muggulu
-
సంక్రాంతికి ముగ్గులు వేయడంలో దాగున్న ప్రాశస్త్యం ఏంటీ?
'సంక్రాంతి వచ్చింది తుమ్మెద' 'సరదాలు తెచ్చింది తుమ్మెదా'.. అన్న పాటలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగ కోసం ఎక్కడెక్కడ ఉన్నవాళ్లు కష్టపడి మరి తమ సొంతూళ్లకి వచ్చేస్తారు. ఎంత ఖర్చు పెట్టి అయినా పండుగకి ఊరు వెళ్లి పోవాల్సిందే. అక్కడ ఉండే సందడే వేరు. ముఖ్యంగా కోడిపందాలు, పిండి వంటలతో ఊరు ఊరంతా సందడి సందిడిగా ఉంటుంది. ఈ పండుగల్లో మంచి ఆకర్షణగా కనిపించేవి ముగ్గులు. వచ్చిరాని పడుచులు సైతం ఏదో రకంగా ముగ్గు వేసి శభాష్ అనిపించుకోవాలని తెగ ఆరాట పడిపోతుంటారు. అసలు ఈ నాలుగు రోజుల పండుగల్లో కచ్చితంగా రకరకాల రంగవల్లులతో ముగ్గులు పెడతారు ఎందుకని? దీని వెనుక దాగున్న రహస్యం ఏంటీ? వాస్తవానికి సాధారణ రోజుల్లో కూడా ఇంటి ముందు ముగ్గులు వేస్తాం. ఇలా ముగ్గులతో వాకిళ్లను అందంగా అలంకరిస్తే ఇంటికి శ్రేయస్సును తెస్తాయని పెద్దల నమ్మకం. పైగా లక్ష్మీ దేవిని ముచ్చటపడి ఇంట్లోకి వస్తుందని, ఆమె అనుగ్రహం లభిస్తుందని పురాణ వచనం. ముగ్గు ప్రాముఖ్యత.. హిందూసంప్రదాయంలో ముగ్గులకు అధిక ప్రాధాన్యం ఉంది. ముగ్గులు వేయడానికి ఎంతో చారిత్రక సంబంధం కూడా ఉంది. ముగ్గుల్లో తామర పువ్వు, పూల ఆకారాలు, నెమళ్లు, మామిడి పండ్లు, చేపల చిహ్నాలు ఎక్కువగా ఉంటాయి. రంగురంగుల ముగ్గులను చూసినప్పుడు ప్రశాంతత, దైవిక శక్తుల ఉనికిని అనుభవిస్తారు. ఇంట్లోకి దేవతలను స్వాగతించడానికి, ప్రజలను ఆశీర్వదించడానికి దేవతల చిత్రాలను, లక్ష్మీ దేవి పాద చిహ్నాలను గీస్తారు. అలాగే అతిథులను స్వాగతించడానికి కూడా ఇలా ముగ్గులు వేస్తారు. అయితే చరిత్ర మాత్రం చెడున అరికట్టి మంచి చేకూరాలనే ఉద్దేశ్యంతో తెల్లటి బియ్యపిండితో ముగ్గు వేస్తారని చెబుతోంది. ఇది శరీరానికి మంచి ఫిట్నెస్ లాంటిది కూడా.. ఓర్పును నేర్పే కళ… ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్ల ముగ్గో వేస్తే చాలు. గంటసేపు ట్రెడ్మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. అందులోను జారిపోయే కొంగును సరిచేసుకుంటూ.. ముందుకు పడే జడను వెనక్కి వేసుకుంటూ.. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి. భోగి నాడు వేసే ముగ్గు ఇష్టంతో కూడిన కష్టం! పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కాని భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత, ముగ్గువేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం, సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు, భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గు వేయడం కొంచెం కష్టంతో కూడుకున్నప్పటికి ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు, రోజు వేసే ముగ్గుల కన్నా ఈ రోజు మరింత అందంగా రంగు రంగుల రంగవల్లికలేస్తారు. శాస్త్రీయ కారణాలు.. చుక్కలను కలిపే వక్ర నమూనాలు విశ్వంలోని అనంతమైన స్వభావాన్ని సూచిస్తాయి. ఇటువంటి నమూనాలు ధ్వని వేవ్ హార్మోనిక్స్‌ను పోలి ఉంటాయి. వీటిని చూస్తే డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలతో సహా అనేక రుగ్మతలు దరిచేరకుండా మనసు ఆహ్లాదభరితంగా ప్రశాంతంగా ఉంటుంది. తెలియకుండానే మనసులో ఓ ఆధ్యాత్మకి భావన వస్తుంది. విశ్వకవి రవీంద్రుడు సైతం ముగ్గు గురించి ప్రస్తావించారు! అంతేకాదండోయ్ రవీంద్రనాథ్ ఠాగోర్ 1919 లో రాసిన 'బంగ్లర్ బ్రత' అనే పుస్తకంలో వ్రతం, పూజ విధానాలలో 'అల్పన' (ముగ్గు) గురించి ప్రస్తావించారు. లక్ష్మీకాంత్ ఝా అరిపన్' మిథిల జానపద సంస్కృతి గురించి రాసిన రచనలలో రంగోలి ప్రస్తావన తెచ్చారు. ఇక ఈ ముగ్గులు వేయడం అనేది కేవలం దక్షిణాదికే పరిమితం కాదని భారతదేశం అంతటా ఈ ముగ్గులు వేయడం అనేది వారి సంస్కృతిలో భాగం అని పరిశోధకులు కూడా పేర్కొన్నారు. అంతేగాదు కామశాస్త్రంలో ప్రస్తావించిన 64 కళల్లో నృత్యం, సంగీతం, తలపాగాలు చుట్టడం, పూల మాలలు అల్లడం, వంటలు, అల్లికలతో పాటు ముగ్గులు వేయడాన్ని కూడా ఒక కళగా పేర్కొన్నారని చెప్పారు. అంతటి ప్రాశస్యం గల ఈ ముగ్గులను రకరకాల రంగవల్లులతో తీర్చిదిద్ది కలర్ఫుల్గా జోయ్ఫుల్ చేసుకోండి ఈ సంక్రాంతి పండుగని. (చదవండి: భోగి రోజే గోదా కళ్యాణం.. చిన్నారులకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు?) . -
సందేశాన్నిచ్చిన సంక్రాంతి ముగ్గు.. 'డోంట్ బి అడిక్టెడ్'
నిర్మల్: సంక్రాంతి అంటే రంగవల్లులకు పేరు. అయితే ఆ సంక్రాంతి ముగ్గులో విభిన్నతను ప్రదర్శించాలనుకున్నాడు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన చిత్రకారుడు అడ్డిగ శ్రావణ్ కుమార్.. ప్రస్తుత కాలంలో విద్యార్థులు, యువత వయసు ప్రమేయం, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సామాజిక మాధ్యమాలకు బానిసగా మారుతున్నారు. అధికసమయాన్ని వీటికే వెచ్చిస్తున్నారు. ఇదే అంశాన్ని స్థానిక మంజులాపూర్ కాలనీకి చెందిన శ్రావణ్‌కుమార్ తన ఇంటిముందు స్వయంగా వేసిన ముగ్గులో సందేశం రూపంలో అందించాడు. రోడ్డుపై వచ్చిపోయే వారు సందర్శించేలా ‘‘డోంట్ బి అడిక్టెడ్’’ అంటూ వేసిన ఈ ముగ్గు పలువురిని ఆకట్టుకుంటుంది. ఈ ముగ్గులో పలు సామాజిక మాధ్యమాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దాడు. ఫేస్బుక్, ఇంస్ట్రాగామ్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, జిమెయిల్, గూగుల్ క్రోమ్ వంటి పలు ఇంటర్నెట్ సోషల్ మీడియాను మితిమీరి వినియోగిస్తూ వాటికే అడిక్ట్ అవుతున్న తీరును ఇలా సృజనాత్మకంగా ప్రదర్శించడం పలువురిని ఆలోచింపజేస్తోంది. చాలామంది విభిన్నరీతిలో ఇచ్చిన సందేశాన్ని ప్రశంసిస్తున్నారు. ఇవి కూడా చదవండి: సంక్రాంతికి ముగ్గులు వేయడంలో దాగున్న ప్రాశస్త్యం ఏంటీ? -
వాకిళ్లు కళ కళ..
సంక్రాంతి వచ్చిందంటే ప్రతి వాకిలి ముగ్గులతో మురిసిపోతుంది. తెల్లటి చుక్కలు మల్లెల్లా ఇంటిముందు వికసిస్తాయి. రంగులు పూసుకొని ముస్తాబవుతాయి. స్త్రీలు తెల్లవారుజాము నుంచి ఓపిగ్గా వీటిని తీర్చుదిద్దుతారు. నిలువు చుక్కలు, అడ్డ చుక్కల మధ్య మెలి తిరుగుతూ రేఖలు కదులుతాయి. ఈ ముగ్గుల వెనుక చాలా విశేషాలున్నాయి. శుభాలూ ఉన్నాయి. బోసి వాకిలిని ముగ్గుతో ఎందుకు కళను నింపాలో తెలుసుకుందాం. సంవత్సరమంతా ఇంటి వాకిలి ముందు సుద్దముక్కతో అమ్మ గీసే ముగ్గు