Addicted
-
సందేశాన్నిచ్చిన సంక్రాంతి ముగ్గు.. 'డోంట్ బి అడిక్టెడ్'
నిర్మల్: సంక్రాంతి అంటే రంగవల్లులకు పేరు. అయితే ఆ సంక్రాంతి ముగ్గులో విభిన్నతను ప్రదర్శించాలనుకున్నాడు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన చిత్రకారుడు అడ్డిగ శ్రావణ్ కుమార్.. ప్రస్తుత కాలంలో విద్యార్థులు, యువత వయసు ప్రమేయం, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సామాజిక మాధ్యమాలకు బానిసగా మారుతున్నారు. అధికసమయాన్ని వీటికే వెచ్చిస్తున్నారు. ఇదే అంశాన్ని స్థానిక మంజులాపూర్ కాలనీకి చెందిన శ్రావణ్‌కుమార్ తన ఇంటిముందు స్వయంగా వేసిన ముగ్గులో సందేశం రూపంలో అందించాడు. రోడ్డుపై వచ్చిపోయే వారు సందర్శించేలా ‘‘డోంట్ బి అడిక్టెడ్’’ అంటూ వేసిన ఈ ముగ్గు పలువురిని ఆకట్టుకుంటుంది. ఈ ముగ్గులో పలు సామాజిక మాధ్యమాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దాడు. ఫేస్బుక్, ఇంస్ట్రాగామ్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, జిమెయిల్, గూగుల్ క్రోమ్ వంటి పలు ఇంటర్నెట్ సోషల్ మీడియాను మితిమీరి వినియోగిస్తూ వాటికే అడిక్ట్ అవుతున్న తీరును ఇలా సృజనాత్మకంగా ప్రదర్శించడం పలువురిని ఆలోచింపజేస్తోంది. చాలామంది విభిన్నరీతిలో ఇచ్చిన సందేశాన్ని ప్రశంసిస్తున్నారు. ఇవి కూడా చదవండి: సంక్రాంతికి ముగ్గులు వేయడంలో దాగున్న ప్రాశస్త్యం ఏంటీ? -
వరుసగా 7 రోజులు ‘తాగితే’ మద్యం అలవాటుగా మారిపోతుందా?
మద్యం, జూదం అనేవి వ్యసనాలని, ఇవి ఎవరికైనా ఒకసారి అలవడితే వారు వాటిని జీవితంలో విడిచిపెట్టలేరని చాలామంది అంటుంటారు. ఇవి వ్యవసంగా మారితే వారి జీవితాలను ఎవరూ బాగుచేయలేని కూడా చెబుతుంటారు. మనిషికి మద్యం ఎలా అలవడుతుంది? ఏ మేరకు మద్యం తాగితే అది అలవాటుగా మారిపోతుంది. కొందరు చెబుతున్నట్లు వరుసగా 7 రోజులు మద్యం తాగితే అది అలవాటుగా మారిపోతుందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం అలవాటు అనేది ఒక క్రానిక్ డిసీజ్. మద్యం అలవాటు అనేది మూడు దశలుగా ఏర్పడుతుంది. మొదటి దశలో మద్యం తాగేవారు అది వారికి తెలియకుండానే అలవాటుగా మారిపోతుందని గ్రహించలేరు. ఈ దశలో మద్యం తాగే వ్యక్తి దానిని అధికమోతాదులో తీసుకుంటాడు. మద్యం తాగడంపై నియంత్రణ కోల్పోతాడు. ఇక్కడి నుంచే అతను తప్పు చేయడం మొదలుపెడతాడు. ఇక వరుసగా 7 రోజులు మద్యం తాగితే అది అలవాటుగా మారిపోతుందా అనే విషయానికి వస్తే దీనికి స్పష్టమైన రుజువులు లభ్యం కాలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే వరుసగా ఏడు రోజుల పాటు మద్యం తాగితే, అలాగే అది అధిక మోతాదులో ఉంటే తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక మద్యం తాగడంలోని రెండవ దశ విషయానికొస్తే ఆ సమయంలో శరీరంలో అంతర్గతంగా మార్పులు వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ దశలో సమాజంలోని తోటివారు మద్యం తాగేవారిని అవహేళన చేయడం కనిపిస్తుంది. ఇక చివరిదశ విషయానికొస్తే మద్యం తాగేవారు పూర్తిగా తమపై నియంత్రణ కోల్పోతారు. అదే సమయంలో శరీరాన్ని పలు వ్యాధులు చుట్టుముడతాయి. ఏ పనీ సరిగా చేయలేని స్థితికి చేరుకుంటాడు. శరీరం బలహీనమవుతుంది. ఇది కూడా చదవండి: నిండు గర్భిణిని నేరస్తురాలిని చేసిన ఏఐ.. మున్ముందు ఎన్ని ఘోరాలు చూడాలో? -
పబ్ జీ గేమ్‌కి బానిసగా మారి.. తల్లిదండ్రులనే మరచిపోయాడు!
సాక్షి, అనంతపురం: ఆన్లైన్ గేమ్ పబ్జీ అంటే యువతతో సహా పిల్లలకు ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఆ గేమ్‌కి బానిసగా మారి ప్రాణలు మీదకు తెచ్చుకుట్టుంటే మరి కొందరు ప్రాణాలే పోగుట్టుకుంటున్నారు. తాజాగా పబ్ జీ గేమ్ ఆడుతూ ఓ బాలుడు ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలానికి చెందిన సుబ్బారాయుడు 8 వతరగతి విద్యార్థి చదువుతున్నాడు. గత కొంత కాలంగా అతను ఈ ఆటను ఆడటం ప్రారంభించాడు. అయితే మూడు నెలలుగా పబ్ జీ ఆట వ్యసనంగా మారి అదే పనిగా ఆడటంతో బాలుడు తల్లిదండ్రులను గుర్తించ లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చికిత్స నిమిత్తం బాలుడి కర్నూలులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కొడుకు పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: ఏఎస్ఐని మాట్లాడుతున్న అర్జెంటుగా రూ.10వేలు పంపు.. -
‘కరోనా’తో ఆన్లైన్ వ్యసనం!..సర్వేలో భయాంకర నిజాలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలిగొన్న కరోనా మహమ్మారి గత ఏడాదిన్నర కాలంలో చాలా మందిని ఆన్లైన్ బానిసలుగానూ మార్చిందని తాజా సర్వేలో వెల్లడైంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్... ‘నార్టన్ లైఫ్‌లాక్’ పేరుతో ఇటీవల వివిధ దేశాల్లో ఆన్లైన్ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా భారతీయుల విభాగంలో సుమారు వెయ్యి మందిపై చేపట్టిన అధ్యయనం ప్రకారం ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆన్లైన్ వ్యసనానికి బానిసలయ్యారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఆన్లైన్ ద్వారా ఆఫీసు కార్యకలాపాలు, డిజిటల్ చదు వులు వెచ్చిస్తున్న సమయమే కాకుండా అదనంగా కనీసం నాలుగు గంటలపాటు ఆన్లైన్లో గడుపుతున్నట్లు దాదాపు 82 శాతం మంది తెలిపారు. వాటిల్లోనూ స్మార్ట్ఫోన్లతో గడిపే కాలం ఎక్కువైందని తెలిపిన వారు 84 శాతం వరకూ ఉండటం గమనార్మం. సర్వే చేసిన వాళ్లల్లో సగం మంది భద్రతాపరమైన కారణాల రీత్యా ఇంటికి సరికొత్త స్మార్ట్ పరికరాలను కొనడం లేదని స్పష్టం చేశారు. స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల ఆరోగ్యం పాడవుతుందన్న స్పృహ మూడొంతుల మంది (74%)లో ఉండటం ఇంకో విశేషం. మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం ఉంటుందని చెప్పినవారు దాదాపు 55 శాతం. అదే సమయంలో బంధుమిత్రులతో మాట్లాడటం ద్వారా స్క్రీన్కు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని 76 శాతం మంది చెప్పడం గమనార్హం. ప్రైవసీ భయాలు ఇళ్లలో ఉండే స్మార్ట్ హోం పరికరాల ద్వారా వ్యక్తిగత సమాచారం బట్టబయలవుతుందన్న ఆందోళన నార్టన్ కంపెనీ సర్వే చేసిన ప్రతి ఐదుగురిలో ఇద్దరు భావిస్తున్నారు. భద్రతపరమైన కారణాలతో స్మార్ట్ హోం పరికరాలను కొనబోమని 48 శాతం మంది చెబితే ప్రైవసీ భయాలను కారణంగా చూపిన వారు 40% మంది. వినియోగదారుల సమాచారాన్ని కం పెనీ ఇతర అవసరాల కోసం వాడుకుంటుందని 35% మంది గట్టిగా నమ్ముతున్నారు. ఇందుకు తగ్గ ట్టుగానే ఇంట్లో స్మార్ట్ హోం పరికరాలు ఉన్న వారిలో 22% మంది రక్షణ కోసం తామేమీ అదనపు చర్యలు తీసుకోవడం లేదని, పరికరంలో ముందుగానే ఏర్పాటైన సెక్యూరిటీతోనే సరిపుచ్చుకుంటున్నామని చెప్పడం గమనార్హం. పాస్‌వర్డ్‌లుగా వ్యక్తిగత సమాచారం పాస్వర్డులుగా వ్యక్తిగత సమాచారం వాడేవారు 82% ఉండగా.. ఇందులోనూ పుట్టిన రోజులను లేదా భార్య, పిల్లల పేర్లను వాడేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. 69 శాతం మంది ఏదో ఒక పేరును వాడుతున్నట్లు చెబితే పుట్టిన రోజును వాడేవాళ్లు 58 శాతం మంది ఉన్నట్లు నార్టన్ లైఫ్‌లాక్ సర్వే తెలిపింది. వైఫై రౌటర్లు ఉన్న భారతీయుల్లో 72 శాతం మంది తాము రౌటర్ పాస్‌వర్డ్‌ను ఏడాదికి ఒకసారి మారుస్తున్నట్లు చెబితే నెలకోసారి మారుస్తామని కేవలం 26 శాతం మంది మాత్రమే తెలిపారు. తాము ఇప్పటివరకూ పాస్వర్డ్ మార్చనేలేదని అంగీకరించిన వారు తొమ్మిది శాతం మంది! పిల్లలకు చెప్పాలి సైబర్ భద్రత గురించి తల్లిదండ్రులు పిల్లలకు చిన్న వయసు నుంచే నేర్పించాలని సర్వే చేసిన వాళ్లలో 84 శాతం మంది అభిప్రాయపడ్డారు. కానీ ఆన్లైన్ వ్యవహారాల్లో పిల్లలను కాపాడుకోవడం కష్టమేనని 75 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ‘కోవిడ్ సమయంలో ఆన్లైన్ వ్యవహారాల్లో పెరుగుదల అనివార్యమైంది. కానీ ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్ సమయాల మధ్య సమతౌల్యం పాటించడం కూడా ముఖ్యం. లేదంటే ఆరోగ్యం మరీ ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడే అవకాశం ఉంది’ అని నార్టన్ లైఫ్‌లాక్ డైరెక్టర్ రితేశ్ చోప్రా తెలిపారు. -
PUBG గేమ్ కి బానిసై బాలుడు ఆత్మహత్య
-
‘నెట్టే’ట మునక
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ప్రజలు ‘నెట్’లోకంలో మునిగితేలుతున్నారు. గంటలకొద్దీ డిజిటల్ ప్రపంచంలో విహరిస్తూ ఇంటర్నెట్కు బానిసలుగా మారుతున్నారు. ఆధునిక సాంకేతికతను అవసరానికి మించి వాడుతూ శారీరక, మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ, సోషల్ మీడియా... ఇలా డిజిటల్ మాధ్యమాలతో రోజుకు ఏడు గం టల చొప్పున ఏడాదికి సరాసరిన 1,800 గంటలపాటు కుస్తీ పడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. డిజిటల్ మార్కెటీర్ అనే సంస్థ ఇటీవల హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ తదితర మెట్రో నగరాల్లో ఆన్లైన్ మాధ్యమం ద్వారా సుమారు 50 వేల మంది అభిప్రాయాలు సేకరించి అధ్యయన వివరాలు ప్రకటించింది. చేతిలో నిరంతరం స్మార్ట్‌ఫోన్‌తో దర్శనమిచ్చే యువత... ఖాళీ సమయాల్లో డిజిటల్ మాధ్యమాలతో కుస్తీ పడుతోంది. ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రతి ఐదు నిమిషాలకు ఓసారి సెల్‌ఫోన్ టచ్ చేస్తూ అప్డేట్స్ చూసుకుంటున్నట్లు అధ్యయనం తెలి పింది. ప్రతి ఐదుగురిలో ముగ్గురు సెల్‌ఫోన్ తమ జీవితంలో విడదీయరాని భాగంగా మారిందని అభిప్రాయపడినట్లు పేర్కొంది. టీనేజర్లలో 50% మంది డిజిటల్ ఎడిక్షన్‌కు గురవుతున్నట్లు స్పష్టం చేసింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే డిజిటల్ అడిక్షన్తో పలు శారీరక, మానసిక సమస్యలతో బాధపడాల్సి వస్తుందని హెచ్చరించింది. డిజిటల్ వర్రీ.. క్షణం తీరికలేకుండా స్మార్ట్‌ఫోన్‌తో గంటలతరబడి కాలక్షేపం చేస్తున్న మెట్రో నగరవాసులకు కొత్త చిక్కులొచ్చాయి. నిరంతరాయంగా వాట్సాప్‌లో చాటింగ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటిలో అప్డేట్స్ కోసం రెప్పవాల్చకుండా స్మార్ట్‌ఫోన్ వైపు దృష్టిసారిస్తుండడంతో మెడ, వెన్నునొప్పులతో సతమతమవుతున్నట్లు తేలింది. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్‌ను చేతిలో పట్టుకొని సరిగా కూర్చోకుండా చాటింగ్ చేయడం, అధిక సమయం చాటింగ్‌లోనే గడిపేస్తుండటంతో వెన్నెముక డిస్క్ లు ఒత్తిడికి గురై పలువురు వెన్నునొప్పులతో బాధపడుతున్నట్లు పేర్కొంది. చాటింగ్ సమయం లో భుజం, తల, మెడ కండరాలు అధికంగా ఒత్తిడికి గురై బిగుసుకుపోవడంతోనే ఇవి తలెత్తుతున్నాయని, ఛాతీ కండరాలూ పలుమార్లు బిగుసుకుపోతున్నట్లు వైద్యులను ఉటంకిస్తూ పేర్కొంది. చిన్నారులూ బాధితులే.... అధిక గంటలు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లలో గేమ్స్ ఆడే చిన్నారులు సైతం మెడ, వెన్నునొప్పులతో సతమతమవుతున్నట్లు సర్వేలో తేలింది. ప్రధానంగా సెల్ఫోన్లు, ట్యాబ్లెట్స్‌లో గేమ్స్ ఆడే సమయంలో సోఫాలు, మంచాలు, కుర్చీల్లో సరిగా కూర్చోకపోవడం వల్ల శారీరక కదలికలు లేక జీవనక్రియల్లో సమతౌల్యం దెబ్బతిని అనారోగ్యం పాలవుతున్నారని వెల్లడించింది అనర్థాలివే: మెడ నొప్పులు, వెన్నెముక డిస్క్‌లు ఒత్తిడికి గురై నొప్పులతో సతమతమవడం, నరాలు బిగుసుకుపోవడం, చేతివేళ్లకు తరచూ తిమ్మిర్లు రావడం, స్పర్శకోల్పోవడం, జీవన క్రియలు మందగించ డం, వెన్నునొప్పులు, నిద్రలేమి, తుంటికండరాలు పట్టేయడం. శ్రుతి మించితే వైద్యులను సంప్రదించాల్సిందే. చిన్నారులకు స్మార్ట్‌ఫోన్ వినియోగం దురలవాటు గా మారితే తప్పకుండా సైకియాట్రిస్ట్‌లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నారుల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫోన్ హాబీ ఇటీవలి కాలంలో 5 రెట్లు పెరిగిందని సైకాలజిస్టులు చెబు తున్నారు. పిల్లలకు ఫోన్లను సరదా కోసం ఇస్తున్న తల్లిదండ్రులు... అది వారికి దురలవాటుగా మారి నప్పుడే కళ్లు తెరుస్తున్నారని చెబుతున్నారు. చాలా మంది మాట్లాడటం కంటే ఫోన్ చాటింగ్‌కే ప్రాధాన్యతనిస్తున్నట్లు సైకాలజిస్టులు చెబుతున్నారు. ఫోన్ హాబీ శ్రుతి మించి దురలవాటుగా మారితే చిన్నారుల మెదడు కణాలూ దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. శారీరక వ్యాయామం, ఆటల ద్వారా చిన్నారుల్లో మానసిక, శారీరక ఆరోగ్యం పెరుగుతుందని సూచిస్తున్నారు. ఆటలకు దూరమై ఫోన్లు, ట్యాబ్లెట్లతో కుస్తీపట్టే చిన్నారులు తీవ్ర ఆవేశకావేశాలకు గురవడంతోపాటు వారిలో క్రమంగా హింసా ప్రవృత్తి పెరుగుతోందని స్పష్టం చేస్తున్నారు. ఇలా చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం ►స్మార్ట్ఫోన్లు వినియోగించే సమయంలో తరచూ బ్రేక్ తీసుకోవాలి. శరీర కదలికలు ఉండేలా చూసుకోవాలి. ►మెడను వంచకుండా స్మార్ట్‌ఫోన్ తెరను చూడాలి. ►నొప్పులు అధికమైతే న్యూరోసర్జన్లు, ఫిజియోథెరపిస్టులను సంప్రదించాలి. -
నలుగురిలో ఒకరికి స్మార్ట్‌ఫోన్ వ్యసనం!
లండన్: ప్రపంచంలో ప్రతి నలుగురు యువతీయువకుల్లో ఒక్కరు స్మార్ట్‌ఫోన్ వ్యసనానికి అలవాటు పడ్డారని లండన్‌లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ అందుబాటులో లేకపోతే వీరు ఆందోళనకు గురవుతున్నారని, నిరుత్సాహానికి గురవుతున్నారని వీరు అంటున్నారు. స్మార్ట్ఫోన్లు విస్తృత వ్యాప్తిలోకి వచ్చిన 2011 సంవత్సరం నుంచి జరిగిన వేర్వేరు అధ్యయనాలు పిల్లలు, యువతీయువకుల్లో 10 – 30 శాతం మంది వీటిని తగువిధంగా వాడటం లేదని ఇప్పటికే ఒక విశ్లేషణ ఉంది. ఇదే లెక్కన చూస్తే వీరిలో సగటున 23 శాతం మంది సమస్యాత్మక స్మార్ట్‌ఫోన్ వినియోగం చేస్తున్నారని శాస్త్రవేత్తలు గుర్తించారు. స్మార్ట్‌ఫోన్ వ్యసనానికి బానిసలు కావడం వల్ల మానసిక సమస్యల బారిన పడుతున్నారని తేల్చారు. -
తు‘ఫోను’
సాక్షి, పార్వతీపురం(విజయనగరం) : ఫోన్ లేకుండా ఒక్క క్షణం ఉండలేని కార్తీక్ ఇంట్లో వారితో మాట్లాడటం తగ్గించేశాడు. అందరూ ఉన్నా ముభావంగా వ్యవహరించడం, వణకడం, స్థిరత్వం లేనిచూపులు, నిలకడ లేని ప్రవర్తన చూసి కుటుంబ సభ్యులు కలత చెందారు. అతనిలో వస్తున్న మార్పుతో నిపుణులను సంప్రదించగా నోమోఫోబియాతో బాధ పడుతున్నాడని తేల్చారు. సకాలంలో గుర్తించి కొద్దిపాటి కౌన్సెలింగ్‌తో అతని సమస్యను పోగొట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సంఘటన మాదిరిగానే ఇప్పుడు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో ఇలాంటి కేసులు నమోదౌతున్నాయి. నిత్యం ఫోన్లో ఆటలు, చాటింగ్ చేయడం, ఫేస్బుక్ వినియోగం, వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు రాత్రి పగలు చేయడం నోమో ఫోబియాకు గురౌతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ ఫోబియా బారిన పడటానికి ప్రధాన కారణం యువత చదువుతున్నా, పడుకున్నా, తింటున్నా, బస్టాప్‌లో నిల్చున్నా, ఆఫీసులో ఉన్నా, సినిమా హాలుకు వెళ్లినా, బ్యాంక్‌కు వెళ్లినా, కళాశాలకు వెళ్లినా వెంట సెల్ఫోన్లు పట్టుకుని అదే పనిగా వాటిని వాడడమేనని సర్వేలు చెబుతున్నాయి. మొబైల్ వాడకం ఒక వ్యసనం ఫోన్ లేకపోతే ఏర్పడే భయాన్నే నోమో ఫోబియాగా చెబుతుంటారు. నో మొబైల్ ఫోన్ నోబియా అనే పదం నుంచి సంక్షిప్తంగా దీనికి నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సెల్ఫోన్లు వాడుతున్న దేశంగా భారత్ అవతరిస్తోంది. ఈ క్రమంలో ఈ రుగ్మతకు గురవుతున్న అత్యధిక బాధితుల సరసన కూడా చేరబోతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేకమంది యువత ఫోన్ లేకుండా ఉండలేని స్థితికి చేరుతున్నారు. దీని తర్వాత దశ నోమోఫోబియానే అని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. 66 శాతం మంది మధ్య పెద్ద వయస్కులు దీన్ని ఎదుర్కొంటున్నారు. నోమోఫోబియా లక్షణాలు ► మొబైల్‌ఫోన్, కంప్యూటర్ వంటి పరికరాలు అందుబాటులో లేకపోయినా, సిగ్నల్స్ సరిగ్గా అందకపోయినా ఆందోళనకు గురవుతారు. ► కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ముఖాముఖి కలిసేందుకు మానసిక సంసిద్ధత గణనీయంగా తగ్గిపోతుంది. ► ఒంటరితనం, కుంగుబాటుతో బాధపడతారు. ► బయటికి వెళ్లాల్సి వస్తే చార్జర్, పవర్‌బ్యాంక్, అదనపు డివైజ్‌లను వెంట తీసుకెళ్లాలనుకుంటారు. ► చెమటలు రావడం, వణుకుడు, ఆందోళన, తమను తామే కొట్టుకోవడం వంటివి కనిపిస్తాయి. ఇలా బయట పడొచ్చు సకాలంలో ఈ లక్షణాలను పసిగట్టి తగిన మానసిక చికిత్స ఇప్పిస్తే సమస్యను పరిష్కరించుకొనే అవకాశం ఉంది. గ్రూప్ డిస్కషన్, నెలలో ఒకరోజు సెల్‌ఫోన్, కంప్యూటర్, ట్యాబ్, వంటివాటికి దూరంగా ఉండటం, నిద్ర పోవడానికి ముందు వీటిని కనీసం పదిహేను అడుగుల దూరంలో ఉంచడం చేయాలి. ఫోన్ పక్కనే ఉంటే నిద్రా భంగమే. కుటుంబసభ్యులు, స్నేహితులు వీరితో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల సాధారణ పరిస్థితులు సృష్టించవచ్చన్నదే నిపుణులు చెప్పేమాట. ఇటీవల ప్రధాన పట్టణాల్లో రెండు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. స్నేహితులు, బంధువులతో ఫోన్లో కాకుండా నేరుగా కలిసి మాట్లాడటం వల్ల మానవ సంబంధాలు మెరుగుపడతాయి. సెల్‌ఫోన్, కంప్యూటర్లతో చేయాల్సిన పనులకు ఒక నిర్ణీత సమయం పెట్టుకోవడం వంటివి చేయొచ్చు. ఎవరికి వారే స్వీయ నియంత్రణ అవసరం. మరిన్ని ప్రత్యామ్నాయాలు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల్లో సెల్ఫోన్లను నిషేధించింది. దీనిని పాఠశాలలు, కళాశాలలకే పరిమితం చేయకుండా విశ్వవిద్యాలయాలకు వర్తింపజేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన రాష్ట్రంలో కూడా ఈ విధానం అమలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ప్రైవేటు కార్యాలయాల్లోని యువతకు సెల్‌ఫోన్, కంప్యూటర్, ట్యాబ్‌లు తప్పని సరి. అక్కడే విధులు నిర్వర్తించడానికి రెండురోజులు వారాంతపు సెలవులున్నా, ఎక్కువ మంది వాటి ద్వారా ఆయా రోజుల్లో కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. ఈ పనులకంటూ కచ్చితమైన ఒక సమయం పెట్టుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. బానిసలౌతున్న యువత మొబైల్ ఫోన్లకు యువత బానిసలవుతున్నారని అంతర్జాతీయ సంస్థల సర్వేలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఈ పరిస్థితి ఇప్పుడిప్పుడే తీవ్రరూపం దాలుస్తోంది. ప్రస్తుతం 23 శాతం యువత నోమోఫోబియాకు గురవుతున్నారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాల తర్వాత ప్రస్తుతం విశాఖపట్నంలో ఎక్కువగా ఈ కేసులు నమోదౌతున్నాయని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఈ కేసుల లక్షణాలు యువతలో కనిపిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. యువత, విద్యార్థులు రోజలో కనీసం 31 పర్యాయాలు సెల్‌ఫోన్ చూసుకుంటున్నారు. సుమారు 3 గంటల పాటు సెల్‌ఫోన్‌తోనే గడుపుతున్నారని తేలింది. పదేపదే ఈ రకమైన కాలక్షేపం వల్ల మానసిక, శారీరక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెబుతున్నారు. నోమోఫోబియా బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా సమస్య నుంచి దూరం చేయవచ్చు. ఆలోచనల్లో మార్పులు తీసుకురావడం, టాక్ థెరపీ, విశ్రాంతి వంటి పద్ధతుల ద్వారా సమస్యను పరిష్కరించొచ్చు. నెట్ వర్క్‌ను పరిమితంగా వినియోగించుకొనేలా మార్గనిర్ధేశం చేస్తాం. ఫోన్‌కు దూరమైతే నోమో ఫోబియా దూరమౌతుంది. – శ్రీహరి, మానసిక నిపుణుడు విపరీత వినియోగంతో ఫోబియా సెల్ ఫోన్‌ను విశ్రాంతి లేకుండా అదే పనిగా వినియోగించడం వల్ల యువత అనేక రగ్మతలకు గురౌతోంది. అలాంటి కేసులు తరచూ వస్తున్నాయి. తలనొప్పి, నరాలు పట్టేయడం, స్థిరత్వం లేని మాటలు ఆడటం వంటి కేసులు వస్తున్నాయి. అన్నం తిన్నా, పడుకోవడానికి వెళ్లినా, చివరికి బాత్రూంకు వెళ్లినా సెల్‌ఫోన్ పట్టుకుని వెళ్లే కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రాథమిక స్థాయిలో గుర్తించిన ఇలాంటి కేసులను కౌన్సెలింగ్ కోసం రిఫర్ చేస్తున్నాం. – డాక్టర్ నాగభూషణ్‌రావు, సూపరింటెండెంట్, పార్వతీపురం ఏరియా ఆసుపత్రి -
ఇంటర్నెట్.. కనికట్టు
పెంచికల్పేట్ : చేతిలో సెల్ ఫోన్ ఉండి దానిలో డాటా ఉంటే చాలు పక్కన నుంచి వెళ్లేవారు ఎవరు పిలిచిన పలికే వారు లేరు.యువత చేతిలో సెల్‌ఫోన్ మంచికి ఉపయోగించాల్సి ఉండగా సామాజిక మాధ్యమాల్లో సమయం వృథా చేసుకుంటున్నారు.ఒకప్పుడు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం అయిన సెల్‌ఫోన్ వినియోగం నేడు గ్రామాల్లోకి విస్తరించింది.ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు చిన్నారులు, యువత, విద్యార్థులు ఎక్కువ సమయం సెల్ఫోన్లతోనే మమేకం అవుతున్నారు.ఒక విధంగా చెప్పాలంటే సెల్‌ఫోన్ మనిషి శరీరంలో ఒక భాగం అయింది.అవసరాలకు వినియోగించాల్సిన సెల్‌ఫోన్ అదేపనిగా వాడుతూ బానిసలవుతున్నారు. యువత చిత్తు.. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు సెల్‌ఫోన్ లేని వారు లేరు.ఇంటర్నెట్ను కేవలం మంచి పనులకు ఉపయోగించాల్సిన యువత లేచి మొదలు ఫేస్బుక్, వాట్సప్, ఆన్‌లైన్‌గేమ్‌లకు వినియోగిస్తూ విలువైన సమయాన్ని వృథాచేస్తున్నారు.చదువుకోవాల్సిన వయస్సులో యువత ఇంటర్నెట్లో మునిగిపోవడంతో యువత పెడదోవపడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళణ చెందుతున్నారు. మార్కెట్లో చౌకధరల ఫోన్లు.. మార్కెట్లో అతితక్కువ ధరలకే ఆధునికి పరిజ్ఞానంతో నూతన ఆండ్రాయిడ్ వర్షన్లతో రోజుకో మొబైల్ మార్కెట్లోకి వస్తుండటంతో పాటు అతి తక్కువ ధరలకే కంపెనీలు డాటాను అందిస్తుండటంతో వినియోగించే వారి సంఖ్య పెరుగుతుంది.సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయింది.దీంతో పగలు రాత్రి తేడా లేకుండా యువత విద్యార్థులు సందేశాలను పంపుతున్నారు. విద్యార్థులకు దూరంగా.. మార్చి నెల అనగానే పది,ఇంటర్మీడియట్,డిగ్రీ,విద్యార్థులకు వార్షిక పరీక్షల సమయం దీంతో మార్చి నెలలో జరిగే వార్షిక పరీక్షలకు విద్యార్థులు సిధ్దం అవుతున్నారు.సెల్‌ఫోన్ వినియోగించేవిద్యార్థులు వారి విలువైన స మయం వృథా కావడమే కాకుం డా ఒత్తిడికి లోనవుతున్నారు.విద్యార్థుల విలువైన సమయం వృథా అవడమే కాకుండా వారి భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఇబ్బందులు తప్పవు సెల్‌ఫోన్ వినియోగం వలన ఎన్ని ప్ర యోజనాలు ఉన్నాయో అందరికి తెలు సు కానీ సెల్‌ఫోన్ జాగ్రత్తగా వినియోగించకపోతే అంతకంటే ఎక్కువ నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇంటర్నెట్ను మంచి కొరకు ఉపయోగించాల్సి ఉండగా అనవసరంగా వాడుతుండటంతో కేసుల్లో ఇరుకుతున్న యువత పెరిగిపోతున్నారు.యువతను కాస్తా కనిపెట్టి ఉండాలి లేక పోతే ప్రమాధాలను కొనితెచ్చుకునే అవకాశం ఉంది. – ప్రభాకర్,ఎస్సై పెంచికల్పేట్ సెల్‌ఫోన్ వినియోగంతో.. పరీక్ష సమయంలో యువత సెల్‌ఫోన్‌తో ఎక్కువ వినియోగించడం వలన యువత ఒత్తిడికి లోనవడమే కాకుండా కంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు సెల్‌ఫోన్‌తో మమేకం కావడం వలన ఏకాగ్రత దెబ్బతినండంతో కంటి చూపు దెబ్బతింటుంది.పరీక్ష సమయంలో యువత సెల్‌ఫోన్ దూరంగా ఉంచితేనే మంచిది. – డాక్టర్ రాజు, పీహెచ్సీ వైద్యుడు -
'టెక్'కు బానిసలుగా టీనేజర్లు
టీనేజ్ పిల్లలు చెడు తిరుగుళ్లుతో పాటు, మద్యానికి ఎక్కడ బానిసలవుతున్నారో అని తల్లిదండ్రులు తెగ బాధపడేవారు. అయితే ఇప్పుడు 60శాతానికి పైగా టీనేజర్లు ... స్మార్ట్ ఫోన్లకు, మొబైల్ డివైజ్ లకు ఎక్కువగా అతుకుపోతున్నారట. టెక్ బానిసలుగా మారుతున్న తమ పిల్లలను తీరుపై తల్లిదండ్రులు బాధపడినట్టు ఓ సర్వేలో తేలింది. యుక్త వయస్కులైన తమ పిల్లలు టెక్ కు ఫుల్ గా బానిసలవుతున్నారని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు ఆ సర్వే తెలిపింది. పిల్లలు టెక్నాలజీని ఎలా వాడుతున్నారో తెలుసుకోవడం కోసం 1,200 మంది టీనేజర్లు, తల్లిదండ్రులపై కామన్ సెన్స్ మీడియా సర్వే చేపట్టింది. సర్వేలో తేలిన కీలక అంశాలు... 59 శాతం మంది తల్లిదండ్రులు వారి టీనేజి పిల్లలు మొబైల్ ఫోన్లకు, టాబ్లెట్స్ కు ఎక్కువగా బానిసలవుతున్నారని అభిప్రాయాలు వ్యక్తంచేశారు. 50 శాతం మంది టీనేజీ పిల్లలు మొబైల్ ఫోన్లపై ఎక్కువ సమయాన్ని గడుపుతున్నట్టు చెప్పారు. 27 శాతం మంది తల్లిదండ్రులు వారే ఎక్కువగా మొబైల్ డివైజ్ లకు బానిసలైన్నట్టు ఒప్పుకున్నారు. 28 శాతం మంది టీనేజీ పిల్లలు వారి తల్లిదండ్రులు మొబైల్ ఎక్కువగా వాడుతారని పేర్కొన్నారు. 66 శాతం తల్లిదండ్రులు వారి టీనేజి పిల్లలు చాలా ఎక్కువ సమయాన్ని మొబైల్ డివైజ్ లపైనే గడుపుతున్నారని బాధపడ్డారు. 66 శాతం మంది తల్లిదండ్రులు డిన్నర్ సమయంలో మొబైల్ డివైజ్ లను అనుమతిచడం లేదని చెప్పారు. 56 శాతం మంది తల్లిదండ్రులు ,51 శాతం టీనేజీలు డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ డివైజ్ ను చూస్తున్నట్టు ఒప్పుకున్నారు. 85 శాతం మంది తల్లిదండ్రులు మొబైల్ డివైజ్ ల వల్ల తమ పిల్లలతో ఉన్న అనుబంధాలకు ఎలాంటి ముప్పు లేదని చెప్పారు. 89 శాతం మంది టీనేజీ పిల్లలు కూడా ఇదే భావనను వ్యక్తంచేశారు.