సందేశాన్నిచ్చేలా తీర్చిదిద్దిన రంగవల్లి ఇదే, అడ్డిగ శ్రావణ్ కుమార్ (ఫైల్)
నిర్మల్: సంక్రాంతి అంటే రంగవల్లులకు పేరు. అయితే ఆ సంక్రాంతి ముగ్గులో విభిన్నతను ప్రదర్శించాలనుకున్నాడు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన చిత్రకారుడు అడ్డిగ శ్రావణ్ కుమార్.. ప్రస్తుత కాలంలో విద్యార్థులు, యువత వయసు ప్రమేయం, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సామాజిక మాధ్యమాలకు బానిసగా మారుతున్నారు. అధికసమయాన్ని వీటికే వెచ్చిస్తున్నారు. ఇదే అంశాన్ని స్థానిక మంజులాపూర్ కాలనీకి చెందిన శ్రావణ్‌కుమార్ తన ఇంటిముందు స్వయంగా వేసిన ముగ్గులో సందేశం రూపంలో అందించాడు.
రోడ్డుపై వచ్చిపోయే వారు సందర్శించేలా ‘‘డోంట్ బి అడిక్టెడ్’’ అంటూ వేసిన ఈ ముగ్గు పలువురిని ఆకట్టుకుంటుంది. ఈ ముగ్గులో పలు సామాజిక మాధ్యమాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దాడు. ఫేస్‌బుక్, ఇంస్ట్రాగామ్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, జిమెయిల్, గూగుల్ క్రోమ్ వంటి పలు ఇంటర్నెట్ సోషల్ మీడియాను మితిమీరి వినియోగిస్తూ వాటికే అడిక్ట్ అవుతున్న తీరును ఇలా సృజనాత్మకంగా ప్రదర్శించడం పలువురిని ఆలోచింపజేస్తోంది. చాలామంది విభిన్నరీతిలో ఇచ్చిన సందేశాన్ని ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: సంక్రాంతికి ముగ్గులు వేయడంలో దాగున్న ప్రాశస్త్యం ఏంటీ?
Comments
Please login to add a commentAdd a comment