వేరు. సంక్రాంతి రాగానే వేసే ముగ్గు వేరు. సంక్రాంతి పండగ నెలంతా ఇంటిముందు పెద్ద ముగ్గులు పడతాయి. తెల్లగీతలతో ఒక్కోసారి, రంగులతో నిండి ఒక్కోసారి. పండగ నెల వస్తే వీధిలోని స్త్రీలంతా తెల్లవారు జామున లేచి ఇంటి ముందు పెద్ద ముగ్గును వేయడానికి ఇష్టపడతారు. కాని అది ఒక నిమిషంతో అయ్యేదా? వాకిలి చిమ్ముకోవాలి, కళ్లాపి చల్లుకోవాలి, తర్వాత చుక్కలు పెట్టాలి, చుక్కలు కలపాలి, రంగులు అద్దాలి.. యోగా అంటారు గాని ఇంతకు మించిన యోగా లేదు. ఇంతకు మించిన వ్యాయామమూ లేదు. ముగ్గు పెట్టాక ఇంటికి ఇంతకు మించిన కళ లేదు. మనకు ఉంది... మరి క్రిమి కీటకాలకు? సంక్రాంతికి పంట చేతికొస్తుంది. కొత్త బియ్యం ఇంట చేరుతాయి. గాదెలు నిండుతాయి. వడ్ల బస్తాలున్న ఇల్లు సమృద్ధిగా కనిపిస్తుంది. కాని పండించింది మనమే తింటే ఎలా? క్రిమి కీటకాదులకు? ముగ్గు ఒక పంపకం. ముగ్గు ఒక దానం. ముగ్గు ఒక సంతర్పణ. ఎందుకంటే ముగ్గును బియ్యం పిండితో వేస్తారు. బియ్యం సమృద్ధిగా ఉన్నప్పుడు బియ్యం పిండితో పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి కొదవేముంది? ఆ పిండి ముగ్గు వేస్తే ఆ పిండిని చీమలు, క్రిములు, కీటకాలు ఆరగిస్తాయి. అలా ప్రకృతిని సంతృప్తి పరిచిన ఇంటిని ప్రకృతి కాచుకుంటుంది. శుభం జరుగుతుంది. ముగ్గు ఆడవాళ్ల సొంతం భారతీయ సంస్కృతిలో హరప్పా, మొహెంజోదారో కాలం నాటి నుంచే అంటే క్రీ.పూ 2000 కాలం నుంచే ముగ్గులు ఉన్నట్టు ఆధారాలున్నాయి. తమిళనాడులో ముగ్గుకు విశేష ఆదరణ ఉంది. ఉత్తరాదిలో ముగ్గును ‘రంగోలి’ అంటారు. తెలుగువారి సంస్కృతిలో ముగ్గు ఉందనడానికి సాహిత్య తార్కాణాలున్నాయి. కాకతీయుల గాథను తెలిపే ‘క్రీడాభిరామం’లో ‘చందంబున గలయంపి చల్లినారు.. మ్రుగ్గులిడినారు’ అని ఒక పద్యంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ‘ఆముక్త మాల్యద’లో ‘బలువన్నె మ్రుగ్గుబెట్టి’ అని ఒక పద్యంలో రాశాడు. అయితే తొలి రోజుల్లో పురుషుల కళగా ఉన్న ముగ్గు క్రమేపి స్త్రీల కళగా మారింది. స్త్రీని ఇంటి పట్టునే ఉంచడం వల్ల, వంటకు, పూజకు, భక్తి గీతాలకు మాత్రమే అనుమతించడం వల్ల, చాలాకాలం ఇతర లలిత కళలకు దూరంగా ఉంచడం వల్ల ‘ఎవరి కంట పడకుండా’ ఇంటి పట్టున సాధన చేసుకునే ముగ్గు మీద ఎవరికీ అభ్యంతరం లేక΄ోయింది. దాంతో స్త్రీలు తమ సృజనాత్మకతను ముగ్గుల్లో చూపారు. ముగ్గుల వల్ల కొద్దో గొప్పో లెక్కలు తెలియడం, ధ్యాస నిలవడం, వేసుకున్న ముగ్గును చూసి సంతృప్తి చెందడం ఆడవాళ్లకు వీలయ్యింది. అంతేకాదు తెల్లవారు జామున స్త్రీలు లేచి వీధి మొత్తాన్ని పలకరించుకుంటూ మానవ సంబంధాలు పెంచుకునే వీలు చిక్కింది. కష్టసుఖాలు మాట్లాడుకునే వీలు కూడా. మనం వేసిన ముగ్గున మరుసటి రోజున మనమే చెరిపిపేయడంలో ఎప్పటికప్పుడు జీవితాన్ని కొత్తగా మొదలెట్టాలన్న భావన, గతం గతః అనుకునే తాత్త్వికత ఏర్పడతాయి. ఇప్పటి కాలంలో కూడా ముగ్గుల్లో మగవాళ్లకు ప్రవేశం లేకపోవడం గమనార్హం. రకరకాల ముగ్గులు ముగ్గుల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటి చుక్కలను బట్టి, రూ΄ాలను బట్టి ఆధ్యాత్మిక, ధార్మిక వ్యాఖ్యానాలు ఉంటాయి. తొమ్మిది చుక్కల ముగ్గు నవగ్రహాలకు ప్రతీక అని, చుక్కలు లేకుండా రెండు అడ్డగీతలు గీసి ఖండించుకునే త్రికోణాలతో వేసే ముగ్గు కుండలినికి గుర్తు అని అంటారు. అలాగే పురాణాలను తెలిపే, అవతారాలను సూచించే ముగ్గులు ఉంటాయి. రాను రాను ఈ ముగ్గులు సందేశాత్మకంగా కూడా మారాయి. దేశభక్తిని తెలిపే నాయకుల బొమ్మలు, జాతీయ పతాకాలు ముగ్గుల్లో చేరాయి. ఒక్కోసారి నిరసనలకు, నినాదాలకు కూడా వేదికలయ్యాయి. ముగ్గు ప్రథమ లక్ష్యం పారిశుద్ధత. ఇంటిముంగిలిని శుభ్రం చేసుకుని వేస్తారు కాబట్టి ఆ రోజుల్లోకాని ఈ రోజుల్లోకాని సగం రోగకారకాలు ఇంట్లో రాకుండా ఉంటాయి. అయితే రాను రాను స్త్రీలు బద్దకించి ఆధునికత పేరుతో స్టిక్కర్ ముగ్గులతో సరి పెట్టడం కనిపిస్తోంది. చిటికెన వేళ్ల మధ్య ముగ్గు ఎంత ధారగా వేయడం వస్తుందో అంత నైపుణ్యం వచ్చినట్టు. ముగ్గు వేయడంలో నైపుణ్యం వస్తే జీవితాన్ని చక్కదిద్దుకోవడంలో కూడా నైపుణ్యం వస్తుంది. సంక్రాంతిని బ్రహ్మాండమైన ముగ్గులతో స్వాగతం చెపుదాం. -
Sankranti Muggulu: సంక్రాంతి అందమైన ముగ్గులు (ఫొటోలు)
-
ముగ్గులోనే ముగ్ధరూపాలు
వ్రతం చేసిన ఆండాళ్ భోగినాడు రంగనాథుడిలో ఐక్యం అయిందని ప్రతీతి. ధనుర్మాసంలో దాపున ఉన్న కోవెలలో ముగ్గులతోనే ఆధ్యాతిక ఆరాధన చేసింది హైదరాబాద్‌లో స్థిరపడ్డ కన్నడ చిత్రకారిణి లభ్య. ముగ్గులలోనే అందమైన దేవతా మూర్తులను తీర్చిదిద్దడం బాల్యంలో తన తాత వద్ద నేర్చుకున్నానని చెబుతోంది. లభ్య బొమ్మలు సంక్రాంతి కళకు వన్నె తెచ్చాయి. ‘ఇదంతా మా తాతయ్య చెలువయ్య చలువ’ అంది లభ్య తాను వేసిన ముగ్గు మూర్తులను చూపుతూ కొద్దిగా తెలుగు, మరింత కన్నడం భాషల్లో. హైదరాబాద్ బాచుపల్లిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివసించే లభ్యది బెంగళూరు. ధనుర్మాసం మొదలయ్యాక కమ్యూనిటీలో ఉన్న గుడిలో ఆమె నిత్యం వేసే ముగ్గు బొమ్మలు చుట్టుపక్కల వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక్కో బొమ్మను తీర్చిదిద్దడానికి లభ్య ఏడెనిమిది గంటలు వెచ్చించాల్సి వచ్చింది. ‘మా తాత పేరు చెలువయ్య. ఆయన బెంగుళూరు జ్ఞానభారతి యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పని చేసేవారు. దీపావళి, సంక్రాంతి పండుగ సమయాల్లో ఇంటిముందు చక్కని ముగ్గులు రంగులతో వేసేవారు. చిత్రాన్ని జాగ్రత్తగా వేయడం, దాన్ని రంగులతో నింపడం ఆయన వద్దే నేర్చుకున్నా’ అంటుంది లభ్య. తాత ప్రభావం వల్లే చిన్నప్పటి నుంచి బొమ్మలు గీస్తూ పెరిగిన లభ్య ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తూనే వివిధ రీతుల చిత్రకళని పరిశీలిస్తూ కుంచెకు పదును పెట్టుకుంటూ వచ్చింది. బెంగుళూరులో చిత్రకళ ఉపాధ్యాయినిగా కూడా పని చేసింది. వివాహానంతరం కొన్నాళ్లకి పూర్తి దృష్టి చిత్ర లేఖనం మీద పెట్టే ఉద్దేశ్యంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి గ్వాలియర్‌లోని రాజా మాన్సింగ్ తోమర్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో చిత్రకళను అభ్యసించింది. కాని ఆమె ప్రత్యేకత అద్భుతమైన చిత్రాలను ముగ్గులుగా నేలమీద ఆవిష్కరించడంలో ఉంది. పండుగ సందర్భాల్లో దేవతామూర్తులను, పండగ సందర్భాన్ని రంగుల ముగ్గులుగా చిత్రిస్తుంది.‘ఈ ధనుర్మాసంలో తిరు΄్పావై పాశురాలకు దృశ్యరూపం ఇచ్చాను ముగ్గుల్లో’ అందామె. వీణలో కూడా డిప్లొమా చేసిన లభ్య వద్ద చిత్రకళ నేర్చుకున్న విద్యార్థులు చాలామందే ఉన్నారు. కేవలం గీతలు రంగులు మాత్రమే కాక ఒక చిత్రాన్ని ప్రేమతో, భావోద్వేగంతో ఎలా అర్థం చేసుకోవాలో, భావనల్ని ఆలోచనలని సంప్రదాయకళగా, మోడర్న్ ఆర్ట్‌గా, ఫ్యూజన్ ఆర్ట్‌గా ఎలా మలచవచ్చో లభ్య తన విద్యార్థులకు నేర్పిస్తుంది. 2022 ముంబైలో జరిగిన ఇండియా ఆర్ట్ ఫెస్టివల్లో, బెంగుళూరులో జరిగే ‘చిత్ర సంతె’లో లభ్య చిత్రాలు అమ్ముడు΄ోయాయి. రాజా రవివర్మ చిత్రాలను ఎంతో ప్రతిభావంతంగా లభ్య పునః చిత్రీకరించింది. ఏ కళలో అయినా స్త్రీలు పురోగమించడానికి కుటుంబ బాధ్యతలు కొంత ఆటంకం కల్గిస్తాయని, పురుషులకు ఉన్న సౌకర్యం స్త్రీలకు ఎల్లవేళలా ఉండదంటోంది లభ్య. -
సంక్రాంతి ముగ్గులు వేసిన మంత్రి ఉష శ్రీ చరణ్
-
సాహితీ రంగవల్లికలు
ఇది ధనుర్మాసం. ముగ్గుల మాసం. మకర సంక్రాంతి వరకు ముంగిళ్లలో ముగ్గుల వ్రతాన్ని మహిళలు అప్రతిహతంగా కొనసాగిస్తారు. క్రీస్తుపూర్వం పదిహేనో శతాబ్ది ప్రాంతంలో ఆర్యులు అడుగు పెట్టే నాటికే, సింధులోయ నాగరికత పరిఢవిల్లిన చోట ముగ్గులు ఉండేవనేందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ లెక్కన ముగ్గులు పురాణాల కంటే ప్రాచీనమైనవి. కచ్చితంగా చెప్పుకోవాలంటే, వేదకాలం నాటివి. ముగ్గులు ఆదిమ చిత్రకళా రూపాలు. సింధులోయ ప్రాంతంలోనే కాదు... గ్రీకు, ఈజిప్టు శిల్పాల్లోనూ ముగ్గుల ఆనవాళ్లున్నాయి. ముగ్గులను సంస్కృతంలో రంగవల్లిక అంటారు. సౌరసేని ప్రాకృతంలోని ‘రంగౌలి’ అనే మాట నుంచి ఈ సంస్కృత పదం పుట్టింది. హిందీ, ఉర్దూల్లో ‘రంగోలి’ అంటారు. వాల్మీకి రామా యణంలోని యుద్ధకాండలో ‘ఏకశృంగో వరాహస్త్వం’ అనే వర్ణన ఉంది. సింధులోయ నాగరికత ప్రాంతంలో దొరికిన ముగ్గులలో ఒంటికొమ్ము వరాహరూపం ఈ వర్ణనకు సరిపోతుంది. అంతే కాదు, హరప్పా ప్రాంతంలో దొరికిన వాటిలో ఊర్ధ్వపుండ్రం, త్రిశూలం, అగ్నిగుండం, శివలింగం తదితర రూపాలలోని మెలికల ముగ్గులూ ఉన్నాయి. సున్నపురాతి నుంచి తయారుచేసిన ముగ్గుపిండితోనూ, వరిపిండితోనూ ముగ్గులు వేయడం ఇప్పటికీ అన్ని చోట్లా వాడుకలో ఉన్న ప్రక్రియ. పురాణకాలంలో కర్పూరంతో రంగవల్లులను తీర్చి దిద్దేవారట! నన్నయ మహాభారతం ఆదిపర్వంలో ‘అంగుళలనొప్పె కర్పూర రంగవల్లులు’ అని వర్ణించాడు. వారణావతంలోని లక్క ఇంట్లో ఉండటానికి కుంతీసమేతంగా పాండవులు వస్తున్న ప్పుడు వారికి స్వాగతం పలకడానికి వారణావతపుర వాసులు ఇంటింటా ముంగిళ్లలో కర్పూరంతో ముగ్గులు వేశారని నన్నయ వర్ణన. ‘చిత్రవర్ణాతిశయ నూత్న రత్న చిత్రి/తాంగ రంగవల్లి సురగాంగణముల’ అంటూ శివపురంలోని రంగురంగుల రంగవల్లులను నన్నెచోడుడు ‘కుమారసంభవం’లో వర్ణించాడు. సీతాదేవి చేత జనక మహారాజు ముగ్గులు వేయించాడట! ‘సంతానపరుడమ్మ జనక మహాముని/ తా ముద్దు కూతురిని తా జేరబిలిచి/ ఆవుపేడ తెచ్చి అయినిళ్లు అలికి/ గోవుపేడ తెచ్చి గోపురాలు అలికి/ ముత్యాలు చెడగొట్టి ముగ్గులేయించి’ అని జానపద గీతం ఉంది. ‘పలనాటి వీరచరిత్ర’లో శ్రీనాథుడు ముత్యాల ముగ్గులను వర్ణించాడు. ‘కస్తూరి చేతను కలియ గనలికి/ ముత్యాల తోడ ముగ్గులను బెట్టి/ కర్పూర ముదకంబు కలిపి ముంగిటన్’ అంటూ సంక్రాంతి సమయంలో ఆనాటి ముగ్గుల వేడుకను కళ్లకు కట్టాడు. క్రీడాభిరామంలో వినుకొండ వల్లభరాయడు ‘చందనంబున గలయంపి చల్లినారు/ మ్రుగ్గులిడినారు కాశ్మీరమున ముదమున/ వ్రాసినా రిందు రజమున రంగవల్లి/ కంజముల దోరణంబులు గట్టినారు’ అంటూ చందనంతో కళ్ళాపి చల్లి ఆపైన ముగ్గులు వేసిన వైనాన్ని వివరించాడు. ‘బోటి గట్టిన చెంగల్వపూవుటెత్తు/ దరు పరిణతోరు కదళి మంజరియు గొనుచు/ బోయి గుడినంబి విజనంబు జేయ జొచ్చి/ మ్రొక్కి వేదిక బలు వన్నె మ్రుగ్గు బెట్టె’ అంటూ శ్రీకృష్ణదేవరాయలు తన ‘ఆముక్తమాల్యద’లో ఆలయాల్లో ముగ్గులు వేసే ఆనాటి ఆచారాన్ని వర్ణించాడు. ఆ«ధునికుల్లో తిరుమల రామచంద్ర ముగ్గువేస్తున్న ముదిత గురించి చక్కని సంస్కృత శ్లోకం రాశారు. ‘రచయంతీ రంగలతాం/ మంగళగాత్రీ సలీలం అంగణకే/ విటజన హృదయాంగణకే/ అనంగజ బాధాం విశాలయతి కునూనమ్’. చక్కని అమ్మాయి ముంగిట్లో ముగ్గుపెడుతూ విట జనుల హృదయాలలో మన్మథబాధను విస్తరింపజేస్తున్నదని దీని తాత్పర్యం. ఈ శృంగార శ్లోకాన్ని ఆయన తన పదమూడేళ్ల ప్రాయంలోనే రాయడం విశేషం. ‘ఉగ్గేల తాగుబోతుకు/ ముగ్గేల తాజ మహలు మునివాకిటిలో’ అంటూ శ్రీశ్రీ తన ‘సిరిసిరిమువ్వ శతకం’లో ముగ్గు ప్రస్తావన తెచ్చారు. నేల మీద ముగ్గులు మనుషులు వేస్తారు గానీ, నీలాకాశం మీద చుక్కల ముగ్గులు వేసేది సాక్షాత్తు భగవంతుడేనని కరుణశ్రీ నమ్మకం. ‘పనిమాలి ప్రతిరోజుప్రాణికోటుల గుండె/ గడియారముల కీలు కదపలేక/ అందాలు చింద నీలాకాశ వేదిపై/ చుక్కల మ్రుగ్గులు చెక్కలేక/ ఎంతశ్రమ యొందు చుంటివో యేమొ స్వామి’ అంటూ దేవుడి కష్టానికి కలత చెందడం ఆయనకే చెల్లింది! ముగ్గుతో ముడిపడిన జాతీయాలు, సామెతలు కూడా ఉన్నాయంటే, ముగ్గులు మన సంస్కృతిలో ఎంతగా పెనవేసుకు΄ోయాయో అర్థం చేసుకోవచ్చు. బాగా నెరిసిన తలను ‘ముగ్గు బుట్ట’ అంటారు. ‘ముగ్గులోకి దించడం’ అంటే ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ‘వాయువేగమును మించి, లోకాలను గాలించి, చిటికెలోనే ఉన్న చోటికే వచ్చు. అదేమిటి?’ అనే ΄పొడుపు కథ ఉంది. దీనికి సమాధానం ‘ముగ్గు'. మొదలు పెట్టిన చోటే ముగించడం ముగ్గు కళలో ప్రత్యేకత. ‘మరిగే నూనెలో ముచ్చటైన ముగ్గు. తీసి తింటే కరకరమంటుంది’ అనే ΄పొడుపు కథకు సమాధానం ‘జంతిక’. జంతికలు చూడటానికి మెలికల ముగ్గుల్లాగానే ఉంటాయి కదా! భారతీయులకు ముగ్గులు ముదితల వ్యవహారమే గానీ, కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో ముగ్గులు వేయడం పురుషుల బాధ్యత. ఆఫ్రికన్లు ముగ్గులు వేయడానికి సున్నపురాతి ముగ్గుపిండి, వరిపిండి వంటివేమీ వాడరు. నేరుగా ఇసుకలోనే వేలితో లేదా కర్రపుల్లతో చుక్కలు పెట్టి, చుక్కల చుట్టూ మెలికల ముగ్గులు తీర్చిదిద్దుతారు. ముగ్గుల కళ దేశదేశాల్లో వ్యాపించి ఉన్నా, మన భారతీయ సాహిత్యంలో మాత్రం ముగ్గుల ప్రస్తావన విస్తారంగా కనిపిస్తుంది. అదీ విశేషం! -
సప్తవర్ణాలతో విరబూసిన ‘సంక్రాంతి’ ముగ్గులు
-
ముగ్గు-ముచ్చట
-
Home Creations: పండగ వేళ.. ఈ ముగ్గులతో మీ ఇంటికి ప్రత్యేక శోభ!
అందమైన రంగవల్లికలతో పండగల రోజుల్లో ప్రత్యేకంగా ఇంటిని సింగారించుకుంటున్నాం. ఆ రంగవల్లికలే అలంకరణ వస్తువుల మీదా కొత్తగా ముస్తాబు అయితే.. ఎంత చూడముచ్చటగా ఉంటుందో ఈ చిత్రాలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ‘సావీస్ హోమ్’ పేజీతో ఈ క్రియేషన్స్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అందిస్తున్నారు స్రవంతి. ఇంటి అందాన్ని పెంచడం ఎలాగో ‘ముగ్గు’ను ముచ్చటగా పెయింట్ చేసి మరీ చూపుతున్నారు. మెలికలుగా తీర్చిన ముగ్గును ఏయే రూపాల్లో వేసుకోవచ్చో.. ముఖ్యంగా పండగలు, ఇంట్లో చేసుకునే చిన్న చిన్న వేడుకలు, ప్రత్యేక సందర్భాలలో ముగ్గు కళతో ఇంటి అందాన్ని ఎలా పెంచుకోవచ్చో చూద్దాం. ఆసనంపైన అందం పూజల్లో ఆసనంగా వాడే పీట, చుట్టూ అలంకరణకు వాడే పొడవాటి చెక్క ముక్కలు, బల్ల వంటివి పసుపు, ఎరుపు, పచ్చ రంగు పెయింట్ మీద వేసిన తెల్లని పెయింట్ ‘ముగ్గు’ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వాకిట్లో గుమ్మం ముందు వేసిన ముగ్గు డిజైన్‌ను ఇలా పీట మీద పెయింట్‌గా వేసి, ఆత్మీయులకు కానుకగానూ ఇవ్వచ్చు. మీ అభిరుచిని సరికొత్తగా తెలియజేయవచ్చు. షోకేస్‌కి ముగ్గు వాల్ ఫ్రేమ్స్, కీ హోల్డర్స్, చిన్న సైజు అర లున్న షోకేస్ వంటివి గోడపైన అలంకరణగా ఉంచాలనుకుంటే.. వాటిని ఇలా ముగ్గు ముచ్చటతో మురిసిపోయేలా మెరిపించవచ్చు. కొన్నాళ్లుగా వాడి, ఇక పడేద్దాం అనుకున్న చెక్క స్పూన్లు , గరిటెలను కూడా రంగవల్లిక పెయింట్‌తో వాల్ హ్యాంగర్స్‌గా మార్చుకోవచ్చు. ట్రే.. గ్లాస్ హోల్డ్ర్లు కాదేదీ అలంకరణకు అనర్హం అన్నట్టుగా ముగ్గుతో ఇంటిని కళాత్మకంగా ముస్తాబు చేసుకోవచ్చు. చెక్కతో చేసిన ట్రే, గ్లాస్ హోల్డర్స్‌ని ముగ్గుతో ‘కళ’గా అలంకరించవచ్చు. కలపకే ప్రాధాన్యం చెక్కతో తయారైన వస్తువులకు, పూల కుండీలకు రంగవల్లిక ఓ ప్రత్యేక అందాన్ని తీసుకువస్తుంది. అయితే, వీటిలో మెలికల ముగ్గుకే ప్రాధాన్యం. కళగా ఉంటుంది కదా అని ప్రతీ వస్తువుపై ‘ముగ్గు’వేస్తే అలంకరణ ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. అభిరుచితో పాటు ఏ వస్తువును ‘కళ’గా అలంకరించాలో కూడా తెలుసుకొని, ఆచరణలో పెట్టడం సముచితం. చదవండి: ఈ చెట్లు ఒయ్యారంగా సాల్సా డాన్స్ చేస్తాయట.. ఆశ్యర్యం!! -
రంగవల్లుల పండుగ.. ‘భోగి’ భాగ్యాలు నిండగ
-
ముగ్గు-ముచ్చట (9)
-
ముగ్గు-ముచ్చట (8)
-
ముగ్గు-ముచ్చట (7)
-
ముగ్గు-ముచ్చట (6)
-
ముగ్గు-ముచ్చట (5)
-
ముగ్గు-ముచ్చట (4)
-
ముగ్గు-ముచ్చట (3)
-
ముగ్గు-ముచ్చట (2)
-
ముగ్గు-ముచ్చట
-
ముచ్చటైన ముగ్గులు (2)
-
ముచ్చటైన ముగ్గులు
-
ముచ్చటైన ముగ్గులకు ఇదే మా ఆహ్వానం
సాక్షి : సంక్రాంతి అంటేనే సరదాల పండుగ. ధాన్యం ఇల్లు నిండగా.. కొత్త అల్లుళ్ల సందడి నెలకొనగా తెలుగువారి లోగిళ్లు ఆనందంతో మురిసే వేడుక. ఎంతో ఆనందంగా జరుపుకొనే ఈ పర్వదినానికి అసలైన శోభను తెచ్చేది మాత్రం రంగవల్లులు. అందులో పెట్టే గొబ్బెమ్మలే. తెలుగింటి ఆడపడుచులు తమ ప్రతిభను వాకిళ్లలో ముగ్గుగా తీర్చిదిద్ది.. రంగులు అద్ది ఈ పెద్ద పండుగను మరింత వైభవోపేతం చేస్తారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకే భోగి మంటలతో మొదలై.. భోగిపళ్లు, పిండివంటలు, డూడూ బసవన్నలు, హరిదాసులతో తెలుగింటి సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ పండుగను పురస్కరించుకుని.. సాక్షి డాట్‌కామ్ మహిళల కోసం సంక్రాంతి సందడిని ముందుగానే తీసుకువచ్చింది. మీ చేతుల్లో రూపుదిద్దుకునే రంగవల్లులను ప్రదర్శించే అవకాశం కల్పిస్తోంది. మీరు మీ వేసే, వేయబోయే వినూత్నమైన ముగ్గుల చిత్రాలను మాకు పంపిస్తే వాటిని ప్రచురిస్తాం. మీ ముగ్గుల ఫోటోలను info@sakshi.com మెయిల్‌కు పంపించండి. లేదా 9010077759 నంబర్‌కు వాట్సప్ ద్వారా మీ ముగ్గుల చిత్రాలను పంపొచ్చు. మీరు పంపించే ముగ్గులకు సంబంధించి ఎన్ని చుక్కలు, ఎన్ని వరుసలు.. వంటి వివరాలు సమగ్రంగా ఉండాలి. మీ పేరు, ఊరు రాయడం మరిచిపోవద్దు. క్లియర్‌గా లేని ముగ్గుల చిత్రాలకు ప్రచురించడం సాధ్యం కాదు. అందుకని మీరు పంపించే ముగ్గులు చాలా స్పష్టంగా ఉండేలా చూడాలి. మీరు పంపిన ముగ్గుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
అమరిక : కొలువు తీరిన సంక్రాంతి శోభ
సంక్రాంతి అంటే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది ముగ్గులు, గొబ్బిళ్లు, హరిదాసులు, గంగిరెద్దులు. ఇవేకాదు... వీటితో సమానంగా ప్రాచుర్యంలో ఉన్న మరో వేడుక బొమ్మలకొలువు. సంక్రాంతికి బొమ్మలను అందంగా అమర్చడం లో కొందరు ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. బొమ్మలకొలువు అమర్చడం పండుగకు నాలుగైదు రోజులు ముందుగానే ప్రారంభమవుతుంది. పండుగ మూడు రోజులూ ఇరుగుపొరుగులను పిలిచి పేరంటం చేయడం ఒక వేడుక. ఈ బొమ్మలకొలువుకి బొమ్మల్ని వరసగా పేర్చుకుంటూ వెళ్లడం కాకుండా, ఒక పద్ధతిలో అందం గా అమర్చడం గొప్ప కళ. త్రిమూర్తులు, రామలక్ష్మణులు, పంచపాండవులు, షట్చక్రవర్తులు, సప్త ఋషులు, అష్టలక్ష్ములు, నవగ్రహాలు, దశావతారాలు,... ఇలా అంకెల వరుసలో బొమ్మలను అమర్చుకోవచ్చు. అదేవిధంగా మనం నివసిస్తున్న ప్రాంతాన్ని ప్రతిబింబించేలా, మన ఊరిలోని వీధుల పేర్లు, పేటల పేర్లు వచ్చేలా అమర్చుకోవచ్చు. జాతీయసమైక్యతను ప్రతిబింబించేలా భారతదేశపటం ఆకారంలో అమర్చి, ఆయా రాష్ట్రాల సంప్రదాయాలను మేళవించేలా బొమ్మల అమరిక ఉంటే బాగుంటుంది. ఎలా చేస్తామన్నది మన ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ బొమ్మలకొలువుకి సంబంధించిన కొన్ని నమూనాలు ఇస్తున్నాం. వీటిని ఆధారంగా చేసుకుని మీకు నచ్చిన రీతిలో బొమ్మలను అమర్చండి. మీలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయండి. అంతేకాదు మీ ఇంటికి బొమ్మలకొలువు పేరంటానికి ఆహ్వానం కూడా ఇలాంటి కార్డ్‌తో మెయిల్లో పిలవండి.