హార్ప్ : హై ఇంటెన్సిటీ ఆక్టివ్ ఆరోరల్ రీసెర్చ్ ప్రోగ్రాం : ఇది మానవ కల్యాణానికి ఉద్దేశించిన కార్యక్రమం అని ఒక పక్క ప్రచారం . 2018 సంవత్సరం రాజ్య సభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆనాటి మంత్రి అనిల్ మాధవ్ దవే దీన్ని అమెరికా చేతిలోని ఆయుధంగా అభివర్ణించారెందుకని ? దీని వల్ల భూతాపం పెరుగుతుందని మన దేశంలో గోధుమ, మొక్కజొన్న లాంటి పంటల దిగుమతి తగ్గనుందని ఆయన తన లిఖిత పూర్వక సమాధానములో చెప్పారెందుకని? మాటల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంది. కానీ లిఖిత పూర్వక సమాధానమంటే, సీనియర్ అధికారులు అన్ని చెక్ చేశాకే రాస్తారు. మరో విషయం అనిల్ దవే మరణం. దానిపై విచారణ జరగాలని అయన మిత్రుడు తపన్ భట్టాచార్య మధ్య ప్రదేశ్ హై కోర్ట్ను ఆశ్రయించిన మాట నిజం కాదా?
ప్రయోగాల పేరుతొ ఆయనొస్పీర్ లో మార్పులు తెస్తే వాటి దీర్ఘ కాలిక పరిణామాలు ఎలా ఉంటాయి ? SAI అంటే ఏంటి ? స్ట్రాటోస్పీరిక్ ఏరోసోల్ ఇంజక్షన్ . SRM అంటే సోలార్ రేడియేషన్ మానేజ్మెంట్ . భూతాపాన్ని తగ్గించడం కోసం అంటే భూమిని లేదా వాతావరణాన్ని చల్లబరచడం కోసం సల్ఫర్ డయాక్సైడ్, కాల్షియమ్ కార్బోనేట్, ఉప్పు లాంటి వాటిని విమానాల ద్వారా వాతావరణ పై పొరల్లో చల్లడం ద్వారా చల్లడం . అగ్నిపర్వతాలు బద్దలయినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతుంది . దాని ప్రభావం తో సూర్య కిరణాలు భూమిని చేరకుండా వాతారణం కొన్ని రోజుల పాటు చల్లబడడం నిజమే .
కానీ దాన్ని పట్టుకొని SAI, SRM లాంటి కార్యక్రమాలు చేబడితే రోగనికన్నా మందు ఎక్కువ కీడు చేస్తుంది అని శాస్త్రవేత్తలు హెచ్చరించిన మాట నిజం కదా ? ఏరోసోల్ ఇంజెక్క్షన్ ఏంటి ? దీని పై అంతర్జాతీయ నియంత్రణ ఏది ? వాతారణం తో ఆటలా ? కార్బన్ శాతాన్ని తగ్గించడం ద్వారా ఉష్ణోగ్రతలు తగ్గించడం అవసరం . కానీ మీరు వేసే ఈ వాతావరణ ఇంజెక్షన్ వల్ల కరోనా వాక్ సీన్ లా మంచి కన్నా చెడు ఎక్కువ జరగదు అని గ్యారెంటీ ఏంటి
గాంలిన్ 1 : ఏంటిది ?
చైనా చేపట్టిన కృత్రిమ వర్ష కార్యక్రమం. తమ దేశానికి చెందిన యాభై అయిదు లక్షల చదరపు కిలోమీటర్ ల ప్రాంతం లో కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ఉద్దేశించింది . దాదాపుగా 15 ఏళ్ళ క్రితమే ఈ టెక్నాలజీ ని వాడి బీజింగ్ ఒలింపిక్స్ ముందుగా తమ స్టేడియం లు ఎంత పటిష్టంగా ఉన్నాయో చెక్ చేసుకోవడానికి కృత్రిమ వానలు కురిపించిందని చెబుతారు.
ఇండో చైనా సరిహద్దు .. మొత్తం కొండల ప్రాంతం . దీని పై చైనా ఎప్పుడో కన్ను వేసింది . ఆ ప్రాంతం లో ప్రజలను ఖాళీ చేయించి మెల్లగా వాటిని ఆక్రమించడానికి చైనా తన టెక్నాలజీతో భారీ స్థాయిలో కృత్రిమ వర్షాలు కురిపిస్తోంది అని జూన్ నెల్లోనే విశ్వ భారతి అనే పత్రిక ఆర్టికల్ ను ప్రచురించింది .
ఇంతకీ వాతావరణ తారుమారు అనే కుట్ర జరుగుతోందా ?
మామూలుగా అయితే నేను నమ్మేవాడిని కాను . కానీ వాక్ సీన్ విషయం లో జరిగిన మాయలు చూసి ఇక్కడ కూడా ఏదో జరుగుతోంది అని అనుమానిస్తున్నా. దీని పై చర్చ జరగాలి . మన దేశానికి చెందిన రా , ఐబి లాంటి సంస్థలు దీని పై నిఘా పెట్టి వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలి.
- అమర్నాద్ వాసిరెడ్డి
ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు
Comments
Please login to add a commentAdd a comment