టీనేజ్ లో అడిక్ట్ అవుతున్నారు.. ఇక అంతే..!
వాషింగ్టన్: స్మార్ట్ ప్రపంచం ముందుకు తీసుకెళ్లడం లేదని టీనేజ్ యువతీయువకులు వీటికి అడిక్ట్ అవ్వడం వారి పేరేంట్స్ ను ఆందోళనకు గురిచేస్తుంది. మొబైల్ వీడియో గేమ్స్, కంప్యూటర్స్ వాడుతూ వీడియో గేమ్స్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయడం, టీవీలో కార్టూన్ ఛానల్స్ చూడటం లాంటి దుష్పరిణామాలు కలిగిస్తున్నాయి. అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ టీనేజర్స్ ఎలాంటి అంశాలపై టైం పాస్ చేయడంపై దృష్టిసారించారు. ఎంతగా అడిక్ట్ అయ్యారంటే.. తల్లిదండ్రులు పది సార్లు పిలిచినా పలకడం లేదట.
ఏసీ ఆఫ్ చెయ్.. వాటర్ తీసుకురా, లైట్ ఆఫ్ చెయ్ అంటూ పేరేంట్స్ మొత్తుకుంటున్నా వారిలో చలనం రావటం లేదని వెల్లడించారు. తల్లి, పిల్లల మధ్య రిలేషన్ గతంలో ఉన్నట్లు లేదని, వారి మధ్య దూరం పెరుగుతుందని చెప్పారు. 44 కుటుంబాలను సంప్రదించి కొన్ని ప్రశ్నలు అడిగి పలు విషయాలను బయటపెట్టారు. గ్రాడ్యూయేషన్ చదివిన తల్లులు ఉన్న ఇంట్లో పరిస్థితి పరవాలేదని, అంతకంటే తక్కువ చదివిన వారి ఇళ్లల్లో పిల్లలను కంట్రోల్ చేయడం వారి వల్ల కష్టమవుతోందట.
పేరేంట్స్ ఎలక్ట్రానిక్ మీడియాపై అవగాహనా తెచ్చుకోవాలని, నెట్ వాడకం, ట్రాకింగ్ విషయాలపై మెరుగవ్వాలని సూచిస్తున్నారు. చదువు, ఆటల మీద ఆసక్తి పెంచాలని.. వీడియో గేమ్స్, కార్టూన్ ఛానల్స్ నుంచి వారి దృష్టిని మళ్లించాలని రీసెర్చర్స్ పదే పదే చెబుతున్నారు.