సంక్రాంతి వచ్చిదంటే గుమ్మాలన్నీ రంగవల్లుల(Rangoli)తో కళకళలాడిపోతుంటాయి. వివిధ రకాల డిజైన్‌లతో కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతారు. ఈ పండుగలో ముగ్గులతో హడవిడి, సంబరమే కనిపిస్తుంది. పడుచులంతా చేరి అద్భుతమైన తన కళా నైపుణ్యాన్ని రంగరించిం మరీ తీర్చిదిద్దే పనిలో పడతారు. ఇంత కష్టపడి పెట్టిన ముగ్గు తొక్కకూడదని మగువలు పడే ప్రయాస అంతా ఇంతా కాదు.
అయితే కొందరూ బియ్యపిండి, రాతిపిండితోనూ పెడతారు. చక్కగా ముగ్గుని తీర్చిదిద్దాక కలర్స్ వేసి మళ్లీ పై కోటింగ్‌లా ముగ్గు వేస్తారు. కానీ ఇక్కడొకామె పెట్టిన ముగ్గు చేస్తే నోటి మాట రాదు. అబ్బా చూస్తుండగానే ఎంత ఈజీగా పెట్టేసింది అనుకుంటారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆమె పెట్టిన ముగ్గు విధానం శతాబ్దల కాలం నాటిది. ఇది వరకు అంతా మట్టి ఇళ్లే ఉండేవి. వాటిని చక్కగా పెడతో అలికి ముగ్గులు పెట్టేవారు. అప్పుడు సున్నంతో ఇంటి చుట్టు గోడలకి అందమైన ముగ్గులను చేతితో భలే జిమ్మే వారు. అవి ఓ మోస్తారు ఆకారంలో సెట్ అయ్యి చూడటానికి భలే అందంగా కనిపించేవి. ఆ విధానంలోనే ఈ మహిళ ముగ్గుపెట్టింది.కాకపోతే దానికి కాస్త ఆధునిక విదానాన్ని జోడించింది.
ఆ వీడియోలో మొదట మహిళ ఇంటి గుమ్మ ముందు పెట్టదలచుకున్న కలర్‌లన్నీ తీసుకుంది. ముందుగా ఓ పెద్ద రౌండ్‌లో ముగ్గు పొడి పెట్టింది. ఆ తర్వాత లయబద్ధంగా రకరకలా రంగులను ముగ్గు పొడి ఉన్న గుండ్ర భాగానికి నలువైపులా చక్కగా వీటిని సెట్ చేసింది.
అంతే నాలుగు భాగాలుగా చేసి ఒక్కోదాన్ని ఒక్కోలా.. ఆకృతిలోకి వాటన్నిటిని నేలపై విరజిమ్మింది అది నెమలీ రెక్కలను విచ్చినట్లుగా చక్కగా రంగులు పరుచుకున్నాయి. అంతే ఆతర్వాత వాటి మధ్యలో ముగ్గుతో కొద్దిపాటి డిజైన్ వేసింది. చూస్తే వాటే ముగ్గు..ఏం పెట్టారబ్బా..అని అనకుండా ఉండలేరు.
இந்த பெண்ணின் திறமையை பாருங்க .👌🏻 pic.twitter.com/jCB8vzr1By
— Narasimman🇮🇳🕉️🚩 (@Narasim18037507) January 3, 2025
(చదవండి: చలికాలం తప్పక తీసుకోవాల్సిన సూప్ ..!)
Comments
Please login to add a commentAdd a comment