మంచి నిద్రకోసం చేయాల్సినవి ఇవే... | To do the same for good sleep ... | Sakshi
Sakshi News home page

మంచి నిద్రకోసం చేయాల్సినవి ఇవే...

Published Wed, Jun 8 2016 11:06 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

మంచి నిద్రకోసం చేయాల్సినవి ఇవే... - Sakshi

మంచి నిద్రకోసం చేయాల్సినవి ఇవే...

స్లీప్ కౌన్సెలింగ్

 

ఈమధ్య నాకు నిద్ర బాగా తగ్గింది. రాత్రివేళ బాగా నిద్రపట్టడం లేదు. మందులు వాడకుండా స్వాభావికంగా నిద్రపట్టే మార్గాలు చెప్పండి.  - నవీన్‌కుమార్, కందుకూరు
ఇటీవల నాణ్యమైన నిద్ర తగ్గడంతో పాటు నిద్రపోయే వ్యవధి కూడా తగ్గుతోందని అధ్యనాల వల్ల తెలుస్తోంది. అయితే రాత్రి వేళల్లో మీరు నిద్రించే వ్యవధి తగ్గినా, ఆ  మర్నాడు పగలంతా ఉల్లాసంగా ఉన్నప్పుడు మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మంచి నిద్ర కావాలనుకునే వాళ్లు ఈ కింది సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అవి...

 
పొగతాగే అలవాటును పూర్తిగా మానేయాలి. బెడ్‌రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మరీ చల్లగానూ, మరీ వేడిగా లేకుండా చూసుకోవాలి.నిద్ర సమయంలో గదిలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి.  సాయుంత్ర వేళలనుంచి కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకండి.  రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయూలి.ప్రతీ రోజూ ఒకే నిర్ణీత వేళకి నిద్రపొండి.పగటి పూట చిన్న కునుకు (పవర్ న్యాప్) మాత్రమే చాలు. ఎక్కువసేపు నిద్రపోవద్దు.  రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపరుునా పగటి వెలుగులో (డే లైట్) గడపాలి. పగలు వుసక వెలుగు రూమ్‌లలో గడిపేవారికి రాత్రివేళల్లో సరిగా నిద్రపట్టదు.గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది. నిద్రకు వుుందు పుస్తకాలు చదవడం వంటివి చేయువద్దు.

 
నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు. దాంతో నిద్రలేచాక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు. అందుకే వుద్యం తాగాక నిద్ర వచ్చినా మెలకువ తర్వాత అలసటంతా తీరిపోరుున రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు.


డా॥రమణ ప్రసాద్
కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్

అండ్ స్లీప్ స్పెషలిస్ట్,  కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్

 

 

హోమియో కౌన్సెలింగ్

 నా వయసు 30 ఏళ్లు. నా వివాహం జరిగి నాలుగేళ్లు అవుతోంది. ఇంకా సంతానం కలగలేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అని చెప్పారు. అంటే ఏమిటి? దీనికి కారణాలు ఏమిటి? హోమియోలో పరిష్కారం ఉందా?  - ఒక సోదరి, హైదరాబాద్


ఇటీవల చాలామంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. సంతానలేమికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ లోపాలు మహిళలలోనూ, పురుషుడిలోనూ లేదా ఇద్దరిలోనూ ఉండవచ్చు.

 
సాధారణ కారణాలు : మహిళల్లో కనిపించేవి :  జన్యు సంబంధిత లోపాలు  హార్మోన్ లోపాలు  థైరాయిడ్ సమస్య అండాశయంలో లోపాలు, నీటి బుడగలు గర్భాశయ సమస్యలు  ఫెలోపియన్ ట్యూబ్స్‌కు సంబంధించిన సమస్యలు  డయాబెటిస్ గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడటం.

 

పురుషుల్లో కనిపించేవి: హార్మోన్ సంబంధిత సమస్యలు  థైరాయిడ్ సమస్య  పొగతాగే అలవాటు  శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం

 
సంతాన లేమిలో రకాలు : ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ

 
ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ
: దంపతుల్లో అసలు సంతానమే కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ముఖ్యంగా జన్యు సంబంధిత లోపాలు, హార్మోన్ సంబంధిత లోపాల వల్ల ఇది ఏర్పడుతుంది.

 
సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ
: మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్ తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ  అంటారు. ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఏవైనా ఇన్ఫెక్షన్స్ రావడం దీనికి కారణం.

 
గుర్తించడం ఎలా : సమస్యను బట్టి తగిన పరీక్షలు చేసి సంతానలేమిని గుర్తిస్తారు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్ స్టడీ వంటివి చేస్తారు.

 
హోమియో చికిత్స : కాన్‌స్టిట్యూషనల్ చికిత్స ద్వారా రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, సమస్య తీవ్రతను తగ్గిస్తూ క్రమక్రమంగా సమస్యను పూర్తిగా తగ్గించడం అన్నది హోమియో చికిత్సలో జరుగుతుంది. ఇన్‌ఫెర్టిలిటీ సమస్యనూ హోమియో ద్వారా పరిష్కరించవచ్చు.

 

డాక్టర్ ఎ.ఎం. రెడ్డి

సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement