Habit
-
మీ ఇంటి దగ్గర పుస్తకాలను అద్దెకు ఇచ్చే షాపులు ఉన్నాయా?
మన పక్కింటికో, ఎదురింట్లోకో పండగ సెలవులకని ఎవరైనా కొత్తపిల్లలు వచ్చినపుడు మాటా మాటా కలిసినపుడు మీ ఊరు పెద్దదా మా ఊరు పెద్దదా అని ఒక అంచనా వేసుకొవడానికి అడిగే మొదటి ప్రశ్న మీ ఊర్లో సినిమా టాకీసులు ఎన్ని ఉన్నాయి? అని అయి ఉండేది. నా కటువంటి సమస్యే ఎదురయ్యేది కాదు. నాకు కావలసిన భోగట్టా అల్లా మీ ఊర్లో, మీ ఇంటి దగ్గర పుస్తకాలకు అద్దెకు ఇచ్చే షాపులు ఎన్ని ఉన్నాయని మాత్రమే.నాకు ఊహ తెలిసాకా తరుచుగా ఎమ్మిగనూరుకు వెల్తుండే వాడిని. ఊర్లో దిగి మా మేనత్త ఇంటికి వెళ్ళే రిక్షా ఎక్కాకా దారికి అటూ ఇటూ చూస్తూ ఆ ఊరిలో పుస్తకాల బంకులు ఎన్ని ఉన్నాయా ? ఎక్కడెక్కడ ఉన్నాయా అని బుర్రలో గురుతులు పెట్టుకునేవాడిని . మా నూనెపల్లె లో భద్రయ్య బంకు అద్దె పుస్తకాలకు పేరెన్నికది. నూనెపల్లె సెంటరు లో గుర్రాల షెడ్డుకు ఎదురుగా ఉండేదది. ఆ బజారు అంతా కోమట్ల ఇల్లు ఎక్కువగా ఉండేవి. భద్రయ్య గారు కూడా కొమట్లే. ఆయన కొడుకు భాస్కర్ ఆ బంకులో ఎక్కువగా కూచునేవాడు. బంకు సీలింగు కు ఒక చిన్న ప్యాన్ బిగించి ఉండేది. బంకులో ఒక మూల రేడియో కూడా. అక్కడ నాకు పుస్తకాల తరువాత అత్యంత ప్రీతిప్రాత్రమైన వస్తువు బెల్లంపాకపు వేరుసేనగ గట్టా. ఎంతో రుచిగా ఉండేదది . ఇప్పుడు అటువంటి గట్టాలే ఆల్మండ్ హౌస్ లో కనపడతాయి. రూపం ఒకటే కాని ధర మాత్రం హస్తిమశకాంతరం. పుస్తకాలు, గట్టాల తరువాత నాకు ఫేవరెట్ అనదగ్గది గుడ్ డే బిస్కత్తు. గాజు సీసాలలో చక్కగా అమర్చి పెట్టి ఉండేవి. సుతారంగా అల్యూమినియం మూత తిప్పి అడిగిన వారికి బిస్కట్లు ఇచ్చేవాడు భద్రయ్య . అపుడు ఆ సీసాలోనుంచి బిస్కెట్ల వాసన ఎంత కమ్మగా వచ్చేదో. ఇప్పుడు అప్పుడప్పుడూ రత్నదీప్ సూపర్ మార్కెట్ కు ఏదయినా సరుకులు కొనడానికి వెడతానా, బిస్కెట్ కౌంటర్ దగ్గర గుడ్ డే ప్యాకెట్ పుచ్చుకుని ఆ చిన్ననాడు తగిలిన చక్కని వాసన వస్తుందా లేదా అని చూస్తా, రానే రాదు. ఆ వాసన లేని బిస్కెట్ కూడా రుచిగా అనిపించదు నాకు . నేను భద్రయ్య అంగట్లో పుస్తకం తీసుకుంటే కూడా ఉన్న ఫ్రెండ్ ఎవరో ఒకరు బిస్కెటో , బుడ్డల గట్టానో కొనేవాడు అది ఇద్దరం పంచుకుని తినుకుంటూ నడిచే దారిలోనే పుస్తకాన్ని నమిలేస్తూ కదిలేవాడ్ని.పుస్తకాలు అద్దెకిచ్చే షాపులో ఆ గోడల నిండా వందలుగా పుస్తకాలను నిలువ వరుసల్లో నింపేవారు. స్కెచ్చు పెన్నులతో పుస్తకాల మీద పేర్లు రాసి ఉండేవి. ఏ పుస్తకం కోసం కష్టపడి వెదుక్కోనక్కరలేదు. చక్కని చేతి రాతలో ఆ పేర్లు కళ్ళని ఆకర్షించేవి. చాలా షాపుల్లో అయితే పత్రికలో సీరియల్ గా వచ్చిన నవల పేజీలని చించి పుస్తకంగా బైండ్ చేసి అద్దెకు ఇచ్చెవారు. కొత్తగా రిలీజ్ అయిన పుస్తకాలయితే డిమాండ్ ఎక్కువ కాబట్టి వాటిని జనం కంట పడకుండా సెపరేట్ గా ఉంచేవాళ్ళు. నియమిత ఖాతాదారుల కోసం ఆ పుస్తకాలు పక్కకు తీసిపెట్టేవారు. షాపు వాళ్ళు ఏ పుస్తకాన్ని కూడా ఒకటి ఒకటిగా కొనేవాళ్ళు కాదు. ప్రతి పుస్తకం రెండు మూడు ఉండేవి సూపర్ స్టార్లయిన మధుబాబు, మల్లాది, యండమూరి పుస్తకాలయితే అయిదు లెక్కన కొనేవారు. ఆ పుస్తకాలు వచ్చిన కొత్తలో అయిదేం ఖర్మ పది కొన్నా అంత సులువుగా పాఠకుల చేతికి వచ్చేవి కావు. త్రిమూర్తులకు డిమాండ్ ఎక్కువ. ఎవరు ఎంత గీ పెట్టి చచ్చినా ఒకానొక కాలంలో హైస్కూలు పిల్లవాళ్ళ దగ్గరి నుండి సకుటుంబ సపరివారం వరకు తెలిసిన రచయితలంటే వీరే . పెరిగిపెద్దయి అతి పెద్ద చదవరులయిన ఆ రోజుల చదువరులు చాలామందికి అక్షర ప్రాశన చేసింది వీరే. వీరిలో యండమూరి కాస్త హట్ కే. రాసింది కమర్షియల్, పాపులర్ సాహిత్యమే కావచ్చు. అయినా ఆయన తన పుస్తకాల్లో ఎక్కడో ఒకక్కడ బుచ్చిబాబు, తిలక్ , విశ్వనాథ సత్యనారాయణ, చలం... ఇత్యాదుల ప్రస్తావన తెచ్చేవారు. నాకయితే ఈ మహారచయితల తొలి పరిచయం వీరేంద్రనాథ్ గారి పుస్తకాల్లోనే. ఒక పుస్తకంలో ఆయన ఇట్లావాక్యం వ్రాశారు "తెలుగు సాహిత్యంలో ఒకే ఒక హీరో తంగిరాల శంకరప్ప" ఆ వాక్యాన్ని పట్టుకుని నేను పెద్దయ్యాకా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి సాహిత్యాన్ని మొత్తం చదువుకునే భాగ్యం కలిగింది. లేకుంటే ఎక్కడి చిన్న పల్లె నూనెపల్లె? దానికి అద్భుతమైన సాహిత్యం ఎంతెంత దూరం?షాపు పెట్టాము కదాని వచ్చిన ప్రతి ఒక్కరికి పుస్తకాలు ఇవ్వబడవు. బ్యాంకులో అకవుంట్ తెరవడానికి సాక్షి సంతకం కావాలన్నట్లు, షాపువారికి తెలిసిన వారినెవరినయినా తోడుగా తీసుకెడితేనే పుస్తకాలు ఇస్తారు. లేదా పుస్తకం ధరమొత్తం అడ్వాన్సుగా కట్టాలి. నాకు గుర్తు ఉండి కొందరు 20 రూపాయలు బయానా గా పుచ్చుకునేవారు. అంత డబ్బు ఎలా వస్తుంది? ఎవరు ఇస్తారు? అందుకని నేను ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి అడ్వాన్స్ కట్టే వాణ్ని, అద్దె చెల్లించే వాడిని. పుస్తకాలు నాకు దొంగతనం నేర్పాయి. అలవాటు ఐయింది కదాని ప్రతిఎప్పుడూ దొంగతనం చేయకూడదు. పట్టుబడి పోతాం. అందుకే పుస్తకాలకు అద్దె అప్పు పెట్టడం నేర్చుకున్నాను. ఈ రోజుల్లో చోరీ చేస్తూ పట్టుబడిన పిల్లలు ఎవరైనా పుస్తకాలు కొనడానికి దొంగతనం చేసాను అని ఏడుపుముఖంతో అంటే వాళ్ళని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోబుద్ది వేస్తోంది. నేను పెరిగి పెద్దయ్యాక ఒకసారి నాకెంతో ఇష్టమైన ఆర్టిస్ట్ పుస్తకాలు కొనడానికి డబ్బులు లేక దిగాలుగా ఉంటే ఏమిటి విషయమని అడిగి తెలుసుకుని చిత్రకారులు శ్రీ బాపు గారు దగ్గరకు పిలిచి ముద్దు పెట్టుకోలేదు కానీ ఇరవైవేల రూపాయలు ఇచ్చి నా ముఖంలో నవ్వు చూశారు . అద్దెకు తీసుకున్న పుస్తకాన్ని తమ వద్దనున్న రిజిస్టరు పుస్తకంలో తేది, సమయం వేసి , మళ్ళీ ఆ పుస్తకాన్ని రేపటి రోజున అదే సమయం లేదా అంతకంటే ముందుగా తెచ్చి ఇస్తే ఒక రోజు అద్దె, రోజు మారిన కొద్దీ అద్దె రెట్టింపు అయ్యేది ,ఒక్కొక్క సారి అద్దె కట్టడానికి కి డబ్బులు లేక పుస్తకాన్ని అట్లానే అట్టిపెట్టేసుకుని పుస్తకం ధరకన్నా ఎక్కువ అద్దె డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అప్పుడప్పుడు షాపు యజమానికి ఏదయినా పనిపడో , భోజనానికి వెళ్ళవలసి వచ్చినపుడో పుస్తకాల షాపు మూసి ఉండేది. షాపు మూసి ఉన్నదేమి అని ఖంగారు పడకూడదు. అంగడి చెక్కలకు సన్న సందులు ఉంటాయి . అందు గుండా పుస్తకాన్ని పడెయ్యాలి. షాపు ఆయన తిరిగి వచ్చాక మన పుస్తకం నెంబరు , పేరూ చూసి పుస్తకం ముట్టినట్టుగా పద్దు వేసుకుంటాడు. అద్దె బకాయి రాసుకుంటాడు.మా ఇంటి దగ్గరలోనే, శివశంకర విలాస్ దగ్గర ఒక క్రైస్తవ కుటుంబం పుస్తకాల బంకు పెట్టుకున్నారు. అమ్మా, నాన్న, ఒక అబ్బాయి. ఒకరు లేనప్పుడు ఒకరు ఆ షాపు చూసుకునేవారు. నేను వాళ్లదగ్గర పుస్తకాలు అద్దెకు తీసుకునేవాడిని. యండమూరి వీరేంద్రనాథ్ "’రక్తసింథూరం" పుస్తకం అక్కడే తీసుకున్న గుర్తు నాకు. ఆ పుస్తకానికి చిత్రకారులు చంద్ర గారు వేసిన బొమ్మని చూసి మంత్రముగ్దుణ్ణి అయ్యాను ఆ కాలల్లోనే. ఒకసారి పుస్తకాలకు అద్దె చెల్లించడానికి డబ్బులు లేనప్పుడు ఒక ఉపాయం చేశా. కొడుకు ఆ షాపులో ఉన్నపుడు పుస్తకం తీసుకున్నాను అనుకో, పుస్తకం తిరిగి ఇచ్చేటప్పుడు అతను కాకుండా వాళ్ళ అమ్మగారో , నాయనో ఉన్నప్పుడు పుస్తకం వాపసు ఇచ్చి అద్దె ముందే కట్టా అని చెప్పేవాడిని. కొన్ని సార్లు పుస్తకం అద్దె ముందే కట్టించుకునేవారు. పుస్తకాలు నాకు మోసాన్ని కూడా నేర్పాయి. ఆ కుటుంబం వారు కడు బీదవారు. వారి రూపు, వేసుకున్న బట్టలు ఆ విషయాన్ని యథాతంగా చూపేవి. ఇప్పుడు ఎప్పుడయినా నాకు ఏదయినా అన్యాయం జరిగింది అనిపించినపుడు నేను ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకుని వారిని మోసం చేసినందుకు ఇదంతా నాకు తగినదే జరిగింది అనుకుంటాను. ఇపుడు ఆ బంకు వాళ్ళు ఎవరూ కనపడరు కానీ కనపడితే బావుండు, వాళ్ళ చేతులు పట్టుకుని మన్నించమని ప్రాధేయపోయేవాడినే. పుస్తకాల చదువు వలన నేను దొంగతనం, మోసం నేర్చుకుంటే నా ప్రెండు బాషా అనేవాడికి పుస్తకాలు వ్యాపారం నేర్పాయి. ఆ రోజుల్లో ఎంత పెద్ద పుస్తకాన్నయినా ఒక దెబ్బకు గంటా రెండు గంటల్లో చదివేసేవాళ్లం. మరి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లొక లెక్క. మా బాషాగాడు ఏం చేసేవాడంటే వాడు ఒక పిల్లల పుస్తకాన్ని అద్దెకు తెచ్చుకుని చదివేసి , ఒకోసారి చదవకుండా కూడా మాకు అద్దెకు ఇచ్చేవాడు. గంటకు పావలా పుచ్చుకునేవాడు . షాపులో అయితే పుస్తకాన్ని ఒక గంటకు వెనక్కి ఇచ్చినా, ఒక రోజుకు వెనక్కి ఇచ్చినా రూపాయో, రూపాయిన్నరనో కట్టక తప్పదు . బాషగాడి పావలా పథకం హాయిగా ఉండేది. వాడు ఇచ్చినంత మందికి అద్దెకు ఇచ్చి , అద్దె చెల్లించి ఆ పై దర్జాగా మిగిలిన డబ్బులు జేబులో వేసుకునే వాడు.చిన్న చిన్న బంకుల్లో కుదరదు కానీ, కాస్త పెద్ద షాపుల్లో అయితే పుస్తకాలు చూస్తూన్నట్టుగా నటిస్తూ, షాపు యజమాని తల తిప్పగానే చేతిలో ఉన్న పుస్తకాన్ని చొక్కా ఎత్తి లటుక్కున నిక్కరుకు పొట్టకు మధ్యలో దాచేవాళ్లం. పుస్తకం చదివెయ్యగానే మళ్ళీ వెనక్కి వచ్చి పుస్తకాన్ని ఆ అరల మధ్యనే ఇరికించి వెళ్ళేవాళ్లం. చెప్పుకుంటూ పొతే చాలా సంగతులు ఊరుతూనే ఉంటయి. నిజానికి ఎలా కనుమరుగయ్యాయో, ఎప్పుడు కనుమరుగయ్యాకో కూడా ఊహకు అందడం లేదు ఆ పుస్తకాలని అద్దెకు ఇచ్చే షాపులు. టెంత్ క్లాస్ లోనా? కాదేమో ! ఇంటర్ మీడియట్ లోనా , లేక డిగ్రీ రోజుల్లోనా? ఏమో గుర్తు లేదు. సినిమా థియేటర్ టికెట్ కౌంటర్ బయట నిలబడ్డంత పెద్ద బారు వరుస కాకపోయినా , అద్దె పుస్తకాల షాపు, బంకుల బయట వరుసలో నాలుగురయిదుగురే ఉన్నా, కొత్త నవల కోసం విపరీతమయిన ఒత్తిడి తోనో , నాలుగురోజులుగా తెగ తిరుగుతున్నా ఇంకా దొరకని అభిమాన రచయితా పుస్తకం ఈరోజైనా దొరుకుతుందా లేదా అనే మనోదౌర్బల్యం తోడుగానో నిలబడి ఉండేవారు పాఠకులు. వట్టి అద్దె పుస్తకాలే కాదు. ఊరి మెయిన్ సెంటర్లలోనూ, సందు చివర, వీధి మలుపులో ప్రతిచోటా దినపత్రికలు, వార పత్రికలూ, పక్షపత్రికలు, పిల్లల పత్రికలూ , పాకెట్ నవల్స్ కనపడుతూనే ఉండేవి, ఈరోజు ఒక దినపత్రిక కోసమో, వార పత్రిక కోసమో కిలోమీటర్లకు కిలో మీటర్లు నడిచినా ఒక్క పుస్తకమూ రోడ్డు మీద కనపడుత లేదంటే అత్యంత సాంస్కృతిక లేమి నడుస్తున్న రోజులవి . ఆరోజుల్లో కథలు, నవలలు, పాటలు , పద్యాలు అనేకాలు పుస్తకాలుగా దొరికేవి. రచయితల ముక్కు మొహంతో అవసరం లేని రోజులవి. రాసిందే భాగ్యం. కంటపడిన అచ్చు కాగితమే వరం. ఈ రోజున వద్దన్నా వీధికొక, సందుకోక, నగరం నాలుగు వైపులా రచయితలూ, కవులు ఊరికూరికే కనపడుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. సరస్వతి మీద ఒట్టు రచయితల పేర్లు తెలుసు , వారు వ్రాసిన ఒక్క వాక్యం కూడా తెలీదు. రాసేవారు మాత్రమే తెలుస్తున్నారు రచన అందడం లేదు . ఏం రాశారో ఆనవాలు లేదు, చూసిన తనని పోల్చుకుంటే చాలన్నంత అల్పసంతోషి అయిపోయినాడు సృజనకారుడు.-అన్వర్ -
సానుకూల దృక్పథం
అంతా మన మంచికే అనే మంత్రిగారి కథ అందరికీ తెలిసినదే. ‘‘అంతా మన మంచికే’’ అనే మంత్రిగారు రాజుగారి చిటికెనవేలు తెగితే కూడా అదే మాట అని చెరసాల ΄ాలు అయ్యారు. వేటకి వెళ్ళిన రాజుని ఆటవిక జాతివారు తమ దేవతకు బలి ఇవ్వబోయారు. చిటికెనవేలు లేక΄ోవటంతో అంగవైకల్యం ఉన్న వ్యక్తి బలికి పనికి రాడు అని వదిలి పెట్టారు. రాజు తిరిగి వచ్చి మంత్రిని విడుదల చేసి, ‘‘నాకు మీ రన్నట్టు మంచే జరిగింది, మీకు ఏం మంచి జరిగింది?’’ అని అడిగాడు. అందుకు మంత్రి ‘‘అది కూడా నా మంచికే జరిగింది. చెరసాలలో లేక΄ోతే తప్పకుండా మీతో వేటకి వచ్చే వాడిని. అంగవైకల్యం ఉన్న మిమ్మల్ని వదిలేసి అప్పుడు ఏ అవయవ లోపమూ లేని నన్ను బలి ఇచ్చేవారు’’ అని చె΄్పాడు. ఇది అతి మామూలు కథ. కానీ, దేనినైనా సానుకూల దృక్పథంతో ఎట్లా చూడాలి, దాని వల్ల ప్రయోజనం ఏమిటి? అన్న విషయాలు అర్థం అవుతాయి. కొన్ని ఆ క్షణాన ఇబ్బంది కలిగించేవిగా, అయిష్టంగా అనిపించ వచ్చు. కానీ, మనకి ఏది మంచో మనకన్నా ప్రకృతికే బాగా తెలుసు. ఆ ప్రకృతినే విశ్వం అని, దైవం అని, ఎనర్జీ అని రక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. వేసవి కాలంలో ఎటువంటి పళ్ళు, కూరలు ఆరోగ్యానికి మంచివో వాటినే ఇస్తుంది ప్రకృతి. వర్షాకాలంలో మామిడిపళ్ళు తినాలి అనిపించినా దొరకవు. ఎందుకో తెలుసా? ఆ వాతావరణానికి మామిడిపండు తినటం ఆరోగ్యానికి మంచిది కాదు. దొరికితే మామిడిపండు తినకుండా ఉండలేం. మన మంచికోసం దొరక కుండా చేసింది ప్రకృతి. ఈ దృక్పథం అలవాటయిన వారికి జీవితం కష్టాలమయంగా కనిపించదు. దేనినైనా తేలికగా తీసుకొని ముందుకి సాగటం ఉంటుంది. అట్లా అయితే వారి జీవితాల్లో కష్టాలు ఉండవా? ఉంటాయి, కానీ కన్నీళ్ళు ఉండవు. కష్టపడకుండా ఏదీ లభించదు. అది భౌతికమైనది. దాన్ని ఏదోవిధంగా దాటవచ్చు. మనస్సుకి ఎక్కించుకుంటే వేదన మిగులుతుంది.ఆ కాస్త ఇబ్బందిని అయినా ఎందుకు భరించాలి? అనే సందేహం వస్తుంది. కానీ మనం ఆ పరిస్థితిని మార్చలేము కదా! అప్పుడు కూడా అంతా మన మంచికే అనుకుంటే అద్భుతం జరుగుతుంది. దీని వల్ల మంచే జరుగుతుంది అనే సానుకూల భావన వల్ల మన మనసు సానుకూల భావతరంగాలను ప్రసరింప చేస్తుంది. భావతరంగాలు పరిసరాలని, పరిస్థితులని, వ్యక్తులని కూడా ప్రభావితం చేస్తాయి. దానివల్ల ముందుగా వాతావరణం, తరువాత మనస్సు ప్రశాంత మవుతాయి. పరిస్థితులు చక్కబడతాయి. దానికి కారణం నెమ్మదించిన మనస్సు. ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కాదు, ఎఖార్ట్ వంటి ఆధునిక మనస్తత్వశాస్త్రవేత్తలు కూడా ఆలోచనని అనుసరించే పరిస్థితులు ఉంటాయి అని ప్రయోగాత్మకంగా నిరూపించారు. వేలికి దెబ్బ తగిలింది అని బాధపడటం కన్న చెయ్యి, కాలూ బాగున్నందుకు సంతోషించటం నేర్చుకోవాలి. సరైన చెప్పులు లేవని ఏడుస్తున్న కొడుకుకి కాళ్ళు లేని వాడిని చూపించాడుట తండ్రి. అప్పుడు లోటు ఉన్నా బాధ పడటం ఉండదు. సంతోషమే ఉంటుంది. సంతోషంగా ఉంటే ‘హాపీ హార్మోనులు’ విడుదల అవుతాయి. సంతోషం, ఆనందం బాహ్యమైన వస్తువులు, పరిస్థితుల పైన కాక దృక్పథం మీద ఆధార పడి ఉంటాయి. పురుటి నొప్పులు పడనిదే శిశువు లోకంలో అడుగు పెట్టటం కుదరదు. బిడ్డ చిరునవ్వు చూడగానే నొప్పుల సంగతి మరపుకి వస్తుంది. సాన పెట్టనిదే వజ్రం మెరవదు. నమలనిదే పదార్థం రుచి తెలియదు. గంధపుచెక్కని అరగదీయనిదే మంచిగంధం రాదు. చివరికి కుంకుడుకాయ రసం కావాలి అన్నా గట్టిగా పిసకాలి. ఇతర పళ్ల రసం గురించి చెప్ప నక్కర లేదు. గట్టిగా పిండనిదే రసం రాదు. ఈ కష్టం మెఱుగుదల కోసమే అని అర్థం చేసుకుంటే సమస్య లేదు. దానిని కూడా వ్యాయామం మొదలైనవి చేసినప్పుడు ΄÷ందే సుఖం లాగా ఆనందించవచ్చు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
ఆకలికి అలవాటుకి తేడా ఉంది ...ఇదో మైండ్‌గేమ్!
‘నా దేహం నా ఇష్టం. నాకు ఇష్టమైనవి తింటాను’... అనుకోవడంలో ఇతరులకు ఎటువంటి అభ్యంతరమూ ఉండాల్సిన అవసరం లేదు. కానీ సమాజంలో గౌరవంగా జీవించాలంటే మనం తినే ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. వినడానికి విచిత్రంగా ఉన్నా సరే ఇది నిజం. ప్రతి ఒక్కరూ ‘పోషకాహారం తీసుకోవాలి, దేహానికి అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. దానికి తగినట్లు వ్యాయామం చేయాలి’... దైనందిన జీవితం ఇలా క్రమబద్ధంగా ఉన్న వ్యక్తి ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ప్రవర్తన కూడా గౌరవపూర్వకంగా ఉంటుంది. స్థూలంగా చెప్పినా సూక్ష్మంగా చెప్పినా, విషయం ఏమిటంటే... ఆరోగ్యకరమైన దేహం ఆరోగ్యకరంగా ఆలోచిస్తుంది. మానసిక ఆరోగ్యంలో అపసవ్యతలు తలెత్తాయంటే అవి కేవలం మానసికం మాత్రమే కాదు, అసలైన సమస్య దేహంలోనే ఉంటుంది. దేహానికి అందుతున్న ఆహారంలోనే ఉంటుంది... అన్నారు హెల్త్ సైకాలజిస్ట్ సుస్మితా గుప్తా ‘‘సమాజంలో మంచి వ్యక్తిగా చలామణి కావాలంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం మీద మన అలవాట్లు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మనకు తెలియకుండా చేసే పోరపాటు ఏమిటంటే ‘ఆకలి– అలవాటు’ మధ్య తేడా గుర్తించకపో వడం. ఆకలి లేకపో యినా అలవాటుగా తినడం, ఒత్తిడిలో ఉన్నప్పుడు దాన్నుంచి తప్పించుకోవడానికి ఆహారాన్ని ఆశ్రయించడం అనే దురలవాటు ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇటీవల ఎక్కువైంది. దైనందిన జీవితంలో ఒత్తిడి ఎక్కువైంది, జిహ్వను సంతృప్తిపరుచుకోవడానికి జంక్‌ఫుడ్ మీదకు మనసు మళ్లడం అనేది కూడా మన జీవనశైలిలో భాగమైపో యింది. నిజానికి మన మెదడు మనతో గేమ్ ఆడుతుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని తెలిసినప్పటికీ మనసు జంక్‌ఫుడ్ మీదకు మళ్లిస్తుంది. ఇదెలాగంటే... రేపటి నుంచి వ్యాయామం మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుని అలారం పెట్టుకుంటాం. అలారం మోగినప్పుడు ఆపేసి మళ్లీ నిద్రపో తాం. మన జీవనశైలికి అనుగుణంగా మన మెదడులో మ్యాపింగ్ జరిగిపోయి.......ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి మెదడు ఇష్టపడదు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనల్ని కూడా బయటకు రానివ్వదు. అలాంటప్పుడు మనం మెదడు మాటను పెడచెవిన పెట్టడమే పరిష్కారం. మనల్ని మనం దురలవాట్ల నుంచి బయటేసుకోవాలంటే ఆ ప్రయత్నంలో మనల్ని వెనక్కి లాగే మెదడు చెప్పే మాటను వినకూడదు. ఆహారం– మానసిక అనారోగ్యం! మనం అలవాటుగా నిత్యం జంక్‌ఫుడ్‌తో పోట్టను నింపేస్తుంటే దేహం శక్తిహీనమవుతూ ఉంటుంది. అలసటతోపాటు ప్రతిదానికీ చిరాకు, ఆందోళన, ఆవేశపడడం వంటి లక్షణాలు తోడవుతాయి. మెదడు నుంచి నాడీ వ్యవస్థ ద్వారా దేహభాగాలకు అందాల్సిన సంకేతాల్లో అపసవ్యతలు తలెత్తుతాయి. ఒక విషయానికి సక్రమంగా ప్రతిస్పందించాల్సిన సందర్భంలో విపరీతంగా స్పందించడం వంటి మార్పులు కనిపిస్తాయి. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. మానసిక సమస్యలు తీవ్రరూపం దాల్చినప్పుడు మాత్రమే మానసిక వైద్యుని సంప్రదిస్తుంటాం. ప్రతి ఒక్కరిలో సమస్య అంతటి స్థాయి తీవ్రతకు దారితీయదు. కానీ మధ్యస్థ దశ ఎక్కువమందిలో కనిపిస్తుంటుంది. ఈ సమస్యకు వైద్యం... మనం మంచి ఆహారం తీసుకోవడమే. బ్రెయిన్ మనతో ఆడుకుంటుంది, మనం బ్రెయిన్‌ని మన అధీనంలో ఉంచుకోగలగాలి. అదే దేహానికి–మెదడుకు సమగ్రమైన ఆరోగ్యం. మనం ఏమి తింటున్నామో దానిని బట్టే మనం ఏమిటో చెప్పవచ్చు. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువెళ్లగలిగితే సమాజం ఎదుర్కొంటున్న అనేక మానసిక రుగ్మతలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన బంధాలతో అందమైన సమాజాన్ని నిర్మించడానికి నా వంతుగా చేస్తున్న ప్రయత్నమే ఇది’’ అన్నారు హెల్త్ సైకాలజిస్ట్ సుస్మితాగుప్తా – వాకా మంజులారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి వార్థక్యం పోంచి ఉంటుంది బాడీ–మైండ్‌ని కలిపి ఒక యూనిట్‌గా పరిగణించాలి. ఒకటి ప్రమాదంలో పడితే రెండవది కూడా ప్రమాదంలో పడుతుంది. దేహం సమతుల ఆరోగ్యంతో ఉన్నప్పుడే మెదడు కూడా సంపూర్ణారోగ్యంతో ఉంటుంది. దేహానికి సంతులిత ఆహారం అందనప్పుడు తలెత్తే సమస్యలు మానసిక అపసవ్యతలు మాత్రమే కాదు వార్ధక్యం కూడా. త్వరగా వయసు మీద పడుతున్న వారిలో దేహానికి పో షకాహారం తగిన మోతాదులో అందకపో వడంతోపాటు చిన్న చిన్న మానసిక రుగ్మతలతో సతమతమైన నేపథ్యం కనిపించి తీరుతుంది. ఇది అంతర్జాతీయంగా నిర్వహించిన అధ్యయనం. జంక్‌ఫుడ్ కారణంగా ఎదురయ్యే సమస్య స్థూలకాయం మాత్రమే కాదు మానసిక అనారోగ్యాలు కూడా. దేహం లోపల ఇన్ఫ్లమేటరీ కండిషన్‌కు దారి తీస్తుంది. అది దేహం వార్థక్యం బారిన పడడానికి తొలి దశ. – సుస్మితా గుప్తా,హెల్త్ సైకాలజిస్ట్, ద క్యూర్ స్పేస్ -
అలవాటుని అధిగమించటం అతికష్టం!
