భారత్‌లో రెండో పెద్ద భాష తెలుగు
విజయవాడ కల్చరల్: భారత్‌లో రెండడో పెద్దభాష తెలుగు అని సీనియర్ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు తెలిపారు. తెలుగు కళావాహిని, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీలు సంయుక్తంగా గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవాన్ని సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రెండో అధికార భాషగా తెలుగును గుర్తించాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర ఆర్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ తెలుగు భాష అంధకారంలో పడిందని, దాన్ని వెలుగులోకి తీసుకురావాలన్నారు. కళాభారతి అధ్యక్షుడు శింగంశెట్టి పెదబ్రహ్మం ప్రభుత్వ కార్యాలయంలో తెలుగు భాష అమలు అంశంగా ప్రసంగించారు. భాషావేత్తలు కొండపల్లి మాధవరావు, కోనాడ అశోక్‌సూర్య. భాస్కరశర్మ, తెలుగు అధ్యాపకుడు డాక్టర్ బాలకృష్ణ, పరిశోధకుడు డాక్టర్ జయంతి చక్రవర్తి తదితరులను సత్కరించారు. కార్యక్రమాన్ని తెలుగు కళావాహిని అధ్యక్షుడు చింతకాయల చిట్టిబాబు నిర్వహించారు.