రియాధ్: సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో అంగరంగ వైభవంగా తెలుగు దినోత్సవం నిర్వహించారు. సౌదీ అరేబియా తెలుగు సంఘం (సాటా) అధ్వర్యంలో తెలుగు దినోత్సవం, సౌదీ అరేబియా జాతీయ దినోత్సవాన్ని సంయుక్తంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భారతీయ ఎంబసీ డిచార్జి (ఉప రాయబారి) అబూ మాథన్ జార్జి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉంటూ తెలుగు ప్రజలు తమ సంస్కృతిక పరిరక్షణ కోసం తెలుగు దినోత్సవాన్ని నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని భారతీయ ఎంబసీ సెకండ్ సెక్రటరీ మోయిన్ అఖ్తర్ అన్నారు.
ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా ఎడారిలో ఆపద సమయంలో ఆపన్న హస్తంగా సాటా పనిచేస్తుందని ప్రధాన కార్యదర్శి ముజ్జమీల్ శేఖ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రవాసీయులకు సేవలందించె ప్రముఖ మలయాళీ సామాజిక సేవకులైన నాస్, షిహాబ్, సిద్ధీఖ్ తువూర్‌లతో పాటు మరికొందరిని అభినందిస్తూ ప్రత్యేకంగా వారికి శాలువాలు కప్పి సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment