tummalapalli kalakshetram
-
మంచి చేస్తుంటే ఈనాడు ఓర్వలేకపోతోంది: మంత్రి రోజా ఫైర్
సాక్షి, విజయవాడ: సంక్షేమ సామ్రాట్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఏపీ మంత్రి ఆర్కే రోజా కొనియాడారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా.. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు జరిగాయి. ఈ సంబరాలు ముగింపు కార్యక్రమం మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఏపీ మీడియా సలహాదారు అలీ, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి అధ్యక్షురాలు వంగపండు ఉష హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. తప్పుడు రాతలు రాస్తున్న ఈనాడు దినపత్రికపై మండిపడ్డారు. ఇది కళాకారులను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంబరాలని, కానీ, ఈనాడుకి కళ్లు కనిపించడం లేదంటూ ఆమె విమర్శించారు. ‘‘రూ. 2.6 కోట్లు కేటాయించారంటూ కడుపు మంటతో వార్తలు రాస్తున్నారు. జీవో ఎక్కడ విడుదల చేసామో ఓసారి చూపించాలని ప్రశ్నిస్తున్నా. మంచి చేస్తుంటే ఓర్వలేకపోతున్న ఇలాంటోళ్లకు జెలెసిల్ బాటిల్స్ పంపించాల్సిందే’’ అని రోజా వ్యాఖ్యానించారు. ఇక నెలరోజుల పాటు నిర్వహించిన సంబరాల్లో 12 వేల మంది పోటీ పడ్డారని, 300 మంది విజేతలుగా నిలిచారని, విజేతలందరికీ ప్రత్యేక ఆకర్షితులుగా హాజరైన జబర్దస్త్ నటుల చేతుల మీదుగా బహుమతులు అందజేయిస్తున్నామని రోజా తెలిపారు. ప్రత్యేక ఆకర్షితులుగా హైపర్ ఆది, రాం ప్రసాద్, రోహిణి, అభి, చంటి, మహేష్,రాకేష్, ప్రవీణ్ తదితరులు హాజరయ్యారు. రోజా ఒకప్పటి అగ్రశ్రేణి నటి. నేడు అగ్రశ్రేణి రాజకీయనాయకురాలు . సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు . జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా సంబరాలు నిర్వహించిన మంత్రి రోజాకు అభినందనలు. విజేతలకు శుభాకాంక్షలు అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మరుగున పడిపోతున్న కళలను వెలికి తీసే ప్రయత్నం చేయడం గొప్ప విషయం. మారుమూల ఉన్న కళాకారులను గుర్తించడం అభినందనీయమని మంత్రి కారుమూరి తెలిపారు. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా సంబరాలు నిర్వహించిన మంత్రి రోజాకు అభినందనలు తెలియజేశారు. ఆపై ఈనాడు పేపర్, రామోజీరావు పై మంత్రి కారుమూరి మండిపడ్డారు. కళాకారులను వెలికితీస్తుంటే ఈనాడు పేపర్ కు కడుపు మండిపోతుందని, రోజా సొంత ఖర్చుతో చేస్తుంటే జీవోలో రెండు కోట్లు కేటాయించినట్లు కథనాలు రాశారని, ఇలా రాయడానికి సిగ్గుందా? అని రామోజీరావును నిలదీశారు మంత్రి కారుమూరి. కళాకారులకు తన వంతు సహకారం అందిస్తానని ప్రకటించారు మంత్రి కారుమూరి. బియ్యపు గింజలపై జగనన్న సంక్షేమం ఈ కార్యక్రమంలో.. జగనన్న సంక్షేమ పథకాలు ,26 జిల్లాల వివరాలు బియ్యపు గింజలపై చిత్రీకరించారు కారుమూరి మౌల్య పద్మావతి. పద్మావతి రూపొందించిన ఆర్ట్ ను మంత్రి ఆర్కే రోజా ఆవిష్కరించారు. -
హాస్యానికి చిరునామా ‘జంధ్యాల’
విజయవాడ కల్చరల్ : హాస్యానికి చిరునామా జంధ్యాల అని సినీనటుడు ప్రదీప్ అన్నారు. అభిరుచి సాంస్కృతిక సంస్థ, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో జంధ్యాల జయంతి స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం ఉదయం జరిగింది. ప్రదీప్ మాట్లాడుతూ తనలాంటి వారితో ఆనాడే జంధ్యాల సినిమాలు నిర్మించారన్నారు. హాస్య రచయిత శంకరనారాయణ మాట్లాడుతూ సంభాషణల ద్వారా హాస్నాన్ని పండించిన వ్యక్తి జంధ్యాల అన్నారు. జంధ్యాల మిత్రుడు ఎంసీ దాస్ మాట్లాడుతూ జంధ్యాల స్నేహశీలి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జంధ్యాల శంకర్, జంధ్యాల భార్య అన్నపూర్ణ, కుమార్తె సంపద, న్యాయవాది వేముల హజరత్తయ్యగుప్తా తదిరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను అభిరుచి సంస్థ నిర్వాహకుడు పి.కృష్ణాజీ నిర్వహించారు. -
వెల్లివిరిసిన సృజనాత్మకత
సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నృత్యాలు... వివిధ సంస్కృతులను చాటేలా విచిత్ర వేషధారణలు... రంగు రంగుల రంగవల్లులు... ఆలోచింపజేసిన గీసిన చిత్రాలు... ఇలా పలు అంశాల్లో విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మొగల్రాజపురం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మంగళవారం ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. వివిధ ఆకృతుల్లో తీర్చిదిద్దిన రంగవల్లులు ఆకుట్టకున్నాయి. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లోనూ చిన్నారులు సత్తాచాటారు. స్కూల్ ప్రిన్సిపాల్ రాంబాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో దిగిన సృజనాత్మకతన వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. నాట్యాచార్యుడు రమేష్, వైఎస్ ప్రిన్సిపాల్ లతాకుమారి, కో ఆర్డినేటర్ పార్ధసారథి, క్రాఫ్ట్ ఉపాధ్యాయిని నషీరున్నీసా తదితరులు పాల్గొన్నారు. – విజయవాడ (భవానీపురం) -
భారత్లో రెండో పెద్ద భాష తెలుగు
విజయవాడ కల్చరల్: భారత్లో రెండడో పెద్దభాష తెలుగు అని సీనియర్ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు తెలిపారు. తెలుగు కళావాహిని, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీలు సంయుక్తంగా గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవాన్ని సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రెండో అధికార భాషగా తెలుగును గుర్తించాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర ఆర్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ తెలుగు భాష అంధకారంలో పడిందని, దాన్ని వెలుగులోకి తీసుకురావాలన్నారు. కళాభారతి అధ్యక్షుడు శింగంశెట్టి పెదబ్రహ్మం ప్రభుత్వ కార్యాలయంలో తెలుగు భాష అమలు అంశంగా ప్రసంగించారు. భాషావేత్తలు కొండపల్లి మాధవరావు, కోనాడ అశోక్సూర్య. భాస్కరశర్మ, తెలుగు అధ్యాపకుడు డాక్టర్ బాలకృష్ణ, పరిశోధకుడు డాక్టర్ జయంతి చక్రవర్తి తదితరులను సత్కరించారు. కార్యక్రమాన్ని తెలుగు కళావాహిని అధ్యక్షుడు చింతకాయల చిట్టిబాబు నిర్వహించారు. -
తుమ్మలపల్లి కళాక్షేత్రం పనులు పూర్తి చేయండి
విజయవాడ సెంట్రల్ : నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆధునికీకరణ పనులను మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ పరిశీలించారు. వాల్ప్లానింగ్, ఎలక్ట్రికల్, ఏసీ, వాల్ పెయింటింగ్, ఫ్లోరింగ్, సౌండ్ సిస్టం, ఎలివేషన్, సీలింగ్ లైటింగ్, ప్రొజెక్టర్లు, సీటింగ్ పనులకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తికావాలని సూచించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. కళాక్షేత్రం చుట్టూ ప్రహరీని వెంటనే తొలగించాలన్నారు. చీఫ్ ఇంజినీర్ ఎంఎ.షుకూర్, ఈఈ పి.వి.కె.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.