వెల్లివిరిసిన సృజనాత్మకత
సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నృత్యాలు... వివిధ సంస్కృతులను చాటేలా విచిత్ర వేషధారణలు... రంగు రంగుల రంగవల్లులు... ఆలోచింపజేసిన గీసిన చిత్రాలు... ఇలా పలు అంశాల్లో విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మొగల్రాజపురం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మంగళవారం ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. వివిధ ఆకృతుల్లో తీర్చిదిద్దిన రంగవల్లులు ఆకుట్టకున్నాయి. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లోనూ చిన్నారులు సత్తాచాటారు. స్కూల్ ప్రిన్సిపాల్ రాంబాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో దిగిన సృజనాత్మకతన వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. నాట్యాచార్యుడు రమేష్, వైఎస్ ప్రిన్సిపాల్ లతాకుమారి, కో ఆర్డినేటర్ పార్ధసారథి, క్రాఫ్ట్ ఉపాధ్యాయిని నషీరున్నీసా తదితరులు పాల్గొన్నారు. – విజయవాడ (భవానీపురం)