rangoli
-
మూసాపేటలో ‘సాక్షి’ సంక్రాంతి ముగ్గుల పోటీలు (ఫొటోలు)
-
ముగ్గుల పండుగ : ఏ ముగ్గు వేయాలా అని ఆలోచిస్తున్నారా? (ఫొటోలు)
-
ముగ్గు ఇలా కూడా పెట్టొచ్చా..! జస్ట్ కలర్స్‌తో..
సంక్రాంతి వచ్చిదంటే గుమ్మాలన్నీ రంగవల్లుల(Rangoli)తో కళకళలాడిపోతుంటాయి. వివిధ రకాల డిజైన్లతో కలర్ఫుల్గా తీర్చిదిద్దుతారు. ఈ పండుగలో ముగ్గులతో హడవిడి, సంబరమే కనిపిస్తుంది. పడుచులంతా చేరి అద్భుతమైన తన కళా నైపుణ్యాన్ని రంగరించిం మరీ తీర్చిదిద్దే పనిలో పడతారు. ఇంత కష్టపడి పెట్టిన ముగ్గు తొక్కకూడదని మగువలు పడే ప్రయాస అంతా ఇంతా కాదు.అయితే కొందరూ బియ్యపిండి, రాతిపిండితోనూ పెడతారు. చక్కగా ముగ్గుని తీర్చిదిద్దాక కలర్స్ వేసి మళ్లీ పై కోటింగ్‌లా ముగ్గు వేస్తారు. కానీ ఇక్కడొకామె పెట్టిన ముగ్గు చేస్తే నోటి మాట రాదు. అబ్బా చూస్తుండగానే ఎంత ఈజీగా పెట్టేసింది అనుకుంటారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె పెట్టిన ముగ్గు విధానం శతాబ్దల కాలం నాటిది. ఇది వరకు అంతా మట్టి ఇళ్లే ఉండేవి. వాటిని చక్కగా పెడతో అలికి ముగ్గులు పెట్టేవారు. అప్పుడు సున్నంతో ఇంటి చుట్టు గోడలకి అందమైన ముగ్గులను చేతితో భలే జిమ్మే వారు. అవి ఓ మోస్తారు ఆకారంలో సెట్ అయ్యి చూడటానికి భలే అందంగా కనిపించేవి. ఆ విధానంలోనే ఈ మహిళ ముగ్గుపెట్టింది.కాకపోతే దానికి కాస్త ఆధునిక విదానాన్ని జోడించింది. ఆ వీడియోలో మొదట మహిళ ఇంటి గుమ్మ ముందు పెట్టదలచుకున్న కలర్లన్నీ తీసుకుంది. ముందుగా ఓ పెద్ద రౌండ్లో ముగ్గు పొడి పెట్టింది. ఆ తర్వాత లయబద్ధంగా రకరకలా రంగులను ముగ్గు పొడి ఉన్న గుండ్ర భాగానికి నలువైపులా చక్కగా వీటిని సెట్ చేసింది.అంతే నాలుగు భాగాలుగా చేసి ఒక్కోదాన్ని ఒక్కోలా.. ఆకృతిలోకి వాటన్నిటిని నేలపై విరజిమ్మింది అది నెమలీ రెక్కలను విచ్చినట్లుగా చక్కగా రంగులు పరుచుకున్నాయి. అంతే ఆతర్వాత వాటి మధ్యలో ముగ్గుతో కొద్దిపాటి డిజైన్ వేసింది. చూస్తే వాటే ముగ్గు..ఏం పెట్టారబ్బా..అని అనకుండా ఉండలేరు.இந்த பெண்ணின் திறமையை பாருங்க .👌🏻 pic.twitter.com/jCB8vzr1By— Narasimman🇮🇳🕉️🚩 (@Narasim18037507) January 3, 2025 (చదవండి: చలికాలం తప్పక తీసుకోవాల్సిన సూప్ ..!) -
మురిపించే ముగ్గులు..రత్నాల రంగవల్లులు (ఫొటోలు)
-
ముచ్చట గొలిపే ముత్యాల ముగ్గులు.. మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)
-
ముగ్గు ఎలా వేయాలి? అందులోని రకాలు..!
ముగ్గు ఎప్పుడు ఎలా పుట్టింది అనడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ వేదాలలో సూర్య ఆరాధన కోసం రకరకాల చిత్రాలు చిత్రీకరించినట్లు ఆధారాలు ఉన్నాయని చెబుతుంటారు చరిత్రకారులు. ముఖ్యంగా శీతాకాలంలో పూజకి, ఆధ్యాత్మికతకు ఈ కాలం నెలవుగా ఉండటం వలన ఈ సమయంలో ముగ్గులు వేయడం ఒక సాంప్రదాయంగా స్థిరపడింది. అందునా ధనుర్మాసం వచ్చిందంటే చాలు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో నెలగంటి ముగ్గులతో కళకళలాడుతూ దర్శనమిస్తాయి. అలాంటి ముత్యాల ముగ్గులను ఎలా పెట్టాలి? పాటించాల్సిన నియమాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ముగ్గు వేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు, నియమాలు తప్పనిసరిగా పాటించాలి. గడప, గేటు ముందే(వాకిలి) ముగ్గు వేయాలి. అలాగే ముగ్గు వేశాక ఖచ్చితంగా నాలుగువైపు అడ్డగీతలు వేయాలి. ఇలా అడ్డగీతలు వేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రావు. అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లదని శాస్త్రం చెబుతుంది. పైగా అలా వేయడం వల్ల అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయనే సంకేతాన్ని సూచిస్తుంది కూడా. ముగ్గుల్లో రకాలు..ముగ్గుల్లో రకరకాల డిజైన్లు ఉంటాయి. ముఖ్యంగా పువ్వులు, కొమ్మలు, చతురస్రాకారం, త్రిభుజం, ప్రకృతి, కొండలు, దీపాలు వంటి వివిధ ఆకృతులు ముగ్గుల డిజైన్లలో కనిపిస్తుంటాయి. ఉత్తరాది, తూర్పు రాష్ట్రాల ముగ్గుల డిజైన్లలో ఎక్కువగా ప్రకృతిలో ఉండే వృక్షాలు, జంతువులూ, పక్షులు, కొండలు ప్రతిబింబిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చుక్కలు, గీతలు, పువ్వులు, మెలికలు... ఇలా ముగ్గుల్లో బోలెడు రకాలు. ద్రవిడులు చుక్కల ముగ్గులేస్తే, ఆర్యులు గీతల ముగ్గులు వేసేవారట. ఈ రెండింటి సమాహారం మన తెలుగు ముగ్గులు. చుక్కల చుట్టూ ముత్యాల్లా వచ్చేవి ముత్యాల ముగ్గులు. రేఖాగణితంలోని కోణాలను తలపించేవి రత్నాల ముగ్గులు. ఇక, ముగ్గులోని డిజైన్లకు ప్రకృతే స్ఫూర్తి... హంసలు, చిలుకలు, నెమళ్లు, శంఖువులు, పువ్వులు, లతలు... ఎన్నో. సంక్రాంతి ముగ్గుల్లో సూర్యచంద్రులు, ధాన్యం, గోవుమాలక్ష్మి, చెరకు గడలు, పాలు పొంగే కుండలు గీస్తారు. ధనుర్మాసంలో వేసే మెలికల పాములు హేమంతంలో కొంకర్లు తిరిగే చలికి సంకేతం. చివరగా సంక్రాంతి ఆఖరి రోజు సూర్యుణ్ణి ఆహ్వానిస్తూ రథం ముగ్గు వేస్తారు. దాన్ని తాడుతో పక్కింటి రథానికి కలపడం అన్నది అందరూ కలిసి ఉండాలన్న సమైక్యతను చాటుతుంది. ముగ్గుల్లో వేసే లతలూ పువ్వులూ జంతువులూ పక్షులూ...ప్రకృతితో కలిసిమెలిసి జీవించాలని బోధిస్తాయి.సందర్భానుసారం వేసే ముగ్గులు..నక్షత్రం ఆకారంలో ముగ్గు వేస్తే.. భూత, ప్రేత, పిశాచాలు దరిచేరకుండా చూస్తుంది.పద్మం ముగ్గు వేయడం వల్ల మనకు హాని కలిగించే చెడు శక్తులు దరిచేరకుండా అరికడతాయి. కాబట్టి ముగ్గులు తొక్కరాదు.అమ్మవారి పూజ చేసేటప్పుడు.. విగ్రహం పెట్టే పీట మీద ఖచ్చితంగా చిన్న ముగ్గు వేసి.. చుట్టూ రెండు రెండు గీతలు వేయాలి.తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మం ముగ్గు వేసి.. పూజ చేయాలిఆలయాల్లో, అమ్మవారి ముందు, మహావిష్ణువు ముందు ముగ్గులు వేసే స్త్రీలు 7 జన్మల వరకు సుమంగళిగానే మరణిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.దేవతలు ఉన్న ముగ్గులు అంటే ఓం, స్వస్తిక్, శ్రీ వంటి పవిత్ర గుర్తులతో కూడిన ముగ్గులు వేయరాదు. ఎందుకంటే వీటిని తొక్కరాదు కాబట్టి.పూర్వం సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ముగ్గు లేని ఇంట్లో బిక్ష అడిగేవాళ్లు కాదట. ముగ్గు లేదంటే అశుభం జరిగిందని భావించేవాళ్లట(చదవండి: ముగ్గులో దాగున్న ఆరోగ్య రహస్యం, సైన్సు ఏంటో తెలుసా..!) -
ముగ్గులో దాగున్న ఆరోగ్య రహస్యం, సైన్సు ఏంటో తెలుసా..!
ఈ ముగ్గుల సంస్కృతి ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది. కాకపోతే ఒక్కోభాషలో ఒక్కో పేరుతో దీన్ని పిలుస్తారు. తెలుగులో ముగ్గులు అంటాం. కన్నడలో రంగోలి అంటారు. తమిళం-మళయాళంలో కోలం, బెంగాల్లో అల్పన, రాజస్థాన్‌లో మండన, సంస్కృతంలో మండల వంటి పేర్లుతో పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా.. అందరూ అందంగా తీర్చిదిద్దేది రంగవల్లులే. పండుగలతో సంబంధం లేకుండా ప్రతి తెలుగింటి లోగిళ్లలో తప్పనిసరిగా ముగ్గు వేయడం పరిపాటి. ఇది అనాదిగా వస్తున్న ఆచారం లేదా సంస్కతిగా చెబుతారు పెద్దలు. అయితే ఇలా ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దడంలో దాగున్న ఆరోగ్య రహస్యం, సైన్సు ఏంటో చూద్దామా ఏంటో చూద్దామా..!ముత్యాల ముగ్గులోని శాస్త్రీయ కోణం..ముగ్గులని ప్రాచీన ఖగోళశాస్త్రంగా చెబుతుంటారు. పూర్వం ఆర్యభట్ట ఖగోళాన్ని అధ్యయనం చేసేందుకు ముగ్గుల రూపంలో నేలమీద చిత్రించాడట. అప్పటినుంచే ఖగోళశాస్త్ర రహస్యాలకు ప్రతీకగా చుక్కలు పెట్టడం, వాటిని వివిధ ఆకారాల్లో కలపడం ద్వారా ముగ్గులను వేస్తున్నారని నానుడి. జ్యోతిషంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, రాశుల చిహ్నాలూ ముగ్గుల్లో కనిపిస్తాయి. గృహవాస్తు, ఆలయవాస్తు, నగర నిర్మాణాల్ని తెలిపే రంగవల్లులూ ఉన్నాయంటున్నారు నిపుణులు. వైద్యశాస్త్రం కూడా ఉందట..రంగవల్లిలో కిందికి చూపించే త్రిభుజాలు స్త్రీలనీ, పైకి చూపించే త్రిభుజాలు పురుషులనీ, ఈ రెంటినీ కలపడం ద్వారా గీసిన ఆరు కోణాల నక్షత్రం స్త్రీ, పురుషుల కలయికకు సంకేతమనీ నమ్ముతారు. ముగ్గులోని కలుగపువ్వు గర్భాన్ని సూచిస్తుందట. నేటి కంప్యూటేషనల్ ఆంత్రోపాలజీ పరిశోధనలకీ ముగ్గు ఉపయోగపడుతుంది. ముగ్గుల్లోని గణిత సూత్రాలను అధ్యయనం చేసేందుకు ఆల్గారిథమ్స్‌ను రూపొందించి, వాటిని బొమ్మలు గీసే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లోనూ వాడుతున్నారట. అంతేగాదు సంక్లిష్టమైన ప్రొటీన్ నిర్మాణాల్ని అర్థం చేసుకునేందుకూ ఈ ముగ్గులు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.ముగ్గులో గమ్మతైన గణితం..ఈ ముగ్గులో తీరుగా పెట్టే చుక్కలు లెక్కలపట్ల ఆసక్తిని పెంచితే కలపడం వల్ల గణితం తేలికగా అర్థమవుతుందట. ఉదాహరణకు చుక్కలు పెడుతూ సరి, బేసి సంఖ్యలు నేర్చుకోవచ్చు. చుక్కలు...అంక గణితమైతే, వాటిని కలపడం సమితులు. నిజం చెప్పాలంటే ముగ్గులు మేధస్సుకి సవాలుగా నిలుస్తాయి. అంతేగాదు పిల్లల మెదడు వృద్ధి చెందడానికి మొదటి ఏడు సంవత్సరాలూ కీలకం. ఆ సమయంలో వారికి తేలికపాటి ముగ్గులు నేర్పిస్తే వాళ్లలో నైపుణ్యాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారుఆరోగ్య ప్రయోజనం..ముగ్గు వేయడం అనేది మహిళలకు మంచి వ్యాయామం లాంటిది. వంగి లేవడం కారణంగా.. వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని.. అందుకే పెద్దలు రోజూ ఇంటి ముందు ముగ్గు వేసే సంప్రదాయం తీసుకొచ్చారని అంటారు.చేతులు, కాళ్లను చుక్కలకు, గీతలకు అనుగుణంగా అటూఇటూ తిప్పడం వల్ల వారి జీర్ణక్రియ, పునరుత్పత్తి అవయవాలకు చక్కిని మసాజ్‌లా ఉపకరిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, జాయింట్లు, వెన్నెముక, పూర్తి శరీరానికి వ్యాయాయం తద్వారా బలం చేకూరుతుంది. ముగ్గులు వేసే మహిళల మెదడు చాలా చురుగ్గా పని చేస్తుందట. మహిళలకు ఇది శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామంలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.అంతేగాదు ముగ్గులు వేయడం వల్ల మంచి శరీరాకృతిని కలిగి ఉంటారట.శరీరాన్నీ మనస్సునూ ఒకేచోట కేంద్రీకృతం చేస్తూ వేసే ముగ్గు ఏకాగ్రతను పెంచే దివ్యమైన మెడిటేషన్‌గా చెబుతున్నారు. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుందట. ఎక్కడో చూసి.. ఎప్పుడో నేర్చిన ముగ్గుల్ని గుర్తుతెచ్చుకుంటూ వేయడంవల్ల ధారణశక్తి మెరుగవుతుందట. దీనివల్లే మహిళలకు ఏకాగ్రత, ఓర్పు అలవడుతాయట.అదీగాక ఉదయాన్నే ముగ్గు వేస్తారు కాబట్టి..స్వచ్ఛమైన గాలిని పీల్చడం జరుగుతుంది. అందువల్ల మహిళలు ఇలా వాకిట ముగ్గులు వేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎంతో మేలని అంటున్నారు ఆరోగ్య నిపుణలు. అలాగే చాలామంది ముగ్గుగా బియ్య పిండిని ఉపయోగిస్తారు. ఇది పక్షులు పావురాలు, చీమలు, పిచ్చుక, కాకితో పాటు ఇతర కీటకాల కడుపు నింపేందుకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక పరంగానూ, ఆరోగ్య పరంగానూ ఎన్నో ప్రయోజనాలందించే రంగవల్లికలను శోభాయమానంగా తీర్చిదిద్దుదాం..ఆరోగ్యంగా ఉందాం. (చదవండి: ఇలాంటి డైట్ గురించి తెలిసే ఛాన్సే లేదు..! కానీ ఒక్క ఏడాదిలోనే 50 కిలోలు..) -
అలా ‘సత్య’కు నిర్మాతను అయ్యాను : శివ మల్లాల
‘ఓ సారి చెన్నై వెళ్లినప్పుడు నా స్నేహితుడి ద్వారా నిర్మాత సతీష్ పరిచయం అయ్యాడు. ఆయన తన కుమారుడు హమరేష్ని హీరోగా పెట్టి నిర్మించిన రంగోలి సినిమాను నాకు స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారు. సినిమా మొత్తం చూశాక క్లైమాక్స్ బాలేదని చెప్పేశాను. నేను చూసింది రఫ్ వెర్షన్ మాత్రమే. రెండు నెలల తర్వాత మళ్లీ తమిళ్ సినీ పెద్దలతో పాటు నాకు సినిమా చూపించాడు. ఆ తర్వాత స్టేజ్‌పై మాట్లాడుతూ.. తెలుగులో శివ ఈ సినిమాను విడుదల చేస్తున్నాడని ఆయనే చెప్పాడు. అప్పటి వరకు నేను ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకోలేదు. కానీ సతీష్ నమ్మకంగా చెప్పడంతో.. నేను కూడా ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నానని ప్రకటించాను. అలా నేను అనుకోకుండా సత్య సినిమాకు నిర్మాతను అయ్యాను’ అన్నారు జర్నలిస్ట్, శివమ్ మీడియా అధినేత శివ మల్లాల. హమరేష్, ప్రార్ధన జంటగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘రంగోలి’. ఈ చిత్రాన్ని సత్య పేరుతో శివ మల్లాల మే 10న తెలుగులో విడుదల చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంగోలి టైటిల్ ఇక్కడ వేరే వాళ్లు బుక్ చేసుకోవడంతో ఈ చిత్రాన్ని తెలుగులో ‘సత్య’పేరుతో రిలీజ్ చేస్తున్నాను. ఆర్జీవీ తెరకెక్కించిన సత్య సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అలాగే సినిమా ప్రమోషన్స్‌కి కూడా కలిసొస్తుందనే ఉద్దేశంతో ఈ చిత్రానికి సత్య అనే టైటిల్‌ని పెట్టాం. డబ్బింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అచ్చమైన తెలుగు సినిమాలాగే ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. క్లైమాక్స్‌లో మార్పులు చేశాం. తెలుగు ఆడియన్స్‌కి నచ్చేలా క్లైమాక్స్ ఉంటుంది. సినిమాలో ఫాదర్స్ అండ్ సన్ రిలేషన్‌షిప్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. నిర్మాతగా కొనసాగాలనుకుంటున్నాను. ఇప్పటికే నాలుగు కథను విన్నాను. అన్ని కుదిరితే త్వరలోనే మరో సినిమాను నిర్మిస్తాను’ అని శివ మల్లాల అన్నారు. -
సంక్రాంతికి ముగ్గులు వేయడంలో దాగున్న ప్రాశస్త్యం ఏంటీ?
'సంక్రాంతి వచ్చింది తుమ్మెద' 'సరదాలు తెచ్చింది తుమ్మెదా'.. అన్న పాటలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగ కోసం ఎక్కడెక్కడ ఉన్నవాళ్లు కష్టపడి మరి తమ సొంతూళ్లకి వచ్చేస్తారు. ఎంత ఖర్చు పెట్టి అయినా పండుగకి ఊరు వెళ్లి పోవాల్సిందే. అక్కడ ఉండే సందడే వేరు. ముఖ్యంగా కోడిపందాలు, పిండి వంటలతో ఊరు ఊరంతా సందడి సందిడిగా ఉంటుంది. ఈ పండుగల్లో మంచి ఆకర్షణగా కనిపించేవి ముగ్గులు. వచ్చిరాని పడుచులు సైతం ఏదో రకంగా ముగ్గు వేసి శభాష్ అనిపించుకోవాలని తెగ ఆరాట పడిపోతుంటారు. అసలు ఈ నాలుగు రోజుల పండుగల్లో కచ్చితంగా రకరకాల రంగవల్లులతో ముగ్గులు పెడతారు ఎందుకని? దీని వెనుక దాగున్న రహస్యం ఏంటీ? వాస్తవానికి సాధారణ రోజుల్లో కూడా ఇంటి ముందు ముగ్గులు వేస్తాం. ఇలా ముగ్గులతో వాకిళ్లను అందంగా అలంకరిస్తే ఇంటికి శ్రేయస్సును తెస్తాయని పెద్దల నమ్మకం. పైగా లక్ష్మీ దేవిని ముచ్చటపడి ఇంట్లోకి వస్తుందని, ఆమె అనుగ్రహం లభిస్తుందని పురాణ వచనం. ముగ్గు ప్రాముఖ్యత.. హిందూసంప్రదాయంలో ముగ్గులకు అధిక ప్రాధాన్యం ఉంది. ముగ్గులు వేయడానికి ఎంతో చారిత్రక సంబంధం కూడా ఉంది. ముగ్గుల్లో తామర పువ్వు, పూల ఆకారాలు, నెమళ్లు, మామిడి పండ్లు, చేపల చిహ్నాలు ఎక్కువగా ఉంటాయి. రంగురంగుల ముగ్గులను చూసినప్పుడు ప్రశాంతత, దైవిక శక్తుల ఉనికిని అనుభవిస్తారు. ఇంట్లోకి దేవతలను స్వాగతించడానికి, ప్రజలను ఆశీర్వదించడానికి దేవతల చిత్రాలను, లక్ష్మీ దేవి పాద చిహ్నాలను గీస్తారు. అలాగే అతిథులను స్వాగతించడానికి కూడా ఇలా ముగ్గులు వేస్తారు. అయితే చరిత్ర మాత్రం చెడున అరికట్టి మంచి చేకూరాలనే ఉద్దేశ్యంతో తెల్లటి బియ్యపిండితో ముగ్గు వేస్తారని చెబుతోంది. ఇది శరీరానికి మంచి ఫిట్నెస్ లాంటిది కూడా.. ఓర్పును నేర్పే కళ… ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్ల ముగ్గో వేస్తే చాలు. గంటసేపు ట్రెడ్మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. అందులోను జారిపోయే కొంగును సరిచేసుకుంటూ.. ముందుకు పడే జడను వెనక్కి వేసుకుంటూ.. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి. భోగి నాడు వేసే ముగ్గు ఇష్టంతో కూడిన కష్టం! పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కాని భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత, ముగ్గువేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం, సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు, భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గు వేయడం కొంచెం కష్టంతో కూడుకున్నప్పటికి ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు, రోజు వేసే ముగ్గుల కన్నా ఈ రోజు మరింత అందంగా రంగు రంగుల రంగవల్లికలేస్తారు. శాస్త్రీయ కారణాలు.. చుక్కలను కలిపే వక్ర నమూనాలు విశ్వంలోని అనంతమైన స్వభావాన్ని సూచిస్తాయి. ఇటువంటి నమూనాలు ధ్వని వేవ్ హార్మోనిక్స్‌ను పోలి ఉంటాయి. వీటిని చూస్తే డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలతో సహా అనేక రుగ్మతలు దరిచేరకుండా మనసు ఆహ్లాదభరితంగా ప్రశాంతంగా ఉంటుంది. తెలియకుండానే మనసులో ఓ ఆధ్యాత్మకి భావన వస్తుంది. విశ్వకవి రవీంద్రుడు సైతం ముగ్గు గురించి ప్రస్తావించారు! అంతేకాదండోయ్ రవీంద్రనాథ్ ఠాగోర్ 1919 లో రాసిన 'బంగ్లర్ బ్రత' అనే పుస్తకంలో వ్రతం, పూజ విధానాలలో 'అల్పన' (ముగ్గు) గురించి ప్రస్తావించారు. లక్ష్మీకాంత్ ఝా అరిపన్' మిథిల జానపద సంస్కృతి గురించి రాసిన రచనలలో రంగోలి ప్రస్తావన తెచ్చారు. ఇక ఈ ముగ్గులు వేయడం అనేది కేవలం దక్షిణాదికే పరిమితం కాదని భారతదేశం అంతటా ఈ ముగ్గులు వేయడం అనేది వారి సంస్కృతిలో భాగం అని పరిశోధకులు కూడా పేర్కొన్నారు. అంతేగాదు కామశాస్త్రంలో ప్రస్తావించిన 64 కళల్లో నృత్యం, సంగీతం, తలపాగాలు చుట్టడం, పూల మాలలు అల్లడం, వంటలు, అల్లికలతో పాటు ముగ్గులు వేయడాన్ని కూడా ఒక కళగా పేర్కొన్నారని చెప్పారు. అంతటి ప్రాశస్యం గల ఈ ముగ్గులను రకరకాల రంగవల్లులతో తీర్చిదిద్ది కలర్ఫుల్గా జోయ్ఫుల్ చేసుకోండి ఈ సంక్రాంతి పండుగని. (చదవండి: భోగి రోజే గోదా కళ్యాణం.. చిన్నారులకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు?) . -
Sankranti Muggulu: సంక్రాంతి అందమైన ముగ్గులు (ఫొటోలు)
-
ఆ కుటుంబం నుంచి కొత్త హీరో ఎంట్రీ.. ట్రైలర్ చూశారా?
సీనియర్ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కుటుంబం నుంచి ఇప్పుడు మరో హీరో తెరపైకి వస్తున్నారు. ఏఎల్ అళగప్పన్ కుమారులిద్దరూ ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే! విజయ్ దర్శకుడిగా, ఉదయ్ నటుడిగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయన మనవడు(కూతురి కుమారుడు) అమరేష్ 'రంగోలి' చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'మా నగరం'లో బాలనటుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ చదువును కొనసాగిస్తున్న అమరేష్ ఇప్పుడు రంగోలి చిత్రం ద్వారా హీరో అవతారం ఎత్తారు. ప్రార్థన కథానాయికగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని గోపురం స్టూడియోస్ పతాకంపై కె.బాబురెడ్డి, జి సతీష్‌కుమార్ నిర్మించారు. వాలి మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మరుద నాయకం ఛాయాగ్రహణం, కేఎస్ సుందరమూర్తి సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్లో చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. దర్శకుడు కే భాగ్యరాజ్, ఆర్వీ ఉదయ్‌కుమార్ పాల్గొని ఆడియో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎల్ అలగప్పన్ కుటుంబసభ్యులందరూ పాల్గొనడం విశేషం. పాఠశాల విద్యార్థుల ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు వాలి మోహన్‌దాస్ చాలా చక్కగా తెరపై ఆవిష్కరించారని దర్శకుడు కే.భాగ్యరాజ్, ఆర్వీ ఉదయకుమార్, ఏఎల్ విజయ్ ప్రశంసించారు. చిత్రం మంచి విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. చదవండి: Trisha : 40 ఏళ్ల వయసులో పెళ్లిపై దృష్టి పెట్టిన త్రిష.. -
రెండ్రోజుల్లో ఫంక్షన్.. మూడు రోజుల్లో పెళ్లి.. సుధా రవికి చెప్పారా? ఆమె ఎవరు?
స్కూల్లో ఇంకో రెండు రోజుల్లో ఫంక్షన్ జరగబోతోంది... ‘సుధా రవికి చెప్పారా?’ అనే ప్రశ్న చెవులకు వినిపిస్తుంది. మూడురోజుల్లో పెళ్లి జరగబోతుంది... ‘సుధా రవికి తెలియజేశారా’ అనే ప్రశ్న ఎదురు వస్తుంది. ఇంతకీ ఎవరీ సుధా రవి? ఒక్కమాటలో చెప్పాలంటే ‘రంగోలి స్పెషలిస్ట్’ ఎవరి రంగోలి ద్వారా శుభకార్యాల వేదికలకు కొత్తకళ వస్తుందో...ఆమె పేరే సుధా రవి. తాజాగా కూతురు రక్షితతో కలిసి రూపొందించిన రంగోలితో ‘సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి ఎంటర్ అయిందామె... సుధా రవి తన కూతురు రక్షితతో కలిసి 26,000 ఐస్‌క్రీమ్ పుల్లలను ఉపయోగించి రూపొందించిన రంగోలి ఆర్ట్ వర్క్ ‘సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి ఎంటర్ అయింది. సింగపూర్‌లోని లిటిల్ ఇండియా షాప్‌కీపర్స్ అండ్ హెరిటేజ్ అసోసియేషన్(లిషా) ఆధ్వర్యంలో జరిగిన పొంగల్ వేడుకల్లో భాగంగా ఈ సిక్స్ బై సిక్స్ మీటర్ ఆర్ట్‌వర్క్‌కు శ్రీకారం చుట్టింది సుధా రవి. మూమూలుగానైతే బియ్యంగింజలు, సుద్దముక్కలు... మొదలైనవి ఉపయోగించి రంగోలి వేసే సుధా ఈసారి మాత్రం ఐస్‌క్రీమ్ స్టిక్స్‌ను మాత్రమే ఉపయోగించింది. ఈ రంగోలిలో తమిళ కవులు తిరువళ్లువర్, అవ్వైయార్, భారతీయార్ చిత్రాలు ఆకట్టుకుంటాయి. ఆశ్చర్యంగొలిపే అందమైన ఆర్ట్‌వర్క్‌లను రూపొందించడం రవికి కొత్తేమీ కాదు. 2016లో 3,200 చదరపు అడుగుల రంగోలీని రూపొందించి రికార్డ్ సృష్టించింది. ‘సింగపూర్‌లో తమిళ సంప్రదాయాలు, కళలను ముందుకు తీసుకువెళ్లడానికి, ఈతరానికి చేరువ చేయడానికి సుధా రవి పనిచేస్తున్నారు’ అంటున్నారు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న సుధా రవి ‘రంగోలి స్పెషలిస్ట్’గా పేరు తెచ్చుకుంది. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న రంగోలి కళకు మరింత ప్రాచుర్యాన్ని కల్పించడానికి తనవంతుగా ప్రయత్నిస్తోంది. ‘అందరు పిల్లల్లాగే నాకు చిన్నప్పటి నుంచి రంగులు అంటే చాలా ఇష్టం. వాటిని చూస్తే చాలు ఎంతో సంతోషం కలిగేది. ఆ సంతోషమే నన్ను రంగోలి కళ వైపు నడిపించింది. రకరకాల ప్రయోగాలు చేసేలా చేసింది. ఎమోషన్స్ విత్ కలర్స్ కాన్సెప్ట్‌తో కూడా రంగోలి రూపొందించాను. సింగపూర్‌లో దశాబ్ద కాలంగా ఉంటున్నాము. మా జీవితంలో రంగోలి భాగం అయింది. నాలాగే నా కూతురు రక్షితకు రంగోలిపై ఆసక్తి ఉండడం సంతోషకరమైన విషయం’ అంటుంది సుధా రవి. భూమిని ప్రేమగా ముద్దాడే రంగోలిని కాన్వాస్‌పైకి కూడా తీసుకువచ్చి కనువిందు చేయడంలో ఆమె విజయం సాధించింది. చదవండి: భార్య భర్తల మధ్య ఎంత వయసు తేడా ఉండాలి? హ్యాపీ జర్నీ -
Home Creations: పండగ వేళ.. ఈ ముగ్గులతో మీ ఇంటికి ప్రత్యేక శోభ!
అందమైన రంగవల్లికలతో పండగల రోజుల్లో ప్రత్యేకంగా ఇంటిని సింగారించుకుంటున్నాం. ఆ రంగవల్లికలే అలంకరణ వస్తువుల మీదా కొత్తగా ముస్తాబు అయితే.. ఎంత చూడముచ్చటగా ఉంటుందో ఈ చిత్రాలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ‘సావీస్ హోమ్’ పేజీతో ఈ క్రియేషన్స్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అందిస్తున్నారు స్రవంతి. ఇంటి అందాన్ని పెంచడం ఎలాగో ‘ముగ్గు’ను ముచ్చటగా పెయింట్ చేసి మరీ చూపుతున్నారు. మెలికలుగా తీర్చిన ముగ్గును ఏయే రూపాల్లో వేసుకోవచ్చో.. ముఖ్యంగా పండగలు, ఇంట్లో చేసుకునే చిన్న చిన్న వేడుకలు, ప్రత్యేక సందర్భాలలో ముగ్గు కళతో ఇంటి అందాన్ని ఎలా పెంచుకోవచ్చో చూద్దాం. ఆసనంపైన అందం పూజల్లో ఆసనంగా వాడే పీట, చుట్టూ అలంకరణకు వాడే పొడవాటి చెక్క ముక్కలు, బల్ల వంటివి పసుపు, ఎరుపు, పచ్చ రంగు పెయింట్ మీద వేసిన తెల్లని పెయింట్ ‘ముగ్గు’ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వాకిట్లో గుమ్మం ముందు వేసిన ముగ్గు డిజైన్‌ను ఇలా పీట మీద పెయింట్‌గా వేసి, ఆత్మీయులకు కానుకగానూ ఇవ్వచ్చు. మీ అభిరుచిని సరికొత్తగా తెలియజేయవచ్చు. షోకేస్‌కి ముగ్గు వాల్ ఫ్రేమ్స్, కీ హోల్డర్స్, చిన్న సైజు అర లున్న షోకేస్ వంటివి గోడపైన అలంకరణగా ఉంచాలనుకుంటే.. వాటిని ఇలా ముగ్గు ముచ్చటతో మురిసిపోయేలా మెరిపించవచ్చు. కొన్నాళ్లుగా వాడి, ఇక పడేద్దాం అనుకున్న చెక్క స్పూన్లు , గరిటెలను కూడా రంగవల్లిక పెయింట్‌తో వాల్ హ్యాంగర్స్‌గా మార్చుకోవచ్చు. ట్రే.. గ్లాస్ హోల్డ్ర్లు కాదేదీ అలంకరణకు అనర్హం అన్నట్టుగా ముగ్గుతో ఇంటిని కళాత్మకంగా ముస్తాబు చేసుకోవచ్చు. చెక్కతో చేసిన ట్రే, గ్లాస్ హోల్డర్స్‌ని ముగ్గుతో ‘కళ’గా అలంకరించవచ్చు. కలపకే ప్రాధాన్యం చెక్కతో తయారైన వస్తువులకు, పూల కుండీలకు రంగవల్లిక ఓ ప్రత్యేక అందాన్ని తీసుకువస్తుంది. అయితే, వీటిలో మెలికల ముగ్గుకే ప్రాధాన్యం. కళగా ఉంటుంది కదా అని ప్రతీ వస్తువుపై ‘ముగ్గు’వేస్తే అలంకరణ ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. అభిరుచితో పాటు ఏ వస్తువును ‘కళ’గా అలంకరించాలో కూడా తెలుసుకొని, ఆచరణలో పెట్టడం సముచితం. చదవండి: ఈ చెట్లు ఒయ్యారంగా సాల్సా డాన్స్ చేస్తాయట.. ఆశ్యర్యం!! -
యోగా మా అక్కను మనిషిని చేసింది...
మా అక్క 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు యాసిడ్ అటాక్ జరిగింది. ఒక కన్ను, వక్షం, చెవి దగ్ధమయ్యాయి. ఆమె బండరాయిగా మారిపోయింది. ఆమెను మళ్లీ మనిషిని చేయడానికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు యోగా ఆమెను కాపాడింది. నేను రోజూ ఆమెను యోగాకు తీసుకెళ్లడంతో ఆమె తిరిగి పూర్తి మామూలు మనిషయ్యింది... అని కంగనా రనౌత్ తన కుటుంబం యోగా వల్ల ఎంత లబ్ధి పొందిందో చెప్పుకొచ్చింది. ‘‘2006లో మా అక్క రంగోలికి 21 ఏళ్లు. అవినాష్ శర్మ అనే అతను ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. మా అక్క తిరస్కరించింది. ఒకరోజు అతను, మరో స్నేహితుడితో కలిసి మా అక్క మీద యాసిడ్ కుమ్మరించాడు. మా అక్క చెవి, చెంప, ఒక వక్షం పూర్తిగా దెబ్బ తిన్నాయి. కంటి చూపు పోయింది. ఆమెకు డాక్టర్లు 54 సార్లు కాస్మటిక్ సర్జరీ లు చేసి పూర్వపు ముఖం తేవడానికి ప్రయత్నించారు. ఆమెకు రెటినా రీప్లేస్మెంట్ అయ్యింది. వక్షాన్ని పూర్వరూపంలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఆ సమయంలోనే ఒక సంబంధం మాట్లాడితే వచ్చిన కుర్రాడు మా అక్క ముఖం చూసి మళ్లీ రాలేదు. ఇవన్నీ జరిగాయి. అప్పుడు నాకు 18 ఏళ్లు. మా అక్క భౌతిక ఆరోగ్యం కంటే కూడా ఆ సమయంలో నేను ఎక్కువగా ఆలోచించింది మానసిక ఆరోగ్యం గురించే. ఆ ఆరోగ్యాన్ని ఆమె యోగా నుంచి పొందింది’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియచేసింది కంగనా రనౌత్. ‘మా అక్క ఆ సమయంలో ఒక బండరాయిలా మారిపోయింది. ఏం మాట్లాడినా ఊరికే అలా చూసేది తప్ప స్పందించేది కాదు. మా జోక్స్‌కు నవ్వేది కాదు. అసలు తన మీద తాను విశ్వాసం ఉంచుకుందా లేదా అర్థమయ్యేది కాదు. ఆమెను నేను కాపాడుకోవాలనుకున్నాను. నేను ఎక్కడికి వెళితే అక్కడకు తీసుకువెళ్లేదాన్ని. అలాగే నా యోగా క్లాసులకు కూడా తీసుకెళ్లేదాన్ని. అక్కడకు వస్తూ ఉండటం వల్ల క్రమంగా ఆమెకు యోగా మీద ఆసక్తి ఏర్పడింది. ఆమె యోగా చేయసాగింది. ఆమెకు మెల్లమెల్లగా ఆత్మవిశ్వాసం పెరిగింది. జీవం వచ్చింది. చూపు మెరుగు అయ్యింది. ఆమె పూర్తిగా మామూలు మనిషి కావడంలో యోగా అద్భుతంగా పని చేసింది’ అని రాసింది కంగనా. ‘మా అమ్మకు ఒక దశలో కొలెస్ట్రాల్ పెరిగిందని, డయాబెటిస్ ఉందని ఓపెన్ హార్ట్ సర్జరీ వరకూ వెళ్లారు డాక్టర్లు. కాని నేను ఆమెను రెండు నెలలు ఆగు అని యోగాసనాలలోకి తెచ్చాను. ఆమె యోగా చేసింది. ఏ సర్జరీ అవసరం ఏర్పడలేదు. ఇవాళ మా ఇంట్లో అందరి కంటే ఆమే ఆరోగ్యంగా ఉంది’ అని రాసింది కంగనా. యోగా అంరత్గత శక్తులను వెలికి తీస్తుందన్న సంగతి తెలిసిందే. ఇలాంటి అనుభవాలు విన్నప్పుడు యోగాను స్వీకరించాల్సిన, సాధన చేయాల్సిన ఉత్సాహం కలిగితే అది చాలు కదా. -
నాపై ఉన్న కేసులన్నింటిని సిమ్లాకు మార్చండి
న్యూఢిల్లీ : ముంబైలో తనపై ఉన్న కేసులన్నింటిని సిమ్లాలోని కోర్టుకు తరలించాలంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముంబైలో తనకు, తన సోదరి రంగోలి చందేల్‌కు ప్రాణహాని ఉందని, తన ఆస్తులకు సైతం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కేసులన్నింటిని సిమ్లా కోర్టుకు మార్చాల్సిందిగా తన లాయర్ నీరజ్ శేఖర్ ద్వారా పిటిషన్ దాఖలు చేయించారు. శివసేన ప్రభుత్వానికి తనపై ఉన్న వ్యక్తిగత కోపం కారణంగా ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నట్లు ఆమె అందులో వివరించారు. ఆమెపై నమోదైన పలు కేసుల వివరాలను పిటిషన్లో పేర్కొంటూ, ఆ కేసులన్నింటిని సిమ్లా కోర్టుకు మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తనకు చెందిన ఇంటిని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూల్చేసిన ఘటనను సైతం ఆమె ప్రస్తావించారు. దాన్ని హైకోర్టు కూడా తప్పుబట్టిందని అందులో పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా ప్రభుత్వం తనపై వ్యక్తిగత కక్షను పెంచుకుందని ఆమె పేర్కొన్నారు. -
కంగనాను అరెస్టు చేయకండి: హైకోర్టు
ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ను అరెస్టు చేయోద్దని బాంబే హైకోర్టు మహరాష్ట్ర పోలీసులను ఆదేశించింది. కంగనాతో పాటు ఆమె సోదరి రంగోలి చందెల్పై ఇటీవల ముంబై పోలీసుల దేశద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కంగన సిస్టర్స్ సోషల్ మీడియా పోస్టులు, ఇంటర్యూలు ఉన్నాయని క్యాస్టింగ్ డైరెక్టర్ మాన్వల్ అలీ సయ్యద్ ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కంగనా సిస్టర్స్ విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు సమన్లు జారీ చేశారు. అయితే కంగన మాత్రం సినిమా షూటింగ్లో పాల్గొంటూ విచారణకు హాజరుకాకుండా వాయిదా వేస్తున్నారు. దీంతో పోలీసులు షూటింగ్‌లకు వెళ్లే సమయం ఉంటుంది కానీ విచారణకు హజరయ్యే సమయం ఉండదా అని వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కంగన, రంగోలిలను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. (చదవండి: న్యాయవ్యవస్థను కించిపర్చిందంటూ ఫిర్యాదు) ఈ నేపథ్యంలో తమపై ఉన్న కేసును కొట్టేసేలా ఆదేశాలను ఇవ్వాలని కంగన, రంగొలీలు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తాము సోషల్ మీడియాలో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, కేవలం తమ ఉద్దేశాలను మాత్రమే వెల్లడించామంటూ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. అంతేగాక పోలీసుల సమన్లను తాము గౌరవిస్తున్నామన్నారు. అయితే పోలీసులు తమను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. కంగన వాదనను విన్న హైకోర్టు ముంబై పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని ఇప్పుడే అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అదే విధంగా జనవరి 8న ముంబై పోలీసుల ముందు హాజరుకావాల్సిందిగా కంగన, రంగోలీలను న్యాయస్థానం ఆదేశించింది. (చదవండి: పెళ్లికి ముందు శృంగారం తప్పుకాదు: హీరోయిన్) -
నా ట్యాక్స్‌లోంచి కంగనకు భద్రతా కల్పించారా?
ముంబై : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు వై-ప్లస్ కేటగిరి భద్రత కలిపించడంపై నటి కుబ్రాసైథ్ అసహనం వ్యక్తం చేశారు. తన ట్యాక్స్‌లోంచి వీటికి డబ్బులు వెళ్లడం లేదు కదా అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై కంగనా సోదరి రంగోలి సైతం ధీటుగా సమాధానమిచ్చారు. క్యురియాసిటీ (ఉత్సుకత)తో అడుగుతున్నా..ఇంతకీ ఎంత ట్యాక్స్ కడుతున్నారేంటి అంటూ చురకలంటించారు. ప్రస్తుతం బాలీవుడ్లో ఓ వర్గం కంగనాకు మద్దుతుగా ఉంటే, మరో వర్గం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఓ సాధారణ నటికి వై- ప్లస్ క్యాటగిరీ కల్పించడంపై రాజకీయ కోణమేదైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్‌లోని 25 ప్రముఖ వ్యక్తులకు డ్రగ్స్‌తో సంబంధాలున్నాయని రియా పేర్కొన్న సంగతి తెలిసిందే. (మహరాష్ట్ర సీఎం ఠాక్రేను హెచ్చరించిన కంగనా) తదనంతర కస్టడీ కోరుతూ ఎన్సీబీ రియాను అదుపులోకి తీసుకోవడంతో పలువురు బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు జస్టిస్ ఫర్ రియా అంటూ క్యాంపెయిన్ నడుపుతుండటం గమనార్హం.ఇక కంగనా కార్యాలయం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తన ఇంటిలో ఎలాంటి అక్రమ నిర్మాణం చేపట్టలేదని, కోవిడ్ కారణంగా సెప్టెంబర్ 30 వరకూ కూల్చివేతలను ప్రభుత్వం నిషేధించిందని కంగనా ట్వీట్ చేశారు. ఫాసిజం ఎలా ఉంటుందో బాలీవుడ్ ఇప్పుడు గమనిస్తోందని కంగనా బీఎంసీ చర్యపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కంగనాకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇండియా విత్ కంగనా అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తూ అభిమానులు కంగనాకు బాసటగా నిలిచారు. (ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర ఉద్రిక్తత) Just checking, is it going out my taxes? https://t.co/z6xYxXPqEv — Kubbra Sait (@KubbraSait) September 7, 2020 -
అక్కకి ప్రేమతో...
తన అక్క రంగోలి కోసం ఇంటీరియర్ డిజైనర్ అవతారం ఎత్తారు కంగనా రనౌత్. కంగనా డిజైన్ చేసిన వాటిని షేర్ చేశారు రంగోలి. ‘‘నీ ఇంట్లో నీకు ఎలాంటి ఇంటీరియర్ డిజైన్స్ కావాలని నన్ను కంగనా అడిగింది. నిజానికి నాకేం కావాలో నాకే తెలియదు. పాతకాలానికి చెందినవి, రొటీన్‌గా ఉండేవి మాత్రం వద్దని చెప్పాను. తను నా ఇంటిని బాగా అలంకరించింది. అది చూసి షాక్ అయ్యాను. నిజానికి ఇంటీరియర్ డిజైనింగ్ కంగనాకు కొత్త. కానీ తను నా కోసం ఇంటీరియర్ డిజైనింగ్ గురించి తెలుసుకుని నా ఇంటిని అందంగా తయారు చేసింది. అందుకే ఇప్పుడు నా ఇల్లు నాకో స్వర్గంలా అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు రంగోలి. ఈ లాక్డౌన్ సమయంలో కంగనా వంటలు నేర్చుకున్నారు, కవితలు రాశారు. పెయింటింగ్స్ వేశారు. తాజాగా ఇంటీరియర్ డిజైనర్‌గా మారారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కంగనా తాజా చిత్రం ‘తలైవి’ (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత బయోపిక్) షూటింగ్ లాక్డౌన్ వల్ల ఆగి పోయింది. ఇంకా ఆమె అంగీకరించిన హిందీ చిత్రాల్లో ‘తేజస్, థాకడ్’ కూడా ఉన్నాయి. -
రంగోలికి మద్దతు.. కంగనా రనౌత్‌పై కేసు
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌పై కేసు నమోదైంది. ముంబైకి చెందిన అడ్వకేట్ అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ కంగనాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజులక్రితం ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో కరోనాతో మృతి చెందిన ఓ జమాతీ కుటుంబానికి వైద్య పరీక్షలు చేయటానికి వెళ్లిన డాక్టర్లు, పోలీసులపై వారు దాడి చేశారు. ఈ సంఘటనపై స్పందించిన రంగోలి చందేల్ ఓ వర్గానికి చెందిన వారిని, సెక్యులర్ మీడియాను వరుసగా నిలబెట్టి కాల్చిపడేయాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో రంగోలి చందేల్ ట్విటర్ ఖాతాను అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో కంగనా స్పందిస్తూ కొద్దిరోజులక్రితం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు. తన సోదరి రంగోలి చందేల్ ట్విటర్ ఖాతాను తొలిగించటాన్ని ఆమె తప్పుబట్టారు. గతంలో రంగోలి చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు. అంతేకాకుండా సదరు వర్గానికి చెందిన వారిని టెర్రరిస్టులని కంగనా పేర్కొన్నారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో అలీ పోలీసులను ఆశ్రయించారు. ( రంగోలి ట్విటర్ బ్లాక్; ఖండించిన సింగర్ ) -
రంగోలి ట్విటర్ బ్లాక్; ఖండించిన సింగర్
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ ట్విటర్ ఖాతా తొలగింపుపై బాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. గాయని సోనా మోహపత్రా మాత్రం దానిని ఖండించారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘కంగనా ఆమె సోదరి రంగోలిలకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకునే హక్కు ఉందంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. దీనిని రాజకీయం చేయకుండా వెంటనే ఒకసారి ఆలోచండి #వోక్సభ’ అంటూ శుక్రవారం ట్వీట్ చేశారు. అదే విధంగా ‘‘ఏ విషయాన్ని అయినా లోతుగా చూసే ప్రపంచంలో మనమంతా జీవిస్తున్నాము. ఇక్కడ ఒకరి అభిప్రాయాన్ని మరొకరు ఏకిభవించరు. దేశ పురోగతికి ఇది చెత్త ఫార్ములా. ఇక రంగోలీ ట్విటర్ ఖాతాను బలవంతంగా తొలగించి మరింత ద్వేషాన్ని స్వాగతించారు’’ అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. (రంగోలి ట్విటర్ అకౌంట్‌ను తొలగించిన అధికారులు) Just read on my timeline that the ‘Rangoli Chandel-Kangana Ranaut’ handle has been suspended by @twitter ? While I might not subscribe to all their views,I also stand by their right to express them.Let’s not be so ‘politically correct’ & quick to be offended dear #WokeSabha 🧚🏿♀️🔴 — ShutUpSona (@sonamohapatra) April 16, 2020 ఇక సోనా మోహపత్రా ట్వీట్‌కు దర్శకురాలు రీమా కగ్టి, రంగోలీ ట్వీట్‌ను షేర్ చేస్తూ.. ‘‘సోనా మీరు దీనికి మద్దతు ఇవ్వాల్సిందే. ఈ ట్వీట్‌ను మీరు చుశారో లేదో నాకు తెలియదు. అయితే ఈ ట్వీట్‌ను ఓసారి చూడండి. ఇందులో ఒక నిర్థిష్ట వర్గానికి చెందిన వ్యక్తులను, నిర్థిష్టమైన పత్రికలను మారణ హెమానికి పిలుపునిచ్చింది. ఇది నేరం. ఆమోద యోగ్యం కానిది’’ అంటూ సోనా ట్వీట్‌కు సమాధానం ఇచ్చారు. ఇక దీనికి సోనమ్ మరో ట్వీట్ చేస్తూ ‘‘అవును ఇప్పుడే ఆ వివాదస్పద ట్వీట్‌ను చుశాను. అయితే దీనికి రద్దు చేయడమే పరిష్కారం కాదు. ఇలాంటి పద్దతిని సమర్థించను. ఎలాంటి వారినైనా క్షమించి వారి ఉదారవాదాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నా’’ అని వివరణ ఇచ్చారు. (రంగోలి సంచలన వ్యాఖ్యలు) కాగా ఫైర్ బ్రాండ్ రంగోలి తన అభిప్రాయాలను సోషల్ మీడయాలో తెలుపుతూ ఏప్పుడు వార్తల్లో నిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్‌కు తరలిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్ధిష్ట వర్గానికి చెందిన వారిని, సెక్యూలర్ మీడియాను కాల్చి చంపాలని రంగోలి తన ట్వీట్ ద్వారా పిలుపునిచ్చారు. దీంతో ఆమె ట్విటర్ ఖాతాను అధికారులు గురువారం రద్దు చేశారు. -
వివాదాస్పద ట్వీట్.. రంగోలి ఖాతా తొలగింపు
కంగనా రనౌత్ సోదరి, ఫైర్‌బ్రాండ్ రంగోలి చందేల్ ట్విటర్ ఖాతాను అధికారులు తొలగించారు. ఓ వర్గాన్ని ఉద్ధేశించి రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోందని బాలీవుడ్ సెలబ్రిటీలు చేసిన ఆరోపణలపై స్పందించిన ట్విటర్ అధికారులు ఆమె అకౌంట్‌ను సస్పెండ్ చేశారు. కాగా బుధవారం ఉత్తర ప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్‌కు తరలిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్ధిష్ట వర్గానికి చెందిన వారిని, సెక్యూలర్ మీడియాను కాల్చి చంపాలని రంగోలి ట్వీట్ చేశారు. (రంగోలి సంచలన వ్యాఖ్యలు) ఈ ట్వీట్ కాస్తా వైరలవ్వడంతో రంగోలి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని దర్శకుడు రీమా కగ్టి, నటి కుబ్రా సైత్తోపాటు కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ సహా ట్విటర్లో ఫిర్యాదు చేశారు. ఒక వర్గంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన రంగోలిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముంబై పోలీసులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ట్యాగ్ చేశారు. వీటిపై స్పందించిన ట్విటర్ అధికారులు వెంటనే రంగోలి అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. చివరికి రంగోలి అకౌంట్‌ను అధికారులు తొలగించడంతో ఫరాఖాన్తోపాటు తదితర నటులు ట్విటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. (‘అలా అయితే.. కంగనా నటన వదిలేస్తుంది’) Thank you @Twitter @TwitterIndia @jack for suspending this account. I reported this because she targeted a specific community and called for them to be shot along with liberal media and compared herself to the Nazis. 🙏🙏🙏 . pic.twitter.com/lJ3u6btyOm — Farah Khan (@FarahKhanAli) April 16, 2020 -
రంగోలి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజ్ మహల్‌పై రంగోలి చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. తాజ్ మహల్ కేవలం సమాధి మాత్రమేనని.. అది ఎప్పటికీ ‘ప్రేమ చిహ్నం’ కాదంటూ రంగోలి బుధవారం ట్వీట్ చేశారు. ‘తాజ్ మహల్‌ను చాలా మంది సమాధిగానే పరిగణిస్తారు. అయితే దీనిని ప్రపంచ వింతగా చూడాలని ప్రజలను బలవంతం చేస్తున్నారు’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. అంతేగాక ముంతాజ్ బేగం గురించి కూడా ట్వీట్లో ప్రస్తావించారు. ముంతాజ్‌పై ఉన్న ప్రేమ, గౌరవంతో షాజాహాన్ నిర్మించిన ఈ అతిపెద్ద కట్టడం వెనుక ఒళ్ళు గగుర్పొడిచే విషయాలెన్నో ఉన్నాయని, ఆమెను షాజాహాన్ ఎంతగా హింసించేవాడో మీకు తెలుసా?’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. (ఫోర్బ్స్‌పై కంగన సోదరి ఫైర్) Mr @rajcheerfull ji not every Indian is proud of Taj Mahal, a grave can never be a symbol of love, we are forced to accept it as a wonder but it’s creepy as hell especially when we know how she suffered in her lifetime how the artists who made it were tortured it’s creepy ... https://t.co/1V2waXDkbL — Rangoli Chandel (@Rangoli_A) April 7, 2020 ఇక రంగోలీ ట్వీట్ చూసిన నెటిజన్లు ‘తాజ్ మహల్‌ను ప్రేమకు చిహ్నంగా అంగీకరించాలని మిమల్ని ఎవరూ కోరడం లేదు’ ‘మీ అభిప్రాయం మాకు అవసరం లేదు, ‘ఇది ప్రపంచలోని వింత అని చరిత్రే చెబుతుంది ఇక మీ అభిప్రాయం ఎవరికి కావాలి’ అంటూ విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా తాజ్ మహల్ ప్రపంచంలోనే 7వ వింతగ పరిగణించబడుతున్న విషయం తెలిసిందే. ఇది ప్రేమకు చిహ్నంగా భావిస్తు ప్రేమికులు సైతం తాజ్ మహాల్ బొమ్మలను బహుమతులుగా ఇచ్చుకుంటుంటారు. అంతేగాక దేశ ప్రజలంతా దీనిని చూసి గర్వపడుతుంటారు కూడా. కాగా రంగోలి ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవడం ఇది మొదటిసారి కాదు. తరచూ ఎన్నో విషయాల పట్ల తనకున్న అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తూ విమర్శలను ఎదుర్కొంటారు. -
‘అలా అయితే.. కంగనా నటన వదిలేస్తుంది’
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ తరచూ సోషల్ మీడియాలో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. కాగా రంగోలి తాజాగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సోషల్ మీడియా వేదికగా బుధవారం సవాలు విసిరారు. ప్రస్తుత హీరోయిన్లలో ఎవరైనా రూ. 60 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జేట్‌తో లేడి ఓరియంటెడ్ సినిమాలు తీస్తే.. కంగనా తన నటనను పూర్తిగా వదులుకుంటుందని ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం రంగోలి ట్వీట్ బీ-టౌన్లో చర్చనీయాంశంగా మారింది. ‘నేను పరిశ్రమకు బహిరంగంగా సవాలు చేస్తున్నాను. కంగనా కాకుండా ప్రస్తుత హీరోయిన్లలో ఎవరైనా లేడి ఓరియంటేడ్ సినిమాలను రూ. 60 నుంచి రూ. 100 కోట్ల బడ్జేట్‌తో తీస్తే... ఇక కంగనా తన ఆక్టింగ్ కెరీర్‌ను పూర్తిగా వదిలేస్తుంది. లేదంటే నా పేరు మార్చుకుంటాను’ అంటూ ట్వీట్ చేశారు. ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా కంగనా.. ఫస్ట్ లుక్ ఇక కంగనా ట్వీట్ చూసిన కొంతమంది... ప్రస్తుత హీరోయిన్లలో కూడా కంగనాకు ఏమాత్రం తీసిపోని వారు ఇండస్ట్రీలో ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ఇందుకు రంగోలీ.. ‘మీరు ఓకవేళ అలానే భావిస్తే.. ఓ విషయం గుర్తు పెట్టుకోండి. ప్రస్తుతం మంచి నటులు ఇండస్ట్రీలో ఉన్నారన్నది నిజమే. అది నేను కూడా అంగీకరిస్తాను. అయితే వారు కూడా లీడ్ రోల్ పాత్రలు చేశారు కానీ.. వారి సరసన కచ్చితంగా హీరో పాత్రలు ఉన్నాయి. ఇక కంగనా లీడ్ రోల్లో నటించిన మణికర్ణిక, క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్స్(టీడబ్ల్యూఎమ్ఆర్) సినిమాలు తనని ప్రముఖ హీరోలా సరసన నిలబెట్టాయని విశ్లేషకులే వెల్లడించిన విషయం అందరికీ తెలుసు. మీరు, నేను మాత్రమే అనుకున్నది కాదు’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అంతేగాక కంగనా టీడబ్ల్యూఎమ్ఆర్, మణికర్ణిక సినిమాలు లేకపోతే తనకు ‘తలైవి’, ‘ధాకడ్’ సినిమాల ఆఫర్లు వచ్చేవి కాదని పేర్కొన్నారు. కాగా చాలా మంది ప్రతిభావంతులు ఇండస్ట్రీలో ఉన్నప్పటికి పెట్టుబడులు పెట్టాలంటే నిర్మాతలకు నమ్మకం కలిగించాలని అన్నారు. My open challenge to the industry can any girl in today’s time solo carry a film above 60-70-80-100cr budget other than Kangana....??? If you give me a legit name Kangana will stop acting forever .... 🙏 — Rangoli Chandel (@Rangoli_A) March 11, 2020 ‘కంగనా ముందు పెద్ద సవాల్’ -
‘కంగనా ముందు పెద్ద సవాల్’
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ప్రతిష్టాత్మక చిత్రం ‘తలైవి’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నటీ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిజ జీవితంగా ఆధారం రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివర దశకు చేరుకుంది. కాగా ‘తలైవి’ కోసం కంగనా 20 కిలోల బరువు పెరిగారు. ఇక ‘తలైవి’లో తన షూటింగ్‌ను పూర్తి చేసుకున్న కంగనా.. తన తదుపరి చిత్రాల కోసం బరువు తగ్గె పనిలో పడ్డారని ఆమె సోదరి రంగోలి చందేల్ తెలిపారు. ఈ విషయాన్ని రంగోలి తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘ఇక తలైవి షూటింగ్‌ను దాదాపుగా పూర్తి చేసుకుంది. ఇది చిత్ర బృందానికి సంతోషంచే విషయం. కానీ.. ఆ తర్వాత కంగనాకు పెద్ద సవాలు ముందుంది. కంగనా తన తదుపరి చిత్రాలు ‘తేజాస్’, ‘ధాకడ్’ కోసం రెండు నెలల్లో 20 కిలోల బరువు తగ్గాల్సి ఉంది’ అని ట్విట్ చేశారు. అంతేగాక సినిమా షూటింగ్‌లోని కంగనా నీలి రంగు చీరలో మెరిసిన ఫొటోతో పాటు అదే నీలి రంగు చీరలో ఉన్న అప్పటీ జయలలితా ఫొటోలు గతంలోని కంగనా గ్లామరస్ ఫొటోలను కూడా ఆమె షేర్ చేశారు. (చదవండి: ఎందరికో స్ఫూర్తి) ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా కంగనా.. ఫస్ట్ లుక్ Only last schedule to go for #Thalaivi Kangana has gained 20 kgs weight, After 2 months she starts #Tejas & #Dhaakad.... will she be able to shed that weight, let’s see 😛 pic.twitter.com/CC410XdPuj — Rangoli Chandel (@Rangoli_A) March 4, 2020 కాగా ‘తలైవి’లో బొద్దుగా కనిపించడం కోసం కంగనాను బరువు పెరగాలని దర్శకుడు సూచించడంతో ఆమె జిమ్ మానేసి కోవ్వు పదార్థాలను ఎక్కువగ లాగించేశారు. దీంతో జీమ్‌కు, వర్కఔట్లకు బ్రేక్ ఇచ్చిన కంగనా తన షూటింగ్ పూర్తికావడంతో మళ్లీ కసరత్తులు మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా 52 కిలోల బరువు ఉండే ఈ భామ ‘తలైవి’ కోసం 20 కిలోల బరువు పెరిగారు. కాగా ‘మణికర్ణిక’, ‘బాహుబలి’ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్, ‘డర్టీ పిక్చర్’, ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’ చిత్రాల రచయిత రజత్ అరోరాలు సంయుక్తంగా ‘తలైవీ’ కథను రచించారు. కాగా షూటింగ్లో చివరి దశకు చేరుకున్న ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం -
ఫిల్మ్‌ఫేర్ అవార్డులపై స్పందించిన రంగోలీ
అత్యంత ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డులపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలీ చందేల్ స్పందించారు. ఈ అవార్డుల్లో ప్రతిభ కలిగిన ఎంతోమందికి అన్యాయం జరిగిందంటూ ట్విటర్ వేదికగా ఆమె ఘాటు విమర్శలు చేశారు. 65వ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం శనివారం అస్సాంలోని గువాహటిలో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆవార్డుల్లో బాలీవుడ్ మూవీ ‘గల్లీబాయ్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. అత్యధిక విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. అయితే ఈ సందర్భంగా రంగోలీ అలియాభట్‌పై విమర్శలు గుప్పించారు. అలియా కంటే బాగా నటించే హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని దుయ్యబట్టారు. ఇక గల్లీబాయ్‌లో ఆమె నటన సాధారణంగా ఉందని.. అలియా ప్రధాన పాత్రలో నటించినప్పటికీ ఆమె సహాయక నటి లాగా కనిపించారని ఆరోపించారు. అలాంటి ఆమెకు ఉత్తమ నటి అవార్డు ఎలా ఇచ్చారని మండిపడ్డారు. చదవండి: ఘనంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. 'గల్లీ బాయ్'కి అవార్డుల పంట బాలీవుడ్‌లోని మూవీ మాఫియా గురించి కంగన చాలా సందర్భాల్లో స్పందించిందని.. అందుకే తనకు, తాను నటించిన చిత్రాలకు అవార్డులు ఇవ్వలేదని రంగోలీ ఆరోపించారు. అలాగే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2 చిత్రానికి గానూ ఉత్తమ డెబ్యూ నటి అవార్డు అనన్యపాండేకు లభించడాన్ని ఆమె తప్పుబట్టారు. ‘పటాఖా’ సినిమాలో నటించిన రాధిక మదన్‌కు ఇస్తే బాగుండేదని అన్నారు. రాధికకు అవార్డు ఇస్తే కొత్త వారిని ప్రొత్సహించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. రాధిక.. అనన్యపాండే కంటే అద్భుతంగా నటించిందని రంగోలీ ట్వీట్ చేశారు. ఇక రంగోలీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.