అలవాట్లు మనిషిని పట్టిస్తాయి. అంతే కాదు బంధిస్తాయి, బానిసని కూడా చేస్తాయి. అలవాటుకి ప్రయత్నం అవసరం లేదు. అలవాటు రెండవ స్వభావం అని చెప్పవచ్చు. స్వభావం లాగానే అలవాటుని కూడా అధిగమించటం చాలా కష్టం. అది ఎంతగా వంటపట్టిపోతుందంటే దాన్ని విడిగా గుర్తించటం కూడా కుదరదు. నిజానికి అది పుట్టుకతో వచ్చింది కాదు. తరవాత పెంపొందించుకున్నది. అలవాట్లు మనిషిని పట్టిస్తాయి. అంతే కాదు బంధిస్తాయి, బానిసని కూడా చేస్తాయి. అలవాటుకి ప్రయత్నం అవసరం లేదు. అలవాటు రెండవ స్వభావం అని చెప్పవచ్చు. స్వభావం లాగానే అలవాటుని కూడా అధిగమించటం చాలా కష్టం. అది ఎంతగా వంటపట్టిపోతుందంటే దాన్ని విడిగా గుర్తించటం కూడా కుదరదు. నిజానికి అది పుట్టుకతో వచ్చింది కాదు. తరవాత పెంపొందించుకున్నది. పెరిగిన భౌగోళిక, ఆర్థిక, సాంఘిక, రాజకీయ, పరిస్థితులు, వాతావరణం, మనుషులు, మత విశ్వాసాలు మొదలైన ఎన్నో అంశాలు ఒక అలవాటు ప్రబలటానికి దోహదం చేస్తాయి. అవే పరిస్థితుల్లో ఉన్న మరొక వ్యక్తికి అది కాక మరొక అలవాటు ఉండవచ్చు. దీనికి వ్యక్తి స్వభావం కారణం అవుతుంది. అంటే, వ్యక్తి సహజ స్వభావం, పరిస్థితుల ప్రభావాల సమాహారంగా అలవాట్లు ఏర్పడుతాయి. ఆ అలవాటు తెచ్చి పెట్టుకున్నది అని గుర్తించటం ఉండదు. అది సహజ లక్షణం అనే భ్రమలో ఆ వ్యక్తి మాత్రమే కాదు, చుట్టుపక్కల వారు కూడా ఉంటారు. అలవాటు ఎట్లా ఏర్పడిందో గుర్తించటం చాలా కష్టం. దానిని మానుకోటం మాత్రం కష్టం. ముందు అది మంచిది కాదు అని గుర్తించాలి, తరవాత మానాలి అనే సంకల్పం ఉండాలి. ఆ పైన ప్రయత్నం చేయాలి. మొదటిదే చాలా కష్టం. ఎందుకంటే మనిషికి తనని తాను సమర్థించుకోటం అన్నది సహజంగా ఉంటుంది. అలవాటై పోయంది అనటం అలవాటుగా మారింది. ఇంతకీ అలవాటు అంటే? అల+వాటు = అలవాటు. అంటే, సముద్రంలో అల ఎంత సహజంగా పైకి ఎగసి, అంతే వేగంగా ఎటువంటి ప్రయత్నం, శ్రమ లేకుండా పడుతుందో అంత తేలికగా హాయిగా జరిగిపోయేది. దానిని ప్రత్యేకంగా గుర్తించటం కూడా ఉండదు. అలవాటు అన్నది ఎంత బలంగా ఉంటుందంటే దానిని మానటం చాలా కష్టం. బలవంతంగా మానే వాతావరణం కల్పిస్తే గిజగిజ లాడిపోతారు. అందులోనూ దురలవాట్లు అయితే మరీనూ. పిచ్చిగా ప్రవర్తించటం, అవతలి వారికి పిచ్చెక్కేట్టు ప్రవర్తించటం లేదా ఆత్మహత్యలకి ΄పాల్పడటం చూస్తూనే ఉన్నాం. అదే మంచి అలవాటు అయితే ఇబ్బంది పడతారు కాని, ఉన్న పరిస్థితుల్లోనే సద్దుకునే ప్రయత్నం చేస్తారు. కాని, గిజగిజలాడరు. ఉదాహరణకి రోజూ ఒక సమయానికి ధ్యానమో, పూజో చేసుకునే అలవాటు ఉన్నవారు ఎప్పటిలాగా వీలుకాకపోతే ఉన్నంతలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా తమ పని పూర్తి చేసుకుంటారు. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు ఎక్కడ ఉన్నా, ఎంత మంది మధ్య ఉన్నా, ఇతరులని ఇబ్బంది పెట్టకుండా పుస్తకం పట్టుకుని కూర్చొంటారు. కొంతమంది త్వరగా దేనినైనా అలవాటు చేసుకుంటారు. వీరి అలవాట్లని మార్చటం అంత కష్టం కాదు. కొత్త అలవాట్లని తేలికగా చేసుకోగలరు కనుక మంచివి అలవాటు చేస్తే సరి! కొంతమందికి ఏది అలవాటు కావటం అన్నదే ఉండదు. వీళ్ళతో ప్రమాదం ఏమంటే మంచివి, పనికి వచ్చే అలవాట్లు కూడా ఉండవు. మనిషి జీవితం చాలావరకు అలవాటుగా సాగుతుంది. కొంతమందిని ఈ విధంగా ఎట్లా బతుకుతున్నావు? అని అడిగితే అలవాటయి పోయింది అంటారు. చిన్నప్పటినుంచి ఏది అలవాటు చేస్తే అదే అలవడుతుంది. రుచులు కూడా అలవాటు వల్లనే కలుగుతాయట! చిన్నతనం నుండి కారం తినటం అభ్యాసం చేస్తే అదే అలవాటు అవుతుంది. ఎప్పుడు తినని వారికి నోరు మంట పుడుతుంది. ఒక్కొక్కప్రాతం వారు ఒక్కొక్క ఆహారాన్నీ ఇష్టపడటానికి కారణం ఇదే. అభిరుచులు కూడా అంతే! సాధారణంగా చేదు ఇష్టం ఉండదు ఎవరికీ. కాని నెమ్మదిగా అలవాటు చేసుకుని వదల లేని స్థితికి వచ్చింది సమాజం. కాఫీ, టీ, శీతల పానీయాలు ఇత్యాదులు. మొదటిసారి గొంతు దిగవు. ఆ తరువాత వదలవు. ధూమపానం, మద్యపానం సంగతి సరే సరి. – డా.ఎన్. అనంత లక్ష్మి (చదవండి: పుట్టలో పాలు పోయటంలో అంతరార్థం? ఆ 12 నాగులనే పూజిస్తారు ఎందుకు?) -
ఎదుగుదల వాయిదా!
బాపట్లకు చెందిన చిట్టిబాబు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. వయసు 40 దాటడంతో ఆరోగ్యంపై దృష్టిపెట్టాలనుకున్నాడు. ‘రేపటి నుంచి మార్నింగ్ వాక్ చేయాలి’.. అని నిర్ణయం తీసుకుని ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకున్నాడు. తెల్లారింది.. అలారం మోగడం మొదలైంది. నిద్రమత్తులోనే చిట్టిబాబు అలారాన్ని ఆపి.. ఈ రోజు గురువారం.. అటూఇటు కాకుండా ఈ రోజే మొదలెట్టాలా? సోమవారం నుంచైతే ఓ క్రమపద్ధతిలో ఉంటుంది కదా అనుకుని.. వచ్చే సోమవారానికి వాయిదా వేసుకుని మళ్లీ ముసుగుతన్నాడు. సోమవారం ఉదయాన్నే అలారం మోగడంతో భారంగా నిద్రలేచాడు. వాకింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో అతడి మెదడులో తళుక్కున ఓ ఆలోచన మెదిలింది..ఎటూ మూడు రోజుల్లో ఈ నెల ముగిసిపోతుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వాకింగ్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందబ్బా.. అని ఆలోచించాడు. తన ఆలోచన కరక్టే అనిపించింది. ఒకటో తేదీ అయితే లెక్కించుకోడానికి కూడా సులువుగా, అనువుగా ఉంటుందనుకుంటూ.. వాకింగ్‌కు వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఒకటో తేదీ కూడా రానే వచి్చంది.. ఆ రోజు బుధవారం. మరీ వారం మధ్యలో ఎందుకు? సోమవారం నుంచి నడుద్దాంలే.. అని వాయిదా వేశాడు. మళ్లీ సోమవారం రాగానే.. ఆపై సోమవారానికి వాయిదా. ఇలా రెండేళ్లుగా వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది గానీ.. మార్నింగ్ వాక్కు మాత్రం అడుగు ముందుకు పడలేదు. వాకింగ్ మొదలెడదామనుకున్న రోజు రాగానే ఏదో ఒక కారణాన్ని వెతుక్కోవడం.. ఆ సాకుతో వాయిదా వేసుకుని, ఆ క్షణానికి హమ్మయ్యా.. అని ఊపిరిపీల్చుకోవడం పరిపాటిగా మారింది. – తమనంపల్లి రాజేశ్వరరావు, ఏపీ సెంట్రల్ డెస్క్ ఒక్క చిట్టిబాబు విషయంలోనే కాదు.. దాదాపు అందరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో ఇలాంటి వాయిదా ఘటనలు ఉండే ఉంటాయి. ఒక్కసారి ఈ వాయిదా సంస్కృతికి అలవాటు పడితే.. మన ఎదుగుదలను, అభివృద్ధిని వాయిదా వేసుకున్నట్టే లెక్క. విలువైన కాలాన్ని హరించి వేస్తుంది. వాయిదా వేయడం.. ఆ సమయానికి ఎంతో రిలీఫ్‌నిస్తుంది. చేయాల్సిన పనిని ‘తర్వాత చేద్దాంలే..’ అనుకోవడం ఆ క్షణానికి ప్రశాంతతనిస్తుంది. కానీ ఆ వాయిదా తాలూకు పర్యావసానం నష్టాన్ని కలిగించినప్పుడు తల పట్టుకుని కుమిలిపోతుంటారు. ఇలా డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదమూ లేకపోలేదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూద్దాంలే.. చేద్దాంలే.. అనేవి జీవితాన్ని వెనక్కి లాగే విషయాలని, వీటి నుంచి ఎంత త్వరగా బయటపడగలిగితే అంత మంచిదంటున్నారు. మనం ఇలా ఆలోచిస్తే.. మెదడు అలా ఆదేశిస్తుంది.. సాధారణంగా మనకు ఒత్తిడి కలిగించేవాటిని వాయిదా వేయమని మెదడు చెబుతుంది. పరీక్షల కోసం చదవడం, ఉదయాన్నే లేచి నడవడం వంటివి మానసికంగా భారంగా ఉండే పనులు. ఎక్కువగా ఇలాంటి వాటినే వాయిదా వేయాలని మెదడు చెబుతూ ఉంటుంది. ఇలాంటి వారిలో ఎక్కువ మంది డిప్రెషన్, మానసిక ఆందోళనల బారిన పడే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోన్లో మునక నుంచి బయటి కొద్దాం.. ఏ పనినైనా అనుకున్న సమయానికి పూర్తిచేయాలంటే ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది. ఫోన్ అనేది మనకు తెలియకుండానే సమయాన్ని హరిస్తుంది. మనలో అంతులేని బద్దకానికి కారణమవుతుంది. ఫోన్ చేతిలో ఉందంటే చాలు.. ఇక ఏపనైనా ‘ఆ చేయొచ్చులే..’ అనిపించే నీరసం, ‘ఇప్పుడే చేయాలా..’ అనేంత బద్దకం, ‘చేయలేక చస్తున్నా..’ అనుకునేంత నిస్తేజం మనల్ని ఆవహించేస్తాయి. అందుకే ఫోన్‌కు దూరంగా ఉంటే ఈ వాయిదా అలవాటు నుంచి బయటపడే అవకాశం ఉంది. అందరిలో ఉండే లక్షణమే గానీ.. పనులు వాయిదా వేయడం అనేది టైం మేనేజ్మెంట్ సమస్య అని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి ఇది ఎమోషనల్ రెగ్యులేషన్ సమస్య. ఏదైనా ఒక పని మనలో ఒత్తిడిని కలిగిస్తే.. మెదడులోని దానికి సంబంధించిన భాగం ఆ పనిని వాయిదా వేయాలని ప్రేరేపిస్తుంది. దీంతో మనం ఆ పనిని వాయిదా వేస్తాం. అందుకే వాయిదా వేయడాన్ని ఓ డిఫెన్స్ మెకానిజంగా పరిగణించవచ్చు. ఇది అందరిలో ఉండే లక్షణమే గానీ, ఇది క్రానిక్‌గా మారినప్పుడు మాత్రం సైకాలజిస్టులను సంప్రదించాల్సి ఉంటుంది. కాగి్నటివ్ బిహేవియర్ థెరపీ, మైండ్ ఫుల్నెస్ ట్రైనింగ్, బిహేవియర్ షేపింగ్, ఎపిసోడిక్ ఫ్యూచర్ థింకింగ్ వంటి పద్ధతులు ఉపయోగించి వాయిదా వేసే లక్షణాన్ని సైకాలజిస్టులు తగ్గిస్తారు. – బి.కృష్ణ, సైకాలజిస్ట్ మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ పనులు వాయిదా వేయడం అనేది మెదడులోని లింబిక్ సిస్టం, ప్రీ ఫ్రొంటల్ కార్తెక్స్ మధ్య ఘర్షణతో సంభవిస్తుందని న్యూరో సైన్స్ చెప్తుంది. ఈ లక్షణం విద్యార్థుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌లో 81 శాతం మంది పనులు వాయిదా వేస్తున్నారని ఒక సర్వేలో తేలింది. పనులు వాయిదా వేయడానికి కొన్ని మానసిక కారణాలున్నాయి. మోటివేషన్ లేకపోవడం, ఓటమి భయం, ఒత్తిడి, స్వీయ విమర్శలు తదితరాలు ఓ వ్యక్తి పనులు వాయిదా వేయడానికి కారణమవుతాయి. వాయిదా లక్షణం మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వాయిదా వేసే లక్షణం దైనందిక జీవితానికి ఇబ్బంది కలిగించే స్థాయికి చేరుకుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది. – బి.అనితజ్యోతి, సైకాలజిస్ట్ ‘వాయిదా’పై నిపుణులు ఏమంటున్నారంటే.. ఒక పనిని వాయిదా వేయడానికి ముఖ్య కారణం ఆ పని చేయడానికి ఆసక్తి లేకపోవడంతో పాటు ఉత్సాహ లేమిని కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. మనం ఇంతకు ముందు చెప్పుకొన్నట్టు ఆ పని మనకు ఒత్తిడి కలిగించేది, లేదా మానసికంగా భారంగా అనిపించేదై ఉంటుంది. ఒక పనిని ఒక్కసారి వాయిదా వేశామంటే.. మళ్లీ మళ్లీ వాయిదా వేసేందుకే మన మెదడు మొగ్గు చూపుతుంది. బద్దకం, సోమరితనం కూడా ఈ వాయిదా పరంపరకు ప్రధాన కారకంగా నిలుస్తున్నాయి. అసలు ఎలాంటి కారణం లేకుండా కూడా పనులు వాయిదా వేస్తూ అదో రకమైన మానసిక ఆనందాన్ని పొందుతుంటాం. చాలా కోల్పోతున్నాం వాయిదా వేసిన పనిని పూర్తిచేయలేక దాని తాలూకు నష్టాన్ని మూటగట్టుకుంటాం. వాయిదాల వల్ల తరచూ ఇలానే జరగడంతో ఆందోళన, భయానికి లోనవుతాం. మనమీద మనకు నమ్మకం సన్నగిలి.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం. ఇది మన నిద్రను ప్రభావితం చేస్తుంది. మనకు నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది. ఫలితంగా మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది.. ఇలా అధిగమిద్దాం.. ఒక పనిని చేయడంలో హాయిని అనుభవించాలి గానీ.. ఒత్తిడిని దరిచేరనీయ కూడదు. ఈ వాయిదా వేయడం అనే దాన్ని మన ఎదుగుదలను నియంత్రించే రుగ్మతగా భావిస్తూ.. దాని బారిన పడకుండా ఉండాలంటూ మనసుకు ఆదేశాలిచ్చుకుంటూ.. మనసును పూర్తిగా మన నియంత్రణలో ఉంచుకోవాలి. ఏదన్నా పని మొదలెట్టామంటే.. దానికి అంకితమైపోవాలి. అది పూర్తయిందాకా వెనకడుగు వేయకూడదు. వాయిదా సంస్కృతి అనేది మన ఉన్నతిని, ఎదుగుదలను నిలువరించే ఓ సోమరిపోతు. ఈ జీవన పరుగు పందెంలో తోటివారితో పాటు మన అడుగుల్ని ముందుకు పడనీయకుండా అనుక్షణం వెనక్కి లాగుతూ.. మనల్ని ఓ మాయా ప్రపంచంలోని నిష్క్రియా స్థితికి తీసుకెళ్లే ఓ మత్తుమందు. దీని విషయంలో మనం అప్రమత్తంగా, అనుక్షణం జాగరూకతతో ఉండాలి. పనిని విభజించుకోవాలి. ఓ టైం టేబుల్ వేసుకుని ఆ సమయానికి ఎట్టి పరిస్థితుల్లో ఆ పనిని పూర్తిచేసి తీరాలి. ఒక సామెత చెప్పినట్టు.. రేపు మనం చేయాలనుకుంటున్న పనిని ఈ రోజే.. ఈ రోజు ఏం చేయాల్సి ఉందో దానిని ఇప్పుడే చేసెయ్యాలి. పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా యోగా లేదా వ్యాయామం, ధ్యానం చేయాలి. -
నేస్తమా పుస్తకం విందామా!
పుస్తకం హస్తభూషణం అన్నారు.చేతిలో ఉండాల్సిన పుస్తకం ‘ఆడియో బుక్స్’ రూపంలో చెవికి చేరువవుతోంది.వ్యక్తిత్వ వికాసం నుంచి కాల్పనిక సాహిత్యం వరకు పుస్తకాలను ‘ఆడియో బుక్స్’ రూపంలో వినడానికి యూత్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉన్న బెంగళూరుకు చెందిన విరజ, పుస్తకాల విలువ గురించి తెలుసుకొని వాటిపై ప్రేమ పెంచుకున్న భోపాల్‌కు చెందిన చైత్రకు పుస్తకాలకు చేరువ కావడానికి ఒకప్పుడు టైమ్ దొరికేది కాదు. ఇప్పుడు మాత్రం వీరిద్దరికి మాత్రమే కాదు యువతరంలోని ఎంతోమందికి పుస్తకాలు దగ్గర కావడానికి ‘టైమ్’ అనేది సమస్య కావడం లేదు. దీనికి కారణం... ఆడియో బుక్స్.మిలీనియల్స్, జెన్‌జెడ్ జెనరేషన్‌కు ‘ఆడియో బుక్స్’ హాట్ ఫేవరెట్‌గా మారాయి.‘ఒక పుస్తకం చదవడానికి రకరకాల కారణాల వల్ల నెల రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆడియో బుక్స్ వారానికి ఒకటి వినగలుగుతున్నాను. వినడం పూర్తయిన వెంటనే ఆ పుస్తకానికి సంబంధించిన నోట్స్ రాసుకుంటాను’ అంటుంది విరజ.గూగుల్ ప్లేలో ఆడియో బుక్స్ సెక్షన్ ప్రారంభమైన కొత్తలో యువత అంత దగ్గర కాలేదు. అయితే ఇప్పుడు దృశ్యం మారింది. వారి ప్రధానమైన ఆసక్తులలో ‘గూగుల్ ఆడియో బుక్స్’ కూడా ఒకటి.గూగుల్ ప్లేలో డబ్బు చెల్లించే ఆడియో బుక్స్‌తో పాటు చెల్లించనవసరం లేనివి కూడా ఉన్నాయి.‘ఓకే గూగుల్, హూ ఈజ్ అథర్?’ ‘ఓకే గూగుల్, స్టాప్ ప్లేయింగ్ ఇన్ 20 మినిట్స్’...ఇలాంటి కమాండ్స్ గూగుల్ అసిస్టెంట్‌కు ఇవ్వవచ్చు. గ్లోబల్ ఆడియో బుక్స్ మార్కెట్ లీడర్‌గా ఉన్న ‘ఆడిబుల్’ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించిన తరువాత ఆడియో బుక్స్‌కు ఊపు వచ్చింది. రకరకాల వయసుల వారిని దృష్టిలో పెట్టుకొని ‘ఆడిబుల్ ఇండియా’లో వేలాది ఆడియో బుక్స్‌ను రొమాన్స్, థ్రిల్లర్, ఆధ్మాత్మికం, హారర్, డ్రామా జానర్లలో తీసుకువచ్చారు.ఇంగ్లిష్తో సహా హిందీ, మరాఠీ, ఉర్దూ, బెంగాలీ... మొదలైన భాషలలో ఆడియో బుక్స్ ఉన్నాయి.‘ఆడియో బుక్స్ సక్సెస్ కావడానికి కారణం మన మూలాల్లోనే ఉంది. చిన్నప్పుడు కథలను వినేవాళ్లం’ అంటుంది ముంబైకి చెందిన స్మిత. ఒక పుస్తకం విజయాన్ని అంచనా వేసే ప్రమాణాలలో ఆడియో బుక్స్ కూడా చేరాయి. మాతృభాషలో పుస్తకాలు చదవడానికి ఇబ్బంది పడే యువతరానికి ఆడియో బుక్స్ ఆత్మీయనేస్తాలయ్యాయి.‘పాడ్‌కాస్ట్‌తో పాటు ఆడియో బుక్స్‌కు ఆదరణ పెరిగింది’ అంటున్నాడు ‘వన్ బై టు’ మీడియా కో–ఫౌండర్ రాజేష్ తాహిల్.ఫిక్షన్, రొమాన్స్ జానర్స్ కోసం యాపిల్ బుక్ ‘మాడిసన్’ ‘జాక్సన్’ ‘హెలెన్’ అనే డిజిటల్ నేరేటర్లను క్రియేట్ చేసింది.యూఎస్, యూరోపియన్ దేశాలలో పబ్లిషర్స్‌కు ఆడియో కంటెంట్ క్రియేట్ చేయడానికి సొంతంగా స్టూడియోలు ఉన్నాయి. మన దేశంలో అలాంటి పరిస్థితి వచ్చినట్లు లేదు. ఒక ఆడియో బుక్కు కనీసం లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా.‘స్పాటిఫై’ అనగానే గుర్తుకు వచ్చేది సంగీతం. ఆడియో బుక్స్ ఆదరణను పసిగట్టిన ఈ డిజిటల్ మ్యూజిక్ సర్వీస్ యూఎస్‌తో పాటు నాలుగు దేశాల్లో ఆడియో బుక్ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. మూడు లక్షల ఆడియో బుక్స్‌ను తీసుకువచ్చిన ‘స్పాటిఫై’ యూజర్ల కోసం ‘ఆడియో కామెంట్’ తీసుకురానుంది.ఆడియో బుక్ ఇండస్ట్రీ ఊపందుకోవడాన్ని గమనించిన పబ్లిషర్లు రానున్న రోజుల్లో ఆడియో బుక్స్ స్పేస్‌ను పెంచాలనుకుంటున్నారు. క్లాసిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.‘గతంతో పోల్చితే ఆడియో బుక్స్ వినడానికి వెచ్చిస్తున్న టైమ్ పెరిగింది’ అంటున్నాడు ‘స్టోరీ టెల్ ఇండియా’ కంట్రీ మేనేజర్ యోగేష్ దశరథ్.ఆడియో బుక్స్ యూత్‌ను ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం ప్రయాణాలలో, బారెడు క్యూలలో నిలబడిన సందర్భాలలో కూడా వాటిని వినే అవకాశం ఉండడం. కొందరైతే వ్యాయామాలు చేస్తూ కూడా ఆడియో బుక్స్ వింటున్నారు.‘ఆడియో బుక్స్ వల్ల పుస్తకం చదివే దృశ్యం అదృశ్యం కానుందా?’ అనే ప్రశ్నకు ఇంజనీరింగ్ స్టూడెంట్ సౌమ్య మాటల్లో జవాబు దొరుకుతుంది.‘పుస్తకం చదవడం అంటేనే నాకు ఇష్టం. అంతమాత్రాన ఆడియో బుక్స్‌కు దూరం కాలేదు. సమయ సందర్భాలను బట్టి చదవాలా, వినాలా అనేదాన్ని ఎంచుకుంటాను’ అంటుంది సౌమ్య. ఆడియో బుక్ రీడ్ బై సెలబ్రిటీ ఆడియో బుక్స్ విజయంలో పుస్తకంలోని కంటెంట్‌తో పాటు నేరేటర్ ప్రతిభ కూడా ఆధారపడి ఉంటుంది. వినే కొద్దీ వినాలనుకునే గొంతులు ఆడియో బుక్స్ విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.‘ఆడియో బుక్ రీడ్బై సెలబ్రిటీస్’ ధోరణి మన దేశంలోనూ పెరగనుంది. ఆడియో బుక్ రీడింగ్‌లో బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ మంచి పేరు తెచ్చుకుంది. వుడీ ఎలెన్ ‘కౌంట్ డ్రాకులా’తో పాటు ఎన్నో పుస్తకాలు ఆమె స్వరంలో యువత మంత్రముగ్ధులై విన్నారు. -
అవి సాధారణ మరణాలే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఎంఐసీయూలో చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమించడం వల్లే శుక్రవారం ఆరుగురు మృతి చెందారని సూపరింటెండెంట్ సిద్ధానాయక్, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ రామచంద్రరావు స్పష్టం చేశారు. అయితే ఆక్సిజన్ అందకపోవడం, వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందారంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేయడం సరికాదన్నారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా నిరంతరంగా ఉంటుందని తెలిపారు. గూడూరుకు చెందిన కె.సాంబయ్య (55), నెల్లూరుకు చెందిన ఎస్.లలిత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో, విపరీతంగా మద్యం అలవాటున్న నరుకూరుకు చెందిన పి.రమేష్ (42), నెల్లూరులోని శ్రీనివాసనగర్‌కు చెందిన ఎన్.చలపతి (52) క్లోమ గ్రంధి పాడవ్వడంతో మృతి చెందారని తెలిపారు. నెల్లూరులోని వేదాయపాళెంకు చెందిన సుందరం (70), నెల్లూరులోని పొర్లుకట్టకు చెందిన కె.చెంచమ్మ (70) గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ కోలుకోలేక చనిపోయారన్నారు. ఐదారు రోజులుగా చికిత్స పొందుతున్న వీరంతా శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేర్వేరు సమయాల్లో మృతి చెందారనే విషయాన్ని గమనించాలన్నారు. ఆరుగురు కూడా దీర్ఘకాలిక రోగులని, ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి పెంచలయ్య విచారణ చేపట్టారు. శనివారం ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి వైద్య సేవలు బాగున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ కూడా ఎంఐసీయూ వార్డును పరిశీలించారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడారు. ఆక్సిజన్ ట్యాంకును, పైపులను టెక్నీషియన్ ద్వారా పరిశీలించారు. ఆస్పత్రి సేవల్లో ఎక్కడా లోపం లేదని చెప్పారు. -
విచిత్రమైన అలవాటు! తన జుట్టును తానే తింటున్న బాలిక!
చాలమందికి పలు రకాలు విచిత్రమైన హ్యబిట్స్ ఉంటాయి. వాటిలో కొన్ని మంచివి, చెడ్డవి కూడా ఉంటాయి. మన అలవాట్లును మన పెద్దలు లేదా తల్లిదండ్రులు గమనించి అవి మంచివో లేక చెడ్డవో వివరించి చెప్పకపోతే ఇక్కడ ఉన్న బాలిక మాదిరి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనక తప్పదు. వివరాల్లోకెళ్తే...చైనాకు చెందిన 14 ఏళ్ల బాలికకు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. అదేంటంటే తన జుట్టును తానే తింటుంది. ఐతే దీన్ని ఆమె ఇంట్లో వాళ్లు గమనించకపోవడంతో అదే పనిగా చాలా ఏళ్ల నుంచి తన జుట్టును తానే తింటోంది. దీంతో గత కొద్ది రోజులుగా ఆమె ఆహారం తీసుకోలేనంత దారుణమైన స్థితికి వచ్చేసి నీరసంగా తయారైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు ఆమె కుటుంబసభ్యులు. అక్కడ జరిపిన వైద్య పరీక్షల్లో...ఆమె కడుపు మొత్తం ఏకంగా మూడు కిలోల జుట్టుతో నిండిపోయిందని, అందువల్లే ఆమె ఆహారం తీసుకోలేకపోతుందని అన్నారు. ఆ తర్వాత ఆ బాలికకు వైద్యులు సుమారు రెండు గంటలపాటు సుదీర్ఘ శస్త్ర చికిత్స చేసి ఆ ముడు కిలోల హెయిర్ బాల్(ఉండలుగా ఉన్న జుట్టు)ని తీసేశారు. ఈ మేరకు జియాన్ డాక్సింగ్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ షిహై మాట్లాడుతూ...ఆ బాలిక ఆహారం తీసుకులేని పరిస్థితి ఏర్పడటంతోనే మా వద్దకు వచ్చింది. అసలు ఆమె పొట్టలో ఆహారం పట్టేందుకు అవకాశం లేకుండా జుట్లుతో నిండిపోయిందని, ఆఖరికి ఆమె ఆహార ప్రేగు కూడా మూసుకుపోయిందని చెప్పారు. ఆ బాలిక తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా దూరంగా ఉండటంతో ఆమె అమ్మమ్మ తాతయ్యల వద్ద పెరుగుతుందన్నారు. దీంతో వారు ఆమె విచిత్రమైన అలవాటుని గుర్తించలేకపోయారు. ఆ బాలిక పికా అనే విచిత్రమైన డిజార్డర్‌తో బాధపడుతోందని చెప్పారు. ఇలాంటి సమస్యతో బాధపడే చిన్నారులు, కాగితాలు, సుద్ధ ముక్కలు వంటి తినకూడని వాటిని ఆహారంగా తింటుంటారని చెబుతున్నారు. అంతేగాదు తమ జుట్టును తామే తినడాన్ని రాంపూజ్ సిండ్రోమ్‌గా వ్యవహిరస్తారని చెప్పారు. ఇది ట్రైకోఫాగియా అనే మానసిక రుగ్మత వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆ చిన్నారి కూడా తన తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్ల చాల ఏళ్లుగా మానసిక సమస్యలతో బాధపడి ఉండవచ్చని, అందువల్లే ఆమె ఈ విచిత్రమైన అలవాటుకి అడిక్ట్ అయినట్లు వైద్యుడు షిహై చెప్పారు. (చదవండి: డార్విన్ సంతకంతో కూడిన లేఖ వేలంలో ఎంత పలుకుతోందంటే...) -
తమ్ముడి నిర్వాకం... సొంత అక్కపైనే అఘాయిత్యం
18-year-old youth shoots sister: చెడు అలవాట్లకు బానిసైన వాళ్లను దారిలో పెట్టెందుకు కుటుంబ సభ్యులు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఒక్కసారి కౌన్సిలింగ్‌లకు పంపించి మరీ సరైన మార్గంలో పెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తారు. అయితే వాళ్లు సహకరిస్తేనే ఏదైన చేయగలం. మరికొంత మందికి అవి చెవికి ఎక్కవు, పైగా కక్ష పెంచుకుని ఎంతటి దుర్మార్గానికైన ఒడికట్టేందుకు ప్రయత్నిస్తారు. అచ్చం అలాంటి ఘటనే గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో హర్ధోయి ప్రాంతంలోని 32 ఏళ్ల వివాహిత సోదరుడు తాగుడికి బానిసై అందర్నీ దూషించడం వంటి పనులు చేస్తుంటాడు. దీంతో విసిగిపోయిన ఆమె తన తమ్ముడుని తాగడం మానేయమని హితవు చెప్పింది. ఇలా అందర్నీ దూషించడం సరికాదని చెప్పేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అసలే తాగి ఉన్నాడమే ఆ మైకంలో ముందు వెనుక చూడకుండా పిస్టల్ తీసుకుని తన అక్కనే అతి దారుణంగా కాల్చి చంపి అక్కడ నుంచి పారిపోయాడు. దీంతో బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులకు సంఘటన స్థలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్నారు. ఈ మేరకు నిందుతుడిని షహబెరి ప్రాంతంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ యోగేంద్ర సింగ్ పేర్కొన్నారు. -
నలుగురిలో ఒకరికి స్మార్ట్‌ఫోన్ వ్యసనం!
లండన్: ప్రపంచంలో ప్రతి నలుగురు యువతీయువకుల్లో ఒక్కరు స్మార్ట్‌ఫోన్ వ్యసనానికి అలవాటు పడ్డారని లండన్‌లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ అందుబాటులో లేకపోతే వీరు ఆందోళనకు గురవుతున్నారని, నిరుత్సాహానికి గురవుతున్నారని వీరు అంటున్నారు. స్మార్ట్ఫోన్లు విస్తృత వ్యాప్తిలోకి వచ్చిన 2011 సంవత్సరం నుంచి జరిగిన వేర్వేరు అధ్యయనాలు పిల్లలు, యువతీయువకుల్లో 10 – 30 శాతం మంది వీటిని తగువిధంగా వాడటం లేదని ఇప్పటికే ఒక విశ్లేషణ ఉంది. ఇదే లెక్కన చూస్తే వీరిలో సగటున 23 శాతం మంది సమస్యాత్మక స్మార్ట్‌ఫోన్ వినియోగం చేస్తున్నారని శాస్త్రవేత్తలు గుర్తించారు. స్మార్ట్‌ఫోన్ వ్యసనానికి బానిసలు కావడం వల్ల మానసిక సమస్యల బారిన పడుతున్నారని తేల్చారు. -
సెల్ఫీ దిగడం మానేయండి! పేలకు చెక్ పెట్టండి!
సాక్షి, న్యూఢిల్లీ: పేలు.. వీటితో బాధపడినవారు కనీసం ఇంటికొక్కరైనా ఉంటారు. ఆడపిల్లలకైతే ఈ బాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఇప్పటికీ మీరు పేల సమస్యతో బాధపడుతుంటే ఓసారి మీ అలవాట్లను చెక్ చేసుకోండి..! బహుశా మీకు సెల్ఫీ దిగే అలవాటు ఎక్కువగా ఉందేమో చూసుకోండి. ఎందుకంటే తలలో పేలు పెరగడానికి సెల్ఫీ దిగడానికి చాలా దగ్గర సంబంధం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ‘సెల్ఫీలంటే ఈ మధ్య పుట్టుకొచ్చిన పిచ్చి. కానీ పేలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా?’ అనే అడగాలనుకుంటున్నారు కదూ? నిజమే.. అయితే తలలో పేలు పెరగడానికి ఎన్నో కారణాలున్నా.. సెల్ఫీ కూడా ఓ కారణమని చెబుతున్నారు. సెల్ఫీలు దిగే అలవాటు ఉన్నవారు స్నేహితులతో కలసి తలలు ఆనించుకుంటూ దిగుతారు. ఇటువంటప్పుడు ఒకరి తలలోని పేలు మరొకరి తలలోకి సులభంగా చేరిపోతాయట. అంతేకాదు.. చెవిదగ్గర పెట్టుకునే స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా పేలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పుడు లాజిక్ సరిపోయిందా! -
పిల్లలు గోళ్లు కొరుకుతూనే ఉన్నారా?
సెల్ఫ్ చెక్ పిల్లలకు నోట్లో వేలు వేసుకోవడం, గోళ్లు కొరకడం సులభంగా అలవాటవుతాయి. వాటిని మాన్పించడానికి తల్లి సహనాన్ని అరువు తెచ్చుకోవలసిందే. ఇలాంటప్పుడు ఏం చేస్తారు? 1. గోళ్లు కొరకడం లేదా నోట్లో వేలు వేసుకోవడం అనేది పైకి కనిపించే లక్షణమేనని, ఇందుకు పిల్లలు మానసిక ఘర్షణకు లోనుకావడం కూడా కారణం కావచ్చని ఆలోచిస్తారు. ఎ. అవును బి. కాదు 2. స్కూలు, హోమ్‌వర్క్ లేదా ఇతర పిల్లలతో ఆడుకోవడంలో సరిగా కలవలేక పోవడం... ఇలా ఏ విషయంలో ఆందోళన పడుతున్నారో గమనించి దానిని పరిష్కరిస్తారు. ఎ. అవును బి. కాదు 3. గోళ్లు కొరకవద్దని, నోట్లో వేలు వేయకూడదని ఆంక్షలు పెడితే అలవాటు మానలేరని, పైగా మరింత మొండిగా పంతాన్ని నెగ్గించుకోవాలనుకుంటారని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 4. వేళ్ల మీద కొట్టడం వల్ల ఆ నిమిషంలో ఏడుస్తారు, ఆ బాధ నుంచి సాంత్వన పొందడానికి తిరిగి ఆ అలవాటునే ఆశ్రయిస్తారు. ఎ. అవును బి. కాదు 5. గోళ్లలో ఇన్ఫెక్షన్ చేరుతుందని, నోట్లో పెట్టుకున్నప్పుడు అది కడుపులోకి చేరితే అనారోగ్యమని జాగ్రత్త చెప్పాలి. ఎ. అవును బి. కాదు 6. నోట్లో వేలు వేసుకుంటే నీ చేతితో ఏదైనా పెడితే నీ ఫ్రెండ్స్ తినరు, అప్పుడు నువ్వు ఎంత బాధపడతావో ఆలోచించమని చెప్తే ఈ అలవాటుని మానడానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 7. ఏమీ తోచనప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారు. వాళ్లను ఆటలు లేదా ఏదో ఒక యాక్టివిటీలో నిమగ్నమయ్యేటట్లు చూస్తే తమకు తెలియకుండానే మానేస్తారు. ఎ. అవును బి. కాదు 8. ‘ఒక గంట సేపు గోళ్లు కొరకకుండా ఉండి ఆ తర్వాత మాత్రమే ఈ చాక్లెట్ తినాలి’ అని సరదాగా కండిషన్ పెడితే తమ మీద తాము కంట్రోల్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే పిల్లల పెంపకంలో వాళ్ల సైకాలజీని గమనించి జాగ్రత్తలు తీసుకోవడం మీకు తెలుసు. ‘బి’లు ఎక్కువైతే పిల్లలు చేసే పనులకు దారి తీస్తున్న కారణాలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. -
పొగ మానేయాలనుకుంటున్నారా?
31 మేలు 31 మే వరల్డ్ నో టొబాకో డే పొగాకు నమలడం, పొగతాగడం ఎంత హానికరమోఅందరికీ తెలియజేయడం కోసం డబ్ల్యూహెచ్ఓ ఎంచుకున్న రోజు. పొగాకు వ్యసనాన్ని మానేయాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉన్నా ఈ అలవాటు మానలేకపోతున్నారు. వీళ్లకు సహాయం చేద్దామని ‘సాక్షి’ ఈ కొన్ని మేలు మార్గాలు చూపిస్తోంది. మే 31న పొగాకు అలవాటును మానేసి ఇతరులకు మీరు స్ఫూర్తిదాయకంగా ఉంటారని ఆశిస్తున్నాం. ఈ మేళ్లు ఎంతోమందికి మైలురాళ్లు కావాలి. ‘ముప్ఫయి రోజుల్లో...’ అనేది చాలా జనాకర్షణ కలిగిన అంశం. ముప్ఫయి రోజుల్లో ఆంగ్ల భాష, ముప్ఫయి రోజుల్లో కరాటే... ఇలా. దాదాపు నెల రోజుల తర్వాత... సరిగ్గా ఈ నెల 31న ‘యాంటీ టొబాకో డే’. పొగాకు వల్ల, పొగతాగడం వల్ల కలిగే అనర్థాలు ఇప్పటికే అందరికీ తెలిసినవే. కానీ తెలిసి కూడా మానలేకపోవడమే సిగరెట్ బలం... దాన్ని తాగేవారి బలహీనత. దీన్ని అధిగమించడానికీ మార్గాలున్నాయి. ఈ నెల రోజుల్లో పొగతాగడం మానేయడానికి అనేక మంది నిపుణులు సూచించిన కొన్ని మార్గాలను మీకు అందిస్తున్నాం. ఈ నెల 31న వచ్చే యాంటీ టొబాకో డే నాటికి మీరు పొగ మానేస్తారనే లక్ష్యంతో... మీకు మేము వినమ్రంగా అందిస్తున్న కథనం ఇది. పొగాకులో దాదాపు నాలుగు వేలకు పైగా హానికర రసాయనాలు ఉంటాయి. వాటిలోని ఆక్సిడెంట్స్ వల్ల వయసు పైబడిన కొద్దీ దుష్ప్రభావాలు ఎదురవు తుంటాయి. పొగలో ఉండే కార్సినోజెన్స్ వల్ల క్యాన్సర్స్ కూడా రావచ్చు. 1. ఫ్రెండ్స్ సిగరెట్ తాగుతున్నది చూసి ఎడతెరిపి లేకుండా దగ్గు వచ్చినా సరే, స్నేహితుల ముందు చిన్నబోకూడదని పంతంపట్టి మొదలుపెడతారు. 2 భార్యాపిల్లలు ‘ఎప్పుడు మానేస్తారు’ అని ఎంతగా బతిమిలాడుతున్నా అదేపనిగా కొనసాగిస్తారు. 3.ఆస్తమా లేదా ఇతర ఊపిరితిత్తుల సమస్య వచ్చినప్పుడు మానేద్దామనుకొని మళ్లీ ప్రారంభిస్తారు. 4. కానీ తప్పక మానేయడానికీ 4వ తేదీ నుంచి ప్రయత్నం చేయండి. ఆయా సూచనలు పాటించండి. ఆల్ ద బెస్ట్! 5.ముందుగా క్యాలెండర్లో సిగరెట్/పొగాకు మానాల్సిన రోజును మార్క్ చేసుకొని, అది నిత్యం మీకు కనిపిస్తుండేలా అమర్చుకోండి. 6.సిగరెట్/పొగాకుకు పురిగొల్పుతున్న అంశాల జాబితాను రాయండి. ఈ జాబితాను పూర్తి చిత్తశుద్ధితో రాయాలి. జాబితాలోని అంశాలను సమీక్షించుకుంటూ... ఆ సందర్భాలలో పొగతాగకుండా ఎందుకు ఉండలేరో ఆలోచించుకోండి. 7.భార్య, పిల్లలు, స్నేహితులు, బంధువుల నుంచి మీ పొగతాగే అలవాటు గురించి ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. మీ అలవాటు వల్ల వారు పడ్డ మనోవేదన, ఇక్కట్లు, కష్టాలను ఆలోచించండి. మీ అలవాటుతో వారిని బాధపెట్టారని పదే పదే గుర్తుతెచ్చుకోండి. 8.మంచి మూడ్‌లో ఉన్నప్పుడే సిగరెట్‌ను వదిలేయండి. ఇలా మంచిమూడ్‌లో ఉన్నప్పుడు వదిలేస్తే... ఆ అలవాటు మళ్లీ దరిదాపుల్లోకి రాదు. ఎక్కువ మందిలో ఇది నిరూపితమైందని అధ్యయనాలు చెబుతున్నాయి. 9.మీరు సిగరెట్ మానేసిన విషయం మీ భార్యకు, స్నేహితులకు, పిల్లలకు, మీ కొలీగ్స్‌కు చెప్పండి. బహిరంగంగా ఇలా ప్రకటించాక వారి ముందు మళ్లీ సిగరెట్ తాగాలంటే బిడియంగా ఉంటుంది. ఒకవేళ తీసినా పిల్లలు నేరుగా ప్రశ్నిస్తారేమోనని సిగ్గనిపిస్తుంది. 10.సిగరెట్ తాగాలనిపించినప్పుడు పంటికింద నమలడానికి ఆరోగ్యకరమైన పదార్థాలు... అంటే పల్లీలు, నట్స్ వంటివి అందుబాటులో పెట్టుకోండి. అవి మీ బరువును పెంచుతాయనుకుంటే చిన్న కప్పు గ్రీన్ టీ తాగండి. 11.మీరు సిగరెట్ బయటకు తీయగానే ముఖం ముడుచుకొని పక్కకు వెళ్లేవారినీ, మీరు సిగరెట్ తాగి రాగానే ఆ వాసన సోకిన వెంటనే ముఖం చిట్లించుకునే వారిని గుర్తుకు తెచ్చుకోండి. ఇంతటి అసహ్యాన్ని పెంచడం అవసరమా?... ఆలోచించండి. 12.మీ పనిలో బ్రేక్ వచ్చినప్పుడల్లా సిగరెట్‌కు వెళ్లడానికి బదులు కంప్యూటర్గేమ్లో నిమగ్నం కండి. ఆ తర్వాత మళ్లీ మీ పని మొదలుపెట్టేయండి. ఇంక సిగరెట్ తాగడానికి దొరికే బ్రేక్ ఎక్కడ? మీ పనిలో బ్రేక్ పడే అవకాశమెక్కడ? 13.సిగరెట్ తాగాలనిపించినప్పుడల్లా టెన్నిస్, స్క్వాష్ ఆటలు ఆడుతున్నట్లుగా ఊహించుకోండి. మర్నాడు ఆడాలని నిశ్చయించుకోండి. అందుకు ఊపిరితిత్తులకు మరింత శక్తి కావాలి కదా. సిగరెట్‌తో వాటిని కోల్పోతారన్న సంగతి గుర్తు తెచ్చుకోండి. 14.ఎప్పుడూ నో–స్మోకింగ్ జోన్లో ఉండటానికి ప్రయత్నించండి. దగ్గర సిగరెట్లు ఉంచుకోకండి. తపన (క్రేవింగ్) పుట్టినప్పుడు సిగరెట్ కొనడానికి బయటకు వెళ్తారు. చాలా సందర్భాల్లో బయటికెళ్లే సమయం లేక పొగతాగకుండా ఉండకతప్పని పరిస్థితి వస్తుంది. 15.స్మోకింగ్‌తో వచ్చే అనారోగ్యాలను జాబితా రాయండి. దాని అనేక కాపీలు తీయండి. ఇంట్లో అన్ని గదుల్లోనూ మీకు ప్రస్ఫుటంగా కనిపించేలా, మీరు నడయాడే ప్రతి చోటా అతికించండి. స్మోకింగ్‌ను కొనసాగిస్తే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేరని అర్థమవుతుంది. 16.మీరు రెగ్యులర్‌గా తీసుకునే పాన్–షాప్ వైపునకు కాకుండా... వేరే దారుల్లో ఆఫీసుకు వెళ్లండి. అదే దారిలో వెళ్తే కాళ్లు అక్కడ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కొత్త మార్గాల్లో ఎక్కడ పాన్–షాపు ఉంటుందో తెలియదు కాబట్టి అంత తేలిగ్గా మీకు సిగరెట్ దొరకదు. 17.గతంలో మీరు నిర్వహించిన అతి కష్టమైన, టాస్క్‌లను, సులువుగా పూర్తి చేసిన వ్యవహారాలను గుర్తు తెచ్చుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని, మనోనిబ్బరాన్ని తలచుకోండి. అంత కష్టమైనవే చేశారు. ఈ పొగాకూ / సిగరెట్లు మానేయడం అనగా ఎంత? 18.సిగరెట్ మానేశాక ఇంట్లో వాళ్ల ఫీలింగ్ తెలుసుకోండి. ఆ ఫీడ్‌బ్యాక్ సిగరెట్‌కు దూరంగా ఉంచుతుంది. అగ్గిపెట్టె, లైటర్, యాష్‌ట్రే, సిగరెట్ హోల్డర్ వంటివేవీ దగ్గర ఉంచుకోకండి. అవి కళ్ల ముందు ఉంటే... మనసు సిగరెట్ మీదకు మళ్లుతుంది. 19.మీ ఫ్రెండ్స్‌లో డాక్టర్స్, పల్మనాలజిస్ట్స్, హెల్త్ కేర్ ఇండస్ట్రీ వారు ఉంటే తరచూ వారినే కలుస్తూ సిగరెట్ నుంచి వచ్చే అనర్థాలు, ఆరోగ్యానికి ముప్పుల గురించి చర్చిస్తూ ఉండండి. తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. 20.సిగరెట్ మానే ప్రయత్నంలో ఒకసారి ఫెయిలైతే మరోసారి ప్రయత్నించండి. పదో ప్రయత్నంలో విజయం సాధించిన వారు కూడా ఉన్నారు. 21.సిగరెట్ మానేసే ప్రయత్నంలో.. అరెరె... ఈ ఆనందానికి దూరం కావాలా అని బెంగపడకండి. ఎప్పుడు కావాలంటే అప్పడు సిగరెట్ దొరుకుతుంది, తాగగలను. కాకపోతే ఇప్పుడు తాగడం లేదు. అంతే...! అనుకోండి. అప్పుడు తప్పక మానేయగలరు. 22.సిగరెట్ తాగినప్పుడల్లా ఉల్లి, వెల్లుల్లి తిన్నవారి నుంచి వచ్చే వాసనను గుర్తు తెచ్చుకోండి. ఆరోగ్యాన్నిచ్చే వాటిని తినే మీటింగ్‌కు వెళ్లాలంటేనే వెనకాడుతాం. అనారోగ్యకరమైన పొగాకు, సిగరెట్‌కు, ఆ కంపునకు ఆమోదం ఉంటుందా? ఆలోచించండి. 23.సిగరెట్ తాగాలనే కోరిక పుట్టినప్పుడల్లా మీరు అమితంగా గౌరవించే పెద్దల(సిగరెట్ తాగి వెళ్లలేనివారి) దగ్గరకు వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. అలా సిగరెట్‌కూ, సిగరెట్‌కూ మధ్య వ్యవధి పెరుగుతుంది. సిగరెట్ అలవాటు దూరం అవుతుంది. 24.సిగరెట్ మానడానికి ఈ–సిగరెట్‌ను ఆశ్రయించదలచుకున్నారా? వద్దనే వద్దు. పొగతాగడం మానేయాలనుకుంటే పూర్తిగా మానేయండి. ఈ ప్రత్యామ్నాయం సరికాదు. ఈ–సిగరెట్ సైతం ఆరోగ్యానికి హాని చేసేదే అని గుర్తుంచుకోండి. 25.తరచూ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంచండి. ఇందులో భాగంగా క్యాన్సర్ హాస్పిటల్స్‌ను, క్యాన్సర్ విభాగాలను సందర్శించండి. అక్కడ కనిపించే దృశ్యాలు మీ మనసు మార్చి, మీ దురలవాటును తప్పించే అవకాశం ఎక్కువ. 26.ఎడతెరిపి లేనంత పనిలో నిమగ్నం అయిపోండి. ఇది ఒత్తిడి లేని పనిౖ అయివుండాలి. మీరు పనిలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు అసలు సిగరెట్ తహతహ (క్రేవింగ్) కలగని తీరును గుర్తించండి. 27.నికోటిన్ తపనను తగ్గించే చ్యూయింగ్ గమ్స్, ప్యాచ్‌ల వంటి వాటిపై ఆధారపడండి. అవి సిగరెట్ తాగాలనే తహతహను తగ్గించి క్రమంగా ఆ అలవాటు నుంచి దూరం చేస్తాయి. 28.ధూమపానం మానడానికి వ్యాయామం మంచి మార్గం. అంత కష్టపడి వ్యాయామం చేసి సంపాదించుకున్న ఆరోగ్యాన్ని, సౌష్ఠవాన్ని కేవలం సిగరెట్‌తో బుగ్గి చేసుకోవడం సరికాదనే భావన పెరుగుతుంది. 29.బోర్ అనిపించినప్పుడు దాన్ని అధిగమించడానికి ఇతరత్రా మంచి హాబీలను పెంపొందించుకోండి. బోర్ అనిపించినప్పుడు సిగరెట్ తాగడం వల్ల బోర్డమ్ మరింత పెరుగుతుందని గుర్తుంచుకోండి. 30.ఎవరినైనా ఆపద నుంచి రక్షించడానికి మీ బలాన్ని ప్రదర్శించాల్సి వచ్చిన సందర్భాన్ని గుర్తుతెచ్చుకోండి. మీరు సిగరెట్ తాగుతూ ఉంటే అదే స్టామినాను ప్రదర్శించడం సాధ్యపడేది కాదన్న విషయాన్ని గుర్తించండి. పై మార్గాలన్నీ విఫలం అయితే కౌన్సెలర్ వద్ద సలహా తీసుకోండి. సపోర్ట్ గ్రూప్‌ల సహాయం తీసుకోండి. చివరగా మీ డాక్టర్ / సైకియాట్రిస్ట్‌ను సంప్రదించండి. 31.వరల్డ్ నో టొబాకో డే... కొన్ని అనర్థాలు లంగ్‌క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్, అనేక రకాల లుకేమియా, గుండెజబ్బులు, హైబీపీ, డయాబెటిస్ ముప్పు, డిప్రెషన్, అలై్జమర్స్ డిసీజ్, సంతానలేమి, పుంసత్వం తగ్గడం, ఎముకలు పలచబారడం, నాలుకకు రుచి తెలికయకపోవడం, ముక్కుకు వాసనలు తెలియకపోవడం... మొదలైనవి. ఆలోచించండి ఎలా మొదలైనా... ఇలా వదిలేయచ్చు! మీరు సిగరెట్ తాగే చోట మీరెప్పుడూ గౌరవించే వారి ఫొటో పెట్టుకోండి. ఎంతైనా అక్కడ సిగరెట్ కాల్చడానికి మీ మనసు అంగీకరించదు.మీ పిల్లలకు ముద్దు పెట్టే సమయంలో మీ నుంచి వచ్చే సిగరెట్ కంపు కారణంగా వాళ్లు ముఖం చిట్లించుకోవడం గుర్తు చేసుకోండి. మరోసారి సిగరెట్ జోలికి పోరు.మంచి చేయాలనీ, మంచిని అనుసరించాలని మనం సమాజానికి చెబుతుంటాం. మరి మనం ఏం చేయకూడదన్నది మరొకరు చెప్పడం అవసరమా?ఏదైనా ఒకటి వదిలిపెట్టాలంటే కాశీ దాకా వెళనక్కర్లేదు. సిగరెట్ తాగీ తాగీ ఆరోగ్యం చెడగొట్టుకొని మన ఆత్మీయుడు మనల్ని వీడి వెళ్లిపోతే అతడి జ్ఞాపకార్థం శ్మశానంలోనూ దాన్ని వదిలేస్తే చాలు కదా.టీనేజ్‌లో స్నేహితుడెవరో చేశారని సిగరెట్ తాగడం అవసరమా? ఆ స్నేహితుడు వదిలిపోయినా, ఈ పని వల్ల జీవితాంతం ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడతారు. దీనిని కొనసాగించడం ఎంతవరకు సబబు? పల్మనాలజిస్ట్ ను సంప్రదించండి ప్లానింగ్ ఈ నెల 31న వరల్డ్ నో టొబాకో డే. ఆ తేదీకి దాదాపు నాలుగు వారాల గడువుంది. ఈ నాలుగు వారాల్లో పొతతాగడం మానేయాలనుకున్న వారు వరుసగా ఒక్కోవారంలో వేసుకోవాల్సిన ప్రణాళిక, చేయాల్సిన పని ఇదీ! మొదటివారం సిగరెట్ మానేయాలనే ఉత్సాహం, ఉద్వేగం మొదటివారం ఉంటాయి. తొలి 72 గంటల పాటు నికోటిన్ లోపం వల్ల తహతహ, తపన కలుగుతాయి. కానీ నాలుగు, ఐదో రోజు నుంచి అంతా మామూలవుతుంది. చెమటలు పట్టడం, ఊపిరి అందనట్లుగా అనిపించడం, ఉద్వేగం వల్ల అనర్థాలేమీ ఉండవు. ఈ వారంలో చ్యూయింగ్ గమ్స్, ప్యాచెస్ దగ్గర ఉంచుకోవాలి. అలవాటు వదిలాక మీకు అధికపాళ్లలో ఆక్సిజన్ అందడాన్ని మీరే గమనిస్తుంటారు. రెండో వారం ఇది మొదటివారం అంత గడ్డుగా ఏమీ గడవదు. చాలా రిలాక్స్ అవుతారు. పొగమానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ మీకే కనిపిస్తుంటాయి. మీరు తినే ఆహారం మరింత రుచికరంగా ఉంటుంది. మీకు అనేక పరిమళాలు అందుతుంటాయి. ఇంతకాలం ఏం కోల్పోయారో కొద్దికొద్దిగా మీరు అర్థమయ్యేది ఈ వారంలోనే. మీరు కోల్పోయిన వాటిని ఆస్వాదిస్తూ ఈ వారం గడుస్తుండటం వల్ల ఇది తేలిగ్గా గడవడం మీకే తెలుస్తుంది. హ్యాపీగా అనిపిస్తుంది. మూడో వారం ఈ వారానికి మీ ఒళ్లంతా తేలిగ్గానూ, మీ ఊపిరితిత్తులు మంచి గాలితో నిండుగానూ ఉన్న అనుభూతిని మీరు అనుభవిస్తుంటారు. ఈ వారంలో కాస్త కెఫిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి. ఎందుకంటే అవి మళ్లీ సిగరెట్‌ను ప్రేరేపించే అవకాశం ఉంది. ఈ వారంలో ఏరోబిక్స్, ధాన్యం మొదలుపెట్టడం మంచిది. ఈ వారంలో మీరు ఒకింత బరువు పెరుగుతారు. కానీ ఆందోళన వద్దు. ఆ పెరిగిన బరువుకు విరుగుడే ఈ వారంలో మీరు చేసే ఏరోబిక్స్. నాలుగో వారం ఈ వారం పొగతాగే రోజులకూ, మానేసిన రోజులకూ తేడాను సమీక్ష చేసుకుంటూ ఉంటే చాలు... అదే మీ సంకల్పాన్ని మరింత దృఢతరం చేస్తుంది. డబ్బు, ఆరోగ్యం, జీవనశైలిలో మీరు అనుభవిస్తున్న తేలికదనం (ఈజ్), ఫిజికల్ ఫిట్నెస్... ఈజీగా గడిచేలా చేస్తాయి. 31 వచ్చిందా? నెల పూర్తయ్యిందా? ఇక మిమ్మల్ని ఎవరూ నియంత్రించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆఫర్ చేసినా మీరే సిగరెట్‌ను తోసిపుచ్చుతారు. – డాక్టర్ కె. శైలజ, కన్సల్టెంట్, పల్మనాలజిస్ట్, మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్ -
తుపాకీతో కాల్చుకుని గిరిజనుడు ఆత్మహత్య
బుట్టాయగూడెం : మండలంలోని చింతలగూడెంలో ఒక గిరిజన యువకుడు ఆదివారం నాటు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. చింతలగూడెంకు చెందిన కొండరెడ్డి యువకుడు మిర్తివాడ సురేంద్రరెడ్డి (28)వ్యవసాయ కూలీ. అతనిని భార్య సుబ్బలక్షి్మ మద్యం మానాలని పోరడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండగ సమయంలో భర్తతో గొడవపడి సుబ్బలక్ష్మి అమ్మపాలెంలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సురేంద్రరెడ్డి ఇంటిలో తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. భార్య కాపురానికి రావడం లేదనే అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని బంధువులు చెబుతున్నారు. సురేంద్రరెడ్డి రాసిన సూసైడ్ నోట్ ఘటనా స్థలంలో దొరికింది. తన చావుకు ఎవరూ కారణం కాదని, తన తల్లిని, అన్నను క్షమించాలని అందులో ఉంది. తన మరణం గురించి పోలీసులకు చెప్పవద్దంటూ రాసి ఉంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సురేంద్ర మృతి తర్వాత నాటు తుపాకీని అతని సోదరుడు రవిరెడ్డి లంకాలపల్లి వెళ్ళే రహదారిలోని ఒక ప్రదేశంలో దాచి ఉంచడంతో దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సురేంద్రరెడ్డి రాసిన సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సురేంద్ర సోదరుడు రవిరెడ్డి ఫిర్యాదు మేరకు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై డి.నరసింçహారావు తెలిపారు. కాగా భర్త మరణ వార్త విన్న సుబ్బలక్ష్మి హుటాహుటిన చింతలగూడెం చేరుకుంది. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఇప్పుడే నేర్పండి
పేరెంటింగ్ అలవాటును మించిన వ్యసనం మరొకటి ఉండదు. అది మంచైనా. చెడైనా సరే జీవితాంతం అలా ఉండిపోతుంది. వృథా కూడా ఒక వ్యసనమే. అందుకే వృథాని కంట్రోల్ చెయ్యడం ఎలాగో పిల్లలకు నేర్పాలి. అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు పని చేస్తుంటే వెంటనే వాటిని ఆపేసే అలవాటు చేయాలి. పెద్దవాళ్లు చేస్తుంటే పిల్లలకు కూడా వస్తుంది, కాని అది అమ్మ పనేనన్నట్లు ఉంటారు చాలామంది పిల్లలు. తమ దృష్టికి వచ్చినప్పుడు పట్టించుకోకుండా వెళ్లకుండా వెంటనే రియాక్ట్ అయ్యేటట్లు చేయాలి. కొంతమంది పిల్లలు వాటర్ ట్యాప్ ఓపెన్ చేసి పని పూర్తయిన తర్వాత సరిగా కట్టకుండా వెళ్లిపోతుంటారు. నీరు సన్నటి ధారగా పోతూనే ఉంటుంది. ఇక్కడ పోయేది నీరు మాత్రమే కాదు, పిల్లల్లో పద్ధతి ప్రకారం ఉండాల్సిన బిహేవియర్ కూడా. ఇటువంటివి చిన్నప్పుడు చిన్నపాటి నిర్లక్ష్యాలుగా కనిపించినప్పటికీ పెద్దయ్యే కొద్దీ నిర్లక్ష్యంగా ఉండడం అనే దురలవాటుకు దారి తీస్తాయి. -
కాఫీ తాగడంపై జన్యు ప్రభావం
స్కాట్లాండ్: మన చుట్టూవున్న వాతావరణం చలి, చలిగా ఉన్నప్పుడు వేడి వేడి కాఫీ తాగాలని అనిపించడం ఎవరికైనా అనుభవమే. అయితే కొందరు తక్కువ తాగుతారు. కొందరు ఎక్కువ కప్పులు తాగుతారు. మరి కొందరు గబ,గబా తాగేస్తారు. ఇంకొందరు అసలే తాగరు. కాఫీ తాగడంలో వ్యక్తికి, వ్యక్తికి మధ్య వ్యత్యాసానికి కారణం ఏమిటీ? మన అలవాట్లా, మన ప్రవర్తనా? ఇదే అంశాన్ని తేల్చుకుందామని ఎడిన్బర్గ్ యూనివర్శిటీకి చెందిన ‘యుషర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ హెల్త్ సెన్సైస్ ఇన్ఫార్మిటిక్స్’కు చెందిన నిపుణులు పరిశోధనలు చేశారు. మానవ డీఎన్ఏలో ఉండే ‘పీడీఎస్‌ఎస్2’ అనే జన్యు రకం మానవులు కాఫీ తాగడాన్ని ప్రభావితం చేస్తోందని, ఈ జన్యువును కలిగిన వారు అది లేనివారికన్నా తక్కువ కప్పుల కాఫీ తాగుతారని పరిశోధనల్లో తేలింది. మరో విధంగా చెప్పాలంటే కాఫీ తాగడాన్ని ఈ జన్యువు నియంత్రిస్తుంది. మన ఆహారపు అలవాట్లు, రుచులకు మనలోని జన్యువులకు ప్రత్యక్ష సంబంధం ఉంటుందని శాస్త్రవేత్తలు ఎప్పుడో కనిపెట్టినప్పటికీ కాఫీ తాగే అలవాటుపై జన్యువుల ప్రభావం ఎలా ఉంటుందో విఫులంగా పరిశోధించడం దాదాపు ఇదే మొదటిసారి. దక్షిణ ఇటలీలోని 370 మంది, ఈశాన్య ఇటలీకి చెందిన 843 మంది కాఫీ తాగే అలవాటున్న వారి డీఎన్ఏలోని జన్యువుల క్రమాన్ని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. పీడీఎస్‌ఎస్ 2 రకం జన్యువు ఉన్నవారు తక్కువ కప్పుల టీ తాగగా ఇది లేని వారు ఎక్కువ కప్పుల టీ తాగుతున్నట్లు తేలింది. నెదర్లాండ్స్‌కు చెందిన 1731 మందిపై కూడా ఈ పరిశోధనలు జరపగా ఒకే రకమైన ఫలితాలు వచ్చాయి. అసలు టీ అనేది తాగడానికి పరిస్థితులు, పరిసరాలు, సంస్కృతి, అలవాటు కారణం అనే విషయం తెల్సిందే. అయితే కాఫీ ఎక్కువ, తక్కువ తాగడానికి మానవ జీర్ణక్రియకున్న ప్రత్యక్ష సంబంధం ఏమిటో తెలుసుకునేందుకు ఈ అంశంలో మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాఫీ తాగే అలవాటు మనుషుల్లో ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుందన్న విషయం తెల్సిందే. అమెరికాలో 65 శాతం మంది ప్రజలు రోజుకు ఒక్క కప్పయిన కాఫీ తాగుతారు. -
ఆ అలవాటు పోవాలంటే...
సందేహం నా వయసు 16. మెచ్యూరై ఎనిమిది నెలలు అవుతోంది. మొదట్లో రెండు నెలలకు ఓసారి పీరియడ్స్ వచ్చినా, ఎక్కువ నొప్పి ఉండేది కాదు. కానీ ఇప్పుడు తీవ్ర కడుపు నొప్పితో నెలకోసారి పీరియడ్ వస్తోంది. అయితే నాకు సంవత్సరం కాలంగా స్లేట్ పెన్సిల్స్ (బలపాలు) తినడం అలవాటైంది. ఎంత ప్రయత్నించినా ఆ అలవాటును మానుకోలేక పోతున్నాను. బలపాలు తినడం వల్లే నొప్పి వస్తోందా? వాటిని తినడం వల్ల నులిపురుగులు కూడా వస్తాయా? ఇంకా ఏమైనా సమస్యలు వస్తాయా? - నీరజ, హనుమకొండ మెచ్యూరైన తరువాత కొందరిలో హార్మోన్స్ సక్రమంగా పనిచెయ్యడానికి సంవత్సరం నుండి రెండు సంవత్సరాల సమయం పట్టవచ్చు. దానివల్ల ఆ సమయంలో పీరియడ్స్ సక్రమంగా ఉండకపోవచ్చు. వేరే సమస్యలు ఏమీ లేనప్పుడు దాని వల్ల ఇబ్బంది ఏమీ లేదు. పీరియడ్స్ సమయంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. అవి విడుదలయ్యే మోతాదును బట్టి గర్భాశయం కండరాలు కుదించుకుని బ్లీడింగ్ బయటకు రావడం వల్ల కొందరిలో కడుపు నొప్పి వస్తుంది. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి నొప్పి తీవ్రత ఉంటుంది. ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంటే, నొప్పి ఉన్న రోజులలో రోజుకు రెండు చొప్పున నొప్పి నివారణ మాత్రలు వాడవచ్చు. నెలకి రెండు రోజులు నొప్పి మాత్రలు వాడడం వల్ల ప్రమాదం ఏమీలేదు. కొందరిలో గర్భాశయంలో గడ్డలు, అండాశయంలో సిస్ట్లు వంటి ఇతర సమస్యలు ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉండవచ్చు. అశ్రద్ధ చేయకుండా ఒకసారి స్కానింగ్ చేయించుకొని, గర్భాశయంలో కాని, అండాశయాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం మంచిది. కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. రక్తం తక్కువ ఉన్నప్పుడు బలపాలు, చాక్‌పీస్‌లు, బియ్యం వంటివి తినాలని అనిపిస్తుంది. కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల, అవి శరీరం లోపల రక్తాన్ని పీల్చుకోవడం వల్ల రక్తం తగ్గి బలపాలు తినాలనిపిస్తుంది. కాబట్టి ఒకసారి రక్తం ఎంత ఉందో complete blood picture (cbp) పరీక్ష చేయించుకొని రక్తం తక్కువ ఉంటే, పెరగడానికి ఆకుకూరలు, పప్పులు, పండ్లు, మాంసాహారంతో పాటు ఐరన్ మాత్రలు వేసుకోవాలి. అలాగే నులి పురుగులకు ఆల్బెండజోల్ మాత్ర ఒక్కటి తీసుకోవచ్చు. రక్తం తక్కువ ఉన్నప్పుడు బలపాలు, చాక్‌పీస్‌లు, బియ్యం వంటివి తినాలని అనిపిస్తుంది. కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల, అవి శరీరం లోపల రక్తాన్ని పీల్చుకోవడం వల్ల రక్తం తగ్గి బలపాలు తినాలనిపిస్తుంది. నా వయసు 24. పెళ్లై ఇంకా సంవత్సరం కాలేదు. అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. దాంతో సేఫ్టీ డేస్‌లోనే కలుస్తున్నాం. అయినా ఏ మూలో భయంగానే ఉంటోంది. ఆ రోజుల్లో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండానే రోజుకు రెండు మూడుసార్లు కలుస్తుంటాం. ట్యాబ్లెట్స్ వాడాలంటే భయంగా ఉంది, ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమోనని. సేఫ్టీ డేస్‌లో కలిస్తే సేఫేనా అన్న విషయాన్ని దయ చేసి చెప్పండి. అలాగే.. కలవడానికి డే టైం, నైట్ టైంలో కూడా ఏమైనా తేడాలుంటాయా తెలపండి. - ఓ సోదరి నెలనెలా క్రమంగా పీరియడ్స్ వచ్చే వారిలో పీరియడ్స్ మొదలైన మొదటిరోజు నుంచి లెక్కపెడితే పదో రోజు నుంచి పదహారో రోజు మధ్యలో అండం విడుదలవుతుంది. ఆ సమయంలో కలయిక జరిగితే, వీర్యకణాలు అండంతో కలిసి గర్భం నిలిచే అవకాశాలు ఉంటాయి. అండం విడుదలైన తర్వాత కేవలం 24 గంటలు మాత్రమే అది చురుగ్గా ఉంటుంది. వీర్యకణాలు 48 గంటల వరకు చురుగ్గా ఉంటాయి. కాబట్టి నెలసరి మొదలైన 9వ రోజు నుంచి 18వ రోజు వరకు గర్భధారణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గర్భం వద్దనుకునే వాళ్లకు ఇది అన్‌సేఫ్ పీరియడ్. ఈ సమయంలో కలవాలంటే కండోమ్స్ జాగ్రత్తగా వాడుకోవాలి. కానీ కండోమ్స్ ఫెయిలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిగతా రోజులలో గర్భం వచ్చే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి వాటిని సేఫ్ పీరియడ్‌గా పరిగణిస్తారు. కానీ పీరియడ్స్ సక్రమంగా రాని వారిలో సేఫ్ పీరియడ్ పద్ధతిని పాటించడానికి ఉండదు. ఎందుకంటే అలాంటి వారిలో అండం ఎప్పుడు విడుదలవుతుందో చెప్పడం కష్టం. సక్రమంగా పీరియడ్స్ వచ్చే వారిలో కూడా కొన్ని సందర్భాల్లో ఏదైనా హార్మోన్ల తేడా వల్ల ఒక నెలలో అండం విడుదల ముందుగా లేదా ఆలస్యంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు సేఫ్ పీరియడ్‌లో కలిసినా కూడా గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. కలవడానికి రాత్రి, పగలు అని సమయం లేదు. వారి వారి వీలునుబట్టి, మూడ్‌ని బట్టి ఎప్పుడైనా ఫర్వాలేదు. టెంపరరీ ఫ్యామిలీ ప్లానింగ్ విధానాలలో ట్యాబ్లెట్లు మాత్రమే కాక ఇతర మార్గాలూ ఉన్నాయి. మీరు డాక్టర్‌ను సంప్రదించి అనువైన పద్ధతిని పాటించండి. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
మంచి నిద్రకోసం చేయాల్సినవి ఇవే...
స్లీప్ కౌన్సెలింగ్ ఈమధ్య నాకు నిద్ర బాగా తగ్గింది. రాత్రివేళ బాగా నిద్రపట్టడం లేదు. మందులు వాడకుండా స్వాభావికంగా నిద్రపట్టే మార్గాలు చెప్పండి. - నవీన్‌కుమార్, కందుకూరు ఇటీవల నాణ్యమైన నిద్ర తగ్గడంతో పాటు నిద్రపోయే వ్యవధి కూడా తగ్గుతోందని అధ్యనాల వల్ల తెలుస్తోంది. అయితే రాత్రి వేళల్లో మీరు నిద్రించే వ్యవధి తగ్గినా, ఆ మర్నాడు పగలంతా ఉల్లాసంగా ఉన్నప్పుడు మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మంచి నిద్ర కావాలనుకునే వాళ్లు ఈ కింది సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అవి... పొగతాగే అలవాటును పూర్తిగా మానేయాలి. బెడ్రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మరీ చల్లగానూ, మరీ వేడిగా లేకుండా చూసుకోవాలి.నిద్ర సమయంలో గదిలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి. సాయుంత్ర వేళలనుంచి కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకండి. రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయూలి.ప్రతీ రోజూ ఒకే నిర్ణీత వేళకి నిద్రపొండి.పగటి పూట చిన్న కునుకు (పవర్ న్యాప్) మాత్రమే చాలు. ఎక్కువసేపు నిద్రపోవద్దు. రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపరుునా పగటి వెలుగులో (డే లైట్) గడపాలి. పగలు వుసక వెలుగు రూమ్‌లలో గడిపేవారికి రాత్రివేళల్లో సరిగా నిద్రపట్టదు.గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది. నిద్రకు వుుందు పుస్తకాలు చదవడం వంటివి చేయువద్దు. నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు. దాంతో నిద్రలేచాక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు. అందుకే వుద్యం తాగాక నిద్ర వచ్చినా మెలకువ తర్వాత అలసటంతా తీరిపోరుున రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు. డా॥రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. నా వివాహం జరిగి నాలుగేళ్లు అవుతోంది. ఇంకా సంతానం కలగలేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అని చెప్పారు. అంటే ఏమిటి? దీనికి కారణాలు ఏమిటి? హోమియోలో పరిష్కారం ఉందా? - ఒక సోదరి, హైదరాబాద్ ఇటీవల చాలామంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. సంతానలేమికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ లోపాలు మహిళలలోనూ, పురుషుడిలోనూ లేదా ఇద్దరిలోనూ ఉండవచ్చు. సాధారణ కారణాలు : మహిళల్లో కనిపించేవి : జన్యు సంబంధిత లోపాలు హార్మోన్ లోపాలు థైరాయిడ్ సమస్య అండాశయంలో లోపాలు, నీటి బుడగలు గర్భాశయ సమస్యలు ఫెలోపియన్ ట్యూబ్స్‌కు సంబంధించిన సమస్యలు డయాబెటిస్ గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడటం. పురుషుల్లో కనిపించేవి: హార్మోన్ సంబంధిత సమస్యలు థైరాయిడ్ సమస్య పొగతాగే అలవాటు శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం సంతాన లేమిలో రకాలు : ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ : దంపతుల్లో అసలు సంతానమే కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ముఖ్యంగా జన్యు సంబంధిత లోపాలు, హార్మోన్ సంబంధిత లోపాల వల్ల ఇది ఏర్పడుతుంది. సెకండరీ ఇన్ఫెర్టిలిటీ : మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్ తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఏవైనా ఇన్ఫెక్షన్స్ రావడం దీనికి కారణం. గుర్తించడం ఎలా : సమస్యను బట్టి తగిన పరీక్షలు చేసి సంతానలేమిని గుర్తిస్తారు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్ స్టడీ వంటివి చేస్తారు. హోమియో చికిత్స : కాన్స్టిట్యూషనల్ చికిత్స ద్వారా రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, సమస్య తీవ్రతను తగ్గిస్తూ క్రమక్రమంగా సమస్యను పూర్తిగా తగ్గించడం అన్నది హోమియో చికిత్సలో జరుగుతుంది. ఇన్ఫెర్టిలిటీ సమస్యనూ హోమియో ద్వారా పరిష్కరించవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ -
కాఫీ మీ జీవితాన్ని కాపాడుతుంది..!
కాఫీ తాగడం అలవాటుపై అనేక అనుమానాలు, అపోహలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అయితే తాజా పరిశోధకులు మాత్రం... కాఫీ తాగడం జీవితాన్నే కాపాడుతుందంటున్నారు. రోజుకు నాలుగైదు కప్పుల కాఫీ తాగడం జీవన పరిమాణాలనే పెంచుతాయంటున్నారు. అసలు కాఫీనే తాగే అలవాటు లేని వారికన్నా కాఫీ తాగేవారు ఎక్కువ కాలం బతుకుతున్నారని, మధుమేహం, గుండె జబ్బులనుంచి వచ్చే ప్రమాదాలను కూడా అరికట్టేందుకు కాఫీ సహకరిస్తుందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, మధుమేహం, అకాల మరణాలు, న్యుమోనియా, ఇన్ఫ్లుయంజా వంటి వ్యాధుల వల్ల వచ్చే ప్రమాదాలకు దూరంగా ఉండడంతోపాటు ఆత్మహత్యలకు పాల్పడాలన్న ఆలోచనల నుంచి కూడా కాఫీ దూరం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. పది సంవత్సరాలపాటు (1998 నుంచి 2009) సుమారు లక్షమంది నడివయస్కులపై చేసిన పరిశోధనల్లో కాఫీ తాగనివారికంటే తాగేవారు ఎక్కువకాలం బతికినట్లుగా తెలుసుకున్నారు. కాఫీలోని ఫినోలిక్ యాసిడ్లు, పొటాషియం, కెఫిన్ సహా మనుషుల జీవనంపై క్రియాశీలకంగా పనిచేస్తామయని నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అధ్యయన రచయిత డాక్టర్ ఎరిక్కా లాఫ్టిఫైడ్ తెలిపారు. అలాగే ప్రతిరోజూ నాలుగు నుంచి ఐదు కప్పుల కాఫీ తాగే వారికి వ్యాధుల ప్రమాదం అత్యల్పంగా ఉందని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే కాఫీ తాగేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. కొన్ని క్యాన్సర్ల తో బాధపడే వారికి కాఫీ అలవాటువల్ల కొంత జీవన కాలం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు గర్భిణిలు కాఫీ తాగొచ్చా కూడదా అన్న విషయంపై కూడ అనుమానాలను తాజా పరిశోధనలు తీరుస్తున్నాయి. రోజుకు సుమారు రెండు వందల మిల్లీగ్రాముల కెఫెన్ కలిగిన కాఫీని గర్భిణిలు కూడా తాగొచ్చని అమెరికన్ అబ్ స్టెట్రీషియన్స్, గైనకాలజిస్ట్ ల కళాశాల అధ్యయనకారులు చెప్తున్నారు. రోజువారీ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేవారిలాగే ప్రతిరోజూ అలవాటుగా కాఫీ తాగేవారు కూడ ఆరోగ్యంగానే ఉంటారని తెలుస్తోంది. అయితే అప్పటికే అనారోగ్యంతో బాధపడేవారు మాత్రం కాఫీ తాగకుండా ఉండటమే మంచిదంటున్నారు. ఏది ఏమైనా కాఫీ రోజువారీ జీవితంలో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే పానీయంగా అధ్యయనకారులు చెప్తున్నారు. -
ముందు సెల్... తర్వాతే భోజనం!
అలవాటు భోజనం చేసే సమయంలో ఎక్కువగా మాట్లాడకుండా, వేరే విషయాల గురించి ఆలోచించకుండా శ్రద్ధగా తినాలని పెద్దలు చెబుతారు. కానీ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఈ సెల్‌ఫోన్ కాలంలో భోజనం చేయడం మీద కంటే సెల్ఫోన్ల మీ జనం ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. మంచిచెడులు మాట్లాడుకోవడానికి, అందరూ ఒక చోట కలుసుకోవడానికి డిన్నర్ టేబుళ్లు కేంద్రంగా ఉండేవి. ఇప్పుడు మాత్రం అలా లేదు. ఒకే టైమ్‌లో ఒకే చోట భోజనానికి కూర్చున్నప్పటికీ...తమ సెల్ఫోన్లపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తున్నారని వ్యూ రిసెర్చ్ సెంటర్(బ్రిటన్) అధ్యయన కేంద్రం చెబుతోంది. ముఖ్యంగా 16 - 34 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారు తాము భోజనం చేస్తున్నప్పుడు, భోజనం మీద దృష్టి పెట్టకుండా సెల్ఫోన్లో మెసేజ్‌లు చూడడం, మెసేజ్‌లు పంపడం, సోషల్ మీడియా సైట్లు చెక్ చేయడం, మిత్రులతో మాట్లాడడంలాంటివి చేస్తున్నారు. అమెరికా, బ్రిటన్లలోనే కాదు చాలా దేశాల్లోనే ఇదే పరిస్థితి ఉంది. కొద్దిమంది మాత్రమే భోజన సమయంలో సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండగలుగుతున్నారట.! -
నేను ఆడంగినా?
మగోడు కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, మనం ఎలాంటి కాలంలో నివసిస్తున్నామా అని. ఒకప్పుడు ఏ అలవాటు లేని వాళ్లను చాలా గౌరవంగా చూసేవాళ్లు. వారి గురించి పదిమందికి గొప్పగా చెప్పేవాళ్లు. ఇప్పుడు మాత్రం పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఎన్ని దురలవాట్లు ఉంటే అంత గొప్ప మగవాడు అనుకుంటున్నారు. అలాంటి వారితోనే మర్యాదగా మాట్లాడుతున్నారు. తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక నా విషయానికి వస్తే మొదటి నుంచి నేను మద్యం, సిగరెట్...మొదలైన అలవాట్లకు చాలా దూరం. ఫ్రెండ్స్ ఎన్నోసార్లు ఈ దురలవాట్లను నాకు అంటించాలని ప్రయత్నించారు. భగవంతుడి దయ వల్ల ఏ దురలవాటు నా దరి చేరలేదు.ఏ దురలవాటూ లేకపోవడంతో నాకు గర్వంగా కూడా ఉండేది. ‘‘ఇతను స్వాతిముత్యం’’ అని నా గురించి ఎవరైనా అన్నప్పుడు సంతోషంగా ఉండేది. ఇటీవల జరిగిన ఒక సంఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. నేను మా ఆవిడ కలిసి ఒక ఫంక్షన్‌కు వెళ్లాం. ఫంక్షన్ అయిపోయిన తరువాత మగాళ్లు కొందరు మందు కొడుతున్నారు. ‘‘మీ ఆయన వెళ్లాడా?’’ అని అడిగింది ఒక ఆవిడ. ఈ ప్రశ్నకు మామూలుగానైతే- ‘‘ఆయనకు ఎలాంటి దురలవాట్లు లేవు’’ అని కాస్త గర్వంగా చెప్పాలి. మా ఆవిడ మాత్రం ముఖం అదోలా పెట్టి- ‘‘మా ఆయన అతి జాగ్రత్త మనిషి. టీ తాగాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎవరితోనూ పెద్దగా కలవరు. ఒక్కరోజు మందు కొడితే ఈయన సొమ్మేదో పోయినట్లు దూరంగా ఉంటారు...’’ అని చెప్పుకుంటూ పోతోంది. ‘‘మా ఆయన కూడా అంతే. మా ఆయనే ఆడంగి అనుకుంటే ఆయన కంటే పెద్ద ఆడంగిలా ఉన్నాడు మీ ఆయన!’’ అంటూ ఆ దూరపు బంధువుఅదేదో పెద్దజోక్లా విరబడి నవ్వింది. ఈ సంభాషణ విని నా గుండెలో రాయి పడినట్లుగా విలవిలలాడిపోయాను. మీరైన చెప్పండి. ఇది సమంజసమా?! -జిఆర్, కొత్తపేట -
అలవాటు మార్చుకోలేదు! తప్పు దిద్దుకున్నా!!
మనోగతం నాకు పుస్తకాలు చదవడం అంటే విపరీతమైన ఇష్టం. దీని కోసం ఎంతైనా ఖర్చు చేసే అలవాటు ఉంది. మా ఆవిడకు మాత్రం నా అలవాటు బొత్తిగా నచ్చేది కాదు. ‘‘జీతం డబ్బులన్నీ పుస్తకాల కోసం తగలేస్తున్నాడు’’ అని ఇరుగు, పొరుగు వాళ్లకూ, బంధువులకూ చెప్పి బాధ పడుతుండేది. అది విన్నప్పుడల్లా చాలా బాధగా ఉండేది. ఒకసారి నేను ఊరెళ్లిన సమయం చూసి...చాలా పుస్తకాలను కిరాణా కొట్టు వాడికి అమ్మింది. ‘‘ఇక్కడ కొన్ని పుస్తకాలు కనిపించాలి. ఏవి?’’ అని అడిగితే ‘‘నాకేం తెలుసు!’’ అని అమాయకంగా ముఖం పెట్టింది. కాస్త గట్టిగా అడిగేసరికి ఆమెకు కోపం వచ్చింది. ‘‘అవును. కిరాణా కొట్టుకు వాడికి అమ్మాను. పుస్తకాల కోసం డబ్బులు తగలేస్తుంటే గుడ్లప్పగించి చూస్తుండాలా?’’ అని దురుసుగా సమాధానం ఇచ్చింది. ‘‘చూడనక్కర్లేదు...నీ దారిన నీవు వెళ్లిపోవచ్చు’’ అని కోపంగా అన్నాను. దీంతో ఆమె కంటికి మింటికి ధారగా ఏడ్చింది. బట్టలు సర్దుకొని ఉన్నపళంగా పుట్టింటికి వెళ్లింది. ‘తొందరపడ్డానా? అనవసరంగా ఆమెను బాధ పెట్టానా?’ అనిపించింది. కానీ పుస్తకాలు కిరాణం కొట్టువాడికి అమ్మడం గుర్తుకు వచ్చి నాకు కోపం రావడం సమంజసమే అనిపించింది. ఒక వారం తరువాత పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. ‘‘అందరూ మీ ఆయన గురించి మంచిగా చెబుతుంటారు. ఏమిటమ్మా నీకు వచ్చిన ఇబ్బంది?’’ అని అడిగాడు ఒక పెద్దాయన. ‘‘ఎప్పుడు చూసినా పుస్తకాల గొడవే. ఒక సినిమా లేదు, షికారు లేదు...’’ అని మా ఆవిడ నన్ను తిట్టడం మొదలుపెట్టింది. మధ్యలో మా అమ్మ ఏదో కలిపించుకోబోతే-‘‘అసలు నీవల్లే ఆయన ఇలా తయారయ్యాడు’’ అన్నది. దీంతో నాకు విపరీతంగా కోపం వచ్చి- ‘‘మీ నాన్నలా మందు కొట్టడానికి డబ్బులు ఖర్చు చేయడం లేదు. మీ అన్నయ్యలా సిగరెట్లు తాగడానికి ఖర్చు చేయడం లేదు..’’ అని నేను అనేసరికి గొడవ పెద్దదయింది. పెద్దలు సర్దిచెప్పారు. సాయంత్రానికల్లా రాజీ కుదిర్చారు. మరుసటి రోజు మా ఆవిడ నాతో కాపురానికి వచ్చింది. ‘‘పుస్తకాలను తప్ప నన్ను పట్టించుకోడు’’ అని ఆమె అన్నమాట పదే పదే గుర్తుకు వచ్చింది. నేను నా తప్పును సరిదిద్దుకున్నాను. ఆమెతో పాటు సినిమాలకు, షాపింగ్‌లకు వెళుతున్నాను. కబుర్లు చెబుతున్నాను. ఆమె కూడా చాలా మారిపోయింది. నేను ఏదైనా కొత్త పుస్తకం కొంటే ‘‘ఎందుకు కొన్నారు?’’ అని రుసరుసలాడకుండా ఆ పుస్తకం గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికైతే ఇద్దరం ఎలాంటి సమస్యలు లేకుండా సుఖంగా ఉంటున్నాం. - యస్. సుందర్, హైదరాబాద్