నలుగురిలో ఒకరికి స్మార్ట్‌ఫోన్‌ వ్యసనం! | Youth Addicted to Smart Phones, Often with Mental Health Problems | Sakshi
Sakshi News home page

నలుగురిలో ఒకరికి స్మార్ట్‌ఫోన్‌ వ్యసనం!

Published Tue, Dec 3 2019 8:21 AM | Last Updated on Tue, Dec 3 2019 9:44 AM

Youth Addicted to Smart Phones, Often with Mental Health Problems - Sakshi

లండన్‌: ప్రపంచంలో ప్రతి నలుగురు యువతీయువకుల్లో ఒక్కరు స్మార్ట్‌ఫోన్‌ వ్యసనానికి అలవాటు పడ్డారని లండన్‌లోని కింగ్స్‌ కాలేజీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో లేకపోతే వీరు ఆందోళనకు గురవుతున్నారని, నిరుత్సాహానికి గురవుతున్నారని వీరు అంటున్నారు. స్మార్ట్‌ఫోన్లు విస్తృత వ్యాప్తిలోకి వచ్చిన 2011 సంవత్సరం నుంచి జరిగిన వేర్వేరు అధ్యయనాలు పిల్లలు, యువతీయువకుల్లో 10 – 30 శాతం మంది వీటిని తగువిధంగా వాడటం లేదని ఇప్పటికే ఒక విశ్లేషణ ఉంది. ఇదే లెక్కన చూస్తే వీరిలో సగటున 23 శాతం మంది సమస్యాత్మక స్మార్ట్‌ఫోన్‌ వినియోగం చేస్తున్నారని శాస్త్రవేత్తలు గుర్తించారు. స్మార్ట్‌ఫోన్‌ వ్యసనానికి బానిసలు కావడం వల్ల మానసిక సమస్యల బారిన పడుతున్నారని తేల్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement