నిత్యం పోర్న్‌ వెబ్‌సైట్స్‌ను చూస్తూ భార్యను.. | Bengaluru Woman Alleges Harassment Over Husband Porn Addiction | Sakshi
Sakshi News home page

నిత్యం పోర్న్‌ వెబ్‌సైట్స్‌ను చూస్తూ భార్యను..

Published Wed, Nov 3 2021 1:53 PM | Last Updated on Wed, Nov 3 2021 4:41 PM

Bengaluru Woman Alleges Harassment Over Husband Porn Addiction - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరు: కొందరికి కొన్ని అలవాట్లు ఉండడం సహజమే, కానీ అవే వ్యసనంగా మారితే వాటి వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓ వ్యక్తి పోర్న్‌ సైట్స్‌ను చూడటం వ్యసనంగా మారడంతో వద్దన్న భార్యను వేధింపులకు గురి చేసి చిత్ర హింసలు పెట్టాడు. ఎంతో ఓపికతో ఉన్న ఆ మహిళ భర్త ఆగడాలను భరించలేక చివరకు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.  ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది. 

జయనగర్‌లో ఉంటున్న ఓ మహిళకు నవంబర్ 2019లో వివాహమైంది. అయితే గత కొంత కాలం నుంచి తన భర్త పోర్న్ సైట్‌లను చూడటం ప్రారంభించాడు. ఆ అలవాటు కాస్త వ్యసనంగా మారింది. దీంతో పాటు రాత్రిపూట కాల్ గర్ల్స్‌తో ఆన్‌లైన్‌లో చాటింగ్ చేయడంతో పాటు వారి కోసం డబ్బులు కూడా ఖర్చు పెట్టేవాడు. అయితే ఇటీవల తన భర్త మ్యాట్రిమోనియల్ సైట్‌లో తన పేరు మీద అకౌంట్‌ ఓపన్‌ చేయడంతో అందులో తను విడాకులు తీసుకున్నట్లు పేర్కొన్నాడు.

దీంతో భరించలేని ఆమె తన భర్త అలవాట్ల గురించి అతని తల్లిదండ్రులకు కూడా ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందిని. అలా వీటన్నిటిని భరిస్తూ వచ్చిన ఆ మహిళ చివరికి తన ప్రవర్తన మార్చుకోవాలని వారించినందుకు ఆమెను వేధించడం ప్రారంభించాడు. పాడైన ఆహారం పెట్టేవాడు. అంతేగాక ఆమెను ఇంటికే ప‌రిమితం చేసి హింసించాడు. చివరికి చేసేదేమి లేక ఆమె తనకు న్యాయం చేయాలని కోర్టుని ఆశ్రయియింది. దీంతో కోర్టు మహిళ భ‌ర్త‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది.

చదవండి: భూతవైద్యం చేసే మహిళతో ‘సంబంధం’.. ఇటీవల దూరం పెట్టడంతో...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement