Addiction
-
ఫోన్ లేకుంటేనే సూపర్ బ్రెయిన్!
మనిషి జీవితం ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌తోనే నడుస్తోంది. అలాంటిది అది లేకుండా ఒక్కరోజైనా ఉండగలమా?. ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. అంతలా అడిక్ట్ అయ్యాం మరి!. అయితే ఫోన్ వాడకం వీలైనంత తగ్గించుకోవాలని తరచూ నిపుణులు సూచిస్తుండడం చూస్తుంటాం. ఈ క్రమంలో తాజా పరిశోధనల్లో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. స్మార్ట్ ఫోన్లను వీలైనంత తక్కువగా(Smart phone Less Use) ఉపయోగించడం వల్ల మెదడు అత్యంత చురుకుగా పని చేస్తుందట. జర్మనీకి చెందిన కోలోగ్నే, హెయిడెల్ బర్గ్ యూనివర్సిటీ సైంటిస్టులు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఇందుకోసం త్రీడేస్ చాలెంజ్‌ను కొంతమందిపై ప్రయోగించారు. ఎంపిక చేసిన 18 నుంచి 30 ఏళ్లలోపు 25 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు. సుమారు 72 గంటలపాటు(దాదాపు మూడు రోజులు) కేవలం అత్యవసర వినియోగానికి మాత్రమే వాళ్లకు ఫోన్‌కు అనుమతించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా అడిక్షన్‌ను కూడా పరిశీలించారు. రీసెర్చ్‌కు ముందు.. తర్వాత ఆ వ్యక్తులకు ఎమ్మారై స్కాన్‌తో పాటు కొన్ని మానసిక పరీక్షలు నిర్వహించారు. పరిశోధనల్లో తేలింది ఏంటంటే.. ఫోన్ తక్కువగా వాడిన వాళ్లలో బ్రెయిన్ అత్యంత చురుకుగా ఉండడం. అంతేకాదు.. వ్యసనానికి సంబంధించిన ‘‘న్యూరోట్రాన్స్మిటర్ వ్యవస్థ’’కు సంబంధించిన మెదడు క్రియాశీలతలోనూ మార్పులను గమనించారట. తద్వారా ఫోన్‌కు ఎంత దూరంగా ఉంటే.. బ్రెయిన్ అంత ‘సూపర్’గా మారుతుందని ఒక అంచనాకి వచ్చారు. సుదీర్ఘంగా.. పదే పదే జరిపిన పరిశోధనలన (longitudinal Study) తర్వాతే తాము ఈ అంచనాకి వచ్చినట్లు చెబుతున్న పరిశోధకులు.. భవిష్యత్తులో మరింత స్పష్టత రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సామ్ ఏం చెప్పిందంటే..ఇక్కడో ఆసక్తికరమైన సంగతి చెప్పాలి. ప్రముఖ నటి సమంత ఈ మధ్యే త్రీడేస్ చాలెంజ్‌ను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేశారు. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టిన ఆమె.. మూడు రోజులు ఫోన్‌కు దూరంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు.. ఆ అనుభవాన్ని తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘‘మూడు రోజులపాటు ఫోన్ లేదు. ఎవరితో కమ్యూనికేషన్ లేదు. నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాల్లో ఒకటి. భయంకరమైనది కూడా. కానీ, ఇలా మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్‌సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను. మీరు కూడా ఇలా ఉండటానికి ప్రయత్నించండి’’ అంటూ అభిమానులకు ఆమె సూచన ఇచ్చారు కూడా. -
టెక్నాలజీ ఊబిలో భారతీయులు
భారతీయులు ఉదయం లేచించి మొదలు రాత్రి పడుకునేదాకా ఎల్రక్టానిక్ డివైజ్లతో గడుపుతున్నారు. డెస్క్ టాప్‌తో మమేకమవుతారు. డెస్క్ టాప్ నుంచి తల పక్కకు తిప్పితే నేరుగా ల్యాప్‌టాప్‌లో తలదూర్చేస్తారు. ఒకవేళ ల్యాప్‌టాప్ పక్కనబెడితే స్మార్ట్‌ఫోన్ లేదంటే ట్యాబ్ లేదంటే ఇంకో డివైజ్‌కు దాసోహం అవుతున్నారు. దీంతో ఎన్నో సమస్యలు. తక్కువ నిజాలు, ఎక్కువ అబద్ధాలతో కూడిన సమాచారాన్ని మాత్రమే నమ్మడం, సోషల్‌మీడియా లో ప్రతికూల వార్తలనే ఎక్కువగా ఫాలో అవడం, ఫోన్ రింగ్ కాకపోయినా వచ్చినట్లు, మెసేజ్ రాకపోయినా వచ్చినట్లు భావించడం, అతి డివైజ్‌ల వాడకంతో సాధారణ విషయగ్రహణ సామర్థ్యం సన్నగిల్లడం, ఒంటరిగా ఉంటేనే బాగుందని అనిపించడం, వెంటనే స్పందించే గుణం కోల్పోవడం, అతి ఉద్రేకం లేదంటే నిస్సత్తువ ఆవహించడం, ఏకాగ్రత లోపం.. ఇలా ఎన్నో సమస్యలకు ఎల్రక్టానిక్ డివైజ్‌లు హేతువులుగా మారాయి. వాటి అదుపాజ్ఞల్లోకి వెళ్లకుండా వాటినే తమ అదుపాజ్ఞల్లో పెట్టుకున్న భారతీయులు కేవలం మూడు శాతమేనని తాజా సర్వే కుండబద్దలు కొట్టింది. దాదాపు 83,000 కౌన్సిలింగ్ సెషన్లు, 12,000 స్క్రీనింగ్‌లు, 42,0000 అంచనాలను పరిశీలించి చేసిన సర్వేలో ఇలాంటి ఎన్నో విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. డిజిటల్ డివైజ్లతో సహవాసం చేస్తూ భారతీయులు ఏపాటి మానసిక ఆరోగ్యంతో ఉన్నారనే అంశాలతో వన్టూవన్హెల్ప్ అనే సంస్థ ‘ది స్టేట్ ఆఫ్ ఎమోషనల్ వెల్బీయింగ్,2024’అనే సర్వే చేసి సంబంధిత నివేదికను వెల్లడించింది. సగం మంది డివైజ్‌లను వదల్లేక పోతున్నారు సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది తమ ఎల్రక్టానిక్ డివైజ్‌లను వదిలి ఉండలేకపోతున్నారు. మరో పది శాతం మందికి డిజిటల్ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో తెలీక సతమతమవుతున్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి కౌన్సిలింగ్ తీసుకుంటున్న వారి సంఖ్య 15 శాతం పెరిగింది. ఆదుర్తా, కుంగుబాటు, పనిచేసే చోట ఒత్తిడి వంటి ప్రధాన కారణాలతో ప్రజలు మానసిక ఆరోగ్యం బాగు కోసం నిపుణులను సంప్రతించడం పెరిగింది. వృత్తిసంబంధ అంశాల్లో సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో 23 శాతం మంది తాము పనిచేసేచోట ప్రతికూల వాతావరణంలో పనిచేస్తున్నట్లు తేలింది. ఇది ఆరోగ్యవంతమైన పని వాతావరణం ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. కౌన్సిలింగ్ కోసం పురుషుల్లో పెరిగిన ఆసక్తి గతంలో ఏదైనా థెరపీ చేయించుకోవాలన్నా, మానసికంగా ఒక సాంత్వన కావాలంటే ఒకరి తోడు అవసరమని మహిళలు భావిస్తుంటారు. మగాడై ఉండి థెరపీ చేయించుకోవడమేంటనే ఆలోచనాధోరణి ఇన్నాళ్లూ పురుషుల్లో ఉండేది. ఇప్పుడు ఆ ధోరణిలో కాస్తంత మార్పు వచ్చింది. గతంతో పోలిస్తే 7 శాతం మంది ఎక్కువగా పురుషులు థెరపీలు సిద్ధపడుతున్నారు. ఆర్థికసంబంధ కన్సల్టేషన్లు పొందిన వారిలో 70 శాతం మంది పురుషులే ఉన్నాయి. ఇక మానవీయ సంబంధాలకు సంబంధించిన కౌన్సిలింగ్ సెషన్లలో 60 శాతం దాకా మహిళలే కనిపించారు. యువతలో పెరిగిన మానసిక సమస్యలు ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువతలో నైరాశ్యం పెరుగుతోంది. 30 ఏళ్లలోపు వయసు యువతలో అత్యధికంగా ఆదుర్దా, కుంగుబాటు సమస్యలు ఎక్కువయ్యాయి. ఉద్యోగం మారాల్సి రావడం, జీవితభాగస్వామితో సత్సంబంధం కొనసాగించడం వంటి అంశాలకొచ్చేసరికి యువత ఆత్రుత, కుంగుబాటుకు గురవుతోంది. పాతికేళ్లలోపు యువతలో 92 శాతం మందిలో ఆత్రుత, 91% మందిలో కుంగుబాటు కనిపిస్తున్నాయి. ఆత్మహత్య భయాలూ ఎక్కువే ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్న వారి సంఖ్య గతంతో పోలిస్తే 22 శాతం పెరిగింది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పిన వాళ్ల సంఖ్య 2023తో పోలిస్తే 17 శాతం పెరగడం ఆందోళనకరం. తమకు కౌన్సిలింగ్ అవసరమని భావిస్తున్న వారిలో సగం మంది ఇప్పటికే తీవ్రమైన భావోద్వేగ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఎక్కువ మందికి తక్షణం మానసిక సంబంధ తోడ్పాటు అవసరమని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే భారతీయుల్లో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన బాగా పెరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆన్లైన్ షాపింగ్‌లో బిజీనా.. అయితే బీకేర్‌ఫుల్!
ఐరన్ మ్యాన్ 3 టీ షర్ట్ కావాలా.. ఆన్‌లైన్‌కు వెళ్లు, బ్లూటూత్ అవసరమా నెట్లో చూడు.. లంచ్‌కి వెజిటబుల్స్ లేవా జొమాటోలో ఆర్డర్ పెట్టు.. ఇది ప్రస్తుతం నగరంలో నడుస్తోన్న కొత్త రకమైన మానియాగా వైద్యులు చెబుతున్నారు.. నగరవాసుల ధోరణిలోనూ ఇదే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. గృహిణులకు, విద్యార్థులకు, సమయాభావంతో షాపింగ్‌కు వెళ్లలేని వారికి అత్యంత సౌకర్యంగా ఉంటున్న ఈ షాపింగ్ ట్రెండ్.. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు కొందరిలో తీవ్రస్థాయి వ్యసనంగా మారడం ఆందోళనకర పరిణామం అని నిపుణులు చెబుతున్నారు. తొలుత దీనిని ‘కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్’గా పేర్కొన్న సైకాలజిస్ట్స్.. ఇప్పుడు తీవ్రత దృష్ట్యా ఈ వ్యాధికి ఒనియోమానియా అని నామకరణం చేశారు. ఈ వ్యాధి బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జర్మనీలోని హన్నోవర్ మెడికల్ స్కూల్ పరిశోధకులు ‘కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్’ అని పేర్కొనే వ్యాధి ఆధునికుల్లో ముదురుతోందని గుర్తించారు. ‘దీనిని ప్రత్యేక మానసిక ఆరోగ్య స్థితిగా గుర్తించడానికి ఇది సరైన సమయం’ అని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన ఆస్ట్రిడ్ ముల్లర్ అన్నారు. కాంప్రహెన్సివ్ సైకియాట్రి అనే జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 5% మంది పెద్దలను సీబీడీ ప్రభావితం చేస్తోంది. ప్రతి 20 మందిలో ఒకరు దీని బారిన పడుతున్నారని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ వెల్లడించింది. వీరిలో ముగ్గురిలో ఒకరు తీవ్రమైన ఆన్లైన్ కొనుగోలు వ్యసనంతో బాధపడుతున్నారు. ఇప్పుడు దీనినే ఒనియోమానియాగా వ్యవహరిస్తున్నారు. ఒనియోమానియా అనేది గ్రీకు భాషలోని ‘ఒనియోస్‘ అనే పదం నుంచి ఉద్భవించింది, ఇది ‘ఉన్మాదం’, ‘పిచ్చితనం’ అనే దానిని సూచిస్తుంది. కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్ (సీబీడీ) ముదిరి ఆరోగ్యంపై ప్రతికూల ఫలితాలకు దారితీసే స్థాయిని షాపింగ్ ద్వారా నిర్ధారిస్తారు. తక్షణ ఉత్సాహం కోసం.. ఆన్లైన్ షాపింగ్ వ్యసనపరులం అయ్యామా లేదా అనేదానికి సమాధానంగా వారం రోజుల్లో మనం ఎన్ని ప్యాకేజీలను రిసీవ్ చేసుకున్నాం? అనేది లెక్కిస్తే సరి అంటున్నారు కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్ అంకుర్ సింగ్. ఆన్లైన్ షాపింగ్ వ్యసనాన్ని కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్ దాటి ఒనియోమానియాగా పిలుస్తున్నామని, ఇది జీవితంలో ప్రతికూల పరిణామాలకు దారితీసే అతి పెద్ద ప్రవర్తనా సమస్య అని హెచ్చరించారు. ఈ ఆన్లైన్ షాపింగ్ తక్షణ ఆనందాన్ని ఉత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. హార్మోన్లపై ప్రభావం.. కొనుగోలు వల్ల కలిగే ఉత్సాహంతో బాక్స్‌ను ఓపెన్ చేసిన మరుక్షణమే డోపమైన్ హోర్మోన్ విడుదలవుతుంది. ఇది మరింత షాపింగ్ చేయాల్సిన అవసరాన్ని తెస్తుందని అంకుర్ వివరించారు. దీంతో ఒత్తిడి, ఆందోళన, నిరాశ లేదా ఒంటరితనాన్ని ఎదుర్కోడానికి షాపింగ్‌ను ఒక మార్గంగా ఉపయోగించడం పెరుగుతోందని, చివరికి మరింత తీవ్ర ఒత్తిడికి దారి తీస్తోందని విశ్లేషించారు. షాపింగ్ నుంచి పొందిన తాత్కాలిక ఉపశమనం లేదా ఆనందాన్ని పదే పదే కోరుకోవడం, మాదకద్రవ్య దురి్వనియోగానికి సమానమైన వ్యసనాన్ని సృష్టించగలదని హెచ్చరించారు.నష్టాలెన్నో.. సాధారణ వ్యక్తిగత షాపింగ్ సరదా ఎవరికీ హానికరం, లేదా బాధించేది కాదని చాలా మంది భావించవచ్చు. అయితే, ఇది స్థూల ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది. ప్రత్యేకించి భాగస్వాములిద్దరూ ఉమ్మడి ఆర్థిక ఖాతాను కలిగి ఉన్న సందర్భాల్లో.. ఇది కొనుగోళ్లను దాచిపెట్టమని ప్రేరేపిస్తుంది. ఇది నెమ్మదిగా అపరాధ భావం లేదా అవమానం, ఆందోళన, నిరాశ, ఆత్మగౌరవం లోపించడం వంటి భావనలను కలిగిస్తుంది. ఈ ప్రవర్తన సామాజిక ఒంటరితనానికి దారితీయవచ్చు. వ్యక్తులు తమ షాపింగ్ అలవాట్లపై నియంత్రణ కోల్పోవచ్చు. ఇది ఆకస్మిక నిర్ణయాలకు దారి తీస్తుందని, ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ ఆపలేకపోవడం వ్యాధి తీవ్రతకు చిహ్నమని, ఈ అలవాటు అనుబంధాలపై సైతం వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తు పొదుపు వంటి దీర్ఘకాలిక లక్ష్యాలపైనా వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని సూచిస్తున్నారు. ఇలా వదులుకోవాలి.. ⇒ ఆన్లైన్లో గడపడం కన్నా వ్యాయామం చేయడం, స్నేహితులతో ముచ్చట్లు వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిచాలి. ⇒ విచక్షణతో కూడిన ఖర్చుల కోసం కఠినమైన బడ్జెట్‌ను సెట్ చేసుకోవాలి. పరిమితుల్లో ఉండేలా ఖర్చులను నిర్ణయించుకోవాలి. ⇒ ప్రచార ఈ మెయిల్స్ నుంచి సబ్స్క్రిప్షన్స్ తీసేయడం, ఫోన్ వగైరా డివైజ్‌ల నుంచి షాపింగ్ యాప్‌లను తగ్గించేయాలి. ⇒ తరచూ షాపింగ్ వెబ్సైట్లను సందర్శించకుండా నియంత్రించుకోవాలి. ⇒ అవసరం లేని వస్తువులను జాబితా తయారు చేసి పొరపాటున కూడా అవి కొనుగోలు చేయవద్దని నిర్ణయించుకోవాలి. మొదటి పది ఇవే.. నగరవాసులు అత్యధికంగా ఈ–షాప్ చేస్తున్నవాటిలో అగ్రస్థానంలో పుస్తకాల కొనుగోలు ఉంటే, ఆ తర్వాత వరుసగా దుస్తులు, మూవీ టిక్కెట్స్, ప్రయాణ టిక్కెట్లు, యాక్సెసరీస్, కార్డ్స్, డిజిటల్ డివైజ్‌లు, ఫుట్‌వేర్, గృహోపకరణాలు, బ్యూటీ ప్రొడక్ట్స్.. వగైరా ఉన్నాయి. ఇక ప్రస్తుతం మన వాళ్లు తరచూ సందర్శిస్తున్న షాపింగ్ సైట్లలో.. స్నాప్ డీల్, అమెజాన్, ఇబే, మింత్ర, జెబాంగ్, ఫ్లిప్‌కార్డ్, షాప్‌క్లూస్, దేశీడైమ్, ఫ్యాషన్ ఎన్ యు.. వంటివి ఉన్నాయి.నగరమా బీకేర్‌ఫుల్.. కరోనా మహమ్మారితో లాక్డౌన్ వల్ల నగరవాసులు ఫిజికల్ స్టోర్లను విస్మరించి, ఆన్లైన్లో ఆర్డర్ చేసేలా అలవాటుపడ్డారు. పైగా నగరంలో ఒక చోటు నుంచి మరోచోటుకు రాకపోకలకు ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు..వంటివి దృష్టిలో పెట్టుకుని గత కొన్ని సంవత్సరాలుగా ఇ–కామర్స్ విపరీతంగా పెరిగింది. అంతేకాక స్మార్ట్ఫోన్ల వినియోగం ఆన్లైన్ షాపింగ్ విజృంభణకు ఆజ్యం పోసింది. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ పరంగా 5.73 శాతంతో నగరం దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. కాగా రంగారెడ్డి జిల్లా తొమ్మిదో స్థానంలో ఉండడం గమనార్హం. నానాటికీ విస్తరిస్తున్న వ్యాపార వ్యూహాలను గమనిస్తే.. త్వరలోనే నగరం టాప్‌కి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని, దీంతో పాటే వ్యసనబాధితుల సంఖ్యలోనే అగ్రగామి కావడం జరగవచ్చని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. కేవలం పుస్తకాలే.. తొలుత దాదాపు 50 పుస్తకాలకు పైగా ఆన్లైన్ ద్వారానే కొన్నాను. అలా అలా ఇప్పుడు రెగ్యులర్ ఈ–షాపర్ అయిపోయా. కేవలం పుస్తకాలే కాకుండా టేబుల్స్, టెక్నికల్ ఎక్విప్మెంట్ కూడా ఆన్లైన్లోనే కొంటున్నాను. – నికుల్గుప్తాతక్కువ ధరలకు.. నగరంలోని షోరూమ్‌లు అందించే వాటికన్నా.. ఆన్లైన్ ద్వారానే ఎక్కువ లేటెస్ట్ వెరైటీలు దొరుకుతాయి. బర్త్‌డే లేదా పార్టీ, ఫంక్షన్‌కు తగినవి, లేటెస్ట్ ఫ్యాషనబుల్ గూడ్స్ ఇంటి నుంచే సులభంగా యాక్సెస్ చేయవచ్చు. అందుకే ప్రస్తుతం షాపింగ్‌లో దాదాపు 70 శాతం ఆన్లైన్ మీదే. – పూజానేతి -
సోషల్ మేనియా!
సాక్షి, అమరావతి: ఐటీ ఉద్యోగి ప్రవీణ్‌కుమార్ అందరితో ఇట్టే కలిసిపోతాడు. స్నేహితులు ఎక్కువ. అతను ఎక్కడుంటే అక్కడ సందడే. ఆఫీసులో బాస్ నుంచి గేటు వద్ద గార్డు వరకు ప్రవీణ్‌ను ఇష్టపడని వారు ఉండరు. ఏడాది కాలంగా అతను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారాడు. సామాజిక, రాజకీయ అంశాలపై అతను పెడుతున్న పోస్టులకు మెచ్చుకొనే వారికంటే విమర్శించే వారే ఎక్కువయ్యారు. తనని తక్కువ చేసి కామెంట్ చేసే వారిలో రోజూ తనతో తిరిగే స్నేహితులు, కొలీగ్స్ సైతం ఉండడం చూసి విస్తుపోయాడు. ప్రస్తుతం దేశంలో 65 శాతం యువత పరిస్థితి ఇదే అని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) తాజా అధ్యయనంలో తేలింది.రెండు వైపులా పదునున్న సోషల్ మీడియా ఇప్పుడు భారతీయ యువత మెడకు చుట్టుకుంటోంది. ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్, ఫేస్బుక్ వంటివి కోట్లాది విద్యార్థుల రోజువారీ జీవితంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం దేశంలో దాదాపు 400 మిలియన్ల యువత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నట్టు సర్వేలో తేలింది. టీనేజర్లు ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో 3 గంటల కంటే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దేశంలో 2025 చివరికి 72% మంది సోషల్ మీడియా వినియోగదారులుగా ఉంటారని అంచనా. ప్రపంచంలోని చాలా దేశాల్లో యువత కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఉపయోగపడుతున్న ఈ ఫ్లాట్‌ఫారాలు.. భారత్‌లో మాత్రం మానసిక ఆరోగ్యం, విద్యలో వెనుకబాటు, భావోద్వేగాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తూ శత్రువులను పెంచుతున్నట్టు గుర్తించారు.బహిరంగ చర్చ మేలు చేస్తుందిపరిస్థితి ఇలాగే కొనసాగితే నేర్చుకునే సామర్థ్యం, శ్రమించే బలం ఉన్న భారతీయ యువత నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల మధ్య బహిరంగ చర్చలు జరగాలని, ఇది సోషల్ మీడియా ప్రతికూల ప్రభావాలను నివారిస్తుందని చెబుతున్నారు. మహారాష్ట్రలో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానం అమలు చేయడం ద్వారా సోషల్ మీడియా సపోర్ట్ గ్రూపుల్లో యాక్టివ్‌గా ఉన్న విద్యార్థుల్లో 25 శాతం మంది ఆ వ్యసనం నుంచి బయటపడినట్టు గుర్తించారు.52%మంది సైబర్ మోసాలకు బలివిద్యార్థులందరికీ విద్యలో డిజిటల్ అక్షరాస్యతను తప్పనిసరి చేయడం చాలా అవసరమని, చాలామంది భారతీయ విద్యార్థులకు ఆన్లైన్ స్పేస్‌ను సురక్షితంగా నావిగేట్ చేసే నైపుణ్యాలు లేవని అధ్యయనంలో తేల్చారు. దీంతో తప్పుడు సమాచారం, సైబర్ బెదిరింపు, మోసాలకు గురవుతున్నారని గుర్తించారు. సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం కేవలం 25 శాతం విద్యార్థులు మాత్రమే ఆన్లైన్ గోప్యత సెట్టింగ్‌లను అర్థం చేసుకుంటారని వెల్లడైంది. చాలామంది వ్యక్తిగత సమాచారాన్ని ఎలాంటి గోప్యతా లేకుండా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని, ఇలాంటి వారిలో 52 శాతం మంది సులభంగా సైబర్ మోసాల బారిన పడుతున్నారని ఐసీఎస్ఎస్ఆర్ సర్వేలో తేలింది. 2023లో ఒక అధ్యయనం ప్రకారం డిజిటల్ లిటరసీపై శిక్షణ పొందిన విద్యార్థుల్లో 78 శాతం మంది సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. పాఠ్యాంశాల్లో డిజిటల్ మీడియా, మానసిక ఆరోగ్యంపైనా అవగాహన పెంచే అంశాలను చేర్చడం ద్వారా సమస్యను నివారించవచ్చని చెబుతున్నారు.వ్యసనంలా సోషల్ మీడియానేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్) ఇటీవలి నివేదిక ప్రకారం.. » దేశంలోని 27 శాతం టీనేజర్లలో సోషల్ మీడియా డిపెండెన్సీ లక్షణాలను గుర్తించారు.» ఇది ఏకాగ్రత లోపానికి, చెడు వ్యసనాలకు, చదువులో వెనుకబాటుతో పాటు మానసిక అనారోగ్య పరిస్థితులకు దారితీస్తోంది.» ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చూసుకోవడం, 30 నిమిషాలకోసారి పోస్టులు, నోటిఫికేషన్లను తనిఖీ చేయడం పరిపాటిగా మారింది. వాటికి అప్డేట్స్ను పోస్ట్ చేయడం, స్క్రోలింగ్ ఫీడ్స్ చూడడంలో బిజీ అయిపోయి పరిసరాలను సైతం మరిచిపోతున్నారని గుర్తించారు.» తమ పోస్టులకు తెలిసిన వారు రిప్లై ఇవ్వకపోయినా కోపం తెచ్చుకుంటున్నారు. ఇది శత్రుత్వానికి దారితీస్తోంది.»అతిగా స్క్రీన్కు అతుక్కుపోవడంతో నిద్ర లేమి రుగ్మతలు ఎదుర్కొంటున్నారు. దేశంలోని 40 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు సోషల్ మీడియాను లేట్ నైట్ వరకు ఉపయోగించడంతో తమకు మంచి నిద్ర, సరైన విశ్రాంతి లభించడంలేదని చెప్పారు.» ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) సర్వే ప్రకారం భారతీయ యువకుల్లో 65 శాతం మంది స్నేహితులకు వ్యతిరేకంగా మారినట్టు అంగీకరించారు. ఫోన్ చూడవద్దన్నందుకు 10 ఏళ్ల లోపు పిల్లలు తల్లిదండ్రులను శత్రువులుగా భావిస్తున్నారని గుర్తించారు. పిల్లల స్క్రీన్ టైమ్‌పై కఠినమైన పరిమితులు ఉంటే సోషల్ మీడియాపై ఆధారపడటం 30 శాతం తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. -
పొద్దస్తమానం సోషల్ మీడియాలోనే!
డాక్టరు గారూ! నా కూతురు వయస్సు 16 సంవత్సరాలు. తను ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతోంది. అక్కడ ఎక్కువగా అబ్బాయిలతో చాట్ చేయడం, తన ఫోటోలు పెట్టడం చేస్తోంది. మేము ఆంక్షలు పెట్టినప్పుడు విపరీతమైన కోపాన్ని, భావోద్వేగాలను ప్రదర్శించడం, మందలిస్తేనేమో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం సాధారణం అయ్యాయి. ఈ మధ్య చదువు మీద శ్రద్ధ పూర్తిగా తగ్గిపోయింది. మీ సలహా కోసం ఎదురు చూస్తుంటాం. –స్రవంతి, మహబూబ్నగర్మీరు పడుతున్న వేదన అర్థమవుతోంది. ఈ మధ్య ఇలాంటి సమస్యలను తరచూ గమనిస్తున్నాం. మీ అమ్మాయికి ఉన్న కండిషన్‌ని ‘బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్’ అంటారు. ఇందులోని ప్రధానమైన లక్షణాలు అస్థిరమైన సంబంధాలు, విపరీతమైన భావోద్వేగాలు ఆత్మహత్య బెదిరింపులు, ఆత్మహత్యా ప్రయత్నాలు. వీటికి తోడు మీరు చెప్పినట్టు స్నేహితులను మార్చడం, సంబంధాల స్వభావం కూడా ఈ సమస్యకి సంబంధించినవే! మీ అమ్మాయిని ఒక మంచి సైకియాట్రిస్టుకి చూపించి ఈ సమస్య కోసం వైద్య చికిత్స (మందులు) మానసిక చికిత్స (థెరపీ) ఇప్పించాలి. ‘డయలెక్టికల్ బిహేవియర్ థెరపీ’ ఆత్మ నియంత్రణను, మానవ సంబంధాలను మెరుగుపరుస్తుంది. సోషల్ మీడియా వినియోగంపై నిర్దిష్ట నిబంధనలు పెట్టడం మంచి ఆలోచన. నిర్ణీతగంటల్లో మాత్రమే ఉపయోగించడం, ఖచ్చిత సమయానికి పరిమితం చేయడం వంటివి, స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవలకు స్వచ్ఛందంగా సహాయం చేయడం తన పరిస్థితిని మెరుగు పరుస్తాయి.ఆమెతో మాట్లాడేటపుడు తన భావనలను గౌరవిస్తూనే, తనకు సరైన గైడెన్స్ ఇవ్వండి. తన పరిస్థితి మెరుగుపడడానికి సమయం, సహనం అవసరం. అన్నింటికీ మించి మీ కుటుంబ సభ్యుల ప్రేమ ఎంతో అవసరం. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. ఆశాజనకంగా ఉండండి. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆల్ ది బెస్ట్. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com(చదవండి: లైఫ్ అంటే... పెళ్లి మాత్రమేనా?!) -
అమ్మే దిగివస్తే మత్తు దిగదా..
పంజాబ్‌లో హెరాయిన్‌ని ‘చిట్టా’ అంటారు. దీని అడిక్షన్లో పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్‌ను వ్యతిరేకించడానికి నేడు తల్లులే రంగంలోకి దిగారు. పంజాబ్‌లో ‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ మొదలైంది. నిజానికి ఇది ప్రతి రాష్ట్రంలో జరగాలి. డ్రగ్స్ నీడ లేని ఇల్లే సమాజానికి వెలుగు.పంజాబ్‌లో ‘డ్రగ్స్’ మహమ్మారి వ్యాపించి ఉంది. ప్రకృతిలోని మహమ్మారికి మందు ఉంది వాక్సిన్లు ఉన్నాయి... కాని ఈ మహమ్మారికి మందు లేదు. దీనిని నివారించాలంటే మానవశక్తి కావాలి. మహా శక్తి కావాలి. ఆ శక్తి తల్లే తప్ప మరెవరూ కాలేరని పంజాబ్‌లో ‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ ఉద్యమం మొదలైంది. ‘పంజాబ్ లిటరేచర్ ఫౌండేషన్’ అనే సంస్థ సెప్టెంబర్ 15న హోషియార్‌పూర్‌లో ఈ ఉద్యమం మొదలెట్టింది. ఈ కార్యక్రమానికి తల్లులు భారీగా తరలి వచ్చారు. పిల్లలు వ్యసనాల బారిన పడితే కడుపుకోతకు గురయ్యేది మొదట తల్లులే. పిల్లల్ని కాపాడుకోవాల్సింది మొదట వారే.13 నుంచి 18 ఏళ్ల మధ్యలోపిల్లల వయసు 13 నుంచి 18 ఏళ్ల మధ్య వరకు తల్లులు వారిని జాగ్రత్తగా గమనించుకుంటే డ్రగ్స్ నుంచి కాపాడుకోవచ్చని ‘పంజాబ్ లిటరేచర్ ఫౌండేషన్’ స్థాపకుడు, రచయిత కుష్వంత్ సింగ్ అన్నాడు. పంజాబ్‌లోని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఆయన ‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ ఉద్యమానికి అంకురార్పణ చేశాడు. ‘పంజాబ్‌లో 13 నుంచి 18 ఏళ్ల మధ్యలో పిల్లలు డ్రగ్స్‌కు పరిచయం అవుతున్నారు. 14 నుంచి 24 ఏళ్ల మధ్య వీళ్లు అడిక్ట్స్‌గా మారుతున్నారు. వీరిని తీసుకెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్స్‌లో పడేస్తే మారే వారు ఒక శాతం మాత్రమే ఉంటున్నారు. అంటే డ్రగ్స్ బానిసత్వం ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవాలి’ అన్నాడాయన. ‘పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా గత సంవత్సరం చండీగఢ్ నుంచి భగత్ సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలాన్ వరకూ పాదయాత్ర చేసినప్పుడు దారిలో ఎందరో తల్లులు వచ్చి మా పిల్లలు బాగుపడే మార్గం లేదా అని అడిగేవారు. తల్లులే మొదటి రక్షకులుగా మారితే పిల్లలను డ్రగ్స్‌వైపు వెళ్లకుండా ఆపొచ్చని నాకు అనిపించింది. దాని ఫలితమే ఈ ఉద్యమం’ అని తెలిపాడతడు.మంచాలకు సంకెళ్లుపంజాబ్లో హెరాయిన్ వ్యసనపరులు లెక్కకు మించి ఉన్నారు. దీనిని అక్కడ ‘చిట్టా’ అంటారు. దాని కోసం పిల్లలు ఎంతకైనా తెగిస్తారు. వారిని డ్రగ్స్ కోసం వెళ్లకుండా ఉంచేందుకు తల్లిదండ్రులు మంచాలకు సంకెళ్లు వేసి కట్టేసి ఉంచడం సర్వసాధారణం. పంజాబ్‌లో కొన్ని ఊళ్లు డ్రగ్స్ వల్ల చని΄ోయిన వ్యక్తుల భార్యలతో నిండి ‘వితంతువుల పల్లెలు’గా పేరు పడటం సమస్య తీవ్రతను తెలుపుతుంది.తల్లులకు ట్రైనింగ్ ఇస్తేమదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్ ఉద్యమంలో తల్లులను ఒకచోట చేర్చి డ్రగ్స్ గురించి అవగాహన కలిగిస్తారు. ఉదాహరణకు ఢిల్లీకి చెందిన గౌరవ్ గిల్ అనే బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నవారి శారీరక కదలికలు ఎలా ఉంటాయి, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ సందర్భంగా తల్లులకు తెలియచేసి పిల్లల్లో ఈ మార్పు చూడగానే అలెర్ట్ అవ్వాలని కోరాడు. ‘తొలి రోజుల్లోనే గమనిస్తే చాలా మేలు జరుగుతుంది. చాలాసార్లు పరిస్థితి చేయి దాటి ΄ోయాకే పిల్లలు డ్రగ్ ఎడిక్ట్స్ అయ్యారని తల్లిదండ్రులు గమనిస్తున్నారు’ అని అక్కడకు వచ్చిన ΄ోలీసు అధికారులు తెలిపారు. అందుకే ఈ ఉద్యమంలో డ్రగ్స్ కార్యకలాపాలు గమనించిన వెంటనే ΄ోలీసుల హెల్ప్‌లైన్‌కు ఎలా తెలపాలి, ΄ోలీసుల సహాయం ఎలా తీసుకోవాలో తెలియచేస్తారు. ‘గ్రామీణ స్త్రీలకు ఈ శిక్షణ ఉంటే గ్రామాల్లో యువకులు డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోగలరు’ అంటున్నారు ఈ ఉద్యమ బాధ్యులు.ఎన్నో రకాలుమత్తు పదార్థాలంటే హెరాయిన్, గంజాయి మాత్రమే కాదు. వైటెనర్స్తో మొదలు దగ్గుమందు వరకు ఎన్నో ఉన్నాయి. డ్రగ్స్ చలామణి కోసం పంజాబ్‌లో దగ్గుమందు ముసుగులో ఫ్యాక్టరీలు తయారయ్యి ్రపాణాంతకస్థాయిలో దగ్గుమందులోని రసాయనాలను ఇంజెక్షన్లుగా ఎక్కించునే విధంగా తయారు చేస్తున్నారు. అంతేకాదు గ్రాము బరువుకు ఎక్కువ పొడి వచ్చే విధంగా తయారు చేయడంతో ఒక్క గ్రాముతో కూడా రోజు గడపొచ్చనుకుని అలవాటు పడుతున్నారు.ఏం చేయాలి?తల్లిదండ్రులు పిల్లలతో తరచూ సమయం గడపాలి. వారితో విహారాలు చేయాలి. ఆ సమయంలో వారి మనోభావాలు విని స్నేహాలు తెలుసుకోవాలి. చదువుల్లో మార్కులు తెలుసుకోవాలి. ప్రవర్తనను గమనించాలి. ఇవన్నీ ఏమాత్రం తేడా వున్న అనుమానించి ఆదుకోవాలి. ఈ స్పీడు యుగంలో ఎవరూ ఈ పని చేయడం లేదు. తల్లులకు తప్పదు. వారే రక్షకులు. అమ్మ వల్లే మారాను‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ ఉద్యమంలో భాగంగా డ్రగ్స్ నుంచి బయటపడి సామాన్య జీవితం గడుపుతున్న వారి కథనాలు కూడా స్వయంగా వినిపించారు. ‘నేను డ్రగ్స్ నుంచి కేవలం మా అమ్మ వల్ల బయట పడ్డాను. ఒక దశలో హెరాయిన్ డోస్ కోసం 2 లక్షలు కూడా ఖర్చు పెట్టడానికి వెనుకాడలేదు. మా అమ్మ నా కోసం అనేక త్యాగాలు చేసి మామూలు మనిషిని చేసింది’ అని ఒకతను తెలిపాడు. -
మత్తు వదిలిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: మత్తుపదార్థాలు రవాణా చేసే ముఠాలను కట్టడి చేయడంతోపాటు మత్తుపదార్థాలకు అలవాటుపడిన వారిని అందులోంచి బయటపడేసే వ్యూహంతో ముందుకు వెళితేనే మత్తు మహమ్మారిని తరిమికొట్టడం సాధ్యమవుతుందని నిపుణులు చెపుతున్నారు. మద్యం, కల్తీకల్లు, గంజాయి, ఇతర మత్తుపదార్థాలకు బానిసలైన వారిని ఆ వ్యసనం నుంచి బయటపడేసేందుకు ఏర్పాటు చేసిన డీ–అడిక్షన్ సెంటర్లకు రోగుల సంఖ్య ఇటీవల పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతానికి భిన్నంగా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల గురించి అవగాహన పెరుగుతుండటంతో డీ–అడిక్షన్ సెంటర్లలో చేరే రోగుల సంఖ్యా పెరుగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డీ–అడిక్షన్ సెంటర్ల పనితీరును టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఇటీవలే పరిశీలించి ఓ నివేదికను తయారు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 డీ–అడిక్షన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తుండగా.. ఐదు సెంటర్లు పూర్తిగా మూతపడినట్టు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా డీ–అడిక్షన్‌కు ప్రాధాన్యం పెరగడంతోనషాముక్త భారత్ అభియాన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో డీ–అడిక్షన్ సెంటర్లను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటిల్లో కనీసం 10 చొప్పున బెడ్లు అందుబాటులోకి తెచ్చారు. మద్యం బానిసలే ఎక్కువ.. డీ–అడిక్షన్ సెంటర్లలో చేరుతున్న రోగులలో ఎక్కువ మంది మద్యానికి బానిసలైన వారే ఉంటున్నారు. తర్వాత పెద్ద సంఖ్యలో గంజాయి బానిసలు ఉంటున్నారు. 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు 12 వరకు డీ–అడిక్షన్ సెంటర్లలో చేరిన రోగుల సంఖ్య ఆధారంగా చూస్తే.. హనుమకొండలోని డీ–అడిక్షన్ కేంద్రంలో 1,067 మంది మద్యానికి బానిసలైన వారుండగా, గంజాయి రోగులు 344 మంది ఉన్నారు. ఆదిలాబాద్ సెంటర్లో 781 మంది మద్యానికి బానిసలైన వారు చేరగా.. 53 మంది గంజాయి బాధితులు ఉన్నారు.ఎల్బీనగర్లోని సెంటర్లో 933 మంది మద్యానికి బానిసలైన రోగులు, 39 మంది గంజాయికి బానిసలైన రోగులున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో 850 మంది మద్యం బానిసలు, 30 మంది గంజాయికి బానిసలైన రోగులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని సెంటర్లో 722 మంది మద్యానికి బానిసలైన వారు.. 24 మంది గంజాయికి అలవాటుపడిన వారున్నారు. ఖమ్మం జిల్లా మధిర‡ సెంటర్లో 427 మంది రోగులు మద్యానికి బానిసలైన వారుండగా, 23 మంది గంజాయి నుంచి డీ–అడిక్షన్ కోసం చేరారు. డీ–అడిక్షన్ సెంటర్లు అంటే..? మద్యం, గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు బానిసలైన వారికి ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు అవసరమైన వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందించి వారిని తిరిగి ఆరోగ్యవంతులుగా మార్చే కేంద్రాలను డీ–అడిక్షన్ సెంటర్లుగా వ్యవహరిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆధ్వర్యంలో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ (ఎన్ఏపీడీడీఆర్) పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రులలో డీ–అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. -
దేశాన్ని కమ్మేస్తున్న మత్తు మబ్బులు.. సినిమా ప్రభావమా?.. వ్యవస్థలో లోపమా ?
-
Social Media: ఈ వ్యసనం ప్రాణాంతకం
15 సెకన్ల రీల్స్ కోసం నూరేళ్ల జీవితాన్ని పణంగా పెడుతోంది నేటి యువత. రీల్స్‌ను ప్రవేశపెట్టిన ఇన్ స్టాగ్రామ్‌కు నేడు మన దేశంలో 24 కోట్ల మంది ఖాతాదార్లు ఉన్నారు. వీరిలో యువతీ యువకులే ఎక్కువ. ఆన్ లైన్ ఫేమ్ కోసం చిత్ర విచిత్రమైన రీల్స్ చేయడానికి ప్రాణాలతో రిస్క్ చేస్తున్నారు. గొడవలు, మర్డర్లు జరుగుతున్నాయి. మంచి ఫోన్ల కోసం దొంగలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు, సమాజం ఈ వ్యసనాన్ని ఇలాగే వదిలేయాలా?పూణెలో పోలీసులు వెంటనే స్పందించారు. మిహిర్ గాంధీ (27), మీనాక్షి సలూంఖే (23)లను అరెస్ట్ చేశారు. వీరి మీద ఐ.పి.సి 336 సెక్షన్ కింద కేసు పెట్టారు. దీని ప్రకారం ఆరు నెలలకు తగ్గకుండా జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఉంటాయి. ఎందుకు వీరిని అరెస్ట్ చేశారు. ప్రాణాంతకమైన రీల్ చేశారు కనుక.ఏం జరిగింది?పూణెకు చెందిన మిహిర్ గాంధీ, మీనాక్షి వారం క్రితం ఒక రీల్ విడుదల చేశారు. అందులో ఎత్తయిన భవంతి మీద మిహిర్ ఉంటే అతని చేయి ఆధారంగా మీనాక్షి గాల్లో వేలాడింది. అతను వదిలేసినా ఆమె చేయి జారినా మీనాక్షి కచ్చితంగా చనిపోయి ఉండేది. ఈ రీల్ బయటకు రాగానే అందరూ మండి పడ్డారు. ఈ రీల్స్ పిచ్చికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు స్పందించారు. వాటర్ ట్యాంక్ ఎక్కి...ఇటీవల లక్నోలోని వాటర్ ట్యాంక్ ఎక్కి రీల్ చేయబోయిన శివాంశ్ అనే కుర్రాడు కాలు జారి పడి మరణించాడు. దాంతో లక్నోలో పెద్ద ఎత్తున రీల్స్ అడిక్షన్ మీద చర్చ జరిగింది. ఇలా రీల్స్ చేస్తున్న వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం మానేయాలని తల్లిదండ్రులు, సమాజం అందరూ కోరారు. ఇలాగే రాజస్థాన్‌లోని పాలిలో ఒక యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఒక రీల్ చేయాలనుకున్నాడు. తల్లిదండ్రులు వారించేసరికి కోపమొచ్చి వారిని చంపేశాడు. టీనేజ్ యువతీ యువకులు ఇలా మతిలేని పనులు చేస్తున్నారనుకున్నా వైవాహిక జీవితంలో ఉన్న స్త్రీలు, పురుషులు కూడా రీల్స్‌కు బలవుతున్నారు. చత్తిస్‌గఢ్‌లోని భిలాయ్‌కి చెందిన ఒక మహిళ రీల్స్ చేయడానికి అడిక్ట్ అయ్యి భర్త వారించాడని ఆత్మహత్య చేసుకుంది. కర్నాటకలో ఒక భార్య రీల్ కోసం కన్నడ గీతానికి గంతులేసిందని మనసు నొచ్చుకున్న భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌లో రీల్స్ వద్దన్నందుకు భర్తనే చంపేసింది మరో మహిళ. రీల్స్ కోసం యువతీ యువకులు రకరకాల డ్రస్సులు వేసుకోవడం, ప్రాంక్‌లు చేయడం, ట్రాఫిక్‌లో ప్రమాదకరమైన ఫీట్లు చేయడం చివాట్లు తినడం ఆనవాయితీగా ఉంది. సమర్థమైన మంచి కంటెంట్‌తో కొందరు గుర్తింపు పొంది లాభపడుతున్నా మరెందరో ఈ రీల్స్ అనే వధ్యశిలపై తలలు తెగిపడుతున్నారు.గుర్తింపు కోసం పోరాటం...గతంలో డార్విన్ మనుగడ కోసం పోరాటం అన్నాడు. ఇవాళ ప్రభుత్వ పథకాల వల్ల మనుగడకు ఢోకా లేదు. ఇక మిగిలింది గుర్తింపు. టీనేజ్‌లో ఉన్న యువతీ యువకులకు గుర్తింప బడాలన్న కోరిక విపరీతంగా ఉంటుంది. గతంలో బాగా చదివి, ర్యాంక్ తెచ్చుకుని, మంచి ఉద్యోగం తెచ్చుకుంటే గుర్తింపు వచ్చేది. ఇప్పుడు ఒక్క రీల్‌తో గుర్తింపు వస్తోంది. ఫాలోయెర్ల వల్ల ఇదంతా ‘తమ కుటుంబం’ అనే భావన వారిలో కలుగుతుంది. ఎప్పుడూ కల్పిత ప్రపంచంలో ముక్కూ మొహం ఎరగని వారి కామెంట్ల ద్వారా వారు సంతృప్తి ΄÷ందుతుంటారు. మరిన్ని కామెంట్ల కోసం మరిన్ని రీల్స్ చేయాలి. మరిన్ని రీల్స్ కోసం మరిన్ని రిస్క్‌లు తీసుకోవాలి అనే భావన బలపడుతుంది.253 కోట్ల మంది...ప్రపంచ వ్యాప్తంగా రోజూ 253 కోట్ల మంది రీల్స్ చూస్తున్నారని ఒక అంచనా. 2020లో టిక్‌టాక్ బ్యాన్ అయ్యాక ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను ప్రవేశ పెట్టింది. 15 నుంచి 30 సెకండ్ల వీడియోలు పోస్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది. దాంతో ఇన్‌స్టా ఇన్ఫ్లూయెన్సర్ల పేరుతో కంటెంట్ క్రియేటర్ల పేరుతో గుర్తింపు కోసం అందరూ రంగంలో దిగారు. మన దేశంలో 8 కోట్ల మంది కంటెంట్ క్రియేటర్లు ఉన్నారంటే (కంటెంట్ ద్వారా ఆదాయం పొందాలని చూస్తున్నారంటే) అంతమందికి మంచి కంటెంట్ దొరికే అవకాశం లేదు. అందుకే పిచ్చి స్టంట్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఒకప్పుడు సెల్ఫీ పిచ్చితో చాలామంది ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు రీల్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.సిసలు ప్రపంచంలో...యువతీ యువకులు సిసలైన ప్రపంచంలో ఉండేలా చేస్తే వారిని ఈ రీల్స్ నుంచి బయటకు తేవచ్చు. ‘సోషల్ మీడియా అడిక్షన్ వల్ల ఆత్మహత్య ఆలోచనలతో ఉన్న వారు పెరుగుతున్నారు’ అని సైకియాట్రిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులతో దూరం, నిరుద్యోగం, ఈజీ మనీ కోసం వెంపర్లాట, క్షణిక గుర్తింపుతో వస్తున్న మానసికానందం, విలువల శూన్యత ఇవన్నీ యువతను రీల్స్ వైపు నెడుతున్నాయి. స్నేహితులతో ఆటలు, మాటలు కూడా లేనంతగా (అవతలివారు కూడా ఫోన్లతో బిజీగా ఉండటం వల్ల) ఒంటరితనానికి విరుగుడును సోషల్ మీడియాలో వెతుక్కుంటూ మరింత ఒంటరి ఔతున్నారు. తల్లిదండ్రులు.ఏం చేయాలి?→ కుటుంబం కూచుని సోషల్ మీడియా అడిక్షన్ గురించి మాట్లాడుకోవాలి.→ మనం చేసే రీల్స్ వల్ల కుటుంబానికి మంచిదా చెడ్డదా చర్చించుకోవాలి.→ ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో నిజాయితీగా చెప్పే మిత్రుల సలహా అడగాలి.→ పిల్లలు చేసే ప్రతి పనికీ అంగీకారం ఉండదని తల్లిదండ్రులు వారిని ఒప్పించేలా చె΄్పాలి.→ సైకియాట్రీ సాయం పొందాలి.→ విలువలతో కూడిన గుర్తింపు, గౌరవం మాత్రమే శాశ్వతమని తెలుసుకోవాలి. -
వెలుగు నీడల దారుల్లో....
సోషల్ మీడియాతో యువతరాన్ని విడదీసి చూడలేని కాలం ఇది. ‘డిజిటల్ నెటిజన్స్’గా పేరున్న యువతరానికి సోషల్ మీడియాకు సంబంధించి ఎలాంటి ఆసక్తులు ఉన్నాయి? కంటెంట్ క్రియేషన్‌ను ఇష్టపడుతున్నారా? ‘వ్యూయర్’గా ఉండడానికి ఇష్టపడుతున్నారా? బలం తెచ్చుకుంటున్నారా? బలహీనపడుతున్నారా?సోషల్ మీడియా అనేది యువత దైనందిన జీవితంలో విడదీయరాని భాగం అయింది. ‘మా పిల్లలు సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్నారు’ అంటున్న తల్లిదండ్రుల సంఖ్య తక్కువేమీ లేదు.‘సోషల్ మీడియాలో ఎంత టైమ్ గడుపుతున్నారు?’ అనేది ఒక కోణం అయితే అసలు అక్కడ ఏం చేస్తున్నారు? అనేది మరో కోణం. ఈ అంశంపై కొన్ని డిజిటల్ మార్కెటింగ్ పాట్‌ఫామ్స్ సర్వే నిర్వహించాయి.తమ సొంత కంటెంట్‌ను పోస్ట్ చేయడం కంటే యువతలో ఎక్కువమంది ఇతరుల పోస్టులను చదవడం, కామెంట్ చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. 21 శాతం మాత్రమే కంటెంట్ క్రియేటర్లుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. 79 శాతం మంది ‘వ్యూయర్స్’గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. కంటెంట్‌ను పోస్టు చేస్తున్న వారిలో రోజూ పోస్ట్ చేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది.పర్సనల్ గ్రోత్, కెరీర్ ఎంపిక... మొదలైన వాటి విషయంలో సోషల్ మీడియాలోని కంటెంట్ ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు కొందరు. రకరకాల డొమైన్స్‌లో కొత్తగా వస్తున్న ట్రెండ్స్ గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియాకు సంబంధించి మిగిలిన దేశాలతో పోల్చితే మన దేశంలో యువ ‘స్పోర్ట్స్ సూపర్ ఫ్యాన్స్’ ఎక్కువ. ఈ సూపర్ ఫ్యాన్స్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కావడం లేదు. ప్రపంచంలోని ఎన్నో ఆటల గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.‘సోషల్ మీడియాను యూత్ ఎలా ఉపయోగించుకుంటుంది?’ అనేదాన్ని పక్కన పెడితే... సోషల్ మీడియా ఎడిక్షన్ విషయంలో ‘ఎవరో చెప్పేవరకు ఎందుకు... మన గురించి మనం తెలుసుకుందాం’ అనే ధోరణి యువతలో పెరుగుతుండడం శుభసూచకం.‘సోషల్ మీడియాలో ఎంత ఎక్కువ సేపు ఉంటే అంత అప్డేట్ అవుతాం’ అనే భ్రమకు దూరంగా జరుగుతున్నారు.‘ప్రతి అంశానికి మంచి, చెడులు ఉంటాయి. మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేదానిపైనే మంచి, చెడు ఆధారపడి ఉంటాయి’ అంటుంది ఎంబీఏ స్టూడెంట్ తాన్వీ అగర్వాల్.ముంబైకి చెందిన తాన్వీ ఒకప్పుడు సోషల్ మీడియానే ప్రపంచంగా ఉండేది. తాను సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్న విషయం గ్రహించాక ‘ఒకరోజులో ఇంత సమయం మాత్రమే’ అని టైమ్ సెట్ చేసుకుంది.‘సోషల్ మీడియాకు ఎడిక్ట్ కావడం వల్ల నా చదువు దెబ్బతింది. చదివే సమయంలో సోషల్ మీడియాలో చదివిన పోస్టులు, చూసిన వీడియోలు గుర్తుకు వస్తుంటాయి. ఆలోచనలు అటువైపు మళ్లుతుంటాయి. ఏకాగ్రత దెబ్బతింటుంది’ అంటుంది తాన్వీ అగర్వాల్.సోషల్ మీడియాను ఎంతసేపు, ఎలా వాడుకోవాలి అనేది ఒక కోణం అయితే ‘నైతికత’ అనేది మరో కోణం.లక్నోకు చెందిన వైశాలి ఒకప్పుడు మీమ్స్‌ను తెగ ఎంజాయ్ చేసేది. అయితే ‘బ్యాడ్ టేస్ట్ ఇన్ మీమ్స్’ అనే పోస్ట్ చదివిన తరువాత ఆమెలో మార్పు వచ్చింది.ఇప్పుడు ఆమె రిలేటబుల్ కంటెంట్, గుడ్ మీమ్స్‌ను మాత్రమే ఇష్టపడుతుంది.‘మీమ్స్ ద్వారా క్రూరత్వాన్ని ప్రదర్శించవద్దు. మీమ్స్ అనేవి హాయిగా నవ్వుకునేలా ఉండాలి’ అంటుంది వైశాలి.బ్రాండ్ల ఎంపికకు సంబంధించి సోషల్ మీడియాపై ఎక్కువ ఆధారపడుతుంది యువతరం. కాస్తో కూస్తో వచ్చిన మార్పు ఏమిటంటే ఇప్పుడు బ్రాండ్ల నుంచి జవాబుదారీతనాన్ని ఆశిస్తున్నారు. ఫలానా బ్రాండ్ పర్యావరణం హితం అంటే ఆ బ్రాండ్ వైపు మొగ్గుచూపుతున్నారు.స్థూలంగా చేప్పాలంటే... ‘సోషల్ మీడియాతో బలం తెచ్చుకుంటున్నామా? బలహీనపడుతున్నామా?’ అనేది పూర్తిగా మన అవగాహన, ఆలోచన ధోరణి మీదే ఆధారపడుతుంది. ఉదాహరణకు... ఫోర్బ్స్ హెల్త్ అండ్ వన్‌పోల్ సర్వే ప్రకారం సోషల్ మీడియాలో 53 శాతం మంది తమ నవ్వును ఇతరులతో ΄ోల్చి చూసుకుంటున్నారు.‘అయ్యో! అలా అందంగా నవ్వలేక పోతున్నానే’ అని అవతలి వ్యక్తితో పోల్చుకొని బాధ పడుతున్న వారే ఎక్కువ.పలువరుస అందంగా కనిపించడానికి సోషల్ మీడియాలోని తమ ఫొటోలను ఎడిట్ చేస్తున్నవారు, పలువరుస బాగోలేదని ఫొటోను హైడ్ చేస్తున్నవారూ ఉన్నారు. ‘నవ్వు విషయంలో నా ఆత్మవిశ్వాసాన్ని సోషల్ మీడియా దెబ్బతిస్తోంది’ అంటున్నారు 45 శాతం మంది.సోషల్ మీడియా అనే ప్రపంచంలో ...చిన్న నవ్వు విషయంలోనూ ఆత్మవిశ్వాసం లోపించిన వారు ఉన్నారు. ప్రయోజనకర కంటెంట్‌తో తిరుగులేని ఆత్మవిశ్వాసంతో తమను తాము నిరూపించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకున్నవారు ఉన్నారు. ఏ దారిలో వెళుతున్నామనేది పూర్తిగా మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. మార్పు గురించి చెప్పుకోవాల్సి వస్తే... ‘నేను ఏ దారిలో వెళుతున్నాను. ఇది సరిౖయెనదేనా?’ అనే స్వీయ విశ్లేషణ ధోరణి యువతరంలో పెరుగుతోంది. -
మద్యానికి బానిసైతే...ఇంత భయంకరమా? వైరల్ వీడియో!
మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలుసు, మితిమీరితే ప్రాణాలకే ప్రమాదమనీ తెలిసు. అయినా మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకుపెరుగుతూనే ఉంది. అసలు మద్యం లేదా అల్కహాల్ సేవించడం ఎంత ప్రమాదమో తెలుసా?ఒక్కసారి మద్యానికి బానిపైపోతే మనిషి చివరికి ఎలాంటి దుస్థితికి దిగజారి పోతాడో తెలిపే వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. వారాలు, నెలలు, సంవత్సరాల పాటు ఆల్కహాల్‌కు బానిసై, అకస్మాత్తుగా అకస్మాత్తుగా మద్యపానాన్ని ఆపివేసినా లేదా బాగా తగ్గించేసినా మానసిక, శారీరక సమస్యలు రెండూ వస్తాయి. ఈ లక్షణాలు తేలికపాటి నుండి తీవ్రంగా మారవచ్చు. తక్షణ వైద్య సహాయం తీసుకోకపోతే ప్రాణాపాయం కావచ్చు. మద్యం తాగిన తరువాత నరాల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. దీంతో అది క్రమేపీ మనతోపాటు పాటు నరాలు కూడా అలవాటు పడతాయన్న మాట. చివరికి అదొక ఎడిక్షన్‌లా మారిపోతోంది. అంటే అది లేకపోతే ఉండలేని స్థితికి వస్తాయన్నమాట. దీన్నే ఆల్కహాల్ విత్‌డ్రావల్ అంటారు. ఈ స్థాయి మరింత ముదిరితే ఫిట్సు రావటం, అలాగే మతి భ్రమించడం (డెలిరియం) లాంటివి లక్షణాలు కనిపిస్తాయి. చివరికి ఇది ప్రాణాపాయం కావచ్చు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి జరుగుతోంది అదే. మద్యానికి అలవాడు పడిన నరాలు స్థిమితంగా ఉండలేకపోయాయి. దీంతో కాస్త మద్యం పుచ్చుకోగానే కుదుటపడ్డాయి. అంతిమంగా ఇది మరణానికి దారితీస్తుందంటున్నారు వైద్య నిపుణులు. ఆల్కహాల్ విత్ డ్రాయల్ లక్షణాలు: అధిక రక్త పోటు, నిద్రలేమి, శరీర భాగాలు బాగా వణికిపోవడం (హైపర్ రెఫ్లెక్సియా) ఆందోళన, కడుపు నొప్పి, తలనొప్పి, గుండె దడ లాంటివి. ఓకే అండీ, మనం మందు తాగమే అనుకోండి, ముందు నరాలు ఎక్సైట్ అవుతాయన్నమాట, తర్వాత తర్వాత అలవాటు పడతాయన్నమాట, చివరికి అది లేకపోతే ఉండలేని స్థితికి వస్తాయన్నమాట ఇలాగే. దీన్నే ఆల్కహాల్ విత్‌డ్రావల్ అంటారు. బాగా ముదిరితే ఫిట్సు రావటం, అలాగే మతి భ్రమించడం (డెలిరియం), ఇంకా ప్రాణాపాయం కావచ్చు. pic.twitter.com/wmqiDsTr6U — Srikanth Miryala (@miryalasrikanth) April 12, 2024 మద్యానికి బానిసైతే ♦ ఆల్కహాల్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ♦ అతిము ఖ్యమైన అవయం కాలేయం దెబ్బతింటుంది. ఇది ముదిరితే కాలేయ కేన్సర్‌కు దారి తీస్తుంది. ♦ఏకాగ్రతను కోల్పోవడం, పాదాలు, చేతుల్లో తిమ్మిరి, జ్ఞాపకశక్తి సమస్యలు భావోద్వేగాలను నియంత్రించ లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి ♦ ఎంజైమ్‌లు అండ్ హార్మోన్లను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ పనితీరు దెబ్బతింటుంది. ప్యాంక్రియాటిక్ కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందంటున్నారు నిపుణులు. నోట్: మద్యం ఆరోగ్యానికి అనర్థం. ఇందులో రెండో మాటకు తావేలేదు. ఆరోగ్య జీవనం కోసం ఆ వ్యసనాన్ని మెల్లిగా వదిలించుకోవడం తప్పితే వేరే మార్గం లేదు. అవసరమైన నిపుణుల సలహాలు తీసుకొని మద్యానికి దూరంగా ఉండటం ఉత్తమం. -
డీ అడిక్షన్ సెంటర్ నుంచి 13 మంది యువతులు పరార్..
హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాకు చెందిన పర్వానూలో డీ అడిక్షన్ సెంటర్ (మత్తు పదార్థాల వినియోగం నుంచి విముక్తి కల్పించే సంస్థ) నుంచి 13 మంది యువతులు పారిపోయారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది. అనంతరం బాలికలను అడవిలో గుర్తించి, రక్షించారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పర్వానూలోని ఖాదిన్ గ్రామంలో డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్ ఉంది. ఇక్కడ మొత్తం 17 మంది బాలికలు చికిత్స పొందుతున్నారు. శనివారం 13 మంది బాలికలు సెంటర్లోని కిటికీ అద్దాలు పగులగొట్టుకుని, బయటపడి సమీపంలోని అడవిలోకి పారిపోయారు. అయితే డి-అడిక్షన్ సెంటర్ సిబ్బంది పోలీసుల సహకారంతో ఈ యువతులను వెదికిపట్టుకుని తిరిగి సెంటర్‌కు తరలించారు. ఈ ఘటన డీ అడిక్షన్ సెంటర్ల పనితీరుపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. ఈ సెంటర్లో పంజాబ్ హర్యానాలకు చెందిన యువతులు చికిత్స పొందుతున్నారు. పంజాబ్‌లో డీ-అడిక్షన్ సెంటర్లపై నిషేధం విధించిన తర్వాత మత్తుమందు బాధితులు చికిత్స కోసం హర్యానా, హిమాచల్‌లకు వస్తున్నారు. అయితే హిమాచల్‌లో డీ అడిక్షన్ సెంటర్లు ప్రారంభించినప్పటి నుండి ఈ సెంటర్లలో పలు అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. కాగా డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్ల నుంచి పారిపోయిన యువతులు.. పోలీసుల విచారణలో తమకు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా కల్పించడం లేదని అందుకే పారిపోయామని ఫిర్యాలు చేశారు. ఈ ఉదంతంపై విచారణ జరుపుతున్నట్లు స్థానిక ఎస్పీ సోలన్ తెలిపారు. ఇది కూడా చదవండి: కొత్త ఏడాదిలో నూతన ఎక్స్‌ప్రెస్‌వే.. నాలుగు రాష్ట్రాలకు నజరానా! -
మద్యపాన వ్యసనం ఇంత ఘోరంగా ఉంటుందా? ఏకంగా యాసిడ్‌లా మూత్రం..
మద్యపానం వ్యసనం అనేది ఓ రుగ్మత అని పలువురు ఆరోగ్య నిపుణులు గట్టిగా నొక్కి చెబుతున్న సంగతి తెలిసిందే. మనకు తెలిసినవాళ్లు లేదా సన్నిహితులు ఇలా ఉంటే గమనించి కౌన్సిలింగ్ ఇప్పించి మార్చాలని లేదంటే మానవ సంబంధాల తోపాటు ప్రాణాలు కూడా హరించిపోతాయని హెచ్చరిస్తుంటారు. కానీ ఇప్పుడూ ఈ ఘటన చూస్తే.. అదంతా నిజమే అని అనకుండా ఉండలేరు. ఈ వ్యసనం కారణంగా ఓ ప్రముఖ మోడల్ ఆరోగ్యం ఎంతలా క్షీణించిందో వింటే..వామ్మో! అని నోరెళ్లబెట్టడతారు!. వివరాల్లోకెళ్తే..కాలిఫోర్నియాకు చెందిన 37 ఏళ్ల మోడల్, నటి జెస్సికా లాండన్ వోడ్కాకు బానిసైపోయింది. ఎంతలా అంటే 24 గంటలు అది తాగకపోతే లేను అనేంతగా మద్యం అంటే పడి చచ్చిపోయింది. ఆ అలవాటు చాలా చిన్న వయసులోనే ఆరోగ్యం మొత్తం కోల్పోయేలా క్షీణించేసింది. చివరికి ఆ వ్యసనం తనకు తెలియకుండానే తాగుతూ నేలపై పడిపోయి తెలియకుండానే అక్కడే మల మూత్ర విసర్జనలు చేసేంతలా ఆరోగ్యాన్ని దిగజార్చేసింది. వృధాప్యంలో వచ్చే వణుకు, భయం అన్ని ఈ వయసులోనే ఫేస్ చేసింది. మాటిమాటికి స్ప్రుహ కోల్పోవడం అన్ని మరిచిపోతున్నట్ల మెదడు మొద్దుబారిపోవడం వంటి లక్షణాలన్ని ఒక్కసారిగా ఆవరించాయి ఆ మోడల్‌కి. దీని కారణంగా బయటకు వచ్చేందుకు కాదు కదా కనీసం తోడు లేకుండా బాత్రూంకి కూడా వెళ్లలేని స్థితికి చేరుకుంది. ఆఖరికి ఆమె మూత్రమే యాసిడ్‌లా మారి ఆమె చర్మాన్ని తినేసేంత స్థితికి వచ్చేసింది. సరిగ్గా అదే సమయంలో ఆమె మెట్లపై స్ప్రుహ కోల్పోయి పడిపోయింది. పుండు మీద కారం చల్లినట్లుగా ఈ టైంలోనే తలకు కూడా బలమైన గాయం అయ్యింది. దీని కారణంగా మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి కణితిలా వచ్చింది. దీంతో ముఖంలో ఒకవైపు అంతా పక్షవాతానికి గురై మాట కూడా రాని స్థితికి చేరుకుంది. ఇది సీరియస్ కాకమునుపే ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో జెస్సికా ఆల్కహాల్‌కి పూర్తి స్థాయిలో దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా ఆల్కహాల్ మానడం అంత ఈజీ కాదు. దీని కారణంగా మూర్చ, పక్షవాతం, వణుకు లాంటి దారుణమైన సమస్యలను ఎదుర్కొంది. ఒకరకంగా మెదడు శస్త్ర చికిత్స కోసం తాగకుండా ఉండటమే ఆమెను ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటపడేందుకు ఉపకరించిందనాలి. ఆ తర్వాత ఆపరేషన్ అనంతరం ఆమె నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. అసలు మద్య పానం వ్యసనం అంటే.. ఆల్కహాల్‌పై నియంత్రణ లేకుండా అదేపనిగా తాగడం. అందుకోసం ఎలాంటి పని చేసేందుకైనా దిగజారడం. ప్రియమైన వారితో సంబంధాలను తెంచుకునేలా ప్రవర్తించడం తగని సమయాల్లో కూడా తాగడం మద్యాన్ని దాచడం లేదా తాగేటప్పుడూ దాచడం తదితర విపరీతమైన లక్షణాలు ఉండే వారిని వైద్యుల వద్దకు తీసుకొచ్చి చికిత్స ఇప్పించాలి లేదంటే ప్రాణాంతక వ్యాధుల బారినపడి చనిపోతారు. (చదవండి: మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?) -
ఎదుగుదల వాయిదా!
బాపట్లకు చెందిన చిట్టిబాబు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. వయసు 40 దాటడంతో ఆరోగ్యంపై దృష్టిపెట్టాలనుకున్నాడు. ‘రేపటి నుంచి మార్నింగ్ వాక్ చేయాలి’.. అని నిర్ణయం తీసుకుని ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకున్నాడు. తెల్లారింది.. అలారం మోగడం మొదలైంది. నిద్రమత్తులోనే చిట్టిబాబు అలారాన్ని ఆపి.. ఈ రోజు గురువారం.. అటూఇటు కాకుండా ఈ రోజే మొదలెట్టాలా? సోమవారం నుంచైతే ఓ క్రమపద్ధతిలో ఉంటుంది కదా అనుకుని.. వచ్చే సోమవారానికి వాయిదా వేసుకుని మళ్లీ ముసుగుతన్నాడు. సోమవారం ఉదయాన్నే అలారం మోగడంతో భారంగా నిద్రలేచాడు. వాకింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో అతడి మెదడులో తళుక్కున ఓ ఆలోచన మెదిలింది..ఎటూ మూడు రోజుల్లో ఈ నెల ముగిసిపోతుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వాకింగ్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందబ్బా.. అని ఆలోచించాడు. తన ఆలోచన కరక్టే అనిపించింది. ఒకటో తేదీ అయితే లెక్కించుకోడానికి కూడా సులువుగా, అనువుగా ఉంటుందనుకుంటూ.. వాకింగ్‌కు వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఒకటో తేదీ కూడా రానే వచి్చంది.. ఆ రోజు బుధవారం. మరీ వారం మధ్యలో ఎందుకు? సోమవారం నుంచి నడుద్దాంలే.. అని వాయిదా వేశాడు. మళ్లీ సోమవారం రాగానే.. ఆపై సోమవారానికి వాయిదా. ఇలా రెండేళ్లుగా వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది గానీ.. మార్నింగ్ వాక్కు మాత్రం అడుగు ముందుకు పడలేదు. వాకింగ్ మొదలెడదామనుకున్న రోజు రాగానే ఏదో ఒక కారణాన్ని వెతుక్కోవడం.. ఆ సాకుతో వాయిదా వేసుకుని, ఆ క్షణానికి హమ్మయ్యా.. అని ఊపిరిపీల్చుకోవడం పరిపాటిగా మారింది. – తమనంపల్లి రాజేశ్వరరావు, ఏపీ సెంట్రల్ డెస్క్ ఒక్క చిట్టిబాబు విషయంలోనే కాదు.. దాదాపు అందరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో ఇలాంటి వాయిదా ఘటనలు ఉండే ఉంటాయి. ఒక్కసారి ఈ వాయిదా సంస్కృతికి అలవాటు పడితే.. మన ఎదుగుదలను, అభివృద్ధిని వాయిదా వేసుకున్నట్టే లెక్క. విలువైన కాలాన్ని హరించి వేస్తుంది. వాయిదా వేయడం.. ఆ సమయానికి ఎంతో రిలీఫ్‌నిస్తుంది. చేయాల్సిన పనిని ‘తర్వాత చేద్దాంలే..’ అనుకోవడం ఆ క్షణానికి ప్రశాంతతనిస్తుంది. కానీ ఆ వాయిదా తాలూకు పర్యావసానం నష్టాన్ని కలిగించినప్పుడు తల పట్టుకుని కుమిలిపోతుంటారు. ఇలా డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదమూ లేకపోలేదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూద్దాంలే.. చేద్దాంలే.. అనేవి జీవితాన్ని వెనక్కి లాగే విషయాలని, వీటి నుంచి ఎంత త్వరగా బయటపడగలిగితే అంత మంచిదంటున్నారు. మనం ఇలా ఆలోచిస్తే.. మెదడు అలా ఆదేశిస్తుంది.. సాధారణంగా మనకు ఒత్తిడి కలిగించేవాటిని వాయిదా వేయమని మెదడు చెబుతుంది. పరీక్షల కోసం చదవడం, ఉదయాన్నే లేచి నడవడం వంటివి మానసికంగా భారంగా ఉండే పనులు. ఎక్కువగా ఇలాంటి వాటినే వాయిదా వేయాలని మెదడు చెబుతూ ఉంటుంది. ఇలాంటి వారిలో ఎక్కువ మంది డిప్రెషన్, మానసిక ఆందోళనల బారిన పడే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోన్లో మునక నుంచి బయటి కొద్దాం.. ఏ పనినైనా అనుకున్న సమయానికి పూర్తిచేయాలంటే ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది. ఫోన్ అనేది మనకు తెలియకుండానే సమయాన్ని హరిస్తుంది. మనలో అంతులేని బద్దకానికి కారణమవుతుంది. ఫోన్ చేతిలో ఉందంటే చాలు.. ఇక ఏపనైనా ‘ఆ చేయొచ్చులే..’ అనిపించే నీరసం, ‘ఇప్పుడే చేయాలా..’ అనేంత బద్దకం, ‘చేయలేక చస్తున్నా..’ అనుకునేంత నిస్తేజం మనల్ని ఆవహించేస్తాయి. అందుకే ఫోన్‌కు దూరంగా ఉంటే ఈ వాయిదా అలవాటు నుంచి బయటపడే అవకాశం ఉంది. అందరిలో ఉండే లక్షణమే గానీ.. పనులు వాయిదా వేయడం అనేది టైం మేనేజ్మెంట్ సమస్య అని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి ఇది ఎమోషనల్ రెగ్యులేషన్ సమస్య. ఏదైనా ఒక పని మనలో ఒత్తిడిని కలిగిస్తే.. మెదడులోని దానికి సంబంధించిన భాగం ఆ పనిని వాయిదా వేయాలని ప్రేరేపిస్తుంది. దీంతో మనం ఆ పనిని వాయిదా వేస్తాం. అందుకే వాయిదా వేయడాన్ని ఓ డిఫెన్స్ మెకానిజంగా పరిగణించవచ్చు. ఇది అందరిలో ఉండే లక్షణమే గానీ, ఇది క్రానిక్‌గా మారినప్పుడు మాత్రం సైకాలజిస్టులను సంప్రదించాల్సి ఉంటుంది. కాగి్నటివ్ బిహేవియర్ థెరపీ, మైండ్ ఫుల్నెస్ ట్రైనింగ్, బిహేవియర్ షేపింగ్, ఎపిసోడిక్ ఫ్యూచర్ థింకింగ్ వంటి పద్ధతులు ఉపయోగించి వాయిదా వేసే లక్షణాన్ని సైకాలజిస్టులు తగ్గిస్తారు. – బి.కృష్ణ, సైకాలజిస్ట్ మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ పనులు వాయిదా వేయడం అనేది మెదడులోని లింబిక్ సిస్టం, ప్రీ ఫ్రొంటల్ కార్తెక్స్ మధ్య ఘర్షణతో సంభవిస్తుందని న్యూరో సైన్స్ చెప్తుంది. ఈ లక్షణం విద్యార్థుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌లో 81 శాతం మంది పనులు వాయిదా వేస్తున్నారని ఒక సర్వేలో తేలింది. పనులు వాయిదా వేయడానికి కొన్ని మానసిక కారణాలున్నాయి. మోటివేషన్ లేకపోవడం, ఓటమి భయం, ఒత్తిడి, స్వీయ విమర్శలు తదితరాలు ఓ వ్యక్తి పనులు వాయిదా వేయడానికి కారణమవుతాయి. వాయిదా లక్షణం మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వాయిదా వేసే లక్షణం దైనందిక జీవితానికి ఇబ్బంది కలిగించే స్థాయికి చేరుకుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది. – బి.అనితజ్యోతి, సైకాలజిస్ట్ ‘వాయిదా’పై నిపుణులు ఏమంటున్నారంటే.. ఒక పనిని వాయిదా వేయడానికి ముఖ్య కారణం ఆ పని చేయడానికి ఆసక్తి లేకపోవడంతో పాటు ఉత్సాహ లేమిని కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. మనం ఇంతకు ముందు చెప్పుకొన్నట్టు ఆ పని మనకు ఒత్తిడి కలిగించేది, లేదా మానసికంగా భారంగా అనిపించేదై ఉంటుంది. ఒక పనిని ఒక్కసారి వాయిదా వేశామంటే.. మళ్లీ మళ్లీ వాయిదా వేసేందుకే మన మెదడు మొగ్గు చూపుతుంది. బద్దకం, సోమరితనం కూడా ఈ వాయిదా పరంపరకు ప్రధాన కారకంగా నిలుస్తున్నాయి. అసలు ఎలాంటి కారణం లేకుండా కూడా పనులు వాయిదా వేస్తూ అదో రకమైన మానసిక ఆనందాన్ని పొందుతుంటాం. చాలా కోల్పోతున్నాం వాయిదా వేసిన పనిని పూర్తిచేయలేక దాని తాలూకు నష్టాన్ని మూటగట్టుకుంటాం. వాయిదాల వల్ల తరచూ ఇలానే జరగడంతో ఆందోళన, భయానికి లోనవుతాం. మనమీద మనకు నమ్మకం సన్నగిలి.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం. ఇది మన నిద్రను ప్రభావితం చేస్తుంది. మనకు నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది. ఫలితంగా మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది.. ఇలా అధిగమిద్దాం.. ఒక పనిని చేయడంలో హాయిని అనుభవించాలి గానీ.. ఒత్తిడిని దరిచేరనీయ కూడదు. ఈ వాయిదా వేయడం అనే దాన్ని మన ఎదుగుదలను నియంత్రించే రుగ్మతగా భావిస్తూ.. దాని బారిన పడకుండా ఉండాలంటూ మనసుకు ఆదేశాలిచ్చుకుంటూ.. మనసును పూర్తిగా మన నియంత్రణలో ఉంచుకోవాలి. ఏదన్నా పని మొదలెట్టామంటే.. దానికి అంకితమైపోవాలి. అది పూర్తయిందాకా వెనకడుగు వేయకూడదు. వాయిదా సంస్కృతి అనేది మన ఉన్నతిని, ఎదుగుదలను నిలువరించే ఓ సోమరిపోతు. ఈ జీవన పరుగు పందెంలో తోటివారితో పాటు మన అడుగుల్ని ముందుకు పడనీయకుండా అనుక్షణం వెనక్కి లాగుతూ.. మనల్ని ఓ మాయా ప్రపంచంలోని నిష్క్రియా స్థితికి తీసుకెళ్లే ఓ మత్తుమందు. దీని విషయంలో మనం అప్రమత్తంగా, అనుక్షణం జాగరూకతతో ఉండాలి. పనిని విభజించుకోవాలి. ఓ టైం టేబుల్ వేసుకుని ఆ సమయానికి ఎట్టి పరిస్థితుల్లో ఆ పనిని పూర్తిచేసి తీరాలి. ఒక సామెత చెప్పినట్టు.. రేపు మనం చేయాలనుకుంటున్న పనిని ఈ రోజే.. ఈ రోజు ఏం చేయాల్సి ఉందో దానిని ఇప్పుడే చేసెయ్యాలి. పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా యోగా లేదా వ్యాయామం, ధ్యానం చేయాలి. -
కరోనా తెచ్చిన తంటా! పిల్లల్ని ఫోన్లకు అడిక్ట్ కాకుండా ఏం చేయాలి?
ఎప్పుడెప్పుడు స్కూల్ లాంగ్ బెల్ కొడతారా ? ఇంటికెళుదామా ? అని చూస్తుంటారు " "క్లాసు రూమ్ లో పాఠాలు వినడం లేదు . పక్క వారిని గిల్లడం, గిచ్చడం లాంటి పనులు చేస్తున్నారు " " చిరాకు, కోపం, అసహనం ఎక్కువయ్యింది . ఏకాగ్రత లోపించింది " " టీచర్ల పై తిరుగుబాటు, తల్లితండ్రుల్ని ఎదిరించడం ఎక్కువయ్యింది. రాగ్గింగ్ , బుల్లియింగ్ , ఘర్షణలు ఎక్కువయ్యాయి " " చెడు వ్యసనాల బారిన పడుతున్నారు " ఒక్కో సారి మనం ఫ్లోలో వెళ్ళిపోతాం. మనకు కనిపించిందే లోకం అనుకొంటాము. మనసులో ఉన్నదే నిజంగా జరుగుతోంది అనుకొంటాము . అలాంటప్పుడు మనకు రియాలిటీ చెక్ అవసరం . నేను మొన్న ఆదివారం అదే పని చేశాను. ఆ రోజు జరిగిన ఇంటర్వ్యూ కు దాదాపు డెబ్భై మంది హాజరయ్యారు . వారిలో అత్యధిక శాతం ఇదివరకే ఏదో ఒక స్కూల్లో పనిచేస్తున్నారు. కరోనా ముందు కాలం తో పోలిస్తే , ఇప్పుడు... అంటే కరోనా తరువాత కాలం లో , పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు చూసారా ? అయితే ఏంటది ? ఇది నేను ఆ ఇంటర్వ్యూలో చాల మందిని అడిగిన ప్రశ్న . పైన ఇచ్చినవి వారి సమాధానాలు. ఒక్కరంటే ఒక్కరు పాజిటివ్ చేంజ్ ఉందని చెప్పలేదు . సమస్య తీవ్రంగా ఉందని చాలా మంది చెప్పారు . కారణం ఏంటని అడిగితే అందరూ ఆన్లైన్ క్లాసు లు . మొబైల్ వ్యసనం అని సమాధానం చెప్పారు . "ఈ కాలం పిలల్లు సెల్ ఫోన్ వాడక పొతే ఎట్టా ? " "టెక్నాలజీ మార్పు తెస్తుంది . ఇది సహజం " "టెక్ సావీ పిల్లలు " "మార్పు సహజం . మారుతున్న సమాజంతో పాటే మనం మారాలి " అని ఇంకా పలవరిస్తున్న అజ్ఞానులు కోకొల్లలు. ఏది మార్పు ? టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అనే సింపుల్ విషయం అర్థం కాని అమాయకత్వం అది. ఫ్లో లో వెళ్ళాలి అనుకొనే వారు .. ఇదే ట్రెండ్ అనుకొనే వారు .. మన పిల్లలు ఏదో సాధిస్తున్నారు అనుకొనే వారు .. ఇంకా కోట్లలో . ఈ లోగా యునెస్కో కుండబద్దలు కొట్టేసింది . మొబైల్ అడిక్షన్ వల్ల కలిగే నష్టాన్ని అధికారికంగా తేల్చేసింది. కమిషన్ల ఆశతో హోమ్ వర్క్ ను మొబైల్ డివైసెస్తో ముడిపెట్టే పాఠశాల యాజమాన్యాలకు పచ్చి వెలక్కాయ గొంతుకు అడ్డుపడట్టయ్యింది. కరోనా కాలం లో ఆన్లైన్ క్లాసులను నేను సెలైన్ పెట్టుకోవడంతో పోల్చా. తీవ్ర రోగముండి ఐసీయూ లో ఉంటే తప్పదు . కానీ టిఫిన్ బాక్స్ కు బదులు సెలైన్ పెట్టుకొని రోజూ ఇంటినుంచి బయటకు వెళుతామా? వారం రోజులు వానపడితే (వాన పడింది గట్టిగా రెండు రోజులే ) ఆన్లైన్ క్లాసులు షురూ చేసిన స్కూల్స్ . "పక్కన ఉన్న అన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు నడుపుతుంటే మీరెందుకు చేయరు?" అని మొన్న ఒక పేరెంట్ మెసేజ్ . "వెంటనే వారు కట్టిన ఫీజు వాపసు ఇచ్చేయండి .. ఆన్లైన్ క్లాసులు పెడుతున్న స్కూల్ లో అబ్బాయి ని చదివించడానికి వీలుగా టీసీ ఇచ్చేయండి " నా ఆర్డర్ . చివరకు పేరెంట్ కు తత్త్వం బోధపడింది. సారీ చెప్పారు "మాకు సెల్ ఫోన్ వల్ల కలిగే నష్టం అర్థం అయ్యింది. కానీ ఏమి చెయ్యాలి ?"... అని ఇంకా చాలా మంది ఇంట్లో బాంబు పెట్టుకొంటే పేలుతుంది . ఏమి చేస్తాము ? ఇంట్లో బాంబు పెట్టుకోము . ఇదీ అంతే. "పెద్దాళ్ళకు తప్పని సరి. ఆఫీస్ వర్క్ కోసం సెల్ ఫోన్. ఇది అట వస్తువు కాదు. మీ మెదళ్ళు సెల్ ఫోన్ వల్ల వంద రెట్లు అధికంగా ప్రభావితం అవుతాయి , కాబట్టి వద్దు" అని పిల్లలకు నచ్చ చెప్పి వారు సెల్ ఫోన్ వాడకుండా చూడాలి . మాట వినకపోతే కౌన్సిలింగ్ చేయించాలి . సమస్య జటిలం. పరిష్కారం అంత సులభం కాదు. సంవత్సరాల తరబడి అధిక తిండి తిని ఒంట్లో కిలోల కొద్దీ అధిక కొవ్వును పేరపెట్టుకొన్న వారు ఏమి చెయ్యాలి ? తిన్నప్పుడు పొందిన సుఖాన్ని గుర్తు చేసుకొంటూ దానికి ప్రాయచ్చితం అన్నట్టు సరైన తిండి తినాలి . వ్యాయామం చెయ్యాలి. అబ్బే ఇంత కష్టం మేము పడలేము. ఏదైనా సింపుల్ మార్గం ఉంటే చెప్పండి అని లక్షల్లో అనుకొంటున్నారు. అలాంటి బకరాల కోసం డబ్బాల్లో మూలికా మందులు వచ్చాయి. అవి జస్ట్ ఒక స్పూన్ తింటే సరిపోతుంది అని ప్రచారం. ఈజీ మార్గం కదా అని లక్షల మంది. దాన్ని తిని కిడ్నీలు నాశనం చేసుకొన్న వారు వేలమంది. అయినా ఆగదు. ఆగితే వారి బిజినెస్ సాగదు బలహీనతల్ని కాష్ చేసుకోవడంలో ఫార్మసురులకు మించిన వారెవరూ ఉండరు. నువ్వు అధిక తిండి తింటే వాడికి డయాబెటిస్ బిజినెస్. కనీస ఆహార నియమాలు లేకుండా టెన్షన్ పెంచుకొని నువ్వు ఇమ్మ్యూనిటిని కుళ్ళపొడుచుకొంటే ... తుమ్ముకు.. దగ్గుకు... కాన్సర్‌కు.. జ్వరానికి.. ఒంటి నొప్పులకు ... చివరాఖరికి దురద కూడా వాక్సిన్లు .తిరుగు లేని బిజినెస్. అవి వేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొంటే బోనస్ బిజినెస్ . ఇంతకీ కరోనా వాక్సిన్లు ఏమయ్యాబ్బా ? ముక్కు నోరు . చెవి.. ఇలా నవ రంద్రాల్లో వేసే వాక్సిన్లు .. వాటి మార్కెటింగ్ కోసం అదిగో చైనాలో కేసులు .. లాంగ్ కరోనా .. తొక్క... అంటూ విషపు రాతలు .. మరో పక్క కరోనా వాక్సిన్ వేసుకంటే కండ పుష్టి .. అంటూ మార్కెటింగ్ చేసే బ్రోకర్లు ... అరెరే .. ఎక్కడ పోయారబ్బా ? పిల్లి వచ్చే ఎలుక భద్రం అంటూ ఒక్క సారిగా మొత్తం మాయం అయిపోయారే. అన్నట్టు వారి ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు వేసుకోవాలిగా . ఆ లెక్కన ఇప్పుడు.. అయిదోదో ఆరోదో పొడుస్తుండాలిగా ? ఏంటి ఆగిపోయింది. ఇక ఇప్పుడు సెల్ ఫోన్ కు పిల్లలు బానిసలు అయిపోతుంటే... వాడిది రెహబ్ సెంటర్ బిజినెస్ . వాడిదేనా ? తిలాపాపం తలా పిడికెడు.. పిల్లలు సెల్ ఫోన్ వాడడం మానేస్తే వాటి అమ్మకాలు సగానికి పడిపోతాయి. సెల్ ఫోన్ బిజినెస్ దెబ్బ తింటుంది. దానితో పత్రికలకు ప్రకటనలు తగ్గిపోతాయి. ఓయో హోటళ్ల బిజినెస్ డల్ అయిపోతుంది. గంజాయి దందా తగ్గిపోతుంది. చెప్పుకొంటూ పొతే లిస్ట్ కొండ వీటి చేంతాడంత. ఒకటి నిజం. తమ చుట్టూరా ఉన్న పిల్లలు సెల్ ఫోన్ వాడుతుంటే మన పిల్లలు అదే పని చెయ్యాలని చూస్తారు. అందుకే మేము రివర్స్ ఎటాక్ మొదలెట్టాము. మా పిల్లలు సెల్ ఫోన్ వాడరు. మీ ఇరుగు పొరుగు పిల్లలో చైతన్యం తెండి అని చెప్పాము . ఒక్కోక్కరూ కనీసం అయిదు మందికి .. ఈ వారం రోజుల వానల్లో అందరూ కలిసి కొన్ని వేల మంది పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చారు . "సెల్ ఫోన్ వద్దు. ఆటలు ఆడుకోండి. బాల్యాన్ని ఎంజాయ్ చెయ్యండి. జంక్ ఫుడ్ వద్దు . ఆరోగ్య కరమయిన ఆహారం తీసుకోండి" అని ఎలుగెత్తి చాటారు. మార్పు వస్తుందా ? వస్తుంది. అవతలి వారికి చెప్పడమంటే తమకు తాము చెప్పుకోవడం. ఈ విధంగా మా పిల్లల్లో ఆ భావన మరింత దృడంగా .. పక్కింటి పిల్లలో .. ముఖ్యంగా వారి తల్లితండ్రుల్లో అవగాహన. వారు ఇప్పుడైనా నిద్ర లేస్తే బయటపడతారు . లేకుంటే రేపు దారుణాలకు మూగ సాక్ష్యంగా మిగిలి పోతారు. ఒక స్కూల్ ఇలా చేస్తోంది . మీరు ఇలా ఎందుకు చెయ్యరు అని ప్రతి ఒక్కరు తమ పిల్లలు చదువుతున్న స్కూల్ యాజమాన్యాలను ప్రశ్నిస్తే ? ఎన్నికలు రాబోతున్నాయి. మీ డ్రామాలు, గోవా ఫైటింగ్‌లు ఆపండి. బాల లోకాన్ని పీడిస్తున్న ఈ వ్యసనం పై మీ స్టాండ్ ఏంటి ? యునెస్కో చెప్పాక కూడా నిద్ర నటిస్తారా ?" అని ప్రతి రాజకీయనాయకుడ్ని, పార్టీని ప్రశ్నిస్తే .. మార్పు రాదా ? ప్రశ్నించడం ఆంటే వీధుల్లోకి పోనక్కర లేదు. జస్ట్ సోషల్ మీడియాను వేదికగా చేసుకొంటే చాలు. ఇంకా... స్వచ్చంద సేవ సంఘాలు .. ప్రజా సంఘాలు .. సినిమా హీరోలు .. అబ్బో సమాజం శక్తి కొంచమయ్యిందా ? ముందుకు రావాలి. రావాలి... బాబూ... రావాలి . రాక పొతే చరిత్ర హీనులయి పోతారు . ఎవరో వస్తారని .. ఏదో చేస్తారని .. నిజం మరిచితే నిదురోతే? కరోనా రెండో వేవ్ .. అటు పై వాక్ సీన్ సైడ్ ఎఫెక్ట్స్ కంటే... దారుణాలు ఖాయం . ఇది శాపనార్థం కాదు . హెచ్చరిక దండోరా ! మార్పు మనింటి నుంచే మొదలు కావాలి . వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, విద్యావేత్త (చదవండి: మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు) -
తాగితే మా ఆయన చాలా క్రూరంగా బిహేవ్ చేస్తాడు.. ఏం చేయాలి?
వ్యసనాల బారిన పడిన వ్యక్తిని ఆ కుటుంబంలోని వారు మొదట్లో గుర్తించరు. తమ వాళ్లు మంచివాళ్లని, చెడు అలవాట్లకు బానిసలు కారని నమ్ముతారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్నేహితుల ప్రభావమో, మరొకటో అనుకుంటారు తప్ప సమస్యను పెద్దగా పట్టించుకోరు. ఈ సమస్యను ఫ్యామిలీ డినైల్ అంటున్నారు నిపుణులు. అడిక్షన్స్ గురించి అసలు మన కుటుంబాలు ఎంతవరకు అర్ధం చేసుకుంటున్నాయి..? ఎలాంటి నిర్ణయాలు అమలు చేస్తున్నాయి? ఈ అంశం పై ‘మనం మాట్లాడుకోవాల్సిందే!’ ► అపార్ట్మెంట్లో దాదాపు అన్ని ఫ్లాట్స్ ఒకేలా ఉంటాయి. ఒకబ్బాయి రాత్రి టైమ్‌లో బాగా తాగేసి తమ ఇల్లు అనుకొని, వేరేవాళ్ల ఇంటి బెడ్రూమ్కి వెళ్లి పడుకున్నాడు. ఆ ఇంట్లో వాళ్లు పెద్ద గొడవ చేశారు. ఆ అబ్బాయి వాళ్ల తల్లితండ్రులు తమ పిల్లవాడిని తిట్టకుండా ఏదో పొరపాటున జరిగి ఉంటుందంటూ ఆ కుటుంబంతో గొడవ పడ్డారు. ► ఫ్యామిలీ ఫంక్షన్‌కి భర్త రాలేదు. ‘ఏమైంది..’అని ఎవరైనా అడిగితే ఆరోగ్యం బాగోలేదు అంటారు. ఆ సదరు వ్యక్తి ఇంట్లో ఉండి తాగుతుంటాడు. ► మల్టిపుల్ అడిక్షన్స్‌కు అలవాటుపడిన ఓ అబ్బాయి వచ్చి కౌన్సెలింగ్ తీసుకుంటానంటే, తల్లి ఒప్పుకోలేదు. ‘నీకేమైంది, బాగానే ఉన్నావ్ కదా! పై చదువుల కోసం అమెరికా వెళుతున్నావ్. బాధ్యత తెలిస్తే సెట్ అవుతావులే’ అంటుంది. ► ఒక భార్య ‘మా ఆయన తాగినప్పుడు చాలా క్రూరంగా బిహేవ్ చేస్తాడు. మిగతా సమయాల్లో చాలా చాలా బాగుంటాడు’ అని సరిపెట్టుకుంటుంది. ► ‘మా వాడు చాలా మంచోడు సార్, చాలా జాగ్రత్తగా ఉంటాడు. మొన్ననే తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయ్యింది’ అంటాడు తండ్రి. ► కజిన్స్ రిలేటివ్ ఫంక్షన్లో ఒకబ్బాయి ఓవర్‌గా తాగాడు. మనవాడు కదా అని మరుసటి రోజు తల్లికి ఫోన్ చేసి ‘అక్కా, మీ అబ్బాయి పార్టీలో ఓవర్‌గా తాగాడు’ అని చెబితే ‘మా అబ్బాయి అలాంటోడు కాదు, ఫ్రెండ్స్, కజిన్స్ బలవంతం చేసుంటారు’ అని వెనకేసుకొచ్చింది. విషయం చెప్పిన వ్యక్తితో మాట్లాడటమే మానేసింది. బంధుమిత్రులు ఎవరైనా ‘మీ అబ్బాయి తాగుతుండగా ఫలానా చోట చూశాం’ అని చెబితే వాళ్లతోనూ మాట్లాడటం మానేసింది. ఒకసారి కాలేజీలో గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. తల్లిదండ్రులని పిలిస్తే ‘మా అబ్బాయిని కావాలనే బ్లేమ్ చేస్తున్నారు. మీదే అసలు సమస్య అనేసింది.’ ఇలాంటి సమర్థింపులు ఎన్నో .. ఎన్నెన్నో మీకూ తెలిసే ఉంటాయి. వెరీ డేంజర్!! చాలామంది పేరెంట్స్ తమ పిల్లలు వ్యసనాల బారినపడ్డారనే విషయం తెలిసినా వారు ఒప్పుకోరు. వ్యసనపరులకు కుటుంబాల నుంచి ఇలాంటి రక్షణ దొరికితే ఎప్పటికీ మార్పు రాదు సరికదా సర్దుకుపోవడం, కొట్టిపారేయడం చేస్తుంటే మీ కుటుంబం బీటలు వారడానికి సిద్ధంగా ఉందని గ్రహించాల్సిందే! అడిక్షన్ వెరీ వెరీ డేంజర్ డిసీజ్. ఈ సందర్భంలో కుటుంబంలో ఎవరిలోనైనా అడిక్షన్స్‌కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయించడం మేలు. ధైర్యమే ఆయుధం వ్యసనాల బారిన పడ్డవారు నమ్మబలికే మాటలు చెబుతారు. సంఘటన తర్వాత ‘సారీ..’ అనేస్తారు. చిన్న చిన్న కానుకలు ఇచ్చి, తమ లోపాన్ని కప్పిపుచ్చుకునేవారుంటారు. దీంతో అమ్మ/భార్య/అక్క/ మన వాళ్లే కదా, మన పిల్లలే కదా.. మరోసారి ఇలా చేయరులే అనుకుంటారు. ఇదే విధమైన ప్రవర్తన కొన్నాళ్లకు ముదిరి ఇంట్లో భయోత్పాతాలను సృష్టిస్తుంటారు. కుటుంబం ప్రవర్తన మారాల్సిందే! కొడుకు/కూతురు/హజ్బెండ్/ఫాదర్ కి అడిక్షన్ పట్ల సపోర్ట్ ఇవ్వకూడదు. ఇంట్లో డబ్బులివ్వకపోతే బయట అప్పులు చేస్తారు. పదివేలు, ఇరవైవేలు అప్పు చేసినప్పుడు ఎవరైనా ఇంటి మీదకు వస్తే కుటుంబంలో ఉన్నవారిని బెదిరియ్యకుండా ఆ అప్పు తీర్చేస్తారు. సదరు వ్యక్తికి ఇబ్బంది కలగనీయకుండా అడ్డుగా నిలబడతారు. ఆ సమస్యను ఫేస్ చేయనీయకుండా వెనకేసుకొస్తారు. కాలేజీలో సమస్య వచ్చినా, మరోచోట సమస్య వచ్చినా తల్లిదండ్రులు కొడుకును కాపాడటానికి ట్రై చేస్తారు. దీనివల్ల పిల్లవాడు మరిన్ని తప్పులు చేసేలా ఆ కుటుంబంలోని వారు ప్రోత్సహిస్తున్నట్లే. మందలించాల్సిందే! ముందు తప్పించుకోవడం, సర్దుబాటు చేసుకోవడం నుంచి కుటుంబాల్లో ఉన్నవారు బయటకు రావాలి. కౌన్సెలింగ్ సమయంలో ముఖ్యంగా ఆడవాళ్లకు బలంగా ఉండాలని చెబుతాం. గట్టిగా మందలించమని చెబుతాం. ‘ఇది మా వ్యక్తిత్వం కాదు కదా’ అంటారు. కానీ, మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారు అని గుర్తించరు. సమస్యను భరిస్తూ ఉంటే ఏదో ఒక రోజున మిమ్మల్ని వ్యసనపరులు నిస్సహాయ స్థితికి తీసుకెళతారు. కుటుంబం బలంగా ఉండాలంటే మేజర్ రోల్ భార్య/తల్లిదే. ఆమె గట్టిగా ఉండాల్సిందే. కుటుంబం బాగుండాలంటే మంచిగవ్వాల్సిందే! అని చెప్పాలి. ఒకతను ఆల్కహాల్/ డ్రగ్స్ వాడుతున్నాడంటే అతని మైండ్ నిలకడగా లేదని అర్ధం చేసుకోవాలి. ఫ్రెండ్స్, రిలేటివ్స్, శ్రేయోభిలాషుల సాయంతోనైనా సమస్యను చక్కదిద్దాలి. ‘థెరపీ అవసరం లేదు, సదరువ్యక్తికి తెలియకుండా మందులు ఇప్పిద్దాం’ అనుకుంటారు. కానీ, యాంటీ క్రేవింగ్ మెడిసిన్స్ వాడటం వల్ల బ్రెయిన్‌కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కొత్త సమస్యలు పుట్టుకు రావచ్చు. అవగాహన, బిహేవియరల్ థెరపీ ద్వారానే పరిష్కరించాల్సి ఉంటుంది. ముందుగా కుటుంబాల వాళ్లు... 1. ఇదొక వ్యసనం అని అంగీకరించాలి. 2. పూర్తి చికిత్స ప్రాముఖ్యాన్ని అర్ధం చేసుకోవాలి. 3. చికిత్సకు కావాల్సినంత టైమ్ ఇవ్వాలి. నలుగురిలో తెలిస్తే పరువు పోతుందని భయపడుతుంటారు. ఏదైనా అనారోగ్యం చేస్తే హాస్పిటల్‌కు ఎలా వెళతామో సైకలాజికల్ సమస్య వస్తే అందుకు సంబంధించిన డాక్టర్ని కలవడానికి ఇబ్బంది పడకూడదు. – డాక్టర్ గిడియన్, డి–అడిక్షన్ థెరపిస్ట్ -
13 ఏళ్ల అమ్మాయి..తల్లిదండ్రులకు ఓ రేంజ్లో షాక్ ఇచ్చింది!
వీడియో గేమ్స్ అడిక్షన్ ఇంటింటి వ్యసనాయణం! అది చైనా, హేనన్ ప్రావిన్స్‌లోని ఒక కుటుంబానికి ఎలాంటి షాక్‌ను ఇచ్చిందో చదవండి. ఆ కుటుంబంలోని పదమూడేళ్ల అమ్మాయికి వీడియో గేమ్స్ అంటే పిచ్చి. నిద్రాహారాలు మరచిపోయి మరీ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది.. ఇల్లు, బడి అనే తేడా లేకుండా! ఆ అమ్మాయికున్న ఈ అలవాటును ఇంట్లో పెద్దలు నిర్లక్ష్యం చేసినా బడిలో టీచర్ మాత్రం లక్ష్యపెట్టింది. ఆ పిల్ల తల్లిదండ్రుల దృష్టికీ తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి మీద ఓ కన్నేసి ఉంచింది ఆమ్మ. ఎన్నో రోజులు గడవకముందే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో అమ్మ కంట్లో పడింది. ఏంటా అని చూస్తే.. తన కూతురు ఖర్చు పెట్టిన డబ్బు తాలూకు బ్యాంక్ స్టేట్మెంట్స్ వీడియో అది. ఒకటి కాదు రెండు కాదు 51,72,646 రూపాయలు. అది ఆ పిల్ల అమ్మానాన్న కొన్నేళ్లుగా కూడబెట్టిన మొత్తం! ఒక్క పూటలో అలవోకగా ఖర్చుపెట్టేసింది. అంతా ఆన్లైన్ పేమెంటే. కూతురికి ఎప్పుడైనా అర్జంట్‌గా ఏదైనా అవసరం వస్తుందేమో ఎంతకైనా మంచిది అని అమ్మాయికి తన డెబిట్ కార్డ్ పిన్ నంబర్ చెప్పింది. ఇంకేముంది ఆ కూతురు కొత్త వీడియో గేమ్స్ కొనడానికి, ఆడుతున్న గేమ్స్‌కి కావల్సిన పాయింట్స్‌ని సంపాదించడానికీ తల్లిదండ్రుల సేవింగ్స్‌ని ఖర్చుపెట్టింది ఆ పిన్ నంబర్ ఉపయోగించి. తన ఈ సీక్రెట్ ఫ్రెండ్స్‌కి తెలిసిపోయి.. బ్లాక్మెయిల్ చేసేసరికి వాళ్లకూ కావల్సిన వీడియో గేమ్స్‌ని కొనిపెట్టి మొత్తం డబ్బును హుష్ కాకి చేసేసింది. ఈ వ్యవహారం తల్లి కంట పడకుండా చక్కగా ఫోన్లోంచి ఆ ట్రాన్జాక్షన్ హిస్టరీని డిలీట్ చేసింది. పదమూడేళ్ల అమ్మాయి రికార్డ్ స్థాయిలో వీడియో గేమ్స్ కొనేసరికి అది సోషల్ మీడియాలో వైరలై.. ట్రాన్జాక్షన్ స్టేట్మెంట్ కూడా బయటకు వచ్చి.. అమ్మకు షాక్ ఇచ్చింది. ఇన్నాళ్ల తమ కష్టాన్ని కూతురు సింపుల్‌గా స్వైప్ చేయడంతో నెత్తీనోరు కొట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. ఈ వ్యసనాయణం మనకూ షాక్ ఇవ్వకుండా జాగ్రత్తపడదాం! (చదవండి: బంధం నిలబడాలంటే అదొక్కటే సరిపోదు!) -
డేంజర్: పొద్దస్తమానం.. ఫోన్లోనే!
మాటలు లేవు.. మాట్లాడుకోవడాలు లేవు.. బంధుమిత్రులు ఇంటికొస్తే పలకరింపులూ లేవు.. తలోక దిక్కున సెల్‌ఫోన్‌తో ఎవరి పనిలో వారు బిజీ.. ఆ ఫోన్లతో సోషల్ మీడియా సముద్రంలో ఈదుతుంటాం.. ఏ ఇంటికెళ్లినా ఈ కాలంలో కనిపించే దృశ్యం దాదాపు ఇదే! ఏదో కాలక్షేపానికి కొద్దిసేపు సోషల్ మీడియాను వాడితే తప్పులేదు కానీ.. గంటలు కరిగిపోయే స్థాయిలో దానికి కట్టుబానిసలైతే మాత్రం డేంజర్.. డేంజర్.. డేంజర్!!! టెక్నాలజీ అనేది రెండువైపులా పదునున్న కత్తి అంటారు... ఇదీ చాలా పాతకాలపు సామెతే కానీ, సోషల్ మీడియా ఈ తరానికి ముఖ్యంగా యువతరానికి చేస్తున్న చేటును దృష్టిలో పెట్టుకుంటే దానిని తరచూ గుర్తుచేసుకోవడంలో తప్పేమీ లేదు. ఇందుకు తగ్గట్టుగానే ట్విట్టర్, టిక్‌టాక్, వాట్సాప్, ఇన్‌స్టా్రగామ్, స్నాప్‌చాట్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల లాభనష్టాల గురించి వివరించే అధ్యయనాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా లివింగ్ సర్కిల్స్ అనే సంస్థ దేశంలోని 287 జిల్లాల్లో 9–13 ఏళ్ల వయసున్న పిల్లలు గల తల్లిదండ్రులతో, అలాగే 13–17 సంవత్సరాల వయసున్న బాలబాలికలతో ఒక అధ్యయనం నిర్వహించింది. సామాజిక మాధ్యమాల వాడకాన్ని అనుమతించడంపై తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటే సోషల్ మీడియా ఖాతాలను కలిగి ఉండటం దాని వాడకం తీరుతెన్నులపై టీనేజర్లను అడిగి తెలుసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 65 వేల మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. జరుగుతోంది తప్పే.. అధ్యయనంలో పాల్గొన్న తల్లిదండ్రుల్లో 40 శాతం మంది పిల్లలు వీడియో గేమ్‌లకు, సామాజిక మాధ్యమాలకు బానిసలైనట్లు ఈ సర్వేలో వెల్లడైన భయంకరమైన సత్యం, కాగా, ఇది సరి కాదని వారు కూడా అంగీకరించడం కొసమెరుపు. హైసూ్కల్లో చేరే వయసు కూడా లేని పిల్లలకు స్మార్ట్ఫోన్లు నిత్యం అందుబాటులో ఉన్నాయని 55 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరించారు. టీనేజర్ల తల్లిదండ్రుల దగ్గరకు వచ్చే సరికి ఈ సంఖ్య 71 శాతం ఉంది. అయితే, కోవిడ్ కారణంగా విద్యాసంస్థలు సక్రమంగా పని చేయకపోవడం వల్లనే తాము పిల్లలకు స్మార్ట్ఫోన్లు కొనివ్వాల్సి వచి్చందని మెజారిటీ తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. ఈ కారణంగానే పిల్లలు సామాజిక మాధ్యమాలకు పరిచయమయ్యారని, అది కాస్తా వ్యసనంగా మారుతోందన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సామాజిక మాధ్యమాల్లో ఖాతా తెరిచేందుకు కనీస వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే కావడం. దీనిని కనీసం 15 సంవత్సరాలకు పెంచితే సమస్య కొంతవరకైనా తగ్గుతుందని 68 శాతం మంది తల్లిదండ్రులు తమ ఆవేదన చెప్పుకున్నారు. తమని తాము తక్కువ చేసుకుంటారు.. పిల్లలంటేనే వారికి ఎల్లల్లేని ఆత్మవిశ్వాసం. ప్రపంచంలో దేనినైనా అవలీలగా సాధించగలమన్న నమ్మకం కలిగి ఉంటారు. అయితే, సామాజిక మాధ్యమాల మితిమీరిన వాడకం కారణంగా వీరిలో ఈ లక్షణం క్రమేపీ సన్నగిల్లుతోందని, వారు తమని తాము తక్కువ చేసుకుని చూసుకుంటున్నారని లోకల్ సర్కిల్స్ అధ్యయనం తేలి్చంది. ఆ సర్వే మాత్రమే కాదు ఇప్పటికే జరిగిన పలు శాస్త్రీయ పరిశోధనలు కూడా ఈ విషయాన్ని తేల్చి చెప్పాయి. ప్రతి చిన్న విషయానికీ సోషల్ మీడియాపై ఆధారపడటం వల్ల పిల్లలతోపాటు పెద్దవారిలోనూ కొన్ని శారీరక, మానసిక మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, మనోవ్యాకులత, ప్రతిదానికీ చికాకుపపడటం వంటివి వీటిల్లో కొన్ని. పైగా పిల్లలు ఏ అంశంపైనా సరైన దృష్టిని కేంద్రీకరించలేని పరిస్థితి ఉంటోంది. లోకల్ సర్కిల్స్ అధ్యయనం ప్రకారం 13–17 మధ్య వయసు్కలు రోజుకు మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియాపై ఖర్చు చేస్తున్నారు. నగరాల్లోనైతే 9–13 మధ్య వయస్కులైన పిల్లలు కూడా ఇదే రకంగా ఉన్నట్లు 49 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరించారు. మానసిక సమస్య కాదు టీనేజీ లేదా అంతకంటే తక్కువ వయసులో సామాజిక మాధ్యమాలకు అలవాటు పడిపోవడం మానసిక సమస్య కాదన్నది నిపుణుల అభిప్రాయం. కాకపోతే మార్చుకోదగ్గ బిహేవియరల్ డిజార్డర్ అని చెప్పకతప్పదని ప్రముఖ మానసిక నిపుణుడు డాక్టర్ ఎంఎస్ రెడ్డి చెప్పారు. టీనేజీ వారైనా, పెద్దలైనా రోజుకు కనీసం 150 సార్లు తమ ఫోన్లు చెక్ చేసుకుంటారని సర్వేలు చెబుతున్నాయి. మరీ ఎక్కువగా ఆధారపడ్డ వారైతే నిత్యం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండటం గ్యారంటీ అంటున్నారు నిపుణులు. సామాజిక మాధ్యమాల వల్ల సమస్యలున్నాయని కోవిడ్‌కంటే ముందు కూడా చాలా అధ్యయనాలు స్పష్టం చేశాయి. అతి వాడకం వల్ల ఇవి మరిన్ని వ్యవసనాలకు పాల్పడే అవకాశాలూ ఎక్కువని ఈ అధ్యయనాలు తెలిపాయి. పెద్దలకు మాత్రమే పరిమితం కావాల్సిన కంటెంట్ సులువుగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటమూ టీనేజీ వారికి అంత మంచిది కాదన్నారు మానసిక నిపుణులు డాక్టర్ వీరేంద్ర. ఇటీవల కాలంలో తమ వద్దకు వచి్చన కేసుల్లో అధికం ఇలాంటివేనని మానసిక నిపుణులు అంటున్నారు. పైగా, సోషల్ మీడియాలో ఎవరు ఎవరన్నది ఏమాత్రం తెలిసే అవకాశం లేదు. ఈ కారణంగా ఆడ పిల్లలు ప్రమాదాల బారిన పడేందుకూ అవకాశాలు పెరిగాయంటూ ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ జాయ్ ఎన్ టిర్కీ సైబర్ క్రైమ్ విభాగానికి సమరి్పంచినలో నివేదికలో వెల్లడించారు. జామా సైకియాట్రీ అధ్యయనం ప్రకారం.. రోజుకు మూడు గంటల కంటే ఎక్కువ సమయం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి మాధ్యమాల్లో గడపడం టీనేజర్లకు ఏ మాత్రం సరికాదు. అర గంట కంటే ఎక్కువ సమయం గడిపే వారికి అసలు వాడని వారితో పోలి్చనప్పుడు మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ. టీవీ, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, మ్యూజిక్ వంటి అన్ని రకాల వినోదాలను పరిగణనలోకి తీసుకుంటే కొంతమంది టీనేజర్లు రోజుకు తొమ్మిది గంటల వరకూ గడుపుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇలా గుర్తించండి.. ► సోషల్ మీడియాలో గడిపే సమయం క్రమంగా ఎక్కువవుతుంటే... లైకులు ఎన్ని వచ్చాయి? ఎలాంటి కామెంట్లు వచ్చాయో.. అని మామూలు సమయంలోనూ ఆలోచిస్తూంటే.. ► ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు తగ్గిపోయినా.. ఇతర అలవాట్ల నుంచి దూరంగా తొలగుతున్నా.. స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ అందుబాటులో లేకపోతే తెగ ఆందోళన చెందుతున్నా.. చదువులు దెబ్బతింటున్నా.. బంధుమిత్రులు, తల్లిదండ్రులు తిడుతున్నా.. నచ్చచెబుతున్నా సోషల్ మీడియాను వదలకుండా ఉంటే.. పైన చెప్పుకున్న విషయాలన్నీ మీకు లేదా మీకు తెలిసిన టీనేజీ వారికి వర్తిస్తున్నాయా? అయితే సామాజిక మాధ్యమం ఉచ్చులో చిక్కినట్లే!!! :::కంచర్ల యాదగిరిరెడ్డి -
నా కుమారుడిని రక్షించుకోలేకపోయా!: కేంద్ర మంత్రి భావోద్వేగం
మద్యం సేవించే అధికారికంటే రిక్షా తొక్కేవాడిని, కూలీలను పెళ్లిచేసుకోవడం సముచితమని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు తమ కుమార్తెలు, సోదరీమణులకు మద్యపానం చేసేవారితో అస్సలు వివాహం చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఉత్తరప్రదేశ్‌లోని లంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో మద్యపానం డి అడిక్షన్‌పై జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ...తాను ఎంపీగా తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా తమ కుమారుడి ప్రాణాలను కాపాడలేకపోయినప్పుడూ..సామాన్య ప్రజలను ఎలా కాపాడగలనంటూ భావోద్వేగానికి గురయ్యారు. "తన కొడుకు ఆకాష్ తన స్నేహితులతో మద్యం సేవించడం అలవాటు చేసుకున్నాడు. మానిపించేందుకు డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించాం. ఆ అలవాటు మానుకుంటాడని పెళ్లి కూడా చేశాను కానీ అతను పెళ్లైన తర్వాత కూడా తాగడం ప్రారంభించాడు. క్రమంగా అది అతని మరణానికి దారితీసింది. దీంతో అతడి భార్య వితంతువుగా మారింది. పైగా వారికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు." అని ఆవేదనగా చెప్పుకొచ్చారు. అందువల్ల దయచేసి మీరు మీ కుమార్తెలను, సోదరీమణులను ఇలాంటి వ్యసనపరులకు కట్టబెట్టకుండా రక్షించండి. ఈ తాగుడు వ్యసనం కారణంగా ప్రతి ఏడాది సుమారు 20 లక్షల మంది మరణిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎంపీ కూడా 80 శాతం క్యాన్సర్ మరణాలకు కేవలం పొగాకు, సిగరెట్లు, బీడీల వ్యసనమే కారణమని అన్నారు. ఈ డీ అడిక్షన్ కార్యక్రమంలో ప్రజలు, ఇతర సంస్థలు భాగస్వాములు కావాలని కుటుంబాలను రక్షించుకోవాలని ఆయన కోరారు. అలాగే జిల్లాను వ్యసన రహితంగా మార్చేందుకు డీ అడిక్షన్ క్యాంపెయిన్‌ను అన్ని పాఠశాలలకు తీసుకువెళ్లాలని, పైగా ఉదయం ప్రార్థన సమయంలో పిల్లలకు దీని గురించి చెప్పాలని కేంద్ర మంత్రి కౌశల్ అధికారులను ఆదేశించారు. (చదవండి: ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్ గాంధీ) -
ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఆన్లైన్ ‘ఆట’కట్టించిన తల్లిదండ్రులు
బీజింగ్: చైనాలో ఆన్లైన్ వీడియో గేమ్‌లకు బానిసగా మారిన ఓ ఐదో తరగతి బాలుడిని ఆ వ్యసనం నుంచి బయటపడేసేందుకు తల్లిదండ్రులు అతని ‘దారి’నే ఎంచుకున్నారు! రోజూ గంటల తరబడి వీడియో గేమ్‌లు ఆడుతున్న తమ కుమారుడు తిరిగి చదువుల బాట పట్టేందుకు వీలుగా ఓ ప్రొఫెషనల్ ఆన్లైన్ గేమర్‌ను ఆశ్రయించారు!! ఇందుకోసం అతనికి గంటకు సుమారు రూ. 600 చొప్పున ‘సుపారీ’సైతం చెల్లించారు!! ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా తమ కుమారుడిని ఆన్లైన్ గేమర్‌తో చిత్తుగా ఓడించడం ద్వారా ఈ తరహా ఆటలు ఆడటంలో నిష్ణాతుడినన్న అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలనుకున్నారు. అనుకున్నట్లుగానే వారి వ్యూహం ఫలించింది. బాలుడితో ఐదు గంటలపాటు ఐదు గేమ్‌లు ఆడిన ఆన్లైన్ గేమర్... అతన్ని చిత్తుగా ఓడించాడు. గేమ్‌లన్నీ పూర్తి ఏకపక్షంగా సాగడంతో కంగుతిన్న బాలుడు.. ఆ ఆటలపై ఇష్టాన్ని కోల్పోయాడు. దీంతో తమ కొడుకును ఓదార్చిన తల్లిదండ్రులు... ఇక నుంచి అతను తిరిగి చదువుపై దృష్టిపెట్టేలా ఒప్పించారు. ఈ విషయాలను ఆన్లైన్ గేమర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. మరో బాలుడిని సైతం ఇలాగే ఆన్లైన్ ఆటల వ్యసనం నుంచి బయటపడేసినట్లు చెప్పాడు. చదవండి: పాలపుంతలో నీటి గ్రహాలు! కనిపెట్టిన నాసా టెలిస్కోప్.. -
పిల్లలు మొబైల్‌కు అడిక్ట్ కాకుండా ఉండాలంటే, ఇలా చేయండి..!
పుస్తకం హస్తభూషణం అనేది పాత మాటయితే, స్మార్ట్ ఫోన్ సర్వహస్త భూషణం అనేది ఈనాటి మాట. అది భూషణమైతే పర్వాలేదు.. అదొక వ్యసనంగా మారింది. ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకూ పట్టి పీడిస్తున్న సమస్య మొబైల్ అడిక్షన్. అసలు దేన్ని వ్యసనమంటారు? ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉపయోగించని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. పిల్లలు ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ గేమ్స్ కోసం వాడుతుంటే.. ఫేస్బుక్, ఇన్‌స్టా, ట్విటర్ లాంటి సోషల్ మీడియా ఇంకా రకరకాల కారణాల కోసం పెద్దలు వాడుతున్నారు. మొబైల్ వాడటం తప్పుకాదు. ఆ వాడకం ఎక్కువై మన రోజువారీ పనుల్ని ఇబ్బంది పెడుతుంటే, దాన్ని మానుకోవాలనుకున్నా మానుకోలేకపోతే దాన్నే వ్యసనం అంటారు. మన దేశంలో 33 శాతం మందికి ఈ వ్యసనం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. అసలెందుకు అడిక్ట్ అవుతారు? మనం ఏ పని చేసినా, ఎంత సంపాదించినా.. అంతిమ లక్ష్యం ఆనందమే. నచ్చినపని చేసినప్పుడు మెదడులో డొపమైన్ అనే కెమికల్ విడుదలవుతుంది. స్మార్ట్ ఫోన్ ఉపయోగించినప్పుడు కూడా ఇదే కెమికల్ విడుదలవుతుంది. సిగరెట్ తాగేవాళ్లు నికోటిన్‌కు, మద్యం తాగేవాళ్లు ఆల్కహాల్‌కు అడిక్ట్ అయినట్లే స్మార్ట్ ఫోన్ వాడేవాళ్లు డొపమైన్‌కు అడిక్ట్ అవుతారు. అంటే డొపమైన్ విడుదల వల్ల వచ్చే ఆనందానికి అడిక్ట్ అవుతారు. గతంలో పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తేనో, ఆటల్లో గెలిస్తేనో సంతోషం కలిగేది. ఇప్పుడంత అవసరం లేదు. సోషల్ మీడియాలో ఫొటోలకు లైకులు, కామెంట్స్ వచ్చినా ఆనందపడుతున్నాం.. డొపమైన్ విడుదలవుతోంది. చాలామంది స్మార్ట్ ఫోన్‌ను ఒక సాధనంగా కాకుండా తమ వ్యక్తిత్వంలో భాగం (ఎక్స్టెండెడ్ సెల్ఫ్) గా భావిస్తున్నారు. అందుకే కాసేపు మొబైల్ దూరమైతే, తమలో ఒక భాగం దూరమైనట్లుగా ఆందోళన చెందుతుంటారు. స్మార్ట్ ఫోన్‌ను వదిలి ఉండలేకపోతుంటారు. ఈ తరం పిల్లలకు స్మార్ట్ ఫోన్ కేవలం ఫోన్ మాత్రమే కాదు. తమ జీవితంలో జరిగే ప్రతీ ఆనందకరమైన సంఘటనను దాచుకునే.. చూసుకునే సాధనం. నాన్న చేతిని పట్టుకుంటే ఎంత భరోసాగా ఉంటుందో, అమ్మ చేతి ముద్ద ఎంత కమ్మగా ఉంటుందో మొబైల్ వాడేటప్పుడు కూడా అలాగే ఫీలవుతుంటారు. మీ పిల్లలు మొబైల్‌కు అడిక్ట్ కాకూడదనుకుంటే మీరు చేయాల్సినవి.. పిల్లలు మొబైల్ తక్కువగా వాడాలంటే ముందు పేరెంట్స్ మొబైల్ వాడకం తగ్గించాలి. పిల్లలు అనేక విషయాల్లో పేరెంట్స్‌నే రోల్ మోడల్‌గా తీసుకుంటారు. 12 ఏళ్లలోపు పిల్లలు గంటలు గంటలు స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగిస్తే వాళ్ల బ్రెయిన్ డెవలప్మెంట్ పై ప్రభావం పడుతుంది. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచే మొబైల్‌ను దూరంగా పెట్టండి. మానవ సంబంధాలకు మెదడులోని ఫ్రంటల్ లోబ్ రెస్పాన్సిబుల్. ఆ భాగం బాల్యంలో బాగా పెరుగుతుంది. బాల్యంలో స్మార్ట్ ఫోన్‌తోనే ఎక్కువ సమయం గడపడం వల్ల పెరుగుదల మందగిస్తుంది. ఫలితంగా సోషల్ స్కిల్స్ తగ్గుతాయి. అటెన్షన్ తగ్గుతుంది. ఇతరుల ఆటిట్యూడ్‌ని, బిహేవియర్, కమ్యూనికేషన్‌ని అర్థం చేసుకోవడమూ తగ్గుతుంది. పిల్లలు ఎంతసేపు స్క్రీన్ చూశారనే దానికన్నా, చూసినదాంట్లో హ్యూమన్ పార్టిసిపేషన్, షేరింగ్ ఉన్నాయా లేవా అనేది ముఖ్యం. అంటే పిల్లలు ఒంటరిగా ఫోన్‌తో ఎంగేజ్ అయితే నష్టం. పేరెంట్స్‌తో కలసి చూస్తే, చూసేటప్పుడు మాట్లాడుకుంటే మంచిది. పిల్లల అల్లరిని తప్పించుకునేందుకు వాళ్ల చేతికి ఫోన్ ఇవ్వడం వాళ్లను ఒంటరితనానికి అలవాటు చేసి మనుషులకు దూరం చేయడమే. Toddlers need laps, not apps. మొబైల్లో పిల్లలకు పనికి వచ్చే టెడ్–ఎడ్, కోరా లాంటి ఎడ్యుకేషనల్ యాప్స్‌ను పరిచయం చేయండి. పిల్లలు ఎంతసేపు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారనేది కాదు, ఎలా ఉపయోగిస్తున్నారనేది వాళ్ల స్క్రీన్ అడిక్షన్‌ను, సోషల్, ఎమోషనల్ సమస్యలను నిర్దేశిస్తుందని అధ్యయనంలో తేలింది. కాబట్టి వాళ్లకు మొబైల్ ఎలా ఉపయోగించాలో నేర్పించండి. ఉదాహరణకు మొబైల్లో క్రికెట్ బాగా ఆడినంత మాత్రాన గ్రౌండ్లో బాగా ఆడలేరని, మొబైల్లో బైక్ రేస్‌లో గెలిచినంత మాత్రాన రోడ్ పై బైక్ నడపలేరని వివరించండి. మొబైల్ గేమ్స్‌లోని స్కిల్స్ బయటకు ట్రాన్స్ఫర్ కావనే విషయం వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. టీనేజర్లకు స్క్రీన్ టైమ్‌ను నియంత్రించడం కచ్చితంగా వర్కవుట్ కాదు. అది పేరెంట్స్‌పై వ్యతిరేకతను పెంచుతుంది. అందువల్ల వాళ్లతో కూర్చుని మాట్లాడి రీజనబుల్ టైమ్ చూసేందుకు ఒప్పించండి. ఫోన్ పక్కన పెట్టేయమని కోప్పడకుండా యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఉండే హాబీలు, పనుల్లోకి డైవర్ట్ చెయ్యండి. అలాంటి పనులు చేసినప్పుడు తరచుగా అభినందించండి. ప్రతి ప్రశంస వారి మెదడులో డొపమైన్‌ను రిలీజ్ చేస్తుంది. ఇవేవీ ఫలితమివ్వకపోతే సైకాలజిస్ట్‌ను సంప్రదించండి. డిజిటల్ డీఅడిక్షన్ ద్వారా మీ పిల్లలు మొబైల్‌కు దూరమయ్యేలా చికిత్స అందిస్తారు. సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
ఫోన్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారా?
ఒక కార్టూన్లో... యువకుడి చేతిలో ఉన్న సెల్‌ఫోన్ కాస్త ‘సెల్’ (జైలు)గా మారుతుంది. అందులో బందీ అయిన కుర్రాడు బయటికి బిత్తర చూపులు చూస్తుంటాడు. యువతరం డిజిటల్ వ్యసనానికి అద్దం పట్టే కార్టూన్ ఇది. హైదరాబాద్‌కు చెందిన పల్లవికి అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వస్తుంటుంది. లేచి తన సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు ‘పదిలంగానే ఉన్నాయా లేదా!’ అని ఒకసారి చూసుకొని పడుకుంటుంది. చెన్నైకి చెందిన శ్రీహర్షిణి ఇంజనీరింగ్ స్టూడెంట్. తాను చదువుకుంటున్నా, ఏదైనా పనిలో ఉన్నా సెల్‌ఫోన్ రింగైనట్లు శబ్దభ్రమ కలిగి, ఫోన్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటుంది. ఇవి మాత్రమే కాదు... ‘స్క్రీన్ టైమ్’లో తినాలనిపించకపోవడం, నిద్రపోవాలనిపించకపోవడం, చేయాల్సిన పనులను వాయిదా వేయడం, స్క్రీన్ యాక్సెస్‌కు అవకాశం లేని సమయాల్లో ఒత్తిడికి గురికావడం, చిరాకు అనిపించడం, కోపం రావడం, ఏదైనా సరే ఆన్లైన్లోనే చేయాలనుకోవడం (అవసరం లేకపోయినా సరే), ఫోన్లలో ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం గడపడం (ఉద్యోగ విధుల్లో భాగంగా కాదు), చదువు దెబ్బతినడం... మొదలైనవి ‘డిజిటల్ అడిక్షన్’ కు సూచనలుగా చెబుతున్నారు. ‘ఇది సమస్య’ అని తెలుసుకోలేనంతగా ఆ సమస్యలో పీకల లోతులో మునిగిపోయిన యువతరం ఇప్పుడిప్పుడే ఆ వ్యసనం ఊబి నుంచి బయటపడడానికి, స్వీయచికిత్సకు సిద్ధం అవుతోంది. ‘డిజిటల్ అడిక్షన్’కు దూరం కావడానికి యువతరంలో ఎక్కువ మంది అనుసరిస్తున్న టెక్నిక్స్‌లో కొన్ని.... 20–20–20: ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి ఫోన్ నుంచి బ్రేక్ తీసుకోవడం. 20 సెకండ్ల పాటు ఫోన్‌ను 20 ఫీట్ల దూరంలో పెట్టడం. అన్నీ బంద్: పడుకోవడానికి ముందు అన్ని స్క్రీన్లు ఆఫ్ చేయడం. డిజిటల్ ఫాస్ట్: నెలలో కొన్నిరోజులు గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండడం. యూజ్ టెక్–స్టే ఆఫ్ టెక్: అధిక సమయం స్మార్ట్ఫోన్లను ఉపయోగించకుండా యాప్ బ్లాకర్, టైమ్ ట్రాకర్లను ఉపయోగించడం. ఉదా: సెల్ఫ్–కంట్రోల్, ఫోకస్ బూస్టర్, థింక్... మొదలైన యాప్స్ అలారం: అలారం సెట్ చేసుకొని ప్రతి అరగంటకు ఒకసారి మాత్రమే సెల్‌ఫోన్ చెక్ చేసుకోవడం. మిగులు కాలం: డిజిటల్ ప్రపంచంలో గడపడానికి నిర్దిష్టమైన సమయాన్ని ఏర్పాటు చేసుకొని, మిగులు కాలాన్ని పుస్తకాలు చదవడానికి, స్నేహితులను ప్రత్యక్షంగా కలవడానికి ఉపయోగించడం, ఇంటి పనుల్లో పాల్గొనడం... మొదలైనవి. టర్న్ ఆఫ్: ఫోన్లో రకరకాల నోటిఫికేషన్లకు సంబంధించి ‘టింగ్’ అనే శబ్దాలు వస్తుంటాయి. ఎంత కాదనుకున్నా వాటిని చూడాలనిపిస్తుంది. దీనివల్ల టైమ్ వేస్ట్ అవుతుంటుంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి నోటిఫికేషన్ టర్న్ ఆఫ్ చేయడం. నో ఫోన్స్ ఎట్ నైట్ పాలసీ: అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితులలోనూ స్మార్ట్‌ఫోన్ వైపు చూడరాదు అనేది ఈ పాలసీ ఉద్దేశం. టెక్ దిగ్గజాలు కూడా కాలం వృథాను అరికట్టడానికి కొత్త ఫీచర్లు తీసుకువస్తున్నాయి. తాజాగా టిక్‌టాక్ రెండు స్క్రీన్టైమ్ ఫీచర్లను తీసుకువచ్చింది. ‘మొదట్లో డిజిటల్ ఫాస్ట్ అనే మాట నాకు వింతగా అనిపించేది. ఇది ఎలా సాధ్యమవుతుంది అని వాదించేదాన్ని. నేను కూడా ప్రాక్టిస్ చేసి చూశాను. చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఏదైనా మితంగానే ఉపయోగిస్తే మంచిది అనే వాస్తవాన్ని తెలుసుకున్నాను’ అంటుంది పల్లవి. ముంబైలో డిగ్రీ రెండో సంవత్సరం స్టూడెంట్ అయిన మేఘ ఒకప్పుడు ఫేస్బుక్లో నుంచి అరుదుగా మాత్రమే బయటికి వచ్చేది. ఈ వ్యసనం తన చదువుపై తీవ్ర ప్రభావం చూపడంతో డిజిటల్ ఫాస్ట్ వైపు మొగ్గు చూపింది. ‘ఫోన్లు, సామాజిక మాధ్యమాలు వాటికవే చెడ్డవేమీ కాదు. అయితే వాటిని ఎలా ఉపయోగిస్తున్నాం, ఎంతసేపు ఉపయోగిస్తున్నాం అనేది అసలు సమస్య’ అంటారు మానసిక నిపుణులు. మొన్నటి వరకు ‘ఫోమో’ ప్రపంచంలో (ఫోమో... ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. ఏదైనా మిస్ అవుతున్నానేమో అనే భావనతో పదే పదే ఫోన్ చెక్ చేసుకోవడం) ఉన్న యువతరం ఇప్పుడు ‘జోమో’ ప్రపంచంలోకి (జోమో... జాయ్ ఆఫ్ మిస్సింగ్ ఔట్–మిస్ కావడంలో కూడా ఆనందం వెదుక్కోవడం) రావడానికి గట్టి కృషే చేస్తోంది. మంచిదే కదా! (క్లిక్: మీరూ మీ ఇల్లూ వానలకు రెడీయేనా?) -
కాలక్షేపం కోసం ఆడిన ఆన్లైన్ గేమ్‌లు...సైబర్ జూదం ఊబిల్లో ..
బనశంకరి: సాంకేతికత అనే కత్తికి ఒకవైపు ఎన్నో ప్రయోజనాలు అయితే, రెండో వైపు ఉన్న నష్టాలు అపారం. ఐటీ సిటీలో ఆన్లైన్ గేమ్స్, జూదాలు క్రికెట్ బెట్టింగ్ వంటివి యువతను పీల్చిపిప్పిచేస్తున్నాయి. వీటి మాయలో పడి డబ్బును కోల్పోయి కుటుంబాలను నిర్లక్ష్యం చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇవి కూడా మద్యం, డ్రగ్స్ మాదిరిగా తీవ్ర వ్యసనాలుగా తయారైనట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనాతో మరో నష్టం మొదట్లో కాలక్షేపం కోసం మొబైల్ యాప్‌ల ద్వారా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కొన్నిరోజులకే వాటికి బానిసలుగా మారడం, ఆపై ఇబ్బందుల్లో కూరుకుపోవడం జరుగుతోంది. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ తరగతులతో అతిగా మొబైల్స్‌ను వినియోగించడం మొదలయ్యాక సైబర్ జూదాల ఊబిలో చిక్కుకుకోవడం అధికమైంది. పీయూసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం పీయూసీ ఫస్టియర్ విద్యార్థికి కరోనా సమయంలో ఆన్లైన్ తరగతుల కోసం తండ్రి మొబైల్ ఇచ్చారు. తరగతులు అయిపోయాక అతడు ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు. తండ్రి మొబైల్ బ్యాంకింగ్ పాస్వర్డ్ తెలుసుకుని గేమ్స్‌కు డబ్బు చెల్లించేవాడు. ఇలా రూ.1.25 లక్షల నగదు కట్ అయింది. తండ్రి ఈ తతంగాన్ని తెలుసుకుని మందలిస్తే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుమారునికి మానసిక వైద్యాలయంలో చికిత్స అందిస్తున్నారు. డబ్బు తగలేసిన టెక్కీ ఒక టెక్కీ పోకర్ అనే ఆన్లైన్ జూదంలో కాలక్షేపం కోసం రూ. వెయ్యి చెల్లించి ఆడాడు. లాభం రావడంతో జూదాన్ని కొనసాగించాడు. కానీ లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ అప్పులను తీర్చడానికి ఇంటిని కుదువ పెట్టాడు, వివిధ బ్యాంకుల్లో రుణాలు చేశాడు. చివరకు అతని భార్య వనితా సహాయవాణి సహాయాన్ని కోరింది. వీధిన పడ్డ క్యాషియర్ బ్యాంక్ క్యాషియర్ ఒకరు ఆన్లైన్ రమ్మీకి బానిసై రెండేళ్లలో రూ.32 లక్షలు డబ్బు పోగొట్టుకున్నాడు. బ్యాంకులో అప్పులు తీసుకున్నాడు. ఒకసారి బ్యాంకులో డబ్బులు కాజేసి పట్టుబడడంతో ఉద్యోగం నుంచి తీసేశారు. ఇదంతా తెలుసుకున్న భార్య తన తల్లిదండ్రుల నుంచి రూ.25 లక్షలు తీసుకువచ్చి అప్పులు తీర్చింది. భర్తలో మార్పు తేవాలని పోలీసులను సంప్రదించింది. ఇలా కౌన్సెలింగ్ కేంద్రాలకు చేరుతున్న దీన గాథలు అనేకం ఉంటున్నాయి. ఆన్లైన్ జూదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు హెచ్చరించారు. (చదవండి: ఎస్ఐ స్కాంలో దంపతుల అరెస్టు) -
స్మార్ట్‌గా బంధిస్తోంది.. అధికమవుతున్న అనారోగ్య సమస్యలు
స్మార్ట్ ఫోన్ల వాడకం పతాకస్థాయికి చేరింది. మొబైల్ లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అవసరానికి వాడుకోవడం మంచిదే. కానీ దానికి బానిసలవుతున్న వారు కెరీర్‌ను పాడు చేసుకుంటున్నారు. అపరిమిత వాడకం.. జీవితాలనే చిన్నాభిన్నం చేస్తోంది. వెన్నెముక, కంటి తదితర సమస్యల బారినపడి అనారోగ్యం పాలవుతున్నారు. సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్మార్ట్ఫోన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా ట్రాయ్ (టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కల ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లా చిరునామాతో సిమ్ కార్డులు తీసుకున్న 8,01,456 మంది స్మార్ట్ఫోన్లు వాడుతున్నట్లు తేలింది. ఏటా 10 నుంచి 15 శాతం వరకు మొబైల్ఫోన్ల సంఖ్య పెరుగుతోంది. ఇవి కాకుండా సాధారణ (కీప్యాడ్) ఫోన్లు మరో 10 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. నెలకు రూ.16 కోట్లు పైనే స్మార్ట్‌ఫోన్ వినియోగదారు నెలకు సగటున రూ.200 వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన వినియోగదారులు వివిధ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు నెలకు కనిష్టంగా రూ.16 కోట్లు, ఏడాదికి రూ.192 కోట్లకు పైగా చెల్లిస్తున్నారని తెలుస్తోంది. మిగతా సాధారణ ఫోన్లు కూడా కలిపితే ఏడాదికి రూ.250 కోట్లకు పైగా చార్జీల రూపంలో ఆయా కంపెనీలకు చెల్లిస్తున్నట్టు సమాచారం. సగటున 2 గంటల సమయం వృథా స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్న వారికి సగటున రోజుకు రెండు గంటల సమయం వృథా అవుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలా ఏదో ఒక యాప్ నుంచి ప్రయోజనం లేకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఎక్కువగా యువకులు, పనిచేసే వారు ఇలా చేయడం వల్ల ఉత్పాదక రంగంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. చాలామంది విద్యార్థులు చదువుల్లో వెనుకబడిపోతున్నారు. సెల్‌ఫోన్ కొనివ్వలేదని.. గత ఏడాది డిసెంబర్లో ఉరవకొండ పట్టణంలో రవినాయక్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇంతకీ కారణమేంటంటే తల్లిదండ్రులు తనకు సెల్‌ఫోన్ కొనివ్వలేదని. తన కొడుకు సెల్‌ఫోన్‌కు బానిస అయ్యాడని తల్లి కుళ్లాయమ్మ కన్నీరుమున్నీరవుతోంది. అలవాటు చేసినందుకు.. అనంతపురం నగరానికి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాసులు, తనూష దంపతులకు మూడేళ్ల తేజాస్ అనే కుమారుడు ఉన్నాడు. అన్నం తినడం లేదని కుమారుడికి సెల్‌ఫోన్ అలవాటు చేశారు. చివరకు ఆ సెల్‌ఫోన్‌కు బానిసైన చిన్నారి.. ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్)కు గురయ్యాడు. ప్రస్తుతం కర్నూలులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ తాజాగా ప్రపంచ ఆరోగ్యసంస్థ సర్వే ప్రకారం ఎక్కువ సేపు మొబైల్ వాడుతున్న వారిలో టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ (మెడ నొప్పి) లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ సేపు మెడ వంచి మొబైల్ ఫోన్ మెసేజ్‌లు చదువుతున్నారు. గంటల తరబడి మెడ వంచి చూడటం వల్ల వెన్నెముక సమస్యలు కూడా వస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా మితిమీరి మొబైల్‌ఫోన్‌కు అలవాటు పడిన చిన్నారులకు రెటీనా (కంటి) సమస్యలు వస్తున్నట్టు అధ్యయనాలు తేల్చాయి. అనర్థాలకు మూలం సెల్‌ఫోన్ అనేక అనర్థాలకు సెల్‌ఫోన్ వినియోగమే మూలం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సెల్‌ఫోన్, వాట్సాప్, ఇంటర్నెట్ వినియోగాన్ని కూడా ఒక బానిసత్వంగా పరిగణించింది. వీటి వల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి. ప్రధానంగా నిద్ర వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది. నిద్ర లేకపోవడంతో కోపతాపాలకు గురికావడం, ధ్యాస లోపించడం తోపాటు కంటి చూపు పూర్తిగా మందగిస్తోంది. చిన్న వయస్సులో నిషేధిత వెబ్సైట్లలోకి ప్రవేశించి పోర్న్ సైట్లకు బానిసలుగా మారిపోతున్నారు. సర్వ అనర్థాలకు కారణం సెల్‌ఫోన్ అని ప్రధానంగా చెప్పవచ్చు. –యండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణుడు, అనంతపురం అధికమవుతున్న అనారోగ్య సమస్యలు (చదవండి: ప్రశాంత్ నీల్.. మన బంగారమే) -
నట్టింట ‘స్మార్ట్’ చిచ్చు!
మాటల్లేవు... మాట్లాడుకోవడాలు లేవు! ఒక అచ్చట లేదు.. ముచ్చటా లేదు! నట్టింట్లో సందడి, హడావుడి లేనే లేవు... ఉన్నదల్లా భరించలేనంత నిశ్శబ్దం! నలుగురు నాలుగు దిక్కుల్లో మొబైల్‌ఫోన్ తెరలకు అతుక్కుపోయిన పరిస్థితి. స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు చాలామందిలో వ్యసనమైపోయింది. దీంతోనే నిద్ర... దీంతోనే మేలుకొలుపు. రీల్స్ మత్తులో కొందరు... పబ్జీ ఆడుతూ ఇంకొందరు.. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇన్‌స్ట్రాగామ్, స్నాప్‌చాట్... పేర్లు ఏవైనా.. అన్నింటి అతి వాడకం పుణ్యమా అని సమాజం విచిత్ర మహమ్మారిని ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి పీడ ఎలాగోలా వదిలిందని సంబరపడుతున్న ఈ సమయంలో దశాబ్దకాలంగా పట్టిపీడిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ మహమ్మారి సంగతులపై ప్రత్యేక కథనం. -కంచర్ల యాదగిరిరెడ్డి సగటున ఏడు గంటలు ఇటీవల ఓ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ దేశంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. 2021లో సగటు భారతీయులు రోజుకు సుమారు ఏడు గంటలపాటు ఫోన్‌కు అతుక్కుపోతున్నారు. ‘నేను మొదట్లో గంట మాత్రమే యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాలను చూసేదానిని. ఇప్పుడు ఆ ఊబి నుంచి బయటపడేందుకు మానసిక నిపుణుడి సహాయం తీసుకోవాల్సి వచ్చింది’ అని ముంబైకి చెందిన గృహిణి ప్రమీలారాణి వాపోయారు. ‘ముఖ్యంగా టీనేజ్ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారు. వారిని ఆ వ్యస నం నుంచి దూరం చేయకపోతే భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. నా దగ్గరకు రోజు ఇలాంటి కేసులు అరడజను దాకా వస్తున్నాయి. వారిలో పిల్లలతో పాటు సాధారణ గృహిణులు కూడా ఉన్నారు’అని ఢిల్లీకి చెందిన మానసిక నిపుణుడు డాక్టర్ రాజేంద్రన్ చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన మానసిక నిపుణుడు డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘నిమిషానికి ఒకసారి.. నోటిఫికేషన్లు, మెయిళ్లు, చాట్ మెసేజీలేమైనా వచ్చాయా? అని చెక్ చేసుకోవడం స్మార్ట్‌ఫోన్ వ్యసన లక్షణాల్లో మొదటిది. ఫోన్ దగ్గర లేకపోతే ఆందోళనలో పడిపోవడం.. నిద్రలేవగానే స్మార్ట్‌ఫోన్ లాక్ ఓపెన్ చేయడం.. ఇలా అనేక రూపాల్లో మన వ్యవసనం బట్టబయలు అవుతూంటుంది’అని చెప్పారు. భౌతిక, మానసిక సమస్యలు స్మార్ట్‌ఫోన్ అతి వినియోగం కారణంగా అటు భౌతిక, ఇటు మానసిక సమస్యలు రెండూ తలెత్తుతున్నాయి. మహిళల్లో తలనొప్పి ఎక్కువ అవుతుండగా.. కళ్ల మంటలు, చూపులో అస్పష్టత, మెడ సమస్యలు, జబ్బు పడితే తేరుకునేందుకు ఎక్కువ సమయం పట్టడం వంటి దు్రష్పభావాలు కనిపిస్తాయి. విద్యార్థుల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం కాస్తా ఏకాగ్రత లోపానికి దారితీస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ‘బాలల హక్కుల సంఘం నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్న విద్యార్థుల్లో 37.15 శాతం మంది ఏకా గ్రత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే కనీసం 23.80 శాతం మంది పిల్లలు నిద్రపోయేటప్పుడు కూడా స్మార్ట్‌ఫోన్‌ను తమ దగ్గరగా ఉంచుకుంటున్నారు’ అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వయంగా గత నెలలో లోక్‌సభకు వివరించారు. ‘ప్రాథమిక ఫలితాల ప్రకారం సెల్‌ఫోన్ రేడియేషన్ కాస్తా మగవారిలో వంధ్యత్వానికి దారితీస్తుంది. అలాగే వీర్యకణాల కదలికలు నెమ్మదించేందుకు, సంఖ్య తగ్గేందుకూ మొబైల్‌ఫోన్ రేడియేషన్ కారణమవుతుంది’ అని ప్రముఖ రేడియోలజిస్ట్ డాక్టర్ కే.గోవర్దన్ రెడ్డి హెచ్చరించారు. ప్రశ్నించుకోండి... సరిచేసుకోండి! స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని గుర్తించేందుకు కొన్ని సర్వేలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లోని ప్రశ్నలకు నిజాయితీగా జవాబులు చెప్పుకోగలిగితే మీరు స్మార్ట్‌ఫోన్‌కు బానిసయ్యారా? లేదా? అన్నది తెలిసిపోతుంది. తదనుగుణంగా సమస్యను అధిగమించే ప్రయత్నం చేయొచ్చు. మానసిక వైద్యులు కౌన్సెలింగ్ ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం చూపగలరు కూడా. అతికొద్ది మందికి కొన్ని మందులు వాడాల్సిన అవసరం రావొచ్చు. అయితే స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని తొలగించేందుకు నిర్దిష్టమైన పద్ధతి అంటూ ఏదీ లేదన్నది మాత్రం అందరూ గుర్తించాలి. -
సరదాగా మొదలై... వ్యసనంగా మారి!
‘చాంద్రాయణగుట్టకు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఇటీవల మత్తుమందుకు అలవాటు పడ్డాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు పాకెట్ మనీ కట్ చేశారు. డ్రగ్స్ కొనడానికి డబ్బుల్లేకపోవడం, తల్లిదండ్రులను అడిగినా ఇవ్వకపోవడంతో ఏకంగా తండ్రినే హత్య చేసేందుకు సిద్ధపడ్డాడు’ ‘గచ్చిబౌలికి చెందిన ఓ యువతి డ్రగ్స్ కొనుగోలు కోసం దొంగతనానికి పాల్పడింది. ముందు ఇంట్లో తల్లిదండ్రుల పర్సులను మాయం చేసేది. అవి సరిపోకపోవడంతో బంధువుల ఇళ్లల్లో బంగారు ఆభరణాలను కొట్టేసి చివరకు పోలీసులకు చిక్కింది’ ‘మలక్‌పేటకు చెందిన ఓ యువకుడు డ్రగ్స్‌కు ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి తల్లిదండ్రులు కొనిచ్చిన టూ వీలర్‌ను అమ్మడమే కాదు.. వీధుల్లో పార్క్ చేసిన వాహనాలనూ కొట్టేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు’ సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. మాదక ద్రవ్యాల కోసం యువత చిన్నచిన్న చోరీల నుంచి హత్యలు చేయడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ఇటీవలికాలంలో నగరంలో పెరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బంజారాహిల్స్ రాడిసన్‌బ్లూ హోటల్లో దొరికిన 150 మందిలో 80 శాతం మంది 35ఏళ్లలోపు వారే. మధ్య తరగతి యువతీ, యువకులు ఎక్కువగా గంజాయి తీసుకుంటున్నారు. ఆర్థికంగా ఉండి, పబ్బులకు వెళ్లేవాళ్లు కొకైన్, హెరాయిన్, ఓపీయం, ఎల్ఎస్డీ వంటి ద్రావణాలను తీసుకుంటున్నారు. ఆవేశంతోనో, ఆనందం కోసమో మొదలవుతున్న ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతోంది. ఆ తర్వాత వారి భవిష్యత్‌నే కబళిస్తోంది. వారి జీవితాలను పాడుచేసుకోవడమే కాదు... మత్తులో వాహనాలు నడిపి ఇతరుల మరణానికీ కారణమవుతున్నారు. చాలా ఘటనల్లో పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడడానికి స్నేహితులు, తల్లిదండ్రులే కారణమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలతో పిల్లలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. లక్షణాలివే.. మాదక ద్రవ్యాలు తీసుకున్న వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులుంటాయి. చిన్న విషయాలకు చిరాకు, కోపం తెచ్చుకుంటారు. వేళకు తినరు. ఒక్కోసారి అతిగా తింటారు. వ్యక్తిగత శుభ్రత ఉండదు. చదువు, పనితీరులో వెనకబడుతుంటారు. ఆసక్తి తగ్గుతుంది. ఏకాగ్రతను కోల్పోతారు. పరధ్యానంలో ఉంటారు. విపరీతమైన దూకుడు ప్రదర్శిస్తారు. నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు. తల్లిదండ్రుల కళ్లల్లోకి సూటిగా చూడలేక పోతారు. ఇలాంటి లక్షణాలుంటే డ్రగ్స్ తీసుకుంటున్నారని అనుమానించొచ్చు. పర్యవేక్షణ అవసరం.. పిల్లలు ఎక్కడికి, ఎవరితో వెళ్తున్నారు? తిరిగి ఇంటికెప్పుడొస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం తింటున్నారు? ఏం తాగుతున్నారు? ఎలాంటివారితో స్నేహం చేస్తున్నారు? వంటి అంశాలు తెలుసుకోవాలి. లేదంటే పిల్లలు చేయిదాటిపోవడమే కాదు అసాంఘీక శక్తులుగా మారే ప్రమాదం ఉంది. ఊహాలోక అనుభూతికోసం.. గంజాయి, కొకైన్, హెరాయిన్, మారిజువానా, మార్పిన్, చేరస్ వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. డ్రగ్స్ తీసుకున్న వారు ఊహా లోకంలో విహరిస్తుంటారు. దీన్నే యూపోరియా అంటాం. ఒకసారి ఈ భావన పొందిన వ్యక్తి మళ్లీ, మళ్లీ అలాంటి అనుభూతినే పొందాలని భావిస్తుంటాడు. ఉన్నత వర్గాల్లో ఈ సంస్కృతి విపరీతంగా పెరిగింది. డ్రగ్స్ వాడకంతో మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇవి దొరక్కపోతే అసాంఘీక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడుతారు. పిల్లలు డ్రగ్స్ బారిన పడితే.. కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడుకోవచ్చు. –డా.కళ్యాణ్ చక్రవర్తి, మానసిక వైద్యనిపుణుడు ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం వ్యసనంగా మారిన డ్రగ్స్ యువత ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపుతున్నాయి. నిరంతరం ముక్కు నుంచి నీరు కారడం, లోపల మంట, గొంతులో పుండ్లు, బొంగురు పోవడం, చర్మంపై దద్దుర్లు, కీలకమైన సిరలు దెబ్బ తినడం, మొదడు పోటు, నిద్రలేమి/అతినిద్ర వంటి సమస్యలు తలెత్తడం, రాపిడికి గురై పళ్లు పాడైపో వడం, గుండెపోటు, వాల్వ్‌లకు ఇన్ఫెక్షన్లు, రక్తకఫం, పిల్లికూతలు, ఆయాసం, ఉబ్బసం, నిమోనియా వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. –డాక్టర్ వై.జయరామిరెడ్డి, వైజేఆర్ డీఅడిక్షన్ సెంటర్ డ్రగ్స్‌తో బ్రెయిన్ స్ట్రోక్ లక్డీకాపూల్ (హైదరాబాద్): ఆల్కహాల్‌తోపాటు డ్రగ్స్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని నిమ్స్ న్యూరో సర్జన్ విభాగం అధిపతి డాక్టర్ ఎర్రంనేని వంశీకృష్ణ తెలిపారు. డ్రగ్స్‌తో రక్తనాళాలు వ్యాకోచించి, మెదడులో రక్తస్రావం అవుతుందని.. ఇది ప్రాణాలకు ప్రమాదకరమని స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగం వల్ల మానసిక ఒత్తిడి, భావోద్వేగ సమస్యలు పెరిగి.. తమ పనులను సక్రమంగా చేసుకోలేని స్థితికి చేరుకుంటారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ బాధితులు గుండెపోటుతో చనిపోతున్నారన్నారు. ఆల్కహాల్‌తో డ్రగ్స్ కలిపి తీసుకునేవారి సంఖ్య పెరిగిందని.. వారిలో చాలా మంది విద్యావంతులు కావడం, 29 నుంచి 35 ఏళ్ల మధ్య వయసువారే అధికంగా ఉండటం ఆందోళనకరమని చెప్పారు. కొకైన్, గంజాయిలను ఆల్కహాల్‌తో కలిపి తీసుకున్న యువకుడు ఇటీవల మెదడులో రక్తస్రావంతో చనిపోయాడని.. ఓ ఐటీ ఉద్యోగిని గంజాయికి అలవాటుపడి రెండుసార్లు బ్రెయిన్ స్టోక్‌కు గురైందని వివరించారు. డ్రగ్స్ వల్ల చేజేతులా జీవితాలను కోల్పోయే ప్రమాదముందని.. యువత ఆల్కహాల్, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. -
ఆదాయం కోసం ప్రభుత్వం అడ్డదారులు: అన్నా హజారే
సాక్షి, ముంబై: సూపర్ మార్కెట్లలో, కిరాణ షాపుల్లోనూ వైన్ విక్రయించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు పోరాటాలకు సిద్ధమవుతుండగా, ప్రముఖ సమాజ సేవకుడు అన్నా హజారే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని, దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో స్పష్టం చేయాలని సోమవారం అన్నాహజారే బహిరంగంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘ఈ నిర్ణయం రైతుల హితవు కోసం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. మరోపక్క వైన్ అంటే మద్యం కాదని కూడా అంటోంది. కానీ ఈ నిర్ణయం భవిష్యత్తులో ఎటు దారి తీస్తుందో’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైన్ విక్రయం ఎవరికి మేలు చేస్తుందో, ఎవరికి కీడు చేస్తుందో త్వరలో బయటపడు తుందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మన రాజ్యాం గం ప్రకారం ప్రజలను వ్యసనాల నుంచి, మాదక ద్రవ్యాలనుంచి విముక్తి చేయడం, మద్యపానానికి దూరంగా ఉంచడం ప్రభుత్వాల విధి. మద్యానికి వ్యతిరేకంగా ప్రచారాల ద్వారా, జనజాగృతి కార్యక్రమాల ద్వారా ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వమే అదనపు ఆదాయం కోసం వ్యసనాలకు బాట వేసే నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయం తనను కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రైతుల హితవు కోసమైతే పేదలు, సాధారణ రైతులు పండించిన పంటలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. కానీ రైతులకు మేలు చేసే అలాంటి చర్యలను విస్మరిస్తూ, యువత భవిష్యత్తును అంధకారంగా మార్చే ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరానికి వెయ్యి కోట్ల లీటర్ల వైన్‌ను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందని ఆయన ప్రశ్నించారు. మంత్రులు నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు 2021 నవంబర్ 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతి చేసుకున్న స్కాచ్ విస్కీపై విక్రయ పన్ను 300 శాతం నుంచి 150 శాతానికి కుదించింది. మద్యం ధరలు తగ్గడంతో విక్రయాలు జోరందుకున్నాయి. ఫలితంగా 2.5 లక్షల బాటిళ్ల విక్రయం పెరిగిపోయింది. ప్రభుత్వానికి లభించే రూ.100 కోట్ల ఆదాయం ఏకంగా రూ.250 కోట్లకు చేరుకుంది. ప్రజలు మద్యానికి బానిసలై సర్వం కోల్పోయినా పర్వాలేదు, ఆదాయం పెరిగితే చాలని ప్రభుత్వం అనుకుంటోందా అని హజారే ప్రశ్నించారు. ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, కొందరు మంత్రులు ఈ నిర్ణయాన్ని సమరి్ధస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అదనపు ఆదాయం కోసం మద్యం విక్రయానికి మార్గం సుగమం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడమంటే రాష్ట్ర ప్రజలకు ఇంతకంటే దురదృష్టకరమైన విషయం ఇంకేముంటుందని నిలదీశారు. ఔరంగాబాద్‌లో విక్రయించండి చూద్దాం: ఇమ్తియాజ్ జలీల్ కిరాణ షాపుల్లోనూ వైన్ విక్రయించేందుకు అనుమతివ్వాలని ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఔరంగాబాద్ ఎంపీ ఇమ్తియాజ్ జలీల్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ లాంటి మహాయోధుడు ఏలిన రాష్ట్రం ఇది. బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన ఇలాంటి పుణ్యభూమిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదు, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఇంకా ఎవరైనా సరే ఔరంగాబాద్‌కు వచ్చి కిరాణ షాపుల్లో వైన్ విక్రయాన్ని ప్రారంభించి చూపాలని సవాలు విసిరారు. ఆ తరువాత షాపులను ధ్వంసం చేసే బాధ్యత తమదని స్పష్టం చేశారు. ఇది కేవలం హెచ్చరిక కాదని, ప్రభుత్వానికి బహిరంగంగా సవాలు విసురుతున్నామని ఇమ్తియాజ్ అన్నారు. వైన్ విక్రయాలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర సంస్కృతిని చెడగొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. వైన్ విక్రయాలతో రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తే చరస్, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల పంటలను కూడా పండించేందుకు అనుమతివ్వాలని ఇమ్తియాజ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీజేపీది ద్వంద్వ వైఖరి: భుజ్‌బల్ సూపర్ మార్కెట్లలో వైన్ అమ్మకాలను అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీని రాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ తీవ్రంగా విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇళ్లలో పెద్ద మొత్తంలో మద్యం నిల్వ చేసుకోవడానికి అనుమతించిందని, అక్కడ తప్పు కానిది, మహారాష్ట్రలోనే తప్పు అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష బీజేపీది ద్వంద్వ వైఖరి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ మార్కెట్లలో వైన్ అమ్మకాలను అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్య కచ్చితంగా రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అవుతుందని పేర్కొన్నారు. రైతులకు అదనపు ఆదాయాన్ని అందించే పండ్ల ఆధారిత వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ మంత్రి నవాబ్ మాలిక్ కూడా వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో, ప్రభుత్వం పెద్దమొత్తంలో మద్యం విక్రయాలకు, బార్లను సైతం తెరవడానికి అనుమతి ఇచ్చారు. మహారాష్ట్రలోనే బీజేపీకి ఇది తప్పుడు నిర్ణయంగా కనిపిస్తోందా అని మాలిక్ ప్రశ్నించారు. ‘వైన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య పానీయంగా పరిగణిస్తారు. ప్రభుత్వ నిర్ణయం రైతులకు కచ్చితంగా ఆర్థికంగా సహాయపడుతుంది. కొనుగోలు చేయాలనుకునే వారు ఎక్కడి నుంచైనా కొనుగోలు చేస్తారు. మా ప్రభుత్వ నిర్ణయ మాత్రం రైతులకు మేలు చేసేందుకే’ అని ఆయన సమర్థించుకున్నారు. అయితే ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థలకు సమీపంలో ఉన్న సూపర్ మార్కెట్లు వైన్‌ను విక్రయించకూడదని, నిషేధం అమలులో ఉన్న జిల్లాల్లోనూ వైన్ అమ్మకాలను అనుమతించబోమని భుజ్‌బల్ స్పష్టం చేశారు. కాగా, బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించారు. ప్రభుత్వం మద్య నిషేధాన్ని ఉపసంహరించుకుందని, మహారాష్ట్రను ‘మద్య’రాష్ట్ర చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. -
మాయదారి అలవాటు.. పిచ్చోళ్లు అవుతున్న పిలగాండ్లు
ఆదిలాబాద్: సాంకేతిక పరిజ్ఞానం మనిషిలోని సృజనాత్మకతను రోజురోజుకూ నీరు గారుస్తోంది. ప్రతీ చిన్న విషయానికి సాంకేతికత ఆసరా తీసుకుని దానికి బానిస అవుతున్నాడు. మొబైల్ ఫోన్లకు అలవాటు పడుతున్న చిన్నారులు బయటి ప్రపంచాన్ని మరిచిపోతున్నారు. యువత, టీనేజర్లు స్మార్ట్ఫోన్లలో మునిగిపోయి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. శారీరక శ్రమ లేక బద్ధకం పెరిగి అనారోగ్యం బారిన పడిన ఆస్పత్రుల పాలవుతున్నారు. వినిపించని బామ్మల కథలు.. గతంలో చిన్నారులు పాఠశాల ముగియగానే ఇంటి వద్ద అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యల పంచన చేరేవారు. వారు చెప్పే పేదరాశి పెద్దమ్మ కథలు, పంచతంత్రం వంటి నీతి కథలను శ్రద్ధగా వినేవారు. దీంతో పిల్లల్లో వినికిడి సామర్థ్యం పెరగడంతోపాటు ఏకాగ్రత, శ్రద్ధ వంటి అంశాలు మెరుగుపడేవి. నీతి కథల ద్వారా నైతిక విలువలు నేర్చుకునేవారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి చిన్నకుటుంబాలు పెరగడంతో పిల్లలకు కథలు చెప్పేవారు కరువయ్యారు. నేటి పిల్లలు పాఠశాల నుంచి రాగానే టీవీ, మొబైల్ ఫోన్లను వదలడం లేదు. మరోవైపు టీనేజ్ పిల్లలు, యువత మొబైల్ ఫోన్ల వాడకంతో అశ్లీలత వైపు అడుగులు వేస్తున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి విపరీత పోకడలు టీనేజ్ పిల్లలను నేరాలను చేయడానికి సైతం ఉసిగొల్పుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పుస్తక పఠనంపై తగ్గిన ఆసక్తి.. డిజిటల్ లర్నింగ్, ఆన్లైన్ తరగతులు రాకతో రోజురోజుకూ పుస్తకం ప్రాధాన్యత తగ్గుతోంది. ఫలితంగా విద్యార్థులు పఠనంపై ఆసక్తి చూపడం లేదు. అరచేతిలోనే ప్రాపంచిక విషయాలు తెలుస్తుండటంతో లైబ్రరీలవైపు పిల్లల అడుగులు పడడం లేదు. ఫోన్లలో ఈ–బుక్ అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువసేపు వాటిని చూడటంతో చిన్నారుల కళ్లు త్వరగా అలిసిపోతున్నాయి. ఫలితంగా ఈ–బుక్ పఠనంలోనూ వారి ఆసక్తి సన్నగిల్లుతోంది. సరైన వినియోగంతోనే.. ఆధునిక యుగంలో మానవ జీవన వృద్ధి, అవసరాలకు సాంకేతిక పరిజ్ఞానం చాలా కీలకం. విద్య, వైద్యం, నిర్మాణం, పారిశ్రామికం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా సర్వం సాంకేతికమయమే. విద్యాబోధన రంగాల్లో కూడా గణనీయ మార్పులు వచ్చాయి. సానుకూల ఫలితాలను ఇస్తున్న సాంకేతికత దుష్ప్రభావాలను సైతం చూపుతోంది. ఇదే విషయమై పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్థుల శారీరక, మానసిక, నైతిక అభివృద్ధికి తోడ్పడాలని నిపుణులు సూచిస్తున్నారు. గంటల తరబడి స్మార్ట్ ఫోన్లను పిల్లలకు ఇవ్వకుండా కట్టడి చేస్తూ, పుస్తక పఠనం, క్రీడలపై ఆసక్తి పెంచాలని సూచిస్తున్నారు. అప్పుడే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. తగ్గిన శారీరక శ్రమ ‘దృఢమైన శరీరంలోనే దృఢమైన మనసు ఉంటుంది’ అని ఒక మేధావి అంటాడు. ఆయన మాటలను పరిగణలోకి తీసుకుంటే శారీరక సామర్థ్యం మానసిక స్థైర్యం పెరుగుదలకు ఉపయోగపడుతుంది అనే విషయం అర్థమవుతోంది. సాంకేతిక ఆధునిక యుగంలో పిల్లలు ఆటపాటలు, క్రీడలకు దూరం అవుతున్నారు. ఫలితంగా శారీరకంగా బలహీనులుగా మారి, మానసికంగా జీవితంలో ఎదగలేకపోతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో ఏ చిన్న ఓటమి వచ్చినా కుంగుబాటుతో ఆత్మహత్య వంటి విపరీత నిర్ణయాలు తీసుకుంటూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. వాస్తవిక ప్రపంచానికి దూరం మొబైల్ ఫోన్లను అధికంగా వినియోగించడంతో పిల్లలు వాస్తవిక ప్రపంచానికి దూరమవుతున్నారు. ఫైటింగ్ గేమ్స్, రేసింగ్ గేమ్స్ ఆడటంతో వారిలో సహనం క్రమక్రమంగా తగ్గిపోయి, ప్రతి విషయానికి ఉద్రిక్తతకు లోనవుతారు. టెక్ గ్యాడ్జెట్స్ అధికంగా వినియోగిస్తుండటంతో కమ్యూనికేషన్, సోషల్ స్కిల్స్ తగ్గిపోతాయి. పిల్లలకు శారీరక శ్రమ కలిగించే ఆటలు, క్రీడలపై ఆసక్తి కలిగించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – ఓంప్రకాశ్, మానసిక వైద్యనిపుణుడు పిల్లలకు సమయం కేటాయించాలి మొబైల్ ఫోన్లను అధికంగా వాడుతుండటం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫోన్ల వాడకంతో తల్లిదండ్రులతో అనుబంధం తగ్గిపోతోంది. తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లలకు మొబైల్ ఫోన్లను అందించే విషయంలో కట్టడి చేస్తూ.. వారికి కొంత సమయాన్ని కేటాయించాలి. అప్పుడే పిల్లలు అనుబంధాలు, నైతిక విలువలను గుర్తించి జీవితంలో ఏ సమస్య ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. – సాధన, డెప్యూటీ డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్ -
పిల్లలకు బోర్ కొట్టిస్తున్న సంక్రాంతి సెలవులు
సాక్షి, హైదరాబాద్: ‘సెల్ ఫోన్‌తో ఆడుకోవడం లేదా డల్‌గా పడుకోవడం’.. ప్రస్తుత సంక్రాంతి సెలవుల్లో పిల్లలు చేసేది ఇదే అంటున్నారు చాలామంది తల్లిదండ్రులు. కరోనా పుణ్యమాని ఉత్సాహంగా ఊరెళ్లే పరిస్థితి లేదు. ఆనందంగా అయిన వాళ్లను రమ్మనే అవకాశం లేదు. కనీసం పక్కింటి పిల్లలతో ఆడుకుందామన్నా ఆందోళన.. వెరసి సంక్రాంతి సెలవులు విద్యార్థులకు బోర్ కొట్టిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అర్ధరాత్రి వరకు సెల్ పట్టుకుని, అదే పనిగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటే మౌనంగా చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు వాపోయారు. సరే అని కట్టడి చేస్తే ఏదో కోల్పోయినట్టుగా ఉండిపోతున్నారని చెప్పారు. కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు కనీసం పక్కింటి పిల్లలతో ఆడుకోవడానికి కూడా సంశయించాల్సి వస్తోంది. కరోనా పరిస్థితుల్లో వచ్చిన సంక్రాంతి సెలవుల్లో స్కూల్ పిల్లల దిన చర్యను ‘సాక్షి’క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేసింది. కొన్ని ప్రాంతాల్లోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను పలకరించింది. ఇంట్లో బందీగా పిల్లలు ‘ఇది వరకు సంక్రాంతి సెలవులొస్తే చాలు పిల్లాడిని పట్టుకోవడం కష్టంగా ఉండేది. పొద్దున లేస్తే గాలి పటాల గోలే. ఇప్పుడు ఇల్లు కదలడం లేదు. బయట కూడా అంతా సందడిగా ఉండేది. ఇప్పుడా వాతావరణం లేదు..’ అని వరంగల్ పట్టణానికి చెందిన లలిత చెప్పారు. కరోనా భయంతో పిల్లల్ని ఇల్లు కదలనివ్వడం లేదు. ఇంటికి వేరే పిల్లల్నీ రానివ్వడం లేదు. పక్క పక్క ఇళ్ళవాళ్ళయితే కాస్త సర్దుకుపోతున్నారు. అదీకూడా వాళ్ళింటికి కొత్తవాళ్ళు ఎవరూ రాకపోతేనే. నిజానికి సంక్రాంతి పండగొస్తే పోస్టాఫీసు కాలనీ మొత్తం హడావిడిగా ఉంటుందని, ఎక్కడెక్కడి నుంచో గాలి పటాలు ఎగరెయ్యడానికి, ఆటల పోటీల్లో పాల్గొనడానికి వస్తుంటారని హన్మకొండ పోస్టాఫీసు కాలనీకి చెందని రవి తెలిపారు. ఇప్పుడు అవేవీ కన్పించడం లేదని అన్నారు. పక్క వీధిలోని ఫ్రెండ్ ఇంటికి తన కొడుకు వస్తానంటే, అతని తల్లిదండ్రులు ‘రోజులు బాగోలేవు కదా’అని సున్నితంగా వద్దని చెప్పారని వెల్లడించారు. రెండేళ్ళ క్రితం చూసిన ముగ్గుల పోటీలు, కబడ్డీ ఆటలు, కుస్తీ పోటీలు ఏవీ పిల్లలు ఎంజాయ్ చేసే పరిస్థితి కన్పించడం లేదని అన్నారు. అమ్మమ్మ ఇంటికెళ్ళినా అదే సీన్... ‘నేనొచ్చానని అమ్మమ్మ ఎన్నో పిండి వంటలు చేసింది. కొత్త దుస్తులూ కొన్నది. కానీ ఇల్లు మాత్రం దాటనివ్వడం లేదు..’అని కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్‌లో అమ్మమ్మ ఇంటికొచ్చిన 9వ తరగతి విద్యార్థి రామకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిజానికి ఆ ఊళ్ళో వారం రోజులుగా పరిస్థితి బాగాలేదు. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కొన్నిచోట్ల మనవళ్లు, మనవరాళ్లు ఊరికి వస్తామన్నా వద్దన్న ఘటనలున్నాయి. ఖమ్మం పట్టణంలో ఉంటున్న చంద్రం దంపతులు.. తమ ఇంటికి హైదరాబాద్ నుంచి మనవడు, మనమరాలు సంక్రాంతికి వస్తామన్నా.. వద్దన్నారు. ‘రోజులు బాగోలేవు. ఇక్కడ వాళ్ళకు ఏవైనా వచ్చినా వాళ్ళనే అంటారు. వాళ్ళకు ఏమైనా అయినా మాటొస్తుంది’అని చంద్రం వ్యాఖ్యానించారు. కొత్త గేమ్స్ కోసం వేట లాక్డౌన్లో విద్యార్థులు ఆడే గేమ్స్‌పై సూపర్ స్కూల్స్ అనే సంస్థ ఓ సర్వే చేపట్టింది. ఆన్లైన్ గేమ్స్ విషయంలోనూ పిల్లల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోందని ఆ సంస్థ సీఈవో భానూ ప్రసాద్ తెలిపారు. పబ్జీ, క్యాండీ క్రష్, యాంగ్రీ బర్డ్, సబ్వే సర్ఫర్స్, టెంపుల్ రన్ వంటి ఆటలు వాళ్ళకు పెద్దగా కిక్కెకించడం లేదు. దీంతో కొత్త కొత్త గేమ్స్ ఏమొచ్చాయా అనే దిశగా నెట్లో వెతుకుతున్నారు. కరోనా కారణంగా బయటకెళ్ళే అవకాశం లేకపోవడంతో 24 గంటలూ సెల్‌ఫోన్ గేమ్స్‌పై ఆధారపడుతున్నారని సర్వేల్లో తేలింది. సంక్రాంతి సెలవుల్లోనూ ఇదే కన్పిస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గేమ్స్ మోజులో నెట్ లింక్స్ తెలియకుండా క్లిక్ చేస్తే తలిదండ్రుల బ్యాంకు సమాచారం తెలుసుకుని, సైబర్ నేరగాళ్ళు దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పిల్లల మానసిక స్థితిపై ప్రభావం కరోనా కాలంలో పిల్లలకు ఆన్లైన్ విద్య కోసం తల్లిదండ్రులే ఫోన్లు కొనిచ్చారు. ఇప్పుడు వాళ్ళ జీవితంలో అది అంతర్భాగమైంది. సెలవులొస్తే చాలు ఫిజికల్ గేమ్స్ గురించి వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కరోనా ఉధృతి దీనికి మరింత అవకాశం ఇచ్చింది. ఎంతసేపూ మొబైల్ పట్టుకుని కాలం గడిపేస్తున్నారు. ఇది విద్యార్థి మానసిక స్థితిలో మార్పు తెస్తుంది. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి – పణితి రామనాథం (ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, బూర్గుంపాడు, కొత్తగూడెం జిల్లా) సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలి సెల్ ఆటలే విద్యార్థులకు శరణ్యం అయినట్టయ్యింది. అయితే ఇవి హద్దుమీరడానికి నియంత్రణ లేకపోవడమే కారణం. పిల్లల్ని తల్లిదండ్రులు అలా వదిలేయకూడదు. వాళ్ళ బాగుకోరి కొంతసేపైనా సెలవుల్లో పుస్తకాల పఠనం వైపు దృష్టి మళ్లించే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులూ వాళ్ళతో ఆడుకుంటూ, సెల్ఫోన్లకు దూరంగా ఉండేలా చేయడం మంచిది. – శ్రీధర్ (భారత్ పబ్లిక్ స్కూల్, కోదాడ) -
నెలకు లక్ష జీతం.. రమ్మీకి బానిసై, కుటుంబ పరిస్థితి భారంగా మారడంతో..
సాక్షి, చెన్నై: తిరువాన్మీయూరు రైల్వే స్టేషన్లో సంచలనం రేపిన దోపిడీ కథ ముగిసింది. భార్యతో కలిసి రైల్వే ఉద్యోగి ఆడిన నాటకం గుట్టు రట్టయ్యింది. ఇంటి దొంగను అరెస్టు చేసిన పోలీసుల కటకటాల్లోకి నెట్టారు. చెన్నై తిరువాన్మీయూరు ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్లో సోమవారం ఉదయం దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు తనను కట్టి పడేసి రూ. లక్షా 32 వేలు నగదు అపహరించుకెళ్లినట్టు రైల్వే టికెట్ క్లర్ టిక్కారామ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు ముందుకు సాగడం కష్టతరంగా మారింది. అయితే, రైల్వే స్టేషన్ మార్గంలో ఉన్న సీసీ కెమెరాల్ని పరిశీలించిన పోలీసులు విస్మయానికి గురయ్యారు. దోపిడీ జరిగిన సమయంలో ఓ మహిళ రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆగమేఘాల మీద వెళ్లిన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఆమె టిక్కారామ్ భార్య సరస్వతిగా తేలింది. దీంతో ఇంటి దొంగ నాటకం గుట్టు బట్టబయలైంది. నెలకు దాదాపుగా రూ. లక్ష వరకు జీతం తీసుకుంటున్న టిక్కారామ్ ఆన్లైన్ రమ్మికి బానిస అయ్యాడు. దీంతో లక్షల చొప్పున అప్పుల పాలయ్యాడు. ఈ నెల కుటుంబ పరిస్థితి భారంగా మారడం, స్టేషన్లో సీసీ కెమెరాలు లేవన్న విషయాన్ని పరిగణించి భార్యతో కలిసి నాటకం రచించి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ దంపతుల్ని అరెస్టు చేసిన పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. -
ఫోన్లో అసభ్యకరమైన మెసేజ్‌లు.. కానీ అసలు విషయం అది కాదు..
కొన్ని రోజులుగా కూతురు ప్రతిమ (పేరు మార్చడమైనది)ను చూస్తుంటే లత మనసు తల్లడిల్లిపోతోంది. సమయానికి తినడం లేదు, నిద్రపోవడం లేదు. తనలో తను దేనికోసమో మధనపడుతోంది. కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పటికే తను చాలాసార్లు చూసింది. అదేమని అడిగితే.. ‘ఏమీ లేదు’ అంటుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురి విషయం భర్తకు చెప్పింది. తండ్రి గట్టిగా నిలదీసేసరికి ‘ఎవరో ఆకతాయిలు తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి, వేధిస్తున్నార’ని చెప్పింది. బాధపడిన పేరెంట్స్ ఈ విషయం ఇంతటితో వదిలేస్తే కూతురు భవిష్యత్తుకు ప్రమాదం అవుతుందని ప్రతిమ వద్దులే అంటున్నా వినకుండా ఆమెను తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు కంప్లైంట్ ఇవ్వడానికి. వారు చెప్పిందంతా విన్నాక, ప్రతిమను అడిగారు పోలీసులు. భయం భయంగా చూస్తున్న ప్రతిమకు ధైర్యం చెప్పి, ఒంటరిగా ఆమెతో మాట్లాడి అసలు విషయాలు రాబట్టారు. ప్రతిమకు అసలు ఏ ఆకతాయిలూ వేధింపుల మెసేజ్‌లు పంపలేదు. రోజులో ఎక్కువ సమయం ఫోన్లోనే గడపడం వల్ల మానసిక ఆందోళనకు గురైంది. వేళకు తిండి, నిద్ర లేకపోవడంతో ఆమె శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం పడింది. ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించడం, విమర్శకు తట్టుకోలేకపోవడం .. వంటి దశకు చేరుకుంది. ఇలా ప్రతిమలో ఫోన్ కారణంగా మానసికంగా వచ్చిన మార్పులను అక్కడి కౌన్సిలర్ ఒక్కోటి ముందుంచారు. అలవాట్లు తీవ్రమైతే అవి వ్యసనానికి ఎలా దారి తీస్తాయో చెబుతూ ఎక్కడ తన నుంచి తల్లీదండ్రి ఫోన్ లాక్కుంటారో అని భయపడి ‘ఆకతాయిల నుంచి మెసేజ్’ అంటూ అబద్ధం చెప్పింది. నిజమేంటో తెలిసి కూతురు ఫోన్ వ్యసనాన్ని దూరం చేయడానికి తల్లీదండ్రి సిద్ధమయ్యారు. చదవండి: చిరుత దళం.. వాళ్లు చంపాలని. వీరు కాపాడాలని! వ్యసనంగా మారిన అలవాటు ఇది కేవలం ప్రతిమ ఒక్క విషయమే కాదు, మనలో చాలా మంది రకరకాల కారణాల వల్ల సోషల్ మీడియాకు వ్యసనపరులుగా మారుతున్నారు. ఏది సరైనదో తెలుసుకునే విచక్షణను కోల్పోతున్నారు. డిజిటల్ అలవాట్లకు దూరం దూరం ఈ రోజుల్లో సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండటం అనేది అసాధ్యమైన విషయంగా అంతా చెబుతారు. కానీ, మన మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలంటే డిజిటల్ అలవాట్లను నియంత్రించుకోవడం అత్యవసరం. ఇది నూతన సంవత్సరానికి తీసుకోబోయే సరైన, తప్పనిసరి నిర్ణయం కూడా. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, అలవాట్లను నియంత్రించుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి.. తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. సోషల్ మీడియాకు సాధ్యమైనంత దూరంగా ఉండటం వల్ల మనకు రోజులో ఎక్కువ ఖాళీ సమయం లభిస్తుంది. తక్కువ ఆందోళన చెందుతాం. ఉదయం, పగటి వేళల్లో మన పనితీరు పెరుగుతుంది. నేర్చుకునే విషయాల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే సోషల్ మీడియాను ఒక వ్యసనంగా కాకుండా వార్తావాహికగా ఉపయోగించుకోవాలి. ‘విష’యాలు.. ► సామాజిక మాధ్యమాల ద్వారా విషయాలు తెలుస్తుంటాయి అనుకుంటే బాగానే ఉంటుంది. కానీ, మనలో విషం నింపే నెగిటివిటీ లాంటి వ్యసనం కూడా ఉంటుంది. ►మీరు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నామనే విషయాన్ని ముందు మీ చుట్టూ ఉన్నవారికి చెప్పండి. ఈ మాట వల్ల తిరిగి మీ చుట్టూ ఉన్నవారు ప్రశ్నిస్తారనే ఆలోచనతోనైనా సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. ►మీ ఫోన్లో అనవసర యాప్‌లను తొలగించండి. అలాగే, అనవసరమైన నోటిఫికేషన్స్‌ను వదిలే వెబ్సైట్లను బ్లాక్ చేయండి. ►సామాజిక మాధ్యమం నుంచి దూరంగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా ఏం పనులు చేయాలో ప్లాన్ చేయండి. ►మీకే కాదు మీ ఫోన్ కు కూడా విశ్రాంతి ఇవ్వండి. అంటే రోజులో 8 నుంచి 10 గంటలైనా ఫోన్‌కి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకోండి. ►ఫోన్లో కాకుండా బయట అలారం గడియారాన్ని ఏర్పాటు చేసుకోండి. దీని వల్ల నిద్రలేస్తూనే ఫోన్ చూసే అలవాటు తప్పుతుంది. ►రోజులో కొంత సమయం ఫోన్‌ని ఇంట్లో ఉంచి, పచ్చని పచ్చికలో కాసేపు తిరగండి. ఇలా దినసరి చర్యలో భాగంగా సామాజిక మాధ్యమాల్లో ఉండే సమయాన్ని బయటి పనుల్లో గడిపేలా ప్లాన్ చేయండి. మరిన్ని డి–అడిక్షన్ చిట్కాలు ►ఫోన్‌ను ఛార్జ్ చేసే పరికరాన్ని బెడ్రూమ్ లోపల కాకుండా హాలులో అమర్చండి. ►సోషల్ మీడియా నోటిఫికేషన్స్‌ను ఫోన్ నుంచి కాకుండా ల్యాప్ టాప్ లేదా డెస్క్‌టాప్‌లో చూడండి. ►హోమ్ స్క్రీన్‌లో ముఖ్యమైన యాప్‌లను మాత్రమే ఉంచండి. ►గ్రే స్కేల్ మోడ్‌ను ఉపయోగించండి. ►మీరు ఎంతసేపు స్క్రీన్ సమయాన్ని ఉపయోగించాలో మీ ఆండ్రాయిడ్ ఫోన్ మానిటర్ సెట్టింగ్స్‌ను ముందే సెట్ చేసుకోవచ్చు. ఇది మిమ్మల్ని అలవాటు నుంచి నియంత్రించడానికి ఉపకరిస్తుంది. -అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
నిత్యం పోర్న్ వెబ్‌సైట్స్‌ను చూస్తూ భార్యను..
బెంగళూరు: కొందరికి కొన్ని అలవాట్లు ఉండడం సహజమే, కానీ అవే వ్యసనంగా మారితే వాటి వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓ వ్యక్తి పోర్న్ సైట్స్‌ను చూడటం వ్యసనంగా మారడంతో వద్దన్న భార్యను వేధింపులకు గురి చేసి చిత్ర హింసలు పెట్టాడు. ఎంతో ఓపికతో ఉన్న ఆ మహిళ భర్త ఆగడాలను భరించలేక చివరకు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది. జయనగర్‌లో ఉంటున్న ఓ మహిళకు నవంబర్ 2019లో వివాహమైంది. అయితే గత కొంత కాలం నుంచి తన భర్త పోర్న్ సైట్లను చూడటం ప్రారంభించాడు. ఆ అలవాటు కాస్త వ్యసనంగా మారింది. దీంతో పాటు రాత్రిపూట కాల్ గర్ల్స్‌తో ఆన్లైన్లో చాటింగ్ చేయడంతో పాటు వారి కోసం డబ్బులు కూడా ఖర్చు పెట్టేవాడు. అయితే ఇటీవల తన భర్త మ్యాట్రిమోనియల్ సైట్లో తన పేరు మీద అకౌంట్ ఓపన్ చేయడంతో అందులో తను విడాకులు తీసుకున్నట్లు పేర్కొన్నాడు. దీంతో భరించలేని ఆమె తన భర్త అలవాట్ల గురించి అతని తల్లిదండ్రులకు కూడా ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందిని. అలా వీటన్నిటిని భరిస్తూ వచ్చిన ఆ మహిళ చివరికి తన ప్రవర్తన మార్చుకోవాలని వారించినందుకు ఆమెను వేధించడం ప్రారంభించాడు. పాడైన ఆహారం పెట్టేవాడు. అంతేగాక ఆమెను ఇంటికే పరిమితం చేసి హింసించాడు. చివరికి చేసేదేమి లేక ఆమె తనకు న్యాయం చేయాలని కోర్టుని ఆశ్రయియింది. దీంతో కోర్టు మహిళ భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. చదవండి: భూతవైద్యం చేసే మహిళతో ‘సంబంధం’.. ఇటీవల దూరం పెట్టడంతో... -
సింఘు సరిహద్దులో వ్యక్తి హత్య: ‘అతను అలాంటివాడు కాదు.. ఆశ చూపి’
న్యూఢిల్లీ: ఢిల్లీ-హర్యానా సరిహద్దు సమీపంలోని సింఘు ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేస్తున్న క్రమంలో వ్యక్తి చేతులు, కాళ్లు నరికిన మృతదేహం బారికేడ్లకు వేలాడుతూ కనిపించింది. హత్యకు గురైన వ్యక్తిని లఖ్బీర్ సింగ్ (35)గా పోలీసులు గుర్తించారు. పంజాబ్‌లోని తార్న్ తరణ్ జిల్లాలోని చీమా ఖుర్ద్ గ్రామ నివాసి. అతను ఓ దళితుడు. రోజూవారీ కూలీ పనులు చేసుకొని జీవించేవాడు. అతనికి భార్య ముగ్గురు కుమార్తెలు, ఓ సోదరి ఉన్నారు. అతనిపై ఎలాంటి నేర చరిత్ర గానీ, ఏ రాజకీయ పార్టీతో సంబంధం గానీ లేదని పోలీసులు తెలిపారు. చదవండి: ప్రియుడితో కలిసి మామను హత్య చేసిన కోడలు అయితే సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేశాడన్న ఆరోపణలతో కొందరు వ్యక్తులు ఆయన్ను కొట్టి చంపినట్లుగా కొన్ని వీడియోలు ప్రచారమవుతున్నాయి. కానీ బాధితుడి సొంత గ్రామమైన పంజాబ్‌లోని చీమా ఖుర్ద్ నివాసితులు మాత్రం సిక్కుల పవిత్ర గ్రంథాన్ని అపవిత్రం చేసినందుకు అతన్ని హత్యకు గురయ్యాడనే వాదనలను ఖండించారు. ఉద్ధేశ్యపూర్వకంగా బాధితుడికి ఆశ చూపి సింఘు సరిహద్దు వద్దకు తీసుకెళ్లి చంపేశారని ఆరోపిస్తున్నారు. అతను బానిస అని, ఏదో ఆశ చూపించి చంపారని తర్న్ తరణ్ జిల్లాలోని గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది హర్భజన్ సింగ్ అన్నారు. బాధితుడు లఖ్బీర్ సింగ్ 4, 5 రోజుల క్రితం గ్రామంలో ఉన్నాడని, అతని దారుణ హత్య వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోయారని చెప్పారు. అతను నిరుద్యోగి అని, కుంటుంబాన్ని కూడా పోషించలేడని విచారం వ్యక్తం చేశారు. గ్రామంలోని అనేకమంది సైతం బాధితుడు చెప్పిన పని చేసే బానిసగా పేర్కొన్నారు. సిక్కుల పవిత్ర గ్రంధాన్ని అపవిత్రం చేసిన ఘటనలో బాధితుడు పాత్ర లేదని, అతను అలాంటి వ్యక్తి కాదని పేర్కొన్నారు. అయితే, ఈ హత్య కేసులో ఒక వ్యక్తి లొంగిపోయాడు. అతడు నిహాంగ్ గ్రూప్ సభ్యుడు సరబ్జిత్ సింగ్ అలియాస్ నిహాంగ్ సిఖ్‌గా పోలీసులు తెలిపారు. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసినందుకే అతడిని శిక్షించానంటూ మీడియా ముందుకు వచ్చిన అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించిన వీడియో..సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం కోర్టులో హాజరుపరుచనున్నారు. -
Nizamabad: గుప్పుమంటున్న గంజాయి!
సాక్షి, బాల్కొండ(నిజామాబాద్): గంజాయి మత్తులో యువత పెడదోవ పడుతున్నారు. గంజాయికి బానిసలుగా మారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. తాజాగా మెండోరా మండలం బుస్సాపూర్‌లో గంజాయి మత్తులో జోగుతున్న ఓ యువకుడు అకారణంగా రోడ్డుపై వెళుతున్న వృద్ధుడిపై గొడ్డలితో విచక్షణ రహితంగా దాడిచేయడంతో మృతి చెందాడు. బాల్కొండలో కొందరు యువకులు గంజాయికి మైకంలో బైక్‌ల చోరీకి పాల్పడిన ఘటన మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంత జరుగుతున్నా గ్రామాల్లో గంజాయిని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకోకపోవడం విచారకరం. గంజాయితో ఛిద్రమైన జీవితం మెండోరా మండలం బుస్సాపూర్‌కు చెందిన సోమ నవీన్ గంజాయికి బానిసై గంజాయి తాగిన మైకంలో దాడికి పాల్పడి వృద్ధుడి మరణానికి కారణమై కటకటాల పాలయ్యాడు. చదువు కోవడానికి అబ్రా డ్ వెళ్లాల్సిన యువకుడు గంజాయి వలన జీవితాన్ని ఛిద్రం చేసుకున్నాడు. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి గారబంగా పెంచింది. కానీ ప్రస్తుతం కొడుకు ప్రవర్తను చూసి ఆ తల్లే తన కొడుకుని చంపండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. గంజాయి మత్తులో అనేక ఘటనలు గంజాయి మత్తులో జోగుతున్న యువకులు ఆ మైకంలో ఏం చేస్తున్నామో కూడా గుర్తించలేని స్థితిలో ఇతరుల ప్రాణాలను సైతం హరిస్తున్నారు. హాసాకొత్తూర్‌కు చెందిన గిరిజన యువకుడు సిద్ధార్థను గంజాయి మత్తులోనే హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య తదనంతరం ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం పోలీసులకు ప్రజలు ఎదురు తిరగడం జరిగింది. మెండోరా పోలీసు స్టేషన్ పరిధిలో ఒక యువకుడిపై కొందరు యువకులు గంజాయి సేవించి హత్యాయత్నానికి పాల్పడ్డారు. చివరకు రాజీపడి కేసు నుంచి తప్పించుకున్నారు. మోర్తాడ్‌లో ఒక యువకుడు గంజాయి మత్తులో బైక్‌ను వేగంగా నడిపి ఒక కూలీ మరణానికి కారణమయ్యాడు. కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్ లో యువకులు గ్రూపులుగా విడిపోయి ఘర్షణలకు పాల్పడిన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నా యి. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో దందా జోరుగా సాగుతుంది. నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి గంజాయి సరఫరా నిర్విరామంగా కొనసాగుతోంది. ప్రధానంగా పోచంపాడ్ గంజాయి వ్యాపారులకు అడ్డాగా ఉందనే వార్త బలంగా వినిపిస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి గంజాయి విక్రయాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. చదవండి: తువ్వాలులో జీఏవైరు పెట్టి మెడకు బిగించి హత్య -
క్రికెట్ బెట్టింగ్ తో అప్పులు.. తీర్చేందుకు వేరే దారి లేక..
సాక్షి, బంజారాహిల్స్ ( హైదరాబద్): అప్పులు తీర్చేందుకు చోరీకి పాల్పడ్డ యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ పట్టణానికి చెందిన జన్నా రమేష్ మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి కార్మికనగర్‌లో నివాసం ఉంటున్నాడు. టైల్స్ వర్క్ చేస్తున్న రమేష్ కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ టోర్నీ సందర్భంగా అప్పులు చేసి బెట్టింగ్‌లు కట్టాడు. వాటిని తీర్చకపోవడంతో అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తెచ్చారు. ఎలాగైనా డబ్బులు సంపాదించి అప్పులు తీర్చాలన్న లక్ష్యంతో ఈ నెల 15న రెహ్మత్‌నగర్‌లో నివాసం ఉంటున్న చేపల వ్యాపారి ఆంజనేయులు ఇంట్లో చొరబడి అల్మారాలోంచి రూ.25,500 నగదు, ఆరున్నర తులాల బంగారం చోరీ చేశాడు. ఆంజనేయులు భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మంగళవారం జన్నా రమేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. -
చిల్డ్రన్–సోషల్ మీడియా.. చూస్తున్నారా... ఏం చూస్తున్నారో!
పిల్లలు ఫోన్ తీసుకుని ఏం చూస్తున్నారు? పిల్లల్ని టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో ఏమేమి వస్తోంది? ఎవరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నారు? ఏ గేమ్‌కు బానిసవుతున్నారు? తెలియక ఏ పోర్నోగ్రఫీ కంటెంట్‌కు ఎక్స్పోజ్ అవుతున్నారు? అశ్లీల చిత్రాలను సోషల్ మీడియా యాప్స్‌లో పెడుతున్నందుకు ఇటీవల జరిగిన బాలీవుడ్ అరెస్ట్ నేర విచారణ గురించి కంటే అలాంటి కంటెంట్ పిల్లల వరకూ చేరుతున్నదా అనే ఆందోళనే ఎక్కువ కలిగిస్తోంది. తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. లోకంలో చాలా పనులు జరుగుతున్నాయి. మనం మాత్రం పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చి మన పనుల్లో పడుతున్నాం. ఆన్లైన్ క్లాసుల కోసమో, తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే పిల్లలతో మాట్లాడటం కోసమో, పిల్లలతో టైమ్ స్పెండ్ చేసే వీలు లేక వారిని ఎంగేజ్ చేయడం కోసమో, స్టేటస్ కోసమో, గారాబం కోసమో ఇవాళ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల చేతికి ఫోన్లు ఇస్తున్నారు. ఇవ్వక తప్పడం లేదు. కాని వారి చేతిలో ఉన్న ఆ ఫోన్ వారికి చాలా మేలు చేయగలదు. చాలానే కీడు కూడా చేయగలదు. ఆ విషయం వారికి తెలిసే వరకు స్నేహంగా వారిని అలెర్ట్ చేస్తున్నామా? చెక్ చేస్తున్నామా? అంతా అయ్యాక ‘నువ్వు గేమ్స్‌కు బానిసయ్యావు.. నిన్నూ’.. అని ఫోన్లు పగలగొడితే ఆ పిల్లలు అలిగి ఆత్మహత్యలు చేసుకునేవరకు తీసుకువెళుతున్నాం. ఇప్పుడు ఫోన్ అనేది ఇద్దరి బాధ్యతతో ముడిపడి ఉన్న వస్తువు... తల్లిదండ్రులూ... పిల్లలూ... ఢిల్లీలో వినూత్న కేసు రెండు రోజుల క్రితం ఢిల్లీ మహిళా కమిషన్ అక్కడి పోలీసులకు ఒక మహిళ మీద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయమని ఆదేశాలు ఇచ్చింది. దానికి కారణం ‘ఇన్స్టాగ్రామ్’ అకౌంట్లో ఆ మహిళ పెట్టే వీడియోల్లో కుమారుణ్ణి నటింపచేయడమే. సాధారణంగా తగిన ఆపోజిట్ పార్టనర్ ఉంటేనే కొన్ని వీడియోలు చేయాలి. ఆ వీలు లేనివారు చిన్న పిల్లలతో పాటలకు డాన్సులు చేయడం చేస్తున్నారు. ఆ మహిళ తన కొడుకుతో కలిసి చేసిన డాన్సు ‘అశ్లీలంగా’ ఉందని మహిళా కమిషన్ గుర్తించింది. వెంటనే ఆ మహిళను అరెస్ట్ చేయమంది. పిల్లాడ్ని కౌన్సిలింగ్‌కి తీసుకువెళ్లమని చెప్పింది. పిల్లల్ని ఇవాళ విపరీతంగా ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఇన్స్టాగ్రామ్’. ఇందులో ‘రీల్స్ మేకర్లు’గా పిల్లలు డాన్సులు చేస్తూ పాపులారిటీ సంపాదిస్తున్నారు. కాని అవి ఒక్కోసారి శృతి మించి ఫాలోయెర్స్‌ను పెంచుకోవడానికి శరీరం కనిపించే లేదా పెద్దల్లా శరీర కదలికలు చేసే విధంగా ఉండటం ప్రమాదంగా పరిణమించింది. కొందరు తల్లిదండ్రులు పిల్లలతో ఇలాంటి వీడియోలను చేసి మరీ పెడుతున్నారు. 30 సెకన్ల సేపు ఉండే ఇన్‌స్టా రీల్స్ ఇవాళ చాలామంది పిల్లలను తప్పు దోవ పట్టించడమే కాక ఇతర ‘ఉద్రేకపరిచే’ డాన్సులను, డమ్మీ సంభాషణలను వారు చూసేలా చేస్తోంది. ఫొటోల ప్రమాదం ఫేస్బుక్లో 18 ఏళ్ల లోపు పిల్లలు అకౌంట్లు కలిగి ఉంటున్నారు. వీరు అకౌంట్స్ ఓపెన్ చేసేలా కొంతమంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఒకసారి అకౌంట్ ఓపెన్ చేశాక ఇక ఎవరెవరు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెడతారో చెప్పలేం. మెసెంజర్లో ఎవరు చాట్‌కు ఆహ్వానిస్తారో తెలియదు. అలాంటివి ఏమీ లేకపోయినా చీటికి మాటికి పిల్లల ఫొటోలు పిల్లలుగాని పెద్దలు కాని పోస్ట్ చేయడం క్షేమం కాదు. వాటిని సేవ్ చేసుకుని మార్ఫింగ్ చేసే వీలు ఉంటుంది. ఫేస్బుక్లో రకరకాల భావజాలాలు, వీడియోలు, యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. అవన్నీ పిల్లల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో మనకు తెలిసే అవకాశం లేదు. అడిక్షన్ అంటే పిల్లలు ఫోన్‌కు అడిక్ట్ అయితే వారు కేవలం గేమ్స్ ఆడుతూ మాత్రమే అడిక్ట్ కారు. ఇవాళ వస్తున్న కామెడీ స్కిట్లు, డాన్స్ షోలు, ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్న సిరీస్‌లు... వీటన్నింటిని చూస్తూ ఫోన్‌కు అడిక్ట్ అవుతారు. కొన్ని రకాల గేమ్స్ వారిని పదే పదే ఫోన్ చేతిలో పట్టుకునే విధంగా ఎప్పుడెప్పుడు క్లాస్/తల్లిదండ్రులు చెప్పిన పని పూర్తవుతుందా ఎప్పుడు ఫోన్ చేతిలోకి తీసుకుందామా అని అస్థిమితం చేస్తాయి. కామెడీ పేరుతో సాగే అశ్లీల సంభాషణలు వేస్తున్న ప్రభావం తక్కువ ఏమీ కాదు. ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో చాలా సిరీస్ ‘18 ప్లస్’గా ఉంటాయి. కాని వాటిని కూడా 10–13 ఏళ్ల మధ్య పిల్లలు చూస్తున్నారు. మార్కెట్ మార్కెట్ కూడా పిల్లల వెంట పడుతుంది. సోషల్ మీడియాలో ఉండే పిల్లలు వారు బ్రౌజ్ చేసే సైట్లు, ప్రొడక్ట్స్‌ను బట్టి వారికి యాడ్స్ ప్రత్యక్షమవుతాయి. స్లిమ్ కావాలంటే ఈ ఫుడ్ తినండి, అందంగా కనిపించాలంటే ఈ బట్టలు వాడండి, ఫలానా యాప్ ద్వారా ట్యూషన్ క్లాసులు వినండి, ఫలానా చోటుకు ప్రయాణాలు కట్టండి అని వారిని ఆకర్షిస్తూ ఉంటాయి. పిల్లలు అవి చూసి కావాలని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. పుస్తకం బెటర్ పిల్లలు ఏ పుస్తకం చదువుతున్నారో దాని కవర్ మనకు కనపడుతూ ఉండటం వల్ల తెలుస్తుంది. కాని వారు ఫోన్ చూస్తూ ఉంటే అందులో ఏం చూస్తున్నారో ఎదురుగా ఉన్న మనకు తెలియదు. ఎదిగే వయసులో ఉన్న పిల్లలను ఒక మాయా ప్రపంచంలో దించినట్టే... వారి చేతికి సెల్ ఇవ్వడం అంటే. వారిని కనిపెట్టే సమయం లేదని ఇప్పుడు ఊరుకుంటే భవిష్యత్తు సమయమంతా వారి కోసం బెంగపడాల్సి వస్తుంది. జాగ్రత్త పడదాం. ఫోన్ తగ్గించి పుస్తకం ఎక్కువగా పెడదాం. -
ఆ అలవాటుకు బానిసయ్యా: అనుపమ
అందం అభినయం పుష్కలంగా ఉన్న హీరోయిన్ల జాబితాల ముందు వరుసలో ఉండే అనుపమ పరమేశ్వరన్ అదృష్టం పరంగా మాత్రం కాస్త వెనక ఉందనే చెప్పాలి. కెరీర్ మొదట్లో ‘ప్రేమమ్’, ‘అఆ’ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించినా, ఆ ఫేమ్‌ను నిలకడగా నిలబెట్టుకోలేకపోయింది. దీంతో ఇటీవల కెరీర్ పరంగా కాస్త స్లో అయ్యింది ఈ అమ్మడు. ఇక సినిమాల విషయం ఎలా ఉన్నా సోషల్‌మీడియాలో మాత్రం తన హవాను కొనసాగిస్తోంది ఈ కేరళ బ్యూటీ. తాజాగా అనుపమ ఒకదానికి బానిసలా మారిపోయినట్లు చెప్పగా ఆ వార్త నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. ఓ వైపు నటన, మరో వైపు క్యూట్ లుక్స్‌తో ఉండే అనుపమకు ఇటీవల సినిమా ఆఫర్లు పెద్దగా లేవనే తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు నిఖిల్ సరసన 18పేజెస్, దిల్ రాజు బ్యానర్ లో ఆయన తమ్ముడు కొడుకు హీరోగా లాంచ్ అవుతున్న రౌడీ బాయ్స్ లో నటిస్తోంది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య తానొక వ్యక్తిని ప్రేమించినట్లు, చివరకి బ్రేకప్ కూడా జరిగిందంటూ తెలిపిన అనుపమ.. తాజాగా ఇన్‌స్టాలో గిబ్బరిష్ గేమ్‌కు బానిసలా మారిపోయినట్లు తెలిపింది. ఈ ఆటలో కొన్ని విచిత్ర పదాలు మనకు స్క్రీన్‌పై కనపడతాయ్. అందులో మనం పలికే తీరును బట్టి నిజమైన ఆంగ్ల పదాలను కనిపెట్టేయవచ్చు. ఇప్పుడు ఈ ఆటని అనుపమ ఆడటం కాదండోయ్.. దానికి తాను ఎంతగానో బానిస అయినట్లు తెలిపింది. -
ఆన్లైన్ గేమ్ వ్యసనమై.. తల్లి తిరిగి వచ్చే సరికి విగతజీవుడిగా వేలాడుతూ..
సాక్షి, ఆత్మకూర్(సూర్యాపేట): ఆన్లైన్ గేమ్ సరదా ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన ఆత్మకూర్ (ఎస్) మండలంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఏపూరు గ్రామానికి చెందిన కాకి వెంకటరెడ్డి, కవితలకు కుమార్తె, కుమారుడు సంతానం. ఏడాది క్రితమే కుమార్తె వివాహం చేయగా కుమారుడు మధురెడ్డి (20) బీటెక్ మూడో సంవత్స రం చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో కొంతకాలంగా ఇంటివద్దనే ఉంటున్న మధురెడ్డి ఆన్లైన్ గేమ్ మోజులో పడ్డాడు. ఇటీవల తల్లి కవిత ఖాతానుంచి రూ.1.20లక్షలు కట్ కావడంతో ఆందోళన చెందింది. దీంతో ఆమె సాయంత్రం వివరాలు తెలుసుకోవడానికి స్థానిక బ్యాంక్‌కు వెళ్లింది. విషయం బయటపడుతుందని భయాందోళనకు గురైన మధురెడ్డి ఇంట్లో చీరతో ఉరేసుకున్నాడు. తల్లి తిరిగి వచ్చే సరికి విగతజీవుడిగా వేలాడుతున్నాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లింగం తెలిపారు. -
మతి చెడగొడుతున్న సెల్‌ఫోన్
సాక్షి, అమరావతి: ‘‘దేశవ్యాప్తంగా మానసిక జబ్బుల తీవ్రత పెరుగుతోంది. ఇది వర్తమానానికే కాదు భవిష్యత్‌కూ పెద్ద ప్రమాదమే. సెల్‌ఫోన్ పుణ్యమా అని మెదడు ఉచ్చులో ఇరుక్కుంది. సెల్ఫోన్లో ఏది కనిపిస్తోందో అదే నిజమనుకుంటున్నారు. దీంతో యువత ఆలోచనలు ఎదగకుండా ఆగిపోతున్నాయి. ఎప్పుడైతే భవిష్యత్ ఆగిపోయిందని తెలుసుకున్నారో.. అక్కడ్నుంచే మానసిక ఆందోళనలు మొదలవుతున్నాయి. ఇవి క్రమంగా మానసిక జబ్బులుగా మారి జీవితాన్ని కుచించుకుపోయేలా చేస్తున్నాయి’’ అని అంటున్నారు.. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, నిమ్హాన్స్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్–బెంగళూరు) మాజీ ప్రొఫెసర్, కేంద్ర ప్రభుత్వంలో పాతికేళ్లపాటు మానసిక జబ్బులపై సేవలందించిన డా.కె.వి.కిషోర్ కుమార్. విజయవాడ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మానసిక జబ్బులకు కారణాలనేకం.. 15 నుంచి 45 ఏళ్లలోపు వారు ఎక్కువగా మానసిక జబ్బుల బారిన పడుతున్నారు. వంశపారంపర్యం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, మద్యం అలవాటే వీటికి కారణం. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తిస్తే 90 శాతం మందిని సాధారణ స్థితికి తేవచ్చు. ఉమ్మడి కుటుంబాలన్నీ చిన్న కుటుంబాలుగా మారి మానసిక ప్రగతికి బ్రేకులు వేశాయి. చిన్న కుటుంబాల్లో పిల్లలకు తల్లిదండ్రులు ప్రేరణ కావడం లేదు. తోటి స్నేహితులే ప్రేరణగా నిలుస్తున్నారు. వారు మంచివారైతే వీరూ మంచివారవుతున్నారు.. లేదంటే చెడిపోతున్నారు. ఏటా లక్షల్లో పెరుగుతున్నారు.. ప్రపంచవ్యాప్తంగా వ్యాధులకు చేస్తున్న వ్యయంలో 12.5 శాతం మానసిక జబ్బులకే అవుతోంది. మన దేశంలో మానసిక రోగుల కోసం 20 వేల పడకలుంటే.. అందులో 5 వేల మంది పాతికేళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు. ఏటా లక్షల్లో రోగులు పెరుగుతున్నారు. చిన్నతనం నుంచే పిల్లల పెరుగుదల, పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన, వాతావరణం ఇవన్నీ కీలకం. నాలుగేళ్ల వయసులోనే సెల్‌ఫోన్ వాడకం గురించి తెలుసుకున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు.. మా పిల్లలు చాలా గొప్ప అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. సెల్ఫోన్ల బారిన 25 ఏళ్ల లోపు యువత వయసు, మనసు, కెరీర్‌పరంగా ఎదిగే క్రమంలో సరిగ్గా 25 ఏళ్లలోపు యువతను సెల్ఫోన్లు నాశనం చేస్తున్నాయి. వారి విలువైన సమయాన్ని హరిస్తున్నాయి. ఆలోచించే సమయాన్ని లాగేసుకుంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప వీటి నుంచి బయటపడటం కష్టం. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా 13.5 శాతం మంది వివిధ మానసిక జబ్బులతో బాధపడుతున్నారు. వీరిలో వెయ్యికి 10 మంది తీవ్ర మానసిక జబ్బులతో కుంగిపోతున్నారు. దీంతో ఒక్కో రోగి వల్ల వారింట్లో నలుగురు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఏ రాష్ట్రంలోనూ ఇంత గొప్పగా లేదు మానసిక జబ్బులతో బాధపడుతూ ఇంట్లో లేకుండా ఆస్పత్రుల్లోనూ, వీధుల్లోనూ ఉంటున్న చాలామందికి చికిత్స చేసి తిరిగి ఇంటికి తేవడమే.. హోం అగైన్. దీనికోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత గొప్పగా మానసిక వ్యాధుల నియంత్రణకు కృషి చేస్తున్నారు. ఈ క్రతువులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నేను కూడా బనియాన్ ఎన్జీవో సంస్థ ద్వారా కృషి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఆస్పత్రుల నెట్వర్క్ చాలా బాగుంది. ఐదేళ్లు కష్టపడితే రాష్ట్రంలో 90 శాతం వ్యాధులను నియంత్రించొచ్చు. దీనివల్ల ఆర్థిక భారమూ తగ్గుతుంది. చదవండి: టీచర్ అవతారమెత్తిన కలెక్టర్ నివాస్ చిన్నారులను చెరబట్టాడు.. కోరిక తీర్చుకుని.. -
వైరల్ అవుతున్నపెళ్లి ప్రకటన
కోల్‌కతా: పెళ్లి చూపులు అనగానే మన పెద్దలు ఒక మాట చెప్పేవారు అటు, ఇటు ఏడు తరాల చూడాలి అని. అంటే అన్ని విషయాలు పూర్తిగా ఆరా తీయాలని. అయితే కాలం మారుతున్న కొద్ది అన్ని విషయాల్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు పెళ్లాయ్యక ఆడపిల్ల ఇంటి పట్టునే ఉండి, కుటుంబాన్ని చూసుకోవాలని కోరేవారు. నేడు ఇద్దరు జాబ్ చేస్తే బెటర్ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి వధువు కావాలంటూ ఇచ్చిన ప్రకటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. అతడి యాడ్ చూసిన వారంతా ‘నీకు ఈ జన్మలో పెళ్లి కాదు’ అని కుండ బద్దలు కొడుతున్నారు. మరి అంత వింత కోరిక ఏం కోరాడబ్బ అని ఆలోచిస్తున్నారు. ఏం లేదు సోషల్ మీడియాకు అడిక్ట్ అవ్వని అమ్మాయిని వధువుగా కోరాడు. దాంతో నెటిజన్లు నీకు పెళ్లి అవ్వడం.. నేను ప్రధాని కావడం రెండు ఒకటే అంటూ కామెంట్ చేస్తున్నారు. (పదేళ్లుగా లవర్ కోసం వెతుకులాట..) Prospective brides/grooms please pay attention. Match making criteria are changing 😌 pic.twitter.com/AJZ78ARrHZ — Nitin Sangwan, IAS (@nitinsangwan) October 3, 2020 నితిన్ సాంగ్వాన్ అనే ఐఏఎస్ అధికారి వధువు / వరుడు విషయంలో ఆలోచనలు మారుతున్నాయి అంటూ పేపర్లో వచ్చిన ఓ యాడ్‌ని ట్విట్టర్లో షేర్ చేశాడు. పశ్చిమ బెంగాల్ కమర్పూర్‌కు వ్యక్తి ‘చటర్జీ 37/5’7” యోగా ప్రాక్టీషనర్, అందమైన, ఎటువంటి దురలవాట్లు లేని, హైకోర్టులో న్యాయవాది, పరిశోధకుడు. ఇళ్లు, కారు ఉన్నాయి. తల్లిదండ్రులు ఉన్నారు. కమర్పుకుర్‌లో మరో ఇల్లు, కట్నం అడగని వరుడికి అందమైన, పొడవైన, సన్నని వధువు కావాలి.. ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాకు బానిస కాకూడదు’ అంటూ ఇచ్చిన ప్రకటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు నీకు ఇక ఈ జన్మలో పెళ్లి కాదు అని కామెంట్ చేస్తుండగా మరి కొందరు మాత్రం ఇదేం వివక్ష.. మహిళలకు సోషల్ మీడియా చూసే స్వేచ్ఛ కూడా లేదా అని మండి పడుతున్నారు. -
కండల కోసం స్టెరాయిడ్స్!
సాక్షి, సిటీబ్యూరో : అత్యవసర సమయాల్లో వినియోగించే మెఫన్ టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్‌ను నగర యువత స్టెరాయిడ్‌గా వినియోగిస్తోంది. జిమ్‌ల్లో ఎక్కువ సమయం గడిపి, కండలు పెంచడానికి ఈ సూది మందు తీసుకుంటోంది. ఈ ఇంజక్షన్‌ను అక్రమంగా యువతకు విక్రయిస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి, వారి నుంచి రూ.1.5 లక్షలు విలువైన 130 మెఫన్‌టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి శనివారం వెల్లడించారు. ►చంద్రాయణగుట్ట పరిధిలోని అల్ జూబ్లీ కాలనీకి చెందిన మహ్మద్ షా ఫహద్ గతంలో ఓ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి వివిధ రకాలైన ఔషధాలు, వాటిలో స్టెరాయిడ్స్‌గా ఉపకరించే వాటిపై పట్టుంది. ఇతడికి మెఫన్‌టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్ ఉత్ప్రేరకంగా పని చేస్తుందని, దీన్ని యువత ఎక్కువగా వాడతారని తెలిసింది. ►రోగులకు సర్జరీలు చేసే సమయంలో మత్తు (అనస్తీషియా) ఇస్తారు. ఈ ఇంజక్షన్ రక్తపోటును అవసరమైన స్థాయిలో పెంచి, గుండె పక్కాగా పని చేయడానికి ఉపకరిస్తుంది. అలాగే గుండెపోటు వచ్చిన వారికీ వైద్యం కోసం ఈ ఇంజక్షన్‌ను వాడతారు. ►ఈ ఇంజక్షన్‌ను రోగికి ఇవ్వడం ద్వారా అతడి నరాలు పూర్తిస్థాయిలో తెరుచుకునేలా చేయవచ్చు. దీంతో రక్త ప్రసరణ సక్రమంగా జరిగి ముప్పు తప్పే ఆస్కారం ఉంటుంది. అయితే కాలక్రమంగా ఈ ఇంజక్షన్‌ను అథ్లెట్స్ స్టెరాయిడ్‌గా వాడటం మొదలెట్టారు. ►నగరంలో జిమ్‌లకు వెళ్తున్న యువత నిర్ణీత బరువు కంటే ఎక్కువ వెయిట్స్ ఎత్తడానికి, ఎక్కువ సమయం వ్యాయామం చేయడానికి స్టెరాయిడ్‌గా మెఫన్‌టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్ వాడుతున్నారు. నిబంధనల ప్రకారం వైద్యుడి ప్రిస్కిప్షన్ లేనిదే ఈ ఇంజక్షన్ విక్రయించేందుకు వీలులేదు. ►కొందరు అక్రమార్కులు వీటిని జిమ్‌లకు వెళ్లే యువతకు అక్రమంగా, ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ఈ విషయం గుర్తించిన ఫహద్ చాదర్‌ఘాట్‌కు చెందిన షేక్ అబ్దుల్ ఓవైసీతో జట్టు కట్టాడు. వీరిద్దరూ ఢిల్లీకి చెందిన అక్షయ్ ఎంటర్ప్రైజెస్ అనే మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు విక్రమ్ సాయంతో ఈ ఇంజక్షన్లు ఖరీదు చేస్తున్నారు. ►అక్కడి నుంచి కొరియర్లో సిటీకి తెప్పించి జిమ్‌లకు వెళ్లే యువతకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, వి.నరేందర్, మహ్మద్ థక్రుద్దీన్లతో దాడి చేసి ఇద్దరు నిందితుల్ని పట్టుకున్నారు. ►150 ఇంజక్షన్లను వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు. మెఫన్‌టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్ స్టెరాయిడ్‌గా వాడటం వల్ల అనేక దుష్ఫరిణామాలు ఉంటా యని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
ప్రాణం బలిగొన్న మొబైల్ గేమ్ వ్యసనం
గంగవరం (చిత్తూరు జిల్లా): మనస్తాపానికి గురైన ఓ బాలిక ఇంటిలో ఉరేసుకుని బలవన్మరణం చెందింది. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు కిలపట్ల గ్రామానికి చెందిన మణికంఠ కుమార్తె చైత్ర(12) రాయలపేట గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కరోనా కారణంగా పాఠశాలలు మూత పడటంతో అప్పటి నుండి ఇంటి వద్దనే ఉంటోంది. అమ్మ చేస్తున్న ఇంటి పనుల్లో సహాయ పడక పోగా రోజూ మొబైల్లో గేమ్ ఆడుకుంటూ టైంకి సరీగా భోజనం కూడా చేసేది కాదు. మొబైల్లో గేమ్ ఆడొద్దంటూ అప్పుడప్పుడూ తల్లి మందలించేది. ఈ నేపథ్యంలో బాలిక గురువారం రాత్రి ఇంటి మిద్దెపైన రూమ్‌లో ప్యానుకు చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. (చదవండి: దురాశకు పోయారు.. అడ్డంగా దొరికారు) మిద్దిపైకి కోపంగా వెళ్ళిన కుమార్తె ఎంతసేపటికీ కిందికి రాకపోవడంతో తల్లికి అనుమానం వచ్చి మిద్దింటి తలుపును ఎంత తట్టినా కుమార్తె తెరవలేదు. కిటికీలో నుండి చూడగా ప్యానుకు వేలాడుతున్న కుమార్తెను చూసి తల్లి ఒక్కసారిగా బిత్తరపోయి అరుపులు కేకలు పెట్టింది. ఆమె కేకలు విన్న పక్కింటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇంటి తలుపును బద్దలుకొట్టి ప్యానుకు వేలాడుతున్న బాలికను కిందికి దించి వెంటనే పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ బాలికకు చికిత్స అందించే లోపే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
విషాదం: పబ్జీ గేమ్ ఆడిన యువకుడు..
సాక్షి, ద్వారకాతిరుమల: పబ్జీ గేమ్‌కు బానిసైన ఒక యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన ద్వారకాతిరుమలలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన 16 ఏళ్ల యువకుడు కొంత కాలంగా పబ్జీ (ఫ్రీ ఫైర్)గేమ్‌కు బానిసయ్యాడు. లాక్డౌన్ వల్ల ఇంటర్మీడియెట్ చదువుతున్న ఈ యువకుడు ఇంటి వద్దే ఖాళీగా ఉంటూ, ఎక్కువ సమయం ఫోన్‌తోనే గడుపుతున్నాడు. నిద్రాహారాలు మానేసి రాత్రి, పగలు అనే తేడాలేకుండా పబ్జీ గేమ్‌ను ఆడేవాడు. నాలుగు రోజుల నుంచి అతడి ఆరోగ్యం దెబ్బతింది. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం చేయించారు. అయినా ఫలితం లేకపోవడంతో సోమవారం ఉదయం ఆ యువకుడ్ని ఏలూరుకు తీసుకెళ్లి, సంజీవని వాహనంలో కరోనా టెస్ట్ చేయించగా, నెగిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దిండి రిసార్ట్స్ వద్ద తేలిన మృతదేహం పాలకొల్లు సెంట్రల్: ఆచంట మండలం భీమలాపురానికి చెందిన యర్రగొండ్ల పవన్‌కుమార్ శర్మ(24) గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలలో సోమవారం సాయంత్రం 6గంటలకు దిండి రిసార్ట్స్ వద్ద అతని మృతదేహం దొరికినట్లు యలమంచిలి ఎస్సై గంగాధర్ తెలిపారు. శర్మ మృతదేహాన్నీ పంచనామా నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి తరలించనున్నట్లు తెలిపారు. పాలకొల్లు గాయత్రి స్మార్త పురోహిత సంఘం సెక్రటరీ ఈరంకి కాశీ విశ్వనాథం తెలిపిన వివరాలు ప్రకారం భీమలాపురానికి చెందిన పవన్‌కుమార్ శర్మ సంస్కృతంలో ఎంఏ చేశారు. సంస్కృతానికి విలువ లేకపోవడంతో ఉద్యోగం దొరకక పాలకొల్లు పట్టణంలో పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి వృద్ధుడైన తండ్రి, మానసిక ఇబ్బందితో ఉన్న తల్లి, కదలలేని స్థితిలో బాబాయ్, 90 సంవత్సరాల నానమ్మ ఉన్నారు. వీరు ఉంటున్న ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది. వీరందరినీ శర్మ జీవనాధారంతోనే పోషించుకుంటూ వస్తున్నాడు. గత నాలుగు నెలలుగా కోవిడ్ 19 వల్ల ఆలయాలు మూసివేయడం పెళ్లిళ్లు పేరంటాలు, పూజలు, హోమాలు లేకపోవడంతో ఆదాయ మార్గాలు లేక ఆర్థిక భారంతో అనేక ఇబ్బందులకు గురయ్యాడని తెలిపారు. ఈ బాధలు భరించలేక ఆదివారం తన ద్విచక్ర వాహనంపై చించినాడ గోదావరి వంతెన వద్దకు వెళ్లి గోదావరిలో దూకినట్లు అక్కడి స్థానికులు తెలిపారన్నారు. -
లాక్డౌన్: స్మార్ట్ ఫోన్‌కు బానిసవుతున్నారా?
అసలే కరోనా లాక్డౌన్ కాలం.. ఆపై ఖాళీగా ఇంట్లో ఉండేవాళ్లం.. సెల్‌ఫోన్ లేకపోతే!.. ఆ ఊహే బాగోలేదంటారా. మీరు ఆ ఊహలో బ్రతుకుతుంటే మాత్రం మీ జీవితాన్ని మీ చేతులారా నాశనం చేసుకుంటున్నారని గ్రహించండి. ఈ కొన్ని రోజుల కాలాన్ని గడపటానికి మీరు సెల్‌ఫోన్‌ను ఆశ్రయించినట్లైతే లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని గుర్తించండి. లాక్డౌన్ తర్వాత మీరు పనుల్లోకి వెళ్లిపోతారు. ఇన్ని రోజులు సెల్‌ఫోన్‌కు అతుక్కుపోయిన బుర్ర ఒక్కసారిగా పనిమీదకు మళ్లమంటే మొండికేస్తుంది. కుదరదని మంకు పట్టుపడుతుంది. పని మీద శ్రద్ధ పెట్టలేక, పని సమయంలో సెల్‌ఫోన్ వాడలేక ఒత్తిడికి లోనవుతారు. ( వైన్ షాపులు తెరవండి.. ఖజానా నింపుకోండి ) వ్యసనాన్ని చంపుకోలేక ఒక వేళ ఆఫీసులో కూడా ఫోన్ వాడుతూ కూర్చుంటే.. మీ నెత్తిన సెల్‌ఫోన్ పడ్డట్లే. సెల్‌ఫోన్ వ్యసనం మీ ఫ్యామిలీ లైఫ్‌పై, జాబ్ లైఫ్‌పై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు సెల్‌ఫోన్ వాడటం వల్ల నిద్ర సంబంధింత సమస్యలు రావటమే కాకుండా నిద్రలేమితో దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. సెల్‌ఫోన్ వాడకాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి : సెల్‌ఫోన్ నుంచి మీ దృష్టిని మరల్చడానికి వేరే పనుల్లో బిజీగా ఉండటానికి ప్రయత్నించండి. మీ సమయాన్ని మొత్తం భాగాలుగా విభజించి ఒక్కో సమయంలో ఒక్కో పని చేస్తూ గడపండి. దీర్ఘకాలంలో ఫలితాలనిచ్చే అంశాలపై దృష్టి పెట్టండి. ఓ గంట పుస్తకం చదవటం, ఓ గంట ఇంటి పనులు చేయటం.. ఇలా సమయాన్ని మీ ఇంటి వాతావరణానికి తగ్గట్లు ఎంచుకోండి. దీంతో మీకు శారీరకంగానూ, మానసికంగానూ ఉపయోగపడుతుంది. ఒక్కో సారి అవసరం లేకపోయినా సెల్‌ఫోన్‌ను చేతుల్లోకి తీసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఓ క్షణం ఆలోచించండి ‘‘ నేనెందుకు ఇప్పుడు సెల్‌ఫోన్ ముట్టుకున్నాను. ( ఆ విషయం మాకూ తెలుసు.. అదో వ్యూహం! ) నిజంగా దీంతో నాకు అవసరం ఉందా’’ అని. ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ యూజర్స్ కనీసం మూడు గంటల పాటు సెల్‌ఫోన్‌తో కాలం వెళ్లదీస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్‌లకు వీలైనంత దూరంగా ఉండండి. అసలు అవసరం లేదనుకుంటే వాటిని డిలేట్ చేయటం మంచిది. ఇంట్లో ఉన్నపుడు వీలైనంత మీ సెల్‌ఫోన్‌ను దూరంగా ఉంచండి. నిద్రపోయే సమయంలో సెల్‌ఫోన్‌ను దరిచేరనీయకండి. -
పబ్జీ.. డేంజర్‌జీ
-పదో తరగతి వార్షిక పరీక్షల సమయంలో చదువుకోకుండా సెల్ఫోన్లో పబ్జీ ఆడుతుండడంతో తల్లి మందలించినందుకు మనస్తాపంతో మల్కాజిగిరి విష్ణుపురి ఎక్స్టెన్షన్ కాలనీకి చెందిన ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకొని ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. - తాజాగా వనపర్తికి చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి పబ్జీ ఆటలో లీనమై నిద్రాహారాలు మానేయడంతో మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి కాలు, చేయి పడిపోయాయి. అచేతన స్థితిలో ఉన్న ఆ యువకుడు నగరంలోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేరాడు. సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ పబ్జీ తాజాగా నగరంలోనూ విస్తరిస్తోంది. ప్రమాదకరమైన ఈ పబ్జీ ఆటకు బానిసై... అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు చేరుకుంటున్న యువకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ గేమ్ ఆడుతున్న వ్యక్తులు... ఇప్పుడు పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు.. ఆడొద్దని చెబితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హత్యలూ చేస్తున్నారు. తొలుత ‘పోకేమాన్’ అంటూ రోడ్డున పడిన యువత... ఆ తర్వాత బ్లూవేల్‌కు బానిసై ఆత్మహత్యలు చేసుకోవడం తెలిసిందే. ఇప్పుడదే కోవలో పబ్జీ వచ్చి చేరింది. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది ఈ ఆట ఆడుతున్నారని, ఇందులో సుమారు 4 కోట్ల మంది నిత్యం యాక్టివ్‌గా ఉంటున్నారని అంచనా. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి కేశవర్ధన్(19) రాత్రి వేళల్లో పబ్జీ ఆటలో లీనమై నిద్రాహారాలు మానేయడంతో రక్తనాళాలు చిట్లిపోయి మెదడులో రక్తం గడ్డ కట్టింది. ఫలితంగా కాళ్లు, చేతులు పడిపోయి అచేతనా స్థితిలో ఈ నెల 26న నగరంలోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేరాడు. దీంతో ‘పబ్జీ’ మరోసారి చర్చనీయాంశమైంది. ఆస్పత్రికి చెందిన న్యూరో ఫిజిషియన్ సకాలంలో గుర్తించి వైద్యం చేయడంతో యువకుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆటలో లీనమైతే అంతే... పబ్జీ అంటే ‘ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్’ అని అర్థం. దక్షిణ కొరియాలోని ఓ గేమింగ్ సంస్థ ఈ మల్టీ ప్లేయర్ గేమింగ్ యాప్‌ను రూపొందించింది. ఈ గేమ్ ఆడాలంటే ముందుగా పబ్జీ యాప్‌ను మొబైల్‌లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఐడీ లభిస్తుంది. అయితే, ఈ ఆటను సింగిల్‌గా కాకుండా జట్టుగా ఆడితేనే మజా ఉంటుంది. దీంతో కొంతమంది టీమ్‌లుగా ఏర్పడి మరీ ఈ గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్ ఆడే వ్యక్తులు సైనికులుగా మారిపోతారు. స్వయంగా యుద్ధ రంగంలోకి దిగి శత్రువులతో పోరాడుతున్నామనే భావనలో ఉంటారు. ఒకసారి ఆట మొదలైందంటే యుద్ధంలో ఉన్నట్లే. అప్రమత్తంగా లేకపోతే శత్రువులు చంపేస్తారు. దీంతో ఈ ఆటలో లీనమైనవారు పక్కన ఎవరున్నారు? ఏం జరుగుతుంది? అనే అంశాలనే కాదు చివరికి నిద్రాహారాలనే మరిచిపోతుంటారు. ఆటలో లీనమైతే మళ్లీ బయటకు రావడం కష్టమే. పైగా గ్రూప్‌తో కలిసి ఆడినప్పుడు మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఆట ఆడేవారు తమని తాము సైనికులుగా భావిస్తారు. ఇది గ్రూప్ వాయిస్ గేమ్ కావడంతో యుద్ధం చేస్తుంది తామేననే భావన ఏర్పడి, తెలియకుండానే ఈ గేమ్‌కు బానిసలుగా మారి.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ప్రముఖ మానసిక వైద్యనిపుణుడు డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. మానసిక సమస్యలు.. ఈ ఆటతో పిల్లల మానసిక, శారీరక స్థితి తీవ్రంగా దెబ్బతింటోందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. ఆటాడే సమయంలో వీరు ఇతరులను పట్టించుకోరు. గేమ్ నుంచి దృష్టి మరల్చితే శత్రువుల చంపేస్తారనే భయంతో పరిసరాలను మరిచిపోతుంటారు. ఏకాగ్రత లోపించి చదువులో వెనకబడి పోతుంటారు. ఆ సమయంలో ఎవరైనా ఫోన్ చేసినా, పిలిచినా పట్టించుకోరు. ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అసహనం ప్రదర్శిస్తారు. కొంతమంది కోపంతో ఊగిపోతారు. ఈ ఆటకు బానిసలైన యువత నిద్ర లేమి, కంటి చూపుతో బాధపడుతుంటారు. గంటల తరబడి ఒకేచోట కూర్చొని ఆడడంతో మానసిక సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో న్యూట్రిషన్ లెవల్స్ పడిపోయి డీహైడ్రేషన్‌కు లోనవుతుంటారు. మెదడులో క్లాట్స్ ఏర్పడి, చివరకు కాళ్లు, చేతులు పడిపోతుంటాయి. – డాక్టర్ వినోద్‌కుమార్, న్యూరోఫిజిషియన్, సన్‌షైన్ ఆస్పత్రి గేమ్‌ను నిషేధించాలి.. యువత రోజుకు 8–10 గంటలు ఈ ఆట ఆడుతోంది. దీనికోసం అన్ని పనులను వదులుకునే స్థాయికి వస్తున్నారు. దీంతో కొన్ని రాష్ట్రాలు ఈ గేమ్‌పై నిషేధం విధించాయి. ఇటీవల జమ్మూలో ఓ ఫిట్నెస్ ట్రైనర్ పబ్జీకి బానిసై పిచ్చివాడయ్యాడు. దీంతో అక్కడి ప్రభుత్వం పబ్జీని నిషేధించింది. గుజరాత్ ప్రభుత్వం స్కూళ్లలో ఈ ఆటను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు స్కూళ్లకు స్మార్ట్ ఫోన్లు తీసుకెళ్లరాదని ఆదేశించింది. వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) సైతం ఈ గేమ్‌పై నిషేధం విధించింది. మహారాష్ట్ర హైకోర్టు కూడా ఈ గేమ్‌ను నిషేధించింది. ఈ పబ్జీ గేమ్‌ను తెలంగాణలోనూ నిషేధించాలి. – అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం -
సోషల్ మీడియా బూచోళ్లు..
సాక్షి,హైదరాబాద్ : వినోదం, ఆటలు, స్నేహం పేరిట సామాజిక మాధ్యమం వేదికగా చిన్నారులకు ‘సోషల్ కింకరులు’గాలాలు వేస్తున్నారు. వీరికి చిక్కితే అంతే సంగతులు. మెల్లిగా మాట్లాడి స్నేహం చేస్తారు. వ్యక్తిగత వివరాలు అడుగుతారు. నగ్నఫొటోలు సేకరిస్తారు. వాటితో బ్లాక్మెయిల్ చేస్తారు. పిల్లలతో చేయరాని పనులు చేయిస్తారు. వీరిని వినోదం పంచే వస్తువులుగా, కోరికలు తీర్చుకునే యంత్రాలుగా వాడతారు. వీరి వికృత చేష్టలకు అన్నెంపుణ్యం తెలియని టీనేజర్లు బలవుతున్నారు. రష్యాలో ఓ పిచ్చివాడు రూపొందించిన బ్లూవేల్ గేమ్ కారణంగా మన దేశంలో అనేకమంది చిన్నారులు ప్రాణాలు తీసుకున్నారు. పిల్లల తల్లులకు వాడు జీవితాంతం తీరని కడుపు కోత మిగిల్చాడు హైదరాబాద్‌లో ఓ కామాంధుడు ఫేస్బుక్ వేదికగా 15 ఏళ్ల బాలికకు ఎరవేసి, ఎత్తుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ప్రతిఘటించడంతో బాలికను బండరాయితో మోది పొట్టనబెట్టుకున్నాడు హైదరాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్లో చదువుకునే టీనేజీ కుర్రాడిని తప్పుడు చిరునామాతో ఓ మహిళ వలలో వేసుకుంది. ఆ కుర్రాడు పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. తల్లిదండ్రులకు తెలిసి నిలదీయడంతో రేప్ కేసు పెడతానని బెదిరించింది. గత్యంతరం లేక తల్లిదండ్రులు ఆమె అడిగినంత చెల్లించి, పిల్లాడిని మరో ఊరుకు మార్చారు. తియ్యటి మాటలతో వల.. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది యువకులు టీనేజీ అమ్మాయిలు, అబ్బాయిలకు అమ్మాయిల ఫొటోలతో గాలం వేస్తున్నారు. తర్వాత బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి ఏకంగా ప్రాణాలు తీసేస్తున్నారు. ఇటీవల సూర్యాపేటలో ఉండే ఓ బాలిక గోదావరిజిల్లాకు చెందిన ఓ యువకుడి వలలో పడింది. అతడి తియ్యటి మాటలకు పొంగిపోయింది. చెప్పినట్లు చేసింది. ఇంట్లో నగలన్నీ ఆ యువకుడికి ఇచ్చింది. ఆ నగలతో సదరు యువకుడు కారు కొనుక్కుని జల్సాలు చేశాడు. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు పాటించాలి.. రోజులో 8 గంటలు నిద్రపోతే, 8 గంటలు కాలేజ్ లేదా స్కూల్లో ఉంటారు. ఇక మిగిలిన 8 గంటల సమయంలోనే కొత్త స్నేహాల కోసం వెదుకుతుంటారు. రోజువారీ పనులకు 2 గంటలు పోయినా.. ఇక మిగిలింది 6 గంటలు. ఈ సమయం చాలు.. సైబర్ కింకరులు పిల్లలను గద్దల్లా తన్నుకుపోవడానికి. సైబర్ వేధింపులకు గురైన పిల్లలు ముభావంగా, భయం భయంగా ఉంటారు. అన్నం సరిగా తినరు. రాత్రివేళల్లో నిద్రపోకుండా నిత్యం స్మార్ట్‌ఫోన్ చెక్ చేస్తుంటారు. అలాంటి వారిని ఏకాంతంగా అసలు వదలకండి. వారి ఫోన్‌కు లాక్ చేస్తామంటే ఒప్పుకోకండి. వారు ఏయే యాప్‌లు వాడుతున్నారో తెలుసుకుని ప్రమాదకర యాప్‌ల గురించి వివరించి హెచ్చరించండి. సాధారణ సోషల్ మీడియా వేదికలపై వారి ఫ్రెండ్లిస్టుల్లో మీరూ ఉండండి. వారికి ఒకటికి మించి ఖాతాలుంటే వాటి గురించి తెలుసుకోండి. నిత్యం ఫోన్లో తలమునకలవుతూ.. అకస్మాత్తుగా కోప్పడటం, చిరాకుపడటం చేసే పిల్లల్ని వారి రూముల్లో ఒంటరిగా పడుకోనివ్వద్దు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కనిపెట్టుకోవడం మంచిది. ఈ యాప్‌లతో జాగ్రత్త ! అంతా అనుకుంటున్నట్లుగా కేవలం ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ యాప్‌లే కాదు. సోషల్ కింకరులు ఎవరికీ అనుమానం రాకుండా ఈ యాప్‌లను రూపొందిస్తున్నారు. విద్యార్థులు వారి ఉచ్చులో పడ్డాకఆ తతంగాన్ని తల్లిదండ్రులు గుర్తించకుండా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. కాలిక్యులేటర్ : ఈ యాప్ చూసేందుకు కాలిక్యులేటర్‌లా ఉంటుంది. తల్లిదండ్రులు ఇదో ఎడ్యుకేషన్ యాప్‌లా భావిస్తారు. కానీ వాస్తవానికి ఇది రహస్యంగా ఫొటోలు షేర్ చేసుకునేందుకు ఉద్దేశించిన యాప్. ఓమిగిల్ : ఇది గణితశాస్త్రంలో వాడే ఒమేగాను పోలి ఉంటుంది. ఇది కొత్త వారితో, తెలియని వారితో స్నేహం చేసేందుకు వేదిక. ఇక్కడే చాలామంది పిల్లలు కొత్తవారితో చాట్ చేయాలన్న ఉత్సుకతతో తమ వ్యక్తిగత వివరాలు చెప్పేసి వారి వలలో చిక్కుతారు. విస్పర్ : ఈ యాప్ కొత్త వ్యక్తులను కలుసుకునేందుకు ఉద్దేశించింది. ఈ యాప్‌లో సమాచారం ద్వారా గాలాలు వేస్తుంటారు. ఆస్క్ ఎఫ్ఎమ్ : ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నారంటే అంతే. దీన్ని అంత ప్రమాదకరంగా రూపొందించారు. ఒకసారి లాగిన్ అయ్యారో.. ఇక మీరు ఈ సైబర్ రాక్షసుల నుంచి తప్పించుకోలేరు. హాట్ ఆర్ నాట్ : ఈ యాప్‌తో ఇంకా ప్రమాదకరం. వ్యక్తిగత ఫొటోలు సహా వివరాలన్నీ సేకరిస్తారు. తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు. బెదిరింపులతో చిత్రవధ చేస్తారు. బర్న్ బుక్ : సమాజంలో వ్యక్తులపై వదంతులు పుట్టించేందుకు ఉద్దేశించిన యాప్ ఇది. దీని ద్వారా వ్యక్తిత్వాన్ని హరించేలా కామెంట్లు, ఆడియోలు సృష్టించి బజారు కీడ్చటమే వారి పని. విష్బోన్ : ఈ యాప్ పిల్లల మధ్య అసమాన తలను ఎత్తిచూపుతుంది. ఇందులో నమోదైన వారిని మిగిలినవారితో పోల్చి చూపిస్తుంటుంది. ఎదుటి వారి ముందు అసమానతలు బయట పడ్డందుకు చాలామంది మానసికంగా కుంగిపోతారు. కిక్ : ప్రపంచ వ్యాప్తంగా సైబర్ వేధింపుల ఫిర్యాదులు అధికంగా నమోదవుతున్న యాప్‌లో ‘కిక్’కూడా ఒకటి. టీనేజర్లే ఈ యాప్ లక్ష్యం. వారి వ్యక్తిగత వివరాలు, ఫొటోలు సేకరించి వేధింపులకు పాల్పడుతున్నారు. యెల్లో : టీనేజర్లను కామెంట్లు చేసేందుకు ఉద్దేశించిన యాప్. కొత్త పరిచయాలు, తెలియని వ్యక్తులతో చాటింగ్ దీని లక్ష్యం. ఇక్కడ కూడా పిల్లలు ప్రమాదాల బారిన పడే అవకాశాలు పుష్కలం. ఇన్స్టాగ్రామ్ : తప్పుడు వివరాలతో పలువురు పిల్లలు నకిలీ ఖాతాలు సృష్టించి కొత్తవారితో చాట్ చేసి చిక్కుల్లో పడుతున్నారు. -
వైట్నర్ మత్తులో మహిళల హల్చల్
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీలో ఇన్నాళ్లూ యువకులు మాత్రమే వైట్నర్కు బానిసై జీవితాలు నాశనం చేసుకోగా.. ప్రస్తుతం ఈ వ్యసనం మహిళలకు కూడా పాకింది. వైట్నర్ తాగిన మత్తులో ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ వద్ద శనివారం రాత్రి నలుగురు మహిళలు వీరంగం సృష్టించారు. పోలీసులపై దాడికి యత్నించారు. ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన షబానా, పర్వీనా, జబానా, అయేషాలు వైట్నర్ సేవనానికి బానిసలయ్యారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా వీరు మదీనా కాలనీ, ఫలక్‌నుమా జైతున్ హోటల్, ఇంజన్‌బౌలి ప్రాంతాలలో రోడ్లపై ట్రాఫిక్‌ను అడ్డగించడం.. చెప్పులు విసరడం.. బూతులు తిట్టడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ విషయమై రెండు మూడు రోజులుగా 100 డయల్‌కు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఎస్సైలు రమేష్ నాయక్, గొకారీ నేతృత్వంలో వైట్నర్లపై శనివారం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. ఫాతిమా నగర్‌కు చెందిన గోరీ బీ అనే మహిళ శనివారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని తన 12 ఏళ్ల చిన్న కూతురు సభా బేగాన్ని వైట్నర్ సేవించిన నలుగురు మహిళలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. ఇంట్లోనీ వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు ‘నీ పెద్ద కుమార్తె ముంతాజ్ బేగం తన భర్త హాజీతో అక్రమ సంబంధం పెట్టుకుందని.. నీ పెద్ద కుమార్తె వస్తేనే చిన్న కుమార్తె సభా బేగాన్ని విడిచి పెడతామంటూ పర్వీనా అనే మహిళ బెదిరించి మిగిలిన ముగ్గురితో కలిసి తీసుకెళ్లిందని’ ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే స్పందించిన పోలీసులు నలుగురు మహిళలు నివాసం ఉన్న ప్రాంతానికి వెళ్లి బాలికను వారి చెర నుంచి విడిపించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇదే సమయంలో నలుగురు మహిళలు కూడా పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేసిన గోరీ బీని పోలీసుల సమక్షంలోనే కొట్టడం ప్రారంభించారు. వెంటనే స్పందించిన పోలీసులు వారి స్థితిని గమనించి పోలీస్‌స్టేషన్ నుంచి బయటికి వంపించారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళలు పోలీసులను దుర్భాషలాడుతూ.. చెప్పులు విసరసాగారు. అంతటితో ఆగకుండా ప్రధాన రహదారిపైకి వచ్చి వాహనదారులకు ఆటంకం కల్పించారు. మహిళా పోలీసులు వారిని పట్టుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కిడ్నాప్, న్యూసెన్స్ కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ప్రాణాలు తీస్తున్న పబ్జీ
కామారెడ్డి క్రైం, నిజామాబాద్ అర్బన్: పబ్జీ గేమ్.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారిలో దాని గురించి తెలియనివారుండరు. ప్రధానంగా యువతను ఉర్రూతలూగిస్తున్న ఆన్లైన్ ఆట. తిండి, నిద్ర హారాలు మానేసి ఆటకు బానిసలవుతున్నారు. సరదాగా మొదలై అతి తక్కువ కాలంలోనే యువతను తనకు బానిసను చేసుకుంటున్న క్రీడ. తమకు తెలియకుంగానే పబ్జీకి అంకితమవుతున్న యువత మానసికంగా, శారీరకంగా స్థిమితాన్ని కోల్పోతున్నారు. ఆట వద్దని చెబితే విచక్షణ కోల్పోయి హత్యలు, ఆత్మహత్యలకు సైతం వెనుకాడటం లేదు. ఈ ఆట కారణంగా కొందరికి మానసిక వ్యాధులు, మరికొందరి సంసారాల్లో విడాకులు, చాలా కుటుంబాల్లో పిల్లలు, తల్లిదండ్రుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. అందుకే ఈ క్రీడను గేమింగ్ డిజార్డర్‌గా గుర్తించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రస్తుతం మన దేశంలో మొబైల్ ఫోన్ల క్రీడల్లో 60 శాతం యువత నిత్యం పబ్జీ గేమ్‌లో మునిగిపోతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతమని నిపుణులు భావిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలు పెరుగుతున్న నేటి కాలంలో పిల్లలు సెల్ఫోన్లతో ఏం చేస్తున్నారో గమనించే తీరిక లేకుండా పోతోంది. ఇటీవలే నిజామాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఈ మృత్యుక్రీడకు బలయ్యాడు. తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదకరమైన పరిస్థితులు తప్పవంటున్నారు వైద్యనిపుణులు. పబ్జీ గేమ్ అంటే.. పబ్జీ అంటే ప్లేయర్ అన్నౌన్ బ్యాటిల్ గ్రౌండ్స్. ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తిగా ఆన్లైన్ వేదికగా సాగే ఆట ఇది. 2018లో ఈ గేమ్ మార్కెట్లోకి విడుదలైంది. దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్ సంస్థ దీన్ని యాప్‌లా తయారుచేసింది. యాప్‌ను ఫోన్లో వేసుకొని ప్రారంభించగానే ఎంతమందితో ఆడాలో నిర్ణయించుకోవాలి. ఆన్లైన్లో స్నేహితులంతా జట్టుగా ఏర్పడి ఆడతారు. ఆ సమయంలో స్నేహితులంతా ఎప్పటికప్పుడు మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుంది. గరిష్టంగా వందమంది ఆడవచ్చు. ఎంచుకున్న జట్టు తప్ప మిగితా వారంతా శత్రువుల కిందే లెక్క. శత్రువులనను తుపాకులతో, బాంబులతో చంపడమే లక్ష్యంగా ఆట సాగుతోంది. ప్రత్యేకమైన సైనికుల తరహాలో వేషధారణలతో కూడిన జట్లు పరస్పరం దాడులు చేసుకుంటూ యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తుంది. ఆటగాడు చనిపోతే అతడి గేమ్ ముగుస్తుంది. ఎలాగైనా అందర్ని చంపి గెలవాలన్న తపనతో చనిపోయిన ప్రతిసారీ యువత మళ్ళీ గేమ్‌లోకి ప్రవేశి స్తూ ఆటను ప్రారంభిస్తారు. ఇలా నిద్రాహారాలు మానేసి సెల్ఫోన్లో పబ్జీ ఆటకు బానిసలుగా మారుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఇరవై కోట్ల మంది యువత పబ్జీ ఆటలో లీనమవుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. పెరుగుతున్న నేర ప్రవృత్తి.. పబ్జీ ఆటలో ఉండేది మొత్తం నేర ప్రవృత్తే. ఎదుటివారిని తుపాకులతో కాల్చడం, బాంబు లు వేసి చంపడమే లక్ష్యంగా సాగుతోంది. దీం తో పబ్జీలో ఉన్నట్లుగానే నేర ప్రవృత్తికి అలవాటుపడే అవకాశం ఉందటున్నారు నిపుణులు. ఈ ఆటను ఆడవద్దని తల్లిదండ్రులు మందలిస్తే, సెల్ఫోన్లు లాక్కుంటే ఎందరో యువకులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు వెలుగుచూశాయి. వారం రోజుల క్రితం నిజామాబాద్‌లో ఓ యువకుడు, మెదక్‌లో ఓ యువకుడు చనిపోయారు. పబ్జీ ఆడకపోతే నిమిషం నిలు వలేని స్థితిలోకి వెళ్ళిన హైదరాబాద్‌లోని మల్కా జ్గిరికి చెందిన పదో తరగతి విద్యార్థి సాంబశివ తల్లిదండ్రులు వారిస్తే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పబ్జీ ఆటకు బానిసలై వింతగా ప్రవర్తిస్తున్న ఎందరో యువకుల వీడియోలు వాట్సప్, ఫేస్బుక్లో చక్కర్లు కొడుతున్నాయి. పబ్జీ ఆడవద్దని మందలిస్తే తల్లిదండ్రులని కూడా చూడకుండా వారిపైనే పిల్లలు దాడి చేసిన సంఘటనలు సైతం వెలుగుచూశాయి. చాలా చోట్ల నిషేధం... పబ్జీతో ఎదురవుతున్న దుష్పరిణామాలను గుర్తించిన చైనా దేశం ఈ ఆటను పూర్తిగా నిషేధించింది. తాజాగా మన దేశంలోని గుజరాత్ ప్రభుత్వం సైతం పాఠశాలల్లో ఈ ఆటను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఈ గేమ్‌ను పూర్తిగా నిషేధించాలని కోరుతూ కేంద్రానికి గుజరాత్ ప్రభుత్వం సిఫారసు చేసింది. దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వస్తుండటంతో ఈ ఆటను ఒక ఖాతాదారుడు కేవలం ఆరు గంటలు మాత్రమే ఆడేలా పరిమితి విధించారు. అయినా యువత ఒక్కొక్కరు ఒకటికి మించి అకౌంట్లు సృష్టించుకొని మరీ గంటల తరబడి ఆడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మాయదారి క్రీడను పూర్తిగా నిషేధించాలనే డిమాండ్ రోజురోజుకీ పెరుగుతుంది. లేదంటే ఎందరో యువత ఈ మృత్యు క్రీడ కారణంగా తమ విలువైన జీవితాలను కోల్పోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరీక్షా ఫలితాలపై ప్రభావం... ఈ క్రీడ మూలంగా విద్యార్థులు అస్సలు చదవడం లేదని, ఎప్పుడు చూసిన సెల్ఫోన్లోనే మునిగితేలుతున్నారనే ఫిర్యాదులు పెరిగాయి. ఈ ప్రభావం పరీక్షా ఫలితాలపై పడుతోంది. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఫలితాల్లో ఎంతో మంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. చదువుకోవడానికి సమయం కేటాయించకపోవడమే కారణం అవుతోంది. విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. దీంతో పరీక్షా ఫలితాలు ఎందరో తల్లిదండ్రులకు నిరుత్సాహాన్ని మిగుల్చుతోంది. పబ్జీకి బానిసలుగా మారిన పిల్లలను మామూలు స్థితికి తెచ్చేందుకు మానసిక వైద్యులను సంప్రదిస్తున్న కేసులు పెరిగాయి. -
ఈ నగరానికి ఏమైంది..?
ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు మసి.. మరో వైపు పొగ.. ఎవరూ మాట్లాడరేం.. కాలే బీడీ సిగరెట్ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి.. ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు తప్పకుండా వచ్చే ప్రకటన. ప్రకటన చూడడమే తప్ప పొగరాయుళ్లలో ఎటువంటి చలనం కలగడం లేదు. కాల్చే సిగరెట్లో నికోటిన్ విషతుల్యమైన మత్తు పదార్ధం ఉంటుంది. సిగరెట్, బీడీ తాగే వారిలో ఈ విషం శరీరాన్ని పీల్చిపిప్పి చేస్తుంది. నేటి యువత ధూమపానాన్ని క్రేజీగా భావిస్తూ అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటోంది. పొగతాగడం వ్యసనంగా మారితే ప్రాణాన్నే హరిస్తుందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. నేడు నో స్మోకింగ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.. సాక్షి, తిరుపతి (అలిపిరి): పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రసార మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. సిగరెట్ ప్యాకెట్‌పైనే ప్రాణాంతకం అంటూ రాసుంటుంది. అయినా పొగతాగేవారు వాటిని అసలు పట్టించుకోవడం లేదు. ఆరోగ్యం విషవాయువుల నడుమ హరిస్తున్నా.. పొగతాగే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. నేటి యువత ధూమపానాన్ని క్రేజ్‌గా భావి స్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధం విధించినా చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. ఊపిరితిత్తులకు ముప్పు పొగ పీల్చగానే నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. మనం పీల్చే గాలిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ శరీరానికి అందుతుంది. హానికర కార్బ న్ డైయాక్సైడ్ ఇతరత్రా వాయువులు విడిపోతాయి. ఆక్సిజన్‌ను హిమోగ్లోబిన్ పీల్చుకుని మిగిలిన వాయువులను బయటకు పంపుతుంది. పొగ తాగడం వల్ల శరీరంలోని కార్బన్ మోనాక్సైడ్, సైనైడ్ వంటి విష పదార్థాలు గాలి గదిలో చేరి హిమోగ్లోబిన్‌తో గాఢమైన బంధాన్ని ఏర్పరుచుకుంటాయి. దీంతో హిమోగ్లోబిన్‌కు ఆక్సిజన్ మోసుకుపోయే సామర్ధ్యం తగ్గి కార్బన్ మోనాక్సైడ్‌తో కణాలు విషపూరితమవుతాయి. ఫలితంగా పలు వ్యాధులు సోకుతాయి. పీల్చేవారికీ ప్రమాదమే పొగ తాగేవారి కంటే పీల్చే వారు తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పొగతాగేవారిని యాక్టివ్ స్మోకర్గా, పీల్చేవారిని పాసివ్ స్మోకర్గా పిలుస్తారు. పొగ తాగేవారితో పాటు పీల్చేవారు కూడా పలు రకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పొగ పీల్చడం వల్ల మహిళల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. ఎక్కువ పీల్చడం వల్ల అబార్షన్లు జరగడం, ఒక వేళ పిండం ఎదిగినా చివర్లో మృత శిశువులు జన్మించడం వంటి సమస్యలు మహిళలను వేధించే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 2.5 కోట్ల మంది పొగతాగే వారున్నట్లు అంచనా. ఒక సిగరెట్ తాగితే 43 రకాల విష వాయువులు వెలువడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ అలవాటు ఉన్న వారు మానేస్తే, 20 ఏళ్ల తరువాత లంగ్స్ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గొంతు క్యాన్సర్ పొగ తాగేవారిలో నోటి, గొంతు సమస్యలు ఉత్పన్నమవుతాయి. గొంతులో ఉండే ప్రతి అవయవమూ పొగబారినపడి క్యాన్సర్‌కు లోనయ్యే ప్రమాదం వుంది. గొంతులో ఉండే స్వరపేటిక, థైరాయిడ్, గొంతు నుంచి ఊపిరితిత్తుల్లోకి వెల్లే బ్రాంకియా.. ఇలా ప్రతి భాగమూ దెబ్బతిని అవయవాలన్నింటికీ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. పొగతాగే వారిలో గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ. నష్టం ఎంతంటే.. ♦ ఒక సిగరెట్ తాగితే 43 రకాల విషవాయువులు వెలువడుతాయి. ఎంఫసియా,క్రానిక్ అబ్స్ట్రిక్టవ్ పల్మ్నరీ డిసీజ్ లాంటి ప్రమాదకర మైన వ్యాధులు సోకుతాయి. ♦ బ్రెయిన్ స్ట్రోక్‌కు అవకాశం ఎక్కువ. ♦ దుర్వాసనతో నోరు,పెదాలు, నాలుక క్యాన్సర్లు వస్తాయి. ♦ ముఖంపై మచ్చలు ఏర్పడుతాయి. ♦ పళ్లు రంగు మారుతాయి. ♦ కనుగుడ్డు మీదా ప్రభావం ఉంటుంది. ♦ ఊపిరితిత్తులు క్యాన్సర్ వస్తుంది. ♦ గుండెపోటుకు అవకాశం ఎక్కువ. ♦ రక్త ప్రసరణ ప్రక్రియ మందగిస్తుంది. ♦ కడుపులో ప్రమాదకర యాసిడ్లు ఉత్పత్తి అవుతాయి. ♦ మూత్రాశయం..మూత్రపిండాలు దెబ్బతింటాయి. ♦ శరీరంలో అన్ని భాగాలు దెబ్బతింటాయి. ♦ పొగపీల్చే మహిళల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. అమలుకు నోచుకోని చట్టాలు బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడంపై చట్టాలు ఉన్నా అవి పూర్తిగా అమలుకు నోచుకోవడం లేదు. బహిరంగంగా పొగ తాగుతూ అధికారులకు పట్టుబడితే తొలిసారి రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా.. రెండో సారి పట్టుబడితే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా.. ఒక్కో సందర్భంలో రెండు శిక్షలు అమలు చేయవచ్చు. ఈ చట్టం ఆచరణలో విఫలమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ 2014లో చట్టంలో నిబంధనలు మార్చాలని భావించి మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. దీని ప్రకారం ధూమపాన సేవనానికి ఉన్న వయోపరిమితిని 18 నుంచి 25 ఏళ్లుగా చేసింది. నిబంధన అమలుకు నోచుకోలేదు. 2003లో పొగాకు నిషేధ చట్టం ప్రకారం విశ్వ విద్యాలయాల్లో వంద గజాల దూరంలో ఎలాంటి పొగాకు విక్రయ కేంద్రాలు ఉండకూడదు. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం ఒక సిగరెట్ తాగితే ఏమౌతుందులో అనే అలోచను విడనాడాలి. పొగ, గుట్కాలు వంటివి తీసుకోవడం వల్ల శరీరం అనేక వ్యాధుల బారినపడుతుంది. దీంతో శరీరాన్ని విష వాయువు పీల్చిపిప్పి చేసే ప్రమాదం ఉంది. యువత స్టైల్ కోసం స్మోకింగ్‌కు అలవాటు పడుతున్నారు. కొన్ని రోజుల పాటు అలవాటుపడి వారు చాల ఏళ్లు పాటు ఇబ్బందులు పడితేగాని మానలేకపోతున్నారు. స్మోకింగ్‌కు దూరంగా వుండడం ఉత్తమం. – డాక్టర్ ఎస్.సుబ్బారావు, అసోసియేట్ ప్రొఫెసర్, పల్మొనరీ మెడిసిన్, రుయా ఆస్పత్రి సున్నిత పొరలకు ప్రమాదం ధూమపానంతో కళ్లు, ముక్కు, గొంతులో సున్నిత పొరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. గుండె పోటు వచ్చే శాతం అధికంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు పొగతాగడానికి యువత దూరంగా వుండాలి. – డాక్టర్ సూర్యప్రకాష్, సీనియర్ పాల్మనాలజిస్ట్, తిరుపతి -
మొబైల్ వ్యసనం నుంచి రక్షించేందుకు..
పారిస్ : సెల్‌ఫోన్ వ్యసనం బారి నుంచి పాఠశాల విద్యార్థులను రక్షించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. పాఠశాలల్లో సెల్ఫోన్లపై నిషేధం విధించే బిల్లును జాతీయ అసెంబ్లీ(దిగువ సభ)లో ప్రవేశపెట్టింది. మెజారిటీ సభ్యులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దీంతో ఎగువ సభకు బిల్లును పంపించారు. అక్కడ కూడా బిల్లు ఆమోదం పొందినట్లైతే ఈ విద్యా సంవత్సరం(సెప్టెంబరు) నుంచే మొబైల్లపై నిషేధం అమలులోకి రానుంది. అయితే ఈ నిబంధనను పారిస్ వరకే పరిమితం చేయాలా లేదా దేశ వ్యాప్తంగా అమలు చేయాలా అనే అంశంపై ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అసెంబ్లీ సభ్యులు తెలిపారు. కాగా దివ్యాంగ , విద్యా, సాంస్కృతిక కార్యకలాపాల కోసం సెల్ఫోన్లు, ట్యాబెట్లు ఉపయోగించే విద్యార్థులకు ఈ నిబంధన వర్తించదు. ఇందుకు సంబంధించి పూర్తి నియమావళిని రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 90 శాతం విద్యార్థులు... 7 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారుల్లో 90 శాతం మంది సెల్ఫోన్లను వినియోగిస్తున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల పిల్లలు సైబర్ ప్రమాదాల బారిన పడుతుండటం, పోర్న్సైట్లు చూసే కల్చర్ పెరిగి పోతుండటంతో కనీసం స్కూళ్లో అయిన నిషేధం అనివార్యమని పలువురు అసెంబ్లీ సభ్యులు అభిప్రాయపడ్డారు. నిబద్ధత నిరూపించుకున్నా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటానంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ బిల్లు గురించి ప్రస్తావిస్తూ.. ‘స్కూళ్లు, కాలేజీల్లో మొబైల్లపై సాధారణ నిషేధం విధించే బిల్లుకు జాతీయ అసెంబ్లీలో పూర్తి మద్దతు లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ పూర్తైనట్లే. నా నిబద్ధత నిరూపించుకున్నా’ అంటూ మాక్రాన్ ట్వీట్ చేశారు. -
సమష్టిగా ‘బెల్ట్’ తీశారు
కథలాపూర్(వేములవాడ) : మూడేళ్ల క్రితం గ్రామాల్లో విచ్చల విడిగా మద్యం బెల్ట్‌షాపులు ఉండటంతో సులువుగా మద్యం దొరికేది. అమ్మకాలు జోరుగా సాగేవి. ఫలితంగా సాయంత్రం అయితే చాలు.. వివాదాలు, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ తగాదాలు జరుగేవి. యువత మద్యం మత్తులో తల్లిదండ్రులతో గొడవ పడడం, పొద్దంతా కష్టపడిన కార్మికులు, కూలీలు వారికి వచ్చిన డబ్బులు మద్యానికే వెచ్చించడంతో పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. అన్నిటికీ బెల్ట్‌షాపులే కారణమని భావించారు పోలీసులు. బెల్ట్ షాపులు మూసివేస్తే నేరాలు తగ్గుతాయని నిర్ణయించారు. ఇందుకు గ్రామీణుల సహకారం తీసుకున్నారు. 2016, జనవరి 6 నుంచి అప్పటి ఎస్సై నిరంజన్‌రెడ్డి బెల్ట్ తీయడం ప్రారంబించారు. సుమారు రెండేళ్ల నుంచి బెల్ట్‌షాపులు మూసివేత కొనసాగుతుండటంతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. క్రైంరేటు గణనీయంగా తగ్గింది. 55 షాపులకు చెక్ కథలాపూర్ మండలంలో 18 గ్రామాలున్నాయి. 2015, డిసెంబర్ 31 వరకు మండల వ్యాప్తంగా సుమారు 55 బెల్ట్‌షాపులు అక్రమంగా నిర్వహించేవారు. బెల్ట్‌షాపుల్లోనే సిట్టింగ్ సౌకర్యం ఉండటంతో మందుబాబులు గ్రూపులుగా వెళ్లి మద్యం సేవించేవారు. ఈక్రమంలో కొన్నిసార్లు అక్కడే వివాదాలు జరిగేవి. కొన్ని ప్రైవేట్ పంచాయితీలకు బెల్ట్‌షాపులు వేదికగా మారిన సంఘటనలున్నాయి. ఈ క్రమంలో 2016, జనవరి 6న కథలాపూర్ ఎస్సైగా నిరంజన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక మొదటగా బెల్ట్‌షాపులపై దృష్టిసారించారు. షాపులు నిర్వహించొద్దని నిర్వాహకులకు సమాచారమిచ్చారు. కొత్త అధికారి.. ఇవన్నీ కామన్ అనుకున్నారు నిర్వాహకులు. ఏకంగా బెల్ట్‌షాపు నిర్వాహకులను ఠాణాకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతే మండలంలోని బెల్ట్‌షాపులు అన్నీ మూతబడ్డాయి. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ఆయన బదిలీ తర్వాత వచ్చిన ఎస్సైలు ఆరీఫ్ అలీఖాన్, జాన్‌రెడ్డి, రాజునాయక్, ప్రస్తుత ఎస్సై నాగేశ్వర్రావు కూడా అదే విధానాన్ని పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో మద్యం బెల్ట్‌షాపు ఊసెత్తకుండా చేశారు. పల్లెల్లో వివాదాలు తగ్గుముఖం పట్టాయి. ప్రశాంత వాతావరణం నెలకొంది. తగ్గిన నేరాల సంఖ్య 2015, డిసెంబర్ 31 వరకు కథలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో సుమారు 146 నేరాలు నమోదుయ్యాయి. 2016 జనవరి నుంచి బెల్ట్‌షాపులు మూసివేతతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్న ఆటో, జీపు డ్రైవర్లకు పోలీసు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారు. 2016లో మండలంలో నమోదైన నేరాల సంఖ్య 65. 2017లో మళ్లీ 120కి చేరింది. మద్యం బెల్ట్‌షాపులు బంద్ ఉం డటంతో పోలీసుల కృషి ఫలించిందని మండలంలోని మహిళలు, యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు కృతజ్ఞతలు అధికారులు కొత్తగా వచ్చినప్పుడు ఏదో అంటారు అనుకున్నాం. కథలాపూర్ మండలంలో అప్పటి ఎస్సై నీరంజన్రెడ్డితోపాటు ఇప్పటివరకు కథలాపూర్‌లో విధులు నిర్వర్తించిన పోలీస్ అధికారులు మద్యం బెల్ట్‌షాపులు మూసివేయించడం పక్కాగా అమలు చేశారు. కథలాపూర్ మండలంలో మార్పులు తేవడం సంతోషంగా ఉంది. బెల్ట్‌షాపులు లేకపోవడంతో గ్రామాల్లో కొత్త మార్పులు వచ్చాయి. పోలీసులకు కృతజ్ఞతలు. – బద్దం మహేందర్, భూషణరావుపేట మార్పు సంతోషకరం.. గ్రామాల్లో మద్యం అందుబాటులో ఉండడంతో మద్యం సేవించడం ఎక్కువ మందికి అలవాటైంది. యువత ఒకరినిచూసి మరొకరు మద్యం సేవించి చేడిపోతున్నారు. మద్యానికి బానిస అవుతుండటం ఆందోళన కలిగించింది. ఇవన్నిటికీ కారణమైన బెల్ట్‌షాపులు మూసి ఉండటంతో పేద కుటుంబాలు కాస్తా ఆర్థికంగా ఎదిగి సంతోషంగా ఉంటున్నారు. బెల్ట్‌షాపుల మూసివేతకు కృషిచేసిన పోలీస్ అధికారుల సేవలు మరిచిపోలేం. – మైస శ్రీధర్, చింతకుంట ప్రజల సహకారంతో విజయవంతం ప్రజల సహకారంతోనే బెల్ట్ షాపులను నియంత్రించగలిగాం. రెండేళ్లుగా మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపివేశాం. యువత వ్యసనాలకు బానిసకావొద్దు. యువత మంచి లక్ష్యంతో ముందుకు వెళ్లాలి. మంచి మార్గాల్లో వెళ్లే యువతను పోలీస్‌శాఖ తరఫున ప్రోత్సహిస్తాం. మండలంలో గతంలోకన్నా నేరాల సంఖ్య తగ్గడం సంతోషం. ప్రజలు ఎల్లప్పుడూ పోలీస్‌శాఖకు సహకరించాలి. – నాగేశ్వర్రావు, ఎస్సై, కథలాపూర్ -
రోజుకు 150 సార్లు సెల్‌ఫోన్‌ను..
లక్నో: నేటి ప్రపంచంలో సెల్‌ఫోన్ ఓ అవసరంగా కాదు.. వ్యసనంలా మారింది. ఒక పూట తిండిలేకపోయినా ఉండగలరేమో గాని సెల్‌ఫోన్ వాడకుండా ఉండలేకపోతున్నారు. ఇక యుక్త వయస్సులో ఉన్న వాళ్లు ఫోన్‌కు బానిసలయ్యారని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని కొన్ని సర్వేలు కూడా తేల్చిచెబుతున్నాయి. భారతదేశంలోని కాలేజీ విద్యార్థులు ప్రతిరోజూ కనీసం 150 సార్లు సెల్‌ఫోన్‌ను వాడుతున్నారని పరిశోధకులు తేల్చారు. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. ‘‘స్మార్ట్ ఫోన్ డిపెండెన్సీ, హెడోనిజమ్ అండ్ పర్చేజ్ బిహేవియర్ : ఇంప్లికేషన్ ఫర్ డిజిటల్ ఇండియా ఇన్సియేటివ్ ’’ పేరిట ఈ సర్వేను నిర్వహించారు. దాదాపు 20 యూనివర్శిటీలకు చెందిన 200 మందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇందులో 26 శాతం మంది ఇతరులతో మాట్లాడుకోవడానికి మాత్రమే సెల్‌ఫోన్ ఉపమోగిస్తామని తెలిపారు. మిగిలిన వారు రోజుకు కనీసం 150 సార్లు సెల్ వాడుతున్నారని తేలింది. సెల్‌ఫోన్ అతిగా వాడటం వల్ల అది వారి ఆరోగ్యం, చదువులపై ప్రభావం చూపింది. 2017 సంవత్సరంలో నిర్వహించిన సర్వేలో 63 శాతం మంది ఒక రోజులో 7 గంటలు సెల్‌ఫోన్ వాడుతున్నారని, 23శాతం మంది కనీసం 8 గంటల సేపు ఫోన్ వాడుతున్నట్లు తేలింది. సెల్‌ఫోన్ ఒక అవసరంగా ఉన్నంత వరకు ఎటువంటి ఢోకా లేదని వ్యసనంలా మారితే భారీ నష్టం తప్పదని మేధావులు హెచ్చరిస్తున్నారు. -
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌తో ఎక్కువగా ఆడుకుంటున్నారా?
పిల్లలు స్మార్ట్‌ఫోన్‌తో ఎక్కువగా ఆడుకుంటున్నారా? అయితే వారి మెదడులో అసమతౌల్యం ఏర్పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు రేడియొలాజిక్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా శాస్త్రవేత్తలు. సౌత్ కొరియా విశ్వవిద్యాలయ న్యూరోరేడియాలజీ శాస్త్రవేత్త హ్యుంగ్ సుక్ ఒక పరిశోధన నిర్వహించారు. మాగ్నెటిక్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ ఎం ఆర్ఎస్) సాయంతో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్లకు బాగా అలవాటు పడ్డ యుక్తవయస్కుల మెదళ్లలో జరిగే మార్పులను పరిశీలించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న పరీక్షల ద్వారా ఈ ఆధునిక వ్యసనాల ప్రభావాన్ని అంచనా వేసి మరీ వీరిని ఎంపిక చేశారు. స్మార్ట్‌ఫోన్ వ్యవసనం వీరిలో మనోవ్యాకులత, యాంగ్జైటీ, నిద్రలేమి వంటి మానసిక సమస్యలకు కారణమవుతోందని గుర్తించారు. ఆ తరువాత వారికి మానసిక శాస్త్రవేత్తల ద్వారా చికిత్స (బిహేవియరల్ థెరపీ) అందించారు. చికిత్సకు ముందు, తరువాత వారి మెదళ్లలోని రసాయన ప్రక్రియలను పరిశీలించినప్పుడు రెండురకాల న్యూరో ట్రాన్స్మిటర్లలో తేడాలు కనిపించాయి. వీటిల్లో ఒకటి మెదడులోని న్యూరాన్లు బాగా చైతన్యవంతం చేసేదైతే, రెండోది మెదడు సంకేతాలను మందగింపజేసేది. ఈ రెండో న్యూరోట్రాన్స్మిటర్ మన దృష్టి, కదలికలను నియంత్రిస్తుందని అంచనా. చికిత్స తరువాత వీరిలో ఈ సమస్య గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. -
ఇప్పుడే నేర్పండి
పేరెంటింగ్ అలవాటును మించిన వ్యసనం మరొకటి ఉండదు. అది మంచైనా. చెడైనా సరే జీవితాంతం అలా ఉండిపోతుంది. వృథా కూడా ఒక వ్యసనమే. అందుకే వృథాని కంట్రోల్ చెయ్యడం ఎలాగో పిల్లలకు నేర్పాలి. అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు పని చేస్తుంటే వెంటనే వాటిని ఆపేసే అలవాటు చేయాలి. పెద్దవాళ్లు చేస్తుంటే పిల్లలకు కూడా వస్తుంది, కాని అది అమ్మ పనేనన్నట్లు ఉంటారు చాలామంది పిల్లలు. తమ దృష్టికి వచ్చినప్పుడు పట్టించుకోకుండా వెళ్లకుండా వెంటనే రియాక్ట్ అయ్యేటట్లు చేయాలి. కొంతమంది పిల్లలు వాటర్ ట్యాప్ ఓపెన్ చేసి పని పూర్తయిన తర్వాత సరిగా కట్టకుండా వెళ్లిపోతుంటారు. నీరు సన్నటి ధారగా పోతూనే ఉంటుంది. ఇక్కడ పోయేది నీరు మాత్రమే కాదు, పిల్లల్లో పద్ధతి ప్రకారం ఉండాల్సిన బిహేవియర్ కూడా. ఇటువంటివి చిన్నప్పుడు చిన్నపాటి నిర్లక్ష్యాలుగా కనిపించినప్పటికీ పెద్దయ్యే కొద్దీ నిర్లక్ష్యంగా ఉండడం అనే దురలవాటుకు దారి తీస్తాయి. -
100కోట్లు తాగేశారు
-
ఇంటర్నెట్ అతిగా వాడుతున్నారా..
స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా యువత గంటలకొద్ది ఆన్లైన్లోనే గడుపుతున్నారు. అయితే.. యువతలో పెరిగిపోతున్న ఈ ధోరణి తీవ్ర మానసిక సమస్యలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అంతర్జాలంలో ఎక్కువ సమయం గడిపే యువత అసలు ఏ పనిమీదా సరైన ఏకాగ్రత చూపించడంలేదని మానసిక శాస్త్రవేత్తలు గుర్తించారు. కెనడాలోని మెక్‌మాస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు.. ఎక్కువ సమయం ఇంటర్నెట్ వాడకం అనేది యువతపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే అంశంపై 'ఇంటర్నెట్ అడిక్షన్ టెస్ట్' ద్వారా కొంతమందిని ఎంచుకొని పరిశోధన నిర్వహించారు. దీనిలో వెల్లడైన ఫలితాల ప్రకారం.. ఎక్కువ సమయం సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో గడుపుతున్న యువతలో నిరాశావాదం పెరగడంతో పాటు.. వారు దేనిపై సరైన ఏకాగ్రత చూపించడం లేదని గుర్తించారు. ఇలాంటి వారు తమ రోజు వారి కార్యకలాపాలను నిర్వహించుకోవడంలో విఫలమౌతున్నారని.. వీరి సమయపాలన కూడా గాడి తప్పుతుందని తెలిపారు. ఆధునిక మానసిక సమస్యలలో ఇంటర్నెట్ అడిక్షన్ కీలకపాత్ర వహిస్తుందని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ మైఖేల్ వాన్ వెల్లడించారు. -
టీనేజ్ లో అడిక్ట్ అవుతున్నారు.. ఇక అంతే..!
వాషింగ్టన్: స్మార్ట్ ప్రపంచం ముందుకు తీసుకెళ్లడం లేదని టీనేజ్ యువతీయువకులు వీటికి అడిక్ట్ అవ్వడం వారి పేరేంట్స్ ను ఆందోళనకు గురిచేస్తుంది. మొబైల్ వీడియో గేమ్స్, కంప్యూటర్స్ వాడుతూ వీడియో గేమ్స్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయడం, టీవీలో కార్టూన్ ఛానల్స్ చూడటం లాంటి దుష్పరిణామాలు కలిగిస్తున్నాయి. అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ టీనేజర్స్ ఎలాంటి అంశాలపై టైం పాస్ చేయడంపై దృష్టిసారించారు. ఎంతగా అడిక్ట్ అయ్యారంటే.. తల్లిదండ్రులు పది సార్లు పిలిచినా పలకడం లేదట. ఏసీ ఆఫ్ చెయ్.. వాటర్ తీసుకురా, లైట్ ఆఫ్ చెయ్ అంటూ పేరేంట్స్ మొత్తుకుంటున్నా వారిలో చలనం రావటం లేదని వెల్లడించారు. తల్లి, పిల్లల మధ్య రిలేషన్ గతంలో ఉన్నట్లు లేదని, వారి మధ్య దూరం పెరుగుతుందని చెప్పారు. 44 కుటుంబాలను సంప్రదించి కొన్ని ప్రశ్నలు అడిగి పలు విషయాలను బయటపెట్టారు. గ్రాడ్యూయేషన్ చదివిన తల్లులు ఉన్న ఇంట్లో పరిస్థితి పరవాలేదని, అంతకంటే తక్కువ చదివిన వారి ఇళ్లల్లో పిల్లలను కంట్రోల్ చేయడం వారి వల్ల కష్టమవుతోందట. పేరేంట్స్ ఎలక్ట్రానిక్ మీడియాపై అవగాహనా తెచ్చుకోవాలని, నెట్ వాడకం, ట్రాకింగ్ విషయాలపై మెరుగవ్వాలని సూచిస్తున్నారు. చదువు, ఆటల మీద ఆసక్తి పెంచాలని.. వీడియో గేమ్స్, కార్టూన్ ఛానల్స్ నుంచి వారి దృష్టిని మళ్లించాలని రీసెర్చర్స్ పదే పదే చెబుతున్నారు. -
ఇక తలుచుకుంటే సాధించలేం!
వాషింగ్టన్: మనం సాధారణం ఏ పనైనా చెయ్యగలం అని స్నేహితులతో గానీ, కుటుంబసభ్యులతో గానీ అని చెప్పెటప్పుడు వాడే పదం 'నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలను' అని కానీ.. ఈ పదాన్ని అమెరికాలోని పిల్లలు ఇక ముందు చెప్పలేకపోవచ్చు! ఎందుకోతెలుసా.. అందుకు ముఖ్య కారణం 'ఇంటర్నెట్'. చెప్పలేనంత ఆత్రుత, ఎప్పుడెప్పుడు కంప్యూటర్ కు అతుక్కుపోదామనే కోరిక... ఇవి అమెరికాలో ప్రస్తుతం పిల్లల్ని మానసికంగా కుంగదీసి అంగవైకల్యాన్ని కలిగిస్తున్న సమస్యలు. మొబైల్స్, కంప్యూటర్లలో ఇంటర్నెట్ వాడకానికి బానిసైన కొంతమంది పిల్లలు తాజాగా సైక్రియాట్రిక్ సెంటర్ లకు వెళ్లి వారి సమస్యను వెలిబుచ్చడంతో ఈ భయంకర సత్యం బయటకు వచ్చింది. పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లకుండా సమయాన్నంత ఇంటర్నెట్ పైనే వెచ్చించాలని అనిపిస్తుందని ఓ యువకుడు చెప్పిన మాటలు వింటుంటేనే తెలుస్తుందీ.. వారు నెట్ కు ఎలా బానిసలైపోయారో! తాజాగా వాషింగ్టన్ లో కామన్ సెన్స్ మీడియా 1,300 మంది తల్లిదండ్రులు వారి పిల్లలపై జరిపిన పరిశోధనల్లో 59 శాతం మంది పేరెంట్స్ తమ బిడ్డలు ఫోన్లకు బానిసలయినట్లు తెలిపారు. వీరిలో 50 శాతం పిల్లలు కూడా ఈ విషయాన్ని అంగీకరించడం విస్మయం కలిగించే అంశం. ఇంటర్నెట్ పిల్లల మెదళ్లలో ఎలా నాటుకుపోతోందో తెలుసుకోవడానికి అక్కడి వైద్యుల మల్లగుల్లాలు పడుతున్నారు. ఇంకా ఎటువంటి పేరు నిర్ణయించని ఈ వ్యాధి ఇంకా ఎలాంటి విపరిణామాలకు దారీ తీస్తుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వేల మంది తల్లిదండ్రుల వందల నుంచి వేల డాలర్లను చేతపట్టుకుని తమ పిల్లలను టెక్నాలజీ చీకటి కోణం నుంచి కాపాడాలంటూ ట్రీటెమెంట్ సెంటర్(రీస్టార్ట్) చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. తమ తల్లిదండ్రులే టెక్నాలజీకి అలవాటు పడాలంటూ ఇంటర్ నెట్ వైపు ప్రోత్సహించారని ఇప్పుడేమో అది తమ జీవితాలను నాశనం చేస్తోందని రీస్టార్ట్ సెంటర్ కు వచ్చిన ఓ బాధితుడు తెలిపాడు. ఎక్కువ మంది ఇంటర్నెట్ లో ఆన్ లైన్ ఆటలు, పోర్న్ చూడటానికి బానిసలౌతున్నట్లు ఇప్పటివరకు పరిశోధకులు కనుగొన్నారు. చైనా, దక్షిణ కొరియా, జపాన్ లు ఇప్పటికే ఇటువంటి సమస్యలపై క్యాంప్ లు నిర్వహించి అవగాహానా కార్యక్రమాలు చెపట్టగా.. అమెరికాలో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ఈ చేదు నిజాలపై పరిశోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. -
మత్తులో జోగుతున్న పంజాబ్
ఇప్పుడు మత్తుపదార్థాలు పంజాబ్‌లో ఆరోనదిలా ప్రవహిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. కొన్ని కుటుంబాలే ఈ మహమ్మారి బారిన పడి ఉన్నా యని తేలింది. ఒక యువ వ్యాపారవేత్త అలవాటు కొద్దీ హెరాయిన్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. తరువాత తెలిసిందేమిటంటే, అతడి భార్య, సోదరి కూడా దానికి అలవాటు పడిపోయారు. అతడికి తెలియకుండా ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. ఫరీద్‌కోట జిల్లాలో అయితే అబ్బాయిలు, వాళ్ల గర్ల్‌ఫ్రెండ్స్ ఇద్దరూ హెరాయిన్‌కు బానిసలు కావడం సర్వసాధారణమైపోయిందని గురు గోవింద్‌సింగ్ వైద్యకళాశాల ఆచార్యుడు డాక్టర్ అరవింద్‌శర్మ చెప్పారు. లూధియానాకి చెందిన ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ అజయ్‌పాల్ సాంధు చెప్పిన వివరాలు మరీ ఆందోళనకరంగా ఉన్నాయి. ఆయన ఇంతవరకు రెండువేల కేసులను నయం చేశాడట. అందులో ప్రతి వందకు 30 కేసులు భార్యాభర్తలకు కలిపి వైద్యం చేసినవేనని చెప్పారు. -
అలవాటు పడితే చక్కెర కూడా..
చక్కెర తినడానికి అలవాటు పడిన వాళ్లని మత్తు పదార్థాలకు బానిసలైన వారి కింద లెక్కవేయాలని అంటోంది తాజా అధ్యాయనం. నికోటిన్ వ్యసనానికి అలవాటు పడిన మనుషులకు ఇచ్చే మందులను చక్కెరకు బానిసలైన జంతువులకు అందించొచ్చని ఈ పరిశోధనలో వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలోని 1.6 బిలియన్ జనాభాలో 600 మిలియన్ల మంది ఒబెసిటీతో బాధపడుతున్నారని తేల్చింది. ఇందులో అధికశాతం ప్రజలు చక్కెర పాళ్లు ఎక్కువగా తీసుకున్నవారే కావడం గమనార్హం. పొగాకు, కొకైన్, మార్ఫైన్తో సమానంగా చక్కెరకూ అడిక్టివ్ సామర్ధ్యం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. బరువు పెరగడంతో పాటు చక్కెర పాళ్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటున్న జంతువులు న్యూరొలాజికల్, మనో వ్యాధులకు గురవుతాయని తెలిపారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఆమోదించిన వారెన్క్లియన్, చంపిక్స్ మందులు చక్కెర అడిక్షన్‌ను ట్రీట్ చేయడానికి ఉపయోగపడతాయని తమ పరిశోధనలో తేలిందని పరిశోధకులు వివరించారు. సహజంగా తయారయ్యే చక్కెరే కాకుండా కృత్రిమంగా తయారుచేసే చక్కెర వల్ల కూడా ఈ ప్రభావం ఉంటుందన్నారు. వీటికి సంబంధించిన వివరాలను ప్లొస్ వన్ జర్నల్‌లో ప్రచురించారు. -
ఆరెండూ కలిస్తే... ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయ్!
చెడు వ్యసనాలతో అనర్థాలు జరుగుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇతర దుర్వ్యసనాలకంటే ముఖ్యంగా మద్యం, కొకైన్ వ్యసనంగా కలిగిన వారు భవిష్యత్తులో ఆత్మహత్య చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు అమెరికా అధ్యయనకారులు. ఇటీవల నిర్వహించిన తాజా పరిశోధనల్లో ఈ కొత్త విషయాలను తెలుసుకున్నారు. మోతాదులో మద్యం సేవించడం పెద్దగా ప్రమాదం కాదంటారు కొందరు. అయితే వ్యసనంగా మారినప్పుడు మద్యం కూడ ప్రాణాలమీదకు తెచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మద్యంతో పాటు కొకైన్ కూడ గణనీయంగా వినియోగించేవారు భవిష్యత్తులో ఆత్మహత్యాయత్నం చేసుకునే అవకాశం ఉంటుందని అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయం అల్పెర్ట్ మెడికల్ స్కూల్ ప్రధాన అధ్యయన రచయిత సారా అరియాస్ చెప్తున్నారు. ముఖ్యంగా కొకైన్, మద్యాలను కలిపి తీసుకునేవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నట్లు క్రైసిస్ జర్నల్ లో ప్రచురించిన పరిశోధనా పత్రంలో అరియాస్ వివరించారు. 2010-2012 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఎనిమిది సూసైడల్ ఎమర్జెన్సీ విభాగాల్లో చేరిన 874 మంది రోగుల వివరాలను అధ్యయనకారులు పరిశీలించారు. అంతేకాక ఇటీవల ఆత్మహత్యా ప్రయత్నం చేసిన, పదేపదే ఆత్మహత్యా ఆలోచనలు వస్తున్నాయంటూ చికిత్స పొందుతున్న ఇతరుల వివరాలను కూడ అధ్యయనకారులు ఎమర్జెన్సీ డిపార్ట్ మెంట్ లోని స్టాండర్డ్ కేర్ నుంచి సేకరించి విశ్లేషించారు. వీరిలో మొత్తం 298 మంది మద్యం దుర్వినియోగానికి పాల్పడిన వారు, 72 మంది కొకైన్ ఉపయోగించిన వారితోపాటు 41 మంది రెండూ కలపి వాడిన వారు ఉన్నట్లు పరిశోధకులు తెలుసుకున్నారు. అయితే గంజాయి, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు, మత్తుమందులు, ఉత్ప్రేరకాలు సేవించే వారికన్నా... ముఖ్యంగా మద్యం కొకైన్ లు కలిపి సేవించిన వారే అత్యధికంగా ఆత్మహత్యా ప్రయత్నంతో సంబంధం కలిగి ఉన్నట్లు పరిశోధకుల బృందం పేర్కొంది. విడిగా మద్యం సేవించేవారిని, విడిగా కొకైన్ సేవించేవారిని పరిశీలించినప్పుడు మాత్రం మద్యం సేవించేవారిలో అటువంటి ఆలోచన ఏమాత్రం లేదని, కొకైన్ సేవించేవారు అటువంటి ఆలోచనకు సరిహద్దుల్లో ఉన్నారని తెలుసుకున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. -
రోజంతా స్మార్ట్ ఫోన్ తో గడిపేస్తున్నారా?
రోజంతా స్మార్ట్ ఫోన్ తో గడిపేస్తున్నారా? అది లేకుండా క్షణం గడపలేకపోతున్నారా ? అయితే తస్మాత్ జాగ్రత్త. ఈ వ్యసనం నుంచి త్వరగా బయటపడండి. లేదంటే త్వరలోనే మీకు అనేక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. స్మార్ట్ ఫోన్ వ్యసనం వల్ల ముఖ్యంగా టీనేజర్లలో ఒత్తిడి, మానసిక కుంగుబాటు వంటి సమస్యలు తలెత్తవచ్చునని తాజా అధ్యయనంలో గుర్తించారు. కొత్త టెక్నాలజీ వచ్చిన ప్రతిసారి ఇలాంటి వ్యాధులు వస్తాయనే నానుడి ఎప్పటినుంచో ఉందని, టీవీ, వీడియో గేమ్స్ మొదలు ఇప్పటి స్మార్ట్‌ఫోన్ వరకు అందరిలో ఇలాంటి అభిప్రాయమే ఉందని, అయితే స్మార్ట్ ఫోన్ విషయంలో టీనేజర్లలో ఈ సమస్య అధికంగా ఉండే అవకాశముందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇల్లినాయిస్ యూనివర్సిటీ పరిశోధకుడు అలెజాండ్రో లెరాస్ తెలిపారు. దాదాపుగా 300 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులపై ఆయన ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. విద్యార్థుల మానసిక స్థితి, ఎంతసేపు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉపయోగించడానికి వారిని పురిగొల్పిన కారణాలు ఏమిటి? వంటి అంశాల ఆధారంగా స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వారిపై ఏవిధంగా ప్రభావం చూపుతాయో అంచనా వేశారు. గంటలు గంటలు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయి అస్తమానం అందులోనే తల దూర్చేవారి మానసిక కుంగుబాటు, ఒత్తిడికి ఎక్కువగా లోనవుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. టెక్నాలజీని మితంగా వాడటం వల్ల ఈ సమస్యలు దరిచేరకుండా చూడవచ్చునని శాస్త్రవేత్తలు సూచించారు. ఈ అధ్యయనం వివరాలు 'కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్' అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
నో ఆర్గ్యుమెంట్స్.. ఓన్లీ ఈ మెయిల్స్
Relationships last long not because they're destined to last long.. relationships last long because two brave people made a choice.. to keep it, fight for it and to work for it.. ‘హోప్ ట్రస్ట్’ సంస్థాపకులు రాజేశ్వరి లూథర్, రాహుల్ లూథర్ అనుబంధం కూడా ఇలాంటిదే! ఇద్దరూ భిన్న ధ్రువాలు! ఆమె ఢిల్లీలో పుట్టిపెరిగిన దక్షిణ భారతీయురాలు.. అతను వైజాగ్‌లో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన ఉత్తర భారతీయుడు! ఆమెది సంప్రదాయ మధ్యతరగతి కుటుంబం.. అతను ఐఏఎస్ ఆఫీసర్ నరేంద్ర లూథర్ కొడుకు! . రాహుల్ మొదట్లో ఆల్కహాలిక్. ఆ వ్యసనం విడాకులకు దారితీసింది. కానీ చిన్న ‘హోప్’ వారిద్దరినీ మళ్లీ ఒక్కటి చేసింది. ఏ వ్యసనం తమ మధ్య మనస్పర్థలకు కారణమైందో.. అదే వ్యసనంపై ఆ దంపతులు ఫైట్ చేస్తున్నారు. మాదకద్రవ్యాల బారిన పడిన ఎందరినో.. మామూలు మనుషులను చేస్తున్న ఆ జంట జీవనయానం.. ప్లస్.. మైనస్ ‘రాహుల్ వెరీ గుడ్ లిజనర్. ఏ భార్యకైనా కావాల్సిందే వినే భర్తేకదా’ అంటుంది రాజేశ్వరి నవ్వుతూ. ‘నాలో లేని క్వాలిటీస్‌ను తను భర్తీ చేస్తుంది’ అంటూ అర్థాంగికి అసలైన నిర్వచనం ఇచ్చాడు రాహుల్. ‘ఏ భార్యాభర్తకైనా అల్టిమేట్ గోల్ పేరెంటింగ్. నాకైతే నా పిల్లలే లోకం. వాళ్లకు సంబంధించి కొన్ని విషయాల్లో నేను ఆయనలా, ఆయన నాలా ప్రవర్తిస్తాం. అప్పుడే ఫ్యామిలీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది’ అంటుంది రాజేశ్వరి. రాజేశ్వరిది పారామెడికల్ బ్యాక్‌గ్రౌండ్.. రాహుల్ చదివిన సబ్జెక్ట్స్ ఫిలాసఫీ, సైకాలజీ అండ్ మాస్టర్స్ ఇన్ ఇంగ్లిష్ లిటరేచర్. ‘రాజేశ్వరి నాకు ఢిల్లీలో పరిచయం. ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. తనూ అదే హాస్పిటల్లో పని చేసేది. అప్పుడు చూశాను. నచ్చింది.. ఛేజ్ చేశాను’ అని తమ ప్రేమకథను మొదలుపెట్టాడు రాహుల్. పెళ్లి ప్రపోజల్ తెచ్చిందెవరు..? ‘నేనే, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు ముందు మా పేరెంట్స్‌కి చెప్పాను’ అని చెప్పాడు రాహుల్. ‘వాళ్ల నాన్నగారు మా ఇంటికొచ్చారు. నాకప్పుడు 21 ఏళ్లు. అంత తొందరగా పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు. అమెరికా వెళ్లి చదువుకోవాలనుకున్నాను. కానీ మామయ్య ‘ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే త్వరగా చేసుకోండి. ఎందుకంటే మావాడికిప్పుడు 30 ఏళ్లు’ అని చెప్పారు’ అంది రాజేశ్వరి. ‘అదొక్కటే కాదు ‘మావాడు బాగా తాగుతాడు.. కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయానికి రండి తర్వాత నేను బ్లేమ్ కాదల్చుకోలేదు’ అని నా బలహీనతనూ వాళ్లకు చెప్పాడు నాన్న’ అన్నాడు రాహుల్. రాజేశ్వరి తనకున్న అమెరికా ప్రయారిటీని, రాహుల్‌కున్న బలహీనతను పక్కనపెట్టి ఆయన మంచితనానికి ఓటేసి అతనికి భార్య అయింది. బలహీనత జయించింది.. రాహుల్ బలహీనత వాళ్ల దాంపత్యాన్ని ఆరేళ్లే నిలబెట్టింది. అప్పటికే వాళ్లకు ఓ పాప. రాజేశ్వరి కూతురుతో ఢిల్లీ వెళ్లిపోయింది. ఆమె ఒంటరి పోరాటానికి రాహుల్ తల్లిదండ్రులు మద్దతిచ్చారు. అందుకే రాజేశ్వరి అంటుంది ‘నిజంగా మా ఇన్లాస్ వెరీ మోడల్ పేరెంట్స్. హండ్రెడ్ పర్సెంట్ నాకే సపోర్ట్ ఇచ్చారు’అని. ‘ఇప్పటికీ మా అమ్మ ఏ విషయం అయినా తనతో షేర్ చేసుకుంటుంది. నా కన్నా తనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది’ అంటాడు రాహుల్. ఈ బంధం మళ్లీ ఎలా ముడివేసుకుంది? ‘విడాకుల జీవితాన్నీ కొన్నేళ్లు అనుభవించాం. ఆ టైమ్‌లో నేను అల్కహాల్ తీసుకునే అలవాటును మానే ట్రీట్మెంట్లో ఉన్నాను. రాజేశ్వరిని, పాపను చాలా మిస్ అయ్యాను. ఆ క్షణాలను మళ్లీ పొందాలనుకున్నాను’ రాహుల్. ‘గతం మళ్లీ రిపీట్ కాదనే నమ్మకంతో మళ్లీ కలిశాం..’ భర్త మాటను పూర్తిచేసింది రాజేశ్వరి. ‘హోప్’తో రీయూనియన్.. ‘మా రీయూనియన్ ‘హోప్ ట్రస్ట్’అనే రిహాబిలిటేషన్ సెంటర్‌తో స్టార్ట్ అయింది. అప్పటిదాకా మా ఇద్దరి జీవితాలు, ఉద్యోగాలూ వేరు. ఈ రీహాబిలిటేషన్ పెట్టాలనే ఐడియా రాహుల్‌ది. మా ఇద్దరికీ సైకాలజీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా మేమిద్దరం కలిసి ఈ పనిచేయడం చాలా కష్టమే అయింది. ఇద్దరం ఈగో ఫీలయ్యేవాళ్లం. ఒకరి మాట ఇంకొకరు ఎందుకు వినాలని అనుకునేవారం. మళ్లీ మొదటి పొరపాటే జరుగుతుందేమోనని ఇద్దరం భయపడ్డాం. అప్పటికే బాబు కూడా పుట్టాడు. కుటుంబం ముఖ్యం అనుకున్నాం’ అని రాజేశ్వరి ఆనాటి సంకల్పాన్ని గుర్తు చేసుకుంది. ఒక సందర్భంలో ఈ పనిని రాహుల్‌కే వదిలి తాను చక్కగా ఇంటిని చూసుకుంటాననే ప్రశాంత నిర్ణయానికి వచ్చేసింది రాజేశ్వరి. భార్య శక్తి, సామర్థ్యాలు తెలిసున్న రాహుల్ రిహాబిలిటేషన్‌ను ఆమె సహాయం లేకుండా నిర్వహించలేననుకున్నాడు. ఆమెను కన్విన్స్ చేశాడు. మధ్యేమార్గం అనుసరించాలని భావించింది ఆ జంట. ‘ఎవరు ఏ విషయంలో స్ట్రాంగ్‌గా ఉంటారో బాగా ఆలోచించాను. మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో రాజేశ్వరి చాలా స్ట్రాంగ్. మార్కెటింగ్, ఆర్గనైజింగ్‌లో నేను స్ట్రాంగ్. అలా ఇద్దరం ఎవరి ఫీల్డ్స్‌ని వాళ్లం డివైడ్ చేసుకొని అందులో జోక్యం చేసుకోవద్దని డిసైడ్ చేసుకున్నాం’ వివరించాడు రాహుల్. నో ఆర్గ్యుమెంట్స్.. ఓన్లీ ఈ మెయిల్స్ ‘ఇప్పటికీ పోట్లాడుకుంటాం. కానీ ఈగో హర్ట్ అయ్యేంత కాదు. ఏ విషయంలోనైనా కోపమొచ్చినా.. బాధనిపించినా వెంటనే రాహుల్‌కి ఈ మెయిల్స్ పెట్టేస్తా’ అంటుంది రాజేశ్వరి. ‘అందుకే నిరంతరం నా మెయిల్‌బాక్స్ చెక్ చేసుకుంటూ ఉంటా’ అంటాడు నవ్వుతూ రాహుల్. రిప్లయ్ ఉంటుందా అని అడిగితే ‘ఆ విషయంలో ఆయన చాలా స్లో. అయితే ఈవెనింగ్ ఇంటికొచ్చేటప్పుడు మాత్రం ఆయనలో చేంజ్ కనిపిస్తుంది. అది చాలు కదా నాకు’ రాజేశ్వరి. ‘ఇద్దరం ఒకరి స్పేస్‌ని ఒకరం గౌరవించుకుంటాం. నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తే.. ఓ మూడు రోజులు ఏ టూర్‌కో వెళ్లిపోతా. తనూ అంతే. తన ఫ్రెండ్స్‌తో గడుపుతుంది. తనకు డాన్స్, సంగీతం అంటే ఇష్టం. నాకు నాటకాలంటే ఇష్టం. ఒకరికిష్టమైన పనిని ఇంకొకరు చేయాలని పట్టుబట్టం’ అంటాడు రాహుల్. ముక్తాయింపు కొన్నాళ్ల కిందట.. రాజేశ్వరిని వాళ్లమ్మాయి అడిగిందట.. ‘నువ్వూనాన్న పోట్లాడుకోవట్లేదు బోర్ కొడుతుంది. నువ్వు నాన్నలా మారిపోయావ్.. నాన్న నీలా మారిపోయాడు’ అందిట. అనుబంధానికి ఇంతకుమించిన అర్థమేముంటుంది..! సహచర్యానికి ఇంతకుమించిన పరమార్థం ఏముంటుంది..! ..:: సరస్వతి రమ ఫొటోలు: సృజన్ -
కవ్వింత: దురాశ
సుజిత: సంగీత కచేరి ఎక్కడ జరిగినా ఎందుకు అంత ఖర్చు పెట్టి మీ అత్తగార్ని పంపుతావు? నయన: సంగీత కచేరి అంటే మా అత్త ప్రాణాలిస్తుందట, అందుకనీ... కోపం ‘‘నీకు నీ భార్య మీద బాగా కోపం వస్తే ఏం చేస్తావ్? చెయ్యి చేసుకుంటావా?’’ ‘‘లేదు, నా ఒక్కడికే వంట చేసుకుంటాను’’. అలా అర్థమైందా? ఎస్కలేటర్ ఆపరేటర్: ఏంటి సార్ ఎస్కలేటరు దాకా వచ్చి వెనక్కు వెళ్తున్నారు? కస్టమర్: ఎస్కలేటరు మీద వెళ్లే వాళ్లు కుక్కను చేత్తో ఎత్తుకుని వెళ్లాలని రాశారు కదా. నా దగ్గర కుక్క లేదు మరి. ముల్లు ‘‘ఇదేమిటయ్యా... అరికాలి నిండా ఇన్ని ముళ్లెలా గుచ్చుకున్నాయి?’’ ‘‘మొదట ఒక్క ముల్లే గుచ్చుకుంది డాక్టర్. ముల్లుని ముల్లుతోనే తీయాలని ప్రయత్నించీ... ఆందోళన భార్య: (పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి) సార్, మా ఆయన ఉదయమనగా కుక్కతో పాటు బయటకు వెళ్లారు. నాకేదో భయంగా ఉంది. ఎస్సై: ఎందుకమ్మా అంత ఆందోళన? భార్య: ఆందోళన అంటారేంటండీ, ఆ కుక్కను ఈ మధ్యే పదివేలు పెట్టి కొన్నాను. అదే ఆఖరు ‘‘హర్షవర్థనుడు ఏ యుద్ధంలో మరణించాడురా సోమేశ్వర్? ‘‘ఆయన చేసిన ఆఖరి యుద్ధంలో సార్’’ -
ఇద్దరు చైన్‌స్నాచర్ల అరెస్ట్
7 సవర్ల బంగారు ఆభరణాల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): వ్యసనాలకు బానిసై చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను ఐదో నగర పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి ఏడు సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఐదో నగర పోలీసుస్టేషన్లో సిటీ డీఎస్పీ పి.వెంకటనాథ్‌రెడ్డి విలేకరులకు వివరించారు. ఆయన కథనం మేరకు..కలిగిరి మండలం చిన్నఅన్నలూరుకు చెందిన పల్లా మస్తాన్, గడ్డం రాజేంద్ర స్నేహితులు. దుర్వ్యసనాలకు బానిసలైన ఇద్దరు సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో గొలుసు దొంగతనాలను(చైన్‌స్నాచింగ్) వృత్తిగా ఎంచుకున్నారు. పల్లా మస్తాన్ తన బైక్‌కు దొంగ నంబరు వేసి దానిపై తిరుగుతూ దొంగతనాలు చేయాలని ప్లాన్ వేసి అమలు చేయసాగాడు. వీరిద్దరూ గత నెల 8న కావలి మండలం బుడంగుంట కాలనీలో రోడ్డుపై వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసును లాగారు. ఆమె గట్టిగా పట్టుకోవడంతో సగం దండ (రెండు సవర్లు)తో వెళ్లిపోయారు. అదే నెల 16వ తేదీ రాత్రి నెల్లూరులోని రెండో నగర పోలీసుస్టేషన్ పరిధిలోని షిరిడీ సాయినగర్ ఎఫ్‌సీఐ కాలనీలో వాకింగ్ చేస్తున్న వృద్ధురాలి మెడలోని ఐదుసవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లారు. నిందితులు దొరికిందిలా.. పొదలకూరురోడ్డు వాటర్ ట్యాంకు సమీపంలోని కృష్ణసాయి రెసిడెన్సీలో నివస్తున్న సురసుర మాధవి గత నెల 26న శ్రీ రాజరాజేశ్వరి గుడికి వచ్చారు. ఆమె అమ్మవారిని దర్శించుకుని వెళుతుండగా పోస్టల్ కాలనీ నాల్గో వీధి వద్ద మాధవి మెడలోని గొలుసును లాగేందుకు మస్తాన్, రాజేంద్ర ప్రయత్నించారు. ఆమె వెంటనే అప్రమత్తమై నిందితుల్లో ఒకరి ప్యాంటును పట్టుకుని బైక్‌పై నుంచి కిందకు లాగేసింది. దొంగ..దొంగ అని అరవడంతో అటుగా వెళుతున్న వేమూరి గోవర్ధన్, గాంధీకేషన్ నవీన్ కూడా వచ్చి బైక్‌ను కిందపడేశారు. ఊహించని పరిణామంతో ఖంగుతున్న నిందితులు బైక్‌ను వదిలేసి ఉడాయించారు. బైక్‌ను స్వాధీనం చేసుకున్న ఐదో నగర పోలీసులు దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇన్స్పెక్టర్ రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఎస్సై వైవీ సోమయ్య విచారణ నిర్వహించారు. బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ దొంగదని తేలడంతో చేసిస్ నంబర్ ఆధారంగా కలిగిరి మండలం అన్నలూరుకు చెందిన పల్లా యర్రయ్యదిగా గుర్తించారు. ఆయనను ప్రశ్నించగా తన కుమారుడు మస్తాన్, అతని స్నేహితుడు రాజేంద్ర బైక్‌ను వాడుతున్నారని వెల్లడించారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు ఆదివారం నిందితులు కొత్తూరు సబ్‌స్టేషన్ ప్రాంతంలో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి 7 సవర్ల బంగారు నగలతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. దొంగలను పట్టుకునేందుకు సమయస్ఫూర్తితో వ్యవహరించిన సురసుర మాధవితో పాటు గోవర్ధన్, గాంధీకేషన్ నవీన్‌ను డీఎస్పీ అభినందించారు. గోవర్ధన్‌కు బహుమతి అందజేశారు. చోరీ సొత్తు రికవరీకి కృషి చేసిన సిబ్బందికి రివార్డులు అందిచనున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఇన్స్పెక్టర్ ఎస్వీ రాజశేఖరరెడ్డి, ఎస్సై వైవీ సోమయ్య తదితరులు ఉన్నారు. -
పిచ్చెక్కిస్తున్న ముమైత్ ఖాన్ ఆల్బమ్
-
కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ముమైత్ ఖాన్ ఆల్బమ్
ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ కుర్రకారుకు పిచ్చెక్కించేవిధంగా ఆల్బమ్ రూపొందించారు. ఆ ఆల్బమ్ జనం ముందుకు వచ్చేసింది. ముమైత్ ఖాన్‌ను ప్రేక్షకులు మరచిపోకపోయినా, దర్శక, నిర్మాతలు మాత్రం మరచిపోయారని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఏ దర్శక,నిర్మాత డ్యాన్స్ గర్ల్‌కు అవకాశం ఇవ్వడంలేదు. గత కొద్దికాలంగా ముమైత్ ఏ చిత్రంలో నటించలేదు. ఈ పరిస్థితులలో అందరికీ మతిపోయేవిధంగా తన ఆల్బమ్‌తో అదరగొడుతోంది. తన అందచందాలు - హావభావాలు - చిలిపి చూపులు - కుర్రకారుని రెచ్చగొట్టే డ్యాన్సలతోపాటు తన సెక్సీ వాయిస్‌తో ఈ ఆల్బమ్‌ను విడుదల చేసింది. ఇంకేముంది కుర్రకారు మరింత కిర్రెక్కిపోతున్నారు. ముమైత్ ఖాన్ పేరు చెప్పగానే మనకు దాదాపు ఏడేళ్ల క్రితం పూరీ జగన్నాథ్ - మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'పోకిరి' సినిమాలోని 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' పాట గుర్తొస్తుంది. పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఈ పాట కూడా అదే స్థాయిలో జనాన్ని ఉర్రూతలూగించింది. దీంతో ముమైత్ ఖాన్ రేంజి రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ ముద్దుగుమ్మ దుమ్ము రేపేసింది. ఎంత పదారేళ్ల వయసు అయినా, కొంత కాలానికి మొహం మొత్తుతుంది కదా!. అలా ముమైత్ తెర వెనక్కు పోయింది. అయినప్పటికీ నిరుత్సాహ పడటం లేదు. ముమైత్‌లో యాక్టివ్నెస్ గానీ, ఆ ఊపుగానీ ఏమీ తగ్గలేదు. ఇప్పుడు కొత్త అవతారంలో జనం ముందుకొచ్చింది. అడిక్షన్ పేరుతో ఓ పాట పాడి ఆల్బమ్‌ను రెండు రోజుల క్రితం విడుదల చేసింది. నాలుగు నిమిషాల ఈ ఆల్బమ్‌లో మళ్లీ తన సత్తా చూపింది. దీంతో మళ్లీ తనకు ఆఫర్లు వస్తాయనే ఆశతో ముమైత్ ఖాన్ ఉంది. ఆమె ఆశ నెరవేరాలని ఆశిద్ధాం. - శిసూర్య -
విడాకులకు కేరాఫ్ అడ్రస్ ఫేస్ బుక్!
సామాజిక బంధాలకు ఫేస్ బుక్ దగ్గర దారి అనే భావనకు కాలం చెల్లినట్టే కనిపిస్తోంది. పచ్చని సంసార జీవితంలో సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ చిచ్చు పెడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫేస్ బుక్ కారణంగా దాంపత్య సంబంధాలకు ముప్పు వాటిల్లుతోందని ఓ అధ్యయనంలో పరిశోధకులు వెల్లడించారు. ఫేస్ బుక్ విరివివిగా వాడటం కారణంగా యూఎస్ లోని అన్ని రాష్ట్రాల్లోనూ విడాకుల కేసులు ఎక్కువగా నమోదైనట్టు పరిశోధనలో తేల్చారు. ఫేస్ బుక్ ఎక్కువగా ఉపయోగించడం కారణంగా ఈ సంవత్సర కాలంలో విడాకుల నమోదు 4 శాతం పెరిగినట్టు ఓ నివేదికలో పేర్కొన్నారు. సోషల్ మీడియా వెబ్ సైట్లు ఫేస్ బుక్, ట్విటర్, ఇతర వెబ్ సైట్లపై సమయాన్ని గడిపేవారికి వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధకకులు తెలిపారు. విడాకులు తీసుకున్న వారిలో ఫేస్ బుక్ వినియోగం పెరిగిందా అనే విషయాన్ని పరిశోధకులు వెల్లడించలేదు. ఈ అధ్యయనాన్ని టైమ్ మ్యాగజైన్ ఓ కథనంలో వెల్లడించింది -
ఆ కుక్కపిల్లకు సిగరెట్ తాగడం భలే సరదా!
బీజింగ్: పొగ తాగకుంటే వచ్చే జన్మలో గాడిదగా పుడుతానని భయపడిందో ఏమో.. చైనాలోని ఓ పెంపుడు కుక్కకు పొగ తాగడం ఓ వ్యసనంగా మారింది. చైనాలో రెండేళ్ల వయస్సులో ఉన్న ఓ కుక్క తన యజమాని నుంచి పొగతాగడం అలవాటు చేసుకుంది. ధూమపానానికి బానిసైన ఆ కుక్క పిల్ల నిద్రకు ఉపక్రమించే ముందు ఎంచక్కా ఓ దమ్ము కొట్టి సేదతీరుతుందట. గత సంవత్సర కాలంగా తన పెంపుడు కుక్క మీయా దమ్ము కొడుతోందని యజమాని వెల్లడించారు. ఐతే తన పెంపుడు కుక్క ఏ బ్రాండ్ పడితే అది తాగదని.. కేవలం యూక్సీ బ్రాండ్ సిగరెట్లను మాత్రమే తాగుతుందన్నారు. తన పెంపుడు కుక్క ఆరోగ్యంపై బెంగ పెట్టుకున్న యజమాని త్వరలోనే మీయా పొగమానేలా చేస్తానని యజమాని లూ అంటున్నాడు. Follow @sakshinews -
సెల్‌ఫోన్ కు బానిసైతే.. కుటుంబ బంధాలు విచ్చిన్నం
న్యూయార్క్: ఈ మెయిల్స్ పంపడం..ఆఫీస్ ఫోన్ కాల్స్‌కు స్పందించడం..గేమ్స్ ఆడటం.. ఇలా చాలా మంది మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడుతుంటారు. కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేసేటపుడు కూడా ఫోన్‌ను ఇలాగే వాడుతారా? డిన్నర్ పూర్తయ్యే వరకు ఫోన్ పక్కనపెట్టకుండా మాట్లాడుతూనే ఉంటారా? ఎవరికైనా ఈ అలవాటు ఉంటే మానుకోవాలంటూ అమెరికాకు చెందిన ఓ పరిశోధక బృందం సూచిస్తోంది. ఫోన్ కాసేపు పక్కనబెట్టి పిల్లలతో సరదాగా గడపాలని చెబుతున్నారు. లేకుంటే పిల్లలపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు తల్లిదండ్రులతో అనుబంధం తగ్గిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. బోస్టన్ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు 55 మంది తల్లిదండ్రులపై పరిశోధన నిర్వహించారు. రెస్టారెంట్లలో పిల్లలతో కలసి భోజనం చేసేటపుడు పెద్దల వ్యవహారశైలి, పిల్లల ప్రవర్తనపై అధ్యయనం చేశారు. కొంతమంది డిన్నర్ మొదలైన దగ్గర నుంచి రెస్టారెంట్ విడిచి వెళ్లేంత వరకు ఫోన్ వదిలిపెట్టరు. ప్రతి ముగ్గురు తల్లిదండ్రుల్లో ఒకరికి ఈ అలవాటు ఉందని తేలింది. 73 శాతం మంది భోజన సమయంలో కనీసం ఒకసారైనా ఫోన్ వాడుతారని కనుగొన్నారు. దీనివల్ల పిల్లలకు తల్లిదండ్రులపై అనుబంధం తగ్గుతుందని వెల్లడించారు. తల్లిదండ్రులు అప్యాయంగా గడపకపోవడం వల్ల పిల్లల మనసు గాయపడుతుందని హెచ్చరిస్తున్నారు. తమతో మాట్లాడకుండా ఫోన్లో ఏమి మాట్లాడుతున్నారనే దిశగా పిల్లలు ఆలోచిస్తారని చెప్పారు. ఇలాంటి సంఘటనల వలన పిల్లల పెంపకంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు రానురాను పెద్దలతో అనుబంధం తగ్గిపోతుందని పరిశోధకులు తెలిపారు. -
'ఫేస్ బుక్' వ్యసనం చంపేసింది!
ఉదయాన్నేలేచి అద్దంలో ఫేస్ చూసుకోకున్నా.. ఫేస్ బుక్ చూసుకోవడం నెటిజన్లకు అలవాటైపోయింది. ఇంటర్నెట్ వినియోగం అన్నివర్గాలకు చేరువ కావడంతో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం చాలా సులభమైంది. సమాచార ప్రసార ప్రక్రియలో ఇంటర్నెట్ తో అనుసంధానమైన ఎన్నో సమాచార సాధనాలు నెటిజన్లకు వరప్రసాదమయ్యాయి. ఇంటర్నెట్ సాధించిన పురోగతితో ఈమెయిల్, సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సాధనాలు యువతకు, ఉద్యోగులకు, ఇతర వర్గాలకు మరింత దగ్గరయ్యాయి. గతంలో దూమ, మద్యపానం, జూదం లాంటివి వ్యసనాలుగా ఉండేవి.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాకు అడిక్ట్ (వ్యసనం) గా మారిందని తరచు వింటూనే ఉన్నాం. అయితే ఇటీవల సోషల్ మీడియా కారణంగా చోటు చేసుకున్న సంఘటనలు ఆందోళనకు గురిచేసాయి. చెన్నైలో సాఫ్ట్ వేర్ నిపుణుడి భార్య ఫేస్ బుక్ లో తమ పెళ్లి ఫోటోలు అప్ లోడ్ చేయడం వివాదంగా మారింది. ఫేస్ బుక్ నుంచి ఫోటోలు తొలగించాలని చేసిన విజ్ఞప్తిని భార్య నిరాకరించడంతో సాఫ్ట్ వేర్ నిపుణుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలాంటి సంఘటనే మహారాష్ట్రలోని పర్భని లో ఓ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటనకు కారణం ఆ యువతిని తల్లి తండ్రులు ఫేస్ బుక్ వినియోగించకూడదు అని చెప్పడమే. ఇలాంటి సున్నితమైన సంఘటనలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వల్ల వివాహపరమైన సమస్యలు తలెత్తి.. విడాకుల వరకు దారి తీస్తున్నాయని సర్వేలు వెల్లడించాయి. ఇలాంటి సంఘటనల్లో ఏ ఒక్కరిని తప్పుపట్టడమనేది పక్కన పెడితే.. ఓటర్, ఆధార్ ఐడీ కార్డులు లేకున్నా పర్వాలేదు.. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లలో యూజర్ ఐడీ ఉంటే చాలు అనే పరిస్థితి అన్ని వర్గాల్లో కనిపిస్తుంది. ఫేస్ బుక్, ట్విటర్ లాంటి మీడియా ప్రభావం అన్ని వర్గాలపైన పడుతోంది. ఫేస్ బుక్, ట్విటర్ లో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం దినసరి అలవాటుగా మారింది. ఒకనాడు ఇంట్లో ఆల్బమ్ లకే పరిమితమయ్యే వ్యక్తిగత, కుటుంబ ఫోటో ఆల్బమ్ లు ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా వెబ్ సైట్లకు ఎక్కడం నాగరికతలో భాగమైంది. సమాచారాన్ని చేరవేయడం, ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టి.. తమ అనుభవాలను పంచుకోవడం దినచర్యలో భాగమైంది. సోషల్ మీడియా అక్కడికే పరిమితం కాకుండా ఎన్నికల ప్రచారంలోనూ భాగమైంది. దేశంలోని చాలా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల భవిష్యత్ ను నిర్ణయించే శక్తిగా సోషల్ మీడియా ప్రభావం చూపుతోందని తాజాగా వెల్లడైన సర్వే సమాచారం. సోషల్ మీడియాలో ఉండే బయోడేటా, వ్యక్తుల అభిరుచులను బేరిజు వేసి కొన్ని కార్పోరేట్ కంపెనీలు ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇలాంటి మరెన్నో అంశాలపై ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా వెబ్ సైట్లు ప్రభావం చూపుతున్నాయి. సోషల్ మీడియా జీవితంలో ఓ భాగమైంది అనే విషయం కాదనలేనిది. సోషల్ మీడియా ప్రభావం వల్ల కొన్ని సానుకూల, ప్రతికూల అంశాలు వెలుగుచూస్తున్నాయి. సోషల్ మీడియా వినియోగం వారి వారి విజ్క్షత, అవసరాలకు పరిమితం కావాల్సిందే కాని.. ఈ వ్యసనంతో వ్యక్తులు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎంతమాత్రం సబబు కాదని అన్ని వర్గాల్లో నెలకొని ఉంది.