హాస్యానికి చిరునామా ‘జంధ్యాల’ | jandhyala birth aniversary | Sakshi
Sakshi News home page

హాస్యానికి చిరునామా ‘జంధ్యాల’

Published Fri, Jan 13 2017 8:34 PM | Last Updated on Fri, Aug 17 2018 2:34 PM

హాస్యానికి చిరునామా ‘జంధ్యాల’ - Sakshi

హాస్యానికి చిరునామా ‘జంధ్యాల’

విజయవాడ కల్చరల్‌ : హాస్యానికి చిరునామా జంధ్యాల అని సినీనటుడు ప్రదీప్‌ అన్నారు. అభిరుచి సాంస్కృతిక సంస్థ, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ ఆధ్వర్యంలో జంధ్యాల జయంతి స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం ఉదయం జరిగింది. ప్రదీప్‌ మాట్లాడుతూ తనలాంటి వారితో ఆనాడే జంధ్యాల సినిమాలు నిర్మించారన్నారు. హాస్య రచయిత శంకరనారాయణ మాట్లాడుతూ సంభాషణల ద్వారా హాస్నాన్ని పండించిన వ్యక్తి జంధ్యాల అన్నారు. జంధ్యాల మిత్రుడు ఎంసీ దాస్‌ మాట్లాడుతూ జంధ్యాల స్నేహశీలి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ జంధ్యాల శంకర్, జంధ్యాల భార్య అన్నపూర్ణ, కుమార్తె సంపద, న్యాయవాది వేముల హజరత్తయ్యగుప్తా తదిరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను అభిరుచి సంస్థ నిర్వాహకుడు పి.కృష్ణాజీ నిర్వహించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement