ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ కుర్రకారుకు పిచ్చెక్కించేవిధంగా ఆల్బమ్ రూపొందించారు. ఆ ఆల్బమ్ జనం ముందుకు వచ్చేసింది. ముమైత్ ఖాన్‌ను ప్రేక్షకులు మరచిపోకపోయినా, దర్శక, నిర్మాతలు మాత్రం మరచిపోయారని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఏ దర్శక,నిర్మాత డ్యాన్స్ గర్ల్కు అవకాశం ఇవ్వడంలేదు. గత కొద్దికాలంగా ముమైత్ ఏ చిత్రంలో నటించలేదు. ఈ పరిస్థితులలో అందరికీ మతిపోయేవిధంగా తన ఆల్బమ్తో అదరగొడుతోంది. తన అందచందాలు - హావభావాలు - చిలిపి చూపులు - కుర్రకారుని రెచ్చగొట్టే డ్యాన్సలతోపాటు తన సెక్సీ వాయిస్‌తో ఈ ఆల్బమ్ను విడుదల చేసింది. ఇంకేముంది కుర్రకారు మరింత కిర్రెక్కిపోతున్నారు.
Published Thu, Aug 7 2014 8:28 PM | Last Updated on Thu, Mar 21 2024 8:10 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement