ఇప్పుడే నేర్పండి
పేరెంటింగ్
అలవాటును మించిన వ్యసనం మరొకటి ఉండదు. అది మంచైనా. చెడైనా సరే జీవితాంతం అలా ఉండిపోతుంది. వృథా కూడా ఒక వ్యసనమే. అందుకే వృథాని కంట్రోల్ చెయ్యడం ఎలాగో పిల్లలకు నేర్పాలి. అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు పని చేస్తుంటే వెంటనే వాటిని ఆపేసే అలవాటు చేయాలి. పెద్దవాళ్లు చేస్తుంటే పిల్లలకు కూడా వస్తుంది, కాని అది అమ్మ పనేనన్నట్లు ఉంటారు చాలామంది పిల్లలు. తమ దృష్టికి వచ్చినప్పుడు పట్టించుకోకుండా వెళ్లకుండా వెంటనే రియాక్ట్ అయ్యేటట్లు చేయాలి.
కొంతమంది పిల్లలు వాటర్ ట్యాప్ ఓపెన్ చేసి పని పూర్తయిన తర్వాత సరిగా కట్టకుండా వెళ్లిపోతుంటారు. నీరు సన్నటి ధారగా పోతూనే ఉంటుంది. ఇక్కడ పోయేది నీరు మాత్రమే కాదు, పిల్లల్లో పద్ధతి ప్రకారం ఉండాల్సిన బిహేవియర్ కూడా. ఇటువంటివి చిన్నప్పుడు చిన్నపాటి నిర్లక్ష్యాలుగా కనిపించినప్పటికీ పెద్దయ్యే కొద్దీ నిర్లక్ష్యంగా ఉండడం అనే దురలవాటుకు దారి తీస్తాయి.