతున్నారు . ఒక్క స్పెయిన్ పోర్చుగల్ దేశాల్లోనే ఇప్పటిదాకా వెయ్యి మంది మరణించారు . ఎందుకిలా ? హరిత మందిర ప్రభావం .. భూతాపం . ఇదేనా ? ఆలా అనే ఇప్పటికీ అనుకొంటున్నా . ఇదే కారణమైతే తూతూమంత్రపు చర్యలు కాకుండా ఇప్పటికైనా పటిష్టమైన చర్యలు చేపట్టాలి . హరితమందిర ప్రభావం వల్ల అనేక రకాల అనర్ధాలు జరుగుతాయి . వర్షాలు పడవు . అంటే కరువు . పడితే ఒక రోజులో అతి భారీ కుంభ వృష్టి . అంటే ఒక పక్క వరదలు, మరో పక్క క్షామం . ఏ విధంగా చూసినా బారీనష్టాలు . కొండచరియలు విరిగిపడడం , క్లౌడ్ బరస్ట్ , టైపూన్ , హరికేన్ , ఫ్లాష్ ఫ్లడ్స్ ఇలా అనేక విపత్తులు . మరి గేట్ల తాత మాటేంటి ? రెండేళ్ల నాటి మాట . ‘ప్రపంచ జనాభా ఏడు వందల కోట్లయ్యింది . దీని వల్ల అనేక అనర్ధాలు . రాబొయ్యేది నాలుగో పారిశ్రామిక యుగం . రోబో లు రాజ్యమేలుతాయి . పారిశ్రామిక వ్యవస్థ సంగతి వేరు . పరిశ్రమల్లో పని చేయడానికి ఎక్కువ మంది కావాలి . కానీ కృత్రిమ మేధ యుగం లో ఇప్పుడున్న దానిలో మూడో వంతు చాలు .. ఇదీ గేట్ల తాత బృందం ఆలోచన . కాబట్టి జనాభా ను ఎలాగైనా లేపేయాలి ‘.. ఇదండీ .. రెండేళ్ల క్రితం నేను విన్నది . మెయిన్ మీడియా లో రాదు . ఇలాంటివి ఒక వర్గం లో బాగా సర్క్యూలేట్ అవుతున్నాయి వామ్మో .. ఇదేంటబ్బా .... మరీ స్కెజో పేర్నియా వ్యాధి గ్రస్తుల్లా, మతి భ్రమణం చెంది ఏదేదో ఊహించుకొని చెప్పేస్తున్నారు అనుకొన్నా. వాక్ సీన్ లు వేసుకోండి అని చెప్పా . తీరుబడి గా చూస్తే వాక్ సీన్ ల వల్ల జరిగిన నష్టం, అంతా ఇంతా కాదు . లక్షల మంది ఆరోగ్యం నాశనం అవుతుంటే వ్యవస్థలన్నీ దొంగ నాటకాలాడడం చూసి చూసి .. అసలు నేను కలకంటున్నానా ? అని ఇప్పటికీ నమ్మలేక నమ్మలేక బతుకుతున్నా. గత కొన్ని రోజులుగా కొంతమంది మిత్రులు కొన్ని లింక్స్ పంపుతున్నారు . పుంఖానుపుంఖాలుగా లింక్స్ . డాకుమెంట్స్ . వీటి సారంశం ఏమిటంటే తాత బృందం కేవలం వాక్సిన్ లను నమ్ముకొంటే లాభం లేదని ఇప్పుడు పర్యావరణం రూట్ పట్టింది .. కేం ట్రైల్స్ .. సూర్యుడ్ని కప్పేయడం .. ఇంకా చాలా చాలా ఉంది లెండి . ‘సర్.. మీరు చెబితే నలుగురికీ తెలుస్తుంది . చెప్పండి . తాత కొత్త ప్లాన్.. అందరికీ తెలియాలి‘ అని మెసెంజర్ ద్వారా కొంత మంది మిత్రులు అడుగుతున్నారు . ‘అయ్యా !.. వాక్సీన్ల విషయం లో నాకు అయ్యింది చాలు . కుక్కపని చేసి తన్నులు తిన్న గాడిద బతుకయ్యింది . కరోనా యుగం ముగిసింది . వాక్సీన్ అయితే... వద్దు అంటే కనీసం నలుగురు వింటారు . తాత నిజంగానే పర్యావరణ విపత్తు సృష్టిస్తే నేను జనాల్ని ఎడ్యుకేట్ చేసినా సముద్రం లో నీటి బొట్టు .. జనాలు తెలుసుకున్నా చేసేది ఏముంటుంది ? ఎక్కడో కూర్చొని ఆయనో పొర లో ఏదో మార్పులు చేస్తే ఇక్కడ మనం చేసేది ఏముంటుంది ? అయినా ఇలాంటి వాటి పట్ల పెద్ద పెద్ద నాయకులు వ్యవస్థలు స్పందించాలి . నేను ఈ బురద లో కాలు పెట్టను‘ అని చెబుతూ వస్తున్నా. మొన్న ఒక పోస్ట్ పెట్టా. యూరప్ లో ఇదిగో ఇలాంటి విపత్తులు వస్తున్నాయి .. దీని వెనుక కారణం హరితమందిర ప్రభావమేనా లేక ఇంకేదైనా ఉందా ? అని. కనీసం జనాల్లో చర్చ మొదలైతే ఏది నిజమో ఏదో అబద్ధమో తెలుస్తుంది అని నా ఆశ . జనాలకు ఓపిక తక్కువ . కేవలం ఒక లైన్ చదివి నిర్ణయానికి వచ్చే రకం . ఆరోగ్య కరమైన చర్చలకు అవకాశం లేదు . నిందలు.. ఆరోపణలు .. తిట్లు .. ఆవేశాలు .. .. బూతులు .. ఇవీ సోషల్ మీడియా లో రాజకీయ చర్చలు . రాజకీయాలే సర్వం అనుకొనే స్థాయి వారిది . నేను చెప్పింది వేరు . అసలు పర్యావరణ కుట్ర జరుగుతోంది అని కూడా చెప్పలేదు . ఇక్కడ జరిగింది క్లౌడ్ బరస్ట్ అవునా ?కదా? చెప్పలేదు . కానీ చదివే ఓపిక ఎవరికీ ? ప్రపంచ పర్యావరణం మారి పోతోంది . ఎందుకు ?. చర్చ జరగని .. ఇదీ నా పోస్ట్ ల సారం . నా స్టూడెంట్స్ .. పోలీస్ కమిషనర్ , ఇన్కమ్ టాక్స్ కమిషనర్ అయితే వెళ్లి ఒక సారి గ్రీటింగ్ చెప్పలేదు . చెప్పకూడదని కాదు . నా పని నాది . ఎప్పుడైనా సందర్భం వస్తే ఓకే. అంతే కానీ నా పనులు వదిలి పెట్టి వెళ్ళ. నేను .. నా స్కూల్ .. నా పిల్లలు .. క్లాసులు .. జిం .. ఇదే నా ప్రపంచం . ఏదో కరోనా యుగం లో ఫేస్బుక్ ద్వారా ఎడ్యుకేట్ చేయడం మొదలెట్టా . అది కొనసాగిస్తా . కానీ అక్కినేనికి మిక్కిలినేని తేడా తెలియదా? అని ఏదో సినిమా లో చెప్పినట్టు ఆరోరాల్ రీసెర్చ్ ప్రోగ్రాం కు ఇక్కడ జరిగిందో లేదో తెలియని క్లౌడ్ బరస్ట్ కు తేడా తెలియని జనాలకు జనాలకు చెప్పే ఓపిక/ అవసరం లేదు . వాక్ సీన్ ల గురించి చెప్పాల్సింది అంతా చెప్పేశా . ఇక పర్యావరణ్ కుట్ర నిజమో కాదో .. నేనే డిసైడ్ చేసుకోలేక ఉన్నా. ఇక నేను ఈ విషయం లో చెప్పేది ఏముంది ? ఒక వేళ . చెప్పినా చాలా మందికి అర్థం కాదు . అవన్నీ మీకు అనవసరం కదా .. పోనీలే ! మీరు మీ స్విమ్మింగ్ కొనసాగించండి . మీకు ఏ విధంగా విరోధి కాని / వైరం లేని ఆ మాటకు వస్తే మీ హితం కోరే వ్యక్తి పై ఏదో కాలక్షేపానికో / అహం దెబ్బ తినో బట్ట కాల్చి నెత్తిన వేయకండి . అది ధర్మంకాదు . ధర్మో రక్షతి రక్షితః ! - అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
పోయిన వారందరూ తిరిగి రావలసిందే.. నాన్న చెప్పింది నిజమే అన్పిస్తోంది!
న్యూయార్క్ నగరం. అమెరికాలో జనాభా పరంగా నెంబర్ వన్ సిటీ. నెంబర్ టు లాస్ ఏంజెల్స్ నాగరానికంటే రెట్టింపు జనాభా! నాలుగు వందల సంవత్సరాల చరిత్ర. ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొంది. కానీ.. కరోనా పాండెమిక్ సమయంలో... అంతకు మించి ఇప్పుడు..... వేలాది మంది నగరాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లి పోయారు. కారణాలు 1. నెలసరి ఆదాయం అద్దెకు సరిపోతుంది.. లేదా సరిపోదు. ఆకాశాన్నంటే రియల్ ఎస్టేట్.. అద్దెలు అతి భారీ స్థాయిలో. నెలకు మూడున్నర వేల డాలర్లు. అంటే సుమారుగా రెండు లక్షల ఎనభై వేలు. విల్లాకు కాదండీ... సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దె. సంపాదనంతా అద్దెకు పోతుంది. ఇక బతికేదెట్టా? 2 . తీవ్ర స్థాయిలో ఆర్థిక అసమానతలు . ప్రపంచ కుబేరులు ఇక్కడే . అతి తక్కువ ఆదాయం ఉన్న వారు , నిరుద్యోగులు భారీ సంఖ్యలో .. క్రైమ్ రేట్ భయపెట్టేలా. ౩. ట్రాఫిక్ జామ్స్ , కాలుష్యం 4. కారు ఎక్కడైనా పార్క్ చేయాలంటే గంటకు కనీసం 50 డాలర్లు, కొన్ని సార్లు వందకు పైగా...! పెరుగుట విరుగుట కొరకే.. నగరీకరణ ఒక స్థాయికి మించితే ఏమి జరుగుతుందో న్యూయార్క్ ఒక ఉదాహరణ. టోక్యో మరో రకం.. పెద్ద సంఖ్యలో న్యూ యార్క్ నగరాన్ని వదిలి పెట్టి వెళుతున్న ప్రజలు .. గ్రామాలకు , చిన్న నగరాలకు వలస . మన దేశంలో కూడా ముంబై, ఢిల్లీ , కోల్‌కతా , ఒక విధంగా బెంగళూరు ఇదే స్థితికి చేరుకున్నాయనిపిస్తుంది. మా అమ్మ నాన్న టీచర్ లు . చుట్టుపక్కల చాలా మంది బెంగళూరులో ప్లాట్స్ కొనుక్కొని వలస వెళ్లిపోయారు. మా నాన్న మా సొంత ఊళ్ళో పొలం కొన్నాడు . ‘‘అందరూ నగరాలకు వెళుతుంటే ఇదేంటి నువ్వు గ్రామం లో పొలం కొంటున్నావు?" అని అడిగా. "పోయినవారందరూ తిరిగి రావలసిందే" అన్నాడు . అయన మాటలు ఇన్నాళ్లు వాస్తవం దాల్చలేదు కానీ .. ఇప్పుడు నెమ్మదిగా ట్రెండ్..... రివర్స్ మైగ్రేషన్ అనిపిస్తోంది. - అమర్నాద్ వాసిరెడ్డి, ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
అప్పనంగా కోట్ల డబ్బు! అది నిజంగా దేవుడి వరమేనా? శాపమా?!
"భక్తా ! నీ భక్తికి మెచ్చితిని .. ఏమి కావాలనో కోరుకొమ్ము " ... " వెయ్యి కోట్లివ్వు స్వామి ! " .. ఇచ్చేసాడు. ఎందుకంటే ఆయన.... బేసికల్లి మంచి గాడ్ కాబట్టి. ఒక పెద్ద విల్లా ! సెంట్రలీ ఎయిర్ కండిషన్డ్. నలుగురు వంటవారు.. పది మంది పనివారు. కోట్ల ఖరీదు చేసే కారు. ఇంట్లోనే నే పెద్ద థియేటర్. సోఫా సెట్టు. రాజ భోగం పొద్దున్న లేచి అయిదు రకాల టిఫినీలు. కాఫీలయ్యాక ఇన్డోర్ థియేటర్లో సినిమా. మధ్యాహ్నం లంచ్‌కి పదహైదు రకాల పదార్థాలు. లంచ్ అయ్యాక నిద్ర. సాయంకాలం గార్డెన్ లో పిచ్చాపాటీ. రాత్రికి స్కాచ్ తో డిన్నర్ . నా సామి రంగా ! జీవితమంటే ఇదే కదా ! పెట్టి పుట్టి ఉండాలి సామీ. వారం గడిచింది .... . కొద్దిగా బోర్ .. నెల ...... ఇంకా బోర్ . ఎంత సేపు ఇంట్లో?. పెద్ద క్లబ్ లో మెంబర్షిప్ . సాయంకాలం పేకాట . మందు .. విందు . ఆరు నెలలు గడిచాయి . తూ.. దీనెమ్మ జీవితం .... . ఒక పని లేదు .... . ఛాలెంజ్ లేదు. జైల్లో ఖైదీలా తయారయ్యింది. టైం పాస్ కావడం లేదు . థ్రిల్ లేదు.వంటవాళ్లు ఎంత బాగా, ఎన్ని రకాల ఐటమ్స్ చేసినా తినాలనిపించడం లేదు. ఆకలి లేదు. టేస్ట్ లేదు . ఇంట్లో కూర్చువాలంటే బోర్.. క్లబ్ లో బోర్ .. జీవితమే బోర్ . ఎవరో చెప్పారు. గోవా ... అని ... గోవాలో కేసినో ..... నెల థ్రిల్.. అటు పై అదీ.... ఛీ ..అదీ .. బోర్ .. మనిషన్నాకా ఏదో ఒక గుర్తింపు ఉండాలి . రాజకీయాలు . నాయకులతో చెట్టాపట్టాల్ .. అదీ బోర్ కొట్టింది రాత్రి తాగే విస్కీ ఇప్పుడు పొద్దునే .. బోర్ కొడుతోంది మరి . థ్రిల్ లేదు . జీవితం లో కిక్ కావాలి . ఏదోకటి చెయ్యాలి గురూ ! . మరో ఆరు నెలలు గడిచాయి . ఒక పెగ్గు కిక్కు ఇచ్చేది ..ఇప్పుడు ఫుల్ బాటిల్ తాగినా ఎక్కడం లేదు . ఏమి చెయ్యాలి ? డ్రగ్స్ .. వావ్ .. ఇదే కదా జీవితం ! చెప్పలేని థ్రిల్ . సంవత్సరం గడిచింది . బాన కడుపు. ఫాటీ లివర్. కిడ్నీ సమస్య.... బిపి .. హై షుగర్. గుండెకు స్టెంట్స్ మోకాళ్ళ నొప్పులు .. నడుం నొప్పి . .. రోజుకు గుప్పెడు మాత్రలు. రాత్రి నిద్రపట్టదు . పొద్దునే లేవ బుద్ధి కాదు. లేచి ఏమీ చెయ్యాలి?. రాజకీయాల్లో సాధించింది ఏమీ లేదు. చెడ్డ పేరు. డబ్బు నష్టం. కేసినో లో లాస్. డబ్బుకంటే మనఃశాంతి కరువు . ఏమయ్యా జీవితం ? ఈ బతుకెందుకు ? బతికి ఏమి లాభం ? కొడుక్కి బర్త్‌డే గిఫ్ట్‌గా ఖరీదైన బైక్ ఇచ్చాడు. వాడు ఎక్కడో తిరిగి అర్ధరాత్రి .. అపరాత్రి ఇంటికి వచ్చేవాడు . ఒక రోజు రాలేదు. పోలీస్ ల నుంచి ఫోన్ మాత్రం వచ్చింది . బాగా తాగి రింగ్ రోడ్డు లో ఆక్సిడెంట్ లో పోయాడు అని . ఇప్పుడు ఉన్నది ఒక కూతురు. ఒకే ఆశాదీపం. ఇంకో రోజు ఫోన్ వచ్చింది. కూతురు ఎవరినో పెళ్లి చేసుకొంది. ఆ వ్యక్తి టెర్రరిస్ట్ ముఠా సభ్యుడిగా పోలీస్‌ల అనుమానం. వారు ఎక్కడికి పోయారో తెలియదు. దేశం వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు అని మాత్రం అటు పై పోలీస్‌లు నిర్ధారించారు . డిప్రెషన్. చచ్చి పోవాలని పిస్తోంది. జీవితం నరకం. పొద్దునే మొదలెట్టాడు. రెండు బాటిల్స్ ఖాళీ. స్టఫ్ ఎంత కొట్టాడో తనకే గుర్తు లేదు . నిజానికి తనకి అటు పై ఏది గుర్తుకు రావడం లేదు . ఏమయ్యిందో తెలియదు కళ్ళు తెరిస్తే. ఫైవ్ స్టార్ ఆసుపత్రిలో ఐసీయూ లో .. చాలా రోజులు కోమాలో ఉండి ఇప్పుడే లేచాను అని అర్థం అయ్యింది.. దేవుడు తనకు వరం ఇచ్చాడా ? శాపం పెట్టాడా ? అప్పనంగా వచ్చి పడ్డ వెయ్యి కోట్లు. ఆరోగ్యం .. ఆనందం.. కొడుకు కూతురు .. ఏదీ మిగలలేదు . దేవుడు మోసం చేసాడు గురూ . డబ్బు కట్టలు ఇచ్చి.... మిగతా అన్నీ దోచేశాడు . అవును . దేవుడంతే ! ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది . దాన్ని సైన్స్ లో డోపమైన్ హై అంటారు . ఇవన్నీ తెలియని వారు" దేవుడున్నాడురా.. లెక్క కుదుర్చేస్తాడు" అంటారు . తెలిసిన వారు రెండూ ఒకటే అంటారు . ఇంకొకడు ! కరోనా వచ్చింది . లాక్ డౌన్ . ఇంట్లో బందీ . పని తగ్గిపోయింది . ఏమి లేకున్నా బతకగలడు . కానీ .... పనిలేకుంటే ? టీవీ సెట్ ల లో మరణ మృదంగాలు .. కరాళ నృత్యాలు అంటూ రెయ్యి పగలు వార్తలు ! అందరిలో ఒకటే టెన్షన్ . కరోనా.... కరోనా . ఇదేంటో చూద్దామని అధ్యయనం మొదలెట్టాడు . చాలా విషయాలు తెలుసుకొన్నాడు . ఇంకా లోతుకు వెళ్ళాడు . చాలా విషయాలు తెలిసాయి . జరుగుతున్నదేదో అర్థమయ్యింది . తనకు తెలిసింది నలుగురితో పంచుకున్నాడు .వంద మంది .. వెయ్యి .. వేలు .. లక్షలు .. తనకు రోజంతా పని . నలుగురికీ మంచి చేసామన్న తృప్తి . పాజిటివ్ ఫీలింగ్ . హ్యాపీ హార్మోన్స్ . మరింత ఆత్మ విశ్వాసం . తన ఆరోగ్యం పై మరింత శ్రద్ధ . కాలం గడిచింది . ఎంతో మందికి మేలు జరిగింది . తనకు మంచి పేరొచ్చింది . దానితో పాటే సిక్స్ ప్యాక్ వచ్చింది . ఇతగాడి వయసెంత అని చర్చ . వయస్సు చెప్పడు. ఏజ్ ఒక నెంబర్ మాత్రమే అంటాడు 27 ఏళ్ళ యువకుడికి వుండే గుండె వేగం .. బిపి . తనకుంది అంటాడు . లాక్ డౌన్ కాలం లో పనొచ్చింది . లాక్ డౌన్ పోయాక పని పెరిగింది . పని ... ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, మంచి పేరును, బతకడానికి కావలసిన డబ్బును తెస్తుంది . డబ్బు చేయలేని పని చేస్తుంది . ఇప్పుడొక మహానుభావుడి గురించి. భారత దేశ ప్రధమ పౌరుడిగా రిటైర్ .. అన్ని సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుంది . వంట వాళ్ళు . డ్రైవర్ .. బంగాళా .. రిటైర్మెంట్ దేనికి ? చేస్తున్న ఉద్యోగానికి పదవికి రిటైర్మెంట్ సరే . పనికి రిటైర్మెంట్ ఇస్తే జీవితం నరకం . అందుకే ఆయన తనకిష్టమైన పని .. బోధకుడి పని ఎంచుకున్నాడు . ఎన్నో జీవితాలకు దారి చూపాడు. ఒక సారి కారు లో వెళ్లి చెన్నై ఎయిర్పోర్ట్ లో విమానం ఎక్కాడు . కోల్కత్త లో దిగాడు . కారు లో ఈశాన్య రాష్ట్రానికి .. అక్కడున్న విశ్వ విద్యాలయానికి వెళ్ళాడు . పాఠం మొదలెట్టాడు . పాఠం చెబుతున్నాడు . అయిదంటే అయిదు సెకండ్ ల లో తనువుఁ చాలించాడు . పుట్టినవానికి మరణం తప్పదు . మంచం లో జీవచ్ఛవం లా ఏళ్లకు ఏళ్ళు అందరితో ఛీ కొట్టించుకొని బతికి బతికి .. చచ్చి .. చచ్చి .. చివరకు మరణించే వారిని .. వారి తుది శ్వాసకు ముందు .. అడిగితే చెబుతారు. సుఖ మరణం ఎంత పెద్ద వరమో . నువ్వు పని వెంట పడు . పేరు , డబ్బు , పదవి , ఆరోగ్యం , ఆనందం.. చివరకు సుఖ మరణం నీ సొంతం అవుతుంది . నాలుగు కాలాల పాటూ నలుగురికీ గుర్తుండి పోతావు నువ్వు డబ్బు వెంట పడు. లండన్‌కో మరెక్కడికో పారి పోయి .. బిక్కు బిక్కు మంటూ గడుపుతూ .. ఆరోగ్యం ఆనందం .. మనఃశాంతి .. అన్నీ పోగొట్టుకొని .. చివరకు మరణ శయ్య పై నరకాన్ని అనుభవించి పోతావు . ఏది నీ దారి ? ఛాయస్ నీదే ! ఎందుకంటే ... దేవుడున్నాడు ..మొత్తం అకౌంట్ ఇక్కడే సెటిల్ చేసేస్తాడు . సైన్స్ ఉంది. దాని రూల్స్ దాని పని అది చేసుకొంటూ పోతుంది . ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుంది . నువ్వు ఏ దారిలో చూసిన జరిగేది అదే ! పనా ? డబ్బా ? ఏది నీ దారి ? - అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
తింగరి సన్నాసిలా ఆలోచిస్తాడు.. రాకేష్‌లో ఉన్న లోపమేంటి?
అదో కార్పొరేట్ స్కూలు. ఏడో తరగతి .టీచర్ ఇంగ్లీష్ లో పాఠం చెబుతున్నాడు .‘ సూర్యుడు , భూమి ఒకే సరళ రేఖ లో వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది . అమ్బరా, పెనంబ్రా.. ‘ అంటూ పాఠ్యపుస్తకం లో ఉన్నది వున్నట్టుగా , గడగడా పాఠం అప్పచెప్పినట్టు టీచర్ చెప్పుకొంటూ పోతున్నాడు . రాకేష్ కు ఇదేదీ అర్థం కావడం లేదు. ‘ సర్ .. భూమి చంద్రుడు పక్కపక్కనే ఉంటారు కదా . మధ్యలో ఎటువంటి అడ్డు లేదు కదా ? మరి చంద్రుడు ఎందుకు కనిపించడు ?‘ అడిగాడు. టీచర్ తడబడుతూ‘ రెండింటికి మధ్య సూర్యుడు వస్తాడు అని చెప్పా కదా ? అయినా ఎప్పుడూ అనుమానాలే . వెదవ . నువ్వు ... నీ మొఖం . నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే . క్లాస్ బయట అరగంట నిలబడు‘ శిక్ష విధించాడు.రాకేష్ క్లాస్ బయట నిల్చొన్నాడు . క్లాసులో పిల్లలు హేళనగా నవ్వుతున్నారు . వారు పాఠాన్ని బట్టి కొట్టడం లో దిట్టలు తనకేమో ఆలా చేయడం ఇష్టం ఉండదు . ప్రతిదీ ఆలోచిస్తాడు . సూర్యుడు, భూమికి చంద్రుడికి మధ్యన వచ్చేస్తే భూమి భస్మీపటలం అయిపోతుందని తన అనుమానం . తనకింకా ఎన్నో అనుమానాలు . ఊటీ , సిమ్లా కొండ ప్రాంతాలు . కొండపైకి పొతే సూర్యుడికి కాస్తో కూస్తో దగ్గరగా పోయినట్టే కదా . అంటే ఎక్కువ వేడి ఉండాలి . కానీ కొండ ప్రాంతాలు ఎందుకు చల్లగా ఉంటాయి ? భూమి తిన్నగా ఉండదు . తన చుట్టూ తానూ తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగు తుంటుంది . దీనికి పెట్రోల్ ఎవడు కొట్టిస్తాడు ? ఇంత శక్తి ఎక్కడినుంచి వస్తుంది ? ఉత్తర ధ్రువ దేశాలు సరే . న్యూజిలాండ్ లాంటి దేశాల్లో మనుషులు, వాహనాలు తలకిందులుగా వేలాడుతుంటాయా ? సముద్రాల్లోని నీరు కిందకు కారిపోదా? నదిలోని నీరు తాగడానికి వీలుగా ఉంటుంది . అది సముద్రం లో కలిస్తే ఎందుకు ఉప్పగా మారి పోతుంది? ఉత్తర భారత దేశం లోని నదులు జీవ నదులు . గోదావరి కృష్ణ నదులు ఎందుకు సంవత్సరమంతా ప్రవహించవు ? హుస్సేన్ సాగర్ లో ఎందుకు మంచు కురవదు ? బకెట్ నీటిలో కాళ్ళు పెట్టి ఎండలో నిల్చుంటే పచ్చని చెట్లలా తాను కూడా ఆహారాన్ని తయారు చేసుకోవచ్చా? మనిషి కోతి నుంచి పరిణామం చెందితే ఇంకా కోతులు ఎందుకున్నాయి ? అవి మనుషులుగా ఎప్పుడు మారుతాయి ? ఇవన్నీ అడగాలని పిస్తుంది . టీచర్లు కొడుతారు . క్లాస్మేట్స్ నవ్వుతారు . అందుకే నోరు మూసుకొంటాడు . రాకేష్ ఇంటికి వచ్చాడు . ఇంట్లో న్యూ జెర్సీ తాత ఉన్నాడు. అయన ఎప్పుడు ఇంటికి వచ్చినా, అమెరికా లోని తన కొడుకు కూతురు గురించి గొప్పలు చెబుతాడు . ఇండియా వేస్ట్ అంటాడు . అయన తో మాట్లాడాలి అని ఎన్నో సార్లు అనుకొన్నాడు . అమెరికా జీవన విధానం ఎందుకు గొప్పదని అయన అనుకొంటున్నాడు అని తెలుసుకోవాలి . ఇంటికి రావడం తోటే మమ్మీ ‘ రాకేష్ .. నువ్వు పోయి చదువుకో . హోమ్ వర్క్ చేసుకున్నాక డిన్నర్ . అటు పై రెండు పాఠాలు అప్ప చెప్పాలి ‘ అని టార్గెట్ ఇచ్చింది . ఉసురో మంటూ వెళ్లి తలుపు వేసుకొన్నాడు . పుస్తకం తెరిచాడు. తన మదినిండా ప్రశ్నలే ?అమెరికా డాలర్ ఒక్కటికి మనది 80 రూపాయిలా ? ఎందుకు ? మన డబ్బుకు అంత తక్కువ విలువ ఎందుకు ? అసలు దీన్ని ఎవరు నిర్ణయిస్తారు ? ఒక డాలర్ కు ఒక రూపాయి అయితే అమెరికా లోని మనవారందరూ తిరిగి వచ్చేస్తారా ? కొడుకు కూతురు అక్కడ స్థిరపడితే కొంతమంది అంకుల్స్ ఇక్కడ ప్లాట్స్ కొంటారెందుకు ? తాను అమెరికాకు రెండు సార్లు వెళ్ళాడు . వాళ్ళు తలనుంచి కిందదాకా లావుగా ఉంటారు . ఇక్కడ పెద్దవారు కడుపు దగ్గరే లావుగా ఉంటారెందుకు ? అమెరికా వాతావరణానికి తెల్లబడితే అక్కడికి వెళ్లిన ఇండియన్స్ ఎందుకు బ్రౌన్ కలర్ లోనే ఉన్నారు ? భూమి తిరుగుతూ ఉంటుంది కదా. అమెరికాకి పోవడానికి విమానమే ఎక్కాలా ? గాలిలో కొన్ని గంటలు నిలబడితే హైదరాబాద్ , ముంబై , అరేబియా సముద్రం , అరబ్ .. ఇలా నెమ్మదిగా కిందకు చూస్తూ అమెరికా వచ్చినప్పుడు దూకొచ్చుగా ?ఇండియా ఎందుకు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం గానే ఉంది ? ప్రతి ఇంటికి నోట్ల ప్రింటింగ్ మెషిన్ ఇచ్చేస్తే అందరూ దండిగా నోట్లు ముద్రించుకొని కోటీశ్వరులు అయిపోవచ్చుగా ?‘ ఆలోచనల తో బుర్ర తిరుగుతోంది . ఈ లోగా అమ్మ నాన్న రూమ్ లోకి వచ్చారు . తనేమో తన క్లాస్ మెట్ దగ్గర తీసుకొన్న ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ పై ఒక చిన్న పుస్తకం చదవాలి అని తెరిచి ఉంచాడు . రోబో లు మన జీవితాలను ఎలా మార్చేస్తాయి అని అందులో వివరించారు.‘ చూడండి బాబాయ్ ! ఇదీ వీడి వాలకం . వెదవ! అసలు పుస్తకాలు చదవడు. బుర్ర తక్కువ సన్నాసి .ఎప్పుడూ ఏదో కాలక్షేపం పుస్తకాలు కావాలంటాడు . పిచ్చాడిలా ఆలోచిస్తుంటాడు. గౌతమ బుద్ధుడు అనుకొంటాడు . పక్కింటి అమ్మాయి సెంట్ పర్సెంట్ . వీడు ముప్పై నలబై . రేపు పొద్దున్న దాని దగ్గర నౌకరు అవుతాడు . ఆలా కాదులే .. నువ్వు ఈ సారి అమెరికా కు వెళుతున్నప్పుడు చెప్పు .. వీడిని పంపుతాను . ఇంట్లో నౌకర్లు దొరకడం కష్టం అంటున్నావుగా . అక్కడ పనిలోపెట్టుకోమని చెప్పు‘ .. అమ్మ చెబుతోంది. నాన్న, తాను ఫ్రెండ్ దగ్గరనుంచి బతిమలాడి తీసుకొని వచ్చిన పుస్తకాన్ని చించేసాడు . తనకు మొదట్లో అవమానంగా ఉండేది . ఇప్పుడది మామూలయిపోయింది . తనకు బుర్ర లేదు . పిచ్చి ఆలోచనలు చేస్తాను .. తాను నౌకరు ఉద్యోగానికి మాత్రేమే పనికొస్తాను ‘ డాడీ, మమ్మీ , స్కూల్ లో టీచర్ లు చెప్పేది ఇదే . విని విని దీనికే ఫిక్స్ అయిపోయాడు. ఇంటికి వెళితే అమ్మ చెప్పే మాటలు ..‘ పుస్తకం తీయి . చదువు . నోట్లో గొణుక్కొంటావేంటి ? గట్టిగా చదువు . చదివింది అరగంటలో పొల్లు పోకుండా అప్ప చెప్పాలి‘. నాన్న లేట్ నైట్ ఇంటికి వస్తాడు . ఆదివారాలు ఆయన అడిగే ప్రశ్నలు ‘ ఎన్ని మార్కులు వచ్చాయి ? ఎందుకింత తక్కువ మార్కులు? ‘ మార్కులు చెబితే‘ అసలే నాకే పుట్టవారా నువ్వు ? నీ మొఖం చూపొద్దు . ఈ సారి ఇదే మార్కులు వస్తే హుస్సేన్ సాగర్ లో దూకి చావు . ఇంటికి మాత్రం రావొద్దు .‘ అని మాటలు . తనకు బతకాలనిపించడం లేదు . ఇది తన ఇల్లేనా ? ఈ ఇంట్లో తన స్థానం ఏంటి ? అమ్మ నాన్న కు తనపై ఎందుకింత కోపం ? అర్థం కాని పాఠాల్ని బట్టి గొట్టడం తనకు ఇష్టం ఉండదు . చేతకాదు .ఏమి చెయ్యాలో అర్థం కాదు.ఐఐటీ లో సీట్ సాధించి అమెరికా లో జాబ్ చెయ్యాలి అని తల్లితండ్రులు ఎప్పుడో డిసైడ్ చేసేసారు . ఐఐటీ ఫౌండేషన్ కోర్స్. తనకు మాత్రం స్పేస్ సైంటిస్ట్ లేదా ఎకనామిస్ట్ కావాలని ఆశ. ఆ మాట చెబితే అందరూ పగలపడి నవ్వుతారు . ఉట్టి కెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా? అంటారు . ఉట్టి అంటే ఎలా ఉంటుందో తనకు తెలియదు. స్వర్గానికి ఎక్కడం ఎందుకు ? పుణ్యం చేస్తే దేవుడే తీసుకొని పోతాడు కదా ? తన అనుమానం . తనకే ఎందుకిన్ని అనుమానాలు ? ఊళ్ళో అమ్మమ్మ ఉంది . సమ్మర్ హాలిడేస్ లో ఊరిలో గడపాలని తన ఆశ . బియ్యం చెట్లు ఎలా బియ్యం పండ్లను కాస్తాయో చూడాలి . చెరకును గానుగ ఆడితే నల్లటి బెల్లం వస్తుందట . అదే షుగర్ ఫ్యాక్టరీ కు పంపితే తెల్లటి చక్కర. ఎందుకిలా ?ఊళ్ళో ఒకప్పుడు బావులు ఉండేవట . వాటిలో ఆ రోజుల్లో పిల్లలు ఈత కొట్టేవారట . ఇప్పుడేమో బోర్ బావులు . ఎంత లోతుకు డిగ్ చేసినా నీరు రావడం లేదు . ఎందుకు ? గ్రామాల్లో రైల్వే పట్టాలను మరుగుదొడ్లుగా వాడుతారెందుకని ? మలం ఎప్పుడూ కంపుకొడుతుందా ? లేక హీరోలు హీరోయిన్ లు అమెరికా లోని తెల్లవారు .. వీరి మలం సువాసనను కలిగి ఉంటుందా ? అసలు మలం ఎందుకు వస్తుంది. మనం తినే ఆహారం లో అరగని పదార్థలు ఉంటేనే కదా ? రోజూ పోషకాలను ఇచ్చే టాబ్లెట్స్ సెలైన్ వాటర్ తీసుకొంటే టాయిలెట్లకు వెళ్లాల్సిన అవసరముండదు కదా ? అమ్మమ్మ వూరికి ఎప్పుడు మూడో క్లాసులో ఉన్నప్పుడు ఒక సారి తీసుకొని వెళ్లారు . అదీ పది రోజులు . సమ్మర్ హాలిడేస్ వస్తే తనకు స్పెషల్ క్లాసులు . మాథ్స్ ఫిజిక్స్ లో తాను వీక్ అట . తనకేమో తనకు చదువు చెప్పే టీచర్ లకే సబ్జెక్టు రాదు అనిపిస్తుంది . నాలుగో క్లాసులో మాథ్స్ టీచర్ ఒక ప్రశ్న అడిగాడు . నెలకు 29 రోజులున్న నెల ఏది ? అని . తాను జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రతినెల కు 29 రోజులు ఉంటాయి అని చెబితే టీచర్ అరగంట గోడ కుర్చీ వేయించాడు . తన తప్పేంటో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదు . మొన్న ఫిజిక్స్ క్లాస్ .. ఆకాశం లో రాత్రి ఇన్ని నక్షత్రాలు చూసాము అని పిల్లలు టీచర్ తో చెబుతున్నారు . ఇప్పుడు ఆకాశం లో ఉన్న నక్షత్రాలను మన జీవిత కాలం లో చూడలేము మనకు కనిపించేది ఎప్పుడో తాతల కాలం నాటి దృశ్యం అని తాను చెబితే టీచర్ గొడ్డుని బాదినట్టు బాదేశాడు. రాకేష్ తండ్రి రియల్ ఎస్టేట్ కంపెనీలో మేనేజర్. తల్లి గృహిణి . ఒకడే కొడుకు. రియల్ బూమ్ ఉన్నప్పుడు పరవాలేదు . మిగతా టైం లో ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా తెలియడం లేదు. తాము పడుతున్న బాధలు కొడుకు పడకూడదు . బంధువుల పిల్లలు ఎక్కువమంది అమెరికా లో సెటిల్ అయ్యారు . హ్యాపీగా ఉన్నారు. తమ కొడుకు ఐఐటీ లో సీట్ కొట్టాలి . జీవితం లో స్థిరపడాలి . పిల్లాడి విద్య కోసం వీరు ఎంత త్యాగానికైనా సిద్ధం . సంవత్సరానికి తనకు తన భార్య కు మూడు జతల బట్టలే .నగ కొనాలన్న ఆశ ఆమె మనసులోనే దాచేసుకొంది. సంవత్సరానికి లక్ష ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్ లో ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ లో చేర్పించారు . వీడేమో చదవడు. తింగరి సన్నాసి లా ఆలోచిస్తాడు. అదీ రాకేష్ తల్లితండ్రుల మనోవేదన . ఇప్పడు రాకేష్ ని వెంటబెట్టుకొని దంపతులిద్దరూ ఒక సైకియాట్రిస్ట్ వద్దకు వచ్చారు . రాకేష్ లోని లోపం ఏంటి ?దీన్ని ఎలా సరిదిద్దాలి ? వాడిని దారిలో ఎలా పెట్టాలి అదే వారిముందున్న సమస్య. మీకేమైనా సమాధానం తెలిస్తే చెప్పండి . పాపం... కన్న బిడ్డను ప్రాణంగా చూసుకొంటూ బతుకుతున్న ఆ తల్లితండికి సాయం చేయండి.ఇది రాకేష్ ఒక్కడి సమస్యే కాదు.. మన చుట్టున్న లక్షలాది మంది పిల్లలు, వారి తల్లితండ్రుల సమస్య. ముందు సమాజంలో పేరుకుపోయిన కొన్ని భావనలను గుర్తించండి. పిల్లలకు మేలు చేస్తున్నామా? కీడు చేస్తున్నామా తెలుసుకోండి. -అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు. -
6 లక్షల జీతం.. ప్రేమించి పెళ్లాడి.. ఆఖరికి విడాకులు? అసలు తెలివి అంటే?
ఆమె ఐఐఎంలో ఎంబీఏ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో నెలకు ఆరు లక్షల జీతం పొందే ఉన్నతోద్యాగాన్ని సాధించింది. ఉద్యోగం వచ్చాక ఒక అబ్బాయిని రెండేళ్లపాటు ప్రేమించింది. తల్లితండ్రులను ఒప్పించి పెళ్లిచేసుకుంది. పెళ్ళయాక ఆరునెలల్లో విడాకులు తీసుకొంది. అప్పటికి తాను నాలుగు నెలల గర్భవతి. అబార్షన్ చేయించుకొని విడాకులు తీసుకొన్న ఆమె ఇప్పుడు డిప్రెషన్లో ఉంది. ఇక జీవితంలో పెళ్లిచేసుకోను అంటోంది . మరో చోట మరో అమ్మాయి. అమెరికాలో అత్యున్నత సంస్థలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అటుపై పెద్ద ఉద్యోగం సాధించింది. ఈమె సంపాదనపై కన్నేసిన ఒక యువకుడి ప్రేమ వలలో చిక్కి నరకయాతన అనుభవించి ఎలాగో ఒకలా బయటపడింది . మరో చోట ఐఐటీ చదివే విద్యార్ధి యూట్యూబ్ వీడియోలు చేస్తూ దానికి ఆదరణ లేదని (మరి కొన్ని కారణాలు) ఆత్మహత్య చేసుకొన్నాడు. పెద్దగా చదువుకోని వారు కూడా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు. మరి.. నువ్వు చదివే చదివేంటి ? చేస్తున్న వీడియోలు ఏంటి ? అంతకు మించి వీడియోలకు జనాదరణ ఎలా పెంచుకోవాలో తెలియకపోవడం.. పోనీ రాలేదు. అదే జీవితం అనుకొని తనువు చలించడం. ఏంటిది ? లక్షమంది పోటీ పడితే వందమందికి కూడా సీట్ దక్కని ఐఐటీ, ఐఐఎం లాంటి సంస్థల్లో సీట్ సాధించిన వారు నిస్సందేహంగా తెలివైన వారే ! కానీ రెండేళ్లు ప్రేమించినా అబ్బాయి తత్త్వం అర్థం చేసుకోలేని బేలతనం.. ఒకసారి అబార్షన్ అయితే అటుపై పుట్టే పిలల్లకు మానసిక వైకల్యం వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది అని తెలుకోలేని అజ్ఞానం. అవతలి వాడు ప్రేమిస్తున్నది తన జీతాన్ని.. తనకు కంపెనీ ఇచ్చిన షేర్లను అని తెలుసుకోలేని అమాయకత్వం.. ఏంటివన్నీ? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్మెంట్, మెడికల్ సైన్స్, ఇంజనీరింగ్, మాథ్స్ లాంటి సబ్జెక్టులలో నైపుణ్యం సాధిస్తే అకాడమిక్ లేదా డొమైన్ ఇంటలిజెన్స్ అంటారు. సంగీతం లో పట్టుంటే మ్యూజిక్ ఇంటలిజెన్స్.. భాషపై పట్టుంటే లింగ్విస్టిక్ ఇంటలిజెన్స్. శ్రీదేవి. ఒకనాటి యువకుల కలల రాణి. అద్భుత నటి. కానీ అదివరకే పెళ్ళైన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొంది. అనూహ్య పరిస్థితుల్లో లోకాన్ని వీడి వెళ్లిపోయింది. ఇక మరో ప్రముఖ నటి సావిత్రి ఎలా మోసపోయిందో మహానటి సినిమా పుణ్యమా అని చాలామందికి తెలిసింది. తెలివైన వారు ప్రతిభావంతులు ఇలా మోసపోతారెందుకు? చాలా మందికి అర్థం కాని విషయం ఒకటుంది. తెలివంటే కేవలం పాఠ్యఅంశాలపై పట్టుసాధించి మార్కులు, ర్యాంకులు కొట్టడం కాదు . మీకందరకు ఒక కాలేజీ మిత్రుడుంటాడు. కాలేజి ఎగ్గొట్టి జులాయిలా బలాదూర్ తిరిగేవాడు. కాలేజీలో పుస్తకాలతో కుస్తీ పట్టే వారెందరో ఇప్పుడు సర్కారీ క్లర్కులుగా ఉంటే.. మీరనుకున్న ఆ జులాయి కాంట్రాక్టర్‌గానో, బిజినెస్మేన్గానో అవతరమెత్తి కోట్లు కూడబెట్టివుంటాడు. కేవలం లక్ లేదా పలుకుబడి అనుకొంటే అది మీ అమాయకత్వం అవుతుంది. ఆలోచించండి. ఇదెలా సాధ్యం ? సోషల్ ఇంటలిజెన్స్.. సామాజిక తేలితేటలు.. ఎమోషనల్ ఇంటలిజెన్స్.. భావోద్వేగ తెలివితేటలు. ఈ రెండూ లేకపోతే ఎన్ని మార్కులు వచ్చినా, ఎంత సంపద ఉన్నాఅన్ని బండి సున్నాయే. ఎలాగంటారా ? మార్కులు, జీతం, సంపద ఇవన్నీ లక్షల్లో. సామజిక తేలితేటలు జీరో. ఇప్పుడు ఈ జీరోతో ఆస్తిని సంపాదనను గుణించండి. ఏమొచ్చింది? బండి సున్నా. అవునా కదా ? సామాజిక తెలివితేటలు ఉంటే ఆ సంఖ్యను ఆస్తి / జీతంతో గుణించండి. అనేక రెట్లు పెరుగుతుంది. సామాజిక తేలితేటలు లేక మలిమొఘల్ చక్రవర్తులైన ఫారూఖ్ షియార్, రఫీ ఉద్ డారాజ్, రఫీ ఉద్దీన్ లాంటి వారు సయ్యిద్ సోదరుల చేతిలో చిక్కి విలవిలలాడి, చరిత్ర మరుగయ్యారు. ఎమోషనల్ ఇంటలిజెన్స్ లేక పెద్ద సినిమాల్లో హీరోగా నటించినా అటుపై అవకాశాలు రావడం లేదని ఆత్మహత్య చేసుకొన్న వారొకరు. డిప్రెషన్ లో మరొకరు. దీర్ఘకాలం కోమా.. ఉరి.. ఇలా మరణాన్ని పొందినవారు ఇంకొందరు. తాత సంపాదించిన ఆస్తిని తగలెట్టేసి వ్యాపారాన్ని దివాళా తీయించిన వారు ఎందరో ! ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఈ వ్యక్తులు ఎవరు అని కాదు. ఎమోషనల్ సోషల్ ఇంటలిజెన్స్‌ను పిలల్లకు ఎలా నేర్పాలి? ఇందులో స్కూల్ , కాలేజీ పాత్ర ఏంటి ? తల్లితండ్రులుగా మన పాత్ర ఏంటి అని? ఆయన నాలుగో పెళ్ళానికి మూడో భర్త ఎవరు? ఆ వీడియోలో ఆమె ఒయ్యారాన్ని ఒలక పోసిందా? ఇలాంటి మనకు అవసరం లేని విషయాలపై మీరు ఆసక్తి ప్రదర్శిస్తూ సమయాన్ని వినియోగిస్తుంటే.. మీ పిలల్లు ఇంటర్నెట్ చీకటి ప్రపంచంలో దొరికే వీడియోలకు బానిసలై మీ చేయి దాటి పోతారు. ఆవు/ఎద్దు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? పిల్లలకు సోషల్ ఇంటలిజెన్స్ ఎమోషనల్ ఇంటలిజెన్స్ ఎలా నేర్పాలో ఆలోచిస్తూ ఉండండి. - అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు