గంగవరం (చిత్తూరు జిల్లా): మనస్తాపానికి గురైన ఓ బాలిక ఇంటిలో ఉరేసుకుని బలవన్మరణం చెందింది. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు కిలపట్ల గ్రామానికి చెందిన మణికంఠ కుమార్తె చైత్ర(12) రాయలపేట గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కరోనా కారణంగా పాఠశాలలు మూత పడటంతో అప్పటి నుండి ఇంటి వద్దనే ఉంటోంది. అమ్మ చేస్తున్న ఇంటి పనుల్లో సహాయ పడక పోగా రోజూ మొబైల్‌లో గేమ్ ఆడుకుంటూ టైంకి సరీగా భోజనం కూడా చేసేది కాదు. మొబైల్‌లో గేమ్ ఆడొద్దంటూ అప్పుడప్పుడూ తల్లి మందలించేది. ఈ నేపథ్యంలో బాలిక గురువారం రాత్రి ఇంటి మిద్దెపైన రూమ్‌లో ప్యానుకు చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. (చదవండి: దురాశకు పోయారు.. అడ్డంగా దొరికారు)
మిద్దిపైకి కోపంగా వెళ్ళిన కుమార్తె ఎంతసేపటికీ కిందికి రాకపోవడంతో తల్లికి అనుమానం వచ్చి మిద్దింటి తలుపును ఎంత తట్టినా కుమార్తె తెరవలేదు. కిటికీలో నుండి చూడగా ప్యానుకు వేలాడుతున్న కుమార్తెను చూసి తల్లి ఒక్కసారిగా బిత్తరపోయి అరుపులు కేకలు పెట్టింది. ఆమె కేకలు విన్న పక్కింటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇంటి తలుపును బద్దలుకొట్టి ప్యానుకు వేలాడుతున్న బాలికను కిందికి దించి వెంటనే పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ బాలికకు చికిత్స అందించే లోపే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment