కరోనా తెచ్చిన తంటా! పిల్లల్ని ఫోన్లకు అడిక్ట్‌ కాకుండా ఏం చేయాలి? | Dr Amarnath Vasireddy Speaks About Cell Phone Addiction | Sakshi
Sakshi News home page

కరోనా తెచ్చిన తంటా! పిల్లల్ని ఫోన్లకు అడిక్ట్‌ కాకుండా ఏం చేయాలి?

Published Sun, Aug 6 2023 2:56 PM | Last Updated on Sun, Aug 6 2023 4:06 PM

Dr Amarnath Vasireddy Speaks About Cell Phone Addiction - Sakshi

ఎప్పుడెప్పుడు స్కూల్ లాంగ్ బెల్ కొడతారా ? ఇంటికెళుదామా ? అని చూస్తుంటారు " "క్లాసు రూమ్ లో పాఠాలు వినడం లేదు . పక్క వారిని గిల్లడం, గిచ్చడం లాంటి పనులు చేస్తున్నారు " " చిరాకు, కోపం, అసహనం ఎక్కువయ్యింది . ఏకాగ్రత లోపించింది " " టీచర్ల పై తిరుగుబాటు, తల్లితండ్రుల్ని ఎదిరించడం ఎక్కువయ్యింది.

రాగ్గింగ్ , బుల్లియింగ్ , ఘర్షణలు ఎక్కువయ్యాయి " " చెడు వ్యసనాల బారిన పడుతున్నారు " ఒక్కో సారి మనం ఫ్లోలో వెళ్ళిపోతాం. మనకు కనిపించిందే లోకం అనుకొంటాము. మనసులో ఉన్నదే నిజంగా జరుగుతోంది అనుకొంటాము . అలాంటప్పుడు మనకు రియాలిటీ చెక్ అవసరం . నేను మొన్న ఆదివారం అదే పని చేశాను. ఆ రోజు జరిగిన ఇంటర్వ్యూ కు దాదాపు డెబ్భై మంది హాజరయ్యారు . వారిలో అత్యధిక శాతం ఇదివరకే ఏదో ఒక స్కూల్లో పనిచేస్తున్నారు. కరోనా ముందు కాలం తో పోలిస్తే , ఇప్పుడు... అంటే కరోనా తరువాత కాలం లో , పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు చూసారా ? అయితే ఏంటది ? ఇది నేను ఆ ఇంటర్వ్యూలో చాల మందిని అడిగిన ప్రశ్న .

పైన ఇచ్చినవి వారి సమాధానాలు. ఒక్కరంటే ఒక్కరు పాజిటివ్ చేంజ్ ఉందని చెప్పలేదు . సమస్య తీవ్రంగా ఉందని చాలా మంది చెప్పారు . కారణం ఏంటని అడిగితే అందరూ ఆన్లైన్ క్లాసు లు . మొబైల్ వ్యసనం అని సమాధానం చెప్పారు . "ఈ కాలం పిలల్లు సెల్ ఫోన్ వాడక పొతే ఎట్టా ? " "టెక్నాలజీ మార్పు తెస్తుంది . ఇది సహజం " "టెక్ సావీ పిల్లలు " "మార్పు సహజం . మారుతున్న సమాజంతో పాటే మనం మారాలి " అని ఇంకా పలవరిస్తున్న అజ్ఞానులు కోకొల్లలు. ఏది మార్పు ? టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అనే సింపుల్ విషయం అర్థం కాని అమాయకత్వం అది. ఫ్లో లో వెళ్ళాలి అనుకొనే వారు .. ఇదే ట్రెండ్ అనుకొనే వారు .. మన పిల్లలు ఏదో సాధిస్తున్నారు అనుకొనే వారు .. ఇంకా కోట్లలో . ఈ లోగా యునెస్కో కుండబద్దలు కొట్టేసింది .

మొబైల్ అడిక్షన్ వల్ల కలిగే నష్టాన్ని అధికారికంగా తేల్చేసింది. కమిషన్ల ఆశతో హోమ్ వర్క్ ను మొబైల్ డివైసెస్తో ముడిపెట్టే పాఠశాల యాజమాన్యాలకు పచ్చి వెలక్కాయ గొంతుకు అడ్డుపడట్టయ్యింది. కరోనా కాలం లో ఆన్లైన్ క్లాసులను నేను సెలైన్ పెట్టుకోవడంతో పోల్చా. తీవ్ర రోగముండి ఐసీయూ లో ఉంటే తప్పదు . కానీ టిఫిన్ బాక్స్ కు బదులు సెలైన్ పెట్టుకొని రోజూ ఇంటినుంచి బయటకు వెళుతామా? వారం రోజులు వానపడితే (వాన పడింది గట్టిగా రెండు రోజులే ) ఆన్లైన్ క్లాసులు షురూ చేసిన స్కూల్స్ .

"పక్కన ఉన్న అన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు నడుపుతుంటే మీరెందుకు చేయరు?" అని మొన్న ఒక పేరెంట్ మెసేజ్ . "వెంటనే వారు కట్టిన ఫీజు వాపసు ఇచ్చేయండి .. ఆన్లైన్ క్లాసులు పెడుతున్న స్కూల్ లో అబ్బాయి ని చదివించడానికి వీలుగా టీసీ ఇచ్చేయండి " నా ఆర్డర్ . చివరకు పేరెంట్ కు తత్త్వం బోధపడింది. సారీ చెప్పారు "మాకు సెల్ ఫోన్ వల్ల కలిగే నష్టం అర్థం అయ్యింది. కానీ ఏమి చెయ్యాలి ?"... అని ఇంకా చాలా మంది ఇంట్లో బాంబు పెట్టుకొంటే పేలుతుంది . ఏమి చేస్తాము ? ఇంట్లో బాంబు పెట్టుకోము . ఇదీ అంతే. "పెద్దాళ్ళకు తప్పని సరి. ఆఫీస్ వర్క్ కోసం సెల్ ఫోన్. ఇది అట వస్తువు కాదు. మీ మెదళ్ళు సెల్ ఫోన్ వల్ల వంద రెట్లు అధికంగా ప్రభావితం అవుతాయి , కాబట్టి వద్దు" అని పిల్లలకు నచ్చ చెప్పి వారు సెల్ ఫోన్ వాడకుండా చూడాలి .

మాట వినకపోతే కౌన్సిలింగ్ చేయించాలి . సమస్య జటిలం. పరిష్కారం అంత సులభం కాదు. సంవత్సరాల తరబడి అధిక తిండి తిని ఒంట్లో కిలోల కొద్దీ అధిక కొవ్వును పేరపెట్టుకొన్న వారు ఏమి చెయ్యాలి ? తిన్నప్పుడు పొందిన సుఖాన్ని గుర్తు చేసుకొంటూ దానికి ప్రాయచ్చితం అన్నట్టు సరైన తిండి తినాలి . వ్యాయామం చెయ్యాలి. అబ్బే ఇంత కష్టం మేము పడలేము. ఏదైనా సింపుల్ మార్గం ఉంటే చెప్పండి అని లక్షల్లో అనుకొంటున్నారు. అలాంటి బకరాల కోసం డబ్బాల్లో మూలికా మందులు వచ్చాయి. అవి జస్ట్ ఒక స్పూన్ తింటే సరిపోతుంది అని ప్రచారం. ఈజీ మార్గం కదా అని లక్షల మంది. దాన్ని తిని కిడ్నీలు నాశనం చేసుకొన్న వారు వేలమంది.

అయినా ఆగదు. ఆగితే వారి బిజినెస్ సాగదు బలహీనతల్ని కాష్ చేసుకోవడంలో ఫార్మసురులకు మించిన వారెవరూ ఉండరు. నువ్వు అధిక తిండి తింటే వాడికి డయాబెటిస్ బిజినెస్. కనీస ఆహార నియమాలు లేకుండా టెన్షన్ పెంచుకొని నువ్వు ఇమ్మ్యూనిటిని కుళ్ళపొడుచుకొంటే ... తుమ్ముకు.. దగ్గుకు... కాన్సర్కు.. జ్వరానికి.. ఒంటి నొప్పులకు ... చివరాఖరికి దురద కూడా వాక్సిన్‌లు .తిరుగు లేని బిజినెస్. అవి వేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొంటే బోనస్ బిజినెస్ .

ఇంతకీ కరోనా వాక్సిన్‌లు ఏమయ్యాబ్బా ? ముక్కు నోరు . చెవి.. ఇలా నవ రంద్రాల్లో వేసే వాక్సిన్‌లు .. వాటి మార్కెటింగ్ కోసం అదిగో చైనాలో కేసులు .. లాంగ్ కరోనా .. తొక్క... అంటూ విషపు రాతలు .. మరో పక్క కరోనా వాక్సిన్‌ వేసుకంటే కండ పుష్టి .. అంటూ మార్కెటింగ్ చేసే బ్రోకర్లు ... అరెరే .. ఎక్కడ పోయారబ్బా ? పిల్లి వచ్చే ఎలుక భద్రం అంటూ ఒక్క సారిగా మొత్తం మాయం అయిపోయారే. అన్నట్టు వారి ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు వేసుకోవాలిగా . ఆ లెక్కన ఇప్పుడు.. అయిదోదో ఆరోదో పొడుస్తుండాలిగా ? ఏంటి ఆగిపోయింది. ఇక ఇప్పుడు సెల్ ఫోన్ కు పిల్లలు బానిసలు అయిపోతుంటే... వాడిది రెహబ్ సెంటర్ బిజినెస్ . వాడిదేనా ?

తిలాపాపం తలా పిడికెడు..
పిల్లలు సెల్ ఫోన్ వాడడం మానేస్తే వాటి అమ్మకాలు సగానికి పడిపోతాయి. సెల్ ఫోన్ బిజినెస్ దెబ్బ తింటుంది. దానితో పత్రికలకు ప్రకటనలు తగ్గిపోతాయి. ఓయో హోటళ్ల బిజినెస్ డల్ అయిపోతుంది. గంజాయి దందా తగ్గిపోతుంది. చెప్పుకొంటూ పొతే లిస్ట్ కొండ వీటి చేంతాడంత. ఒకటి నిజం. తమ చుట్టూరా ఉన్న పిల్లలు సెల్ ఫోన్ వాడుతుంటే మన పిల్లలు అదే పని చెయ్యాలని చూస్తారు. అందుకే మేము రివర్స్ ఎటాక్ మొదలెట్టాము. మా పిల్లలు సెల్ ఫోన్ వాడరు. మీ ఇరుగు పొరుగు పిల్లలో చైతన్యం తెండి అని చెప్పాము . ఒక్కోక్కరూ కనీసం అయిదు మందికి .. ఈ వారం రోజుల వానల్లో అందరూ కలిసి కొన్ని వేల మంది పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చారు .

"సెల్ ఫోన్ వద్దు. ఆటలు ఆడుకోండి. బాల్యాన్ని ఎంజాయ్ చెయ్యండి. జంక్ ఫుడ్ వద్దు . ఆరోగ్య కరమయిన ఆహారం తీసుకోండి" అని ఎలుగెత్తి చాటారు. మార్పు వస్తుందా ? వస్తుంది. అవతలి వారికి చెప్పడమంటే తమకు తాము చెప్పుకోవడం. ఈ విధంగా మా పిల్లల్లో ఆ భావన మరింత దృడంగా .. పక్కింటి పిల్లలో .. ముఖ్యంగా వారి తల్లితండ్రుల్లో అవగాహన. వారు ఇప్పుడైనా నిద్ర లేస్తే బయటపడతారు . లేకుంటే రేపు దారుణాలకు మూగ సాక్ష్యంగా మిగిలి పోతారు.

ఒక స్కూల్ ఇలా చేస్తోంది . మీరు ఇలా ఎందుకు చెయ్యరు అని ప్రతి ఒక్కరు తమ పిల్లలు చదువుతున్న స్కూల్ యాజమాన్యాలను ప్రశ్నిస్తే ? ఎన్నికలు రాబోతున్నాయి. మీ డ్రామాలు, గోవా ఫైటింగ్లు ఆపండి. బాల లోకాన్ని పీడిస్తున్న ఈ వ్యసనం పై మీ స్టాండ్ ఏంటి ? యునెస్కో చెప్పాక కూడా నిద్ర నటిస్తారా ?" అని ప్రతి రాజకీయనాయకుడ్ని, పార్టీని ప్రశ్నిస్తే .. మార్పు రాదా ? ప్రశ్నించడం ఆంటే వీధుల్లోకి పోనక్కర లేదు.

జస్ట్ సోషల్ మీడియాను వేదికగా చేసుకొంటే చాలు. ఇంకా... స్వచ్చంద సేవ సంఘాలు .. ప్రజా సంఘాలు .. సినిమా హీరోలు .. అబ్బో సమాజం శక్తి కొంచమయ్యిందా ? ముందుకు రావాలి. రావాలి... బాబూ... రావాలి . రాక పొతే చరిత్ర హీనులయి పోతారు . ఎవరో వస్తారని .. ఏదో చేస్తారని .. నిజం మరిచితే నిదురోతే? కరోనా రెండో వేవ్ .. అటు పై వాక్ సీన్ సైడ్ ఎఫెక్ట్స్ కంటే... దారుణాలు ఖాయం . ఇది శాపనార్థం కాదు . హెచ్చరిక దండోరా ! మార్పు మనింటి నుంచే మొదలు కావాలి .
 




వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, విద్యావేత్త

(చదవండి: మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement